తెల్లవారికి చెప్పమంది బాయ్ బాయ్....

తెల్లవారికి చెప్పమంది బాయ్ బాయ్.... ఆమెవరో కాదండీ ఝాన్సీ లక్ష్మీబాయి.... అంటూ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ప్రతీ భారతీయుడు ఆమెను తలుచుకున్నారు. అంతటి వీర నారి ఆమె. బ్రిటీష్ వారిపై భారతీయుల పోరాట స్ఫూర్తికి...అక్షరాల ఆమె మూర్తి... వారణాశిలో మోరాపంత్ ధాంబే గారికి జన్మించారు. మణికర్ణిక అనేది ఆమె చిన్ననాటి పేరట. అప్పట్లో చిన్న మరాఠా సంస్ధానమైన ఝాన్సీ పరిపాలకుడు రాజా గంగాధరరావుకు ఆమెనిచ్చి వివాహం చేశారు. పెళ్ళయిన తర్వాత ఆమె లక్ష్మీబాయిగా పేరుపొందారు. వారసులెవ్వరూ లేకుండానే గంగాధరరావు మరణించారట. చనిపోవటానికి ముందు దామోదర్ ను ఆయన దత్తత తీసుకున్నారు.  అప్పట్లో లార్డ్ డల్ హౌసీ బ్రిటిష్ గవర్నర్ జనరల్ గా ఉండేవారు. దామోదర్ ను చట్టబద్ధమైన వారసుడిగా, లక్ష్మీబాయిని రాజప్రతినిధిగా అంగీకరించడానికి డల్ హౌస్ నిరాకరించారు. దాంతో గొడవ మొదలైంది. ప్రతిఘటనలు, నిరసనలు ఎదురైనప్పటికీ ఝాన్సీ లక్ష్మీభాయ్ కి అయిదువేల రూపాలయ చిన్నమొత్తాన్ని భరణంగా ఇవ్వసాగారు. అయితే ఈ అగౌరవాన్ని, పరాయివారికి లోబడి ఉండడాన్ని రాణీ ఝాన్సీ లక్ష్మీభాయ్ జీర్ణించుకోలేకపోయారు. సంస్ధానాన్ని వదిలిపెట్టకూడదనుకున్నారు.  అంతే ఆమె వారి మీద 1857 మే నెలలో తిరుగుబాటు చేశారు. ఝాన్సీ సంస్ధానమంతా రాణీ లక్ష్మీబాయిదే అధికారమని ప్రకటించారు. బ్రిటిష్ సేన దండయాత్రకుదిగితే  వారిని ఎదుర్కొని... గ్వాలియర్ కోటను లక్ష్మీబాయి తన అధీనంలోకి తీసుకుంది. అది చూసి గ్వాలియర్ మహారాజు కోట వదిలి పరిగెత్తాడు. ఆయన బలగాల్లో అత్యధికశాతం లక్ష్మీబాయి పక్షం వచ్చేసాయి. దెబ్బతిన్న బ్రిటిష్ వారు గ్వాలియర్ కోట మీద ఒక్కసారి దాడి చేశారు. లక్ష్మీ బాయ్ తీవ్రపోరాటం చేసినప్పటికీ ఆపోరులో మరణించింది. ఆ విధంగా తన ఇంటికి సుదూరప్రాంతంలో రాని అశువులు బాసింది. కానీ బ్రిటిష్ వారి మీద ఝాన్సీ లక్ష్మీ భాయి చూపిన ధైర్యసాహసాలు బలపరాక్రమాలు, సామర్ధ్యం భారతీయులెవ్వరూ ఎప్పటికీ మరిచిపోరు. ఆమె చిరస్మరణీయురాలు.  

పని మధ్యలో ఫేస్‌బుక్‌ చూస్తున్నారా!

  సోషల్‌ మీడియా ఒక వ్యసనం. కాకపోతే అది హద్దుల్లో ఉన్నంతవరకూ చాలా ఉపయోగం అనుకుంటూ ఉంటాము. అందుకే ఎంత పనిలో ఉన్నా మధ్యమధ్యలో ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, వాట్సాప్ లాంటి అకౌంట్లను పలకరిస్తుంటాం. ఇలా పని మధ్యలో వాటిని చూడటం వల్ల మనం రిలాక్స్ అవుతామన్నది మన ఉద్దేశం. ఇందులో నిజమెంత? ఒక సమయంలో ఒకే పని మీదే దృష్టి పెట్టినప్పుడు, మన మెదడు ఏకాగ్రతతో పనిచేస్తుంది. అలాకాకుండా ఏకకాలంలో నాలుగు రకాల పనుల మీదా దృష్టి పెట్టినప్పుడు దాదాపు 40 శాతం తక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ విషయాన్నే మరోసారి రుజువుచేసే ప్రయత్నం చేశారు పరిశోధకులు. ఇందుకోసం వారు ఓ నాలుగు సినిమాలని 50 సెకన్ల పాటు ముక్కలు ముక్కలుగా కత్తిరించారు. ఆ ముక్కల్ని కలగాపులగం చేసి జనాలకి చూపించారు. ఇలా చూస్తున్న సమయంలో వారి మెదడు ఎలా పనిచేస్తుందో స్కాన్ చేశారు. పరిశోధనలో రెండో దశలో సినిమాలని మరీ 50 సెకన్ల పాటు కాకుండా కనీసం 6.5 నిమిషాల నిడివి ఉండేట్లు కత్తిరించారు. వీటిని కూడా కలగాపులగం చేసి జనాలకి చూపించారు. 50 సెకన్ల ముక్కలు చూసినప్పటికంటే 6.5 నిమిషాల వీడియోలను చూసినప్పుడు ప్రేక్షకుల మెదడు సజావుగా పనిచేస్తున్నట్లు తేలింది. మెదడులో cerebellum వంటి భాగాలు ముక్కలు ముక్కలుగా చూసిన విషయాలను ఒకే ప్రవాహంలా (sequence) అల్లుకునే ప్రయత్నం చేస్తాయి. ఆ సీక్వెన్స్‌ని మాటిమాటికీ గజిబిజి చేస్తుంటే మెదడు మీద భారం తప్పదు. సాధారణంగా మనం నాలుగు రకాల పనులని ఒకేసారి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాము. దీని వల్ల సమయం కలిసి వచ్చినట్లు కనిపించిన్పటికీ... ఇలాంటి మల్టీ టాస్కింగ్‌ వల్ల నిజానికి పనులు మరింత ఆలస్యంగానూ, అసంపూర్ణంగానూ సాగుతాయట. ఈ సూత్రం సోషల్‌ మీడియాకు మరింత బాగా వర్తిస్తుంది. ఒకసారి ఏ ఫేస్‌బుక్కో ఓపెన్‌ చేశామనుకోండి.. అందులో ఒకరు ఏదో వార్తని పోస్ట్‌ చేస్తారు, ఇంకొకరు ఆట ఆడమని పిలుస్తారు, మరొకరు ఏదో పాటని అప్‌లోడ్‌ చేస్తారు... ఇలా రకరకాల పోస్టులు చూసుకుంటే వెళ్లేకొద్దీ మెదడు గజిబిజిగా మారిపోతుంది. పైగా మనం చేసే పని ఆపి మరి ఈ పోస్టులు చూడటం మొదలుపెడితే... అసలు పని మీద ఏకాగ్రత చెదిరిపోతుంది.   - నిర్జర.

