బాపుగారి పుట్టినరోజు

      బొమ్మ చూడగానే.. తెలుగుతనం పరవళ్ళు తొక్కగానే..గీతలు అందాలు దిద్దుకోగానే…మాటలు బిడియం ఒలికించగానే..రాతలు వినయం తొణికించగానే..రమణ స్నేహంలో రూపం మూర్తి కట్టగానే…బుడుగు అల్లరి స్పురణకు రాగానే…రాముని దయ స్మరణకు రాగానే మన కళ్లముందు కనిపించే నిలువెత్తు తెలుగుదనం బాపు. వెండితెరకు వయ్యారాన్ని నేర్పిన బాపు పుట్టిన రోజు నేడు ఆ సందర్భంగా ఆ మహానుభావుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుందాం.   ఆయన సినిమాలు చూస్తుంటే.. వేసవికాలంలో మల్లెతోటల్లో విహరించినట్టూ..  ఆరుబైట వెన్నెల్లో చందామామను చూస్తూ  హాయిగా నిదురించినట్టూ.. మధురంగా ఉంటుంది. ఊహకు ఊపిరిపోస్తే.. దానిపేరు బాపుబొమ్మ, సౌందర్యాన్ని దృశ్యీకరిస్తే.. అది బాపు సినిమా. తెలుగు సినిమా ఇండస్ట్రీకి దొరికిన అరుదైన దర్శకుడు బాపు. ఆయన సెట్ చేసిన ఒక్కో ఫ్రేమ్.. ఒక్కో చిత్రపటమే. ఆయన గీసిన బొమ్మలేకాదు.. ఆ కెమెరా కన్నుల్లో చిక్కిన ప్రతి హీరోయిన్ ఓ బాపూబొమ్మే. అందుకే బాపు సినిమాల్లో నటించడమంటే.. వారి అందానికి దక్కిన గొప్పగౌరవంగా భావిస్తారు. బాపు ఫ్రేమ్ లో ఒక్కసారైనా కనిపించాలని పరితపిస్తారు. బాపు అసలు పేరు సత్తిరాజు లక్ష్మీనారాయణ. ఆయన 1933 సంవత్సరం డిసెంబర్‌ 15న పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురంలో తెలుగు నియోగి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. ఆంద్రపత్రికలో కార్టూనిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించిన బాపు తరువాత దర్శకుడిగా ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. రామాయణసారం లేకుండా బాపు సినిమాలే లేవు. రామాయణ, మహాభారతాల్ని ఆధునీకరించి తెరకెక్కించారు బాపు. ఆ రెండు మహాకావ్యాల్ని అణువణువునా జీర్ణించుకుని.. ప్రతి కథనీ ఆకోణంనుంచే చూశారు.. తీశారు.. బాపు.. అందుకే రామాయణంలోని ప్రతిఘట్టాన్ని సినిమాగా తెరకెక్కించిన బాపు. ఆయన తెరకెక్కించిన సాంఘిక చిత్రాల్లోనూ రామయణ సారాన్నే చూపించారు. తనని తాను రాముని బంటుగా చిత్రీకరించుకున్నారు కూడా. అది బాపు భక్తి. క్రియోటివ్ జీనియస్ బాపుని ఎన్నో అవార్డ్స్ వరించాయి. మదర్ థెరీసా చేతులమీదుగా రఘుపతి వెంకయ్య స్మారక పురస్కారాన్ని అందుకున్నారు. ఆరు నందీ అవార్డ్స్ తోపాటు, ఎన్నో గౌరవ సత్కారాల్ని పొందారు. సినిమాలోనే కాదు, భక్తిరసం తొణికిసలాడే అనేక బొమ్మలు బాపు చేతిలో ఊపిరిపోసుకున్నాయి. స్క్రిప్ట్ తోపాటే అన్ని ఫ్రేముల్నీ బొమ్మలుగా గీసుకుంటారు బాపు. అందుకే ప్రతి షాట్ సెల్యులాయిడ్ పై బొమ్మగీసినట్టు బహు ముద్దుగా ఉంటుంది. ఆణిముత్యాల్లాంటి సినిమాలను తీస్తున్న బాపుగారికి గురువంటూ ఎవరూ లేరు. స్త్రిప్ట్ బాగుంటే చాలు డైరెక్టర్ ఐపొవచ్చు అని బాపు గారిని చూసి నేర్చుకోవచ్చు. బాపు గురించి మాట్లాడుకునేట్టపుడు రమణ గురించి చెప్పకపోతే అది పూర్తవదు. వారిద్దరు ఒకే ఆత్మకు రెండు రూపాలు, ఒకే భావాన్ని పలికే రెండు పదాలు. బాపు దృష్టి అయితే రమణ దాని భావం. బాపు చిత్రం అయితే రమణ దాని పలుకు. అందుకే వీరిద్దరి వెండితెర ప్రయాణమేకాదు. జీవనం ప్రయాణం కూడా కలిసి కట్టుగానే సాగింది. కాని విధి అన్ని సార్లు అనుకూలంగా ఉండదుకదా. అందుకే వారిద్దరిని విడదీసింది. బాపు అందాల దృష్యానికి పలుకును దూరం చేసింది. రమణ తన సాహితీ సంపదను మనకు వదిలేసి బాపును ఒంటరిని చేసి వెళ్లిపోయాడు. భారతదేశం గర్వించదగ్గ దర్శకుడు బాపు. కళాత్మకత, భావుకత, స్వచ్ఛత.. వెరసి బాపు సినిమాలుగా రూపుదాల్చాయి. బాపు సినిమాలకోసం ప్రేక్షకుల ఎదురుచూపు సాగుతూనే ఉంటుంది.. కొనసాగుతూనే ఉంటుంది. బాపు గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు.

