ఏపీ యువతకు విదేశాల్లోనూ ఉద్యోగాల కల్పన!

ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాష్ట్ర యువతకు రాష్ట్రంలోనే కాదు, విదేశాల్లో సైతం పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగావశాకాలు కల్పించడంపై దృష్టి సారించింది.  ఇందుకు సంబంధించి మంత్రి నారా లోకేష్ గురువారం (అక్టోబర్ 9) ఉండవల్లిలోని తన నివాసంలో  స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో అధికారులకు  భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. ఓవర్సీస్ మ్యాన్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఓంక్యాప్) ద్వారా రాబోయే ఐదేళ్లలో  విదేశాలలో రాష్ట్ర యువతకు లక్ష బ్లూకాలర్ ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆదేశించారు.  ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి పక్కా ప్రణాళికతో కూడిన రూట్ మ్యాప్‌ను సిద్ధం చేయాలని  ఆదేశించారు. విదేశాల్లో ప్రస్తుతం ఏ ఉద్యోగాలకు డిమాండ్ ఉందో గుర్తించి, దానికి అనుగుణంగా మన యువతను సిద్ధం చేయాలని మంత్రి లోకేశ్ అధికారులకు సూచించారు.  నర్సింగ్, వెల్డర్స్, ట్రక్కర్స్, బిల్డింగ్ వర్కర్లకు యూరప్‌తో పాటు జర్మనీ, ఇటలీల్లో మంచి డిమాండ్ ఉందన్న లోకేష్ ఆయా కొలువులకు అర్హులైన వారిని గుర్తించి శిక్షణ ఇవ్వాలన్నారు. ముఖ్యంగా నర్సింగ్, ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యనభ్యసించిన యువతీయువకులకు ఆయా దేశాల భాషల్లో శిక్షణ ఇచ్చి, విదేశాల్లో ఉద్యోగాలు లభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి కేరళ రాష్ట్రం చాలా విజయవంతమైంది. అందుకే, కేరళ మోడల్‌ను అధ్యయనం చేసి, ఆ  పద్ధతులను ఏపీలో అమలు చేయాలని మంత్రి లోకేశ్ ఆదేశించారు. ప్రస్తుతం ఓంక్యాప్ ద్వారా రాష్ట్రంలో 2,774 మంది నర్సింగ్ అభ్యర్థులు విదేశీ భాషల్లో శిక్షణ పొందుతున్నట్లు ఈ సందర్భంగా అధికారులు మంత్రికి తెలిపారు. జర్మనీ లాంగ్వేజెస్ అసెస్ మెంట్ సెంటర్లను రాష్ట్రంలో ఏర్పాటుచేయడానికి కూడా ఎంఓయూ చేసుకున్నట్లు అధికారులు వివరించారు. యువతకు ఉద్యోగాల సమాచారం సులభంగా అందించడానికి ఉద్దేశించిన  నైపుణ్యం పోర్టల్‌పై కూడా మంత్రి సమీక్షించారు.  

మరియాకు నోబెల్ శాంతి బహుమతి...డొనాల్డ్ ట్రంప్‌కు నిరాశ

  2025కి గాను ప్రతిష్ఠత్మక నోబెల్ శాంతి వెనిజూలకు చెందిన పార్లమెంట్ సభ్యురాలు మరియా కొరినా మచాడోకు లభించింది. డెముక్రటిక్ రైట్స్,శాంతి కోసం ఆమె చేసిన కృషిని గుర్తించిన నార్వేజియన్ నోబెల్ కమిటీ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఆమె డిక్టేటర్‌షిప్ నుంచి ప్రజాస్వామ్యం వైపు నడిపించారు. మరోవైపు నోబెల్ శాంతి బహుమతి కోసం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను వరించలేదు. నోబెల్ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వాన్ని రష్యా సమర్థిస్తుందని క్రెమ్లిన్ ప్రకటించింది. ఈ మేరకు క్రెమ్లిన్ అధికారి యురి ఉషకోవ్ ప్రకటన చేశారని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ టాస్ పేర్కొంది. తన చొరవతో ప్రపంచంలోని పలు దేశాల మధ్య జరుగుతోన్న యుద్ధాలు ఆగాయని ట్రంప్ పదేపదే ప్రకటించుకున్నారు. ఈ క్రమంలో నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.  

ఖతార్ లో ఉద్యోగావకాశాలు.. మంత్రి ఫరూక్

రాష్ట్రంలోని నిరుద్యోగ మైనారిటీ యువతకు ఖతార్ దేశంలో  ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పించేందుకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా జాబ్ మేళా, ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు  రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి  ఎన్ఎండి ఫరూక్ గురువారం (అక్టోబర్ 9) ఒక ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  ఏపీ ప్రభుత్వం, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్  ద్వారా ఖతార్ లోని దోహా లో హోమ్ కేర్ నర్స్  ఉద్యోగాల కొరకు అర్హులైన అభ్యర్డుల నుండి దరఖాస్తులు ఆహ్వానించినట్లు పేర్కొన్నారు.  అర్హులైన మైనారిటీ వర్గాల అభ్యర్థులు  http://naipunyam.ap.gov.in/ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. హోమ్ కేర్ నర్స్ ఉద్యోగానికి దరఖాస్తు చేసే యువతీ యువకుల వయస్సు 21 నుంచి 40 సంవత్సరాల లోపు ఉండాలనీ,   బి.ఎస్సీ లేదా జి.ఎన్.యమ్ నర్సింగ్  విద్యార్హత ఉండి, అనుభవం కూడా ఉండాలన్నారు. ఎంపికైన వారికి  నెలకు రూ. 1.20 లక్షల వేతనంతొ పాటు ఉచిత వసతి,రవాణా సదుపాయం కల్పిస్తామని మంత్రి తెలిపారు.   తెలుగుదేశం కూటమి ప్రభుత్వం   మైనారిటీ వర్గాల అభివృద్దికి కట్టుబడి ఉందని మంత్రి అన్నారు. 