విజయమే ప్రతీకారానికి సమాధానం

ఉపకారికి నుపకారము విపరీతముగాదు సేయ వివరింపంగా నపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ! అన్న సుమతీ శతకంలోని పద్యం చిన్నప్పుడు మనం చదివాం. ఈ పద్యం అర్థం  మేలు చేసిన వానికి మేలు చేయుట గొప్ప కాదు. హాని చేసిన వానికి అంతకుముందు వాడు చేసినదోషాలను లెక్కచేయక ఉపకారం చేసేవాడే నేర్పరి అని ఈ పద్యానికి అర్థం. ఈ కాలంలో అలాంటి వారు ఎవరుంటారు అని అనుకుంటాం. కానీ, మానవత్వం, మంచితనం ఉన్నవారు ఏ కాలంలోనైనా ఉంటారు. అయితే వారి సంఖ్య పరిమతంగా ఉండోచ్చు. ఎందుకంటే ఇది కలికాలం కదా.  సరే ఇక అసలు విషయానికి వస్తే..   వ్యాపార సంస్థల మధ్య పోటీ ఉంటుంది. కొన్నిసార్లు అది కాస్త పెరిగి ప్రతీకారంగా మారుతుంది. అయితే వ్యాపార ఒప్పందం కోసం పిలిచి అవమానపరిచిన ఒక సంస్థతో తిరిగి తొమ్మిదేళ్ల తర్వాత నష్టాల్లో ఉన్న ఆ సంస్థ ఉత్పత్తులను కొనుగోలు చేసి తన ఔదార్యం చాటుకున్న పారిశ్రామిక వేత్త రతన్ టాటా.  ప్రతీకారం అంటే అందనంత ఎత్తుకు ఎదగడమే అని కొత్త అర్థం చెప్పారు. ఎదుటివారిపై పగ సాధించడం అంటే విజయం సాధించడమే అని నిరూపించారు. మేలు చేసిన వానికి మేలు చేయుట గొప్ప కాదు. హాని చేసిన వానికి అంతకుముందు వాడు చేసిన దోషాలను లెక్కచేయక ఉపకారం చేసేవాడే నేర్పరి అన్న సుమతీ శతకంలోని నీతిని అక్షరాల పాటించారు.    రతన్ టాటా భారతీయ వ్యాపార సామ్రాజ్యంలో పరిచయం అవసరం లేని పేరు. జంషెడ్‌జీ నుసెర్వాన్‌జీ టాటా వంశంలో జన్మించారు. 1962లో టాటా స్టీల్ జంషెడ్ పూర్ ప్లాంట్‌లో అప్రెంటిస్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. 1868లో స్థాపించబడిన టాటా గ్రూప్ కు ఐదో చైర్మన్ గా  1991లో  జెఆర్‌డి టాటా నుంచి బాధ్య తలను స్వీకరించారు. అప్పట్లో 10 వేల కోట్ల రూపాయల టర్నోవర్ గల టాటా గ్రూప్ ను అంతర్జాతీయ కార్పోరేట్ సంస్థ స్థాయికి తీసుకువెళ్లారు. ఈ సంస్థ టర్నోవర్ నేడు 100 బిలియన్ డాలర్లకు పెరిగింది. టర్నోవర్‌లో 58 శాతం ఎగుమతుల ద్వారానే వస్తోంది. రతన్ టాటా నిరంతరాయంగా, అవిశ్రాంతంగా చేసిన కృషి ఫలితమే ఇది. టాటా గ్రూపును ఆయన విదేశాలకు కూడా విస్తరింపజేశారు.   టాటా గ్రూప్‌లో మొత్తం 32 పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. వీటి ఉమ్మడి మార్కెట్ క్యాప్ 8,882 కోట్ల డాలర్లు. మొత్తం షేర్ హోల్డర్ల సంఖ్య 38 లక్షలు. ఉద్యోగుల సంఖ్య 4.50,000. లిస్టెడ్ కంపెనీల్లో టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కన్సల్టెన్సీ, టాటా పవర్, టాటా కెమికల్, టాటా గ్లోబల్ బేవరేజెస్, టాటా టెలీ, టైటాన్, టాటా కమ్యూనికేషన్స్, ఇండియా హోటల్స్ వంటి టాప్ కంపెనీలు ఉన్నాయి. గ్రూప్ వ్యాపారం 80 దేశాలకు విస్తరించి ఉంది. 85 దేశాలకు టాటా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి.   టాటా గ్రూప్ ఛైర్మన్ గా రెండు దశాబ్దాలకు పైగా పనిచేసిన ఆయనలోని వ్యాపార దక్షతకు, మానవీయతకు దర్శణం ఫోర్డ్ సంస్థతో జరిగిన ఒప్పందం. స్టీల్, కెమికల్, మోటార్స్ ఇలా అనేక ఉత్పత్తులను దేశీయంగా తయారుచేస్తూ లక్షలాది మందికి ఉపాధి కల్పించిన  ఘనత రతన్ టాటాదే. భారతదేశంలో ట్రక్ ల తయారీలో అగ్రగామి టాటా మోటర్స్. వస్తువుల రవాణాకే పరిమితం కాకుండా  కార్లను కూడా తయారు చేయాలని సంకల్పించారు. అందుకు ఫలితంగా 1998 చివరి నాటికి టాటా ఇండికా అందుబాటులోకి తీసుకువచ్చారు. టాటా ఇండికా మొదటి స్వదేశీ మోడ్రన్ కారు. ఇది రతన్ టాటా డ్రీమ్ ప్రాజెక్ట్. దీనిని నిజం చేయడం కోసం ఆయన రాత్రింబవళ్ళు కష్టపడ్డారు. ఫలితంగా టాటా ఇండికా మార్కెట్ లోకి విడుదల చేశారు.  ఇది భారతీయ ఆటోమొబైల్ రంగంలో ఒక విప్లవాత్మక అంశంగా మారింది. అయితే  కార్ల అమ్మకాలు ఆయన అంచనాకు తగ్గట్టుగా జరగలేదు. దాంతో ఈ ప్రాజెక్ట్ ను వేరే మోటార్ కంపెనీ అమ్మాలని టాటా గ్రూప్ నిర్ణయించింది. 1999లో ఫోర్ట్ కంపెనీ టాటా ఇండియా ప్రాజెక్ట్ కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరిచింది. ముంబాయిలోని టాటా గ్రూప్ కార్యాలయంలో చర్చలు జరిపిన తర్వాత డెట్రాయిట్ లోని తమ ప్రధానకార్యాలయానికి టాటాగ్రూప్ చైర్మన్, ఇతర సభ్యులను ఆహ్వానించారు. రతన్ టాటా తన బృందంతో డెట్రాయిట్ లోని ఫోర్డ్ ఆఫీస్ కు చేరుకున్నారు. మూడు గంటల పాటు అక్కడ నిరీక్షించిన తర్వాత మీటింగ్ ఏర్పాటు చేసిన ఫోర్డ్ కంపెనీ ఛైర్మన్ బిల్ ఫోర్డ్ మీకు ఎం తెలుసని ప్యాసింజర్ కార్ల ఉత్పత్తి ప్రారంభించారు. మీ కార్లను కొలుగోలు చేసి మీకు పెద్ద సహాయం చేస్తున్నాం అంటూ రతన్ టాటాతో వ్యాఖ్యానిస్తాడు. ఆ మాటలను అవమానకరంగా భావించిన రతన్ తమ కార్ల ప్రాజెక్టును అమ్మడం లేదని చెప్పి,  ఒప్పందం చేసుకోకుండానే తన బృందంతో తిరిగి ముంబాయి చేరుకుంటారు. అదే రోజు కార్ల తయారీ ప్రాజెక్ట్ ను అమ్మకూడదని నిర్ణయించుకుని తన పూర్తి దృష్టిని కార్ల పరిశ్రమపై పెట్టారు. ఆ తర్వాత కొద్దికాలంలోనే ప్రపంచంలోని  ఆటోమొబైల్ రంగంలో టాటా కార్స్ మంచి పేరు సాధించాకున్నాయి.   2008లో టాటా మోటర్స్ బెస్ట్ సెల్లింగ్ కంపెనీగా మార్కెట్ లో నిలిచింది. అదే సమయంలో ఫోర్డ్ కంపెనీ నష్టాల బాటలో పడింది. ఫోర్డ్ కార్ల అమ్మకాలు బాగా తగ్గిపోవడంతో నష్టాల ఊబిలో చిక్కిన ఆ సంస్థ కార్లు జాగ్వార్, ల్యాండ్ రోవర్ కొనుగోలు చేస్తామని ఫోర్డ్ సంస్థకు ఆఫర్ ఇచ్చారు. ఈ రెండు కార్ల ప్రాజెక్ట్ ను అమ్మడం ద్వారా తమ సంస్థ నష్టాలను తగ్గించుకునే ప్రయత్నంలో ఫోర్డ్ చైర్మన్ బిల్ ఫోర్డ్ తమ బృందంలో ముంబాయిలోని టాటా కార్స్ ఆఫీస్ కు చేరుకున్నారు. మా రెండు కార్ల ప్రాజెక్ట్ ను కొలుగోలు చేయడం ద్వారా మీరు మాకు పెద్ద సహాయం చేస్తున్నారు అంటూ బిల్ ఫోర్డ్ రతన్ టాటాకు ధన్యవాదాలు చెప్పాడు. ఫోర్డ్ కంపెనీ ఐకాన్ గా భావించే జాగ్వార్ ల్యాండ్-రోవర్ బ్రాండ్‌లను 2.3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు రతన్ టాటా. బిల్ ఫోర్డ్ మాదిరిగా అవమానకరంగా మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ  రతన్ టాటా హుందాగానే వ్యవహరించారు. తొమ్మిది సంవత్సరాల తక్కువ సమయంలోనే ఆటోమొబైల్ రంగంలో తన సత్తా చాటి ఫోర్డ్ లాంటి సంస్థను నష్టాల బారిన నుంచి రక్షించిన ఘనత రతన్ టాటాది. ఈ సంఘటన ఆయనలోని మానవత్వానికి, దార్శనికతకు దర్పణం పట్టే అనేక సంఘటనల్లో ఒకటి మాత్రమే.   భారతదేశంలో ఎక్కువ మంది ఇష్టపడుతున్న కార్లలో ఈ రెండు బ్రాండ్ కార్లు కూడా చేరాయి. ప్రపంచంలోని ఆటోమొబైల్ రంగంలో టాటా మోటార్స్ ప్రముఖ సంస్థగా మారింది. మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే ధరలో నానో కార్లను తయారు చేసిన టాటా గ్రూప్ తమ లాభాల్లో 66శాతం ఛారిటీ కార్యక్రమాలకే వినియోగిస్తోంది. కరోనా మహమ్మారి నియంత్రణ చర్యలకు 1500కోట్ల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించింది.

శ్రమ విలువ...

అతనో నిరుద్యోగి. జీవితంలో ఎన్నోకష్టనష్టాలను చూసిచూసి ఎలాగొలా ఓ డిగ్రీని సంపాదించుకున్నవాడు. ఇంతగా కష్టపడిన తరువాత బతుకులో నిలదొక్కుకునేందుకు ఏదన్నా ఆసరా వస్తుందనే ఆశతో బతుకుతున్నవాడు. అలాంటి నిరుద్యోగి ఓ కంపెనీలో ఉద్యోగానికని బయల్దేరాడు. అవడానికి నిరుద్యోగే అయినా అతని ప్రతిభలో ఎలాంటి లోటూ లేదు. అందుకనే కంపెనీ వాళ్లు పెట్టిన ప్రతి పరీక్షలోనూ సునాయాసంగా నెగ్గాడు. ఆఖరి ఘట్టమైన ఇంటర్వ్యూకి ఎంపికైన అతికొద్ది మందిలో నిలిచాడు.   నిరుద్యోగి ఇంటర్వ్యూ గదిలోకి అడుగుపెట్టగానే ఎదురుగుండా ఉన్న కుషన్‌ కుర్చీలో ఓ ముసలాయన కూర్చుని కనిపించాడు. ఆయన నిరుద్యోగి సర్టిఫికెట్లన్నీ పరిశీలిస్తూ- ‘మీ నాన్నగారు ఏం చేస్తుంటారు?’ అని అడిగాడు. ‘నా చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారండీ. మా అమ్మ ఎంతో కష్టపడి నన్ను చదివించింది,’ అంటూ చెప్పుకొచ్చాడు నిరుద్యోగి. ‘ఓహ్‌! మీ అమ్మగారు ఏం చేస్తుంటారు?’ ఆసక్తిగా అడిగాడు పెద్దాయన. ‘మా అమ్మ బట్టలు కుడుతూ ఉంటుందండి. అలాగే నన్ను ఇంతటివాడిని చేసింది,’ అంటూ చెప్పుకొచ్చాడు నిరుద్యోగి. ‘అవునా. గొప్ప విషయమే! ఏదీ నీ చేతులని ఓసారి చూపించు,’ అన్నాడు పెద్దాయన.   పెద్దాయన మాటల్లోని ఆంతర్యం నిరుద్యోగికి అర్థం కాలేదు. అయినా తన చేతులని ఆయన ముందర ఉంచాడు. అతని చేతులు చాలా మృదువుగా ఉన్నాయి. దూదిలాగా మెత్తగా, తెల్లగా ఉన్నాయి. ‘అదేంటీ! నువ్వెప్పుడూ మీ అమ్మగారి పనిలో సాయపడినట్లు లేదే!’ నిరుద్యోగి మృదువైన చేతులని చూసి అడిగాడు పెద్దాయన.   అప్పుడు అర్థమైంది నిరుద్యోగికి, పెద్దాయన చేతులని ఎందుకు చూపించమన్నాడు. ‘లేదండీ! మా అమ్మకి ఎప్పుడూ సాయపడేవాడిని కాదు. నా చదువులోనే కాలం గడిచిపోయింది. ఎప్పుడన్నా తనకి సాయపడతానని ముందుకు వచ్చినా కూడా ఆమె ఒప్పుకొనేది కాదు,’ అంటూ సిగ్గుపడుతూ చెప్పాడు నిరుద్యోగి.   ‘సరే ఒక చిన్న పని చేయి. ఇవాళ ఇంటికి వెళ్లినవెంటనే మీ అమ్మగారి చేతులు శుభ్రంగా కడుగు. ఆ పని చేశాక నీకెలా అనిపించిందో రేపు వచ్చి నాతో చెప్పు,’ అన్నాడు పెద్దాయన.   పెద్దాయన మాటలకి నిరుద్యోగి అయోమయంలో పడిపోయాడు. ఆ మాటల వెనుక ఆంతర్యం ఏమిటో తనకి ఆర్థం కాలేదు. అయినా తప్పదు కాబట్టి ఆ రోజు ఇంటికి వెళ్లిన వెంటనే తన తల్లి దగ్గర కూర్చున్నాడు. ‘ఇవాళ ఓసారి నీ చేతులని శుభ్రంగా కడగాలని ఉందమ్మా!’ అన్నాడు. పిల్లవాడి చర్యలో ఆంతర్యం అర్థం కాకపోయినా, అతని మీద ప్రేమతో ఊరుకుంది తల్లి. వెంటనే తల్లి చేతులను తన చేతులలోకి తీసుకుని చూసుకున్నాడు నిరుద్యోగి. ఆశ్చర్యం! ఆ చేతులు తన చేతుల్లాగా మృదువుగా లేవు, తెల్లగానూ లేవు. ఆ చేతుల నిండా సూదిగాట్లు! బట్టలు కుట్టీకుట్టీ ఆ చేతులు బండబారిపోయాయి. నిలువెల్లా గీతలతో రాటుదేలిపోయాయి. వాటిని ఎంతగా కడిగినా కూడా ఆ గీతలు కొంచెం కూడా చెరగలేదు.   తల్లి చేతులని చూసిన నిరుద్యోగి నోట మాట రాలేదు. ఆ మర్నాడు అతను ఆ పెద్దాయన ఆఫీసులోకి అడుగుపట్టే వరకు కూడా అతని కళ్లు చెమ్మగిల్లే ఉన్నాయి. ‘ఏమైంది అలా ఉన్నావు. నేను చెప్పిన పని చేశావా!’ అని అడిగాడు పెద్దాయన. ‘చేశాను సర్‌,’ అన్నాడు నిరుద్యోగి సిగ్గుపడుతూ. ‘నీ తల్లి చేతులని చూసినప్పుడు నీకు ఏమర్థమయ్యింది!’ అని అడిగాడు పెద్దాయన.   ‘ఇల్లు గడిచేందుకు నా తల్లి తన వంతు బాధ్యతగా కష్టపడుతోంది అనుకునేవాడిని కానీ, ఆ బాధ్యతని నెరవేర్చడంలో ఆమె శ్రమ ఏపాటిదో గ్రహించలేకపోయాను. తన జీవితం ఎంతగా రాటుదేలిపోయిందో నిన్నటివరకూ నాకు అర్థం కానే లేదు. నేను ఎంత ఎదిగినా కూడా తన త్యాగాన్ని మర్చిపోలేదు. ఆమెని ఎంత గొప్పగా చూసుకున్నా కూడా ఆమె పట్ల మేలుని తీర్చుకోలేను,’ అని చెప్పుకొచ్చాడు నిరుద్యోగి.   ‘నీకు కష్టం విలువ, కృతజ్ఞత విలువ తెలియాలనే ఆ పని చెప్పాను. నీలో స్వార్థముంటే కనుక నీ తల్లి త్యాగం ఎప్పటికీ అర్థమయ్యేది కాదు. నీ తల్లే కాదు... ఈ ప్రపంచంలో శ్రామికులంతా తమ కుటుంబం ముందుకు సాగేందుకు శ్రమిస్తూ రాటుదేలిపోతున్నారు. నువ్వు ఉద్యోగంలో ఎంత ఎదిగినా కూడా వాళ్ల శ్రమని గౌరవించే మనస్తత్వం ఉండాలి. ఆ తత్వం నీలో ఉందని అర్థమైంది. మున్ముందు దానిని నిలుపుకుంటావన్న ఆశా ఉంది. నువ్వు ఈ ఉద్యోగానికి ఎంపికయ్యావు,’ అంటూ చిరునవ్వుతో చెప్పాడు పెద్దాయన. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.

