అప్పుల బాధతో... సొంత ఇంట్లోనే దోపిడీ

  విశాఖలోని కంచరపాలెం ఇందిరానగర్ లో ధర్మాల  ఆనంద్ కుమార్ రెడ్డి ఇంట్లో మూడు రోజుల క్రితం దోపిడీ జరిగింది జీవీఎంసీ కాంట్రాక్టర్ గా వ్యవహరిస్తున్న ఆనంద్ కుమార్ రెడ్డి భార్యతో కలిసి హైదరాబాద్ వెళ్లారు ఇంట్లో అతని తల్లి కొడుకు కృష్ణ కాంత్ మాత్రం ఉన్నారు అర్ధరాత్రి నిద్రపోతున్న దశలో ఇంటి వెనకనుంచి తలుపులు పగలగొట్టి నాన్నమ్మ మనవడు చేతులకు తాళ్లు కట్టి ముఖానికి ప్లాస్టర్ వేసి ఇంట్లో 12 తులాల బంగారం రెండున్నర లక్షల నగదును దోపిడీ చేశారు. ఆ అగంతకులు హిందీలో మాట్లాడారు దోపిడీ అనంతరం ఇంటి ఆవరణలో పార్కింగ్ చేసిన వాహనంలోనే పరారయ్యారు. దీంతో ఆనంద్ కుమార్ రెడ్డి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది నిందితులు ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులుగా పోలీసులు తొలిత భావించారు. .. విచారణలో వెలుగు చూసిన నమ్మలేని నిజాలు  ..  కాంట్రాక్టర్ ధర్మాల ఆనంద్ కుమార్ రెడ్డి ఇంట్లో జరిగిన దోపిడీ విచారణలో విశాఖ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నమ్మలేని నిజాలను చూడాల్సి వచ్చింది. దోపిడి అనంతరం పోలీసులు క్లూస్ టీం ఆధారంగా విచారణ చేపట్టారు ఇంటి ఆవరణలో నిందితులు ఎత్తుకుపోయిన వాహనం నగర శివారులోని మధురవాడ వద్ద కనిపించింది. అనంతరం పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కొన్ని ఆధారాలు సేకరించారు. అందులో ఆనంద్ కుమార్ రెడ్డి తనయుడు కృష్ణ కాంత్ దినచర్యను ఆరా తీశారు. దోపిడీ జరిగిన అర్ధరాత్రి అతను కొందరుతూ ఫోన్లో మాట్లాడినట్టు నిర్ధారణ జరిగింది.  ఆ మేరకు విచారణ చేపట్టుగా వారంతా కృష్ణ కాంత్ స్నేహితులు గా తేలింది. పరపతి ప్రమోద్ కుమార్ షేక్ అభిషేక్ అవసరాల సత్య సూర్యనారాయణ అనే ఈ ముగ్గురు దోపిడీ జరిగిన కృష్ణ కాంత్ స్నేహితులు వీరంతా విలాసాలకు అలవాటు పడ్డారు. దీంతో  సెల్ టవర్ల ద్వారా నిందితుల కదలికను వెంటాడారు. దోపిడీ జరిగిన రోజు వీరు కంచరపాలెం లో ఉన్నట్టు నిర్ధారణ అయింది ఆపై ఆ యువకులను పోలీసులు విచరించగా ఎన్నో ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. కృష్ణ కాంత్ ఇటీవల కాలంలో ఆన్లైన్ ట్రేడింగ్ బెట్టింగ్ వ్యవహారాలకు పాల్పడ్డాడు. దీంతో ఇంట్లో ఇచ్చిన డబ్బు కంటే ఎక్కువ ఖర్చు అయింది. అప్పుల పాలయ్యాడు. దీని నుంచి బయట పడేందుకు ఇంట్లోనే దొంగతనం చేయించి డబ్బు సంపాదించాలని భావించాడు. అందుకోసం ముగ్గురు స్నేహితులను సిద్ధం చేశారు.  ఇంట్లో తన తండ్రి లేని సమయంలో నాన్నమ్మతో ఒంటరిగా ఉన్నప్పుడు చేతులకు తాళ్లను కట్టి నోటికి ప్లాస్టర్ వేసి దొంగతనం చేయాలని అనంతరం పంచుకుందామని కృష్ణ గాని చెప్పాడు. నెల రోజులుగా చేస్తున్న ఆ ప్రయత్నం ఒకరోజు ఫలించింది కానీ పోలీసుల సాంకేతిక పరిజ్ఞానం నిందితులను పట్టించింది. నలుగురు నిందితులు డిగ్రీ చదువుతున్న విద్యార్థులు కావడం విశేషం. ఇటీవల కాలంలో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని.... విలాసవంతమైన జీవితం గడపాలని యువత ఆలోచన చేయడంతో ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారని విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖ బ్రత  బాచ్చి  తెలిపారు. అయితే నేరం చేసిన వ్యక్తులు పోలీసులకు చిక్కడం ఖాయమని తద్వారా భవిష్యత్తు నాశనం అవుతుందని తల్లిదండ్రులకు హితవు పలికారు

