ఛీ.. పాడు వీడియో అంటూనే....
posted on Jan 9, 2015 @ 3:11PM
ప్రఖ్యాత పాప్ కొరియోగ్రాఫర్ సియా లేటెస్ట్‌గా ‘ఎలాస్టిక్ హార్ట్’ పేరుతో ఒక వీడియోను రూపకల్సన చేసింది. ఒక పంజరంలో వున్న ఆటవిక ఆడ, మగ మధ్య ఏం జరిగిందనేది ఈ వీడియో సారాంశం. ఇందులో 28 సంవత్సరాల నటుడు షియా లాబివోఫ్, 12 సంవత్సరాల వయసున్న నటి మాడీ జేగ్లర్ నటించారు. ఈ వీడియో మొత్తం ఆటవికంగా సాగుతుంది. అతనికి, ఆమెకి వున్న సాన్నిహిత్యం, ఆమె తిరస్కరించడం, అతను తిరస్కరించడం, మళ్ళీ ఇద్దరు ఒక్కటి కావడం, మళ్ళీ తిరస్కరణ, అతని పశుబలం... ఇలా సాగుతుందీ వీడియో. ఈ నటీనటుల ఇద్దరి ఒంటిమీదా శరీరం రంగులో కలసిపోయే బిగుతైన దుస్తులు వుంటాయి. అకస్మాత్తుగా చూస్తే అసలు వీళ్ళ ఒంటిమీద బట్టలు ఉన్నాయా లేదా అనే సందేహం కూడా కలుగుతుంది. అయితే ఈ వీడియో విడుదలైన మరునిమిషం నుంచే విమర్శల వెల్లువెత్తాయి. సియాకి ఉన్న ‘పెర్వర్షన్’ అంతా ఈ ఛీ పాడువీడియోలో కనిపిస్తోందన్న విమర్శలు వినిపించాయి. ఇంకా టీనేజ్ కూడా రాని చిన్నపిల్లని 28 ఏళ్ళ లాబివోఫ్‌తో నటింపజేయటమేంటన్న అభ్యంతరాలూ వినిపించాయి. అయతే అలా విమర్శిస్తూనే ఒక్క రోజులోనే కోటీ 30 లక్షల మంది ఈ వీడియో చూసేశారు.. ఒక్కరోజులో ఇంతమంది చూడటం మామూలు విషయం కాదు. ఒక విధంగా ఈ వీడియో విజయం సాధించినట్టే. ఇదిలా వుంటే ఈ వీడియో మీది వస్తున్న విమర్శలకు సియా స్పందించింది. ఈ వీడియో రూపొందించడం వెనుక తన అంతర్భావం వేరే వుందని... అయితే దాన్ని సక్రమంగా ప్రేక్షకులకు చూపించలేకపోయినందుకు తనను క్షమించాలని కోరుతోంది. ఏమయితేనేం.. ఈ వీడియో హిట్టయింది...