జీవితమనే తుపానులో భయమెందుకు?

ఆ అమ్మాయిది అందమైన మనసు. ఆ అబ్బాయిది వెనుదిరకని వ్యక్తిత్వం. వాళ్లిద్దిరికీ మధ్య ప్రేమ చిగురించింది. అదో అందమైన ప్రేమకథ! ఆ ప్రేమకి పెద్దలు కూడా ఒప్పుకోవడంతో ఆ కథ సుఖాంతం అయ్యింది. పెళ్లయిన కొత్తజంత విహారయాత్రకి బయల్దేరారు. దారిలో నది అడ్డువస్తే, దానిని దాటేందుకు చిన్న నావని తీసుకుని వెళ్లారు. నావ నది మధ్యకి రాగానే అప్పటిదాకా ఆహ్లాదంగా ఉన్న వాతావరణం కాస్తా భీకరంగా మారిపోయింది. సన్నటి చినుకులతో మొదలై పెనుతుపాను చెలరేగింది. అంతటి తుపానుకి నావ అల్లల్లాడిపోవడం మొదలుపెట్టింది. ఎటు చూసినా కారుమబ్బులు, అన్ని వైపుల నుంచీ సూదుల్లా పొడుస్తున్న చినుకులు. వాటిని చూసి యువతి చిగురుటాకులా వణికిపోయింది. కానీ యువకుడిలో మాత్రం ఎలాంటి కలవరమూ లేదు. పైగా ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నాడేమో అన్నంతగా అతని మోములో చిరునవ్వు చెక్కుచెదరడం లేదు.   యువకునిలోని నిశ్చలత్వం చూసి అతని ప్రేయసికి ఒళ్లుమండిపోయింది. ‘ఇంత ప్రమాదంలో కూడా ఇంత నిబ్బరంగా ఎలా ఉన్నావు? నీకేమన్నా పిచ్చి పట్టిందా! బెల్లం కొట్టినరాయిలా కదలకుండా కూర్చుండిపోతావేంటి?’ అంటూ అతన్ని నిందించడం మొదలుపెట్టింది. ప్రేయసి మాటలు విన్న ప్రియుడు ఒక్క ఉదుటున తన ఒరలోంచి కత్తి తీసి ఆమె గొంతు మీద పెట్టాడు. ‘నా చేతిలో ఇంత పదునైన కత్తి నీ గొంతు మీద ఉంటే... నీకు భయం వేస్తోందా!’ అని అడిగాడు. దానికి ప్రియురాలు ‘ఇన్నిరోజులుగా నిన్ను చూస్తున్నాను. నీ స్వభావం ఏమిటో నాకు తెలియదా! చూస్తూ చూస్తూ నా గొంతు కోస్తావని ఎలా అనుకుంటాను. నీ చేతిలో ఎంత ప్రమాదకరమైన ఆయుధం ఉన్నా సరే. అది నా గొంతు మీద ఉన్నా సరే. నువ్వు మాత్రం నాకు హాని తలపెట్టవనే నమ్మకం నాకుంది,’ అంది.   ‘ఈ తుపాను కూడా ఆ భగవంతుని చేతిలో ఆయుధంలాంటిదే. ఆయన నాకు హాని తలపెట్టడనే నా నమ్మకం. ఒకవేళ నిజంగానే మన ఆయుర్దాయం ఇంతటితో సరి అని ఆయన తలిస్తే మాత్రం, ఇప్పుడు మనమేం చేయగలం! మన నావ నది మధ్యలో ఉంది. మన ఇద్దరికీ ఈత రాదు. చుట్టూ ఆదుకునే వారు లేరు. ఈ ఆపద నుంచి ఎలాగైనా బయటపడితే బాగుండు అని కోరుకుంటూ కూర్చోవడం తప్ప మనం చేయగలిగిందేమీ లేదు. ఇలాంటి సమయంలో కంగార పడి అటూఇటూ తిరగడం వల్ల నావ కాస్తా బోల్తా పడక మానదు. అందుకని ప్రశాంతంగా కూర్చోవడాన్ని మించి తెలివైన పని మరొకటి ఉందంటావా?’ అని అడిగాడు ఆ యువకుడు. ఆ మాటలకి అతని ప్రియురాలి వద్ద సమాధానం లేకపోయింది.   కాసేపటికి తుపాను ఆగిపోయిన. దంపతులు ఇద్దరూ హాయిగా ఆవలి తీరానికి చేరుకున్నారు. కానీ ఆ వీరుడు చెప్పిన మాటలని మాత్రం ఆ యువతి ఎప్పటికీ మర్చిపోలేదు. జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు వస్తూ ఉంటాయి. వాటి నుంచి బయటపడేందుకు చేయగలిగిన ప్రయత్నం చేయడం, ఫలితాన్ని ఆ ప్రకృతి మీద వదిలి నిబ్బరంగా ముందుకు సాగిపోవడం! ఆనాడు తన వీరుడు చెప్పిన ఈ సూత్రాన్ని జీవితాంతమూ ఆ యువతి మర్చిపోలేదు. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.  

స్వర్గానికి ద్వారాలు ఎక్కడ ఉన్నాయి?

ఓ గురువుగారు సీతాపురం అనే పల్లెటూరి గుండా వెళ్తున్నారు. ఆ పల్లెటూరు అలాంటి ఇలాంటిది కాదు. అందులో అందరూ వీరులే! రాజుగారికి ఉన్న సైన్యంలో సగభాగం అక్కడి నుంచే వస్తుంటారు. సాక్షాత్తూ రాజుగారి సైన్యాధ్యక్షుడు కూడా అక్కడి వాడే. మల్లవిద్య, కర్రసాము, కత్తియుద్ధం… ఇలా ఎలాంటి యుద్ధవిద్యలో అయినా సరే, ఆ ఊరి జనానికి సాటి లేదు. అలాంటి సీతాపురం గుండా గురువుగారు వెళ్తున్నారు. అదే సమయంలో వారికి ఆ ఊరిలోనే విడిది చేసి ఉన్న సైన్యాధ్యక్షుడు ఎదురుపడ్డాడు. గురువుగారిని చూసిన సైన్యాధ్యక్షుడు `గురువుగారూ మీ గురించి చాలా విన్నాను. ఇవాళ మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఎన్నాళ్ల నుంచో ఒక అనుమానం పీడిస్తోంది. దయచేసి నివృత్తి చేయండి` అని అడిగాడు. `నాకు చేతనైతే తప్పక నివృత్తి చేస్తాను. ఏమిటా అనుమానం` అన్నారు గురువుగారు. `మన పెద్దవాళ్లు ఎంతసేపూ స్వర్గం, నరకం అని ఊదరగొడుతుంటారు కదా! నిజంగా స్వర్గం, నరకం అనేవి ఉన్నాయంటారా? ఒకవేళ ఉంటే వాటికి ద్వారాలు ఎక్కడ ఉన్నాయి?` అని అడిగాడు. `ఇంత మంచి ప్రశ్న అడిగావు. ఎవరు నువ్వు` అని అడిగారు గురువుగారు. `నేను ఈ రాజ్యానికే సైన్యాధ్యక్షుడిని. రాజుగారి విజయాలన్నింటికీ కారణం నేనే!` అని గర్వంగా బదులిచ్చాడు సైన్యాధ్యక్షుడు. `అబ్బే నిన్ను చూస్తే సైన్యాధ్యక్షునిలా లేవే. ఎవరో పగటివేషగాడిలా ఉన్నావు. నిన్ను చూస్తే నవ్వు వస్తోంది కానీ భయం వేయడం లేదు` అని ఎగతాళిగా అన్నారు గురువుగారు. `ఎంతమాట! నేను పగటివేషగాడిలా ఉన్నానా! నన్ను చూస్తుంటే నవ్వులాటగా ఉందా! నీ నవ్వుని గొంతులోనే ఆగిపోయేలా చేస్తాను. ఉండు!`అంటూ తన కత్తిని దూసి గురువుగారి కంఠానికి గురిపెట్టాడు సైన్యాధ్యక్షుడు. `ఇదే నాయనా నువ్వు చూడాలనుకున్న నరక ద్వారం. నీ కోపంతోనూ, ఉద్వేగంతోనూ, అహంకారంతోనూ… దాన్ని ఇప్పుడే నువ్వు తెరిచావు` అన్నారు గురువుగారు. గురువుగారి మాటలకు సిగ్గుపడి సైన్యాధ్యక్షుడు తన కత్తిన తీసి ఒరలో ఉంచుకుని బాధగా నిలబడ్డాడు. `ఇప్పుడు నువ్వు స్వర్గంలోకి అడుగుపెట్టావు. నీ ఆలోచనతోనూ, ప్రశాంతతతోనూ, పశ్చాత్తాపంతోనూ స్వర్గపు ద్వారాలను తెరిచావు` అన్నారు గురువుగారు చిరునవ్వుతో! అపై సైన్యాధ్యక్షుడిని చూస్తూ ఇలా అన్నారు `చూశావా! స్వర్గం, నరకం రెండూ నీలోనే ఉన్నాయి. నువ్వు అనాలోచితంగా ప్రవర్తించిన రోజు నరకానికి దారిని తెరుస్తావు. జాగ్రత్తగా, ఖచ్చితంగా ఆలోచించగలిగిన రోజు స్వర్గానికి తలుపులు తీస్తావు. స్వర్గనరకాలు ఎక్కడో కాదు, నీ మనసులోనే ఉన్నాయి.` అంటూ సాగిపోయారు గురువుగారు.

సంతోషం ఎక్కడ ఉంది?

