అందరికి షాకిచ్చిన బాహుబలి
posted on Dec 20, 2013 @ 1:28PM
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం "బాహుబలి". ఈ చిత్రంలోని పాత్ర కోసం రాజమౌళి ఆజ్ఞ మేరకు ప్రభాస్ చాలా బరువు పెరిగాడు. జుట్టు కూడా బాగా పెంచేసాడు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఇటీవలే "బాహుబలి" ప్రభాస్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసాడు రాజమౌళి. ఇందులో ప్రభాస్ దేహం భారీగా కనిపించకపోయినా కూడా, జుట్టు మాత్రం చాలా పొడవుగా కనిపించింది.
అయితే ఇటీవలే నిర్మాత దిల్ రాజు కూతురు ఎంగేజ్ మెంట్ వేడుకకు ప్రభాస్ హాజరయ్యి, అక్కడి వారందరిని ఆశ్చర్యపరిచాడు. ఎందుకంటే "బాహుబలి" సినిమాలో లాగా కండలు తిరిగిన దేహంతో, పొడవైన జుట్టుతో ఉంటాడని అనుకున్న వారందరికి కూడా ప్రభాస్ షాక్ ఇచ్చాడు. ఎందుకంటే ఈ వేడుకకు ప్రభాస్ స్లిమ్ గా, స్టైలిష్ హెయిర్ స్టైల్ తో వచ్చాడు. హెయిర్ స్టైల్ "బాహుబలి" రేంజ్ లో లేకుండా కాస్త తక్కువగా, సింపుల్ గా ఉండటం, భారీ బరువుతో కాకుండా కాస్త స్లిమ్ గా కనిపించడంతో అందరి దృష్టి ప్రభాస్ పైనే పడింది.
"బాహుబలి" చిత్రం మరో రెండు సంవత్సరాల వరకు విడుదల కాదు కాబట్టి... ఈ మధ్యలోనే వేరే సినిమా చేయడానికి ప్రభాస్ సన్నాహాలు చేస్తున్నాడేమో అని టాక్ నడుస్తుంది. మరి ప్రభాస్ ఈ కొత్త లుక్ "బాహుబలి" కోసమో లేక ఇంకా కొత్త సినిమా కోసమో అనే విషయం త్వరలోనే తెలియనున్నది.