కొండా సురేఖస్టేట్ మెంట్ రికార్డు చేయనున్న కోర్టు 

మంత్రి కొండాసురేఖపై మాజీ మంత్రికెటీఆర్ వేసిన పరువు నష్టం కేసు బుధవారం విచారణకు రానుంది . క్రిమినల్ కోర్టులో కెటీఆర్ వేసిన 100 కోట్ల పరువు నష్టం కేసు ఈ నెల 23న విచారణకు రానుంది.  నాగార్జున  కొడుకు నాగచైతన్య , సమంతతో విడాకులు తీసుకోవడానికి ప్రధాన కారణం కెటీఆర్ అని  కొండా సురేఖ ఆరోపించిన సంగతి తెలిసిందే . ఈ కేసులో కొండా స్టేట్ మెంట్ ను బుధవారం క్రిమినల్ కోర్టు రికార్డు చేయనుంది ఇప్పటికే సమంతకు  క్షమాపణలు చెప్పిన కొండా సురేఖ కెటీఆర్ మీద సీరియస్  గానే ఉన్నారు. తన ఆరోపణలు వెనక్కి తీసుకోవడం లేదని కొండా సురేఖ తేల్చేసి చెప్పేశారు  . దీంతో కెటీఆర్ పరువు నష్టంతో బాటు క్రిమినల్ కేసును కొండాపై వేశారు ఇప్పటికే రెండు విచారణలు జరిపిన కోర్టు కొండా స్టేట్ మెంట్ ఆధారంగా విచారణ చేపట్టనుంది నాగార్జున వేసిన పరువు నష్టం దావా వెనక కెటీఆర్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నాగార్జున  స్టేట్ మెంట్ ఇప్పటికే   రికార్డు చేసిన సంగతి తెలిసిందే 

వరదల్లో చిక్కుక్కున్న నాగార్జున 

  ఓ నగల దుకాణం ప్రారంభోత్సవంకు  పుట్టపర్తి నుంచి అనంతపురం బయలు దేరిన సినీ హీరో నాగార్జున వరదల్లో చిక్కుకు పోయారు హైదరాబాద్ నుంచి పుట్టపర్తికి ల్యాండ్ అయిన నాగార్జున కారు మార్గంలో అనంతపురం బయలు దేరారు  రాత్రంతా కురిసిన వర్షాలకు రోడ్లు జలమయమయ్యాయి. సత్యసాయి జిల్లాలో పండమేరు వాగు ఉప్పొంగి పలు కాలనీలో నీటమునిగాయి. నాగార్జున రాక సందర్బంగా రోడ్లపై అభిమానులు బారులు తీరారు . నాగార్జున వరదల్లో చిక్కుకుపోవడంతో నిర్వాహకులు మరో మార్గంలో అనంతపురంకు తీసుకెళ్లారు . తర్వాత నాగార్జున జెవెలరీ షాపును ప్రారంభించారు సత్యసాయి జిల్లాలో భారీ వర్షాల వల్ల  ప్రజలు తీవ్ర ఇబ్బందులకు  గురయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