ఒకప్పుడు అందరూ సంతోషంగా ఉండేవారట. ప్రపంచమంతా నిత్యం ఆనందడోలికల్లో తేలిపోతుండేది. సంతోషంగా ఉండీ ఉండీ జనాలకి మొహం మొత్తేసింది. దాని విలువే తెలియకుండా పోయింది. ఎంతటి నీచులైనా, పనికిమాలినవారైనా హాయిగా సంతోషంగా ఉండసాగారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు సృష్టికర్త ఒక సభను ఏర్పాటుచేశాడు. ‘సంతోషం మరీ తేలిగ్గా దొరుకుతోంది. కాబట్టి దానికోసం ప్రజలు తపించిపోయేలా... దాన్ని ఎక్కడన్నా భద్రపరచాలి. ఎక్కడ భద్రపరచాలో మీమీ ఉపాయాలు చెప్పండి,’ అన్నాడు సృష్టికర్త. ‘ఇందులో చెప్పేదేముంది. సంతోషాన్ని సముద్రగర్భంలో దాచిపెడితే సరి,’ అని సూచించాడో దేవత. ‘అబ్బే! మనిషి అసమాన్యుడు. అతను సముద్రగర్భాన్ని సైతం చేరుకోగలడు. మరో మార్గం ఏదన్నా చెప్పండి,’ అని సూచించాడు సృష్టికర్త. ‘హిమాలయ పర్వతాలలోని అడవుల మధ్య ఓ చిన్న పెట్టెలో దాచిపెడితే ఎలా ఉంటుంది,’ అని సూచించాడు మరో దేవత. ‘అహా! మనిషి అక్కడకి కూడా తేలికగా చేరుకోగలడు. మరో మార్గాన్ని సూచించండి,’ అని పెదవి విరిచాడు సృష్టికర్త. ఆ తరువాత చాలా సలహాలే వినిపించాయి. అగ్నిపర్వతంలో దాచమనీ, కొండల కింద పాతిపెట్టమనీ, ఆకాశంలో వేలాడదీయమనీ... ఇలా సంతోషాన్ని దాచేందుకు రకరకాల ఉపాయాలు సూచించారు దేవతలు. కానీ అవేవీ సృష్టికర్తకు తృప్తినివ్వలేదు. చివరికి ఒక యువదేవత లేని నిలబడ్డాడు... ‘మీరంతా ఏమనుకోకపోతే నాది ఒక చిన్న విన్నపం. మనిషి ఈ ప్రపంచాన్నంతా శోధించే ప్రయత్నం చేస్తాడు కానీ తన మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నమే చేయడు. కాబట్టి మనిషి మనసులోనే సంతోషాన్ని దాచిపెట్టేస్తే సరి! అతను ఎప్పటికీ తనలో ఉన్న సంతోషాన్ని కనిపెట్టలేడు,’ అని సూచించాడు. ‘అద్భుతమైన ప్రతిపాదన. నిత్యం భౌతికమైన విషయాలలో మునిగితేలే మనిషి ఎప్పటికీ తనలో ఉన్న సంతోషాన్ని కనిపెట్టలేడు. తన విచక్షణకు విలువనిచ్చేవాడు మాత్రమే తనలోని సంతోషాన్ని పొందగలడు,’ అంటూ దేవతలంతా ఆ ప్రతిపాదనను ఏకాభిప్రాయంతో అంగీకరించారు. అప్పటి నుంచి సంతోషం మన మనసులోనే ఉండిపోయింది. దాని కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నాం. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.  

ఆమె హృదయం సంచిలో ఉంది..

లబ్ డబ్ శబ్దం వింటూ జీవితాన్ని లయబద్ధంగా కొనసాగిస్తాం. మరి ఆ శబ్దం ఆగిపోతే... జీవితం ఆగిపోతుందా.. ఆగిపోదు అని నిరూపిస్తున్నారు సెల్వా హుస్సేన్. 39 ఏళ్ల సెల్వా శరీరం లోపల గుండె లేకపోయినా గుండెధైర్యంతో జీవితాన్ని కొనసాగించవచ్చని కృత్రిమ గుండెను బ్యాగ్ లో మోస్తూ చిరునవ్వుతో ఎందరికో స్ఫూర్తి నిస్తున్నారు. ఆమె ప్రపంచంలోనే కృత్రిమ గుండెతో జీవిస్తున్న రెండవ మహిళ సెల్వా( మొదటి మహిళ కాథ్లీన్ షోర్స్ ) బ్రిటన్ రాజధాని లండన్ లోని ఇల్ఫోర్డ్ లో నివసించే సాధారణ మహిళ సెల్వా హుస్పేన్. భర్త, ఇద్దరు పిల్లలతో సాఫీగా సాగుతున్న ఆమె జీవితంలో పెనుతుఫాన్. చిన్నపాపాయికి ఆరు నెలల వయసు ఉన్నప్పుడు ఆమె అనారోగ్యం బారిన పడ్డారు. ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారింది. ఫ్యామిలీ డాక్టర్ ను కలవడానికి ఇంటి నుంచి కాస్త దూరం నడిచారు. అంతే అడుగు ముందుకు పడలేదు. వెంటనే లండన్‌లోని హేర్‌ఫీల్డ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ఆమెను పరీక్షించి హార్ట్ లో సమస్య ఉందని వెంటనే మరో గుండెను అమర్చాలని చెప్పారు. ఆమె ప్రాణాలు నిలబడాలంటే మరో గుండె కావల్సిందే. అయితే గుండె దాతల కోసం అప్పటికే వందలాది మంది ఎదురుచూస్తున్నారు. సెల్వా పరిస్థితి రోజురోజుకు విషమిస్తోంది. మరో గుండె అనేది సాధ్యమయ్యే విషయంగా కనిపించలేదు. దాంతో కృత్రిమ గుండె అమర్చడానికి డాక్టర్ల బృందం సిద్ధపడింది. 27 జూన్ 2017న హేర్ ఫీల్డ్ సర్జరీ డిపార్ట్ మెంట్ హెడ్ ఆండ్రీ సైమన్, సర్జన్ డయానా గార్సియా సాజ్ ఆధ్వర్యంలో ఆరుగంటల పాటు జరిగిన ఆపరేషన్ లో ఆమె గుండెను తొలగించారు. దాని స్ఠానంలో కృత్రిమ గుండె కవాటాలను ఇంప్లాట్ చేశారు. దానిని పని చేయించే యంత్రాంగాన్ని శరీరం వెలుపల ఏర్పాటు చేశారు.   ఆపరేషన్ తర్వాత నెలరోజుల పాటు సెల్వా ఆసుపత్రిలోనే ఉన్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో నడవడం, మాట్లాడటం, తినడం, తాగటం, కండరాల బలాన్ని పెంపొందించుకోవడం తదితర అంశాల్లో శిక్షణ తీసుకున్నారు. పుట్టుకతో తన శరీరంలో ఉన్న గుండెను ఆసుపత్రిలో వదిలేసి కృత్రిమ గుండెతో ఇంటిదారి పట్టారు. ఆ తర్వాత  భర్త, పిల్లలతో ఆనందంగా జీవిస్తున్నారు. ఆమె గుండె స్థానంలో ఏర్పాటుచేసిన కృత్రిమ గుండె  నిమిషానికి 138 సార్లు కొట్టుకుంటుంది. ఈ హృదయ స్పందనలతో శరీరమంతా రక్త ప్రసరణ జరుగుతుంది. సెల్వాను సజీవంగా ఉంచుతుంది. ఈ గుండెను పనిచేయించే పరికరాన్ని మాత్రం ఎప్పుడు ఆమెతో ఉండేలా బ్యాగ్ లో అమర్చారు.  6.8 కిలోల బరువున్న ఈ బ్యాగ్ ను ఆమె అనుక్షణం తనతో ఉంచుకోవాల్సిందే. ఇందులోని పరికరం రెండు బ్యాటరీలతో ఉంటుంది, ఇది ఎలక్ట్రిక్ మోటారు , పంపు ద్వారా ఆమె శరీరంలో రక్త ప్రసరణ కోసం ఛాతీలోని ప్లాస్టిక్ సంచిలోకి జతచేయబడిన గొట్టాల ద్వారా గాలిని నెట్టివేస్తాయి. ఇందులో బ్యాటరీ ఆగిపోతే కేవలం నిమిషంన్నరలోనే తిరిగి బ్యాటరీ అమర్చాలి. లేకపోతే ఆమె శరీరంలో రక్తప్రసరణ ఆగిపోతుంది. ఆమెతో పాటు భర్త ఉంటూ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటాడు.   జీవితంలో చిన్నచిన్న సమస్యలకే మనం బాధపడిపోతాం. కానీ, శరీరంలో ఎంతో కీలకమైన గుండె లేకపోయినా ఆమె ధైర్యాన్ని కోల్పోలేదు. తన ప్రాణాలను కాపాడే కృత్రిమ గుండెను భుజానికి తగిలించుకుని  చిరునవ్వుతో జీవిస్తున్న సెల్వాకు హాట్సాఫ్..

పసుపు టాక్సీలకి ప్రమాదాలు జరగవు

ఓలాలు, ఉబర్లు వచ్చేసిన తరువాత ఏది కారో, ఏది టాక్సీనో కనుక్కోవడం కష్టమైపోయింది. కానీ ఒకప్పుడు టాక్సీ అంటే స్పష్టంగా పచ్చటి పసుపురంగులోనే ఉండేది. ఇప్పటికీ చాలా దేశాలలో టాక్సీ అంటే అల్లంత దూరాన పసుపు రంగులో కనిపించే వాహనమే! టాక్సీలు పసుపురంగులో ఉండటానికి ప్రత్యేకించిన కారణాలు ఏవీ లేవు. 1907లో టాక్సీ సర్వీసులను ప్రారంభించినప్పుడు, మిగతా వాహనాలకంటే భిన్నంగా కనిపించాలి కాబట్టి... అరుదుగా ఉండే పసుపు రంగుని ఎంచుకున్నారు. రోడ్డు మీద వేగంగా దూసుకుపోయే వాహనాల మధ్య పసుపురంగుని గుర్తించడం నిజంగానే తేలికని కొన్ని అధ్యయనాలు రుజువుచేశాయి.   ఇప్పుడు ఏకంగా పసుపురంగు టాక్సీలకి ప్రమాదాలు కూడా తక్కువ జరుగుతాయంటూ ఓ పరిశోధన నిరూపిస్తోంది. సింగపూర్‌ జాతీయ విశ్వవిద్యాలయంలోని నిపుణులు ఈ పరిశోధన కోసం 16,700 కార్లున్న ఓ టాక్సీ సంస్థను (The Singapore taxi company) ఎన్నుకొన్నారు. ఈ కంపెనీలో మూడింత ఒక వంతు పసుపు కార్లుంటే, మరో రెండు వంతులు నీలం కార్లున్నాయి. వీటన్నింటినీ ఓ 36 నెలలపాటు దగ్గరగా పరిశీలించారు. చివరికి పసుపురంగు టాక్సీలకి ప్రమాదం జరిగే అవకాశం పదిశాతం తక్కువని తేల్చారు.   ఇలా ప్రమాదాలు తక్కువ జరగడం వల్ల మనుషులకి దెబ్బలు తగిలే అవకాశాలు ఎలాగూ తగ్గుతాయి... కార్లకి రిపేర్ల పేరుతో వేల రూపాయలు వదిలించుకునే శ్రమా తగ్గుతుందని గుర్తుచేస్తున్నారు. The Singapore taxi companyనే తీసుకుంటే... ఇందులో ఉన్న నీలం కార్లని కూడా పసుపురంగులోకి మార్చేయడం వల్ల ఏటా 917 ప్రమాదాలు తప్పిపోతాయనీ, కోటి రూపాయలకు పైగా ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు.   ఇంతకీ పసుపురంగుకీ ప్రమాదాలు తగ్గడానికి మధ్య సంబంధం ఏమిటీ! అంటే కారణం తేలికగానే స్ఫురిస్తుంది. రోడ్డు మీద పోయే ముదురురంగు కార్లతో పోలిస్తే పసుపు టాక్సీలు కంటికి సులభంగా కనిపిస్తాయి. అవి ఎంత దూరంలో ఉన్నాయో అంచనా వేయడం తేలికవుతుంది, దగ్గరగా ఉన్నప్పుడు పక్కకి తప్పుకోవడంలోనూ అంచనా తప్పదు. అంచేత, ప్రమాదాలూ తక్కువగానే సంభవిస్తాయి. పసుపు టాక్సీలు సురక్షితం అని తేలడంతో... ప్రజారవాణా అంతా కూడా పసుపు టాక్సీలలో ఉండేలా చర్యలు తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. మరి ఆ మాటని ప్రభుత్వాలు వింటాయో లేదో!   - నిర్జర. 

ఈ జాగ్రత్తలు పాటించకపోతే... కొంప కొల్లేరే!