కోచ్ వేధింపులు భరించలేక విద్యార్థిని బలవన్మరణం

  సమాజంలో మహిళలు, యువతలు, చివరకు చిన్న పిల్లలకు కామాంధుల నుండి వేధింపులు తప్పడం లేదు. దేవాలయం లాంటి స్కూల్, కాలేజీలలో కూడా కాటు వేసేందుకు కామాంధులు వేచి ఉంటున్నారు. అక్కడ కూడా యువతులు, చిన్నపిల్లలకు సైతం భద్రత లేకుండా పోయింది. ఆడపి ల్లల తల్లిదండ్రులు పిల్లల్ని బయటకు పంపించాలంటే గజ్జుమని వణుకుతున్నారు. ఓ కామాంధుడి వేధింపులు భరించలేక ఓ విద్యా ర్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆ కుటుంబంలో తీరని దుఃఖాన్ని మిగిల్చింది. సికింద్రాబాద్ పరిధిలో నివాస ముంటున్న ప్రమోద్ కుమార్, హరిత అనే దంపతులకు ఇద్దరమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్నారు... ప్రమోద్ కుమార్ రైల్వేలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. మృతురాలు మౌలిక రెండవ సంతానం... మౌలిక సికింద్రాబాద్ పరిధిలోని లాలా గూడలో ఉన్న తార్నాక రైల్వే డిగ్రీ కళాశాలలో బిబిఏ సెకండ్ ఇయర్ చదువు తున్నది. అయితే అదే కాలేజీలో అంబాజీ అనే వ్యక్తి వాలీబాల్ కోచ్‌గా పని చేస్తున్నాడు. అంబాజీ విద్యార్థిని మౌలిక పై కన్ను పడింది. దీంతో వాలీబాల్ కోచ్ అంబాజీ ప్రతిరోజు నన్ను ప్రేమించ మంటూ మౌలిక వెంట పడేవాడు.. ప్రేమ మీద నమ్మకం లేని మౌలిక అతని ప్రేమను తిరస్కరించింది. అంతేకాకుండా తన వెంట పడకూడదని పలుమార్లు హెచ్చరించింది.  అయినా కూడా వాలీబాల్ కోచ్ అంబాజీ మౌలిక వెంట పడుతూనే ఉండేవాడు.. రోజురోజుకి అతని వేధింపులు మితిమీరిపోవడంతో తీవ్ర మనస్థా పానికి గురైన మౌలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మ హత్య చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీ కి తరలించారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని.... నింది తుడు అంబాజీ కోసం గాలింపు చర్యలు చేపడుతూ దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతురాలి తల్లి హరిత తన కూతురు చదువుతోపాటు అన్నిట్లో ఫస్ట్ ఉండేదని... క్లాసికల్ డాన్స్ కూడా బాగా చేసేదని తల్లి హరిత కన్నీరు పెట్టుకున్నారు. ఏం జరిగిందో తెలియదు తన కూతురు మామూలుగానే ఉంది మేము బయటికి వెళ్లి వచ్చేసరికి తన కూతురు శవమైం దని బోరున విలపించింది. ఒకరి మీద అనుమానం ఉంది పోలీసులకు ఫిర్యాదు చేసాం అతను పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని చెప్పారని మృతురాలు తల్లి ఆవేదన వ్యక్తం చేసింది... మృతురాలి అన్న చంద్ర వర్ధన్ కాలేజ్ వాలీబాల్ కోచ్ పై మాకు అనుమానం ఉంది. వాలీబాల్ కోచ్ అంబాజీ నా చెల్లి మౌలికను ప్రతిరోజు వేధింపులకు గురి చేశాడని మా సిస్టర్ ఫ్రెండ్స్ నాతో చెప్పారు. మా చెల్లిని కాలేజీ నుండి తీసుకొని వచ్చాను. అప్పటికే అమ్మా నాన్న చిన్ని చెల్లి చదువుతున్న నారాయణ కాలేజ్ లో మెమో తేవడా నికి వెళ్లారు. మౌలిక, నేను ఇద్దరం కలిసి బజారుకు వెళ్లి సామాన్లు తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టాం. నేను స్నానానికి వెళ్తున్నానని చెప్పి బాత్రూంలోకి వెళ్లాను. అప్పటికి పెద్ద చెల్లె మౌలిక టీవీ చూస్తుంది. నేను బాత్రూం నుండి బయటికి వచ్చిన తర్వాత రెండు డోర్లు మూసి ఉన్నాయి.  వెంటనే నాకు అనుమానం వచ్చి తలుపులు పగల కొట్టి చూడగా మౌలిక ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. దీంతో నాకు భయం వేసింది వెంటనే స్థానికంగా ఉన్న అన్నయ్య, చుట్టుపక్కల ఉన్న వారందరినీ పిలిచాను. డాక్టర్ వచ్చి మౌలికను పరిశీలించి అప్పటికే మృతి చెందిందని చెప్పారు... మా నాన్న కోచ్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించి మౌలిక ఆత్మహత్య చేసు కోవడానికి గల కారణాలను తీసు కుంటామని చెప్పారని మృతు రాలి అన్న తెలిపాడు.

రోహిత్ న్యూ లుక్.. ఇంత స్లిమ్ ఎలా అయ్యాడు?

రోహిత్ శ‌ర్మ‌ ఒకింత బొద్దుగా ఉంటాడు. ఒబెసిటీ అనలేం కానీ.. స్పోర్టింగ్ ఫిగర్ అయితే కాదని అంతా ఒప్పుకుంటారు. ఫిట్ నెస్ అనుమానమే అంటారు. అలాంటి రోహిత్ శర్మ ఒక్కసారిగా స్లిమ్ గా తయారయ్యాడు. బొద్దుగా, లావుగా ఉండే రోహిత్ శర్మ  ఉన్న‌ట్టుండి ఇంత స‌న్న‌గా ఎలా మారిపోయాడంటూ ఆయన ఫ్యాన్స్ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.  సియ‌ట్ క్రికెట్ అవార్డుల ఫంక్ష‌న్లో క‌రోహిత్ శర్మ    75 కిలోల‌ క‌రెంటు తీగ‌లా కనిపించాడు.  అదీ కేవలం రెండంటే రెండు నెలలలో. అలాగ‌ని ఆయ‌నేమీ అంద‌రిలా క‌డుపు మాడ్చుకోలేదు. ఏకంగా ఏడు పూట‌లా తింటూ త‌న ఫిట్ నెస్ సాధించిన‌ట్టు తెలుస్తోంది. అరే అంత‌లా రోహిత్ శ‌ర్మ ఏం తిన్నాడు? ఆ డైట్ ప్లాన్ మ‌న‌మూ ఒక ప‌ట్టు ప‌డ‌తాం అనుకునే వారు రోహిత్ శర్మ డైట్  ప్లానింగ్ పై ఒక లుక్ వేస్తే స‌రి. ఇంత‌కీ డైటేంటంటే..?   ఉద‌యం లేవ‌గానే ఆరు నాన‌బెట్టిన బాదంప‌ప్పులు, మొల‌కెత్తిన స‌లాడ్ ఆపై జ్యూస్ తాగ‌డం. ఇక తొమ్మిదిన్న‌ర‌కు బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా తాజా పండ్ల‌తో కూడిన‌ ఓట్ మిల్క్ తో పాటు ఒక గ్లాసు పాలతో స‌రిపెట్ట‌డం. ప‌ద‌కొండున్న‌ర‌కు పెరుగు, చిల్లా, కొబ్బ‌రి నీళ్లు, ప్రోబ‌యోట్రిన్స్. ఇదంతా మాణింగ్ సెష‌న్ డైట్. ఇక మ‌ధ్యాహ్నం.. ఒక‌టిన్న‌ర‌కు వెజిట‌బుల్ క‌ర్రీస్, అన్నం, ప‌ప్పు, స‌లాడ్ ఎంచ‌క్కా లాగించేస్తాడు. ఆపై . సాయంత్రం 4. 30గంట‌ల‌కు డ్రై ఫ్రూట్స్ తీస్కుంటాడు. రాత్రి ఏడున్న‌ర‌కు కూర‌గాయ‌లు పులావ్ తింటారు, ఇక ప‌డుకునే ముందు గ్లాస్ పాలు ఇదీ రోహిత్ డైట్ అండ్ స్లిమ్ సీక్రెట్  ఇదే హిట్ మాన్ డైట్. మ‌రి మీరు కూడా ఒక ప‌ట్టు ప‌డ‌తారా?రోహిత్ లా హిట్ మాన్ అయిపోతారా? ట్రై చేయండి మ‌రి.

బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీలో భారీ దోపిడీ

అబ్దుల్లాపూర్ మెట్ లోని బ్రిలియంట్ ఇంజినీరింగ్ కాలేజీలో భారీ దోపిడీ జరిగింది. ఆ కాలేజీలో పెద్ద మొత్తంలో సొమ్ము ఉందని తెలిసిన గుర్తు తెలియని వ్యక్తులు పక్కా స్కెచ్ లో దోపిడీకి పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం కాలేజీ సిబ్బంది గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అసలా కాలేజీలో భారీ మొత్తంలో సొమ్ము ఉందన్న విషయం బయటకు ఎలా తెలిసిందనేది మిస్టరీగా మారింది.  ఇక దోపిడీ విషయానికి వస్తే..అబ్దుల్లాపూర్మెట్ లోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీ లో  గుర్తు తెలి యని దుండగులు చొరబడి కాలేజీలోని లాకర్స్ పగలకొట్టి దాదాపు కోటి రూపాయలు దోచుకున్నారు. మూడు కాలేజీలకు సంబంధించిన సొమ్ములను ఒకే చోట సేఫ్టీలాకర్ లో పెట్టి భద్రంగా తాళం వేసినా.. దుండగులు వాటిని పగుల గొట్టి సొత్తు దోచుకున్నారు. ఎక్కడా ఎలాంటి క్లూ వదలకూడదన్న ఉద్దేశంతో  200 సీసీ కెమెరాలు ఉన్న డివిఆర్ ను సైతం ఎత్తుకెళ్లారు.  శుక్రవారం (అక్టోబర్ 10) ఉదయం  కాలేజీకి వచ్చిన ఉద్యోగులు లాకర్ బ్రేక్ చేసి ఉండడం చూసి వెంటనే యాజమాన్యానికి సమాచారం అందించారు. వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.   క్లూస్ టీం ఆధారాలు సేకరించే పనిలో ఉంది.  కాలేజీలో అంత సొమ్ము ఒక్కచోటే గంపగుత్తగా ఉందని ఎవరెవరికి తెలుసు; లాకర్ తాళం చెవులు ఎవరి వద్దనున్నాయి. ఈ దోపిడీలో ఇంటి దొంగల హస్తం ఏమైనా ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే  పోలీసులు కాలేజీ పరిసర ప్రాంతాలలో సీసీ కెమేరాలను సైతం పరిశీలిస్తున్నారు.  

