తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. తిరుమలేశుని దర్శనానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు పోటెత్తుతుంటారు. సోమవారం  (అక్టోబర్ 13) తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 29 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలకు పైగా పడుతోంది. ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనానికి 4 గంటలకు పైగా సమయం పడుతోంది. కాగా ఆదివారం  (అక్టోబర్ 12) శ్రీవారిని మొత్తం 84,424 మంది దర్శించుకున్నారు. వారిలో 27,872 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 06  లక్షల రూపాయలు వచ్చింది. 

పెట్టుబడుల రాకతో ఏపీ ఆదాయానికి బూస్ట్

ప్రపంచ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గమ్యస్థానంగా మారిందా అంటే.. పరిశీలకుల నుంచి ఔనన్న సమాధానమే వస్తున్నది. అలాగే పరిశ్రమలు, పెట్టుబడులూ ఒకే చోట కేంద్రీకృతం కాకుండా.. రాష్ట్రం నలుమూలలా విస్తరించేలా తెలుగుదేశం కూటమి సర్కార్ ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నది. ఆ కారణంగానే చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకూ ఒకదాని వెంట ఒకటి అన్నట్లుగా భారీ ప్రాజెక్టులు వస్తున్నాయి. డేటా సెంటర్లు, ఐటీ కంపెనీలు, ఎలక్ట్రానికి పరిశ్రమలు.. ఇలా ఒకటనేమిటి.. పలు పరిశ్రమలు ఏపీలో అడుగుపెడుతున్నాయి పెట్టుబడులు, పరిశ్రమల రాకవల్ల రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అందులో సందేహం లేదు. కానీ ఆ ప్రయోజనం అంతటితో ఆగదు.. పెట్టుబడుల రాకవల్ల రాష్ట్ర ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది. పెరుగుతోంది.  ఈ పెట్టుబడుల్లో 30శాతం పన్నుల రూపంలో రాష్ట్ర ఆదాయానికి జమ అవుతుంది.రాష్ట్రంలో వివిధ సంస్థలు ఇప్పుడు కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి. దాని వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. విశాఖలో గూగుల్ డేటాసెంటర్ రాకతో ఏపీకి దాదాపుగా పదివేల కోట్ల ఆదాయం వస్తుంది.  అలాగే ఇతర పరిశ్రమల రాకవల్ల కూడా. అందుకోసమే.. రాష్ట్రంలోకి పెట్టుబడులతో వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు. ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు.. అన్ని రాష్ట్రాలూ కూడా తమ తమరాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టి, పరిశ్రమలు స్థాపించడానికి వచ్చే వారికి ప్రోత్సహకాలు ఇస్తాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే చేస్తున్నది. అయితే రాష్ట్రంలో పెట్టుబడులకే పారిశ్రమిక వేత్తలు ఆసక్తి చూపడానికి కారణమేంటంటే.. ఇక్కడ ప్రభుత్వాధినేతగా ఉన్న చంద్రబాబుపై విశ్వసనీయత, పారిశ్రామిక అబివృద్ధికి దోహదపడటంలో ఆయనకు ఉన్న విశ్వసనీయత కారణంగా చెప్పవచ్చు.  ఇక పరిశ్రమలు గ్రౌండ్ అయిన తరువాత రాష్ట్ర ప్రభుత్వానికి నిరంతరంగా ఆదాయం వస్తూనే ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే.. హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చిన తరువాత.. మొత్తం తెలంగాణకు ప్రధాన ఆదాయ వనరు ఆ నగరమే కావడమే. ఇక అనంతపురంలో కియా పరిశ్రమ వల్ల ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం, నిరంతరాయంగా వస్తున్నది. ప్రభుత్వం ఇచ్చిన రాయతీల కంటే ఎన్నో రెట్లు అధికంగా ఆ ఆదాయం ఉంటుంది.  తమ ఉత్తత్తులపై పన్నులు, ఇతర పన్నులు అన్నీ రాష్ట్ర ఆదాయాన్ని పెంచేవే.  అందుకే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన ట్రాక్ రికార్డ్, గుడ్ విల్ కారణంగా పెట్టుబడిదారులు ఏపీవైపు చూస్తున్నారు. 

ఈ నెల 25న మలయప్ప స్వామి దర్శనం

  తిరుమలలో అక్టోబర్ 25వ తేదీన‌ నాగుల చవితి ప‌ర్వ‌దినం సందర్భంగా పెద్దశేష వాహనంపై రాత్రి 7 నుండి 9 గంటలవరకు శ్రీ మలయప్పస్వామివారు ఉభ‌య‌ దేవేరుల‌తో క‌లిసి దర్శనమివ్వనున్నారు. సర్పరాజైన ఆదిశేషువు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా స్వామివారికి విశేష సేవలందించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి సహస్రనామాలతో శేషసాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయం అంటూ నిత్య పూజలు అందుకుంటున్నారు. అటు రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరామునిగా స్వామివారికి అత్యంత సన్నిహితునిగా వ్యవహరించే ఆదిశేషువు శ్రీ వైకుంఠంలోని నిత్యసూరులలో ఆద్యుడు. ఈ విధంగా స్వామివారు, దాసభక్తికి మారురూపంగా నిలిచే తన ప్రియ భక్తుడైన శ్రీ ఆదిశేషుడిపై ఉభయదేవేరులతో కూడి తిరువీధులలో విహరిస్తూ భక్తులకు అభయమివ్వడమే కాకుండా శరణాగతి ప్రపత్తిని కూడా సాక్షాత్కరింపచేస్తాడు.అందుకే బ్రహ్మోత్సవ వాహన సేవలలో కూడా తొలి ప్రాధాన్యత ఆదిశేషునికే ఆ భగవంతుడు ప్రసాదించాడు.  

బీసీ రిజర్వేషన్ల బంద్ వాయిదా

  తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల బంద్ అక్టోబర్‌ 18కి వాయిదా పడింది. రిజర్వేషన్ల కోసం ఇవాళ పలు బీసీ సంఘాలు ఒక్కటై బీసీ జేఎసీగా ఏర్పాడ్డాయి. ఛైర్మన్‌గా ఆర్ కృష్ణయ్య, వైస్ ఛైర్మన్‌గా వీజీఆర్‌ నారగొని,వర్కింగ్ ఛైర్మన్‌గా జాజుల శ్రీనివాస్ గౌడ్, కో చైర్మన్‌గా దాసు సురేష్ , రాజారామ్ యాదవ్‌లు ఎన్నికయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు తీర్పుతో బీసీ సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. వాస్తవానికి అక్టోబర్‌ 14న బీసీ సంఘాలు బంద్‌ చేపట్టాల్సి ఉంది.  అయితే ఈ క్రమంలో బీసీ సంఘాలు ఆదివారం (అక్టోబర్‌ 12) సమావేశమయ్యాయి. ఈ భేటీలో బంద్‌ను తాత్కాలికంగా వాయిదా వేశాయి. ఈ నెల 18న చేపట్టాలని నిర్ణయించాయి.    

కులం ఆధారంగా సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్నారు : మంత్రి వివేక్‌

  మంత్రి వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కష్టపడి పనిచేస్తున్నా నాపై కుట్రలు చేస్తునారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ మాలల ఐక్య సదస్సలో మంత్రి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను రెచ్చగొట్టి తనపై విమర్శలు చేయించారన్నారు. నేను మాల జాతికి చెందిన వాడిని అని అడ్లూరి లక్ష్మణ్ నన్ను విమర్శిస్తున్నాడు.  జూబ్లీ హిల్స్ ఇంచార్జ్ గా కాంగ్రెస్  పార్టీ గెలిస్తే నాకు మంచిపేరు వస్తుందని విమర్శలు చేసున్నారని ఆయన అన్నారు.లక్ష్మణ్ నా పై ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావడంలేదు. లక్ష్మణ్ వచ్చినపుడు నేను వెళ్ళిపోతున్నాను అనటం అబద్ధమని పేర్కొన్నారు. నాకు మంత్రి పదవి పై మోజు లేదని వివేక్ అన్నారు. లక్ష్మణ్ ను రాజకీయంగా ప్రోత్సహించింది వెంకటస్వామి అని మర్చిపోతున్నాడని వాపోయారు.   కాకా వెంకటస్వామి జయంతి కార్యక్రమం కార్డులో అడ్లూరి లక్ష్మణ్ పేరు లేదని విమర్శిస్తున్నాడు.. మంత్రి శ్రీధర్ బాబు తండ్రి శ్రీపాదరావు జయంతి కార్యక్రమం కార్డులో కూడా ఎవరి పేరు వేయలేదుగా మంత్రి శ్రీధర్ బాబును ఎందుకు విమర్శించడం లేదు.. నన్నే ఎందుకు విమర్శిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. నన్ను వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజును టార్గెట్ చేసి కొంతమంది సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారు.  మా ఇమేజ్, పేరును డ్యామేజ్ చేయడానికి ప్రయత్నించినా మేము ఎక్కడా వెనక్కి తగ్గలేదని ఆయన అన్నారు.  