మల్లెతీగ భామ పాటలు

  "రతినిర్వేదం" వంటి చిత్రం ద్వారా తన అభిమానులకు అందచందాలతో మత్తెక్కించిన బొద్దు సుందరి శ్వేతామీనన్ అందరికి తెలిసిందే. ఈ అమ్మడు ఇటీవలే మలయాళంలో "కలిమన్ను" అనే చిత్రంలో నటించింది. జాతీయ ఉత్తమ దర్శకుడు బెస్లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇటీవలే విడుదలై సూపర్ హిట్టయింది. శ్వేతా మీనన్, బిజు మీనన్, సునీల్ శెట్టి వంటి ప్రధాన తారాగణం నటించారు.అయితే ఇపుడు ఇదే చిత్రాన్ని తెలుగులో "మల్లెతీగ" అనే పేరుతో డబ్బింగ్ చేస్తున్నారు. బొడ్డు దేవికిరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. జయచంద్రన్ సంగీతం అందించాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఆమె నాకు దూరం అవుతుంది: హృతిక్

  హృతిక్ రోషన్, అతని భార్య సుజానే విడిపోవడానికి నిర్ణయించుకున్నారు. దీనిని స్వయంగా హృతిక్ ఒక ప్రకటన ద్వారా తెలిపాడు. "సుజానే నా నుంచి విడిపోవాలని నిర్ణయించుకుంది. ఇది మా కుటుంబానికి చెందిన విషయం. నాకు కుటుంబ వ్యవస్థ పట్ల ఎంతో గౌరవం ఉంది. ఈ వార్త నా అభిమానుల్లో ఈ వ్యవస్థ పట్ల అపనమ్మకాన్ని కలిగించరాదని కోరుకుంటున్నాను. నా ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేసిన అభిమానులందరికీ కృతఙ్ఞతలు" అని అన్నారు. హృతిక్, సుజానేలకు 2000ల సంవత్సరంలో వివాహం జరిగింది. వీరిద్దరికీ ఇద్దరు కొడుకులు ఉన్నారు. కొంతకాలంగా సుజానే తన తల్లిదండ్రుల వద్దనే ఉంటున్నారు.

