Google announced most searched Telugu heroes in last decade

పవన్‌ని దాటిపోయిన మహేష్

  టాలీవుడ్‌లో టాప్ హీరో మా హీరో అంటే మా హీరోనే అనే పోటీ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఎప్పుడూ వుండేదే. టాలీవుడ్‌లో ర్యాంకింగ్ సంగతి అలా వుంచితే, ఒకచోట మాత్రం మహేషే టాప్ హీరో. ఈ విషయంలో పవన్ కళ్యాణ్‌ని మహేష్ బాబు దాటిపోయాడు. ఇంతకీ అది ఎక్కడ? ఇంకెక్కడో కాదు... ఇంటర్నెట్‌లో.. అది కూడా గూగుల్లో. గత పది సంవత్సరాల్లో అంటే 2004 నుంచి 2014 మధ్య గూగుల్లో అభిమానులు వెతికిన స్టార్స్‌కి సంబంధించిన వివరాలను గూగుల్ వెల్లడించింది. ఈ వివరాల్లో మన టాలీవుడ్ హీరోలకి సంబంధించిన వివరాలు కూడా వున్నాయి. ఈ వివరాల ప్రకారం ఈ పదేళ్ళలో గూగుల్లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన హీరో మహేష్ బాబు. అయితే ఆ తర్వాతి స్థానం మా హీరోదే అని పవన్ కళ్యాణ్ అభిమానులు అనుకుంటారేమో... ఆశ దోశ అప్పడం వడ.. ఈ లిస్టులో పవన్ కళ్యాణ్ స్థానం చెబితే ఆయన ఫాన్స్ ఫీలైపోతారు. అయినప్పటికీ చెప్పక తప్పదు. గూగుల్ రిలీజ్ చేసిన లిస్టులో పవన్ కళ్యాణ్ ఐదో స్థానంలో నిలిచారు. పాపం.. సరే, మొదటి స్థానంలో మహేష్ బాబు వున్నాడని చెప్పకున్నాం కదా.. ఇప్పుడు రెండో స్థానంలో ఉన్న హీరో ఎవరో చెప్పుకుందాం.. ఆ స్థానాన్ని అల్లు అర్జున్ ఆక్రమించేశాడు. మూడో స్థానాన్ని ప్రభాస్ సొంతం చేసుకుంటే, నాలుగో స్థానాన్ని మాత్రం చిరంజీవి తన అకౌంట్లో వేసుకున్నాడు. ఐదో స్థానం పవన్ కళ్యాణ్‌కి దక్కింది.

Vicki Gunvalson Apologizes For Leaking Her Own Nude Photo

నా నగ్న ఫొటోలు లీక్ చేసి తప్పు చేశా

  ఈమధ్య హాలీవుడ్ హీరోయిన్లకి తమ నగ్న ఫొటోలు తీసుకోవాలన్న మోజు బాగా పెరిగిపోయింది. వాళ్ళ మోజుకు తగ్గట్టుగా చక్కగా నగ్నంగా ఫొటోలు దిగి కంప్యూటర్లలో దాచుకుంటున్నారు. అప్పుడప్పుడు వాటిని చూసుకుంటూ తమలో తామే మురిసిపోతున్నారు. అయితే ఈమధ్యకాలంలో ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు అలా తమ నగ్న ఫొటోలు కంప్యూటర్లలో దాచుకుంటే హ్యాకర్లు ఎంచక్కా వాళ్ళ కంప్యూటర్లని హ్యాక్ చేసి సదరు బ్యూటీఫుల్ ఫొటోలని ఇంటర్నెట్లో లీక్ చేశారు. ఆ విషయం తెలుసుకుని సదరు హీరోయిన్లు లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. ఈ స్టోరీ ఇలా వుంటే, వికి గున్వాల్సన్ అనే హాలీవుడ్ హీరోయిన్ తన నగ్న ఫొటోలు తానే ఇంటర్నెట్లో లీక్ చేసింది. దాంతో ఇంకేముందు... అంతా రచ్చ రంబోలా అయింది. ఆ ఫొటోలని చూసి కుర్రకారు పిచ్చెక్కిపోయారు. అంతవరకూ బాగానే వుందిగానీ, వికి గున్వాల్సర్ తన నగ్న ఫొటోలను తానే లీక్ చేయడం పద్ధతిగా లేదని కొంతమంది విమర్శించారు. ఆ విమర్శలను మొదట్లో ఎంతమాత్రం పట్టించుకోని వికి ఇప్పుడు పశ్చాత్తాపపడిపోతోంది. తన నగ్న ఫొటోలను తానే లీక్ చేసి పొరపాటు చేశానని అనిపిస్తోందని బాధపడుతోంది. ఇప్పుడు బాధపడినా ప్రయోజనం లేకుండా పోయిందని, తన తప్పును తాను వెనక్కి తీసుకోలేనని చెప్పింది. ఇప్పటికే తన నగ్న ఫొటోలు ప్రపంచమంతా వ్యాపించిపోయాయని అంటోంది. నేను సాధారణ మనిషిని. మనుషులందరూ తప్పులు చేస్తారు. నేను కూడా తప్పు చేశాను క్షమించండి అంటూ సినిమా డైలాగ్స్ చెబుతోంది.

