జీఎస్టీలో అవకతవకలు.. కేసీఆర్ పై ఈడీ కేసు

గత ఏడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత ప్రజా జీవితంలో ఎక్కువగా కనిపించకుండా ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ముఖం చాటేస్తున్నారు. ఎక్కడా బయట కనిపించకుండా పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. పార్టీ నేతలకు, క్యాడర్ కు కూడా అందుబాటులో ఉండటం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ పై బీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టిన సమయంలో కూడా ఆయన బయటకు రాలేదు. రైతు రుణమాఫీ విషయంలో రేవంత్ సర్కార్ పై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులు మాత్రమే గొంతెత్తి విమర్శించారు. కేసీఆర్ మాత్రం మౌనం వీడలేదు. అయితే ఆయనపై తాజాగా ఈడీ కేసు నమోదు అయ్యింది. ఇప్పుడైనా కేసీఆర్ మౌనం వీడి గొంతెత్తుతారా లేదా అని బీఆర్ఎస్ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నారు. ఇంతకీ ఈడీ కేసీఆర్ పై ఎందుకు కేసు నమోదు చేసిందంటూ.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జీఎస్టీ చెల్లింపులలో 46 కోట్ల మేర అవకతవలు జరిగినట్లు గుర్తించిన ఈడీ  కేసీఆర్ పై కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఇదే విషయంపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి విదితమే.  ఇందుకు సంబంధించి ఇప్పుడో ఇహనో ఈడీ కేసీఆర్ కు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. 

వరకట్నం ఇవ్వాలన్న నియమం లేదు

జాఫర్ భయ్  తన చెల్లెలు అప్సర్ కి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు.  కాని చేతిలో చిల్లి గవ్వలేదు. సమస్య పరిష్కారానికి మౌలానా దగ్గరికి వస్తాడు జాఫర్ భాయ్.  జాఫర్ భాయ్: సలాంవాలేకూం మౌలానా సాబ్  మౌలానా: వాలేకుం సలాం జాఫర్ భాయ్ కైరియత్ , కైసే హై ఆప్  జాఫర్ భాయ్: అలమ్ దు లిల్లా జీ మౌలానా సాబ్ . మేరీ బెహన్ కా షాదీ కర్నా హై . జెహేజ్ కా ఇంతెజామ్ నై వుహా . సొల్యూషన్ బతాయియే   మౌలానా: ఇస్లాంలో నిఖా( పెళ్లి) అత్యంత సులభతరం . ఖర్చులు వీలయినంతగా  తగ్గించాలి. ఈ మధ్యకాలంలో నిఖాలు అత్యంత విలాసవంతంగా జరుగుతున్నాయి. వయసు పెరుగుతున్న కొద్దీ చావు దగ్గరవుతుంది. వయసులో ఉన్నప్పుడే నిఖా  చేయాలి.అపుడు  యుక్త వయసులో ఉన్నప్పుడే  వారి పిల్లలు పెద్దవారు అవుతారు.  ప్రయోజకులు అవుతారు.   పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ లో పెళ్లిళ్లు చేయకండి.  డబ్బులేనప్పుడు తమ తాహతును బట్టీ   నిఖా  చేసేయండి. ఖర్చు తగ్గుతుంది. షరియత్ లో గోరింటాకు వేడుకలు అట్టహాసంగా జరుపుకోవడం నిషిద్దం .  నిఖాను సులభతరం చేయాలి.  ఇస్లాం ప్రకారం బరాత్ కు  చోటే లేదు. వరకట్నం ఇవ్వాలన్న నియమం ఇస్లాంలో లేదు.  పెళ్లికి ఆరు నెలల ముందే సంబరాలు ప్రారంభిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు.ఇవి కూడా నిషేధం. డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడే వలీమా(డిన్నర్) ఘనంగా చేసుకోవచ్చు. నేను వెయ్యి రూపాయల మొబైల్ ఫోన్ కొనుగోలు చేసే కెపాసిటీ ఉంటుంది.  కాని అవతలి వ్యక్తి లక్ష రూపాయల మొబైల్ ఫోన్ కొన్నాడని మనం కొనాల్సిన అవసరం లేదు. వ్యక్తుల స్థితి గతులను బట్టీ పెళ్లిళ్లు చేయాలి. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు అవుతుంది మరి.  పెళ్లిళ్లు చేయాలి కానీ   మెహర్ (వరకట్నం) అమ్మాయి తరపున తండ్రి ప్రకటించాల్సి ఉంటుంది. తండ్రి లేనప్పుడు బాబాయ్, మామయ్య మెహర్ ప్రకటించాల్సి ఉంటుంది. అబ్బాయి వాళ్లు మెహర్ అడుగుతారు. అప్పుడు అమ్మాయి తరపు వాళ్లు అబ్బాయి తరపున వారితో సామరస్యంగా చర్చించుకోవాలి. ఇస్లాంలో అమ్మాయి తండ్రి వరకట్నం ఇవ్వాలన్న నియమం లేదు. అమ్మాయికి  కనీస అవసర వస్తువులు ఇవ్వొచ్చు. బైక్, ఎయిర్ కూలర్, మంచం, ఆల్మారా వంటివి అబ్బాయి తరపున వాళ్లు అడగొచ్చు. అయితే అమ్మాయి తరపు వాళ్లు ఇష్టంగా ఒప్పుకుంటే మాత్రమే. బలవంతంగా వసూలు చేయకూడదు అంటూ మౌలానా జాఫర్ బయ్ కు  వివరించాడు.  - బదనపల్లి శ్రీనివాసాచారి 

టాటా ట్రస్ట్స్ ఛైర్మన్‌గా నోయెల్ టాటా!