నోబెల్‌పై ఘాటుగా రియాక్ట్ అయిన వైట్‌హౌస్

  ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి వెనెజులా ప్రతిపక్ష నేత మారియా కొరినా మచాడోకు దక్కడంతో అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ కాస్త ఘాటుగా స్పందించింది. ఈ బహుమతి రాకున్నా అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత ట్రంప్ మాత్రం శాంతి సంప్రదింపులు, యుద్ధాలు నివరించడంతోపాటు ప్రజల ప్రాణాలు కాపాడటాన్ని కొనసాగిస్తారని స్పష్టం చేసింది.  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మానవతా వాది అని అభివర్ణించింది. ఆయనకు హృదయం సైతం ఉందని గుర్తు చేసింది. ఆయన తన సంకల్ప శక్తితో పర్వతాలను సైతం కదిలించగలరని తెలిపింది. అలాంటి వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ ఉండరంటూ చెప్పుకొచ్చింది.ఈ మేరకు అమెరికా అధ్యక్ష భవనం ప్రతినిధి స్టీవెన్ చియుంగ్  తన ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించారు. ఈ బహుమతి అధ్యక్షుడు ట్రంప్‌కి కాకుండా.. మరొకరికి ఇస్తూ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని సైతం ఈ సందర్భంగా స్టీవెన్ చియుంగ్ విమర్శించారు. ఈ బహుమతి ఎంపిక విషయంలో శాంతి స్థానంలో రాజకీయాలు చేశారంటూ నోబెల్ కమిటీ నిరూపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెల ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో కూడా అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ తన శాంతి యత్నాలను పొగడ్తలతో ప్రస్తావించారు. భారత్-పాకిస్థాన్‌ మధ్య మే నెలలో ఏర్పడిన ఉద్రిక్తతలను తానే తగ్గించానని ఆయన ప్రకటించారు. అయితే, పాకిస్థాన్‌ అభ్యర్థన మేరకే కాల్పుల విరమణ జరిగిందని, ఇందులో ట్రంప్‌కు ఎటువంటి పాత్రలేదని భారత్‌ స్పష్టంచేసింది. ఇదే కాకుండా ఇజ్రాయెల్–ఇరాన్‌, రువాండా–కాంగో, సెర్బియా–కొసోవో సహా మొత్తం ఏడు యుద్ధాలను తానే పరిష్కరించానని ట్రంప్‌ చెప్పుకున్నారు. అయితే వీటిలో చాలా వరకు పూర్తిస్థాయి యుద్ధాలు కానివి కాగా, కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. నోబెల్‌ బహుమతిపై ట్రంప్‌ ఆసక్తి కొత్తది కాదు. గతంలో మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు నోబెల్‌ బహుమతి లభించినప్పుడు, “ఏమీ చేయకుండానే ఆయనకు బహుమతి ఇచ్చారు” అంటూ ట్రంప్‌ తీవ్రంగా విమర్శించిన విషయం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది.  

ప్రతి ఒక్కరు సమాజానికి కొంత తిరిగి ఇవ్వాలి : సీఎం చంద్రబాబు

  సమాజంలో పైకి వచ్చిన ప్రతి ఒక్కరూ సమాజానికి తిరిగి ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా ఈదగాలిలో విశ్వసముద్ర గ్రూప్ ఆధ్వర్యంలో నిర్మించిన నందగోకులం లైఫ్ స్కూల్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా తరగతి గదులను పరిశీలించి.. కంప్యూటర్ ల్యాబ్ లో విద్యార్థులతో ముచ్చటించారు సీఎం. అనంతరం విశ్వసముద్ర బయో ఎనర్జీ ఇథనాల్‌ ప్రాంట్‌ను సందర్శించారు. అలాగే.. విశ్వసముద్ర గ్రూప్‌ ప్రాజెక్ట్‌లను ఆయన ప్రారంభించారు.  ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.నందగోకులంలో పశువుల పరిరక్షణ, లైఫ్‌ స్కూల్, ఇథనాల్ ప్లాంట్‌ను ప్రారంభించడం తనకు కొత్త ఎక్స్‌పీరియన్స్‌ అని చంద్రబాబు తెలిపారు. 15,000 టన్నుల ధాన్యం నూకలతో ఇథనాల్ తయారు చేస్తున్నారని పేర్కొన్నారు. దీని ద్వారా రైతులకి ఆదాయం పెరుగుతుందని హర్షం వ్యక్తం చేశారు. ప్రకృతి పరిరక్షణకి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలని అందిపుచ్చుకున్నారని చెప్పారు. ఎద్దులతో విద్యుత్తు ఉత్పత్తి చేయడం ఎక్కడా లేదని చెప్పారు.  పవర్ ఆఫ్ బుల్స్ చాటుతూ.. 5 యూనిట్లు విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారని చంద్రబాబు వివరించారు. నందగోకులం సేవ్ ది బుల్ అనే నినాదం ఎంతో విశిష్టమైందని చంద్రబాబు గుర్తు చేశారు. నందగోకులం లైఫ్ స్కూల్లో పేద పిల్లలకి చదువులు చెబుతున్నారని చెప్పారు. సామాన్య పిల్లలని అనితరసాధ్య వ్యక్తులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయడం గొప్ప విషయమని కొనియాడారు. సమాజం వల్ల పైకొచ్చిన వారు సమాజానికి డబ్బు ఇవ్వడం కాదు. పిల్లలకి అన్ని సదుపాయాలు కల్పించి, బెస్ట్ సిటిజన్స్‌లా తయారు చేయాలని ఆయన సూచించారు. P4 మోడల్లో చింతా శశిధర్ ఫౌండేషన్ ది బెస్ట్ స్కూల్ నడుపుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. దగదర్తిలో ఎయిర్ పోర్టు, కృష్ణపట్నంకి సీ పోర్టు, నేషనల్ హైవే, రైల్వే కనెక్టవిటీలు వస్తాయని స్పష్టం చేశారు. 2047లో ప్రపంచంలోనే మనదేశం ఒక శక్తిగా ఎదగబోతుందని ధీమా వ్యక్తం చేశారు. అందులో మన ఏపీ మరింత శక్తిగా ఎదుగుతుందని వివరించారు. విశాఖలో రూ.87వేల కోట్లతో ఆర్టిఫిషియల్ సెంటర్ రాబోతుందని చెప్పారు. పేదలని బయటకి తీసుకువచ్చే బాధ్యత అందరూ తీసుకోవాలని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

