షార్ట్ - స్వీట్ రివ్యూ: ‘గోపాల గోపాల’
తారాగణం: పవన్ కళ్యాణ్, వెంకటేష్, మిథున్ చక్రవర్తి, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్, రాళ్ళపల్లి, వెన్నెల కిశోర్, పృధ్వీ, దీక్షాపంత్ తదితరులు... సాంకేతిక వర్గం: డా॥ డి. రామానాయుడు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్ ప్రై. లిమిటెడ్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్ బ్యానర్స్‌పై కిషోర్‌కుమార్ పార్ధసాని దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ సురేష్, శరత్‌మరార్ సంయుక్తంగా నిర్మించారు. కథ: భవేష్ మందాలియా, ఉమేష్ శుక్ల స్క్రీన్‌ప్లే : కిశోర్‌కుమార్ పార్థసాని భూపతిరాజా, దీపక్‌రాజ్ కెమెరా: జయనన్ విన్సెంట్ మాటలు: సాయిమాధవ్ బుర్రా, సంగీతం: అనూప్ రూబెన్స్ పాటలు:చంద్రబోస్ ఎడిటింగ్: గౌతమ్‌రాజు ఆర్ట్: బ్రహ్మ కడలి. హిందీలో ఘన విజయం సాధించిన ‘ఓ మై గాడ్’ సినిమాకు రీమేక్ ‘గోపాల గోపాల’ శనివారం నాడు విడుదలైంది. ఈ సినిమా ఒరిజినల్ కథలో పెద్దగా మార్పులేమీ చేయకపోయినా స్క్రీన్ ప్లేలో మాత్రం మన ట్రెండ్‌కి అనుగుణంగా కొన్ని మార్పులు చేశారు. వెంకటేష్ ఒక మధ్యతరగతి వ్యక్తి. ప్రకృతి వైపరీత్యం కారణంగా తనకు జరిగిన నష్టానికి భగవంతుడే కారణం కాబట్టి ఆ భగవంతుడి ప్రతినిధులమని చెప్పుకుంటున్నవారే తనకు నష్టపరిహారం చెల్లించాలంటూ కోర్టుకు ఎక్కే వ్యక్తి పాత్రను వెంకటేష్ ధరించగా, భగవత్ తత్వాన్ని వెంకటేష్‌కి తెలియజేయడానికి వచ్చిన భగవంతుడిగా పవన్ కళ్యాణ్ నటించాడు. పవన్ కళ్యాణ్... ఇంటర్వెల్‌కి కాసేపు ముందుగా పవన్ తెరమీదకి వస్తాడు. పవన్ రావడం రావడం ఫైట్‌తో వస్తాడు. ఆ తర్వాత సినిమా మొత్తం పవన్ మీదే నడుస్తుంది. ఆయనదేం చిన్న పాత్ర కాదు.. దాదాపు గంటసేపు పవన్ కళ్యాణ్ తెర మీద కనిపిస్తారు. ఈ భగవంతుడి పాత్రను ఆయన అవలీలగా నటించేశారు.