మధు మతిపోయేలా ఉంది

  ఇప్పటివరకు యాంకర్ గా అలరించిన హాట్ లేడి ఉదయభాను హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం "మధుమతి". ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఎలాంటి అంశాలు ఉంటాయో అని ఆశించి వెళ్ళే జనాలందరికీ కూడా ఈ సినిమా ఒక తలనొప్పిగా ఉంటుంది. సినిమా కథలో ఎలాంటి కొత్తదనం లేకపోగా, చూస్తున్నంతవరకు కూడా చిరాకు కలిగిస్తుంది. అసలు ఈ సినిమా కథ ఏమిటంటే... కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా ఉదయభానుకి హీరోతో పెళ్లి జరుగుతుంది. హీరో ఇంటికి వెళ్లిన ఈ అమ్మడు.. అక్కడ అత్తగారింటిలో అందరితో కలిసిపోతుంది. ఇంతలో అనుకోకుండా 50 లక్షల నగలతో మధుమతి జంప్ అయిపోతుంది. ఇక్కడ ఇంటర్వెల్‌. ఆ తర్వాత ఏం జరుగుతుందో అనేది మిగతా కథ. ఉదయభాను ఈ సినిమాలో అందాల విందు చేస్తాదనుకొని వెళ్తే మాత్రం వారికి ఖచ్చితంగా తీవ్ర నిరాశే తప్పదు.

రానా రుద్రమదేవి ఫస్ట్ లుక్

  అనుష్క, రానా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం "రుద్రమదేవి". ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. నవంబర్ 7న అనుష్క పుట్టినరోజు సంధర్భంగా అనుష్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ కు భారీ స్పందన వచ్చింది. అయితే రేపు (డిసెంబర్ 14) రానా పుట్టినరోజు. తన పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలో రానాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఒకరోజు ముందుగానే విడుదల చేసారు. ఈ సినిమాలో రానా నిడవర్ద్యపురం(నిడదవోలు) యువరాజు చాళుక్య వీరభద్రుడుగా కనిపించబోతున్నాడు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు గుణశేఖర్ చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ప్రేమ కిరాక్ చూపించనున్న అనిరుద్

  "పవన్ కళ్యాణ్ ప్రేమలో పడ్డాడు" వంటి షార్ట్ ఫిలిమ్స్ లో తన నటనతో అదరగొడుతున్న అనిరుద్ హీరోగా "కిరాక్" అనే చిత్రం తెరకెక్కుతుంది."లవ్ స్టొరీ" అనేది ఉపశీర్షిక. చాందిని హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం హైదరాబాద్ లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కె.అచ్చిరెడ్డి క్లాప్ కొట్టగా, ఎస్వీ కృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. హరిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి గంగపట్నం శ్రీధర్ నిర్మాత. ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ... పేరుకు తగ్గట్టే సినిమా కిరాక్ పుట్టించేలా ఉంటుంది. నేటి యువత ధోరణికి అద్దం పట్టే విధంగా ఉండే ప్రేమకథా చిత్రమిది అని అన్నారు. ఈ చిత్రానికి అజయ్ అరసాద సంగీతం అందిస్తున్నారు.

మరో ప్రేమకథలో చైతు

  నాగచైతన్య హీరోగా మరో చిత్రం ప్రారంభమయ్యింది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్. ఈ సినిమా పూజా కార్యక్రమాలు గురువారం హైదరాబాద్ లో జరిగాయి. ఈ సినిమా గురించి నాగచైతన్య మాట్లాడుతూ.. "దర్శకుడు చెప్పిన కథ కొత్తగా ఉంది. ప్రేమకథా చిత్రాల్లో ఇది ఒక కొత్తరకం. అందరిని అలరించే విధంగా ఉంటుంది" అని అన్నారు. ఈ నెల 23నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతుంది. ఏప్రిల్ వరకు షూటింగ్ పూర్తీ చేయడానికి ప్రయత్నిస్తామని చిత్ర ఎగ్జిక్యుటివ్ నిర్మాత సాయిబాబా అన్నారు. ఈ చిత్రానికి అనూప్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

