trisha charmi nikisha patel photos

త్రిష, ఛార్మి, నిఖిషా సంచలన ఫొటోలు...

  ఇటీవలే పెళ్ళి కుదిరిన హీరోయిన్ త్రిష, మరో ఇద్దరు హీరోయిన్లు ఛార్మి, నికిషా పటేల్ సోషల్ మీడియాలో పెట్టిన ఫొటోలు సంచలనం సృష్టిస్తున్నారు. ఈ ముగ్గురు హీరోయిన్లు ఎక్కడో ఓ పబ్‌లో పార్టీ చేసుకున్నారు. ముగ్గురూ కలసి మస్తుగా ఎగిరారు. ఒకరిని మరొకరు కౌగిలించుకుని ఫొటోలకు పోజిచ్చారు. ఈ సంతోషమంతా త్రిష పెళ్ళి కుదిరినందుకేనని అర్థమవుతూనే వుంది. ఈ ఫొటోలను పోస్టు చేయడంతోపాటు వాటి కింద పెట్టిన కామెంట్లు సంచలనం సృష్టించాయి. ఈ ముగ్గురూ తమను తాము మూడు కోతులతో పోల్చుకున్నారు. తమ ముగ్గురిలో ఒక కోతి వికెట్ పడిపోయిందని, ఇంకా రెండు కోతుల వికెట్లు కూడా పడబోతున్నాయని కామెంట్ పెట్టారు. అంటే, తమ ముగ్గురిలో త్రిషకు పెళ్ళి కుదిరిపోయింది... త్వరలో తమకూ పెళ్ళి కుదరబోతోందని వాళ్ళు అన్యాపదేశంగా చెప్పారు. అంతేలే.. ఏ వయసు ముచ్చట ఆ వయసులోనే జరగాలి. ఇప్పటికే కాస్త లేటయింది.. మొత్తమ్మీద ఈ ముగ్గురు ముద్దుగుమ్మలకీ అభినందనలు.

bad yoga guru

యోగా గురువుకు మాయరోగం

  ఈమధ్య గురువులకు మాయరోగాలు వచ్చి రకరకాల సెకలు పోయి దొరికిపోతున్నారు. ఇండియాలో వున్న చాలామంది గురువుల పరిస్థితి ఇలా వుందని బాధపడుతుంటే, ఇతర దేశాలలో వుండే గురువులకు కూడా ఇదే మాయరోగం పట్టుకుంది. ఆస్ట్రేలియాలోని మౌంట్ ఏలియా ప్రాంతానికి చెందిన రస్సెల్ క్రుక్‌మాన్ అనే ఒక 72 సంవత్సరాల వయసున్న ముసలాయన యోగా గురువు. ఆస్ట్రేలియావాసులకు ఎప్పటి నుంచో యోగాసనాలు నేర్పుతున్నాడు. స్వామి శంకరానంద అని పేరు మార్చుకున్న ఇతగాడు ఆస్ట్రేలియాలో తన పేరుతోనే ఒక యోగా కేంద్రాన్ని కూడా స్థాపించాడు. పళ్ళూడిపోయే వయసులో వున్న ముసలాయన కావడంతో ఈయన మీద ‘నమ్మకం’తో చాలామంది మహిళలు యోగా నేర్చుకోవాలని వచ్చేవారు. అయితే ఈ మధ్యకాలంలో ఒక బాంబులాంటి విషయం బయటపడింది. ఈ ముసలి యోగా గురు తన దగ్గరకి యోగా నేర్చుకోవడానికి వచ్చిన చాలామంది అమ్మాయిలను ముగ్గులోకి దించి వాళ్ళతో ‘భోగం’ అనుభవించేశాడట. ఈ విషయం బయటపడిపోవడంతో ఇక చేసేదేమీ లేక ఆయనగారే తాను చేసిన తప్పులని ఒప్పుకున్నాడు. తన దగ్గరకి వచ్చే మహిళలకు తాంత్రిక విద్యలు వస్తాయని నమ్మించి తనతో శారీరకంగా కలిసేలా ప్రేరేపించాలనని ఈ ముసలాయన వెల్లడించాడు. ఇప్పటి వరకు 40 మందికి పైగా యువతులు తన మాయలోపడిపోయారని చెప్పాడు. ఒక పవిత్రమైన స్థానంలో వుండి ఇలాంటి పని చేసినందుకు తనను క్షమించాలని వేడుకున్నాడు. ఆస్ట్రేలియా పోలీసులు ప్రస్తుతం ఈ ముసలాయన్ని ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు.