ఇప్పటి వరకు రతన్ టాటా ఛైర్మన్‌గా వున్న టాటా ట్రస్ట్స్ బాధ్యతలను నోయెల్ టాటాకు ట్రస్ట్ బోర్డు ఏకగ్రీవంగా అప్పగించినట్టు తెలుస్తోంది. రతన్‌ టాటా కన్నుమూసే వరకు టాటా గ్రూప్స్‌ గౌరవ చైర్మన్‌గా కొనసాగారు. అలాగే ఐదు ట్రస్టులు కలసి వున్న టాటా ట్రస్ట్స్.కి కూడా ఛైర్మన్‌గా వున్నారు. ఈ ఐదు ట్రస్టులలో కీలకమైనవి, ఎక్కువ వాటాలు వున్నవి సర్‌ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌. మరొకటి సర్‌ రతన్‌ టాటా ట్రస్ట్‌. ఈ రెండు ట్రస్టులకే కంపెనీలో 52 శాతం వాటాలు వున్నాయి. మొత్తం ఐదు ట్రస్టులకు కలిపి కంపెనీలో 67 శాతం వాటాలు వున్నాయి. ఇప్పుడు ఆ ట్రస్ట్స్ మొత్తానికి నోయెల్ టాటా ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. అలాగే హోల్డింగ్ కంపెనీ బాధ్యతలను టాటా సన్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. టాటా సన్స్.కి చంద్రశేఖరన్ ఛైర్మన్‌గా వున్నారు. టాటా ట్రస్ట్స్‌ చైర్మన్‌గా నోయెల్‌ని నియమించే విషయంలో 13 మంది ట్రస్టీలు ఏకాభిప్రాయం తీసుకున్నారు. వారంతా నోయెల్ టాటానే టాటా ట్రస్ట్‌ల చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలుస్తోంది.  రతన్‌ టాటా సవతి తల్లి సిమోన్‌ టాటాకి నోయెల్‌ టాటా కుమారుడు. నోయెల్ టాటాకి టాటా గ్రూప్‌తో 40 సంవత్సరాలుగా అనుబంధం వుంది. ఆయన టాటా కంపెనీలోని బోర్డుల్లో రకరకాల హోదాల్లో పని చేశారు. 

నందిగం సురేష్‌కి హార్ట్ ఎటాక్?

గుంటూరు జైల్లో వున్న బాపట్ల వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ భుజం, ఛాతీ నొప్పిగా వుందని అనడంతో జైలు అధికారులు ఆయన్ని గుంటూరు జనరల్ ఆస్పత్రికి తరలించారు. భుజం విపరీతంగా నొప్పి పుట్టడంతోపాటు ఛాతీలో కూడా నొప్పిగా వుందని, హార్టెటాక్ కావచ్చన్న అనుమానంగా వుందని నందిగం సురేష్ చెప్పడంతో జైలు అధికారులు అప్రమత్తమయ్యారు. నందిగం సురేష్‌కి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. అయితే జైలు అధికారులు మాత్రం ఇది హార్టెటాక్ కాకపోవచ్చని, నందిగం సురేష్‌ని అరెస్టు చేసిన సమయంలో కూడా ఆయనకు భుజం నొప్పి వుందని అంటున్నారు. వైసీపీ అధికారంలో వుండగా అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఇంటి మీద దాడి చేసిన కేసుతోపాటు మరియమ్మ అనే మహిళను హత్య చేసిన కేసులో నిందితుడైన నందిగం సురేష్ రిమాండ్‌లో వున్నారు. నందిగం సురేష్‌ది  హృదయ సంబంధ అనారోగ్యం కాదని నిర్ధారించుకున్న తర్వాత ఆయన్ని తిరిగి జైలుకు తరలిస్తామని అధికారులు చెబుతున్నారు.

ఆంధ్రాలో అప్పుల అప్పలమ్మలు ఎక్కువే!

యథారాజా తథా ప్రజా అన్నట్టుగా పాలించేవాళ్ళు ఏది చేస్తే, పాలించబడేవాళ్ళు కూడా అదే చేస్తారు. ఈ పార్టీ... ఆ పార్టీ... ఈ రాష్ట్రం... ఆ రాష్ట్రం అని కాకుండా దేశంలో ప్రతి ఒక్క ప్రభుత్వమూ అప్పుల మీదే బండి లాగిస్తోంది. జానానికి ఉచితాలు అలవాటు చేసిన నాయకులు అప్పులు చేసి మరీ గొప్పలు చెప్పుకుంటున్నారు. దేశాన్ని అప్పుల ఊబిలో నెట్టేస్తూ ఉచితాలు ఇవ్వడం తమ గొప్పతనంగానో, తన తాతలు సంపాదించిన ముల్లెని పంచుతున్నట్టుగానో బిల్డప్పు ఇచ్చుకుంటూ బతికేస్తున్నారు. ఈ జనం కూడా ప్రభుత్వం అప్పులు చేస్తోందో, అల్లాడి చస్తుందో మాకెందుకు... మా ఉచితాలు మాకు కావాలి అన్నట్టుగా వున్నారు. అందుకే దేశం అప్పుల కుప్పలా తయారైంది. దేశం సంగతి అలా వుంచితే, దేశ ప్రజలు కూడా అప్పులు చేయడంలో అభివృద్ధి పథంలో  పయనిస్తున్నారు. అక్షరమాలలో అగ్రస్థానంలో వున్నఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అప్పులు చేయడంలో కూడా దేశంలోనే  అగ్రస్థానంలో వున్నట్టు ఇటీవల కేంద్రం వెల్లడించిన నివేదిక చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పద్దెనిమిదేళ్ళు దాటిన వారిలో ప్రతి లక్ష మందిలో సగటున 60,093 మంది అప్పులు చేయడం ద్వారానే జీవితాన్ని నెట్టుకొస్తున్నట్టు కేంద్రం ఇటీవల విడుదల చేసిన కాంప్రిహెన్సివ్ యాన్యువల్ మాడ్యులర్ సర్వే వెల్లడించింది. ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ శాతం మంది అప్పుల అప్పారావులే అన్నమాట! సాధారణంగా పట్టణాలు అభివృద్ధి చెందాయి, గ్రామాలు అభివృద్ధి చెందలేదు అని అనుకుంటూ వుంటాం. కానీ, అప్పులు చేసే విషయంలో పట్టణాల్లో వుండే జనం కంటే గ్రామాల్లో వున్న జనమే ఫార్వర్డ్.గా వున్నారట. పట్టణ ప్రజలతో పోలిస్తే గ్రామీణ ప్రజలు 4.3 శాతం ముందున్నారట. అలాగే పట్టణాల్లో వుండే మహిళలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో వున్న మహిళలే ఎక్కువగా అప్పులు చేస్తున్నారట. ఓవరాల్‌గా చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ అప్పులు చేస్తున్నారట. అప్పులు చేసే విషయంలో అప్పుల అప్పారావుల కంటే అప్పుల అప్పలమ్మలదే అప్పర్ హ్యాండ్ అని అర్థమవుతోంది. ఇంకో గొప్ప విషయం ఏమిటంటే, అప్పులు చేయడంలో తెలుగు మహిళలే దేశంలో అన్ని రాష్ట్రాల మహిళల కంటే ముందంజలో వున్నారట. ఇక ప్రభుత్వాలు చేసే అప్పుల విషయాన్ని మరోసారి ప్రస్తావించుకుంటే, ఉత్తరాది రాష్ట్రాల ప్రజల మీద కంటే, దక్షిణాది రాష్ట్రాల ప్రజల నెత్తినే ఎక్కువ అప్పుల భారం వుందట.