మాట్రిమోనియల్ సైట్లో పరిచయం.. పెట్టుబడుల పేరుతో మోసం

రూ.7.7 కోట్లు మోసపోయిన బాధితుడు  అమెరికాలో వ్యాపారం చేస్తూ ఉంటాను.. మ్యాట్రిమోనీలో మీ ప్రొఫైల్ చేశాను. చాలా అందంగా ఉన్నారు. మీ స్మైల్   బాగా నచ్చింది... నేను మీకు నచ్చితే వివాహం చేసు కుందాం  అంటూ వలపు వల విసిరి, పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో దగ్గరై త్వరలోనే వివాహం అంటూ నమ్మించి.. ఆ తరువాత   క్రిప్టో, స్టార్ట్-అప్, ఫారెక్స్, స్టాక్స్ మొదలగు ఎగుమతి కంపెనీలలో పెట్టుబడులు పెట్టొచ్చు కదా బోలోడు ఆదాయం అంటూ నమ్మించి కోట్ల రూపాయలు దోచేస్తున్నారు  నేరగాళ్లు. విదేశాల్లో వ్యాపారం లేదా ప్రోఫెషనల్స్ గా పరిచయం చేసుకుంటూ మేట్రిమోనియల్ లో ప్రొఫైల్ చూశాం అంటూ పరిచయం పెంచుకుని పెట్టుబడులు పెట్టమనే వారిని నమ్మవద్దని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్  శిఖాగోయెల్ హెచ్చరించారు. వీటిలో ఇన్వెస్ట్ చేస్తే బోలెడు లాభాలు అంటూ నమ్మించి నకిలీ వెబ్ సైట్ లు చూపించి.. ముందు చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టించి లాభాలు వచ్చినట్లుగా చూపుతారు. ఆ తరువాత.. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితే ఇంకా పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయంటూ నమ్మించి కోట్లలో దోచుకుంటారని శిఖాగోయెల్ హెచ్చరించారు.  ఇటీవలే తెలంగా ణకు చెందిన ఓ బాధితుడు మ్యాట్రిమోనీ పేరుతో 7.7 కోట్ల రూపాయలు నష్టపోయాడని పేర్కొన్న శిఖాగోయెల్.. ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి.. జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజలను హెచ్చరించారు.  ఎ సోషల్ మీడియా లేదా మాట్రిమోని యల్ ప్రొఫైల్ ద్వారా వచ్చిన సంబంధా లను జాగ్రత్తగా పరిశీలించి.. అన్ని వివరాలు తెలుసుకున్న తరువాతనే ముందుకు అడుగువేయాలని సూచించారు.   అలాగే పెట్టుబడులు పెట్టమంటూ అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దని శిఖాగోయెల్ హెచ్చరించారు. ఆన్ లైన్ లోతెలియని వ్యక్తుల తో పరిచయం పెంచుకోవద్దని సూచించారు. అలాగే  వ్యక్తిగత వివరాలు, ఫోటోలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వొదన్నారు.  ఏదైనా అనుమానం కలిగినా,  మోసపోయినా వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్  1930కి కాల్ చేసి లేదా www. Cyber crime.gov.in లో ఫిర్యాదు చేయాలని  శిఖా గోయల్  ప్రజలకు సూచించారు.  

ఫిమేల్ రైడర్స్.. ఫెమీరైడ్స్ సంస్థ వినూత్న ఆలోచన

మహిళల కోసం, మహిళల రక్షణ కోసం విశాఖలో ఫెమీ రైడ్స్ పేరుతో మహిళా రైడర్స్ అందుబాటులోకి వచ్చారు. ఫెమీ రైడ్స్ పేరులో ప్రారంభమైన ఈ స్టార్టప్ మహిళల కోసం మహిళలే పని చేసేలా తీర్చి దిద్దారు. రాథికా బెహరా అనే ఓ మహిళ ప్రారంభించిన ఈ స్టార్టప్ ఇప్పుడు ఎందరో మహిళలకు ఉపాధిగా మారింది. ఈ ఫెమీ రైడ్స్ సంస్థ దాదాపు 500 మంది మహిళలకు డ్రైవింగ్ లో శిక్షణ ఇచ్చింది. ఈ మహిళా రైడర్లు మహిళా ప్రయాణీకులు భద్రంగా గమ్యం చేరేందుకు దోహదపడుతున్నారు.  మహిళలు ఇప్పుడు ఫెమీ రైడ్స్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని తమతమ అవసరాలకు తగినట్లుగా టూ వీలర్, త్రీవీలర్, ఫోర్ వీలర్ లను బుక్ చేసుకుని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉంది. ఈ ఫెమీరైడ్స్ స్టార్టప్ మహిళలకు ట్రావెల్ రంగంలో ఉపాధి కల్పిస్తోంది.   నిస్సందేహంగా ఇది ట్రావెల్ రంగంలో కొత్త మార్పు అంటున్నారు మహిళలు. ఇప్పుడు విశాఖలో మహిళా రైడర్ల జోరు పెరిగింది.   రవాణా సదుపాయం లేక, ఆటోల్లో, ట్యాక్సీల్లో ఒంటరిగా వెళ్లే ధైర్యం చేయలేని మహిళలకు ఈ ఫెమీ రైడ్స్ యాప్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఇపప్టికే హైద్రాబాద్‌, బెంగుళూరులో మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ట్రావెల్‌ ఏజెన్సీ లు ఉన్నాయి. ఇప్పడు విశాఖలో కూడా మహిళల కోసం మహిళలే పని చేసేలా ఫెమీరైడ్స్ అందుబాటులోకి వచ్చింది.  ఈ ఫెమీరైడ్స్ సంస్థ ప్రత్యేకత ఏమిటంటే.. మిగతా ఏజెన్సీలలా మహిళారైడర్స్ కు కమిషన్ రూపంలో కాకుండా, వేతనాలు చెల్లిస్తారు. ప్రస్తుతం ఫెమీరైడ్స్ సంస్థ  బైక్‌ రైడ్‌, ట్యాక్సీ రైడ్‌, ఆటో రైడ్‌ల సేవలు అందిస్తోంది.  

మహిళల బాత్ రూంలో సెల్ ఫోన్.. పోలీసుల అదుపులో సైట్ ఇంజినీర్?

చిత్తూరులోని అపోలో  యూనివర్సిటీలోని మహిళ టాయిలెట్ లో రహస్యంగా మొబైల్ ఫోన్ ఉంచి.. అసభ్యంగా ఫొటోలు తీస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాష్ రూమ్ కు వెళ్లిన ఓ ఆమ్మాయి.. దీనిని గుర్తించి వెంటనే వర్సిటీ యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో   యాజమాన్యం విషయాన్ని గోప్యంగా ఉంచి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తుతో ఆ సెల్ ఫోన్ ను రహస్యంగా మహిళల టాయిలెట్ లో అమర్చినది ఒక సైట్ ఇంజినీర్ గా గుర్తించి ఆ సైట్ ఇంజినీర్ ను అదుపులోనికి తీసుకున్నారు. ఈ నెల 1న ఈ ఘటన జరిగినట్లు చెబుతున్నారు. గోప్యంగా ఉంచగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  కళాశాల యాజమాన్యం పోలీసులకు గుట్టుచప్పుడు కాకుండా పిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు బాత్రూమ్ లో మొబైల్ ఫోన్ అమర్చిన ఓ సైట్ ఇంజనీర్ ను అదుపులోకి తీసుకున్నారు. అక్టోబర్ 1న ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై వివరాలు వెల్లడించేందుకు అటు పోలీసలు కానీ, ఇటు వర్సిటీ యాజమాన్యం కానీ సుముఖత చూపడం లేదు. 