అర్థరాత్రి అమ్మాయి ఎలా బయటికి వచ్చింది : సీఎం మమతా

  పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హాస్టళ్లలో ఉండే అమ్మయిలు రాత్రి వేళల్లో బయటకు వెళ్లకపోవడం మంచిదని ఆమె సూచించారు. మెడికల్ స్టూడెంట్ గ్యాంగ్‌రేప్‌పై ఘటనపై మమతా బెనర్జీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. హాస్టల్ నుంచి అర్థరాత్రి 12 :30 గంటలకు అమ్మాయి ఎలా బయటికి వచ్చిందని ప్రశ్నించారు. రాత్రిపూట బయటకు రానివ్వకూడదని అన్నారు.  అమ్మాయిలు తమను తాము రక్షించుకోవాలని చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మణిపుర్, బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశాలో ఇలాంటివి జరిగాయి. అక్కడి ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలు తీసుకోవాలి అని మమతా అన్నారు. ఒడిశాకు చెందిన యువతి పశ్చిమ బెంగాల్‌లో అత్యాచారానికి గురైంది. జలేశ్వర్‌కు చెందిన ఆమె దుర్గాపూర్‌లోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. శుక్రవారం రాత్రి భోజనం కోసం స్నేహితుడితో కలిసి కాలేజీ క్యాంపస్ బయటకు వెళ్లిన విద్యార్థినిని కొందరు యువకులు వెంబడించారు. బైక్‌లపై వచ్చిన వారు అసభ్యంగా ప్రవర్తించి, ఆమె స్నేహితుడిని బెదిరించి పంపించివేశారు. అనంతరం విద్యార్థినిని సమీపంలోని అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి మొబైల్‌ ఫోన్‌ను కూడా దొంగిలించారు. తరువాత స్నేహితుడు మరికొందరిని తీసుకెళ్లి అక్కడికి చేరుకోగా, విద్యార్థిని తీవ్ర గాయాలతో కిందపడి ఉండటాన్ని గమనించి ఆసుపత్రికి తరలించారు. కాలేజీ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఈ ఘటనలో షేక్ రియాజుద్దీన్‌, అపు బౌరి‌, ఫిర్దోస్ షేక్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. జాతీయ మహిళా కమిషన్‌ కూడా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐదు రోజుల్లోగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్‌ సమర్పించాలని పశ్చిమ బెంగాల్ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. బాధిత విద్యార్థినికి అన్ని విధాల సహాయం అందిస్తామని కాలేజీ యాజమాన్యం ప్రకటించింది.

రూ.78 కోట్ల విలువ చేసే గంజాయి పట్టివేత

  స్మగ్లర్లు కొత్త కొత్త వ్యూహాలతో డ్రగ్స్ ని రవాణా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ వారి ఎత్తులను అధికారులు చిత్తు చిత్తు చేసి... జైలుకు పంపుతున్నారు. ముంబై అంతర్జాతీయ విమానాశ్ర యంలో కస్టమ్స్ అధికారులు కొన్ని కోట్ల విలువ చేసే విదేశీ గంజాయిని పట్టుకుని... స్మగ్లర్ల ను కటకటాల వెనక్కి పంపిం చారు.. విదేశీ గంజా యిని అక్రమంగా తరలిస్తున్నట్లుగా కస్టమ్స్ అధికారు లకు విశ్వసనీయ మైన సమాచారం రావడంతో వెంటనే వారు ముంబై ఎయిర్ పోర్ట్ లో మాటు వేశారు.  ఓ పదిమంది స్మగ్లర్లు బ్యాంకాక్ నుండి ముంబై అంతర్జా తీయ విమానాశ్ర యంలో దిగారు. వారి నడవడికపై అనుమానం కలిగిన కస్టమ్స్ అధికారులు వెంటనే వారందరినీ అడ్డుకున్నారు. అనంతరం కస్టమ్స్ అధికారులు స్మగ్లర్ల కు సంబంధించిన ట్రాలీ బ్యాగ్ స్క్రీనింగ్ చేయగా విదేశీ గంజాయి వ్యవహారం కాస్త బట్టబయలు అయింది. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అను మానం కలగకుండా గంజాయిని చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్లలో ప్యాకింగ్ చేసి... ట్రాలీ బ్యాగ్ అడుగు భాగంలో దాచిపెట్టి పైన వస్తువులు పెట్టు కుని... దర్జాగా ఎయిర్ పోర్ట్ లో దిగి బయటికి వెళ్లేం దుకు ప్రయత్నిం చారు.  ఈ కేటు గాళ్లు..... కానీ కస్టమ్స్ అధికారుల స్క్రీనింగ్ లో విదేశీ గంజాయి వ్యవ హారం కాస్త గుట్టు రట్టు అయింది. దీంతో కస్టమ్స్ అధికారులు వెంటనే అప్రమత్తమై 10 మంది స్మగ్లర్లను అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ.78 కోట్ల విలువచేసి 78 కేజీల విదేశీ గంజాయిని స్వాధీనం చేసుకు న్నారు. అనంతరం ఎన్డిపిఎస్ ఆక్ట్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంబించారు.