Ajith Yennai Arindhaal teaser beats Bang Bang

అజిత్ సినిమా టీజర్ అదుర్స్

  అజిత్, అనుష్క, త్రిష హీరో హీరోయిన్లుగా గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎన్నాయి అరిందల్’ (తెలుగులో ఎంతవాడు గానీ..) త్వరలో తమిళ, తెలుగు భాషల్లో విడుదలవటానికి ముస్తాబుతోంది. ఈ సినిమాని ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది. టీజర్ విడుదల చేసిన 48 గంటల్లోనే 2 మిలియన్ల మంది దీనిని వీక్షించారు. ఈమధ్యకాలంలో విడుదలైన దక్షిణాది చిత్రాల్లో ఏ చిత్రం టీజర్నీ ఇంతమంది ప్రేక్షకులు చూడలేదని తెలుస్తోంది. ‘ఎన్నాయ్ అరిందల్’ టీజర్ ఆమధ్య విడుదలైన ‘బాంగ్ బాంగ్’ సినిమా టీజన్ వ్యూయర్లని కూడా మించిపోయిందని తెలుస్తోంది. ఈ సినిమా జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Rajnikanth

Rajnikanth Speach at Linga Movie Function

  Rajnikanth speaking at his upcoming movie Linga curtain raiser function held at Hyderabad on Monday  said, “This is a period film. The story takes place between 1948 and 58 period. It revolves around a huge dam. Our technicians did a tremendous job. We the actors come and do our part in the last minute, but they put lots of efforts to glorify each and every scene of the movie. After seeing their hard efforts and great workmanship, I feel myself second to them. There are 40 very important and very difficult scenes in this movie. They would be highlight of this movie. We all worked so hard to deliver a unique movie. I hope people will have a whole new kind of experience with this movie.”   “I heard our make-up man is saying that he worked very hard to present me very young and handsome to match my young heroines. But, I would like to say that I have sweated a lot to sing duets with these two young girls Anushka and Sonakshi Sinha. I think it is a punishment for an elder person like me to shake legs with the young girls, but somehow I managed it.”   “Anushka and Sonakshi Sinha are very busy artists. There are hundred artists in our movie. There are several very complicated shots in this movie. But, our director has winds-up the film just within six months. It is very hard to believe, but he did it. Hollywood film makers take lots of time in pre-production, but complete the shooting in a very short time. I think our director also seems to be followed the same technique to complete the shooting in-time.”   “I don’t mean that I am pointing at Rajamouli, who is making film ‘Bahubali’ for last one and half years. He is a great director and I would love to work in his direction. I also like to work in Allu Arvind’s movie, but I suggest him to first complete the 150th movie of Chiranjeevi.”   “Some persons have claimed the story of this Linga movie is theirs, but I don’t think so. I am sure this film would give a different experience to Telugu audiences. I thank them for encouraging me like our Tamil audiences.”   Jagapathibabu, Anushka, Sonakshi Sinha, producer Allu Arvind, directors K Viswanath, and Tivikram Srinivas, Ramesh Prasad and many eminent people have graced the function. Rajnikanth thanked one and all.