కడప పెద్ద దర్గా ఉరుసు మహోత్సవాలకు ఏర్పాట్లు

  మత సామరస్యానికి ప్రతీక అయిన కడప అమీన్ పీర్ దర్గా (పెద్దదర్గా) ఉరుసు మహోత్సవాలు నవంబర్ 4 నుంచి 10 వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ ఉత్సవాలను ను అత్యంత వైభవంగా, కన్నుల పండుగగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ముందస్తు ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. ఈ ఉత్సవాలను విజయ వంతం చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం కడప అమీన్ పీర్ దర్గా లోని ముషాయిరా హాల్ నందు అమీన్ పీర్ దర్గా ఉత్సవాల నిర్వహణ, ముందస్తు ప్రచారం ఏర్పాట్లపై అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి జనాబ్ ఆరిఫ్ ఉల్లా హుసేని అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే ఆర్. మాదవి రెడ్డి, కడప నగర మేయర్ ముంతాజ్ బేగం, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హాజరయ్యారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ "మన కడపలో మన పండుగ"గా భావించే కడప అమీన్ పీర్ దర్గా ఉత్సవాలను అందరూ కలసి కట్టుగా పనిచేసి విజయవంతం చేయాలని అధికారులు, ప్రజా ప్రతినిధులను కోరారు. ఉరుసు మహోత్సవాలకు కొన్ని  రోజుల ముందుగానే అన్నిరకాల ఉత్సవ ఏర్పాట్లను ఒక్కొశాఖ జిల్లా అధికారుల పర్యవేక్షణలో నిర్వహించడం జరుగుతుందన్నారు.  పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను  చేయాలని ఎక్కడా ఎలాంటి సంఘటనలకు తావివ్వకుండా గట్టి భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. కడప నగర మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పరిశుభ్రత ఏర్పాట్లను చూడాలని ఆదేశించారు.గతంలో కంటే ఈ సంవత్సరం ఉరుసు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని  ప్రజలందరూ కుటుంబ సమేతంగా హాజరై ఉత్సవాలను దిగ్విజయం చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.  *వాలంటీర్ల ఏర్పాటు  ఈ ఏడాది ఉరుసు మహోత్సవాలకు వచ్చే భక్తులకు సౌలభ్యం, సమాచారం కోసం రైల్వేస్టేషన్, బస్ స్టేషన్, ఎయిర్ పోర్టులలో దర్గా కమిటీ తరపున వాలంటీర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అధిక సంఖ్య లో వైద్య సిబ్బందిని వైద్యాధికారులను నియమించి ప్రత్యేక  వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే 108, అంబులెన్స్ తదితర వాహనాలతో పాటు అత్యవసర మందులు కూడా అందుబాటులో ఉంచాలన్నారు.అన్ని శాఖల సమన్వయంతో అమీన్ పీర్ దర్గా ఉత్సవాలను ఘనంగా నిర్వహించి విజయవంతం చేయాలన్నారు. ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే మాధవీ రెడ్డి మాట్లాడుతూ  శతాబ్దాల నాటి చరిత్ర కలిగిన ప్రఖ్యాత అమీన్ పీర్ దర్గా ఉత్సవాలను మత సామరస్యాన్నిప్రతిబింబించేలా  ఘనంగా నిర్వహించాలని కోరారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ మాట్లాడుతూ  అమీన్ పీర్ దర్గా ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్ల ను చేయడం జరుగుతుందని, నిర్దేశించిన ప్రాంతాల్లో సీసీ కెమెరా లను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. అదనపు భద్రతా సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం ఉరుసు ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి.. జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి,ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే మాధవీ రెడ్డి, దర్గా పీఠాధిపతులలు, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ప్రజాప్రతినిధులతో కలిసి ఉరుసు మహోత్సవ పోస్టర్లను ఆవిష్కరించారు.  

నకిలీ మద్యం కేసులో ఏ1 జనార్దన్‌ రావు అరెస్ట్

  నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు జనార్ధన్‌రావును గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు అదుపులోకి తీసుకొన్నరు. సౌతాఫ్రికా నుంచి విజయవాడ వస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు.. గన్నవరం విమానాశ్రయంలో ఏ1గా ఉన్న జనార్ధన్‌రావును అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు కీలక నేతలు అరెస్ట్ అయ్యారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశ‌ పెట్టే ఛాన్స్ ఉంది.  ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని పోలీసులు గుట్టురట్టు చేశారు. అద్దెకు తీసుకున్న ప్రదేశంలో నకిలీ మద్యం ఉత్పత్తి జరుగుతున్నట్లు గుర్తించిన పోలీసులు ఇటీవల దాడులు నిర్వహించి రూ.1.75 కోట్ల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్‌రావు సోదరుడు జగన్మోహన్‌రావును ఇప్పటికే అరెస్ట్‌ చేశారు. దర్యాప్తులో ములకల చెరువులో తయారైన నకిలీ మద్యం విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నాలో ఏర్పాటు చేసిన బాట్లింగ్‌ యూనిట్‌లో ప్రాసెసింగ్‌ చేసినట్లు పోలీసులు నిర్ధరించారు. అలాగే, ఇబ్రహీంపట్నం ఏఎన్‌ఆర్‌ బార్‌ వద్ద నకిలీ మద్యం తయారీ కేంద్రం ఏర్పాటు చేసి విక్రయాలు కూడా నిర్వహించినట్లు వెల్లడైంది. గోల్డ్‌ అడ్మిరల్‌, క్లాసిక్‌ బ్లూ, కేరళ మాల్ట్‌, మంజీరా వంటి ప్రముఖ బ్రాండ్ల ఒరిజినల్‌ లేబుళ్లతో వేల సంఖ్యలో నకిలీ క్వార్టర్‌ బాటిళ్లను నింపినట్టు పోలీసులు గుర్తించారు. మూతలు బిగించే యంత్రాలు, హోలోగ్రామ్‌ స్టిక్కర్లు, కార్టన్‌ బాక్స్‌లు కూడా అక్కడ నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ మద్యం అక్కడి నుంచి బెల్ట్‌షాపులు, మద్యం దుకాణాలకు తరలిస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. జనార్దన్‌రావు తన సోదరుడు జగన్మోహన్‌రావు సాయంతో ఈ దందా నడిపించినట్టు విచారణలో పోలీసులు వెల్లడించారు.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో అతిపెద్ద విమానం ల్యాండింగ్

  శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో అతిపెద్ద విమానం ల్యాండింగ్ అయింది... దానిని చూసిన ప్రయాణికులు ఒకెంత ఆశ్చర్యచకితుల య్యారు.. కండ్లప్ప గిచ్చి అలాగే చూస్తుండి పోయారు. అయ్య బాబోయ్ ఎంత పెద్ద విమానమో... చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు.. చూస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అంటూ ఎయిర్ పోర్ట్ లో ఉన్న ప్రయాణికులు దానిని చూసి తెగ సంబరపడిపోతూ ఫోటోలు, వీడియోలు తీస్తూ యమ బిజీగా  ఉన్నారు.అవునండి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో మరో మారు ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం ల్యాండింగ్ అయింది. అంటోనోస్ ఎన్ 124... ప్రపంచంలోనే అతిపెద్ద విమానం లో ఇది ఒకటి...క్వాడ్ ఇంజన్ అంటే నాలుగు ఇంజన్లు ఉంటాయి.. మరియు 24 చక్రాలు ఉంటాయి. వింగ్ ప్రాంతాలు 6760 చదరపు అడుగులు ఉంటుంది.. ఖాళీ విమానం 1,81,000 కిలోల బరువు ఉంటుంది ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానాల్లో ఇది ఒకటి దీనిలో లాంగ్ ట్రక్కులు నేరుగా లోడింగ్ మరియు అన్లోడింగ్ కోసం రాంపులను సైతం ఉపయోగించి ప్రవేశించగలవు... గతంలో కూడా అతిపెద్ద విమానం శంషాబాద్ ఎయిర్పోర్ట్‌లో ల్యాండింగ్ అయింది. ఇప్పుడు మరో మారు అతిపెద్ద కార్గో విమానం ల్యాండింగ్ అవడంతో  ప్రయాణికుల ఆనందం అంతా ఇంతా కాదు.  

మావోయిస్టు పార్టీలో విభేదాలు...ముగ్గురు లొంగుబాటు

  తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీలో కీలకస్థానా ల్లో ఉన్న ముగ్గురు నేతలు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో చందు–సోని దంపతులు, వికాస్ అనే మరో నేత ఉన్నారు. లొంగిపో యిన నాయకులు తమ అనుభవాలు, పార్టీ అంతర్గత పరిస్థితులను మీడియా ముందుంచారు.లొంగిపోయిన వికాస్ మాట్లాడుతూ మావోయిస్టు పార్టీలో విభేదాలు వాస్తవమే. అగ్రనా యకుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆయు ధాలు వదిలేయాలా లేదా అనే దానిపై చాలా కాలంగా చర్చ కొనసాగు తోంది.  మల్లోజులా జగన్ మధ్య కూడా ఈ అంశంపై చర్చలు జరుగుతు న్నాయని వెల్లడించారు. వికాస్ సిద్దిపేట జిల్లాకు చెందిన వాడు. ఇతను 1990లో మావో యిస్టు ఉద్యమంలో చేరి 35 ఏళ్ల పాటు చురుకుగా కార్యకలాపాలు నిర్వహించాడు. చందు (45) చిన్న వయసులోనే విప్లవ సాహిత్యానికి ఆకర్షితుడై, 1993లో నర్సంపేట దళంలో చేరాడు. సోని అతని జీవిత భాగస్వామి.తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ మావోయిస్టు పార్టీలో ఆధిపత్య పోరు సహజమే. ఈ విభేదాల కారణం గానే పలువురు సభ్యులు దళాన్ని వీడుతున్నారు.  ఇప్పటి వరకు 412 మంది మావోయి స్టులు లొంగిపో యారు. వారిలో 72 మంది తెలంగాణకు చెందినవారు. వీరిలో 8 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారని  వివరించారు.మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలవా లని పిలుపుని చ్చారు. ప్రస్తుతం పార్టీలో సెక్రటరీ పదవి ఖాళీగా ఉందని, మల్లోజులా జగన్ ఎక్కడు న్నారో సమాచారం అందుబాటులో లేదని చెప్పారు.కోల్డ్ బెల్ట్ ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాలను మళ్లీ చురుకుగా చేయాలనే ప్రయత్నం చేసినా, నాయకుల లొంగుబాటుతో ఆ యోచనలు దెబ్బతిన్నాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి.ఈ లొంగుబాటుతో మావోయిస్టు పార్టీ లో అంతర్గత భిన్నాభిప్రాయాలు మరింత బహిర్గతం అవుతున్నాయి

బావ పొట్టిగా ఉన్నాడని హత్య చేసిన బామ్మర్ది

  గుంటూరులో దారుణం చోటుచేసుకుంది. పెళ్ళైన పది రోజులకే బావను అతని బావమరిది నడిరోడ్డుపై కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు. బాపట్ల జిల్లా వేమూరు మండలం ఏడవురు గ్రామానికి చెందిన కుర్రా గణేష్ (25)కు తెనాలికి చెందిన కీర్తి అంజనీదేవికి సంబంధం చూడటానికి వెళ్లారు. గణేష్ పొట్టిగా ఉన్నాడని యువతి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. అయినప్పటికీ మొదటి చూపులోనే ఒకరినొకరు ఇష్టపడిన గణేష్, కీర్తి అంజనీదేవి పెద్దలను ఎదిరించి పది రోజుల క్రితం అమరావతి గుడిలో రహస్యంగా వివాహం చేసుకున్నారు.  తన చెల్లెలికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడని ఆగ్రహంతో ఉన్న యువతి సోదరుడు దుర్గారావు తన బావ గణేష్ అంతు చూస్తానని హెచ్చరించాడు. తమకు ప్రాణహాని ఉందని గణేష్ నల్లపాడు పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. పెళ్లి రిసెప్షన్‌ కోసం బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకెళ్తున్న బావ గణేష్‌ను గుంటూరులో నడిరోడ్డుపై బామ్మర్ది దుర్గారావు తన స్నేహితులతో కలిసి కత్తితో పొడిచి దారుణంగా చంపాడు. పోలీసులు దుర్గారావు, అతని స్నేహితులను అరెస్ట్ చేశారు  