పెళ్లైన 13 రోజులకే యువతి ప్రెగ్నెన్సీ... యువకుడు షాక్

  వివాహం జరిగిన 13 రోజులకే  ఒక నవవధువుకి విపరీ తమైన కడుపు నొప్పి వచ్చింది. దీంతో నవ వరుడు వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళ్లాడు. అక్కడ వైద్యులు చెప్పిన మాటలు విన్న నవ వరుడికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది... అనంతరం నవ వరుడు తన భార్య వద్దకు వెళ్లి అసలు నిజం చెప్పమని వేడుకున్నాడు. భార్య చెప్పిన షాకింగ్ న్యూస్ విని తనను మోసం చేశారంటూనవ వరుడు పోలీసు లకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.  సిద్దిపేట జిల్లాలోని ములుగు లో నివాసముంటు న్న ఓ యువకుడు అంగరంగ వైభవం గా వివాహం చేసుకున్నాడు. తన జీవితంలోకి అడు గుపెట్టిన యువతిని సంతోషంగా చూసు కోవాలని అనుకు న్నాడు. అలా నవ వరుడు 12 రోజులు ఆనంద డోలికల్లో విహరించాడు... 13వ రోజు అనగా ఈనెల 8వ తేదీన నవవధువు తీవ్ర మైన కడుపు నొప్పితో బాధప డుతూ ఉండడం గమనించిన నవ వరుడు వెంటనే ఆమెను హాస్పిటల్కి తీసుకు వెళ్ళాడు. ఆమెను పరీక్ష చేసిన వైద్యులు బయటికి వచ్చి అసలు విషయం నవవరుడికి చెప్పారు. వైద్యులు చెప్పిన మాటలు విన్న ఆ యువకు డికి నోట మాట రాలేదు. ఇదెలా సాధ్యం మాకు వివాహమై కేవలం 13 రోజులే అవు తుందని వైద్యులతో చెప్పాడు... అనంతరం యువకుడు నేరుగా వెళ్లి నవ వధువును నిలదీసి అడిగాడు. దీంతో నవవధువు అసలు విషయం చెప్పింది... ఉదయ్ కిరణ్ అనే యువ కుడు ప్రేమ పేరుతో తనను శారీరకంగా లొంగ దీసుకున్నాడు.ఈ విషయం తెలు సుకున్న పవన్ కళ్యాణ్ అనే మరో యువకుడు నన్ను బెదిరింపులకు గురిచేసి నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు.  ఈ విషయం నా తల్లి దండ్రులకు కూడా తెలుసు.... అయినా కూడా నా తల్లిదం డ్రులు ఈ విషయం దాచిపెట్టి మీకు ఇచ్చి వివాహం చేశారని నవవ ధువు అసలు విషయం చెప్పింది. తనను మోసం చేసి పెళ్లి చేశారని నవ వరుడు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు.

జూబ్లీహిల్స్‌లో ఓటుకు రూ.10 వేలు : కేటీఆర్‌

  జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ప్రజలు కారు కావాలా.. బుల్డోజర్ కావాలా నిర్ణయించుకోవాలని ఆయన సుచించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికతో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. హైదరాబాద్‌ షేక్‌పేట డివిజన్‌కు చెందిన సీనియర్‌ నాయకుడు చెర్క మహేశ్‌.. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. . కాంగ్రెస్‌ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారని.. రాష్ట్రంలో రెండేళ్లుగా అధికారంలో ఉన్నది ఎవరని ఆయన ప్రశ్నించారు.  ఈ ఎన్నికల్లో బుద్ధి చెబితేనే కాంగ్రెస్‌ పార్టీకి సోయి వస్తదని అన్నారు. రెండేళ్లలో సంపాదించిన మొత్తం అవినీతి సొమ్మును జూబ్లీ ఎన్నికల్లో ఖర్చు పెడతారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేస్తే ఓటుకు రూ.10 వేలు కూడా ఇస్తామంటారని తెలిపారు. బీజేపీ తెలంగాణకు పనికిరాని పార్టీ అని కేటీఆర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌, బీజేపీకి ఓటు వేస్తే మోరీలో వేసినట్లే అని అన్నారు.  హైదరాబాద్‌లో అభివృద్ధి తిరిగి గాడిన పడాలంటే మళ్లీ మాజీ సీఎం కేసీఆర్‌ మళ్లీ రావాల్సిందే అని మాజీ మంత్రి అన్నారు. అది జూబ్లీహిల్స్‌ నుంచి మొదలు కావాల్సిందే అన్నారు. అప్పుడే ఎన్నికల హామీల అమలులో చేసిన మోసంతో ప్రజలు కోపంగా ఉన్నారని కాంగ్రెస్‌ పార్టీ అర్థం చేసుకుంటుందన్నారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ఓడిపోతేనే నెలకు రూ.4వేల పెన్షన్‌ వస్తుందని.. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలన్నీ అమలవుతాయని స్పష్టం చేశారు. అదే కాంగ్రెస్‌ పార్టీకి ఓటేస్తే.. ప్రజలను.. ఎంత మోసం చేసినా ప్రజలు ఏమీ అనరనే ధీమాలోకి వెళ్లిపోతారని కేటీఆర్ తెలిపారు.

హైదరాబాద్‌లో లారీ ఢీకొని ఇద్దరు మృతి

  పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు  వ్యక్తులు మృతి చెందారు... నగరంలో ఈరోజు తెల్లవారుజామున సుమారు 5:30 గంటల ప్రాంతంలో గ్రీన్ ల్యాండ్ నుండి బేగంపేట వైపు వెళ్తున్న ఇసుక లారీ వెనక నుండి ముందు వస్తున్న ఒక హోండా యాక్టి వా ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉండ డంతో వెంటనే అతన్ని సోమాజి గూడ లో ఉన్న యశోద హాస్పిటల్ కి తరలించారు అక్కడ అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతులు నవీన్, జగదీష్ చంద్రగా పోలీసులు గుర్తించారు.  ఖమ్మం జిల్లా హవేలీ రూరల్ కు చెందిన ముద్దంగల్ నవీన్ (30) హైదరాబాద్ నగరానికి వచ్చి జేఎన్టీయూ పరిధిలో నివాసం ఉంటే రాపిడో డ్రైవర్గా పనిచేస్తు న్నాడు. అలాగే కరీంనగర్ జిల్లా ధర్మపురి కి చెందిన డాక్టర్ కస్తూరి జగదీష్ చంద్ర (35) హైదరాబాదులోని బేగంపేట్ కుండన్ బాగ్ లో నివాసం ఉంటూ కిమ్స్_సన్ షైన్ హాస్పిటల్ లో జనరల్ ఫిజీషియన్ గా పనిచేస్తున్నాడు.  ఈ ఇద్దరు కలిసి ద్విచక్ర వాహనం పైన వెళ్తున్న సమ యంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రీన్ ల్యాండ్స్ వద్ద వైట్ హౌస్ ఎదురుగా రోడ్డు ప్రమాదం జరిగి మృత్యువాత పడ్డారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు పరిణ స్థలానికి చేరుకుని నాగూర్ కర్నూల్ జిల్లాకి చెందిన లారీ డ్రైవర్ శంకర(38) ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు.

ఎస్సారెస్పీకి దామోదర్‌ రెడ్డి పేరు : సీఎం రేవంత్‌రెడ్డి

  సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి సంస్మరణ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతు నల్గొండలో గోదావరి నీళ్లు ప్రవహిస్తున్నాయంటే దామన్న వల్లే అని సీఎం అన్నారు.  సూర్యాపేటలో ఎమ్మెల్యేగా గెలవకపోయిన ప్రజల కోసం ఆయన పనిచేశారని రేవంత్‌ తెలిపారు. ఎస్సారెస్పీ-2కి ఆర్‌డీఆర్‌  దామోదర్‌ రెడ్డి అని నామకరణం చేస్తామని దీనిపై 24 గంటల్లో జీవో తెస్తామని సీఎం అన్నారు.  ఆయన కుటుంబానికి కాంగ్రెస్‌ అధిష్ఠానం అండగా ఉంటుందని సోనియా గాంధీ చెప్పారు. ఆయన కుటుంబానికి రాజకీయంగా అవకాశం ఇస్తాం. దామన్న మృతి పట్ల కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ సంతాపం తెలిపారు’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా ఉన్నా దామోదర్ రెడ్డి.. తన ఆస్తులు నల్గొండ, ఖమ్మం జిల్లా ప్రజలకే అంకితం చేశారని కొనియాడారు.  భవిష్యత్తులో ఏ అవకాశం వచ్చినా దామోదర్ రెడ్డి కుటుంబానికి గాంధీ కుటుంబం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ముఖ్యంగా రిజర్వేషన్ల పరంగా తుంగతుర్తి నియోజకవర్గం వదిలి సూర్యాపేటకు వెళ్లినప్పటికీ కూడా దామోదర్ రెడ్డి సొంత ప్రాంతాన్ని ఏనాడు మర్చిపోలేదని అన్నారు. ఖమ్మం జిల్లాలోని ఒకప్పటి సుజాతనగర్, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గం నుండి ప్రాతినిధ్య వహించిన రాంరెడ్డి సోదరులు ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి జోడిద్దుల్లాగా జెండాను మోసారని గుర్తు చేశారు