Priyanka Chopra beats Katrina Kaif as she regains sexiest Asian crown in UK

కత్రినాని ఓడించిన ప్రియాంక

  బాలీవుడ్ హాట్ స్టార్ కత్రినా కైఫ్‌ని మరో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఓడించేసింది. ప్రపంచ ఆసియా శృంగార దేవత (వరల్డ్ సెక్సీయస్ట్ ఆసియన్ వుమెన్)గా ఎంపికయ్యే విషయంలో కత్రినా కైఫ్‌ని పక్కకి నెట్టేసి ఆ స్థానాన్ని ప్రియాంక చోప్రా సొంతం చేసుకుంది. గురువారం నాడు లండన్‌లో ఈ పోటీ జరిగింది. ఈ పోటీలో గత ఏడాది విజేత కత్రినా కైఫ్‌ని కాదని ప్రియాంక చోప్రాను ‘వరల్డ్ సెక్సీయస్ట్ ఆసియన్ ఉమన్’ కిరీటం వరించింది. ఈ పోటీలో కత్రినా కైఫ్‌తోపాటు మరో యాభై మంది అందగత్తెను ప్రియాంక ఓడించింది. ఈ పోటీలో పాపులర్ టీవీ నటి ద్రస్థి ధమి రెండో స్థానంతో సరిపెట్టుకుంది. గత ఏడాది నంబర్ వన్ కత్రినా ఈ ఏడాది నాలుగో స్థానాన్ని పొందింది.