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. దేశ విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలేశుని దర్శనానికి తరలి వస్తుంటారు. శుక్రవారం (అక్టోబర్ 10) తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వెైకుంఠం కాంప్లెక్స్ లోని కాంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది.   టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.   ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు స్వామి వారి దర్శనానికి ఐదు గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక గురువారం (అక్టోబర్ 9)  శ్రీవారిని మొత్తం 66,883 మంది దర్శించున్నారు. వారిలో 26 వేల  మంది    తలనీలాలు సమర్పించుకున్నారు.  శ్రీవారి హుండీ  కానుకల ఆదాయం  4కోట్ల 15లక్షల రూపాయలు వచ్చింది.  

బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆపడంలో ఆ రెండు పార్టీల కుట్ర : భట్టి

  రాష్ట్రంలో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలకు చిత్తశుద్ది లేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు ను ఆపింది బీజేపీ ప్రభుత్వం కాదా?, రిజర్వేషన్లు 50 శాతం మించకుండా చట్టం చేసింది బిఆర్ఎస్ కాదా? అని ప్రశ్నించారు. ఇక్కడ ఆ రెండు పార్టీల కుట్ర స్పష్టంగా కనబడుతుంది. 42 శాతం బీసీ రిజర్వేషన్లు తప్పక అమలు చేస్తామని భట్టి స్పష్టం చేశారు. ఢిల్లీలో మేము ధర్నా చేసిన రోజు బీఆర్‌ఎస్‌ నేతలు ఎక్కడ దాక్కున్నారు? బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం చట్టబద్ధంగా చేయాల్సిన ప్రతి ప్రక్రియను మా ప్రభుత్వం పూర్తి చేసిందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.  సెప్టెంబర్‌ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలంటూ కోర్టు ఆదేశించింది. బీసీ రిజర్వేషన్లు పెంచాలనే ఆలోచన గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఉంటే కులగణన ఎందుకు చేయలేదు? బీసీలు అమాయకులు కాదు... రిజర్వేషన్ల పెంపు ఎంత క్లిష్టమో వారికి తెలుసు. మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆ ప్రక్రియను ప్రారంభించాం” అని తెలిపారు. హైకోర్టు తీర్పు కాపీ వచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్‌ గౌడ్‌ అన్నారు .  బీసీల రిజర్వేషన్ల పెంపు బీజేపీ, బిఆర్ఎస్ లకు ఏ మాత్రం ఇష్టం లేదు. 95 సంవత్సరాల తర్వాత బీసీ కులగణన జరిగింది  బీసీ రిజర్వేషన్లు తగ్గించి బీసీ లను బిఆర్ఎస్ మోసం చేసిందన్నారు. బీజేపీ, బిఆర్ఎస్ లోపాయకారి ఒప్పందం తో బీసీ ల నోటి కాడి ముద్ద లాక్కున్నారు. మేము ఢిల్లీ లో ధర్నా చేస్తే...బీజేపీ, బిఆర్ఎస్ నేతలు ఎక్కడ ఉన్నారు’ అని మహేష్‌ గౌడ్‌  నిలదీశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక ఎన్నికలకు వెళ్తామన్నారు. దేశంలోనే తొలిసారి కులగణన చేసింది తమ ప్రభుత్వమేనని మహేష్‌ గౌడ్‌  చెప్పారు.

హైకోర్టు ఆదేశాలను పాటిస్తాం : ఎన్నికల సంఘం

  స్థానిక ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు ఆదేశాలను పాటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు సింగిల్ సెంటెన్స్‌తో ప్రెస్ నోట్ విడుదల చేసింది. లోకల్ బాడీ ఎన్నికల విషయంలో రాష్ట్ర హైకోర్టు కీలక నిర్ణయం వెల్లడైంది. బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నె 9 పై హైకోర్టు తాత్కాలికంగా స్టే విధించగా, ఎన్నికల నోటిఫికేషన్‌పై కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆర్డర్ కాపీ అందిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ పేర్కొన్నాది. కోర్టు తదుపరి విచారణను ఆరు వారాలకి వాయిదా వేశారు. ఆ సమయంలో వరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండవని ఎన్నికల సంఘం తెలిపింది

ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసాలపై పోలీసులు హెచ్చరిక

  హైదరాబాద్ నగరంలో పలుచోట్ల ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నెరగాళ్లు విసురు తున్న వలలో చిక్కుకుని చాలా మంది బాధితులు లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అధిక వడ్డీ ఆశ చూపించగానే బాధితులు ముందు వెనక ఆలోచించ కుండా పెట్టుబ డులు పెట్టేందుకు  సిద్ధమవుతున్నారు. ఇదే అదునుగా భావించిన సైబర్ నేరగాళ్లు బాధితుల వద్ద నుండి దొరికి నంత దోచుకుం టున్నారు. ఇలా నగరంలో పలు కేసులు నమోదు కావడంతో అప్రమత్తమైన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసాలపై హెచ్చ రికలు జారీ చేశారు. సోషల్ మీడియా ద్వారా నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్లు ప్రజలను మోసం చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. చిన్న ఇన్వెస్ట్‌ మెంట్‌ తో మొదలై పెద్ద మొత్తంలో డబ్బులు దోచుకుం టున్నా రని పోలీసులు తెలిపారు. నకిలీ వెబ్‌సైట్లలో ఫేక్ లాభాలు చూపించి, ట్యాక్స్‌లు, ఫీజుల పేరుతో మరిన్ని డబ్బులు వసూలు చేస్తున్నారని అట్టి వారి పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తం గా  ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు..ప్రజలు ఎందులోనైనా పెట్టుబడి పెట్టే ముందు ఆ ప్లాట్‌ ఫారమ్‌ను ధృవీ కరించుకోవాలని, అధిక లాభాల హామీలను నమ్మి మోసపోకూడదని పోలీసులు సూచి స్తున్నారు. ఎవరైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే 1930 నంబర్ లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని పోలీ సులు విన్నపం చేస్తున్నారు.