నటుడు అయ్యంగార్‌పై "మా" విష్ణుకు ఫిర్యాదు

  మహాత్మా గాంధీ పై సోషల్ మీడియాలో అనుచిత, అసభ్య కర వ్యాఖ్యలు చేసిన నటుడు శ్రీకాంత్ అయ్యం గార్  పై  చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్...మా అసోషియేషన్ అధ్య క్షులు మంచు విష్ణుకు ఫిర్యాదు చేశారు.... అక్టోబర్ రెండో తేదీన జాతిపిత మహాత్మాగాంధీ జయంతి రోజు సినీ నటుడు శ్రీకాంత్ భరత్ అయ్యాంగర్ ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టారు.  అది చూసినట్టు డిజైన్లు విమర్శల వర్షం కురిపించారు. దీంతో సినీ నటుడు శ్రీకాంత్ భరత్ అయ్యాంగర్ ఓ వీడియో విడుదల చేశారు. మహాత్మా గాంధీ గురించి ఓ పోస్టు పెడితే చాలా మంది విమర్శలు చేశారని వాటి గురించి నేను అంతగా పట్టించుకోనని... అయినా మహాత్మాగాంధీ గురించి మీకేం తెలుసురా... అంటూ మహాత్మా గాంధీ గురించి అనుచిత అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ వీడియో చేశాడు. అయితే ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో... నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇటువంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశారు.  ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా ఈరోజు ఉదయం మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు మనోజ్ ని కలిశారు. మహాత్మా గాంధీ పై సోషల్ మీడియాలో అనుచిత అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు శ్రీకాంత్ అయ్యాంగార్ పై తక్షణమే చర్యలు తీసు కోవాలి.. అంతేకాకుండా అతడి మా సభ్యత్వం రద్దు చేయాలని కోరుతూ మంచు మనోజ్ కి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై మా  అసోసియేషన్ విచారణ చేసి నిర్ణయం తీసుకుంటామని మంచు మనోజ్ తెలిపారు

భారతీ సిమెంట్‌కు షాక్

  ఏపీ రాజకీయాలలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ సీఎం జగన్ కుటుంబానికి చెందిన భారతి సిమెంట్ కార్పొరేషన్ కు ఇచ్చిన రెండు సున్నపు గని లీజులను రద్దు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్దం అవుతోంది.కేంద్ర గనుల నిబంధనలను ఉల్లంఘించిన నేపథ్యంలో భారతి సిమెంట్స్‌కు మంజూరైన రెండు సున్నపురాయి లీజులను రద్దు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.  కేంద్ర గనులశాఖ అభ్యంతరాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టి, అడ్వకేట్ జనరల్ నివేదిక ఆధారంగా ఈ లీజులు చట్టవిరుద్ధంగా మంజూరైనట్టు గుర్తించింది. రాష్ట్ర గనులశాఖ తుది నివేదిక సమర్పించిన వెంటనే, భారతి సిమెంట్స్‌కు ఇచ్చిన రెండు లీజుల రద్దు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2015లో కేంద్రం సవరించిన గనుల చట్టం ప్రకారం, సున్నపురాయి వంటి ప్రధాన ఖనిజాల లీజులు వేలం ద్వారా మాత్రమే ఇవ్వాలి. అలాగే, 2015 జనవరి 12కు ముందు లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ అయినా, 2017 జనవరి 11లోపు అన్ని అనుమతులు పొందకపోతే ఆ లెటర్ స్వయంగా రద్దు అవుతుందని నిబంధనల్లో స్పష్టం చేశారు. కానీ, ఈ నిబంధనలను పక్కనబెట్టి 2024 ఎన్నికలకు కొద్దిరోజుల ముందు నాటి సీఎం వైయస్ జగన్‌మోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ (తన సతీమణి భారతి డైరెక్టర్‌గా ఉన్న సంస్థ)కు రెండు లీజులను మంజూరు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ లీజులు కడప జిల్లా కమలాపురం, ఎర్రగుంట్ల మండలాల్లోని 509.18 ఎకరాలు మరియు 235.56 ఎకరాల భూములపై ఇవ్వబడ్డాయి. వాస్తవానికి ఈ భూములు రఘురాం సిమెంట్స్‌కు చెందినవిగా ఉండగా, 2009లో భారతి సిమెంట్స్ వాటిని కొనుగోలు చేసినట్లు సమాచారం.  