విజయవాడలో లోకోపైలట్ ను  ఇనుపరాడ్డుతో హత్య చేసిన సైకో 

విజయవాడ రైల్వేస్టేషన్ లో లోకో పైలట్ ను సైకో చంపేశాడు. ఇనుపరాడ్డుతో లోకోపైలట్ పై శుక్రవారం తెల్లవారు జామున దాడి చేశాడు. దుర్గ గుడి దగ్గర ఈ సైకో ఆటో డ్రైవర్ పై హత్యాయత్నం చేశాడు. పోలీసులు అదుపులో తీసుకుని రైల్వేస్టేషన్ లో వదిలేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఏడో నెంబర్ ప్లాట్ ఫామ్ పై లోకో పైలట్ పై దాడి చేసి హత్య చేశాడు. అయితే అటు రైల్వే పోలీసులు, ఇటు విజయవాడ పోలీసులు కానీ స్పందించలేదు. సైకోను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గంజాయికి అలవాటుపడ్డ సైకో ఈ హత్యకు పాల్పడినట్టు సమాచారం.హత్యకు గురైన లోకో పైలట్ ఇతనే. 

యూట్యూబర్ పై శాంతి లైంగిక ఆరోపణలు

యూట్యూబర్ దాసరి  విజ్ఞాన్ పై  లైంగిక ఆరోపణలు చేస్తూ ఎపి ఎండోమెంట్ కమిషనర్ శాంతి తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను గత కొంత కాలంగా ఈ యూట్యూబర్ లైంగికంగా వేధిస్తున్నాడని ఆమె పేర్కొన్నారు. మార్ఫింగ్ వీడియోలు పోస్ట్ చేస్తున్నాడని ఆమె ఆరోపించింది. శాంతికి పుట్టిన బిడ్డ తన బిడ్గ కాదని  శాంతి భర్త కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తన భార్యతో అక్రమ సంబంధం కొనసాగించినట్లు ఆయన ఆరోపించిన సంగతి తెలిసిందే. విజయసాయిరెడ్డి డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే అసలు విషయం బయటపడుతుందని ఆయన హోంమంత్రి అనితను కల్సి వినతి పత్రం కూడా ఇచ్చారు. అయితే ఈ వివాదం సద్దుమణగకముందే  యూట్యూబర్ దాసరి  విజ్ఞాన్ విడుదల చేస్తున్న మార్ఫింగ్ వీడియోలు ఆమె పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేశారు. 

ఆంధ్రా ఐఏఎస్‌, ఐపీఎస్‌లు ఇలా తయారయ్యారేంటి?

విభజన కారణంగా 40 శాతం, జగన్ కారణంగా 60 శాతం నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కష్టాల నుంచి త్వరగా బయటపడాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలబడాలని ఆశిస్తున్నారా? ఎక్కువగా ఆశించకండి.. ఎందుకంటే ఎక్కువగా ఆశపడటం ఎందుకు... మళ్ళీ నిరాశకు గురవటం ఎందుకు? రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తోంది. కానీ, ప్రభుత్వానికి సహకరించడానికి చాలామంది సిద్ధంగా లేరు. ఐదేళ్ళపాటు ఆంధ్రప్రదేశ్‌ని సర్వనాశనం చేసిన జగన్ అండ్ కో, ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా జనం మీద పగబట్టారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకుండా వుండటానికి ఏం చేయాలో అవన్నీ చాపకింద నీరులా చేస్తూనే వున్నారు. జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పరువు పోయేవిధంగా, పెట్టుబడిదారులు వెనకడుగు వేసే విధంగా చేయాల్సినవన్నీ చేస్తున్నారు. జగన్ అండ్ కో పరిస్థితి ఇలా వుంటే, కొంతమంది ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆంధ్రా ముఖం చూడటానికే ఇష్టం లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. అయినవాళ్ళ నుంచే నిరాదరణను ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌ ఏనాటికి అభివృద్ధి చెందుతుందో ఏంటో! రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర కేడర్‌కి, ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తెలంగాణలో ఉండిపోయారు. అదేవిధంగా తెలంగాణ కేడర్‌కి, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఐఏఎస్‌, ఐపీఎస్‌లు ఆంధ్రలో వుండిపోయారు. ఆంధ్రలో వున్న తెలంగాణ అధికారులు ఎప్పుడెప్పుడు తెలంగాణకు వెళ్ళిపోవాలా అని ఎదురుచూస్తూ వున్నారు. తెలంగాణంలో వున్న ఆంధ్ర అధికారులు ఆంధ్ర పేరు చెబితేనే గిట్టనట్టు వ్యవహరిస్తున్నారు. తెలంగాణను వదిలి ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళడం ఇష్టం లేక న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. విభజన తర్వాత ఏపీకి కేటాయించినా కొంతమంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు తెలంగాణలో కొనసాగుతున్నారు. వారిలో వాణీ ప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రాస్, ఆమ్రపాలి, ప్రశాంతి... ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష్ బిస్త్, అభిషేక్ మహంతి వున్నారు. వీరిలో కొంతమంది వేరే రాష్ట్రాలకు చెందిన వారు అయినప్పటికీ, ఆంధ్రా కేడర్ అధికారులు. మరికొందరు ఆంధ్రా ప్రాంతంలోనే పుట్టి, పెరిగిన స్వచ్ఛమైన ఆంధ్రులు. చట్టపరంగా, న్యాయంగా అయితే, వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళాలి. కానీ, మేం వెళ్ళబోం అంటూ కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్)ని ఆశ్రయించారు. క్యాట్ ఆదేశాల మేరకు ఎన్నో సంవత్సరాలుగా వీళ్ళందరూ తెలంగాణలోనే కొనసాగుతున్నారు. తాజాగా వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్‌కే వెళ్ళి తీరాలని కేంద్రానికి చెందిన డిపార్ట్.మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం (డీఓపీటీ) ఆదేశించింది. సాధారణంగా అయితే డీఓపీటీ ఆదేశిస్తే ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు చప్పుడు చేయకుండా చెప్పినట్టు వినాలి. కానీ, ఆంధ్రాకి వెళ్ళాల్సిన ఐఏఎస్‌, ఐపీఎస్‌లు ఆంధ్రాకి వెళ్ళడానికి ఎంతమాత్రం ఇష్టపడటం లేదు. డీఓపీటీ ఆదేశాల మీద కూడా కోర్టును ఆశ్రయించాలన్న ఉద్దేశంతో వీళ్ళందరూ వున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ధనిక రాష్ట్రం కాబట్టి, వడ్డించిన విస్తరి లాంటి రాష్ట్రం కాబట్టి ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళడానికి అధికారులు బాధపడిపోతున్నారు. అలాగే ఏపీలో వున్న తెలంగాణ కేడర్ వాళ్ళు ఆనందోత్సాహాలతో తెలంగాణకు వస్తున్నారు. అక్కడి వారు ఇక్కడికి వస్తున్నారుగానీ, ఇక్కడి వాళ్ళు అక్కడకి వెళ్ళడానికి బాధపడిపోతున్నారు. మిగతా రాష్ట్రాల్లో పుట్టిపెరిగి, ఆంధ్రా కేడర్‌కి ఎంపికైన వాళ్ళ సంగతి అలా వుంచితే, ఆంధ్రాలో పుట్టి పెరిగిన రోనాల్డ్ రాస్, ఆమ్రపాలి కాటా, వాణి ప్రసాద్, వాకాటి కరుణ, ప్రశాంతి లాంటి వాళ్ళు కూడా సొంత రాష్ట్రానికి వెళ్ళడానికి విముఖత చూపించడం చాలా బాధాకరమైన విషయం. విభజన కారణంగా నష్టపోయిన తమ సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి తమవంతు పాత్రను పోషించాలన్న కనీస బాధ్యత కూడా లేకుండా ఈ అధికారులు వ్యవహరిస్తూ వుండటం దురదృష్టకరం. ఒకవేళ భవిష్యత్తులో వీళ్ళు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళాల్సిందే అనే పరిస్థితి వస్తే, వీళ్ళు ఏపీలో బాధ్యతలు తీసుకున్నా పూర్తిస్థాయి అంకితభావంతో పనిచేస్తారా అనే సందేహాలు వున్నాయి.