దేశ కుబేరుల జాబితా అగ్రస్థానంలో ముఖేష్ అంబానీ!

  రిలయన్స్ వ్యాపార వాణిజ్య అధినేత ముఖేష్ అంబానీ మరోసారి అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. దేశంలోని 100 మంది అగ్రగామి కుబేరుల జాబితాను ఫోర్బ్స్ గురు  వారం విడుదల చేసింది. ఈ జాబితాలో ముకేశ్ టాప్ ప్లేస్‌లో  నిలిచారు. ప్రస్తుతం ముకేశ్ అంబానీ నికర ఆదాయం సుమారు 105 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే, గత సంవత్సరంతో పోలిస్తే మాత్రం 12శాతం 14శాతం ఆదాయం క్షీణించింది. ఇదిలాఉంటే.. రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలి కమ్యూనికేషన్ సంస్థ జియో పబ్లిక్ ఇష్యూకు రానుంది.  2026 తొలి అర్ధభాగంలో తాము ఐపీవోకు వస్తున్నట్లు రిలయన్స్ సీఎండీ ముకేశ్ అంబానీ వార్షిక సమావేశంలో వెల్లడించారు. మరోవైపు.. కృత్రిమమేధను విస్తృతంగా వినియోగంలోకి తెచ్చేందు కు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు అనుబంధంగా ‘రిలయన్స్ ఇంటెలిజెన్స్’ ఏర్పాటు గురించి ప్రకటన చేసింది. భారతదేశంలో 100 మంది అగ్రగామి కుబేరుల పోర్బ్స్ జాబితాలో గౌతమ్ అదానీ రెండో స్థానంలో నిలిచారు. 92 బిలియన్ డాలర్లతో రెండో స్థానాన్ని సొంతం చేసుకోగా.. ఓపీ జిందాల్ గ్రూప్‌నకు చెందిన సావిత్రి జిందాల్ 40.2 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో నిలిచారు.  టెలికాం దిగ్గజం సునీల్ మిట్టల్ నాల్గో స్థానంలో నిలవగా.. అతని సంపద 34.2 బిలియన్ డాలర్లు. ఈ సంవత్సరం అత్యధికంగా డాలర్లు సంపాదించిన వ్యక్తిగా సునీల్ మిట్టల్ నిలిచారు. ఇక టెక్ బిలియనీర్ శివ నాడార్ ఐదో స్థానంలో నిలిచారు. ఆయన సంపద 33.2బిలియన్ డాలర్లు.

ఏపీలో భారీగా ఐఏఎస్‌లు బదిలీ

  ఏపీలో భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయశాఖ డైరెక్టర్‌గా మనజీర్‌ జిలానీ సామున్‌, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా చక్రధర్‌బాబు, ఏపీపీఎస్సీ సెక్రెటరీగా రవి సుభాష్‌, ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీగా శివశంకర్‌ లోతేటి, పౌరసరఫరాలశాఖ వైస్‌ ఛైర్మన్‌గా ఎస్‌.ఢిల్లీరావు, ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌గా పి. రంజిత్‌బాషా, హౌసింగ్‌ కార్పొరేషన్‌ వైస్‌ సీఎండీగా అరుణ్‌బాబు నియమితులయ్యారు. 1. కొల్లాబత్తుల కార్తీక్ - నంద్యాల జాయింట్ కలెక్టర్ 2. శ్రీధర్ బాబు - కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ 3. శుభమ్ బన్సల్ - పరిశ్రమల శాఖ డైరెక్టర్ 4. మనజీర్ జిలానీ - వ్యవసాయ శాఖ డైరెక్టర్ 5. అభిషేక్ గౌడ - ఏలూరు జాయింట్ కలెక్టర్ 6. రవిసుభాష్ - ఏపీపీఎస్సీ కార్యదర్శి 7. నూరుల్ - కర్నూలు జాయింట్ కలెక్టర్ 8. శివశంకర్ లోతేటి - ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ 9. ఢిల్లీ రావు - పౌరసరఫరాల శాఖ వైస్ చైర్మన్ 10. రాహుల్ మీనా - రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ 11. పి. రంజిత్ బాషా - ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ 12. అపూర్వ భరత్ - కాకినాడ జాయింట్ కలెక్టర్ 13. మౌర్య భరద్వాజ్ - శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ 14. అరుణ్ బాబు - హౌసింగ్ కార్పొరేషన్ వైస్ సీఎండీ 15. జేవీ మురళి - సీసీఏల్ఏ కార్యదర్శి 16. సహదిత్ వెంకట్ త్రివినాగ్ - గృహనిర్మాణ శాఖ డిప్యూటీ కార్యదర్శి 17. టీఎస్ చేతన్ - సీసీఏఎల్ సంయుక్త కార్యదర్శి 18. కొమ్మిశెట్టి మురళీధర్ - ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి 19. ప్రసన్న వెంకటేశ్ - లెదర్ ఇండస్ట్రీస్ అభివృద్ధి కార్పొరేషన్ వైస్ చైర్మన్, ఎండీ 20. బి. నవ్య - రాష్ట్ర గిడ్డంగుల సంస్థ వైస్ చైర్మన్ 21. ఎస్. భరణి - స్టెప్ కమిషనర్ 22. ప్రవీణ్ ఆదిత్య - ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ 23. తిరుమణి శ్రీపూజ - అల్లూరి జిల్లా జాయింట్ కలెక్టర్ 24. కేఎల్ విశ్వనాథన్ - ఐ అండ్ పీఆర్ డైరెక్టర్ 25. గోవిందరావు - పౌరసరఫరాల శాఖ 26. ఎస్. చిన్నరాముడు - ఎస్సీ కమిషన్ కార్యదర్శి 27. జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ - ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ 28. ఎస్ఎస్ భావన - బాపట్ల జాయింట్ కలెక్టర్ 29. సి. విష్ణుచరణ్ - సోషల్ వెల్ఫేర్ శాఖ డిప్యూటీ కార్యదర్శి 30. ఎస్ఎస్ శోభిక - వైద్యఆరోగ్య శాఖ డిప్యూటీ కార్యదర్శి 31. అభిషేక్ కుమార్ - ఏపీ మారిటైం బోర్డు సీఈవో

