'కిస్' ఆడియో అదిరింది
posted on Jun 24, 2013 @ 6:13PM
అడివి శేష్ హీరోగా నటించిన 'కిస్' మూవీ ఆడియో రిలీజైంది. ఈ సినిమా పాటల వేడుక హైటెక్స్ నోవాటెల్ లో ఘనంగా జరిగింది. మిస్ కెనడా ప్రియ బెనర్జీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ సాయి కిరణ్ అడివి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాటలు చాలా బాగున్నాయని, అడివి శేష్ మంచి నటుడు అవుతాడని భరద్వాజ గారు అన్నారు.
హీరో సుమంత్ మాట్లాడుతూ...అడివి శేష్ తాను మంచి ఫ్రెండ్స్ అని, తన డైరెక్షన్లో ఒక సినిమా చేద్దామని అనుకున్నాం. కాని కొన్ని కారణాల వల్ల అది కుదరలేదని, త్వరలో శేష్ డైరెక్షన్లో తప్పకుండా సినిమా చేస్తానని చెప్పారు.
అడివి సాయి కిరణ్ మాట్లాడుతూ...ఎనభై ఏళ్ళ తెలుగు సినిమాకు మా వంతు గౌరవాన్ని ప్రదర్శించాడనికి ఈ కార్యక్రమంలో కొన్ని ఆణిముత్యాలైన పాటలను వేశా౦. ఈ సినిమా పూర్తి కావడానికి రమేష్ ప్రసాద్ చాల సపోర్ట్ ఇచ్చారు. ఈ సినిమాకు అన్ని శేష్ చూసుకున్నాడు. నేను జస్ట్ సపోర్ట్ ఇచ్చానంతే.
ఈ కార్యక్రమంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, రమేష్ ప్రసాద్, ఎమ్మెస్ రాజు, తమ్మారెడ్డి భరద్వాజ, హీరో సుమంత్, నీలిమ తిరుమల శెట్టి, సిరాశ్రీ తదితరులు పాల్గొన్నారు.