అవగాహన అన్నిటా వుండాలి కదా....!
జీవవైవిధ్యంపై ప్రజల్లో చైనత్యం కల్సించాల్సిన అవసరం ఉందని హెచ్‌ఐసిసిలో జరుగుతున్న అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సుకు సంబంధించిన అంశాలపై సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షిస్తూ అన్నివర్గాల ప్రజలకు జీవవైవిధ్యం ప్రాధాన్యం గురించి వివరించాల్సిన అవసరం ఉందని, విద్యాసంస్థలు, గ్రామాలు, గిరిజన తండాల్లో ఈ అంశంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఖండాంతర ఖ్యాతి గాంచిన ఒంగోలు ఎద్దులు, పుంగనూరు ఆవులు, నెల్లూరు గొర్రెలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో అరుదుగా లభించే పశు పక్ష్యాదుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నిజమే! గిరిజన తండాల్లో జీవవైవిధ్యం గురించి తెలియజేయడమంటే.. వారుండే ప్రకృతి గురించి వారికి చెప్పడమే. ఎందుకంటే ఇప్పటివరకు అడవుల్లో నివసించే గిరిజన తండాల వల్లే కాస్తోకూస్తో అడవులు, అందులోని ప్రాణులు జీవిస్తున్నాయంటే అతిశయోక్తికాదు. నాగరికం నేర్చిన మనిషే వన్యప్రాణులను చంపి తిన్న సంగతి... తింటున్న సంగతి ప్రజలకు తెలిసిన విషయమే. ఎంతో వృక్ష సంపద ఈ తండాలవల్లే రక్షించబడుతోందని చెప్పవచ్చు. ఎద్దులు, ఆవులు, గొర్రెలు, అరుదైన పశుపక్ష్యాదుల గురించి... ఇప్పటికే దేశానికి చెందిన వాటిపై పేటెంట్ల పేరుతో వాటిపై తమకే హక్కువుందని విదేశాలు తమ దుర్భుద్ధిని బయటపెట్టుకున్నాయి. వేప, పసుపు.. ఇలా ఎన్నిటిపైనో.. వాటిపైకన్నుంది... కొత్తగా జాతికే గర్వకారణమై.. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్దిపొందిన ఒంగోలు గిత్తలపై వాటి దృష్టి పడిరది...ఇప్పటికే సంకరం చేసి స్వచ్ఛమైన జాతికి మచ్చ తెస్తున్నారు.. ఇటువంటివాటిని సమర్ధవంతంగా ఎదుర్కోవాలి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విదేశీ మార్కెట్లతో భారతదేశాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నట్లే... భవిష్యత్‌లో మనకు గుర్తింపుతెచ్చిన ఒంగోలు గిత్తలు.. తదితరాలను వారికి ఉదారంగా మీవేనంటూ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు...మన నాయకులు ప్రజల ఓట్లతో గెలిచినా... ప్రజలనుకంటే... విదేశీ రాజకీయాలనే ఎక్కువగా నమ్ముతారు.... అయినా జీవవైవిధ్యమంటే అన్నివిధాలా వాటిని కాపాడుకోవడం! అది చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తే బావుంటుంది.. అవగాహన అంటే ఎన్నికల సమయంలో కనిపించినట్లుగా కాదు సుమా...!