Samantha

మహేష్ బాబు ఇంటర్వ్యూ బై హీరోయిన్ సమంత

  హూద్ హూద్ తుఫాను బాధితుల కోసం విరాళాలు సేకరించేందుకు తెలుగు చిత్రపరిశ్రమ ‘మేము సైతం’ అంటూ ఏకధాటిగా 12గంటల పాటు అనేక వినోద, క్రీడా కార్యక్రమాలు నిర్వహించింది. యావత్ చిత్రసీమ అందులో పాల్గొనేందుకు స్వచ్చందంగా ముందుకు కదిలి వచ్చింది. ఆ కార్యక్రమాలలో భాగంగా టాలీవుడ్ అందాల తార సమంత ప్రిన్స్ మహేష్ బాబు మరియు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లను ఇంటర్వ్యూ చేసారు.   ఆమె అడిగిన ఒక ప్రశ్నకు త్రివిక్రమ్ బదులిస్తూ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా నిరాడంబరంగా ఉంటారు. వారిద్దరూ కూడా చాలా అల్ప సంతోషులు. వారికి లగ్సరీ కార్లు, విలాసవంతమయిన బంగ్లాలు కావాలనుకోరు. వేసుకోవడానికి ఓ రెండు జతలబట్టలు, తల దాచుకొనేందుకు ఒక చిన్న ఇల్లు, చదువుకొనేందుకు బ్యాగులో ఓ రెండు పుస్తకాలు ఉంటే చాలు వారికి మరేమీ అవసరం ఉండదు. ఒకసారి కధ విని ఒకే చెప్పేసిన తరువాత ఇక షూటింగులో ఎటువంటి ప్రశ్నలు వేయకుండా నిశబ్దంగా చెప్పిన పని చేసుకుపోతారు. వారిలో ఆ గొప్ప లక్షణాలే నన్ను వారికి దగ్గరగా చేర్చాయని భావిస్తున్నాను,” అని అన్నారు.   అప్పుడు మహేష్ బాబు మాట్లాడుతూ, “ఒకసారి దర్శకుడు చెప్పిన కధ విని ఒప్పుకొన్న తరువాత మధ్యలో మళ్ళీ సందేహాలు లేవనెత్తడం మంచిపద్ధతి కాదని నా అభిప్రాయం. దర్శకుడికి తన కధను సినిమాగా ఎలా మలచాలో అందరికంటే బాగా తెలుసుటుంది కనుక ఆయన చెప్పినట్లు ఫాలో అయిపోవడమే మంచిది. అలాగని సినిమా ఫెయిల్ అయితే ఆయన ఒక్కడినే తప్పు పట్టడం కూడా సరికాదు. ఎందుకంటే సినిమా అనేది అందరి సమిష్టి కృషి కారణంగా తయారయినది,” అని అన్నారు.   సమంత అడిగిన ఒక ప్రశ్నకు మహేష్ బదులిస్తూ, “నేను రీమేక్ సినిమాలలో నటించడానికి ఎందుకు ఇష్టపడను అంటే, సినీ నిర్మాణం అనేది ఒక సృజనాత్మక రంగం. అందులో నిత్యం ఏదో ఒక కొత్తదనం కోసం ప్రయత్నం అవసరమని నేను భావిస్తాను. అప్పటికే రిలీజ్ అయ్యి కొన్ని లక్షలమంది చూసేసిన సినిమాను మళ్ళీ తీయడం అందులో నేను ఎవరినో ఊహించుకొంటూ నటించడం నాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే నేను రీమేక్ సినిమాలలో నటించడానికి ఇష్టపడను,” అని అన్నారు.   త్రివిక్రమ్ అడిగిన ప్రశ్నకు సమంతా జవాబిస్తూ, “నేను దక్షిణాదిన అందరో అగ్ర హీరోలతో కలిసి పనిచేసాను. బేసిక్ గా కొన్ని గొప్ప లక్షణాలు అందరిలో ఒక్కలాగే ఉండటం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. నిరాడంబరంగా ఉండటం, ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా కష్టపడి పనిచేయడం, చేసేపని పట్ల పూర్తి శ్రద్ద, ఎటువంటి బేషజాలు లేకుండా సెట్స్ లో అందరితో కలిసిపోవడం వంటివన్నీ వారిని ఈ స్థాయికి తీసుకువచ్చి నిలిపాయని నేను భావిస్తున్నాను. వారెవరిలో కూడా తాము ఒక పెద్ద హీరో అనే ఫీలింగ్ లేకుండా చాలా నిరాడంబరంగా, దర్శకుడు చెప్పినట్లుగా క్రమశిక్షణతో పనిచేయడమే వారి విజయ రహస్యమని నాకు అర్ధమయింది. “ఎన్ని సినిమాలు చేసినప్పటికీ ప్రతీ సినిమాను మొదటి సినిమాగానే భావించి అందులో నుండి కొత్త విషయాలు నేర్చుకొంటూ ఉండాలి” అని హీరో సూర్యా చెప్పిన సలహా నేటికీ నా బుర్రలో అలా మెదులుతూ నన్ను ఎప్పుడూ అప్రమత్తంగా ఉండేట్లు చేస్తుంటుంది,” అని అన్నారు.

balakrishna superb in memusaitham

బాల‌య్య బాబు అద‌ర‌గొట్టేశాడంతే...!