సంసారాన్ని ఓ ప్రయాణంతో పోలుస్తూ ఉంటారు పెద్దలు. ఈ ప్రయాణంలో ఏ ఒక్కరు కాస్త ఆదమరచి ఉన్నా, వెనకబడిపోవాల్సిందే! ఆ పొరపొటు ఒకోసారి భాగస్వామిని చేజార్చుకునేంతవరకూ వెళ్లవచ్చు. లేదా శాశ్వతంగా మన పట్ల ఉన్న నమ్మకాన్ని పోగొట్టవచ్చు. అందుకే తస్మాత్‌ జాగ్రత్త అంటున్నారు అనుభవజ్ఞులు. ఇంతకీ వారి సలహాలు ఏమిటంటే...   కుటుంబంలో ఆఫీసు పెట్టొద్దు కెరీర్‌లో ముందుకు సాగాలంటే కష్టపడి పని చేయాల్సిందే! దానిని ఎవరూ కాదనలేరు. కానీ కుటుంబానికి కూడా కొంత సమయం కేటాయించకపోతే మన పడే కష్టానికి అర్థమే ఉండదు. కనీసం ఇంట్లో ఉండే సమయంలో అయినా టీవీ, ఫేస్‌బుక్‌లాంటి వ్యాపకాలను పక్కనపెట్టి భాగస్వామితో కాస్త మాట్లాడే ప్రయత్నం చేయాల్సిందే. ఆఫీసులో పని ఒత్తిడి గురించి కూడా భాగస్వామికి చెప్పి ఉంచితే... మీరు తనని కావాలనే దూరం ఉంచుతున్నారన్న భావన బలపడకుండా ఉంటుంది.   ఆఫీసరు మీద ఆవేశం ఇంట్లో వద్దు చాలామంది చేసే పొరపాటే ఇది. తోటి ఉద్యోగులతోనో, స్నేహితులతోనో జరిగిన గొడవ తాలూకు కోపాన్ని ఇంట్లో వెళ్లగక్కుతూ ఉంటారు. ఆఖరికి ట్రాఫిక్‌లో ఆలస్యమైనా ఆ ఆవేశం ఇంట్లోనే ప్రదర్శిస్తారు. ఊరంతా తిరిగివచ్చి, ఇంటి బయట చెప్పులు విడవడంతోనే... రోజువారీ చిరాకులన్నీ మర్చిపోయి మనిషిలా మెలగమని సూచిస్తుంటారు పెద్దలు.   అనుమానాస్పదమైన బంధాలు వద్దే వద్దు జీవితంలో ఎంతోమంది తారసపడుతూ ఉంటారు. ఎవరికెంత ప్రాధాన్యత ఇవ్వాలి అన్నది మన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. కానీ మీ స్నేహం సంసారంలోకి ప్రవేశిస్తోందన్న అనుమానం ఉంటే మాత్రం జాగ్రత్త పడాల్సిందే! మీ స్నేహాన్ని భాగస్వామి అపార్థం చేసుకుంటున్నారనో, మీ బంధం హద్దులు మీరడం లేదనో అనుకుంటే ఉపయోగం లేదు. ఆ పరిస్థితిని దాటుకుని మొండిగా సాగే స్నేహం సంసారం చీలిపోయేందుకు దారితీస్తుంది.   రహస్యాలు దాచవద్దు భార్యాభర్తల మధ్య మిగిలే రహస్యాలు ఎప్పటికైనా అపనమ్మకానికి దారితీస్తాయి. మరీ ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు, అప్పులకి సంబంధించిన వ్యవహారాలు వారితో పంచుకుని తీరాల్సిందే!   మనస్పర్థలు సహజమే రోడ్డు మీద ఓ ఇద్దరు మనుషులు ఎదురుపడితేనే గొడవలు మొదలైపోతుంటాయి. అలాంటిది ఇద్దరు మనుషులు ఏళ్లతరబడి కలిసి జీవిస్తే మనస్పర్థలు రాకుండా ఎలా ఉంటాయి. ఆ బేధాలను దాటుకుని ముందుకు సాగడం ఎలా అన్నది ఓ నైపుణ్యం. కోపంలో వాదించకుండా, అహంతో ఆలోచించకుండా, విచక్షణ కోల్పోకుండా పట్టువిడుపులకి సిద్ధపడుతూ సాగితేనే స్పర్థని దాటగలం.                              - నిర్జర.

The Art Of Argument

A conversation can always lead to an argument. And when there is an argument... there won't be any winners. That is the reason why our elders have always warned us against arguments. Repentance is oftenthe end result of an argument. It would hurt our character, our ego and our relation. But we are humans and we might sometimes land in thesoup of a heated discussion. A few reminders might lead us through such an argument... Never argue with the strangers: You might protest anyone being uncivilized and harmful. But don't argue over trifle things with a stranger. How often we see an argument turning into a fight in a bus! It might be a scene of amusement for the co-travellers, but can be really embarrassing to those involved. We never know who the other one is, we never know how far the argument might lead us. So when you wish to argue with a stranger, just answer yourself - Is the matter worthy to be an argument?   Never argue in a bad mood: You have just entered your home from the office and your wife says something that ignites you. On a cool day, you might have probably seen the lighter side of the issue. But today was a tough day with your boss, and you are ready for another fight. Such might be a situation where you loose your charm. It's better to call off the day and postpone the argument over the cup of a tea, the next morning. Thesame would be the suggestion if your partner is in a bad mood. Lethim/ her cool down, before a discussion.     The language: It's the language we use that represents our character. People often tend to be abusive while being in an argument. Because at one point of the argument, it turns out to be an ego clash. And both involved in the argument try to hurt the ego of the opponent. People insult each other with every word that's possible... and that's where our language turns foul.   Those History classes/clashes: It's a silly thing that we do over an argument. We recall every single mistake our opponent has done over years. It almost looks like the long borne grudge that we are spilling. We look back into our past, bring the filth from it, analyse it and feel proud that we've got a weapon to fight with. We often raise the weak points in the life of our opponent, and hurt him deep. You need not be a bad boy: Well! Arguments do occur. Sometimes they do turn ugly. But you can always be yourselves during such situations. You need not blowup to prove your point. You can use harsh words, with calm tone. You can present strong objections with cool mind. One thing that an argument does- it brings the beast out of an angel! So watch out the beast within you. Don't let it handle the situation. Finally... when you feel that an argument is turning and churning into a storm, you better ease the situation. A few calm words, a phone call in between, a permission to leave or even an apology would certainly save the relation. Nirjara

నిజమైన తృప్తి ఎక్కడ దొరుకుతుంది

అనగనగా ఓ రాకుమారి. ఆ రాకుమారి మనసులో ఏదో దిగులు. తన జీవితంలో ఏదో పొందలేకపోయానన్న బాధ. ఆ బాధతోనే నిరంతరం దేవుని ప్రార్థిస్తూ ఉండేది. తనకో దారి చూపమని ఆ భగవంతుని వేడుకునేది. ఒకసారి అలా తీవ్రమైన ప్రార్థనలో మునిగి ఉండగా ఆమెకు ఒక ఆకాశవాణి వినిపించింది. ‘నీ మనసులో ఉన్న వెతని తీర్చేందుకు నేను ముగ్గురు దేవదూతలను పంపుతాను. ఆ ముగ్గురులో ఎవరు నీకు శాంతిని కలిగించగలరో నువ్వే తేల్చుకో!’ అంటూ ఆ ఆకాశవాణి చెప్పింది.   ఆ మాటలు వినిపించినప్పటి నుంచీ ఆ రాకుమారి తన కోసం వచ్చే దేవదూతల కోసం ఎదురుచూడసాగింది. ఆకాశవాణి చెప్పినట్లుగా మర్నాడు రాత్రి ఆ రాకుమారి గది దగ్గరకి ఓ దేవదూత వచ్చి నిల్చొంది. ‘రా నేస్తం నాతో కలిసి కాసేపు ప్రయాణించు. నీ మనసుకి తృప్తి కలుగుతుందేమో చూద్దాము,’ అని చెప్పింది.   రాకుమారి ఆ దేవదూత మాటని నమ్మి తనతో ప్రయాణం సాగించింది. వారి ప్రయాణం నిజంగా ఓ అద్భుతం. ఆకాశ వీధులగుండా, బంగారు తాపడం చేసిన భవనాల పక్క నుంచీ, మిరుమిట్లు గొలిపే వజ్రాల కాంతిలో వారి ప్రయాణం సాగింది. ఆ వైభవాన్ని చూసేందుకు రాకుమారికి రెండు కళ్లూ సరిపోలేదు. కానీ ఆమె మనసులోని అసంతృప్తి మాత్రం అలాగే మిగిలిపోయింది. ‘ఎవరు నువ్వు! నీతో ఉంటే నా కళ్లకి తృప్తిగా ఉంది కానీ నా మనసు మాత్రం సంతోషంగా లేదు’ అని అడిగింది రాకుమారి. ఆ మాటలకు దేవదూత చిరునవ్వుతో... ‘నేను సంపదను, నేను ఎంతసేపు నీతో ఉన్నా నీకు తృప్తి కలగదు,’ అంటూ మాయమైపోయింది.   రెండో రోజు రాత్రి రాకుమారి చెంతకు మరో దేవదూత వచ్చింది. తనతో కలిసి ప్రయాణించమని రాకుమారిని ఆహ్వానించింది. అతనితో రాకుమారి బయల్దేరింది కూడా. సుదూర రాజ్యాల వైపుగా వారి ప్రయాణం సాగింది. దారి పొడుగునా వారిని చూసి ప్రజలు జేజేలు పలకసాగారు. ఆకాశం ఎత్తుల నుంచి పూలు వర్షం కురిసింది. కానీ రాకుమారి మనసులోని అసంతృప్తి మాత్రం అలాగే మిగిలిపోయింది. ‘ఎవరు నువ్వు! నీతో ఉంటే నాకు భలే గర్వంగా ఉంది. ఆ గర్వంతో ఒళ్లు గగుర్పొడుస్తోంది. కానీ మనసు మాత్రం ఇంకా చింతలోనే మునిగి ఉంది,’ అని అడిగింది రాకుమారి. ఆ మాటలకు బదులుగా దేవదూత దర్పంగా... ‘నేను కీర్తిని, నేను నీతో ఉంటే ఈ లోకం నీకు జేజేలు పలుకుతుంది. కానీ నీ మనసుకి తృప్తి కలుగుతుందో లేదో చెప్పలేను,’ అంటూ వెళ్లిపోయింది.   ఇక మూడో రోజు రాత్రి రాకుమారి విచారవదనంతో తన భవనంలో కూర్చుంది. బహుశా ఇవాళ వచ్చే దేవదూత కూడా తన అశాంతిని తొలగించలేదేమో అన్న నిరాశలో మునిగిపోయింది. అలా ఉండగా ఓ దేవదూత ఆమె దగ్గరకి వచ్చింది. ఆమె నడక చాలా నిదానంగా ఉంది. మొహంలో ముదుసలి ఛాయలు కనిపిస్తున్నాయి. కానీ ఆ ముడతల వెనుక ఏదో తెలియని ప్రశాంతత కనిపిస్తోంది. ఆమెని చూడగానే ఆమె వెనకాలే నడిచింది రాకుమారి. వాళ్లు గాలిలో తేలలేదు. బంగారపు భవనాల మీదుగా ఎగరలేదు. వారిని చూసిన జనం అసలు పట్టించుకోనేలేదు. పైగా తను నడుస్తున్న బాట ఏమంత సౌఖ్యంగా లేదని అనిపించింది రాకుమారికి. మధ్యమధ్యలో ఆమె శరీరాన్ని ముళ్లు గీరుకున్నాయి కూడా! అలా చాలా దూరం నడిచీ నడిచీ రాకుమారికి చెప్పలేని అలసట కలిగింది. కానీ ఆమె మనసు మాత్రం ఎందుకనో చాలా సంతోషంగా ఉంది. ‘ఏంటి ఈ వైరుధ్యం. నేను నీతో వచ్చి బావుకున్నది ఏమీ లేదు. అయినా నా మనసు ఎందుకనిలా సంతోషంలో తేలిపోతోంది. ఇంతకు ముందెన్నడూ ఎరుగని తృప్తి కలుగుతోంది,’ అని అడిగింది రాకుమారి. ‘నేను నిజానికి ప్రతినిధిని. నాతో ఉంటే నీ జీవితం సుఖంగా ఉంటుందని చెప్పలేను, ప్రజలు నిన్ను ఆదరిస్తారని అనుకోను. కానీ నీ మనసు మాత్రం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. నీ బతుకు మీద నీకే గౌరవం ఏర్పడుతుంది,’ అని బయల్దేరింది దేవదూత.   రాకుమారి అశాంతికి ఎట్టకేళకు ఆ దేవదూత దగ్గర సమాధానం లభించింది. ఇక మీదట ‘సత్యం’ అనే మార్గానికే కట్టుబడి ఉండాలని నిర్ణయించుకుంది. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)     - నిర్జర.

అదృష్టం ఎందులో ఉంది?