డ్రోన్ సమ్మిట్ ను ప్రారంభించిన చంద్రబాబు- డ్రోన్ హబ్ గా ఏపీ లక్ష్యమని ఉద్ఘాటన

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ది, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా   పాలన కొనసాగిస్తోంది. మరీ ముఖ్యంగా అమరావతి రాజధానికి ఐకానిక్ ట్రెడ్ మార్క్ తెచ్చేందుకు సీఎం చంద్రబాబునాయుడు  కంకణం కట్టుకున్నారు. సాంకేతికతను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే  భాగంగానే విజయవాడలో రెండు రోజుల పాటు జరిగే డ్రోన్ సమ్మిట్ కు ఆయన మంగళవారం (అక్టోబర్ 22)న ప్రారంభించారు.   విజయవాడలోని పున్నమి ఘాట్ దగ్గరున్న సీకే కన్వెన్షన్ లో జరుగుతున్న ఈ సమ్మి ట్ ను ఉద్దేశించి ప్రసంగించిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ను డ్రోన్ హబ్ గా మార్చడమే లక్ష్యమని పేర్కొన్నారు.  ఈ డ్రోన్  సమ్మిట్ ను విజయవంతం చేసే బాధ్యతను చంద్రబాబు సర్కార్ పది మంది ఐఏఎస్ లకు బాధ్యత అప్పగించింది. రెండ్రోజుల పాటు జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ డ్రోన్ సమ్మిట్ సందర్భంగా రాష్ట్ర డ్రోన్ ముసాయిదా విధానం ఆవిష్కరించే అవకాశం ఉంది.    ఈ సమ్మిట్ లో ఏపీ డ్రోన్ కార్పొరేషన్  డ్రోన్ పైలెట్ శిక్షణపై క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకోనుంది. అలాగే తిరుపతి ఐఐటీని నాలెడ్జ్ పార్టనర్ గా చేర్చుకుంటూ మరో ఒప్పందం కుదుర్చుకుంటుంది.  నవంబరు చివరి  నాటికి డ్రోన్ పాలసీకి తుది రూపునిస్తామని ఏపీ డ్రోన్ కార్పొరేన్ తెలిపింది. ఇలా ఉండగా మంగళవారం (అక్టోబర్ 21) సాయంత్రం విజయవాడ బెరం పార్కులో  దేశంలోనే అతి పెద్ద డ్రోన్ షో నిర్వహించనున్నారు. 

ఉప్పొంగిన పండమేరు.. నీటమునిగిన కాలనీలు

ఉమ్మడి అనంతపురం జిల్లాలో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాలతో పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి.  అనంతపురం నగర శివారు కాలనీలో పూర్తిగా నీట మునిగాయి.  శ్రీ సత్య సాయి జిల్లాలో చిత్రావతి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గత రెండున్నర దశాబ్దాల కాలంలో ఎప్పుడూ లేనివిధంగా  చిత్రావతికి వరద పోటెత్తింది. అదే జిల్లాలోని కనగానపల్లి చెరువు తెగిపోవడంతో అనంతపురం నగరం  సమీప కాలనీలలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. మూడు దశాబ్దాలుగా ఎన్నడూ ఇంత స్థాయిలో వరద పోటెత్తలేదని స్థానికులు చెబుతున్నారు. వరద ముందు కారణంగా భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది.   ప్రధానంగా శ్రీ సత్యసాయి జిల్లాలోని వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. అక్కడికి సమీపంలో ఉన్న కాలనీవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.   ఇలా ఉండగా.. అనంతపురం శివారులో పండమేరు వాగు ఉధృతంగా ప్రవహించి పోటెత్తడతో వాగుకు ఆనుకుని ఉన్న  పలు కాలనీలోకి వరద నీరు ప్రవహించింది.  వరద నీటిలో ఇళ్ళు మునగగా.. ఆటోలు, బైకులు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. కనగానపల్లి చెరువు కట్ట తెగడంతో పండమేరు వాగుకు వరద ఉధృతి వచ్చింది. అటు పెనుకొండలో రాత్రి కురిసిన భారీ వర్షానికి గుట్టూరు, వెంకటగిరి పాలెం చెరువులు పొంగి, పొర్లుతున్నాయి. భారీ వర్షంతో ఒక్కసారిగా హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై వరద నీరు రావడంతో.. వరద నీటిలోనే బస్సులు, లారీలు, కార్లు నిలిచిపోయాయి. హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వరద నీటిలో చిక్కుకున్న బస్సులను పోలీసులు జేసీబీల సాయంతో బయటకు తీసి..   ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి  ముఖ్యఅనుచరుడు  హత్య

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి  ముఖ్య అను చరుడు గంగారెడ్డహత్యకు గురయ్యారు . 58 ఏళ్ళ గంగారెడ్డి జగి త్యాల జిల్లాలో హత్యకు గురయ్యాడు. కారుతో గంగా రెడ్డి ప్రయాణిస్తున్న కారును బలంగా ఢీ కొట్టడం వల్ల గంగారెడ్డి అక్కడికక్కడే చనిపోయాడు  ఈ హత్యను నిరసిస్తూ జగిత్యాల బస్టాండ్ వద్ద జీవన్ రెడ్డి ధర్నా చేశారు . రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చాక కాంగ్రెస్ నేతలకు రక్షణ లేకుండా పోయిందని జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. జగిత్యాలలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉందా అని జీవన్ రెడ్డి నిలదీశారు. జీవన్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ లో బలమైన నేత కావడం గమనార్హం.    