హైకోర్టు స్టే ఊహించలేదు...భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం : మంత్రి పొన్నం

  బీసీ రిజర్వేషన్లు, ఎన్నికల నోటిఫికేషన్‌పై తెలంగాణ హైకోర్టు స్టే విధించడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. కోర్టు కాఫీ అందిన తర్వాత చట్టపరంగా, న్యాయపరంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని మంత్రి తెలిపారు. హైకోర్టు స్టే విధిస్తుందని ఊహించలేదని ఆయన అన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించడం జరిగిందని పొన్నం పేర్కొన్నారు.  ప్రభుత్వం కుల సర్వే నిర్వహించి డెడికేటెడ్ కమిషన్ వేసి అన్ని విధాలుగా చిత్తశుద్ధితో వ్యవహరించిందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదని మంత్రి తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీలు హైకోర్టులో ఎందుకు ఇంప్లీడ్ కాలేదో సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రాహుల్ గాంధీ నాయక్వతంలో సామాజిక న్యాయంతో ఎన్నికలకు వెళ్తమని మంత్రి పొన్నం తెలిపారు. బీసీలకు 42 శాతంపై అన్ని పార్టీలు మద్దతు ఇచ్చిన కూడా స్టే విధించడం అన్యాయమని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బీసీ రిజర్వేషన్ కొలిక్కి వచ్చిందనుకున్నాం.. కానీ కోర్టు తీర్పు ఊహించలేదని చెప్పారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా కులగణన పూర్తి చేసి బీసీ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని వివరించారు. బీసీల నోటి కాడ కూడు లాగేయడం శోచనీయమని పేర్కొన్నారు.  నోటి కాడ ముద్ద ఎవరు లాగేసారో కోర్ట్ తీర్పు కాపీ వచ్చాక చెబుతామని హెచ్చరించారు. 42 శాతం బీసీల రిజర్వేషన్ కు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. బీసీ బిడ్డలు అధైర్య పడాల్సిన అవసరం లేదని. .కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్ బిల్లును రెండు సభల్లో పాస్ చేసి గవర్నర్ కు పంపించామని.. గవర్నర్ బిల్లు పాస్ చేయకుండా అడ్డుకున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.  

దేశంలోనే రోల్ మోడల్‌గా నెల్లూరు స్మార్ట్ స్ట్రీట్ బజార్ : మంత్రి నారాయణ

  దేశంలోనే నెల్లూరు స్మార్ట్ స్ట్రీట్ బజార్ ను రోల్ మోడల్ గా తీర్చిదిద్దమే తన లక్ష్యమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ  తెలిపారు. ఈనెల 10న సీఎం చంద్రబాబు నెల్లూరు పర్యటన సందర్భంగా మంత్రి ఏర్పాట్లను పర్యవేక్షించారు. హెలిప్యాడ్ పరిశీలన, కార్యక్రమాల ఏర్పాట్లు తదితర అంశాలపై మంత్రి నారాయణ క్షుణ్ణంగా అధికారులకు దిశ నిర్దేశం చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా సీఎం ప్రోగ్రాం విజయవంతం చేసేందుకు మంత్రి ఏర్పాట్లు చేపట్టారు.  తొలుత వెంకటాచలం మండలం ఈదగాలిలో కార్యక్రమం అనంతరం నెల్లూరులోని మైపాడు గేట్ సెంటర్లో  స్మార్ట్ స్ట్రీట్ బజార్ ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉంటుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లపై అధికారులకు మరోమారు సూచనలు చేశారు. స్మార్ట్ స్ట్రీట్ బజార్ లో ఏర్పాటు చేసిన 120 కంటైనర్ షాప్ లను మంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు. మహిళా వ్యాపారులతో మాట్లాడారు. సీఎంతో మహిళ వ్యాపారుల ఫోటో సెషన్‌కు సంబంధించిన ప్రదేశాన్ని సందర్శించారు. సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు అన్నింటిని సాయంత్రం లోపల పూర్తి చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు.  తమ కల సాకారం చేస్తూ స్మార్ట్ స్ట్రీట్ బజార్‌ను ఏర్పాటు చేసిన మంత్రి నారాయణ కు మహిళ వ్యాపారులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ నెల్లూరులోని మైపాడు గేట్ సెంటర్ లో ప్రారంభోత్సవానికి స్మార్ట్ స్ట్రీట్ బజార్ ముస్తాబయిందన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి  చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనుందని  తెలిపారు. స్మార్ట్ స్ట్రీట్ లో 8.4 కోట్లతో 200 షాపులను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అయితే తొలివిడతలో 30 కంటైనర్లలో 120 షాపులు సిద్ధం చేశామని చెప్పారు.  మొత్తం ఐదు మున్సిపాలిటీల్లో ప్రయోగాత్మకంగా స్మార్ట్ స్ట్రీట్ ల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. అందులో తొలుతగా నెల్లూరు సిటీలో శుక్రవారం సీఎం చేతుల మీదుగా స్మార్ట్ స్ట్రీట్ బజార్‌లో 120 షాప్ లు ప్రారంభమవు తున్నాయన్నారు. ఒక్కో షాపుకి నాలుగు లక్షలు ఖర్చు అవుతుండగా... అందులో రెండులక్షల వ్యయాన్ని కార్పొరేషన్, మెప్మాలు బరిస్తాయని తెలిపారు. మిగిలిన రెండు లక్షల్లో కంటైనర్ కి లక్షన్నర రూపాయలు, పెట్టుబడి సాయం కింద మరో 50వేలు కేవలం రూపాయి వడ్డీకే లోన్ ఇప్పించి ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.  ఆ రెండు లక్షల్లో కూడా పి-4 పథకంలో భాగంగా 120మంది లబ్ధిదారుల్లో ప్రతి ఒక్కరికీ లక్ష రూపాయలు నా సొంత నిధుల నుండి మొత్తం కోటీ 20 లక్షల రూపాయలు ఆర్థిక సాయం కింద అందచేస్తున్నానని మంత్రి తెలియజేశారు. నెల్లూరు స్మార్ట్ స్ట్రీట్ పై ప్రతిపక్షాలు ఎన్నో విమర్శలు చేశాయని, చేస్తున్నాయని తనదైన శైలిలో మంత్రి ఖండించారు. అన్నిటినీ తట్టుకుని స్మార్ట్ స్ట్రీట్ ను విజయవంతం చేయడమే లక్ష్యంగా ముందుకెళ్లామని చెప్పారు. దేశంలోనే ఈ స్మార్ట్ స్ట్రీట్ ని ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని తెలిపారు.  స్మార్ట్ స్ట్రీట్ లో టెక్నాలజీదే పెద్ద పాత్ర అన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ పోల్స్ కి సీసీ కెమెరాలున్నాయని, వైఫై సౌకర్యం ఉందన్నారు. ఏదైనా అనౌన్స్ మెంట్ చేయాలంటే దీనికే స్పీకర్స్ ఉన్నాయని తెలిపారు. లైటింగ్ పోల్స్ కూడా ఇవేనన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రతీదీ టెక్నాలజీ అప్డేటెడ్ అని చెప్పేందుకు గర్విస్తున్నానని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. వ్యాపారంలో మెళుకువలు నేర్పేందుకు మెప్మా మహిళలకు శిక్షణ కూడా ఇచ్చారన్నారు. చెన్నై బర్మా బజారుకు తీసుకెళ్లి వ్యాపారాలపై అవగాహన కూడా కల్పించామని తెలిపారు..

