బ్రహ్మీ ఇంట్లో ‘లెక్క’ లేని బంగారం ?
posted on Dec 3, 2012 9:19AM
ఇటీవల ఆదాయపు పన్ను శాఖ హైదరాబాద్ నగరంలో పలువురు సిని, టివి ప్రముఖుల ఇళ్ళ ఫై దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, అధికారులకు వీరి ఇళ్లలో ఏమి దొరికాయనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది. అధికారులు కూడా ఇంత వరకూ వీటికి సంబందించిన వివరాలేమీ వెల్లడించలేదు.
రాజధానిలో షికారు చేస్తున్న పుకార్ల ప్రకారం బ్రహ్మానందం ఇంట్లో పెద్ద మొత్తంలో బంగారం దొరికినట్లుగా తెలుస్తోంది. ఇటీవలే జరిగిన అయన కుమారుని వివాహం లో ఇచ్చిపుచ్చుకున్న బంగారమే ఇది అని సరిపెట్టుకోవడానికి లేదు గదా? ఆదాయపు పన్ను శాఖ వారికి లెక్కలు చూపించాల్సిందే కదా ? అలాగే, ఈ కమెడియన్ ఇంట్లో భారీగానే ఆస్తులకు సంబందించిన పత్రాలు కూడ లభించినట్లు సమాచారం.
ఇక గాయని సునీత ఇంట్లో అత్యంత ఖరీదైన ఫారిన్ గిఫ్టులు లభ్య మయినట్లు సమాచారం. అలాగే గీతా మాధురి విషయం కూడా. అయితే, అధికారులు పూర్తి సమాచారం ఇచ్చే వరకూ అంతా సస్పెన్సే.