కిరణ్‌పై రణభేరి మోగిస్తున్న ఎంపీలు
posted on Oct 8, 2012 @ 2:34PM
రాష్ట్రంలో అధికార కాం గస్ పార్టీ సభ్యులు ఎప్పుడు ఎవరి తరపున మాట్లాడతారో ప్రజలకు పెద్ద ఫజిల్ అయిపోయింది. తెలంగాణకు చెందిన మధు యాష్కీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో చదివినప్పటినుండి ఫ్రెండ్స్ మొన్నీ మద్యవరకు ఒకరిని ఒకరు దూషించుకునే పరిస్థితి ఇద్దరికీ లేదు. అయితే రోజులు మారాయి. ముఖ్యమంత్రి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. తెలంగాణ మార్చ్ సందర్బంగా నక్లెస్ రోడ్‌కి వెళ్లకుండా మధుయాష్కీ మరికొందరు నాయకులు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి ఎదురుగా నిరసన ప్రదర్శన చేస్తుండగా పోలీసులు అరెస్టు చేయడం పై ముఖ్య మంత్రి పై ఆగ్రహం వెళ్లగ్రక్కుతున్నారు. తెలంగాణ ఇవ్వవలసింది కేంద్ర ప్రభుత్వమే అని తెలిసినా మధుయాష్కీ ఇప్పుడు కిరణ్‌కుమార్ నే బాద్యులన్నట్లు మాట్లాడుతున్నారు. రవీంద్ర రెడ్డి శాఖాపరమైన అధికారాలను ముఖ్యమంత్రి తగ్గించినప్పటినుండి ఏమాత్రం అవకాశం వచ్చినా కిరణ్‌కుమార్‌పై విమర్శలు చేయడానికి వెనుకాడటం లేదు. ఒకప్పుడు రామచంద్రయ్యకు మంత్రి పదవి ఇవ్వవద్దని అడ్డుకున్న డిఎల్ రవీంద్రారెడ్డి ఇప్పుడు అదే రామచంద్రయ్యతో కలసి ముఖ్యమంత్రిని నిలదీస్తున్నారు. ఎవ్వరు ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేసిన వారిదగ్గరకు వెళ్లి మరీ డిఎల్ భుజం తట్టి ప్రోత్సహిస్తుంటారు. ఎప్పుడూ తెలంగాణ గురించి పెదవివిప్పనిఉప రాష్ట్రపతి రాజనర్సింహ ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ ఆలపిస్తున్నారు. అయితే ముఖ్య మంత్రి వర్గం కూడా అందుకు ప్రతిస్పందింస్తూ ఎప్పటికప్పుడు కిరణ్‌కుమార్‌కు వెన్ను దన్నుగా ఉంటున్నారు. ముఖ్యమంత్రి, పిసిసి ఛీఫ్ ఉప్పు నిప్పుగా ఉండేవారు అయితే అధిష్టానం అక్షింతలు వేసిన కారణంగా ఆయన వెనక్కి తగ్గారు అయినా ముఖ్యమంత్రి కి వ్యతిరేకంగా ఉండే వారిని చాటుమాటుగా కలసి మరీ రెచ్చ గొడుతుంటారు. ఇది రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకుల కలహాల కాపురం.