  నంద‌మూరి బాల‌కృష్ణ తెర‌పై ఉగ్ర‌రూపం చూపిస్తుంటారు. బ‌య‌ట మాత్రం చాలా స‌ర‌దా మ‌నిషి. భోళా మ‌నిషి.. చిన్న‌పిల్లాడి మ‌న‌స్త‌త్వం.. ఇలాంటి మాట‌లు మ‌నం చాలాసార్లు వింటుంటాం. కానీ మేము సైతం కార్య‌క్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన డైన్ విత్ ద స్టార్స్ లో ఈ విష‌యం ప్ర‌త్య‌క్ష అనుభ‌వంలోకి వ‌చ్చింది. హుద్ హుద్ బాధితుల‌ను ఆదుకోవ‌డానికి తెలుగు చిత్ర‌సీమ మేము సైతం అనే ఓ బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మం నిర్వ‌హించింది. అంతకు ముందు శ‌నివారం రాత్రి డైన్ విత్ ద స్టార్స్ అనే కార్య‌క్ర‌మం జరిగింది. తెలుగు చిత్ర సీమ‌లో అగ్ర తార‌లుగా కొన‌సాగుతున్న‌వాళ్లంతా దాదాపుగా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. చిరంజీవి, నాగార్జున‌, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్‌, అల్లు అర్జున్, ప్ర‌భాస్‌, గోపీచంద్‌, మోహ‌న్‌బాబు, విష్ణు, మ‌నోజ్‌, నాగ‌చైత‌న్య‌, ర‌వితేజ‌.. ఇలా స్టార్స్ అంతా క‌నిపించారు. ఎంత‌మంది వ‌చ్చినా ఈ కార్య‌క్ర‌మానికి సెంట్రాఫ్ ఎట్రాక్ష‌న్ మాత్రం నంద‌మూరి బాల‌కృష్ణ‌నే.   ఆయ‌న ఈ వేదిక‌పై డాన్స్ చేశారు.. లెజెండ్ సినిమాలోకి నీకంటి చూపులోన అనే పాట‌ని పాడి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. అతిథుల‌కు ద‌గ్గ‌రుండి విందు వ‌డ్డించారు. అంతేకాదు.. స‌హ న‌టీన‌టుల‌కు స్నాక్స్ తినిపించారు కూడా. బాల‌య్య అంద‌రితోనూ కల‌సిపోయి, క‌లివిడిగా తిరిగేయ‌డం అక్క‌డివాళ్లంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. బాల‌య్య డాన్స్ చేస్తుంటే.. ర‌వితేజ‌, అలీ, వెంక‌టేష్‌, విష్ణు వీళ్లంతా విజిల్స్ వేసి ఉత్సాహ‌ప‌రిచారు. మొత్తానికి ఈ కార్య‌క్ర‌మాన్ని బాల‌య్య ఒక్క‌డే ముందుండి న‌డించాడు.. గ్రాండ్ స‌క్సెస్ చేశాడు. 

Kendra Wilkinson has described sleeping with Hugh Hefner

పడకగది రహస్యాలు చెప్పిన హీరోయిన్

  హాలీవుడ్ హీరోయిన్ కెన్డ్రా విల్కిసన్ తెరమీద కనిపించినప్పుడు తన అందాలతో ఎంత సంచలనం సృష్టిస్తుందో, బోల్డ్‌గా మాట్లాడినప్పుడు కూడా అంతే సంచలనం రేపుతూ వుంటుంది. ఆమధ్య ప్లేబోయ్ పత్రిక కవర్ పేజీ మీద యమా హాట్‌గా పోజులిచ్చిన ఈ ముద్దుగుమ్మ తాజాగా తన పడగ్గది కబుర్లను ఎంతమాత్రం దాచుకోకుండా పబ్లిగ్గా, ఓ టీవీ ప్రోగ్రామ్‌లో చెప్పేసి అంతే కలకలం రేపింది. విల్కిసన్ ఈమధ్య హ్యూజ్ హెఫ్నర్ అనే తన బాయ్ ఫ్రెండ్‌తో పడగ్గదిలో ఎలా గడిపిందో, ఏమేం చేసిందో ఆమె ఎంతమాత్రం సిగ్గుపడకుండా చెబుతుంటే, వింటున్నవాళ్ళు మాత్రం సిగ్గుతో మొగ్గలై ముడుచుకుపోయారట. తాను పడగ్గదిలో ఉన్నప్పుడు భారీ స్థాయిలో విస్కీ గట్రా తాగుతుందట. సిగరెట్లు కూడా తాగుతుందట. అప్పుడే ఆమె పడగ్గదిలో చురుగ్గా వుంటుందట. కొంతమంది తనను బాగా మెప్పిస్తారట. కొంతమందితో శృంగారం ఏదో డ్యూటీ చేసినట్టుగా ముగిసిపోతుందట. ఇలా తన పడగ్గది కబుర్లు ఇంకా బోలెడన్ని చెప్పింది. అవన్నీ ఇక్కడ చెబితే పిల్లలు పాడైపోతారు. అన్నట్టు ఈ సుందరాంగి వయసు ఇప్పుడు 29 సంవత్సరాలు. ఈమెకు 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 78 సంవత్సరాల వయసున్న ఓ పెద్దమనిషిని పెళ్ళి చేసుకుని కొంతకాలం సంసారం చేసిన చరిత్ర కూడా ఈమెకి వుంది.