2047 నాటికి నంబర్ వన్‌గా ఆంధ్రప్రదేశ్ : సీఎం చంద్రబాబు

  విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ రాబోతుందని సీఎం చంద్రబాబు అన్నారు. నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన విశ్వసముద్ర గ్రూప్ ప్రాజెక్టులను ప్రారంభించారు. రామాయపట్నంలో త్వరలో బీపీసీఎల్ పెట్టుబడులు పెడుతోంది. ప్రపంచాన్ని శాసించే శక్తి మన పిల్లలకు ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 2047 నాటికి ప్రపంచ దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలుస్తుందని అప్పటికి దేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్‌గా అవతరిస్తుందని చంద్రబాబు తెలిపారు.   వైజాగ్‌కు రైల్వే జోన్, ఆర్సెలార్‌ మిత్తల్‌ ప్లాంట్‌కు త్వరలో శంకుస్థాపన చేయబోతున్నట్లు  చంద్రబాబు ప్రకటించారు. వైజాగ్‌ను ముంబై లాగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు  పంచాయితీ రాజ్‌లో పంచాయతీలు రేషనలైజేషన్ చేసి రూరల్, అర్బన్ పంచాయితీలుగా చేయాలని తెలిపారు. 2028 నాటికి విశాఖ భారత దేశంలో ఒక ప్రత్యేక సిటీగా ఉండబోతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఐటీ రంగంలో లక్షలాది ఉద్యోగాలు రాబోతున్నాయని పేర్కొన్నారు. వెస్ట్‌లో ముంబై తరహాలో ఈస్ట్‌లో విశాఖ అభివృద్ధి చెందబోతుందన్నారు. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్‌లో 4 లక్షల 70 వేల మంది ఆంధ్రాలో పని చేస్తున్నారని తెలిపారు. దీనిని 10 లక్షలకు పెంచాలని అధికారులకు చెప్పినట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.  మంత్రులు, సెక్రటరీలకు చెప్పినప్పటికీ శాఖను నడిపించాల్సిన బాధ్యత మంత్రులదే అని తెలిపారు. శాఖలో పని చేయకపోతే వారిని పిలిచి మందలించాల్సింది మంత్రులే అని పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాల్సింది మంత్రులే కానీ అధికారులు కాదు అనే విషయం గుర్తు పెట్టుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు. తన 15 ఏళ్ల ముఖ్యమంత్రి ప్రస్థానంలో ఎప్పుడూ ఇన్ని పెట్టుబడులు రాలేదని చంద్రబాబు వివరించారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. గూగుల్ డేటా సెంటర్ మనకు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఏపీకీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెద్ద ఎత్తున రావడంపై డిప్యూటీ సీఎం  హర్షం వ్యక్తం చేశారు.

ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం..సునామీ హెచ్చరికలు జారీ

ఫిలిప్పీన్స్‌ను భారీ భూకంపం కుదిపేసింది. దక్షిణ పిలిప్పైన్స్ లోని మిండనోవా ద్వీపంలో శుక్రవారం (అక్టోబర్ 10) భారీ భూకంపం సంభవించింది.   రిక్టర్‌ స్కేలుపై ఈ భూకంపతీవ్రత 7.6గా నమోదైంది. ఈ భూకంప ప్రభావంతో  ఫసిఫిక్ తీరంలో సునామీ సంభవించే అవకాశం ఉందన్న హెచ్చరికలు జారీ అయ్యాయి.  మనీలాకు ఆగ్నేయాన దావో ఓరియంటల్‌ లోని మనాయ్ పట్టణానికి 62 కిలోమీటర్ల దూరంలోని సముద్రంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది.  ఈ భూకంప తీవ్రతకు ఫిలిప్పీన్స్ తీరంలో 3 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసిపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.  ఈ భూకంప ప్రభావంతో పలు భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ఆస్తి, ప్రాణ నష్టం భారీగా ఉండవచ్చన్న ఆందోళన వ్యక్తమౌతోంది.  రెండు వారాల కిందట ఫిలిప్పైన్ లో  6.9 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 72మంది మరణించిన సంగతి తెలిసిందే.  ఈ రోజు వచ్చిన భూకంప తీవ్రత 7.6 కావడంతో ఆస్తి, ప్రాణ నష్టం భారీగా ఉండొచ్చని అంటున్నారు.

ఏం తమ్ముళ్లు ఎలా ఉన్నారు...సీఎం పేరిట వీడియో కాల్!

  సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ మోసగాళ్లు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. తాజాగా ఏకంగా సీఎం చంద్రబాబు , మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుల ముఖాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో సృష్టించి, తెలంగాణ టీడీపీ నేతలను మోసం చేసిన ఘటన వెలుగుచూసింది. పార్టీ టిక్కెట్లు ఇప్పిస్తానని నమ్మించి, వారిని విజయవాడకు రప్పించి డబ్బులు దోచుకున్నాడు ఒక కేటుగాడు. ఎలా జరిగింది..? గత నెల 30న ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన కొందరు తెలుగుదేశం పార్టీ నేతలకు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తాను దేవినేని ఉమ పీఏనని చెప్పి, కొద్దిసేపట్లో ఉమ గారు వీడియో కాల్ చేస్తారని తెలియజేశాడు. ఆ తరువాత దేవినేని ఉమ ముఖంతో ఉన్న వ్యక్తి వీడియో కాల్ చేసి, తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని, కార్యకర్తల పిల్లల చదువులకు సహాయం అందిస్తానని చెప్పాడు. ఇది నిజమని నమ్మిన నేతలు అతను ఇచ్చిన నంబర్లకు రూ.35 వేల రూపాయలు ఫోన్ పే ద్వారా పంపించారు. కొన్ని రోజులకు ఆ వ్యక్తి మళ్లీ సంప్రదించి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బీ-ఫార్మ్స్ ఇప్పిస్తానని చెప్పాడు. అంతేకాక, స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మాట్లాడతారని చెప్పి ఆశ పెంచాడు. కొద్ది సేపట్లోనే చంద్రబాబు ముఖంతో ఉన్న వ్యక్తి వీడియో కాల్ చేయడంతో నేతలు పూర్తిగా నమ్మారు. విజయవాడకు రప్పించి మోసం అమరావతికి వస్తే బీ-ఫార్మ్స్ ఇస్తానని చెప్పడంతో సత్తుపల్లికి చెందిన 18 మంది టీడీపీ నేతలు విజయవాడకు వెళ్లారు. మోసగాడు సూచించినట్లుగా బందరు రోడ్డులోని ఓ హోటల్‌లో బస చేశారు. హోటల్ యాజమాన్యానికి కూడా తనవాళ్లే వస్తున్నారని, బిల్లు తానే చెల్లిస్తానని చెప్పి నమ్మించాడు. సాయంత్రం వరకు ఎదురుచూసినా ఎవరూ రాకపోవడంతో, సీఎంను కలవాలంటే ఒక్కొక్కరు రూ.10 వేల చొప్పున ఇవ్వాలని మరోసారి ఫోన్ రావడంతో అనుమానం కలిగింది. ఇంతలో హోటల్ సిబ్బంది రూ.26 వేల బిల్లు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో గొడవ చెలరేగింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారించగా, అసలు విషయం బయటపడింది.దేవినేని ఉమను సంప్రదించగా, తాను ఎవరికీ వీడియో కాల్ చేయలేదని, ఏలూరుకు చెందిన భార్గవ్ అనే వ్యక్తి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు తనకు సమాచారం అందిందని తెలిపారు. అయితే పరువు పోతుందనే భయంతో బాధిత నేతలు ఫిర్యాదు చేయడానికి ముందుకురాలేదు. పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పి, హోటల్ బిల్లులో సగం చెల్లించేలా చేసి వారిని పంపించారు.

