జగన్‌కు షాకిచ్చిన ఇ.డి.
posted on Oct 8, 2012 @ 2:19PM
నాలుగు నెలలనుండి జగన్ బెయిల్ కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు, వైసిపి నేతలు,కార్యకర్తలు సానుభూతి పరులు ఈడి హఠాత్ నిర్ణయంతో కంగుతిన్నారు. వైసిపినేత జగన్ ఇప్పుడప్పుడే బయటకు రారేమో నని భయపడుతున్నారు. జగన్ సంస్ధలు, వాటిలో పనిచేస్తున్న సిబ్బంది జీతభత్యాలు ప్రశ్నార్ధకంగా మిగిలాయి. జగన్‌కు చెందిన 51 కోట్ల రూపాయల ఆస్ధులు అటాచ్‌మెంట్ జరిగింది. వివరాల్లోకి వెళితే జగతి పబ్లికేషన్స్‌కు చెందిన 14.5 కోట్ల డిపాజిట్‌ను, హెటిరో ఫార్మాకు చెందిన 8.60 కోట్లు, దాని అనుబంధ సంస్ధగా ఉన్న ట్రైటెండో సైసెన్స్ 30.33 ఎకరాల భూమి, అరబిందో ఫార్మా మీద ఉన్న 3కోట్ల ఫిక్సిడ్ డిపాజిట్‌ను, జగన్ నిర్వహణలో ఉన్న జననీ ఇన్‌ప్రా స్ట్రక్చర్‌కు చెందిన 13 ఎకరాల భూమిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట్‌రేట్ స్వాదీనం చేసుకుంది. జగన్ మోహన్‌రెడ్డి మరికొందరు చట్టవిరుద్దంగా మనీలాండరింగ్ చేసినందువల్లే ఈడి ఈ పని చేసింది. 29కోట్ల రూపాయలు మేరకే అవినీతి జరిగిందని ఈడి తెలిపినా చట్ట ప్రకారం అవినీతికి రెండు, మూడు రెట్లు ఎక్కువగా ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.అందు వల్ల జగన్‌కు చెందిన 51 కోట్ల రూపాయల అటాచ్ మెంట్ జరిగిందని న్యాయనిపుణులు చెబుతున్నారు.