టార్గెట్ ప‌వ‌న్‌.. దువ్వాడ శ్రీ‌నివాస్‌, దివ్వెలమాధురి కొత్త డ్రామా!

తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీ‌నివాస్‌, మాధురి ప్రేమ వ్య‌వ‌హారం హాట్ టాపిక్ గా మారింది.   ఏజ్‌తో ప‌నిలేదు మేం ప్రేమపక్షులం అంటూ బ‌హిరంగంగా వారిద్ద‌రూ చెట్టాప‌ట్టాలేసుకొని తిరిగేస్తున్నారు. ఇటీవల తిరుప‌తిలో పెద్ద ర‌చ్చే చేశారు.  ఫొటో షూట్ తో తిరుమ‌ల కొండ‌పై వారు చేసిన ర‌చ్చ అంతాఇంతాకాదు. దీంతో మాధురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భ‌క్తుల నుంచి విమ‌ర్శ‌లు ఎదురైనా డోంట్ కేర్.. మా ప్రేమ ఇలానే ఉంటుందంటూ నిర్మొహ‌మాటంగా చెప్పేస్తున్నారు. వీరిద్ద‌రూ వైసీపీలోనే ఉన్నారు. వీరి ఓవ‌ర్ యాక్ష‌న్‌కు వైసీపీ అధిష్టానం   అడ్డుక‌ట్ట వేసే ప్ర‌య‌త్నం ఇసుమంతైనా చేయ‌డం లేదు. ప్ర‌జా జీవితంలో ఉన్న నేత‌లు ఎవ‌రైనా కాస్త సంస్కారవంతంగా ఉండాలి.  ఫ్యామిలీ ప‌రంగా ఎన్ని అంత‌ర్గ‌త విబేధాలుఉన్నా స‌భ్య‌స‌మాజంలో వారి ప్ర‌వ‌ర్త‌న న‌లుగురు మెచ్చుకునేదిలా ఉండాలి. కానీ దువ్వాడ శ్రీ‌నివాస్‌, దివ్వెల మాధురిల‌కు అవేమీ ప‌ట్ట‌డం లేదు. వైసీపీ అధిష్టానం కూడా మంద‌లించ‌డం లేదు.  దీనికితోడు వీరు మీడియాలో ఇటీవ‌ల  వ‌రుస ఇంట‌ర్వ్యూలు ఇస్తూ నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు అంటూ హ‌ల్‌చ‌ల్ చేసేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఓ ప్ర‌ముఖ చానెల్ ఇంట‌ర్వ్యూలో వారిద్ద‌రూ మాట్లాడుతూ.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ను టార్గెట్ చేశారు. ప‌వ‌న్ డిప్యూటీ సీఎం ప‌ద‌వికి రాజీనామా చేసేయాలంటూ డిమాండ్ చేశారు. దువ్వాడ శ్రీ‌నివాస్‌, మాధురి వ్య‌వ‌హారం తెలుగు  డైలీ సీరియ‌ల్ త‌ర‌హాలో  ఫుల్ స్టాప్ అనేదే లేకుండా కొన‌సాగుతోంది. వారిద్ద‌రికి సంబంధించి రోజూ ఏదోఒక ఎపిసోడ్ తెర‌పైకి వ‌స్తూనే ఉంది. గత ఎన్నికల ముందు దువ్వాడ శ్రీనివాస్‌ కుటుంబంలో అంత‌ర్గ‌త విబేధాలు తారాస్థాయికి చేరాయి.  ఎన్నిక‌ల త‌రువాత వారి కుటుంబ విబేధాలు  రోడ్డెక్కాయి. ఇళ్ల‌పై దాడులు, కోర్టు కేసులు, విడాకుల వ‌ర‌కు దువ్వాడ శ్రీ‌నివాస్‌, వాణిల వ్య‌వ‌హారం వెళ్లింది. దీనికి కార‌ణం మాధురి అని వాణి, ఆమె కుమార్తెలు ఆరోపిస్తున్నారు. టెక్కలిలోని ఓ ఇంటిలో శ్రీ‌నివాస్‌, మాధురి ఉంటుండ‌టంతో వాణి, ఆమె కూతుళ్లు నిల‌దీశారు. ఇంటిని వెంటనే ఖాళీ చేయాలంటూ వారు అక్కడే బైఠాయించి నిర‌స‌న దీక్ష‌  చేశారు. దీంతో ఇది పెద్ద వివాదంగా మారింది. ఈ త‌రువాత దువ్వాడ శ్రీ‌నివాస్‌, మాధురి బ‌హిరంగానే వారి మధ్య సంబంధాన్ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు. త్వ‌ర‌లో పెళ్లి కూడా చేసుకుంటామ‌ని చెప్పి అంద‌రికీ షాకిచ్చారు. వాణి నుంచి విడాకులు కోరుతూ శ్రీ‌నివాస్ కోర్టుకు వెళ్లారు. విడాకుల ప్ర‌క్రియ పూర్త‌వ్వ‌గానే మేమిద్ద‌రం పెళ్లి చేసుకుంటామ‌ంటూ  ఏదో గొప్ప‌ప‌ని  అన్న‌ట్లుగా వారు  చెబుతున్నారు. ఓ ప్ర‌ముఖ మీడియా ఛానెల్లో ఇటీవ‌ల శ్రీ‌నివాస్, మాధురి మాట్లాడుతూ.. ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జా జీవితాన్ని, ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ను వేరువేరుగా చూడాలంటూ   ఆ చానల్ వేదికగా ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. తమ వ్య‌వ‌హారాన్ని అడ్డుపెట్టుకొని వైసీపీ అధినేత‌ జ‌గ‌న్ ని విమ‌ర్శిస్తున్నార‌ని, మ‌మ్మ‌ల్ని పార్టీ నుంచి స‌స్పెండ్ చేయ‌డం లేద‌ని ప్ర‌శ్నిస్తున్నార‌ని ఒకింత ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇదే స‌మ‌యంలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు అది త‌ప్పుకాదా అంటూ ప్ర‌శ్నించారు. ఆయ‌న‌ది త‌ప్పుకాన‌ప్పుడు మేము చేసేది కూడా త‌ప్పుకాదంటూ సమర్ధించుకున్నారు. మాది త‌ప్ప‌ని అనేవాళ్లు ప‌వ‌న్ క‌ల్యాణ్ ను డిప్యూటీ సీఎం ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేయాలని చెబుతూ.ప‌వ‌న్ మూడు పెళ్లిళ్ల వ్య‌వ‌హారం.. లేటు వ‌య‌సులో తమ ఘాటు ప్రేమాయ‌ణం ఒక్క‌టే అని చెప్పుకు ప్ర‌య‌త్నం చేశారు. వీరి వ్యాఖ్య‌లపై ప‌వ‌న్ ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న విష‌యం వాస్త‌వ‌మే. కానీ, ప‌వ‌న్ తో విడిపోయిన వారు ఎప్పుడైనా ప‌వ‌న్ పై విమ‌ర్శ‌లు చేశారా...?  లేదు. ఎవ‌రి జీతాల్లో వారు నిమ‌గ్న‌మ‌య్యారు. కానీ దువ్వాడ శ్రీ‌నివాస్‌, మాధురి వ్య‌వ‌హారం అలాకాదు. శ్రీ‌నివాస్ భార్య‌, ఆయ‌న ఇద్ద‌రు పిల్ల‌లు అభ్యంత‌రం చెబుతున్నారు. మాధురి ఎంట్రీతోనే శ్రీ‌నివాస్ త‌ప్పుదారి ప‌ట్టాడ‌ని, అత‌న్ని మాయ‌చేసి మాధురి వ‌ల‌లో వేసుకుంద‌ని ఆరోపిస్తున్నారు. అలాంట‌ప్పుడు శ్రీ‌నివాస్, మాధురి ల‌వ్ ట్రాక్‌తో ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్య‌వ‌హారాన్ని పోల్చ‌డ‌మేమిట‌ని జ‌న‌సైనికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. దీనికితోడు త‌న‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేయ‌మ‌ని చెప్పినా జ‌గ‌న్ స‌స్పెండ్ చేయ‌లేద‌ని, అది కుటుంబ వ్య‌వ‌హార‌మ‌ని చెప్పార‌ని దువ్వాడ‌ శ్రీ‌నివాస్  చెప్పుకొచ్చారు. త‌మ నాయ‌కుడు గొప్ప వ్య‌క్తి అంటూ భజ‌న‌కూడా చేశారు. వాస్తవానికి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దువ్వాడ శ్రీ‌నివాస్ ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేసి ఉంటే.. శ్రీ‌నివాస్ లాంటి వారు వైసీపీలో ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్లంద‌రినీ స‌స్పెండ్ చేయాల్సి వ‌స్తుంది.  అదే చేస్తే పార్టీ మ‌నుగ‌డే ప్రశ్నార్థకమౌతుంది. అందుకే జ‌గ‌న్ భ‌య‌పడి ఉంటార‌ని  నెటిజ‌నులు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి దువ్వాడ శ్రీ‌నివాస్‌, మాధురిలు త‌మ ప్రేమ వ్య‌వ‌హారాన్నిప‌వ‌న్ క‌ల్యాణ్ పెళ్లిళ్ల‌తో పోల్చ‌డం చూస్తుంటే వారి పిచ్చి ఏ స్థాయికి చేరిందో అర్ధ‌మ‌వుతోందని నెటిజనులు అంటున్నారు. 