అమిత్ షాతో లోకేష్ ఆదివారం భేటీ.. విషయం అదేనా?

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ, మానవవనరుల శాఖ మంత్రి అయిన నారా లోకేష్.. రాజకీయాలలో తనదైన ముద్ర వేశారు. వేస్తున్నారు. సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా అమలు చేస్తూ ప్రజాదరణ పొందుతున్నారు. లోకేష్ మాట ఇచ్చారంటే చేసి తీరుతారన్న విశ్వాసం జనంలో వ్యక్తం అవుతోంది.  తాజాగా నారా లోకేష్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిపిన భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి కీలక అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చాయన్న ప్రచారం జరుగుతోంది. పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ రెడ్ బుక్ ఇప్పుడు ఓపెన్ అయ్యింది. అందులో భాగంగానే  తెలుగుదేశం కూటమి సర్కార్ దాదాపు 16 మంది ఐఏఎస్. ఐపీఎస్ లకు పోస్టింగులు ఇవ్వలేదు.  వీరంతో జగన్ హయాంలో నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారీతిగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే. వీరందరిపై కేంద్రం అనుమతితో చట్ట ప్రకారం చర్యలకు చంద్రబాబు సర్కార్ సిద్ధమౌతోంది. ఈ నేపథ్యంలోనే లోకేష్ అమిత్ షా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.  సాధారణంగా అమిత్ షా ఆదివారాలు రాజకీయ నేతలెవరికీ అప్పాయింట్ మెంట్ ఇవ్వరు. అయితే లోకేష్, అమిత్ షా భేటీ ఆదివారమే జరగడంతో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అమిత్ షాతో భేటీ అనంతరం లోకేష్ చేసిన ఒక ట్వీట్ వీరి భేటీ ఫలవంతమైందన్న సంకేతాలు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నందుకు అమిత్ షాకు కృతజ్ణతలు తెలుపుతూ లోకేష్ ట్వీట్ చేశారు. ఈ భేటీలో లోకేష్ ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగులు ఇవ్వకుండా పక్కన పెట్టిన ఆరోపణలను ఎదుర్కొంటున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు జగన్ హయాంలో వ్యవహరించిన తీరును వివరించినట్లు తెలుస్తోంది. ఈ అధికారులపై ఉన్న కేసులను వివరించి, వారిపై చర్యలకు తెలుగుదేశం కూటమి కట్టుబడి ఉందన్న తెలిపారని అంటున్నారు. అందుకు అమిత్ షా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఇక్కడ చెప్పుకోవలసిన మరో విషయమేమిటంటే లోకేష్ అమిత్ షాతో భేటీ కావడం దాదాపు ఏడాది తరువాత ఇదే మొదటి సారి. దాదాపు సంవత్సరం కిందట, అంటే చంద్రబాబును జగన్ సర్కార్ స్కిల్ కేసు అంటూ అక్రమంగా అరెస్టు చేసినప్పుడు లోకేష్ హస్తిన వెళ్లి అమిత్ షాతో భేటీ అయ్యారు.  ఈ సందర్భంగా విత్ హెల్డ్ లో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై  చట్టపరంగా తీసుకునే చర్యలకు అమిత్ షా మద్దతు తెలిపారని అంటున్నారు. అమిత్ షా, లోకేష్ ల భేటీతో వైసీపీ వర్గాలలో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. రెడ్ బుక్ ఓపెన్ అయ్యిందనీ, ఇప్పుడిక చర్యల ఉంటాయన్న సంకేతాన్ని ఈ భేటీ ఇచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

యథావిధిగా గ్రూప్ 1 మెయిన్స్.. సుప్రీం కోర్టు లైన్ క్లియర్

గ్రూప్ 1 మోయిన్స్ పరీక్ష యథావిధిగా జరగనుంది. ఈ మేరకు సుప్రీం కోర్టు లైన్ క్లియర్ చేసింది. పరీక్షను వాయిదా వేయాలంటూ గ్రూప్ 1 అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు నిరాకరించింది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు కూడా అంగీకరించలేదు. దీంతో షెడ్యూల్ ప్రకారం సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ఆరంభమైంది.   563 పోస్టుల భర్తీ కోసం గ్రూప్ 1 మెయిన్స్ సోమవారం (అక్టోబర్ 21) నుంచి   27వ తేదీ వరకు  యథావిధిగా జరుగుతాయి. ఈ పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.  ఈ పరీక్షల కోసం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో  46   కేంద్రాల వద్దా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  

పుష్ప2 విడుదలకు క్వాష్ పిటిషన్ తో కష్టాలను కొనితెచ్చుకున్న అల్లు అర్జున్?