ప్రియుడి పెళ్లిలో డాన్స్ చేస్తాదంట

  అప్పట్లో సల్మాన్ ఖాన్ తో బాగా క్లోజ్ గా ఉండేది కత్రినా. అయితే ఒక దశలో వీళ్ళిద్దరూ పెళ్ళిచేసుకుంటారు కావచ్చు అని అందరు అనుకునేలోపే, సల్మాన్ కు పెద్ద హ్యాండ్ ఇచ్చి అక్కడి నుండి జంప్ అయ్యింది. సల్మాన్ నుండి జంప్ అయిన తర్వాత రణబీర్ కపూర్ దగ్గరకు చేరింది. అసలే వరుస సినిమాలతో తనకంటూ ఒక క్రేజ్ ను సంపాదించుకున్న రణబీర్ ను తన అందచందాలతో పడగొట్టి మాయ చేసేసింది. ఇంతటితో ఆగకుండా వీళ్ళిద్దరూ కలిసి రహస్యంగా బయట ప్రదేశాల్లో గడిపిన సమయంలో పాపం రణబీర్ కు నిద్ర కూడా లేకుండా చేసిందట. వీళ్ళిద్దరూ అక్కడ ఎంజాయ్ చేసిన ఫోటోలు నెట్ లో వచ్చేసరికి... ఈ కత్రినాకు బాగా కోపం వచ్చి "కావాలంటే నేనే చూపిస్తాను కదా! ఎందుకు అలా దొంగతనంగా ఫోటోలు తీయడం" అంటూ గోల చేసింది.   అయితే వీళ్ళిద్దరి భాగోతం చూసినవాల్లందరూ కూడా... త్వరలోనే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు అని అనుకున్న వారందరికి కత్రినా మళ్ళీ ఓ షాక్ ఇచ్చింది. అదేంటో తెలుసా..? "రణబీర్ తనకు మంచి ఫ్రెండు మాత్రమేనని, తన పెళ్లిలో ఒక డాన్సు చేసి తనకు గిఫ్టుగా ఇస్తాను అని అంటుంది. అంతే కాకుండా మరో 20 ఏళ్ల వరకు నేను పెళ్లి చేసుకోనని" చెప్పింది ఈ అమ్మడు.   ఈ పాపను చూస్తుంటే త్వరలోనే రణబీర్ కు వేరే అమ్మాయితో పెళ్లి చేసి, తనని అన్నయ్య అని పిలిచేట్లుగా కనిపిస్తుంది. అలాగే ఈ 20ఏళ్ళల్లో ఇంకెంతమందితో రొమాన్స్ చేయనుందో చూడాలి. రణబీర్ తర్వాత ఈ అందాల భామ కళ్ళకు ఏ హీరో బుక్కవుతాడో ఏమో త్వరలోనే తెలియనున్నది.

సమంత స్థానం కొట్టేసిన త్రిష

  "ఏమాయ చేసావే" చిత్రం తమిళ వర్షన్ లో హీరోయిన్ గా త్రిష నటించింది. అక్కడ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఆ చిత్ర తెలుగు వర్షన్ లో సమంత హీరోయిన్ గా నటించింది. ఇక్కడ కూడా సూపర్ డూపర్ హిట్టయ్యింది. అయితే ఈసారి సీన్ రివర్స్ అయ్యింది. తెలుగులో మహేష్ నటించిన సూపర్ హిట్ చిత్రం "దూకుడు". ఈ సినిమాను కన్నడలో రీమేక్ చేస్తున్నారు. ఇందులో పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించబోతున్నాడు. తెలుగులో సమంత చేసిన పాత్రను, కన్నడంలో త్రిష చేయబోతుంది. ప్రస్తుతం త్రిషకు కూడా అవకాశాలు అంతంత మాత్రంగానే ఉండడం వలన ఈ కన్నడ రీమేక్ లో నటించడానికి ఒప్పుకుంది. అయితే ఈ సినిమా కోసం త్రిష కేవలం 30 లక్షలు మాత్రమే తీసుకోబోతుంది. ఎందుకంటే కన్నడ మార్కెట్ చాలా తక్కువ. మరి మొదటిసారి కన్నడలో నటించబోతున్న త్రిషకు అక్కడ ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.