The Boy Next Door

‘ద బోయ్ నెక్ట్స్ డోర్’ అదుర్స్

  హాలీవుడ్ హాట్ హీరోయిన్ జెన్నిఫర్ లోపెజ్, ర్యాన్ గజ్‌మాన్ నటించిన హాలీవుడ్ చిత్రం ‘ద బోయ్ నెక్ట్స్ డోర్’ గురువారం నాడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. రాబ్ కోహెన్ ఈ చిత్ర దర్శకుడు. తన భర్త నుంచి కొత్తగా విడాకులు తీసుకున్న ఒక యువతిని తన పక్కింట్లో నివసించే యువకుడు ఆకర్షిస్తాడు. వారిద్దరి మధ్య సంబంధం ఏర్పడుతుంది. అయితే ఇంతలోనే వారి జీవితంలో భారీ మలుపు వస్తుంది. అప్పటి వరకూ రొమాంటిక్‌గా సాగిపోతున్న సినిమా అకస్మాత్తుగా థ్రిల్లర్ రూపంలోకి మారిపోతుంది. వారి జీవితంలో ఎలాంటి ఘటనలు ఎదురయ్యాయి, వాటి పర్యవసానాలు ఎలా వున్నాయనేది ఈ సినిమా కథాంశం. శుక్రవారం నాడు ఒక్క అమెరికాలోనే ఈ సినిమా 1,869 థియేటర్లలో విడుదలైంది. విడుదలైన ఒక్క రోజులోనే ఈ సినిమా ఒక్క అమెరికాలోనే ఐదు లక్షల డాలర్ల కలెక్షన్లలను వసూలు చేసింది. ఇది ఒక రికార్డుగా హాలీవుడ్ సినీ పండితులు చెబుతున్నారు. జెన్నిఫర్ లోపెజ్, ర్యాన్ గజ్‌మాన్ మధ్య సన్నివేశాలు అదరిపోయాయని అంటున్నారు. వీళ్ళిద్దరూ నిజంగానే లవర్సా అనిపించేంతగా ఇన్వాల్వ్ అయి నటించారన్న ప్రశంసలు వినిపిస్తున్నాయి.

Dolly Ki Doli Review

‘డాలీ కీ డోలీ’లో ఇరగదీసిన సోనమ్ కపూర్

  అనిల్ కపూర్ ముద్దుల కూతురు సోనమ్ కపూర్ హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ సినిమా ‘డాలీ కీ డోలీ’ శుక్రవారం నాడు విడుదలైంది. అభిషేక్ డోగ్రా ఈ సినిమాకి దర్శకుడు. రాజ్‌కుమార్ రావ్, వరుణ్ శర్మ ఇతర ప్రధాన పాత్రధారులు. తాను నటించిన ప్రతి సినిమాలోనూ వైవిధ్యమైన పాత్రలను ధరించిన సోనమ్ కపూర్ ఈ సినిమాలో డాలీ అనే ఒక వైవిధ్యమైన పాత్రను ధరించింది. కుర్రాళ్ళను ప్రేమ పేరుతో, పెళ్ళి పేరుతో ముగ్గులోకి దించి చివరికి జెల్లకొట్టే కేరెక్టర్ ధరించింది. ఆమె మాయలో పడి మోసపోయిన యువకులుగా రాజ్‌కుమార్ రావ్, వరుణ్ శర్మ నటించారు. వీళ్ళిద్దర్నీ డాలీ మోసం చేసిన తర్వాత ఏం జరిగిందనేది ఈ సినిమా కథాంశం. ఆశ్చర్యకరమైన క్లైమాక్స్‌తో సినిమా ముగుస్తుంది. ట్విట్టర్లో ఎంతమాత్రం యాక్టివ్‌గా వుండని సల్మాన్ ఖాన్ ఈ సినిమా చూసి తప్పకుండా చూడండంటూ రికమండ్ చేశాడంటే ఈ సినిమా ఎలా వుందో ఊహించుకోవచ్చు. డాలీ పాత్రలో సోనమ్ కపూర్ ఇరగదీసింది.

tribute to ms narayana

వెళ్ళిపోయీ నవ్విస్తున్న ఎమ్మెస్ నారాయణ

  ప్రముఖ హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణ శుక్రవారం నాడు అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో కన్నుమూశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని తన స్వస్థలం నిడమర్రుకు వెళ్ళిన ఎమ్మెస్ నారాయణ అక్కడ ఫుడ్ పాయిజనింగ్ కారణంగా అనారోగ్యానికి గురయ్యారు. ఆయన్ని వెంటనే విజయవాడలోని ఆస్పత్రికి, ఆ తర్వాత హైదరాబాద్‌లోని కిమ్స్‌కి తరలించారు. గురువారం నాడు ఆయన మరణించారని పుకార్లు వచ్చాయి. అయితే ఆయన మరణించలేదని ఆ తర్వాత తెలిసింది. నలుగురినీ నవ్వించే ఎమ్మెస్ నారాయణ సజీవంగా వున్నారన్న వార్త అందరికీ సంతోషాన్ని కలిగించింది. అయితే ఆ సంతోషం ఒక్క రోజు కూడా నిలబడలేదు. శుక్రవారం నాడు ఆయన మరణించారు. ఈ వార్త విన్న తెలుగువారు ఎంతో బాధపడుతున్నారు. దాదాపు ఏడు వందల సినిమాల్లో నటించిన ఆయన తన వైవిధ్యమైన హాస్యంతో ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఎమ్మెస్ నారాయణ పూర్తి పేరు మైలవరపు సూర్యనారాయణ. 1951వ సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రులో జన్మించారు. బాగా చదువుకున్న ఆయన భీమవరంలోని ఓ కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా పనిచేశారు. ఆ తర్వాత సినిమా రచయిత అవ్వాలన్న ఉద్దేశంతో హైదరాబాద్‌కి చేరుకుని తీవ్రంగా ప్రయత్నించారు. అయితే రచయితగా ఆయన కొద్ది సినిమాలకు మాత్రమే పనిచేశారు. ఆ తర్వాత ఆయన హాస్య నటుడిగా ప్రస్థానం ప్రారంభించారు. వంశీ దర్శకత్వం వహించిన ‘లింగబాబు లవ్ స్టోరీ’ నటుడిగా ఆయన తొలి చిత్రం. ఆ తర్వాత ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన ‘మా నాన్నకి పెళ్ళి’ సినిమాలో తాగుబోతు పాత్రను ధరించడంతో ఆయన కెరీర్ మంచి మలుపు తిరిగింది. ఆ తర్వాత ఆయన ఎప్పుడూ వెనుదిరిగి చూసుకోలేదు.. దాదాపు ఏడు వందల సినిమాల్లో నటించారు. తాగుబోతు పాత్రలను ధరించడంలో స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్నారు. పేరడీ పాత్రలను ధరించడంలో ఆయన తర్వాతే ఎవరైనా అన్నట్టుగా నటించారు. ఆయన్ని చూస్తేనే ప్రేక్షకులకు నవ్వు వచ్చేంతగా ఆయన నటుడిగా పరిణితిని సాధించారు. నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా ఆయన కృషి చేశారు. తన కుమారుడు విక్రమ్ హీరోగా ‘కొడుకు’, ‘భజంత్రీలు’ అనే రెండు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. హాస్య నటుడిగా ఎమ్మెస్ నారాయణ రామసక్కనోడు, మానాన్నకు పెళ్లి, సర్దుకుపోదాం రండీ, శివమణి, దూకుడు సినిమాల ద్వారా ఐదుసార్లు నంది అవార్డులు పొందారు. దూకుడు సినిమాలో ఆయన నటనకు ఫిలిం ఫేర్ అవార్డును కూడా అందుకున్నారు. నటుడిగా ప్రేక్షకులలో విశేషమైన ఆదరణ మాత్రమే కాకుండా... మంచి మనిషిగా, మృదుభాషిగా కూడా పేరు సంపాదించుకున్న ఆయన ఆకస్మికంగా మరణించడం దురదృష్టకరం. ఆయన చనిపోయిన శుక్రవారం నాడే ఆయన నటించిన ‘పటాస్’ సినిమా విడుదలైంది. ఆ సినిమాలో ఎమ్మెస్ నారాయణ ‘సునామీ స్టార్’ అనే పాత్రలో నటించి ప్రేక్షకులను ఓ వైపు నవ్విస్తూనే మరోవైపు కంటతడి పెట్టించారు. ఎమ్మెస్ నారాయణ భౌతికంగా మరణించినప్పటికీ ఆయన పంచిన హాస్యం తెలుగు ప్రజల పెదవుల మీద చిరస్థాయిగా మెరుస్తూనే వుంటుంది.

Baby movie review

దేశభక్తి పూరితం ‘బేబీ’... మూవీ రివ్యూ

  అక్షయ్ కుమార్ నటించిన థ్రిల్లర్ మూవీ ‘బేబీ’ శుక్రవారం నాడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తారాగణం: అక్షయ్ కుమార్, రానా దగ్గుబాటి, తాప్సీ పన్ను, అనుపమ్ ఖేర్, డానీ డెంజోప్పా, కేకే మీనన్, దర్శకత్వం: నీరజ్ పాండే. ‘బేబీ’  ఉగ్రవాదులకు వ్యతిరేకంగా రూపొందించిన సినిమా. పాకిస్థాన్‌కి చెందిన ఉగ్రవాదులు భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి ‘ఆపరేషన్ బేబీ’ అనే పన్నాగం పన్నినప్పుడు దానిని కథానాయకుడు ఏ విధంగా భగ్నం చేశాడన్నది ఈ సినిమా కథాంశం. ఈమధ్యకాలంలో కామెడీ పాత్రలు ధరించిన అక్షయ్ కుమార్ ఈ సినిమాలో సీరియస్‌గా వుండే పాత్ర ధరించాడు. దేశభక్తి పూరితంగా ఈ సినిమా వుంది.

అక్షరా హాసన్ అదరహో

  కమల్ హాసన్ పెద్ద కూతురు శ్రుతి హాసన్ ఇటు దక్షిణాదిలో, అటు ఉత్తరాదిలో ఇరగదీస్తోంది. ఇప్పుడు కమల్ మరో కూతురు అక్షర హాసన్ త్వరలో విడుదల కాబోతున్న హిందీ సినిమా ‘షమితాబ్’లో నటించింది. ధనుష్ హీరోగా నటించిన ఆ సినిమాలో అమితాబ్ కూడా నటించాడు. ఈ సినిమాతో తాను బాలీవుడ్‌లో సెటిలైపోవడం ఖాయమని అక్షర భావిస్తోంది. తన అక్కలాగా దక్షిణాదికి, ఉత్తరాదికి షటిల్ సర్వీసు చేయాల్సిన అవసరం లేదని అనుకుంటోందని సమాచారం. ఇదిలా వుంటే, గతంలో రైటర్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా వున్న సమయంలో పప్పు సుద్దలా వుంటే అక్షర హాసన్ ఈమధ్య బాగా గ్లామర్ పెంచేసింది. మొన్నీమధ్య ‘షమితాబ్’ సినిమాకి సంబంధించిన ఒక కార్యక్రమానికి హాజరైన అక్షరని చూసి బాలీవుడ్ వాళ్ళంతా నోళ్ళు తెరిచారు. ఈ పిల్లలో ఇంత గ్లామరుందా అని ఆశ్చర్యపోయారు. అదరహో అక్షరా అనేశారు... ఇదంతా చూసి శ్రుతి హాసన్ కుళ్ళుకుంటుందో ఏం పాడో..