తల్లిని కొట్టి పశ్చాత్తాపంతో... బీజేపీ నేత ఆత్మహత్య

  రంగారెడ్డి జిల్లా ఉప్పల్ బిజెపి పార్టీ నాయకులు రేవెల్లి రాజు ఆత్మహత్య చేసుకోవడంతో వారి కుటుంబంలో చీకట్లు అలుము కున్నాయి. అయితే  రేవల్లి రాజు నిన్న రాత్రి సమయంలో ఆత్మ హత్య చేసుకో బోయే ముందు ఓ వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అనం తరం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారి చెక్కర్లు కొడుతుంది. బిజెపి పార్టీ నాయకులు రేవల్లి రాజు తన సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను వ్యక్తం చేశాడు.  ఏ కొడుకు కూడా కన్నతల్లిని కొట్టాలని అను కోడు... కానీ కుటుంబ కలహాల నేపథ్యంలో నేను ఆ తప్పు పని చేశాను. నేను చేసింది తప్పే... అమ్మ నన్ను క్షమించు... కానీ దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేయడం వల్ల నేను ఎక్కడికి వెళ్లినా తలెత్తు కోలేకపోయాను. నేను ఎప్పుడైనా నా కుటుంబం కోసం కష్టపడ్డాను.అందుకే అన్ని చేశాను. నా తమ్ముడి పెళ్లి కూడా చేశాను. కానీ ఈరోజు నా తల్లి నన్ను మోసం చేసింది..అమ్మను కొట్టాను. నేను తప్పే చేశాను. అయితే ఈ విషయం పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి తిట్టిపియాలి అంతేకానీ వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేయడం వల్ల ఈరోజు నేను ఎక్కడ తలెత్తుకొని తిరగలేకపోతున్నాను... పరువు కోసం నేను ప్రాణాలైనా తీసుకుంటాను. ఈ వీడియో తీసింది ఎవరో అమ్మకు తెలుసు.... తమ్ముడికి తెలుసు... అంత ఎందుకు ఈ వీడియో నా మరదలే తీసి.... వైరల్ చేసింది... కేవలం ఈ వీడియో వల్లనే నేను ఈరోజు ఎవరి వద్దకు వెళ్లి మాట్లాడలేకపోతున్నాను... నా  పరువు మొత్తం పోయింది. అందుకే ఆత్మహత్య చేసు కోవాలని నిర్ణయిం చుకున్నాను... నేను ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి ఆ వీడియో ఒకటే కారణం... మా అమ్మ నన్ను మోసం చేసింది. అమ్మ నువ్వు నా మీద పగ పట్టి...మోసం చేసి నట్లుగా నా పిల్లల ను మోసం చేయకు... నా పిల్లలు అమాయ కులు ,చిన్నపిల్లలు దయచేసి వారి మీద పగ పట్టి మోసం చేయకు.... నీకు దండం పెడతానని రాజు తల్లిని వేడుకున్నాడు. శ్రేయోభిలాషులు, కార్యకర్తలు, స్నేహితులు అందరూ నన్ను క్షమించాలని... వేడుకున్నాడు.  కార్యకర్తలు ఇప్పటివరకు నాకు తోడుగా ఉన్నట్లుగానే... రేపు నా కుటుంబానికి తోడుగా, అండగా ఉండాలని కోరు కుంటున్నానని తన రేవల్లి  రాజు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రాజు ఆత్మహత్య చేసుకోబోయే ముందు సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అనంతరం బీబీనగర్ వద్ద ఉన్న పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీ సులు వీడియోను  స్వాధీనం చేసు కుని...మృతదేహాన్ని భువనగిరి ఏరియా హాస్పిటల్ కి తరలించారు. రాజు భార్య మహిమ ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు...

రమేష్ ధీరజ్ రాసిన మార్పు కోసం పుస్తకావిష్కరణ

  మానవ విలువల గొప్పతనాన్ని తెలియజేయడానికే సినీనటుడు,రచయిత స్వర్గీయ రమేష్ ధీరజ్"జీవితంలో మార్పుకోసం" అన్న అద్భుతగ్రంథాన్ని రాశారని ప్రముఖ కవి మాజీ మైన్స్ డైరెక్టర్ డా.వి.డి.రాజగోపాల్ పేర్కొన్నారు. భారతీయ సాహిత్య  అనువాద పౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ కవి కళారత్న డా.బిక్కి కృష్ణ అధ్యక్షతన హైదరాబాద్ ఆర్టీసి క్రాస్  రోడ్ లోని కాళా భారతిలో రమేష్ ధీరజ్ రాసిన జీవితంలో మార్పుకోసం గ్రంథావిష్కరణ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథులుగా  ప్రముఖ కవులు డా.పి.విజయలక్ష్మి పండిట్, డా.జెల్ది విద్యాధర్, డా.రాధాకుసుమ, పద్మశ్రీలత ,పెద్దూరి వెంకట దాసు,ధీరజ్ తల్లి యం.రమాదేవి, సోదరుడు గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమేష్ ధీరజ్ వ్యక్తిత్వాన్ని,ఆయన రాసిన పుస్తకాల మానవీయవిలువలను వక్తలు కొనియాడారు. ధీరజ్ తల్లి రమాదేవిని ఘనంగా సన్మానించారు.

చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీంలో ఊరట

ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణం కేసులో  చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీం కోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.    దీనిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిన సుప్రీం కోర్టు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.  అక్రమ మద్యం కేసులో యాంటిసిపేటరీ బెయిలు కోసం మోహిత్ రెడ్డి సుప్రీంను ఆశ్రయించారు. ఆయన పిటిషన్ విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహిత్గి, సిద్దార్థ లూథ్రా వా దనలు వినిపించారు.    ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం కేసులో ఏ 39గా ఉన్న   చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డిస్మిస్ చేయడంతో  ఆయన సుప్రీం ను ఆశ్రయించారు.  సుప్రీం కోర్టులో మోహిత్ రెడ్డికి యాంటిసిపేటరీ బెయిలు లభించింది.   

ఏపీ యువతకు విదేశాల్లోనూ ఉద్యోగాల కల్పన!

ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాష్ట్ర యువతకు రాష్ట్రంలోనే కాదు, విదేశాల్లో సైతం పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగావశాకాలు కల్పించడంపై దృష్టి సారించింది.  ఇందుకు సంబంధించి మంత్రి నారా లోకేష్ గురువారం (అక్టోబర్ 9) ఉండవల్లిలోని తన నివాసంలో  స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో అధికారులకు  భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. ఓవర్సీస్ మ్యాన్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఓంక్యాప్) ద్వారా రాబోయే ఐదేళ్లలో  విదేశాలలో రాష్ట్ర యువతకు లక్ష బ్లూకాలర్ ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆదేశించారు.  ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి పక్కా ప్రణాళికతో కూడిన రూట్ మ్యాప్‌ను సిద్ధం చేయాలని  ఆదేశించారు. విదేశాల్లో ప్రస్తుతం ఏ ఉద్యోగాలకు డిమాండ్ ఉందో గుర్తించి, దానికి అనుగుణంగా మన యువతను సిద్ధం చేయాలని మంత్రి లోకేశ్ అధికారులకు సూచించారు.  నర్సింగ్, వెల్డర్స్, ట్రక్కర్స్, బిల్డింగ్ వర్కర్లకు యూరప్‌తో పాటు జర్మనీ, ఇటలీల్లో మంచి డిమాండ్ ఉందన్న లోకేష్ ఆయా కొలువులకు అర్హులైన వారిని గుర్తించి శిక్షణ ఇవ్వాలన్నారు. ముఖ్యంగా నర్సింగ్, ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యనభ్యసించిన యువతీయువకులకు ఆయా దేశాల భాషల్లో శిక్షణ ఇచ్చి, విదేశాల్లో ఉద్యోగాలు లభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి కేరళ రాష్ట్రం చాలా విజయవంతమైంది. అందుకే, కేరళ మోడల్‌ను అధ్యయనం చేసి, ఆ  పద్ధతులను ఏపీలో అమలు చేయాలని మంత్రి లోకేశ్ ఆదేశించారు. ప్రస్తుతం ఓంక్యాప్ ద్వారా రాష్ట్రంలో 2,774 మంది నర్సింగ్ అభ్యర్థులు విదేశీ భాషల్లో శిక్షణ పొందుతున్నట్లు ఈ సందర్భంగా అధికారులు మంత్రికి తెలిపారు. జర్మనీ లాంగ్వేజెస్ అసెస్ మెంట్ సెంటర్లను రాష్ట్రంలో ఏర్పాటుచేయడానికి కూడా ఎంఓయూ చేసుకున్నట్లు అధికారులు వివరించారు. యువతకు ఉద్యోగాల సమాచారం సులభంగా అందించడానికి ఉద్దేశించిన  నైపుణ్యం పోర్టల్‌పై కూడా మంత్రి సమీక్షించారు.  

మరియాకు నోబెల్ శాంతి బహుమతి...డొనాల్డ్ ట్రంప్‌కు నిరాశ

  2025కి గాను ప్రతిష్ఠత్మక నోబెల్ శాంతి వెనిజూలకు చెందిన పార్లమెంట్ సభ్యురాలు మరియా కొరినా మచాడోకు లభించింది. డెముక్రటిక్ రైట్స్,శాంతి కోసం ఆమె చేసిన కృషిని గుర్తించిన నార్వేజియన్ నోబెల్ కమిటీ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఆమె డిక్టేటర్‌షిప్ నుంచి ప్రజాస్వామ్యం వైపు నడిపించారు. మరోవైపు నోబెల్ శాంతి బహుమతి కోసం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను వరించలేదు. నోబెల్ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వాన్ని రష్యా సమర్థిస్తుందని క్రెమ్లిన్ ప్రకటించింది. ఈ మేరకు క్రెమ్లిన్ అధికారి యురి ఉషకోవ్ ప్రకటన చేశారని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ టాస్ పేర్కొంది. తన చొరవతో ప్రపంచంలోని పలు దేశాల మధ్య జరుగుతోన్న యుద్ధాలు ఆగాయని ట్రంప్ పదేపదే ప్రకటించుకున్నారు. ఈ క్రమంలో నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.  