అల్లు అర్జున్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఏపీ ఎన్నికల సమయంలో తన నంద్యాల పర్యటేన సందర్భంగా తనపైన నమోదైన కేసును క్వాష్‌ చేయాలని కోరుతూ అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇంతకీ అల్లు అర్జున్ పై నమోదైన కేసు ఏమిటంటే... నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల వేళ అల్లు అర్జున్ ఆయన నివాసానికి వెళ్లారు. ఆ సందర్భంగా ఒక రోడ్ షో కూడా నిర్వహించారు. అయితే ఎన్నికల వేళ పోలీసు ఆంక్షలను ధిక్కరించి అనుమతి లేకుండా రోడ్ షో నిర్వహించినందుకు నంద్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ తో పాటు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిపైనా కేసు నమోదైంది. ఆ కేసునే క్వాష్ చేయాలంటూ అల్లు అర్జున్ ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు.    అప్పట్లో అల్లు అర్జున్ నంద్యాల పర్యటన వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. మెగా అభిమానులంతా తెలుగుదేశం కూటమికి మద్దతుగా నిలిచిన వేళ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. దాదాపు మెగా ఫ్యామిలీ అంతా పవన్ కల్యాణ్ కు మద్దతుగా నిలిచింది. అటువంటి తరుణంలో తెలుగుదేశం కూటమి ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు ప్రకటించడం, ర్యాలీ నిర్వహించడం సంచలనం సృష్టించింది. దీనిపై మెగా బ్రదర్, జనసేన నాయకుడు నాగబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మెగా అభిమానులు అల్లు అర్జున్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్ప2 సినిమాపై వారి ఆగ్రహం ప్రభావం తప్పకుండా పడుతుందన్న అభిప్రాయం కూడా అప్పట్లో వ్యక్తమైంది. ఇప్పుడిప్పుడే ఆ ఆగ్రహం చల్లారుతోంది. పైగా నంద్యాలలో అల్లు అర్జున్ పై నమోదైనది చాలా చిన్న కేసు. పెద్దగా శిక్ష పడే అవకాశం ఉన్నది కూడా లేదు. అసలా కేసు   పురోగతి ఎలా ఉందో కూడా ఎవరికీ తెలియదు. అటువంటి సమయంలో ఇప్పుడు హఠాత్తుగా అదీ పుష్ప 2 రిలీజ్ కు ముందు ఆ కేసును క్వాష్ చేయాలంటూ అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించడం కచ్చితంగా మెగాభిమానుల పాత గాయాలను కెలకడమే అవుతుంది. అల్లు అర్జున్ తన క్వాష్ పిటిషన్ ద్వారా పుష్ప2 రిలీజ్ ముందు  అనవసరంగా ఇబ్బందులను కొని తెచ్చుకున్నారన్న భావన ఆయన అభిమానులలోనే వ్యక్తం అవుతుంది. 