విజయవాడ దుర్గగుడి పాలక మండలి ప్రమాణ స్వీకారం

  విజయవాడ ఇంద్రకీలాద్రి  కనకదుర్గ ఆలయం దేవస్థానంలో నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం రాజగోపురం ప్రాంగణంలో ఘనంగా జరిగింది. ఉదయం 9 గంటలనుండి కార్యక్రమం ప్రారంభం అయింది. ఆలయ కార్యనిర్వహణాధికారి వి. కె. శీనా నాయక్ 16 మంది ధర్మకర్తల మండలి సభ్యులు, 1 ఎక్స్ అఫీషియో మెంబెర్, 2 ప్రత్యేక ఆహ్వానితులతో ప్రమాణం చేయించారు. అనంతరం చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. ఇద్దరు సభ్యులు చైర్మన్ గా  బొర్రా రాధాకృష్ణ గాంధీ ని చైర్మన్ గా ప్రతిపాదించగా,మిగతా సభ్యులు ఏకగ్రీవంగా బలపరిచారు. దాంతో  బొర్రా రాధాకృష్ణ  చైర్మన్ గా ఎన్నికయినట్లు దేవస్థానం అధికారులు ప్రకటించారు. అనంతరం ధర్మకర్తల మండలి ప్రత్యేక సమావేశం జరిగింది. చైర్మన్,సభ్యులు  దుర్గా మల్లేశ్వరులకు, ప్రభుత్వమునకు ధన్యవాదములు తెలియజేసారు. అనంతరం ఈవో శీనా నాయక్ ఆలయ మర్యాదలతో నూతన చైర్మన్, సభ్యులను ఆలయంలోనికి తోడ్కోని వెళ్లి అమ్మవారి దర్శనం, ఆశీర్వచనం అందించారు.అనంతరం మహా మంటపం 6వ అంతస్తులో  ధర్మకర్తల మండలి చైర్మన్  బొర్రా రాధాకృష్ణ గాంధీ, ఈవో వీకే. శీనా నాయక్ వార్లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. రాజధానిలో ఉన్న ప్రాముఖ్య ఆలయమైన  కనకదుర్గ అమ్మవారి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని, మాస్టర్ ప్లాన్ అమలుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని, దసరా లో ఈవో  సారద్యం లో పని చేసి ఉత్సవాలు విజయవంతం చేసిన రీతిలో సిబ్బంది అంతా అదే స్ఫూర్తి కొనసాగించాలని, ధర్మకర్తల మండలి మొత్తం సిబ్బంది, ఈవో గారితో కలసి మెలసి ఒకే కుటుంబంగా ముందుకు సాగుతామని  బొర్రా రాధాకృష్ణ గాంధీ పేర్కొన్నారు. దేవస్థానం ఈవో శీనా నాయక్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ధర్మ కర్తల మండలి సహకారంతో ముందుకు సాగుతామని,భక్తులకు సరైన సౌకర్యాల కల్పన కు కృషి చేస్తామని పేర్కొన్నారు. కొండ దిగువున నూతనంగా సమాచారకేంద్రాల ఏర్పాటు, భక్తుల కోసం కొత్త బ్యాటరీ వాహనాల ఏర్పాటు చేస్తున్నామని ఈవో వివరించారు. భక్తి, ఆధ్యాత్మిక భావన ఉన్న ధర్మకర్తల మండలితో సంయుక్తంగా ముందుకు సాగుతామని తెలిపారు. నూతన ధర్మకర్తల మండలి చైర్మన్  బొర్రా గాంధీ, సభ్యులను రాష్ట్ర మంత్రివర్యులు కొలుసు పార్ధసారధి, కొల్లు రవీంద్ర, స్థానిక శాసన సభ్యులు  సుజనా చౌదరి,ప్రభుత్వ విప్  తంగిరాల సౌమ్య, స్వచ్చాంద్ర కార్పొరేషన్ చైర్మన్  పట్టాభిరామ్ తదితరులు పాల్గొని, అభినందనలు తెలియజేసారు.

ప్రధాని మోదీకి ట్రంప్ ఆహ్వానం... ఎందుకంటే?

  రేపు ఈజిప్టులో జరగనున్న గాజా శాంతి ఒప్పందానికి ప్రధాని మోదీ హాజరు కావాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆకాంక్షించారు. ఈ మేరకు మోదీకి ఆహ్వానం పంపించారు. హమాస్, ఇజ్రాయేల్ మధ్య కాల్పుల విరమణ, బందీల విడుదలపై ఈ ఒప్పందంలో చర్చించనున్నట్లు సమాచారం. మరోవైపు.. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దేల్ ఫత్తా అల్-సిసి సైతం మోదీని ఆహ్వానించినట్లు సమాచారం. చివరి నిమిషంలో ప్రధాని మోదీకి ఈ ఆహ్వానం అందినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. మోదీ హాజరుపై ప్రకటన వెలువడాల్సి ఉంది. ఆకలి చావులతో తీవ్రంగా అల్లాడిపోతున్న  గాజాలో శాంతి సాధనకు అడుగులుపడిన విషయం తెలిసిందే.  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికలోని మొదటి దశను గమనార్హంగా ఇజ్రాయెల్, హమాస్ రెండూ అంగీకరించాయి. ఈ ఒప్పందంపై ఇరుపక్షాలు త్వరలో సంతకం చేయబోతున్నట్లు తెలిసింది. మొదటి దశ ప్రకారం గాజాలో దాడులను వెంటనే నిలిపివేయాల్సి ఉందని, హమాస్ తమ ధరల్లోని ఇజ్రాయెల్‌ బందీలను త్వరగా విడుదల చేయనూ, భదులుగా ఇజ్రాయెల్ ప్రభుత్వం వాటి నిర్బంధంలో ఉన్న పాలస్తీనా ఖైదీలను వదిలివేయనుందని ప్రకటించారు. అదేవిధంగా, గాజా ప్రక్కన ఉన్న ఇజ్రాయెల్ సైన్యాన్ని వరుసగా వెనక్కి తీసుకెళ్లడం కూడా ఈ దశలో భాగమని వివరమవుతోంది.  