ఖతార్ లో ఉద్యోగావకాశాలు.. మంత్రి ఫరూక్

రాష్ట్రంలోని నిరుద్యోగ మైనారిటీ యువతకు ఖతార్ దేశంలో  ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పించేందుకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా జాబ్ మేళా, ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు  రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి  ఎన్ఎండి ఫరూక్ గురువారం (అక్టోబర్ 9) ఒక ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  ఏపీ ప్రభుత్వం, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్  ద్వారా ఖతార్ లోని దోహా లో హోమ్ కేర్ నర్స్  ఉద్యోగాల కొరకు అర్హులైన అభ్యర్డుల నుండి దరఖాస్తులు ఆహ్వానించినట్లు పేర్కొన్నారు.  అర్హులైన మైనారిటీ వర్గాల అభ్యర్థులు  http://naipunyam.ap.gov.in/ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. హోమ్ కేర్ నర్స్ ఉద్యోగానికి దరఖాస్తు చేసే యువతీ యువకుల వయస్సు 21 నుంచి 40 సంవత్సరాల లోపు ఉండాలనీ,   బి.ఎస్సీ లేదా జి.ఎన్.యమ్ నర్సింగ్  విద్యార్హత ఉండి, అనుభవం కూడా ఉండాలన్నారు. ఎంపికైన వారికి  నెలకు రూ. 1.20 లక్షల వేతనంతొ పాటు ఉచిత వసతి,రవాణా సదుపాయం కల్పిస్తామని మంత్రి తెలిపారు.   తెలుగుదేశం కూటమి ప్రభుత్వం   మైనారిటీ వర్గాల అభివృద్దికి కట్టుబడి ఉందని మంత్రి అన్నారు. 

కోచ్ వేధింపులు భరించలేక విద్యార్థిని బలవన్మరణం

  సమాజంలో మహిళలు, యువతలు, చివరకు చిన్న పిల్లలకు కామాంధుల నుండి వేధింపులు తప్పడం లేదు. దేవాలయం లాంటి స్కూల్, కాలేజీలలో కూడా కాటు వేసేందుకు కామాంధులు వేచి ఉంటున్నారు. అక్కడ కూడా యువతులు, చిన్నపిల్లలకు సైతం భద్రత లేకుండా పోయింది. ఆడపి ల్లల తల్లిదండ్రులు పిల్లల్ని బయటకు పంపించాలంటే గజ్జుమని వణుకుతున్నారు. ఓ కామాంధుడి వేధింపులు భరించలేక ఓ విద్యా ర్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆ కుటుంబంలో తీరని దుఃఖాన్ని మిగిల్చింది. సికింద్రాబాద్ పరిధిలో నివాస ముంటున్న ప్రమోద్ కుమార్, హరిత అనే దంపతులకు ఇద్దరమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్నారు... ప్రమోద్ కుమార్ రైల్వేలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. మృతురాలు మౌలిక రెండవ సంతానం... మౌలిక సికింద్రాబాద్ పరిధిలోని లాలా గూడలో ఉన్న తార్నాక రైల్వే డిగ్రీ కళాశాలలో బిబిఏ సెకండ్ ఇయర్ చదువు తున్నది. అయితే అదే కాలేజీలో అంబాజీ అనే వ్యక్తి వాలీబాల్ కోచ్‌గా పని చేస్తున్నాడు. అంబాజీ విద్యార్థిని మౌలిక పై కన్ను పడింది. దీంతో వాలీబాల్ కోచ్ అంబాజీ ప్రతిరోజు నన్ను ప్రేమించ మంటూ మౌలిక వెంట పడేవాడు.. ప్రేమ మీద నమ్మకం లేని మౌలిక అతని ప్రేమను తిరస్కరించింది. అంతేకాకుండా తన వెంట పడకూడదని పలుమార్లు హెచ్చరించింది.  అయినా కూడా వాలీబాల్ కోచ్ అంబాజీ మౌలిక వెంట పడుతూనే ఉండేవాడు.. రోజురోజుకి అతని వేధింపులు మితిమీరిపోవడంతో తీవ్ర మనస్థా పానికి గురైన మౌలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మ హత్య చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీ కి తరలించారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని.... నింది తుడు అంబాజీ కోసం గాలింపు చర్యలు చేపడుతూ దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతురాలి తల్లి హరిత తన కూతురు చదువుతోపాటు అన్నిట్లో ఫస్ట్ ఉండేదని... క్లాసికల్ డాన్స్ కూడా బాగా చేసేదని తల్లి హరిత కన్నీరు పెట్టుకున్నారు. ఏం జరిగిందో తెలియదు తన కూతురు మామూలుగానే ఉంది మేము బయటికి వెళ్లి వచ్చేసరికి తన కూతురు శవమైం దని బోరున విలపించింది. ఒకరి మీద అనుమానం ఉంది పోలీసులకు ఫిర్యాదు చేసాం అతను పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని చెప్పారని మృతురాలు తల్లి ఆవేదన వ్యక్తం చేసింది... మృతురాలి అన్న చంద్ర వర్ధన్ కాలేజ్ వాలీబాల్ కోచ్ పై మాకు అనుమానం ఉంది. వాలీబాల్ కోచ్ అంబాజీ నా చెల్లి మౌలికను ప్రతిరోజు వేధింపులకు గురి చేశాడని మా సిస్టర్ ఫ్రెండ్స్ నాతో చెప్పారు. మా చెల్లిని కాలేజీ నుండి తీసుకొని వచ్చాను. అప్పటికే అమ్మా నాన్న చిన్ని చెల్లి చదువుతున్న నారాయణ కాలేజ్ లో మెమో తేవడా నికి వెళ్లారు. మౌలిక, నేను ఇద్దరం కలిసి బజారుకు వెళ్లి సామాన్లు తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టాం. నేను స్నానానికి వెళ్తున్నానని చెప్పి బాత్రూంలోకి వెళ్లాను. అప్పటికి పెద్ద చెల్లె మౌలిక టీవీ చూస్తుంది. నేను బాత్రూం నుండి బయటికి వచ్చిన తర్వాత రెండు డోర్లు మూసి ఉన్నాయి.  వెంటనే నాకు అనుమానం వచ్చి తలుపులు పగల కొట్టి చూడగా మౌలిక ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. దీంతో నాకు భయం వేసింది వెంటనే స్థానికంగా ఉన్న అన్నయ్య, చుట్టుపక్కల ఉన్న వారందరినీ పిలిచాను. డాక్టర్ వచ్చి మౌలికను పరిశీలించి అప్పటికే మృతి చెందిందని చెప్పారు... మా నాన్న కోచ్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించి మౌలిక ఆత్మహత్య చేసు కోవడానికి గల కారణాలను తీసు కుంటామని చెప్పారని మృతు రాలి అన్న తెలిపాడు.