అనగనగా ఓ పేదవాడు ఉండేవాడు. అతనికి తన జీవితం అంటే ఏమాత్రం ఆశ ఉండేది కాదు. తనో నష్టజాతకుడిననీ, ఎందుకూ పనికిరానివాడిననీ అతని నమ్మకం. ఏ పని చేసినా ఫలితం ఉండదని నమ్మడంతో ఎలాంటి పనీ చేసేవాడు కాదు. అతని ఇల్లు కూడా అతని మనసులాగానే ఉండేది. ఇంటినిండా బూజు, మూలమూలలా సాలీడు గూళ్లూ, మురికీ మురుగూ… నష్టజాతకునికి తగినట్లుగా ఉండేది ఆ ఇల్లు. ఓ రోజు తన స్నేహితుడి ఇంటికి ఎవరో స్వామీజీ వచ్చారని తెలిసింది నష్టజాతకునికి. వెంటనే ఆయన దగ్గరకు వెళ్లి `స్వామీ తమరు మా ఇంటికి కూడా వేంచేయండి. మీ కాలి ధూళి సోకితేనన్నా నా ఇంటికి సిరిసంపదలు వస్తాయేమో` అని వేడుకున్నాడు. స్వామీజీ నష్టజాతకుని ఇంటికి రానేవచ్చారు. అతని ఇంటిని చూడగానే ఆయన మొహంలో ఓ చిరునవ్వు విరిసింది `స్వామీ చూస్తున్నారుగా నా దరిద్రం. ఈ దరిద్రం దూరమయ్యేలా ఏదన్నా వరాన్ని అనుగ్రహించండి` అని వేడుకున్నాడు పేదవాడు. స్వామీజీ చిరునవ్వుతో ఓ అందమైన గాజుపాత్రని ఇచ్చి `ఇది నీ ఇంట్లో ఉంచుకుని పనికి వెళ్లు. సకల శుభాలూ చేకూరతాయి`అని చెప్పాడు. ఆ గాజుపాత్రని చూసిన పేదవాడి కళ్లు గాజులా మెరిశాయి. మర్నాడు ఉదయాన్నే నిద్రలేచి పని వెతుక్కుంటూ ఊళ్లోకి వెళ్లాడు. ఉదయాన్నే ఉత్సాహంతో ఎదురుపడిన అతణ్ని చూసి ఎవరో ఓ కూలి పనిని అప్పగించారు. ఎన్నో రోజుల తరువాత తనకు పని దొరకడంతో ఒళ్లు వంచి ఆ పనిని సమర్థంగా పూర్తిచేశాడు పేదవాడు. తను అంత బాగా పనిచేయగలనని అప్పటిదాకా అతనికి కూడా తెలియదయ్యే! తన ఇంట్లో ఉంచిన గాజుపాత్రకి నిజంగానే మహిమ ఉందన్న నమ్మకం ఏర్పడింది అతనికి. ఇచ్చిన పనిని సక్రమంగా పూర్తిచేయడంతో రూపాయికి మరో రూపాయి అదనంగా ఇవ్వడమే కాకుండా, మర్నాడు కూడా రమ్మని చెప్పాడు యజమాని. విజయహాసంతో ఇంటికి వచ్చిన పేదవాడు ఆ గాజుపాత్ర వంక ప్రేమగా చూశాడు. అది ఓ మురికి పట్టిన టీపాయి మీద ఉందన్న విషయం అప్పటికి కానీ అతని స్ఫురణలోకి రాలేదు. వెంటనే ఆ గదిని శుభ్రం చేసి, బూజు దులిపి, గాజు పాత్రలో ఓ నాలుగు పూలని అందంగా అమర్చి చూసుకున్నాక కానీ అతనికి తృప్తిగా అనిపించలేదు. ఆ తరువాత అలసిసొలసి నిద్రపోయాడు. మర్నాటి నుంచి అతని జీవితమే మారిపోయింది. అతని ఉత్సాహం, శ్రద్ధ రెండోరోజు కూడా గమనించిన యజమాని తన దగ్గరే శాశ్వతంగా పనిలోకి పెట్టుకున్నాడు. రోజూ ఉదయాన్నే ఒళ్లు వంచి పనిచేయడం, సాయంత్రం వేళకు ఇంటికి వచ్చి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం చేసేవాడు పేదవాడు. తన ఇల్లు చాలా అందమైనదన్న విషయం అతనికి, దాన్ని శుభ్రపర్చుకున్నాక కానీ తెలిసిరాలేదు. ఆదివారం ఆదివారం ఆ ఇంటికి నలుగురు స్నేహితులనూ ఆహ్వానించేవాడు. ఆ రోజంతా విందు, వినోదాలతో మునిగిపోయేవాడు. ఇప్పటికీ అతను చాలామందితో పోలిస్తే పేదవాడే, కానీ తనకి ఏదో లోటు ఉందన్న విషయం అతనికి తోచేది కాదు. ఓ రోజు అనుకోకుండా ఆ గాజు పాత్ర పగిలిపోయింది. అంతే! ఈ దెబ్బతో తన అదృష్టం మాయమైపోతుందని భయపడిపోయాడు పేదవాడు. వెంటనే ఆ స్వామీజీని వెతుక్కుంటూ బయల్దేరాడు. వారం రోజుల పాటు నిద్రాహారాలు మానివేసి, వాకబు చేసుకుంటూ తిరిగితే కానీ అతనికి స్వామీజీ జాడ తెలియలేదు. `స్వామీ మీరు నాకు బహుమతిగా ఇచ్చిన గాజు పాత్ర పగిలిపోయింది. నన్ను క్షమించి, నాపై కరుణ ఉంచి, నాకు మళ్లీ అదృష్టాన్ని కలిగించే మరో పాత్రను ఇయ్యండి` అని వేడుకున్నాడు. పేదవాడి వంక చిరునవ్వులు చిందిస్తూ స్వామీజీ అన్నాడు కదా `నేను నీకు ఇచ్చిన గాజుపాత్రలో ఎలాంటి అదృష్టమూ లేదు నాయనా! నువ్వు విజయం సాధిస్తావన్న నమ్మకాన్ని కలిగించడం కోసం అది ఒక సాకు మాత్రమే! ఒక్కసారి అప్పటి నుంచి జరిగిన సంఘటనలను ఊహించుకుని చూడు. నీ జీవితం బాగుపడింది ఆ గాజుపాత్ర వల్లో, లేకపోతే మారిన నీ దృక్పథం వల్లో నీకే అర్థమవుతుంది!`ఆ మాటలు విన్న పేదవాడు తిరిగి తన ఇంటికి బయల్దేరాడు. అతనికి ఇప్పడు అదృష్టాన్ని కలిగించే గాజుపాత్ర అవసరం లేదు. ఎందుకంటే ఆ గాజుపాత్ర ఇప్పుడు అతని హృదయంలో ఉంది. పైగా అది పగిలే అవకాశం కూడా లేదు!

లోపాలను జయించకపోతే!

ఒకానొక రాజ్యంలో ఓ గొప్ప శిల్పకారుడు ఉండేవాడు. శిల్పకారుడంటే అలాంటి ఇలాంటివాడు కాదు... సుదూరతీరాల వరకూ అతని పేరు మారుమోగిపోతూ ఉండేది. అతనితో శిల్పాలు చెక్కించుకునేందుకు దేశదేశాల రాజులు ఉబలాటపడేవారు. ఎందుకంటే అతను శిల్పం చెక్కితే అచ్చు మనిషే నిలబడినట్లు ఉండేది. అసలుకీ, నకలుకీ వెంట్రుకవాసిలో కూడా తేడా ఉండేది కాదు. అలాంటి శిల్పకారుడికి ఓ కొడుకు ఉండేవాడు. అతనూ తక్కువ వాడేమీ కాదు. చిన్నప్పటి నుంచీ తండ్రి దగ్గర శిల్పకళకు సంబంధించిన ప్రతి ఒక్క మెలకువా చకచకా నేర్చేసుకున్నాడు కొడుకు. తండ్రికి తగ్గ కొడుకనీ, తండ్రి తరువాత అతనే రాజ్యంలో గొప్ప శిల్పకారుడనీ అతనికి పేరు. కానీ అతనికి మాత్రం ఆ పేరు ఏమాత్రం తృప్తి కలిగించేంది కాదు. ఎందుకంటే...   కొడుకు ఎంత కష్టపడి ఒక శిల్పాన్ని చెక్కినా కూడా దానికి తండ్రి ‘బాగానే ఉంది కానీ...’ అంటూనే ఏవో ఒక సవరింపులు చెప్పేవాడు. కనుముక్కు తీరు కుదరలేదనో, గడ్డం ఇంకాస్త కోసుగా ఉండాలనో... ఇలా ఏదో ఒక సవరణ చెప్పేవాడు తండ్రి. తండ్రి వంక పెట్టిన ప్రతిసారీ, కొడుకు మరింత కసిగా శిల్పాలను చెక్కేవాడు. కానీ ఏం లాభం! కొడుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ‘బాగానే ఉంది కానీ...!’ అంటూ మరో లోపాన్ని ఎత్తి చూపేవాడు కొడుకు. ఒక పక్క సమాజంలో శిల్పకారునిగా కొడుకు ప్రతిష్ట పెరిగిపోతోంది. కానీ ఇంట్లో పరిస్థితి ఈగల మోతలా ఉంది. శిల్పకారుడైన తండ్రే మెచ్చుకోకపోతే ఇక తన ప్రతిభ ఎందుకు? అనుకుని మధనపడిపోయేవాడు కొడుకు. దాంతో అతను ఓ ఉపాయాన్ని ఆలోచించాడు.   తన తండ్రికి తెలియకుండా ఓ అందమైన శిల్పాన్ని చెక్కడం మొదలుపెట్టాడు కొడుకు. రోజుల తరబడి తన శక్తిసామర్థ్యాలన్నింటినీ ఉపయోగిస్తూ ఒకో అంగుళమే చెక్కసాగాడు. తండ్రి ఆ వైపుగా వచ్చినప్పుడల్లా శిల్పం కనిపించకుండా దాన్ని ఒక గోతిలో ఉంచేవాడు. అలా దాదాపు మూడు మాసాలు కష్టపడి తన జీవితంలోకెల్లా ఓ అద్భుతమైన శిల్పాన్ని చెక్కాడు కొడుకు. ఒక రోజు తండ్రి పనిచేసుకునే సమయానికి ఏమీ ఎరగనట్లు ఆ శిల్పాన్ని తీసుకువెళ్లి ఆయన ముందర నిల్చొన్నాడు. ‘నాన్నగారూ నిన్న పట్నానికి వెళ్లినప్పుడు ఈ శిల్పాన్ని చూశాను. వెంటనే కొనేయాలన్నంతగా నచ్చింది. ఎలా ఉంది? నేను చెక్కిన శిల్పాలకంటే బాగుందా?’ అని అడిగాడు.   ‘ఓహ్! శిల్పం చాలా అద్భుతంగా ఉంది. వంక పెట్టడానికి ఏమీ లేదు. మన రాజ్యంలో ఇంత గొప్పగా శిల్పాలు చెక్కేవారున్నారంటే నమ్మడం కష్టంగా ఉంది. ఆ శిల్పకారుడిని కలుసుకుని తీరాలి. నువ్వు కూడా ఇంత చక్కగా శిల్పాన్ని చెక్కడం నేర్చుకోవాలి’ అన్నాడు తండ్రి.   తండ్రి ఆ మాటలు అనగానే కొడుకు ఒక్కపెట్టున నవ్వుతూ ‘చూశావా! నా శిల్పాలు అద్భుతంగా ఉంటాయని నీ చేతే చెప్పించాను. ఇది నేను చెక్కిన శిల్పమే. నేను ఎంత గొప్పగా చెక్కినీ మీరు నా పనిని మెచ్చుకోవడం లేదని ఇలా అబద్ధమాడాను’ అన్నాడు. ఆ మాటలకు తండ్రి మొహం చిన్నబోయింది. కొడుకు మొహం మాత్రం తండ్రిని జయించిన సంతోషంతో వెలిగిపోతోంది. ఆ రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చిన కొడుకుకి తన తల్లీతండ్రి తన గురించే మాట్లాడుకోవడం వినిపించింది. ఆ రోజు జరిగిన సంఘటన గురించి వారు చర్చించుకోవడం విని కొడుకు తలుపు దగ్గరే నిలబడిపోయాడు. తన గురించి తండ్రి ఏం చెప్పబోతున్నాడో అని ఆసక్తిగా వింటూ ఉండిపోయాడు. ‘నా తరువాత అంత బాగా శిల్పాలను చెక్కగలిగినవాడు నా బిడ్డే అని నాకు తెలుసు. కానీ పరిణతికి పరిమితులు ఎక్కడుంటాయి. వాడు ఒకో శిల్పాన్ని చెక్కి నా దగ్గరకు తీసుకురాగానే, తండ్రిగా వాడి ప్రతిభకి మురిసిపోయేవాడిని. కానీ వాడు మరింత మెరుగుపడాలని ఆశించేవాడిని. అందుకే వెతికి వెతికి వాడి శిల్పాలలో లోపాలను ఎత్తి చూపించేవాడిని. నేను అలా లోపాన్ని చూపించినప్పుడల్లా వాడి మొహం వాడిపోయేది. అయితే మరుసటి శిల్పంలో ఆ తప్పు చేయకుండా జాగ్రత్తపడేవాడు. కానీ ఇక నుంచి అలా సాధ్యం కాదు! వాడి శిల్పం అద్భుతంగా ఉందని నా నోటే చెప్పించుకున్నాడు. కాబట్టి ఇక తన పనికి తిరుగులేదనే నిర్ణయానికి వచ్చేసి ఉంటాడు. శిల్పకళలో వాడి ఎదుగుదల ఇక్కడితో ఆగిపోతుంది’ అంటూ చెబుతున్నాడు తండ్రి.   తండ్రి మాటలు విన్న తరువాత కొడుకు మొహం చిన్నబోయింది. గురువుల నిరంతరం శిష్యలలో లోపాలను ఎందుకు వెతికి, వాటిని ఎత్తి చూపిస్తూ ఉంటారో అర్థమైంది. ఓ చేత ప్రతిభను పెంచుకుంటూ, మరో చేత లోపాలను అధిగమించుకుంటూ ఉంటేనే ఎదుగుదల సాధ్యమని బోధపడింది.   - నిర్జర.