filmmaker Pooja Bhatt is coming up with a venture titled Cabaret Kaustav Narayan Niyogi Richa Chadda!

క్యాబరే చేయబోతున్న హీరోయిన్

  ఏ హీరోయిన్ అయినా క్యాబరే చేయబోతుందంటే ఆసక్తి చూపించనివారెవరు. సాధారణంగా హీరోయిన్లు క్యాబరే డాన్స్ చేయమంటే బాబోయ్ అనేస్తారు. అయితే రిచా చద్ధా అనే హీరోయిన్ మాత్రం తాను క్యాబరే చేయడానికి సిద్ధమని ప్రకటించింది. విషయం ఏమిటంటే, మాజీ హీరోయిన్ పూజాభట్ కౌస్తభ్ నారాయణ్ నియోగి దర్శకత్వంలో నిర్మించబోతున్న ‘క్యాబరే’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించడానికి రిచా చద్ధా అంగీకరించింది. అందాల ఆరబోతలో సిద్ధహస్తురాలైన రిచా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకి న్యాయం చేయగదన్న నమ్మకంతోనే ఆమెను సంప్రదించామని, ఈ సినిమా కథ చెప్పగానే ఆమె ఎగిరి గంతేసి నటించడానికి అంగీకరించిందని దర్శకుడు, నిర్మాత చెబుతున్నారు. ఈ సినిమాలో పూర్తిస్థాయి క్యాబరే డాన్స్ ఉండకపోవచ్చుగానీ ‘ఓ మోస్తరు’గా నైనా క్యాబరే డాన్స్ వుంటుందన్న అభిప్రాయాలు బాలీవుడ్‌లో వ్యక్తమవుతున్నాయి. పూజాభట్ నిర్మించే సినిమా కావడంతో ‘క్యాబరే’ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Angelina joli good bye to actiong angelena joli direction

స్టార్ హీరోయిన్.. సినిమాలకు గుడ్‌బై

  హాలీవుడ్ హాట్ హీరోయిన్, స్టార్ హీరోయిన్ ఏంజిలీనా జోలీ వయసు మీదపడినా ఇప్పటికీ కుర్రకారుకు ఆరాధ్య దేవతగానే వుంది. త్వరలో ఆమె తన అభిమానులకు షాక్ ఇవ్వబోతోంది. అది ఏమిటంటే, ఆమె త్వరలో నటనకు గుడ్‌బై చెప్పబోతోంది. అయితే ఆ షాక్ ఇవ్వడంతోపాటు మరో ఆనందాన్ని ఇవ్వబోతోంది. ఆమె నటన మానేసినప్పటికీ సినిమాలకు దూరమవ్వదట. త్వరలో దర్శకురాలి అవతారంలో కనిపించబోతోందట. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఏంజిలినా జోలి మాట్లాడుతూ, ప్రస్తుతం తనకు నటన కంటే మెగాఫోన్‌ పట్టుకోవడంలోనే ఎక్కువ ఆసక్తి ఉందని, త్వరలో తాను నటనకు గుడ్‌బై చెప్పి దర్శకత్వంలోకి ఎంటరైపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆమె చెప్పింది. ‘‘ఎందుకో నాకు ఇప్పుడు నటించడం అంటే అసలు ఇష్టం వుండటం లేదు. కెమెరా ముందు నిలబడాలంటే అసౌకర్యంగా అనిపిస్తోంది. ఇక నుంచి పూర్తి స్థాయిలో ఫిల్మ్ మేకింగ్ పై దృష్టి పెడతా. దర్శకురాలిగా కూడా రాణిస్తానని ఆశిస్తున్నా’’ అని ఏంజిలినా స్పష్టం చేసింది. ఏంజిలినా నటించిన ‘మేల్ ఫీసెంట్’ సినిమా ఇటీవల విడుదలై బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపింది.

