బాహుబలిలో ప్రభాస్ కి రెండో జోడీగా తమన్నా
రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క నటిస్తున్నబాహుబలి సినిమాను ఇప్పుడప్పుడే చూసేందుకు వీలుకుదరదు గనుక, అంతవరకు ఆ సినిమా షూటింగ్ కబుర్లతోనే సరిపెట్టుకోకతప్పదు. ఇక తాజా సమాచారం ఏమిటంటే, బాహుబలిలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అందులో బాహుబలితో అనుష్క జతకట్టబోతున్నట్లు ఇదివరకే మన అందరికీ తెలుసు. ప్రభాస్ చేస్తున్న రెండో పాత్ర శివుడుతో అందాల తమన్నాజతకట్టనుంది. ఆరడుగుల ఆజానుభాహువయిన ప్రభాస్ పక్కన ఐదున్నర అడుగులపైన ఎత్తున్న అనుష్క బాగానే సరిపోతుంది. కానీ ఈ సినిమాలో పెద్ద గెడ్డం, జుట్టుతో కండలు తిరిగిన శరీరంతో ప్రభాస్ కొంచెం మొరటుగా కనిపిస్తున్నాడు. మరి అతని పక్కన మల్లెమొగ్గ వంటి తమన్నాను రాజమౌళి ఎంచుకోవడం కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ, మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ అని పేరుపొందిన మన జక్కన ఏది చేసినా చాలా ఆలోచించే చేస్తాడు గనుక, తమన్నాని ఎంచుకోవడం వెనుక బలమయిన కారణమే ఉండవచ్చు. ఈసినిమాలో అనుష్క దేవసేనగా నటిస్తుంటే, తమన్నాఅవంతిక పాత్ర పోషిస్తునట్లు సమాచారం. బాహుబలి సినిమాలో అత్యంత కీలకమయిన యుద్ద సన్నివేశాలు ఈనెల 23నుండి మార్చి5వరకు ఏకధాటిగా రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించబడతాయి.