ఇద్దరమ్మాయిలకోసం 60 డ్రెస్సులేసిన కుర్రోడు

 

ఇద్దరమ్మాయిలకోసం 60 డ్రెస్సులేసిన కుర్రోడు మరెవరో కాదు...మన స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్. త్వరలో ‘ఇద్దరమ్మయిలతో’ సెట్స్ మీదకు వెళ్లనున్న అల్లుఅర్జున్ ఈ సినిమాకోసం 60 రకరకాల డ్రెస్సులేసుకొని ట్రయల్ చూసాడు. మంచి ఊపుమీదున్న పూరీజగన్నాథ్ ఈ సినిమాకి దర్శకుడు. ఇద్దరూ కలిసి ఆడ్రెస్సులలో అల్లుఅర్జున్ ఎలాఉంటాడో తెలుసుకొనేందుకు ఈ మద్యనే ఒక ఫోటోషూట్ కూడా హైదరాబాదులో నిర్వహించేరు. అంతే గాకుండా, వారిదరుకలిసి సినిమాకి లోకేషన్లు వెతికే పనిలో కారులో హైదరాబాదు పరిసర ప్రాంతాలన్నీకూడా చుట్టబెట్టివచ్చినట్లు తెలిసింది.

 

మహేష్ బాబుతో తీసిన ‘బిజినెస్ మ్యాన్’ ఊహించినంత బిజినెస్ చేయకపోయినా పరువాలేదనిపించింది. అందుకే, పూరి జగన్నాథ్ ఈ సినిమాని తమ కేరీర్లోనే పెద్ద హిట్టుగా మలచాలని పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే విదంగా బాక్స్ఆఫీసు వద్ద నీరసపడిన ‘జులాయి’ అర్జున్ కూడా మరో పెద్ద హిట్ట్ పట్టాలనే పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమయినప్పటికీ, పూరి, అల్లుఅర్జున్ కాంబినేషన్ అంటే వారి అభిమానులలో అంచనాలు వారి ఊహిస్తున్నదానికన్నా కొంచెం ఎక్కువే ఉంటాయి అని వారికి తెలుసు. ఈ సినిమాలో అందాలభామలు అమలాపాల్ మరియు కేతరేయిన్ అల్లుఅర్జున్తో జత కట్టి అలరించబోతున్నారు. డిసెంబర్ 10వ తేదిన ఈసినిమా సెట్స్ మీదకి వెళ్ళవచ్చునని నిర్మాత బండ్ల గణేష్ తెలియజేసారు. సినిమాకి సంబంధించి పూర్తీ వివరాలను త్వరలో తెలియజేస్తానన్నారు.

Teluguone gnews banner