film actress renu desai watched gabbar movie singh dvd scratches sixty times pawan kalyan

‘గబ్బర్‌సింగ్’ 60 సార్లు.. ‘అత్తారింటికి..’ 20 సార్లు చూసిన రేణు

  పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ ఛాన్స్ దొరికినప్పుడల్లా పవన్ కళ్యాణ్‌ని పొగిడే పనిలో వుంది. ఆయన మరో పెళ్ళి చేసుకుని హ్యాపీగా వున్నాడు. మళ్ళీ నువ్వీ పొగడ్తల కార్యక్రమం చేపట్టావేంటమ్మా అంటే.. నేనేం పవన్‌కి దగ్గరయ్యే ప్రయత్నాలు చేయడం లేదని చెబుతోంది. రేణు దేశాయ్ తాజాగా పవన్ నటించిన ‘గబ్బర్‌సింగ్’ సినిమాని తెగ పొగిడేసింది. ఆ సినిమా అంటే తనకు ఎంతో ఇష్టమని, ఇప్పటికి అరవై సార్లకు పైగా ఆ సినిమా చూశానని, డీవీడీకి గీతలు పడిపోయినా వదలకుండా పదేపదే చూస్తూనే వున్నానని రేణు చెబుతోంది. తమ పిల్లలు కూడా గబ్బర్ సింగ్ సినిమాని చూస్తూనే వుంటారని చెబుతోంది. అత్తారింటికి దారేది సినిమా కూడా తనకు ఇష్టమని, ఆ సినిమాని ఇప్పటి వరకు దాదాపు ఇరవైసార్లు చూశానని రేణు దేశాయ్ మురిసిపోతూ చెబుతోంది. అన్నట్టు రేణు దేశాయ్ దర్శకత్వం వహించిన మరాఠీ సినిమా ‘ఇష్క్‌ వాలా లవ్‌’ త్వరలో తెలుగులో కూడా విడుదల కాబోతోంది.

bahubali

బాహుబలి పని డిశంబరుకి ఫినిష్..

  దర్శకుడు రాజమౌళి దాదాపు ఏడాదిన్నరగా బాహుబలి సినిమాను తీస్తూనే ఉన్నాడు. ఆయన కోసం హీరో ప్రభాస్ కూడా వేరే సినిమాలు చేయడం మానేసాడు. షూటింగ్ ప్రారంభించిన సమయంలోనే దీనికి దాదాపు రెండేళ్ళు పడుతుందని రాజమౌళి చెప్పేయడం వలన అందులో నటిస్తున్న వారు, ఆ సినిమాకు పనిచేస్తున్న టెక్నీషియన్స్ అందరూ కూడా పూర్తిగా దానికే కమిటయిపోయి ఓపిగ్గా ఎవరి పని వారు చేసుకుపోతున్నారు. పాపం అందుకేనేమో అందరికీ గెడ్డలు మీసాలు ఓ తెగ పెరిగిపోయాయి.   తాజా సమాచారం ఏమిటంటే ఈ సినిమా షూటింగ్ (ఈ) డిశంబరు నాటికి ఎలాగయినా పూర్తిచేసేయాలని రాజమౌళి కూడా కమిటయిపోయాడుట. ఈలోగా ఇంతవరకు పూర్తయిన పోర్షనుకి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఫినిష్ చేసేసి, వచ్చే సంక్రాంతి బరిలోకి వదలాలని ఐడియా అట! మరి రెండేళ్ళ ఈ పాత ఐడియా ఎవరి జీవితాలను ఏవిధంగా మార్చేయబోతోందో ఎవరికీ తెలుసు?