ఈమె బికినీ దర్శనం ఫస్ట్ అతనికేనా...?

  "అత్తారింటికి దారేది" చిత్ర విజయం ద్వారా వెలుగులోకి వచ్చిన హీరోయిన్ ప్రణీతకు మాత్రం వరస అవకాశాలు మాత్రం రావటం లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న "రభస" చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. అదే విధంగా మంచు ఫ్యామిలీ కలిసి నటిస్తున్న "పాండవులు పాండవులు తుమ్మెదా" చిత్రంలో మనోజ్ కు జోడీగా నటిస్తుంది. అయితే ఈ రెండు చిత్రాలు తప్ప తెలుగులో ఈ అమ్మడు మరే ఇతర చిత్రంలో నటించే అవకాశం రాలేదు. అయితే ఇప్పుడిప్పుడే సినిమా ఇండస్ట్రీ గురించి తెలుసుకుంటున్న ఈ అమ్మడు.. ఈ పోటీను తట్టుకోవాలంటే తన అందాలను అస్త్రాలుగా వాడాలని నిర్ణయించుకుంది.   ప్రస్తుతం ఈ అమ్మడు నటిస్తున్న "పాండవులు పాండవులు తుమ్మెదా" చిత్రంలో బికినీ వేసుకోవడానికి సిద్ధమైంది. ఈ విధంగా చేస్తేనైన తన బికినీ అందాలకు దర్శక,నిర్మాతలు ఫ్లాట్ అయిపోయి వారి సినిమాల్లో ఛాన్సులు ఇచ్చేస్తారని ఆశగా ఎదురుచూస్తుంది. అంటే ఈ విధంగా చూస్తే... ఈ అమ్మడి బికినీ అందాలతో మొదటగా మంచు మనోజ్ మాత్రమే జతకట్టనున్నాడన్నామాట. మరి ఈ బికినీ ప్లాన్ సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

డిసెంబర్ 15న ఉయ్యాల పాటలు

  "చిన్నారి పెళ్లికూతురు" హీరోయిన్ ఆనంది అంటే తెలియనివారుండరు. ఆనంది ప్రస్తుతం హీరోయిన్ గా తెలుగు వెండితెరపై కనిపించి మరింత ఆనందాన్ని పంచడానికి "ఉయ్యాల జంపాలా" చిత్రం ద్వారా మన ముందుకు రాబోతుంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో రామ్ మోహన్ నిర్మించిన ఈ చిత్రానికి విరించి వర్మ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి నాగార్జున కొ-ప్రొడ్యుసర్ గా ఉన్నారు. ఈ చిత్ర ఆడియోను డిసెంబర్ 15న విడుదల చేయనున్నారు. సన్నీ సంగీతం అందించాడు. ఇటీవలే విడుదలైన టీజర్ కు మంచి స్పందన వస్తుంది. సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు గట్టి నమ్మకంతో ఉన్నారు.

మరో రికార్డ్ సృష్టించనున్న ఒక్కడు

  మహేష్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "1". అయితే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని విషయాలు నేరుగా అభిమానులకు తెలిపేందుకు "1 నేనొక్కడినే" పేరుతొ ఓ అప్లికేషన్ ను రూపొందించారు. ఈ ఆప్ ను డిసెంబర్ 10వ తేదిన విడుదల చేస్తున్నారు. ఈ ఆప్ ద్వారా సినిమాకు సంబంధించ అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. అదే విధంగా ఫొటోస్, వాల్ పేపర్స్ వంటివి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే విధంగా సినిమా టికెట్స్ ను కూడా బుక్ చేసుకొనే సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఈనెల 19న భారీ స్థాయిలో ఆడియో విడుదల కార్యక్రమం చేయనున్నారు. ఆడియో విడుదల తర్వాత పాటలను నేరుగా ఈ ఆప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ను ఆండ్రాయిడ్ మొబైల్స్ లో మాత్రమే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా విడుదలకు ముందే ప్రిన్స్ కొత్త పద్ధతిని ప్రవేశపెట్టడం ఇది ఒక రికార్డ్ గా చెప్పుకోవచ్చు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన కృతిసనన్ హీరోయిన్ గా నటిస్తుంది.జనవరిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 14రీల్స్ బ్యానర్లో అనిల్ సుంకర, గోపి ఆచంట, రామ్ ఆచంట కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