ఎపిలో మద్యం షాపులకు భారీగా దరఖాస్తులు 

గత వైసీపీ ప్రభుత్వం మద్యం షాపుల్లో చీప్ లిక్కర్ విక్రయాలు చేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడింది.  వినియోగదారులకు తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని అందించాలనే లక్ష్యంతో ఎపి ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది.  దీనిలో భాగంగా ఇటీవల 3,336 షాపులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మద్యం షాపు పొందేందుకు దరఖాస్తు ఫీజ్ రెండు లక్షలుగా కూటమి ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.   ఇప్పటివరకు దాదాపు 20 వేల దరఖాస్తులు వచ్చాయి.   వీటి ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ.400కోట్ల ఆదాయం వచ్చింది. తర్వాతి దశలో గీత కార్మికులకు 10 శాతమైన 340 షాపులు కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం ప్రకటించింది. పారదర్శకతే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోంది. ఈ నెల 11 వ తేదీ చివరి రోజు కావడంతో భారీగా దరఖాస్తులు వచ్చాయి. మద్యం షాపులకు  తెలంగాణలోని మహబూబ్ నగర్, నల్గొండ, మెదక్ జిల్లాల నుంచి భారీగా టెండర్లు వచ్చాయి. చివరి రోజు కావడంతో భారీగా దరఖాస్తులొచ్చాయి.

ఏపీకి తుఫాను ముప్పు.. మూడు రోజులు భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్ కు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే భారీ వర్షాలు వరదలతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ కు  మరో  తుపాను ముప్పు పొంచి ఉందన్నవాతావరణ శాఖ హెచ్చరి కలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇటీవలి భారీ వర్షాలు, వరదల కారణంగా సంభవించిన కష్టాల నుంచి రాష్ట్రం ఇంకా పూర్తిగా తేరుకోకముందే  మరో తుపాను విరుచుకుపడనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో జనం బెంబేలెత్తుతున్నారు. రాష్ట్రంలో ఈ నెల 14 నుంచి 16 వరకూ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనీ, ముఖ్యంగా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలకు ఈ వర్షాల వల్ల తీవ్ర నష్టం సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.  రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏపీని వర్షాలు వణికిస్తున్నాయి. వరుస తుపానుల ప్రభావంతో ఇటీవల వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొట్టాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయంకాగా.. నదులు, వాంగులువంకలు పొంగిపొర్లి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, వరదల కారణంగా పలువురు మృత్యువాత పడ్డారు. పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆ నష్టాల నుంచి తేరుకోకముందే మరోసారి ఏపీలో భారీ వర్షాలు కురవబోతున్నాయి. 

ఐటీ సర్వ్ సినర్జీ కాన్ఫరెన్స్ కు లోకేష్

ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవవనరుల శాఖ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 25 నుంచి నవంబర్ 1వరకూ శాన్ ఫ్రాన్సిస్కో వేదికగా జరిగే ఐటీ సర్వ్ సినర్జీ సదస్సులో ఆయన పాల్గొంటారు. ఆ సందర్భంగా ఏపీలో ఐటీ పురోగతి లక్ష్యంగా ఆయన పలు కంపెనీల ప్రతినిథులతో సమావేశమౌతారు. ఐటీ శాఖ మంత్రిగా రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలను తీసుకువచ్చేందుకు కృషి చేస్తారు. ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారపగ్గాలు చేపట్టిన తరువాత రాష్ట్ర పారిశ్రామిక రంగం వేగంగా   పురోగమిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. జగన్ హయాంలో రాష్ట్రం నుంచి తరలిపోయిన పరిశ్రమలు కూడా మళ్లీ ఏపీలో అడుగుపెట్టేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. అలాగే ఐటీ రంగంలో కూడా పెట్టుబడులు వెల్లువెత్తతున్నాయి. తాజాగా టాటా రాష్ట్రంలో బ్రాంచి స్థాపనకు ముందుకు వచ్చింది. భారీగా ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా టాటా తన బ్రాంచ్ ను విశాఖపట్నంలో నెలకొల్పేందుకు రెడీ అయ్యింది. ఇక ఇప్పుడు నారా లోకేష్ తన అమెరికా పర్యటనలో మరిన్ని ఐటీ కంపెనీలను  రాష్ట్రానికి తీసుకువచ్చే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు.   

గోదావరి పుష్కరాలకు వంద కోట్లు విడుదల చేసిన కేంద్రం

గోదావరి పుష్కరాల కోసం కేంద్రం వంద కోట్ల రూపాయలను విడుదల చేసింది. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల నిర్వహణకు ఏపీకి వంద కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులతో పాటు నిధులను  కూడా విడుదల చేసింది. గోదావరి పుష్కరాలు 2027లో జరుగుతాయి. అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా కేంద్రం ఈ నిధులను విడుదల చేసింది. దీంతో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు ముమ్మరం కానున్నాయి. టూరిజం శాఖ అధికారులు అఖండ గోదావరి ప్రాజెక్టు పనులను త్వరలో ప్రారంభించనున్నారు.  అఖండ గోదావరి ప్రాజెక్ట్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తూర్పు గోదావరి జిల్లాకు ఈ నిధులు కేటాయించారు. ఈ దిశగా టూరిజం శాఖ అధికారులు పనులు త్వరలో ప్రారంభంకానున్నాయని అధికారులు తెలిపారు.  

ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అమ్మవారి విగ్రహానికి అపచారం

దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు గురువారం (అక్టోబర్ 11) అర్ధరాత్రి దాటిన తరువాత ధ్వంసం చేశారు.హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏటా ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో దసర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. అదే విధంగా ఈ ఏడాది కూడా నిర్వహిస్తున్నారు. గురువారం(అక్టోబర్ 11) రాత్రి దాండియా కార్యక్రమం జరిగింది. దీనికి భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. రద్దీ భారీగా ఉన్నందను పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే దాండియా పూర్తికాగానే జనంతో పాటు పోలీసులు కూడా వెళ్లిపోయారు. ఆ తరువాతే విగ్రహ ధ్వంసం జరిగింది.  సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.  అమ్మవారి విగ్రహ ధ్వంసంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు పాల్పడిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అమ్మవారి విగ్రహ ధ్వంసం హిందుత్వపై జరిగిన దాడిగా వారు పేర్కొంటున్నారు. 

ఆమ్రపాలికి షాక్... ఆంధ్రాకి వెళ్ళాల్సిందే!