వయసు తగ్గిపోవాలా? డాన్స్ చేయండి!

వయసు మీదపడే కొద్దీ మన శరీరంలోని అవయవాలు ఒకొక్కటిగా బలహీనపడిపోతుంటాయి. ఇక మెదడు సంగతి చెప్పనే అక్కర్లేదు. మెదడులో కొత్త న్యూరాన్లు ఏర్పడకపోగా, పాత కణాలు నశించిపోతుంటాయి. ఫలితంగా మతిమరపు దగ్గర నుంచి అల్జీమర్స్ వరకు నానారకాల సమస్యలు చుట్టుముడతాయి. కానీ నాట్యం చేసేవారిలో ఈ సమస్య దరిచేరదని చెబుతున్నారు పరిశోధకులు.   శరీరిక వ్యాయమం వల్ల మన మెదడులోని ‘హిప్పో క్యాంపస్’ అనే భాగం బలపడుతుందని ఎప్పటినుంచో చెబుతున్నారు. మన జ్ఞాపకశక్తిని, నేర్పునీ, నిలకడనీ ఈ హిప్పో క్యాంపస్ ప్రభావితం చేస్తుంది. అయితే ఎలాంటి వ్యాయామం వల్ల అధిక ప్రయోజం ఉందో తెలుసుకోవాలనుకున్నారు జర్మనీకి చెందిన శాస్త్రవేత్తలు. ఇందుకోసం 68 ఏళ్ల సగటు వయసు ఉన్న కొందరు వృద్ధులను ఎన్నుకొన్నారు.   పరిశోధనలో భాగంగా అభ్యర్థులందరికీ 18 నెలల పాటు శారీరిక వ్యాయామం కలిగించే ప్రణాళికను రూపొందించారు. వీటిలో నడక, సైక్లింగ్‌తో పాటుగా నాట్యం చేయడం కూడా ఉంది. ఊహించినట్లుగా వీరందరిలోనూ ‘హిప్పోక్యాంపస్’ భాగం బలపడింది. కానీ నాట్యం చేసేవారిలో ఈ ఫలితం మరింత స్పష్టంగా కనిపించింది.   డాన్స్‌ చేసేవారు ఏ వారానికి ఆ వారం కొత్త భంగిమలను నేర్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ భంగిమలన్నీ పూర్తయిపోతే, మరో తరహా నృత్యం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఇవన్నీ గుర్తుంచుకునేందుకు మెదడు మరింత శక్తిమంతంగా మారిపోతుంది.   ఒక పక్క భంగిమలను గుర్తుంచుకోవాలి, మరో పక్క దానికి అనుగుణంగా శరీరంలోని నిలకడని కూడా దారికి తెచ్చుకోవాలి. అంటే శరీరమూ, మెదడూ రెండూ చురుగ్గా పనిచేయాల్సి ఉంటుందన్నమాట. ఈ కారణంగానే ఇతర వ్యాయామాలతో పోలిస్తే, నాట్యం చేయడం వల్ల మరింత లాభం ఉంటుందని తేలింది. మరెందుకాలస్యం! హిప్‌హాప్ దగ్గర నుంచి కూచిపూడిదాకా ఏదో ఒక నాట్యం నేర్చుకునే ప్రయత్నం చేయండి. మీ వయసుని తగ్గించేసుకోండి.

ప్రపంచంలోనే ప్రమాదకరమైన 10 ఉద్యోగాలు

జీవితం సాఫీగా సాగాలంటే డబ్బులు కావాలి. అందుకోసం ఉద్యోగం చేయాల్సిందే. అయితే తాము చేసే పని అంటే ఆడుతుపాడుతూ జరిగిపోవాలనుకుంటారు కొందరు. కానీ మరికొందరు మాత్రం ప్రతి పనిలో కాసింత కిక్కు ఉండాలి అని కోరుకుంటారు. రిస్కు అయినా పర్లేదు కిక్కిచ్చే పనిలోనే థ్రిల్ ఉంటుందని వాటివైపే మొగ్గుచూపుతుంటారు మరికొందరు . అలా కిక్ కోసం ప్రమాదకరమైన పనులను ఎంచుకుంటారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన 10 ఉద్యోగాల గురించి  తెలుసుకుందాం. 1. పాము విషం సేకరించడం : అత్యంత ప్రమాదకరమైన వృత్తిలో ఇది ఒకటి.  పాము విషాన్ని ఒక ప్లాస్టిక్ కంటైనర్లలోకి బలవంతంగా పిండుతుంటారు. ఈ ప్రక్రియలో ఎన్నిజాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. పాము కాటునుండి తప్పించుకున్న వాళ్ళు తక్కువనే చెప్పవచ్చు. పాము విషం (పాయిజన్)  వైద్య పరిశోధనలో లేదా "యాంటివేనోమ్" ను ఉత్పత్తి చేయడం కోసం ఉపయోగిస్తారు.  పాముల నుండి విషం తీసేవారికి సగటు వార్షిక జీతం 30,000 డాలర్ల వరకు ఉంటుంది. 2. మొసలి మల్లయోధులు : ఇది ఎప్పుడూ ప్రమాదకరమైన పనే అనవచ్చు. మొసలి మల్లయోధులు తమ  శరీర భాగాలను మొసలి దవడల మధ్య ఉంచడం, తోకలతో ఆడుకోవడం, కొన్నిసార్లు వెర్రి పనులు చేస్తూ ఉంటారు. అయితే మొసలి ఎప్పుడూ కూల్ గా పడుకోని ఉండదు. అప్పుడప్పుడు చురుగ్గా కదులుతుంది, ప్రతిస్పందిస్తూ ఉంటుంది కాబట్టి ఈ పనిలో చాలామంది  తమ ప్రాణాలను కోల్పోతుంటారు. ఈ జాబ్ చేసే వాళ్లకు గంటకు  సుమారు 8 డాలర్లు ఇస్తూ ఉంటారు. 3. చేపలు పట్టే పని : చేపలు పట్టే పని ప్రమాదకరమైన పనే. ఫిషింగ్‌ అనేది మనం చూసేంత ప్రశాంతంగా ఉండదు. అనుకోకుండా మారే వాతావరణ పరిస్థితులు, లోపభూయిష్ట పడవలకు సంబంధించిన అంశాల కారణంగా తరచు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఈ వృత్తిలో అత్యధిక మరణాల రేటు నమోదు అవుతోంది. ఈ పని చేసే వారికి సగటు వార్షిక జీతం 30,000 డాలర్లు 4. బుల్ రైడర్ : 1990లో చివర్లో ఈ వృత్తి చాలా పాపులర్ అయింది.  ఈ పనిలో 8 సెకన్ల రైడ్ కోసం చాలా పెద్ద మొత్తంలో నగదు ఇవ్వడం మొదలెట్టాక దీనికి ప్రాచుర్యం వచ్చింది. వాస్తవానికి, జీతం అనేది పెద్ద విషయం కాకపోవచ్చు కానీ ఈ పనిలో ప్రతి 15 రైడ్లకు ఒక బుల్ రైడర్ గాయాల పాలు కావడం, బోన్స్ విరగడం వంటి ప్రమాదాలకు గురవుతున్నారని లెక్కలు చెబుతున్నాయి. ఈ పనిలో జీతం బాగానే ఉంటుంది.  వచ్చే సమస్యలు కూడా ఎక్కువే. ఈ పనిలో సగటు వార్షిక జీతం 107,000 డాలర్ల వరకూ ఉంటుంది.  5. ఆయిల్ రిగ్గర్ : ఆయిల్ రిగ్గర్ అంటే ప్రపంచంలో అత్యంత మండే పదార్థాలతో పనిచేయడం అని అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు ఆయిల్ రిగ్గర్స్ కంటిన్యూగా 16 గంటల వరకు పనిచేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి నిద్ర లేకుండా  2 రోజులు కూడా పనిచేయాల్సి వస్తుంది. ఇందులో మంటలు రావడం, చమురు పేలుళ్లు జరగడం, మునిగిపోవడం ఒక్కోసారి శరీర భాగాలు యంత్రాల్లో ఇరుక్కుపోవడం జరుగుతుంది. తరచుగా ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. ఈ పనికి సగటు వార్షిక జీతం: 70,000 నుండి, 140,000 డాలర్ల వరకు ఉంటుంది. 6. లాగర్ : లాగింగ్ అనేది చాలా ప్రమాదకరమైన పనులలో ఒకటి, ఎందుకంటే  ఈ రంగంలో చనిపోయే అవకాశం 20 రెట్లు ఎక్కువ. ఈ పనిలో రోజూ భారీ యంత్రాలతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఫలితంగా, పరికరాల వైఫల్యం, కార్మికులపై చెట్లు పడటం వలన చాలా మరణాలు సంభవిస్తాయి. ఈ పనికి సగటు వార్షిక జీతం: 36,000 నుండి, 000 41,000 డాలర్ల వరకు ఉంటుంది.  7. నిర్మాణ కార్మికుడు : భద్రతా సామగ్రిని ఉపయోగిస్తునప్పటికీ, ఈ ఉద్యోగం  ప్రాణాంతకమనే చెప్పవచ్చు. భారీ వస్తువులతో పనిచేయడం, బరువైన వస్తువులను మోసుకెళ్లడం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రమాదకరమని చెప్పవచ్చు.  కొన్ని సార్లు ప్రమాదవశాత్తు కార్మికులపై గోడలు, స్తంభాలు కూలీ పడిపోతుంటాయి. ప్రాణాలు పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ పనికి సగటు వార్షిక జీతం 31,000 నుండి 70,000 డాలర్ల వరకు ఉంటుంది. 8. మౌంటైన్ గైడ్ : ఎత్తైన పర్వత శిఖరాన్ని అధిరోహించడం కొందరి కల. ఇందులో కొత్త ఉద్యోగావకాశాలు ఉన్నాయి. అనేది ఇందులో రిస్కు తో పాటు థ్రిల్ ఉంటుంది. అయితే ఈ పనిలో  గైడ్ మాత్రమే ఉండరు. కొన్నిసార్లు భారీ పరికరాలను మోసుకెళ్లాలి. అంతకంటే ముందు ప్రమాదకరమైన మార్గాన్ని ముందుగా అధిరోహించి ఆ తర్వాత ఇతరుల భద్రతకు బాధ్యత వహించాలి. అత్యంత ప్రమాదకరమైన వృత్తి లో ఇది ఒకటి. ఈ వృత్తిలో సగటు వార్షిక జీతం 70,000 డాలర్ల వరకు ఉంటుంది. 9. మైక్రోచిప్ తయారు చేసే పని : ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్ వాడకం బాగా పెరిగింది.  రోజువారి జీవితంలో అవి భాగమయ్యాయి. కానీ వాటిని తయారు చేయాలంటే ఎంతో కష్టంతో కూడిన పని.  కంప్యూటర్ చిప్స్ ఉత్పత్తి చేయడానికి ఆర్సెనిక్ వంటి అనేక ప్రమాదకర రసాయనాలను ఉపయోగిస్తారు. అవి తక్షణమే ప్రాణాంతకం కాకపోయినా  దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయి. గర్భస్రావం, జనన లోపాలు, శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు, క్యాన్సర్ వంటివి వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ పనికి సగటు వార్షిక జీతం 61,000 డాలర్ల వరకు ఉంటుంది. 10. వార్ కరస్పాండెంట్ : యుద్ధాలు జరిగే ప్రదేశం నుంచి ఎప్పటిప్పుడు సమాచారాన్ని చేరవేయడం ఆషామాషీ కాదు.  ప్రపంచానికి సత్యాన్ని తెలపడం అనేది డాక్టర్ వంటి ఉన్నతమైన ఉద్యోగం లాంటిదే. అయితే ఈ వృత్తి ఎక్కువ ప్రమాదం కరమైనది.  పనిచేస్తున్నప్పుడు జర్నలిస్టుగా కంటే శత్రువుగానే కనిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వృత్తిలో సగటు వార్షిక జీతం 36,000 డాలర్ల వరకు ఉంటుంది.

