రామ్ చరణ్ ‘నాయక్’ ఆడియో రిలీజ్ కు ఎన్టీఆర్ ?
posted on Dec 9, 2012 @ 4:09PM
టాలీవుడ్ లో ఇద్దరు టాప్ హీరోలు ఓల్డ్ ట్రెడిషన్ ను ఫాలో చేయనున్నారు. తమ మధ్య ఉన్న ఇగో ఉందన్న వాదనలకు శుభం కార్డు వేయనున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఒకే వేదికపై కనిపించనున్నారు. డిసెంబర్ 15 న నెక్లెస్ రోడ్డులని పీపుల్స్ ప్లాజా దద్దరిల్లబోతుంది. డిసెంబర్ 15 న జరగనున్న నాయక్ ఆడియో విడుదల కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ హాజరవుతాడని అంటున్నారు.
ఇందుకు ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయి. దర్శకుడు వివి వినాయక్ జూనియర్ కు బాగా సన్నిహితుడిగా గుర్తింపు ఉన్నవాడు, ఇప్పుడు చరణ్ తో సినిమా చేస్తున్నాడు! ప్రస్తుతం వినాయక్ కు కూడా మంచి హిట్ అవసరం ఉంది. కాబట్టి ఈ సినిమా విషయంలో మరింత హైప్ పెంచడానికి ఆడియో విడుదలకు జూనియర్ కు ఆహ్వానం పలకవచ్చు అంటున్నారు! ఇక ప్రస్తుతం చరణ్ , తారక్ లు ఇద్దరూ ఆర్ఎఫ్ సీలోనే గడుపుతున్నారు. ఎన్టీఆర్ ‘బాద్ షా’ విషయంలోనూ, చరణ్ ‘నాయక్’ విషయంలోనూ ఆర్ ఎఫ్ సీలో యాక్షన్ సీక్వెన్సుల చిత్రీకరణ లో బిజీగా ఉన్నారు. ఖాళీ సమయాల్లో వీరిద్దరూ సరదగా మాట్లాడుకుంటున్నారని అంటున్నారు.
ఈ వార్త విని ఇరువురి ఫ్యాన్స్ లో ఆనందాలు రెట్టింపయ్యాయి. టాప్ హీరోలు ఒకే వేదికపై కనిపించను౦డడంతో వారి ఆనందాలకు హద్దులు లేకుండా పోయాయి.