ఐఏఎస్ ఆఫీసర్‌గా తెలంగాణ కేడర్లోనే కొనసాగాలని తీవ్రంగా ప్రయత్నించిన ఆమ్రపాలి కాటాకి బిగ్ షాక్ తగిలింది. ఆమె తక్షణం ఆంధ్రా కేడర్‌కి వెళ్ళాలని కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆమ్రపాలి గ్రేటర్ హైదరాబాద్‌ కమిషనర్ పోస్టుతోపాటు పలు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమ్రపాలి 2010 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్ కేడర్‌కి వెళ్ళాల్సిందిగా ఆదేశించారు. అయితే ఆమె తనను తెలంగాణ క్యాడర్‌లోనే కొనసాగించాలని దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత వరంగల్ జిల్లా కలెక్టర్‌గా కొనసాగిన ఆమ్రపాలి ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి కార్యాలయంలో ఓఎస్డీగా పనిచేశారు. మళ్ళీ తెలంగాణ కేడర్‌కి వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆమెకు ప్రాధాన్యం ఇస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్‌ బాధ్యతలతోపాటు పలు కీలక బాధ్యతలు అప్పగించింది. అయినప్పటికీ తనను తెలంగాణ స్థానికత ఉన్న అధికారిగా గుర్తించాలని చేసిన విజ్ఞప్తిని కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ఐఏఎస్‌ల కేడర్ల విషయంలో ఖండేకర్ కమిటీ చేసిన సిఫారసుల ఆధారంగా ఆమె ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కే చెందుతారని కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దాంతో ఆమ్రపాలి తెలంగాణ కేడర్‌ని విడిచిపెట్టి ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కి వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆమ్రపాలి భర్త ఐపీఎస్ ఆఫీసర్ సమీర్ శర్మ. ఆయన అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాం, యూనియన్ టెరటరీ కేడర్లో వున్నారు. ప్రస్తుతం ఆయన లక్ష్మద్వీప్స్.లో వున్నారు.

రాష్ట్రాల పన్నుల వాటా విడుదల ఏపీకి ఎంతంటే?

మోడీ నేతృత్వంలో కేంద్రంలో కొలువుదీరి ఉన్న ఎన్డీయే సర్కార్ రాష్ట్రాలకు పన్నుల వాటాను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు నెలవారీగా అందించే పన్నుల వాటా కింద కేంద్రం 1, 78, 173 వేల కోట్లు విడుదల చేసింది. ఇందులోనే అడ్వాన్స్ పేమెంట్ కూడా ఉన్నట్లు వెల్లడించింది. కేంద్రం విడుదల చేసిన పన్నుల వాటాలో ఆంధ్రప్రదేశ్ కు 7వేల 211 కోట్ల రూపాయలు, తెలంగాణకు 3 వేల 745 కోట్ల రూపాయలు దక్కుతాయి. అత్యధికంగా ఉత్తర ప్రదేశ్ కు కేంద్ర నుంచి 31వేల 963 కోట్ల రూపాయలు లభిస్తాయి.   ఇక బీహార్ కు రూ.17,921 కోట్లు, మధ్యప్రదేశ్ కు 13,987 కోట్లు, మహారాష్ట్రకు రూ.11,255 కోట్లు, పశ్చిమ బెంగాల్ కు రూ.13,404 కోట్లు, రాజస్థాన్ కు రూ.10,737 కోట్లు, ఒడిశాకు రూ.8,068 కోట్లు పన్నుల వాటా రూపేణా దక్కనున్నాయి.

బాబు అభివృద్ధి నమూనా.... జగన్ విధ్వంసం చిరునామా!

