ధనుష్, నయనతార హాట్ ఐటెమ్ సాంగ్
posted on Dec 11, 2012 @ 9:50AM
ప్రభుదేవాతో ప్రేమాయణం ముగించిన తరువాత నయనతారకు ఆఫర్లు మీద ఆఫర్లు వస్తున్నాయి. రీసెంట్ గా రాణాతో 'కృష్ణం వందే జగద్గురుమ్' లో కనిపించిన ఈ అందాల బొమ్మ...త్వరలో ఓ ఐటెం సాంగ్ చేయనుంది. తమిళ్ హీరో ధనుష్ నిర్మిస్తున్న సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
శివ కార్తీకేయన్, ప్రియా ఆనంద్ జంటగా ధనుష్ నిర్మిస్తున్న "ఎదిర్ నీచల్" సినిమాలో నయనతార హాట్ ఐటెం సాంగ్ చేస్తుంది. కొలవెరి పాటకు సంగీతం సమకూర్చిన అదే గ్యాంగ్‌నే ఎదిర్ నీచల్ చిత్రం బరిలోకి ధనుష్ దింపనున్నారు. నయనతార చేయనున్న ఐటెం సాంగ్ ను ధనుష్ స్వయంగా రాసి, పాడనున్నారు. ఈ పాట కూడా మరో "కొలవెరి"కావాలని ఆశిద్దాం.