ఏఐ డేటా సెంటర్‌‌కు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేశ్‌

  విశాఖలో ఏఐ డేటా సెంటర్‌తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌ను మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. నాస్ డాక్లో నమోదైన ప్రముఖ డిజిటల్ ఐటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ సిఫీ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ 50 మెగావాట్ల ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్‌తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తోంది. దీనిలో వెయ్యి మందికి ఉపాధి లభించనుంది. రూ.1,500 కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో డేటా సెంటర్‌ను సిఫీ అభివృద్ధి చేయనుంది. దీనిలో వెయ్యి మందికి ఉపాధి లభించనుంది. ఈ ఏఐ ఆధారిత డేటా సెంటర్‌ ఏర్పాటుతో గ్లోబల్‌ డిజిటల్‌ గేట్‌వేగా విశాఖ మారనుంది  

గుప్తనిధుల కోసం తవ్వకాలు...వైసీపీ నేత అరెస్ట్

  చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం వీర్పల్లి కొండపై ఆదివారం అర్ధరాత్రి గుప్తనిధుల కోసం సాగిన తవ్వకాలు కలకలం రేపాయి. బంగారం కోసం తవ్వకాలు జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మెరుపుదాడి చేశారు. దాడిలో వైసీపీ కార్యదర్శి ఎర్రబెల్లి శ్రీనివాస్ సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక జేసీబీ యంత్రం, ఒక కారు, నాలుగు మోటార్‌సైకిళ్లు, పూజా సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుల్లో ముగ్గురు పుంగనూరు మండలం బంటపల్లెకు చెందినవారిగా తేలింది. ఇంకా ఇద్దరు స్వామీజీలు, మరో వ్యక్తి పరారీలో ఉన్నారు. వారికోసం పోలీసులు సమీప అటవీ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికుల సమాచారం ప్రకారం, కొండపై పాతకాలపు నిధులు ఉన్నాయన్న వదంతులు నెలలుగా ప్రచారంలో ఉన్నాయి. ఆ నమ్మకంతో ఈ గుంపు రాత్రివేళ తవ్వకాలకు చేపట్టారని పోలీసులు తెలిపారు ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గుప్తనిధుల వేటలో రాజకీయ నేతల ప్రమేయం బయటపడటం చిత్తూరు జిల్లాలో పెద్ద చర్చగా మారింది.

సీఎం చంద్రబాబును అభినందిస్తూ ప్రధాని మోదీ ఫోన్

  ప్రధాని నరేంద్ర మోదీ సీఎం చంద్రబాబుకు శనివారం ఫోన్ చేశారు. సీఎంగా 15 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. దూరదృష్టి, నిబద్ధత, విలువల వల్లే చంద్రబాబు రాజకీయ జీవితం విజయవంతమైందని మోదీ అన్నారు. ఇరువురు  సీఎంలుగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో కలిసి పని చేశామని నాటి సంగతులను మోదీ గుర్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతికి చంద్రబాబు చేస్తున్న కృషి కొనసాగాలని... ప్రజా సంక్షేమ బాటలో సీఎం చంద్రబాబు అంకితభావంతో చేస్తున్న కృషి మరింత ఫలప్రదం కావాలని ప్రధాని ఆకాంక్షించారు. దీనికి స్పందించిన సీఎం చంద్రబాబు... ప్రధాని మోదీ సహకారంతో స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాధిస్తామని చెప్పారు. ప్రధాని నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా పని చేస్తామని సీఎం చంద్రబాబు మోదీతో అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత ప్రధానిగా మోదీ 25 ఏళ్లుగా దేశానికి సేవలందిస్తున్నారని చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని ట్వీట్ చేయగా ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు.  

తిరుమలలో భక్తుల రద్దీ... దర్శనానికి 24 గంటలు

  తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి శిలాతోరణం వరుకు భక్తులు క్యూలలో వేచి ఉన్నారు. టోకెన్ల లేని వారికి  సర్వ దర్శనానికి  24 గంటల సమయం పడుతోంది. వారాంతం కావడంతో భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయి శిలాతోరణం వరకు క్యూలైన్ లో వేచి ఉన్నారు. క్యూలైన్‌లోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తున్నారు. నిన్న(శనివారం) శ్రీవారిని 84,571 మంది భక్తులు దర్శించుకున్నారు. 36,711 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.70 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.