ఏపీలో అభివృద్ధిని ప‌రుగులు పెట్టించేందుకు సీఎం చంద్ర‌బాబు నాయుడు దూకుడుగా ముందుకెళ్తున్నారు. గ‌డిచిన ఐదేళ్ల కాలంలో అన్ని రంగాల్లో న‌ష్ట‌పోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్రం స‌హ‌కారంతో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఒక‌వైపు అమ‌రావ‌తి రాజ‌ధాని, మ‌రోవైపు పోల‌వ‌రం నిర్మాణం ప‌నుల‌ను వేగంగా పూర్తిచేసేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకున్న చంద్ర‌బాబు.. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అభివృద్ధికి బాట‌లు వేసేలా కృషి చేస్తున్నారు. బాబు దూకుడును చూసి వైసీపీ అధినేత జ‌గ‌న్ , వైసీపీ నేత‌లు కంగుతింటున్నారు. 2019లో  వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఆరు నెల‌ల వ‌ర‌కు సంక్షేమ ప‌థ‌కాలు, అభివృద్ధి ప‌నుల‌ను ప్రారంభించ‌లేదు. కానీ, చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చిన‌ మ‌రుస‌టి రోజు నుంచి రాష్ట్రాభివృద్ధే ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్నారు. ఫ‌లితంగా మేనిఫెస్టోలోని హామీలు ఒక్కొక్క‌టిగా అమ‌లు చేస్తుండ‌టంతో పాటు.. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల‌ను తీసుకొచ్చి ప‌నులు వేగంగా జ‌రిగేలా చూస్తున్నారు. చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తున్నారంటే రాష్ట్రానికి నిధులు రావ‌డం ఖాయ‌మ‌న్న భావ‌న‌కు ప్ర‌జ‌లు వ‌చ్చేశారు. అయితే, గ‌తంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీఎం హోదాలో ఢిల్లీ వెళ్లిన స‌మ‌యంలో ప్ర‌ధానితో భేటీతో పాటు.. కేంద్ర మంత్రుల‌నుకూడా నామ‌మాత్రంగా క‌లిసి వ‌చ్చేవారు. కేవ‌లం త‌న సొంత ప‌నులు పూర్తిచేసుకునేందుకు వెళ్లార‌న్న‌ట్లుగా జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న సాగుతూ వ‌చ్చింది. ఢిల్లీ వెళ్లివ‌చ్చిన త‌రువాత మీడియా స‌మావేశం పెట్టి.. ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్ద‌ల‌తో ఏయే విష‌యాల‌పై చ‌ర్చించాం.. రాష్ట్రానికి ఏ రంగానికి నిధులు రాబోతున్నాయ‌నే విష‌యాల‌ను గత వైసీపీ ప్ర‌భుత్వం గోప్యం ఉంచింది. చంద్ర‌బాబు మాత్రం ఢిల్లీ వెళ్లి వ‌చ్చిన త‌రువాత ప్ర‌ధాని మోదీ, కేంద్ర మంత్రుల‌తో ఏఏ అంశాల‌పై చ‌ర్చించామ‌నే విష‌యాలను మీడియా ముఖంగా ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేస్తున్నారు. ప్ర‌తీవిష‌యంలో జ‌వాబుదారీత‌నంగా ఉంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థ‌కంలో పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్ర‌జ‌లు చంద్ర‌బాబు పాల‌న ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఇది న‌చ్చ‌ని జ‌గ‌న్   సొంత మీడాయా, సోషల్ మీడియా ద్వారా అస‌త్య ప్ర‌చారాల‌తో ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. తాజాగా జ‌గ‌న్ మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ నాయ‌కుల స‌మావేశంలో మాట్లాడుతూ.. మా హ‌యాంలో అది చేశాం.. మా హ‌యాంలో ఇది చేశాం అంటూ తన భుజాలను తానే చరుచుకున్నారు. చేయ‌ని ప‌నులు కూడా చేశామ‌ని  చెప్పుకుని క్రెడిట్ ను ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నించారు. ఎంత చేసినా జనం ఓడించారంటూ ఆవేదనా ఒలకబోసి డ్రామాను రక్తికట్టించడానికి ప్రయత్నించారు.  అయితే వాస్త‌వానికి ఐదేళ్ల వైసీపీ హ‌యాంలో ఇదీ మేం చేశామని చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పనీ లేదు.  ఉద్యోగ ఉపాధి అవకాశాలు   చేసుకోవటానికి ప‌నులు లేక.. ప్ర‌భుత్వం నుంచి స‌హ‌ కారం అంద‌క ప్ర‌జ‌లు న‌ర‌క యాత‌న అనుభ‌వించారు. వైసీపీ ఐదేళ్ల పాల‌న‌లో కనీసం రోడ్ల మ‌ర‌మ్మ‌తు పనులు కూడా జరగలేదు. వాటన్నిటినీ విస్మరించి జ‌గ‌న్ తాను  నెల‌నెలా త‌న సొంత జేబులో నుంచి డ‌బ్బులు ఇచ్చాను అన్న‌ట్లు గా అరకొరగా పంచిన సొమ్ముల గురించే చెప్పుకున్నారు. దీంతో  ఆ సమావేశంలో పాల్గొన్న వైసీపీ నేతలు సైతం  అస‌హ‌నానికి గుర‌య్యారు. ఈవీఎంల‌పైనా మ‌రోసారి జ‌గ‌న్ అక్క‌సును వెళ్ల‌గ‌క్కారు. హర్యానా ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గెలుస్తుంద‌ని ఎగ్జిట్ పోల్స్ అంచ‌నా వేశాయి. కానీ, కాంగ్రెస్ ఓడిపోయి వ‌రుస‌గా మూడోసారి బీజేపీ అధికారంలోకి వ‌చ్చింది. దీంతో కొంద‌రు కాంగ్రెస్ నేత‌లు ఈవీఎంల‌పై నెపాన్నినెట్టే ప్ర‌య‌త్నం చేశారు. దేశంలో ఎక్క‌డ ఈవీఎం ముచ్చ‌ట వినిపించినా దానిని ఏపీకి చుట్టేయ‌డం జ‌గ‌న్‌, ఆ పార్టీ నేత‌ల‌కు అల‌వాటుగా మారిపోయింది. దీంతో ఏపీలో ఈవీఎంల‌లో మ‌త‌ల‌బు జ‌రిగింద‌ని చెబుతూ.. హ‌రియాణాలోనూ బీజేపీ ఈవీఎంల మ‌త‌ల‌బుతోనే గెలిచిదంటూ జ‌గ‌న్‌ ఆరోపణలు గుప్పించేశారు.    2019లో వైసీపీ గెలిచిన స‌మ‌యంలో కొంద‌రు తెలుగుదేశం నేత‌లు ఈవీఎంలలో మ‌త‌ల‌బు వ‌ల్లే వైసీపీ అధికారంలోకి వ‌చ్చిదంటూ వాదించారు. జ‌గ‌న్ వారిని తీవ్రంగా ఖండించారు. ఈవీఎంలు ప‌విత్ర‌మైన‌వి అన్న‌ట్లుగా జ‌గ‌న్ మాట్లాడారు. కానీ, ఇటీవ‌ల అధికారాన్ని కోల్పోవ‌డంతో  త‌మ అస‌మ‌ర్ధ పాల‌న‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు ఓట‌మి నెపాన్ని ఈవీఎంల‌పై నెట్టే ప్ర‌య‌త్నాల‌ను గత నాలుగు నెలలుగా జ‌గ‌న్ కొన‌సాగిస్తూనే  ఉన్నారు. దీంతో జ‌గ‌న్ తీరుపై ఏపీ ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఐదేళ్లు అరాచ‌క పాల‌న సాగించిన జ‌గ‌న్‌కు ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వ‌కుండా ప‌క్క‌న పెట్టినా త‌న తీరును మార్చుకోవ‌టం లేద‌ని, త‌న తీరును ఇప్ప‌టికైనా మార్చుకోక‌పోతే  ఇక రాష్ట్రంలో వైసీపీ కనుమరుగయ్యేందుకే అవకా శాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. 

ప్రొఫెషనల్ టెన్నిస్‌కి నాదల్ గుడ్ బై!

టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ ప్రొషెషనల్ టెన్నిస్‌కి గుడ్ బై చెప్పేశారు. టెన్నిస్ క్రీడాకారుడిగా రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ఏడాది  నవంబర్‌లో జరిగే డేవిస్ కప్ ఫైనల్ తర్వాత నాదల్ ప్రొఫెషనల్ టెన్నిస్‌కి టాటా.. బైబై చెబుతారు. టెన్నిస్ పండితులు 'క్లే కోర్టు' రారాజుగా పేర్కొనే  నాదల్ 1986 జూన్ 3న స్పెయిన్‌లో పుట్టారు. 2001 సంవత్సరంలో అంతర్జాతీయ టెన్నిస్‌ రంగంలోకి  ప్రవేశించారు. ఆ తర్వాత కేవలం సంవత్సరాలకే 2005లో ఫ్రెండ్ ఓపెన్‌ని తొలి టైటిల్‌గా సొంతం చేసుకున్నారు. నాదల్ ఇప్పటి వరకు తన కెరీర్లో 22 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు సాధించారు. వీటిలో 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్.