ప్రియుడి పెళ్లిలో డాన్స్ చేస్తాదంట
posted on Dec 12, 2013 @ 10:56AM
అప్పట్లో సల్మాన్ ఖాన్ తో బాగా క్లోజ్ గా ఉండేది కత్రినా. అయితే ఒక దశలో వీళ్ళిద్దరూ పెళ్ళిచేసుకుంటారు కావచ్చు అని అందరు అనుకునేలోపే, సల్మాన్ కు పెద్ద హ్యాండ్ ఇచ్చి అక్కడి నుండి జంప్ అయ్యింది. సల్మాన్ నుండి జంప్ అయిన తర్వాత రణబీర్ కపూర్ దగ్గరకు చేరింది. అసలే వరుస సినిమాలతో తనకంటూ ఒక క్రేజ్ ను సంపాదించుకున్న రణబీర్ ను తన అందచందాలతో పడగొట్టి మాయ చేసేసింది. ఇంతటితో ఆగకుండా వీళ్ళిద్దరూ కలిసి రహస్యంగా బయట ప్రదేశాల్లో గడిపిన సమయంలో పాపం రణబీర్ కు నిద్ర కూడా లేకుండా చేసిందట. వీళ్ళిద్దరూ అక్కడ ఎంజాయ్ చేసిన ఫోటోలు నెట్ లో వచ్చేసరికి... ఈ కత్రినాకు బాగా కోపం వచ్చి "కావాలంటే నేనే చూపిస్తాను కదా! ఎందుకు అలా దొంగతనంగా ఫోటోలు తీయడం" అంటూ గోల చేసింది.
అయితే వీళ్ళిద్దరి భాగోతం చూసినవాల్లందరూ కూడా... త్వరలోనే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు అని అనుకున్న వారందరికి కత్రినా మళ్ళీ ఓ షాక్ ఇచ్చింది. అదేంటో తెలుసా..? "రణబీర్ తనకు మంచి ఫ్రెండు మాత్రమేనని, తన పెళ్లిలో ఒక డాన్సు చేసి తనకు గిఫ్టుగా ఇస్తాను అని అంటుంది. అంతే కాకుండా మరో 20 ఏళ్ల వరకు నేను పెళ్లి చేసుకోనని" చెప్పింది ఈ అమ్మడు.
ఈ పాపను చూస్తుంటే త్వరలోనే రణబీర్ కు వేరే అమ్మాయితో పెళ్లి చేసి, తనని అన్నయ్య అని పిలిచేట్లుగా కనిపిస్తుంది. అలాగే ఈ 20ఏళ్ళల్లో ఇంకెంతమందితో రొమాన్స్ చేయనుందో చూడాలి. రణబీర్ తర్వాత ఈ అందాల భామ కళ్ళకు ఏ హీరో బుక్కవుతాడో ఏమో త్వరలోనే తెలియనున్నది.