దివ్వెల మాధురికి నోటీసులు

దివ్వెల మాధురి యూట్యూబర్ గా ఆమెకు ఉన్న గుర్తింపు అంతంత మాత్రమే. అయితే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో  వ్యవహారంలో మాత్రం మహా పాపులర్. దివ్వెల మాధురి తన భర్తను, దువ్వాడ శ్రీనివాస్ తన భార్యా బిడ్డలను వదిలేసి మరీ సహజీవనం చేస్తున్నారు. ఈ విషయం రచ్చకెక్కింది. దువ్వాడ శ్రీనివాస్ భార్యా కుమార్తెలు రోడ్డెక్కి ధర్నాలు సైతం చేశారు. అయితే దువ్వాడ, దివ్వెల ఇసుమంతైనా ఖాతరు చేయలేదు. ప్రజలేమనుకుంటారన్న సంకోచం లేకుండా బాహాటంగా తమ మధ్య సంబంధం, అనుబంధం ఉన్నదని చాటారు. ఇద్దరూ కూడా వివాహం చేసుకుంటామనీ, అందుకు సంబంధించిన ప్రొసీజర్ జరుగుతోందని చెప్పారు. ప్రొసీజర్ అంటే దువ్వాడ శ్రీను తన భార్యకు, దివ్వెల మాధురి తన భర్తకు విడాకులు ఇచ్చేయడం అన్న మాట. ఆ విడాకుల ప్రక్రియ పూర్తి అయిన తరువాత చట్టబద్ధంగా పెళ్లి చేసుకుంటామని ఇద్దరూ సంయుక్తంగా, వేరువేరుగా కూడా ప్రకటనలు ఇచ్చేశారు. టీవీ ఇంటర్వ్యూలలో కూడా చెప్పారు. అక్కడితో ఆగకుండా వీరిద్దరూ తిరుమల వేదికగా ప్రీ వెడ్డింగ్ షూట్ లాంటిది కూడా చేశారు. అదిగా ఆ విషయంలోనే దివ్వెల మాధురికి  తిరుమల పోలీసులు నోటీసులు జారీ చేశారు. తిరుమల వేదికగా జరిగిన ఫోటో షూట్, ఆ సందర్భంగా ఆమె తన వ్యక్తిగత జీవితాన్ని గురించి చేసిన వ్యాఖ్యలపై టీటీడీ విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. దివ్వెల మాధురి తిరుమల కొండపై వ్యవహరించిన తీరు తిరుమల ఆలయ నియమాలకు భంగం వాటిల్లేలా ఉందని విజిలెన్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుమల పోలీసులు మాధురిపై బీఎన్ఎస్ 292, 296, 300 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బహిరంగ ప్రదేశాలలో అనుచిత ప్రవర్తన, మతపరమైన సెంటిమెంట్లకు భంగం కలిగించడం వంటి నేరాలకు మాధురి పాల్పడినట్లు పేర్కొంటూ ఆమెకు నోటీసులు జారీ చేశారు.   

మల్లారెడ్డి మాస్ డ్యాన్స్.. స్టెప్పులతో ఇరగదీశారు!

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మామూలోడు కాదు. ఆయన రాజకీయ నాయకుడే .. వ్యాపారవేత్త, ప్రముఖ విద్యాసంస్థల అధినేత కూడా. ఆయన ఏం మాట్లాడినా? ఏం చేసినా సంంచలనమే అవుతుంది. పూలమ్మినా, కట్టెలమ్మినా, పాలమ్మినా అంటూ ఆయన మాస్ డైలాగులతో చాలా చాలా పాపులర్ అయ్యారు. రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్నా ఆయన డైలాగుల్లో పంచ్ మాత్రం అలాగే ఉంటుంది. ఆ కారణంగానే ఆయన పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పరిస్థితి.   గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మల్లారెడ్డి సభలు, సమావేశాలు, ప్రసంగాలకు మంచి స్పందన లభించింది.   ‘ఔను.. పూలమ్మినా.. పాలమ్మినా’ అంటూ మంత్రి మల్లారెడ్డి చేసిన ఒక్క ప్రసంగం.. సోషల్ మీడియాలో  తెగ వైరల్ అయ్యింది. అటువంటి మల్లారెడ్డి తాజాగా మాస్ స్టెప్పులతో అదరగొట్టేశారు. ఆయన డ్యాన్స్ సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  మల్లారెడ్డి మనవరాలు, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహం ఈ నెల 27 న జరగనున్న విషయం తెలిసిందే. దీనికి ముందు కుటుంబసభ్యులు, బంధుమిత్రుల మధ్య సంగీత్ ఫంక్షన్ నిర్వహించారు. ఆ ఈవెంట్ వేదికగానే మల్లారెడ్డి తన మాస్ స్టెప్పులతో చెలరేగిపోయారు.  ఏడు పదుల వయస్సులోకూడా ఆయన కుర్రాళ్లతో సమానంగా మాస్ స్టెప్పులు వేసి అలరించారు.  గతంలో పలు ఈవెంట్లలో  మల్లారెడ్డి చేసిన డ్యాన్సులు ఒకెత్తు,  ఈ సారి డ్యాన్సు స్టెప్పులు మరో ఎత్తు అన్నట్లుగా ఆయన డ్యాన్స్ ఉంది. సంగీత్ లో మాస్ స్టెప్పులు వేయడం కోసం మల్లారెడ్డి కొరియోగ్రాఫర్ల వద్ద శిక్షణ కూడా తీసుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మొత్తానికి మనవరాలి పెళ్లి సంగీత్ లో మల్లారెడ్డి స్టెప్పులు ఇప్పుడు టాక్ ఆఫ్ ది సిటీగా మారిపోయాయి. 