prakashraj

Prakashraj-Sreenu Vaitla war trigger sparks

  The cold war between director Sreenu Vaitla and veteran actor Prakashraj that begins with sending the latter out from Aagadu movie is still igniting sparks. Prakashraj burst on Sreenu Vaitla for using his poetic dialogues that runs like this-“If you throw stones at me…I will build a house for me with them. If you spit fire at me… I will use it light my house. If you…” Prakashraj has stated them to express his grief over the unfortunate development.   During Ram Charan Tej’s latest move ‘Govindu Andarivadele’ success meet Prakashraj hits hard at Sreenu Vaitla for using them in his Agadu movie. He asked ‘When he dislikes me why did he use my dialogues in his move? Don’t he know that it is necessary to take my permission for using them in his movie? I am sad that he even tried to encash my grief also. Yet, he is not feeling any guilty for it. I heard he is saying he used them because he likes them.”   Prakashraj further said "He has huge money at his dispose for making the film. He has a highly talented actor like Mahesh babu with him. He has a team of expert technicians to enhance his movie. Yet, he made a flop movie. I agree hits and flops are very common in one’s life in the film industry. But, I believe the number of flops can be reduced if one shrugs off his ego feeling. Sreenu Vaitla thinks ‘I am a great director.’ But it is wrong. If he can think I am also one of the directors in the industry, he will get success, otherwise films like these will keep repeating from him."   "He wasted not only the efforts, time and money of all the unit members, but also wasted the audiences time and money. He disappoints them very much with his flop show. He can prevent such repetitions only when he shrugs off his ego feeling, ” said Prakashraj.

రామ్‌చరణ్ బైక్ వేలంలో కొనుక్కుంటారా?

  హీరో రామ్చరణ్ తాను ఉపయోగించిన బైకు అమ్మకానికి పెట్టనున్నారు. రామ్ చరణ్ 'గోవిందుడు అందరి వాడేలే' సినిమా కోసం రూ. 30 లక్షల విలువ చేసే హర్లీ డేవిడ్సన్ బైకు వాడాడు. ఈ సినిమా కోసం దీన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు. సినిమా విడుదలైన తర్వాత ఈ బైకును వేలం వేయాలని నిర్మాత బండ్ల గణేష్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ బైక్‌ని వేలం వేయడం ద్వారా వచ్చే డబ్బును దాతృత్వ కార్యక్రమాలకు వినియోగించాలనుకుంటున్నారట. బాలకృష్ణ ‘లెజెండ్’ సినిమాలో తాను వాడిన బైకును వేలం వేయడం ద్వారా సొమ్మును బసవతారకం ఇండో-అమెరికన్ కేన్సర్ ఆస్పత్రికి అందజేసిన విషయం తెలిసిందే.

అమెరికాలో 159 స్క్రీన్స్‌లో ‘ఆగడు’

  మహేష్‌బాబు, తమన్నా కాంబినేషన్‌లో శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ‘ఆగడు’ సినిమా శుక్రవారం నాడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాలో ఈ సినిమా విడుదలయ్యే థియేటర్ల సంఖ్య అలా వుంచితే, ఒక్క అమెరికాలోనే ‘ఆగడు’ సినిమా మొత్తం 159 స్క్రీన్లలో విడుదలవుతోంది. ఒకరకంగా చెప్పాలంటే ఇది పెద్ద రికార్డు. అమెరికాలో ఈ స్థాయిలో ఏ తెలుగు సినిమా విడుదలైన దాఖాలు లేవని నిర్మాత అనిల్ సుంకర చెబుతున్నారు. ‘ఆగడు’ అమెరికాలో ఈ స్థాయిలో విడుదల కావడానికి తమ పంపిణీ భాగస్వామి ఇరోస్ ఇంటర్నేషన్ సంస్థ సహకారం ఎంతో వుందని ఆయన చెబుతున్నారు. నార్త్ ఇండియాలో కూడా వంద స్క్రీన్లలో ఈ సినిమా విడుదలవుతోందని ఆయన తెలిపారు.