కర్ణాటకలో మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్

  కర్ణాటకలో మహిళా ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నెలసరి సెలవు ఇచ్చేందుకు నిర్ణయించింది. రాష్ట్రంలోని మహిళలందరికీ  ప్రతి నెలా ఒక రోజు, అంటే సంవత్సరానికి 12 రోజుల వేతనంతో కూడిన పీరియడ్స్ లీవ్ పాలసీని ఆమోదించింది. . ఈ విధానం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలోని మహిళా ఉద్యోగులకు వర్తిస్తుందని రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు తెలిపింది. మహిళల  శ్రేయస్సును మెరుగుపరచడమే లక్ష్యంగా  ఈ నిర్ణయం  తీసుకున్నట్టు వెల్లడించింది. ఈ విషయాన్ని  సీఎం సిద్ధరామయ్య ఎక్స్ వేదికగా వెల్లడించారు.  ఈ నిర్ణయం మహిళా శ్రామికులకు పెద్ద ఉపశమనంగా మారుతుందని రాష్ట్ర న్యాయ మంత్రి హెచ్‌.కె. పాటిల్‌ తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ఈ విధానం విజయవంతంగా అమలవుతున్న నేపథ్యంలో, తమ రాష్ట్రం కూడా దానిని స్వీకరించాలని నిర్ణయించుకున్నామని ఆయన కేబినెట్‌ సమావేశం అనంతరం వెల్లడించారు. ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అధికారిక రంగంలో అమలు సులభమైనా, అనధికారిక రంగంలో ఇది ఒక సవాలుగా నిలుస్తుందని, అయినప్పటికీ ఇది మహిళల ఆరోగ్య సాధికారతకు బలమైన పునాది వేస్తుందని మహిళా హక్కుల కార్యకర్త బృందా అడిగే అభిప్రాయపడ్డారు. మహిళల అసలైన ఆరోగ్య అవసరాలను గుర్తించి ప్రభుత్వం తీసుకున్న ఈ అడుగు ప్రశంసనీయమని ఆమె అన్నారు.  

టీచర్ కు ప్రేమ వల.. రూ. 2.3 కోట్ల టోకరా

ప్రేమ పేరుతో  అమాయక మహిళలు ఎలా మోసపోతారనడానికి తార్కానంగా నిలుస్తుందీ సంఘటన. మంచి మాటలు, సానుభూతి వ్యాఖ్యలకు మోసపోయి కొత్తవారిని గుడ్డిగా నమ్మకూడదనడానికి నిదర్శనంగా నిలుస్తుందీ ఉదంతం.  ఆన్‌లైన్ పరిచయాల్లో వ్యక్తిగత వివరాలను పంచుకునే సమయంలో జాగ్రత్త వహించాలని విషయాన్ని తెలియజేస్తుందీ ఘటన.. ఇంతకీ విషయమేంటంటే.. ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాల నుండి మనం తీసుకోవలసిన పాఠం ఏంటంటే, నమ్మకంతోపాటు జాగ్రత్త కూడా అవసరం. ఇలాంటి సంఘటనలకు గురి కాకుండా, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి.ఒంటరి తనం భరించలేక తోడు కావాలని ఆశపడటమే ఆ టీచర్ చేసిన పాపం. లేటు వయసులో తోడు కోసం ఆరాటపడిన ఆ టీచరమ్మ మాట్రిమోనియల్ సైట్ లో తన వివరాలు నమోదు చేశారు. ఆమో వయస్సు 59 ఏళ్లు. భర్త మరణంతో ఒంటరిగా జీవించడం కష్టంగా ఉండటంతో ఆమె మాట్రిమోనియల్ సైట్ ను ఆశ్రయించారు. ఆ సైట్ లో ఆమె వివరాలు చూసిన అహాన్ కుమార్ అనే వ్యక్తి తాను అట్లాంటాలో ఇంజినీర్ గా పని చేస్తున్నానంటూ పరిచయం చేసుకున్నాడు. తన ఐడీ కార్డు కూడా చూపి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమలోకి దింపాడు.  అప్పటి నుంచి అంటే 2020 నుంచి 2024 వరకూ నాలుగేళ్ల పాటు వివిధ కారణాలు చెప్పి ఆ టీచరమ్మ నుంచి సొమ్ములు దండుకున్నాడు. నాలుగేళ్లలో ఆ టీచర్ నుంచి దాదాపు 2.3 కోట్లు రాబట్టిన అహాన్ కుమార్ ఆ తరువాత మొహం చాటేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆ టీచర్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.