Crazy Online Shopping

Shopping for personal goods and lifestyle products has been interesting to everyone at a certain point in time...online shopping is picking up its swing in India too. In the Western World, it is already a pretty familiar thing. Buy anything, anytime with just a card!! It is so comfortable, time saving, and an effortless job. Returning items bought online, is also getting easier these days. The 'Free Shipping' is such an attractive part. Email notifications and Cellphone Alerts from the shopping websites have made it even more easier and better to keep a track of the deals and sales. Just make sure you keep your card details secure and use only presonal devices to shop online. Just wait for the after Festival Season in India and the Thanksgiving, Christmas Sale in the USA and every online shopper gets so crazy...so do i !! Most of us just get so curious to know whats every website we signed up for sells during its clearance event...whether we buy things or not, browsing for hours, putting everyother item in the shopping bag and then when you realise the amount is going to high or if it still doesnot qualify for 'free shipping', just close the browser !!! For most of us, it is a Passtime activity.   Even the Birthday Gifts are arriving from online stores, a day after the guests attend the party ! I actually did almost something similar, not intentional, the gifts got delayed and arrived to the host a day after i attended the party ! This online shopping is not as timely as shopping at the store..due to climatic reasons, transport strikes, unavailability of items in stock, the shipments arrive so late and you get so frustrated with the long wait...and strangely sometimes the orders arrive so early. Whatever be the reason to still continue with in-store shopping, Online Buying is irresistibly, crazily attractive !! -Prathyusha Talluri

కుర్రాళ్లు దూకుడుగా ఉండటం మంచిదేనట!

‘ఈ కాలం కుర్రాళ్లున్నారు చూశారూ! వాళ్లకి అసలు భయమే లేదనుకోండి..’ అని తెగ చిరాకు పడిపోతుంటారు పెద్దలు. ఎన్ని శతాబ్దాలు గడిచినా ఈ మాట ఇలాగే ఉంటుంది. ఎన్ని తరాలు దాటినా, కుర్రాళ్లు దూకుడుగానే ఉంటారు. ఇంతకీ కుర్రకారు ఎందుకని అలా దూకుడుగా ఉంటారు? దాని వల్ల ఉపయోగం ఏమన్నా ఉందా? అన్న ప్రశ్నలకి ఇప్పటికి జవాబు దొరికిందట. కుర్రకారు దూకుడి గురించి ఇప్పటిదాకా చాలా పరిశోధనలే జరిగాయి. వీటిలో చాలా పరిశోధనలు రకరకాల విశ్లేషణలు చేశాయి. యువకులలో ‘టెస్టాస్టెరాన్‌’ వంటి హార్మోనుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని కొందరు తేల్చారు. మెదడులోని ‘prefrontal cortex’లో లోపం వల్ల దూకుడు పెరుగుతుందని మరికొందరు ఊహించారు. కానీ ఇవేవీ నిజం కాదని అమెరికా పరిశోధనలు రుజువుచేస్తున్నారు. మనం ఏదన్నా సాహసం చేసేటప్పుడు ఉద్వేగానికి లోనవుతాం. ఆ సాహసం చేశాక ఒక తెలియని తృప్తి లబిస్తుంది. ఈ తృప్తి కోసమే కుర్రకారు సాహసాలు చేసేందుకు సిద్ధంగా ఉంటారని తాజా పరిశోధనలో బయటపడింది. ఒకోసారి ఇలాంటి తృప్తిని కోరుకునే తొందరపాటులో మద్యంలాంటి అలవాట్లు చేసుకోవడం, లేనిపోని గొడవలకు వెళ్లడం, బళ్లు వేగంగా నడపడం... లాంటి ప్రవర్తన కనిపిస్తుంది. అలాంటి సందర్భాలు పక్కన పెడితే, దూకుడు వల్ల కుర్రకారుకి జీవితపాఠాలు తెలుస్తాయంటున్నారు. కుర్రవాళ్లు అప్పుడప్పుడే జీవితంలోకి అడుగుపెడుతూ ఉంటారు. లోకం అంతా వారికి కొత్తగా కనిపిస్తుంది. ఆ ప్రపంచాన్ని నిదానంగా ఆకళింపు చేసుకుందాం అనుకుంటే విలువైన జీవితం కాస్తా గడిచిపోతుంది. అందుకోసం వారి ముందు ఉన్న మార్గం ఒక్కటే! Trial and error method ద్వారా ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకోవడమే! జీవితాన్ని శోధించి చూడటమే! అందుకే వారిలో దూకుడు పెంచేలా ‘డోపమైన్’ అనే రసాయనం ఎక్కువగా ఉత్పత్తి అవుతుందట. వారు ఎంత సాహసం చేస్తే అంత తృప్తి లభించేలా ఈ డోపమైన చూసుకుటుంది. ఇలా కుర్రతనపు చేష్టలతో మనం రకరకాల అనుభవాలను పొంది చూస్తాం. వాటి ఫలితాల ఆధారంగా మనదైన వ్యక్తిత్వాన్ని రూపొందించుకుంటాం. మున్ముందు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను దాటేందుకు ఆ వ్యక్తిత్వమే ఉపయోగపడుతుంది. ఎలాంటి ఉద్యోగాన్ని ఎన్నుకోవాలి? సమయాన్ని ఎలా గడపాలి? డబ్బు ఎలా ఖర్చుచేయాలి? లాంటి కీలకమైన ప్రశ్నలకు ‘కుర్రతనపు’ అనుభవాలే ఉపయోగపడతాయట. దూకుడుగా ఉండటం వల్ల కుర్రకారుకి మేలే అని తేలిపోయింది. కానీ దీనివల్ల నష్టాలు కూడా ఉంటాయి కదా! లేనిపోని గొడవలూ వస్తాయి కదా! అందుకే ఇంట్లో కుర్రకారు ఉన్న తల్లిదండ్రులు తెగ మధనపడిపోవడం సహజం. కానీ అందరు కుర్రకారూ ఇలా చెడుదారులలోకి వెళ్లాలని కానీ, అదే దారిలో ఉండిపోవాలని కానీ లేదట. తమని తాము అదుపు చేసుకోలేని మనస్తత్వం ఉన్నవారే ఇలా ప్రవర్తిస్తారట. అలాంటివారి నడవడిని చిన్నప్పుడే గ్రహించవచ్చని చెబుతున్నారు. అంటే సమస్య కుర్రతనంలో దూకుడుగా ఉండేవారితో కాదు, చిన్నప్పుడే దూకుడుగా ఉండేవారితో అన్నమాట!   - నిర్జర.

వ్యక్తిత్వ పరిమళాన్ని ఇట్టే పట్టేయొచ్చు

ఎదుటివారు వాడే పెర్‌ఫ్యూమ్‌ని బట్టి వారి మనస్తత్వాన్ని అంచనా వేయొచ్చట. నమ్మబుద్ధి కావడం లేదు కదూ.. కానీ ఇది నిజం. కొంతమంది మనస్తత్వ శాస్త్రవేత్తలు అనేకమంది మీద పరిశోధనలు జరిపి నిర్ధారించిన నిజం. జాజి, మల్లె, విరజాజి, సంపంగి, చంపక, పున్నాగ, గులాబీ, చేమంతి... ఇలా పువ్వుల పరిమళాలను కోరుకునేవారి లక్ష్యాలు సమున్నతంగా వుంటాయట. ఎప్పుడూ చక్కగా తయారవడాన్ని కూడా ఇష్టపడతారట కూడా. నిండైన ఆత్మవిశ్వాసం వీరి స్వంతంట. వీరికి ఎదురుపడ్డ ఏ అవకాశాన్నీ అంత తేలికగా చేయిదాటి పోనివ్వరు కూడా. పళ్ళ పరిమళాన్ని ఇష్టపడేవారు... ఇక నిమ్మ, నారింజ, ద్రాక్ష, స్ట్రాబెర్రీలు తినడానికి చాలా బాగుంటాయి కదా! ఇవి తినడానికి ఎంత బాగుంటాయో వాటి పరిమళాలు కూడా అంతే అద్భుతంగా వుంటాయి. మరి ఈ పరిమళాలని ఇష్టపడేవారు సాధారణంగా ఏ పనినైనా శ్రద్ధగా, ఇష్టంగా చేస్తారుట. ఎప్పుడూ ఆడుతూ, పాడుతూ ఉంటారు. అయితే కాస్త దురుసుగా మాట్లాడటం, తనకి నచ్చకపోతే నిక్కచ్చిగా చెప్పటం కూడా చేస్తారుట.   ఆకుల పరిమళాన్ని ప్రేమించేవారు.. యూకలిప్టస్, తేజ్ పత్తా, సబ్జా ఆకుల వంటివాటి సువాసనలంటే మక్కువ చూపేవారు చాలా చురుగ్గా వుంటారని అంటున్నారు నిపుణులు. వీరు సదా అప్రమత్తంగా కూడా వుంటారట. అలాగే చాలా విషయాలు తెలుసుకోవాలని కూడా వీరు ఆరాటపడుతూ వుంటారట. సృజనాత్మకత పాళ్ళూ వీరిలో ఎక్కువే. కానీ ఒక్కోసారి చప్పున మూడీగా మారిపోతుంటారుట.   వీరి వ్యక్తిత్వమే వేరు... వట్టివేరు, అల్లం, పసుపు వంటి వేర్ల సువాసనలను అధికంగా ఇష్టపడేవారు సౌమ్యంగా, నిరాడంబరంగా వుంటారుట. వీరి మనసులో మాట కనిపెట్టడం కష్టమే. వీరు చెప్పేదాకా వీరి ఇష్టాలేంటో కూడా అంచనా వేయలేంట. సో... ఈ సువాసనలని ఇష్టపడేవారు మీ ఫ్రెండ్స్‌లోనో, కావలసిన వారిలోనో వుంటే కొంచెం సునిశితంగా వారిని గమనించి వారి ఇష్టాలని తెలుసుకునే ప్రయత్నం చేయాలి.   వీరి వ్యక్తిత్వమూ సుగంధమే... మంచి గంధం, రోజ్ వుడ్, రైన్ చెట్ల బెరళ్ళ వాసనలు చాలా విలక్షణంగా వుంటాయి కదా. వీటిని ఇష్టపడే వారు కూడా విలక్షణ వ్యక్తులే. ఎందరిలో వున్నా ఇట్టే పసిగట్టవచ్చు వారిని. ఎప్పుడూ గలగలా మాట్లాడుతూ వుంటారు. ఇలా ఆయా పరిమళాల ఎంపికను బట్టి సదరు వ్యక్తుల మనస్తత్వాన్ని అంచనా వేయచ్చు అంటున్నారు ఈ అంశంపై అధ్యయనం చేసిన వ్యక్తులు. మీ సన్నిహితులను కలసినప్పుడు సరదాగా ప్రయత్నించి చూడండి.