దట్ ఇస్ మహాలక్ష్మి వదిన అయ్యింది

  అజిత్ హీరోగా తమిళంలో "వీరం" అనే చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా మిల్క్ బ్యూటీ తమన్నా నటిస్తుంది. అయితే ఈ సినిమా గురించి తమన్నా మాట్లాడుతూ..."ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలన్నింటికీ ఇది భిన్నమైన పాత్ర. ఇందులో నేను అజిత్ భార్యగా నటిస్తున్నాను. నా పాత్ర పేరు మహాలక్ష్మి. కథ పరంగా ఈ సినిమాలో నాకు ముగ్గురు మరుదులు ఉంటారు. చెడుమార్గం పట్టిన ఆ ముగ్గురిని సన్మార్గంలోకి తీసుకొస్తా. ఇంతటి మెచ్యూర్డ్ పాత్ర చేయడం నా కెరీర్‌లో ఇదే ప్రథమం. అజిత్ సార్ పాత్ర రెబల్‌గా ఉంటుంది. ఆయనతో కలిసి పనిచేయడం ఓ గొప్ప అనుభూతి. ఈ సినిమా టైమ్‌లో ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నాను.

కొత్త సంవత్సరం హీరోయిన్ల రేట్లు

  గతకొద్దికాలంగా సినిమాల్లో అవకాశం కోసం ఎదురుచూస్తున్న నేటి యువ హీరోయిన్లకు అప్పుడప్పుడు మాత్రమే ఏవో చిన్న చిన్న పాత్రలు మాత్రమే దక్కుతున్నాయి. వీటివల్ల వీరికి ఎలాంటి లాభాలు రావడం లేదు. అయితే ప్రతి వ్యాపారికి ఎదో ఒక సీజన్ లో మాత్రమే చాలా ఎక్కువగా లాభాలు వస్తుంటాయి. కానీ సినిమా హీరోయిన్లకు ఎప్పుడు ప్రోగ్రాం ఉన్నా కూడా లాభాలే.   సినిమాల్లో అవకాశాలు రాకపోయినా కూడా ఈ స్టేజ్ షో ల వలన వీళ్ళు బాగానే సంపాదిస్తున్నారు. ఒక్కరోజుకి 5 లక్షలకు పైగా వసూళ్ళు చేస్తున్నారు. కామ్నా జెట్మలాని, పూనమ్ కౌర్, మధుశాలిని, అర్చన, సంజన, నిఖిత, పాయల్ ఘోష్, శ్వేతాబసు ప్రసాద్ వంటి హీరోయిన్లు 5 లక్షల వరకు వసూళ్ళు చేస్తున్నారు. ఛార్మి, ప్రియమణి, నవనీత్ కౌర్, నిఖిషా పాటెల్, వంటి హీరోయిన్లు 10 లక్షలకు పైగా వసూళ్ళు చేస్తున్నారు. ఇక వరుస సినిమాలతో బిజీగా ఉన్న లేటెస్ట్ కుర్ర హీరోయిన్లు సైతం మరింత రేటుని పెంచి మరీ ఈ షోలను ఎంజాయ్ చేస్తున్నారు.   మరి ఈ కొత్త సంవత్సరం వేడుకలకు ఎంత మంది హీరోయిన్లు తమ డేట్స్ ను కేటాయించారో... ఎంతమంది హీరోయిన్లకు ఎన్ని లక్షల లాభాలు వస్తాయో, ఎంతమంది ఈ షో ల ద్వారా స్లిమ్ అవుతారో చూడాలి.