వయనాడ్ లో బిజెపి అభ్యర్థి నవ్య హరిదాస్ ప్రియాంకను ఓడించనుందా? 

వయనాడ్​లో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీపై , రాష్ట్ర బీజేపీ మ‌హిళా మోర్చా జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ న‌వ్య హ‌రిదాస్‌ను బీజేపీ బరిలోకి దింపింది. దీంతో ఇద్దరు మహిళా నేతల మధ్య  నువ్వా నేనా  అనే  పోరు నెలకొంది. భారతీయ జనతా పార్టీ వయనాడ్ అభ్యర్థిగా నవ్య హరిదాస్‌(39) పేరును కన్ఫర్మ్ కావడంతో  ఆమె  రాజకీయ ప్రస్థానం ఏంటి? అనే చర్చ నడుస్తోంది. కాలికట్ యూనివర్సి నుంచి ఇంజినీరింగ్ కాలేజీ నుంచి బీటెక్ పూర్తి చేశారు నవ్య. ప్రస్తుతం కోజీకోడ్ కార్పొరేషన్​లో బీజేపీ కార్పోరేటర్ గా ఉన్నారు . వరుసగా ఆమె రెండు సార్లు కార్పోరేటర్ గా ఉన్నారు  2021లో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో  ఓ సారి కోజీకోడ్ సౌత్ నియోజకవర్గం నుంచి ఎన్​డీఏ అభ్యర్థిగా నవ్య హరిదాస్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ దేవర్కోవిల్ చేతిలో ఓడిపోయారు. తాజాగా వయనాడ్ లోక్​సభ ఉప ఎన్నికల బరిలో దిగుతున్నారు. కాగా,ఆమె పై ఎటువంటి క్రిమినల్ కేసులు లేవు. గాంధీ కుటుంబం  వయనాడ్ ను సెకండ్ ఆప్షన్ గా ఎం చుకుందన్నారు  నవ్యహరిదాస్ .  

ఆంధ్రప్రదేశ్ కు మరో వాయు‘గండం’?

ఆంధ్రప్రదేశ్ పై ప్రకృతి పగబట్టిందా? అన్నట్లుగా ఒకదాని వెంట ఒకటిగా తుపానులు రాష్ట్రంపై విరుచుకుపడుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ కు మరో తుపాను ముప్పు ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అప్పపీడనం మరింత బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఈ తుపాను కారణంగా మరో నాలుగైదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ కు భారీ నుంచి అతి భారీ వర్షాల గండం ఉందని పేర్కొంది ఉత్తర అండమాన్ సముద్రం మీదుగా కొనసాగుతున్న  ఆవర్తనం  ప్రభావంతో  వచ్చే  24 గంటల్లో తూర్పు మధ్య బంగాళాఖాతం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ అల్ప పీడనం బలపడి ఆ నెల23 నాటికి తుఫాన్‌గా బలపడే అవకాశం ఉంది. ఈ తుపాను 24వ తేదీన  తీవ్ర తుపానుగా మారి 25వ తేదీన ఒడిశా, లోని గోపాలపూర్‌, పూరి మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో అక్టోబర్ 24, 25తేదీలలో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హచ్చరించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనీ, మత్స్యకారులు సముద్రంపై వేటకు వెళ్ల రాదనీ హెచ్చరించింది.  

మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడి అరెస్టు

మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు పినిపే శ్రీకాంత్ ను పోలీసులు మధురైలో అరెస్టు చేశారు. దళిత యువకుడి హత్య కేసులో నిందితుడిగా ఉన్న పినిపే శ్రీకాంత్ గత కొంత కాలంగా పరారీలో ఉన్నాడు. ఆయనను పోలీసులు మధురైలో గుర్తించి అరెస్టు చేశారు. దళిత యువకుడి హత్య కేసు వివరాలు ఇలా ఉన్నాయి.   కోనసీమ జిల్లా అయినవిల్లికి చెందిన దళిత యువకుడు జనుపల్లి దుర్గాప్రసాద్ అయినవిల్లి గ్రామంలో వాలంటీర్ గా పని చేసేవాడు. మాజీమంత్రి పినిపే విశ్వరూప్ కు అనుచరుడు. అదే క్రమంలో పినిపే శ్రీకాంత్ కు సన్నిహితుడిగా మారాడు. ఇటీవలి ఎన్నికలలో పి. గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు పినిపే శ్రీకాంత్ ప్రయత్నాలు చేశారు. ఆ క్రమంలో పినిపే శ్రీకాంత్ కు అన్ని విధాలుగా జనుపల్లి దుర్గాప్రసాద్ సహాయ సహకారాలు అందించారు.  కాగా ఆ క్రమంలో కోనసీమకు అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం చేయడంపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అయ్యింది. అప్పట్లో ఆ ఆందోళన హింసాకాండకు దారి తీసింది. ప్రధానంగా కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో పెద్ద ఎత్తున అల్లర్లు హింసాకాండ చెలరేగింది. ఆ అల్లర్లలో పినిపే విశ్వరూప్ ఇంటిని ఆందోళన కారులు ధ్వంసం చేశారు. ఆ సమయంలో దాదాపు నెల రోజుల పాటు అమలాపురం వ్యాప్తంగా ఆంక్షలు అమలులో ఉన్నాయి. కర్ఫ్యూ కూడా విధించారు. ఆ సమయంలోనే అంటే 2022 జూన్ 6న జనుపల్లి దుర్గాప్రసాద్ అదృశ్యమయ్యారు. అతడి మృతదేహం అదే  నెల 10 ముక్తేశ్వరం రేవు వద్ద అభించింది. అయితే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు అధికార పార్టీ ఒత్తిళ్లతో దర్యాప్తును సాగించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పటికి పినిపే విశ్వరూప్ మంత్రిగా కూడా ఉండటంతో ఈ కేసును పోలీసులు నీరుగార్చారన్న విమర్శలూ వెల్లువెత్తాయి.  ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. విచారణలో భాగంగా మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడి ప్రమేయం ఉందని వెల్లడి కావడంతో పోలీసులు పినిపే శ్రీకాంత్ ను ఈ కేసులో ఏ1గా చేర్చారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసిన ధర్మేష్ అనే యువకుడు విచారణఏలో పినిపే శ్రీకాంత్ ఆదేశాల మేరకు జనుపల్లి దుర్గా ప్రసాద్ హత్య జరిగిందని వెల్లడి కావడంతో శ్రీకాంత్ కోసం గాలింపు చేపట్టారు.  పరారీలో ఉన్న శ్రీకాంత్ మధురైలో ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశారు.  

తెలంగాణ సచివాలయం వద్ద గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళన 

గ్రూప్ 1 అభ్యర్థులను   బిఆర్ఎస్ పరామర్శించినప్పటికీ ఆందోళన కారుల నుంచి సంఘీభావం వం రాలేదు ఈ  సంఘటన తెలంగాణ సచివాలయం దగ్గర జరిగింది. గ్రూప్ 1 అభ్యర్థులు సచివాలయం ఎదుట బైఠాయించారు. గ్రూప్ 1 పరీక్షలను  వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ శనివారం సచివాలయం ఎదుట గ్రూప్ 1 అభ్యర్థులు బైఠాయించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నేత బండి సంజయ్ ను అరెస్ట్ చేశారు. ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపట్టిన ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. సచివాలయం గేట్లను మూసివేశారు గ్రూప్ -1 అభ్యర్థుల పోరాటం  కంటిన్యూ అవుతోంది.  మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాలంటూ మరోసారి ఆందోళనకు దిగారు. ర్యాలీగా సచివాలయానికి బయలుదేరారు. తెలుగుతల్లి ప్లై ఓవర్ వద్ద వీరికి బీఆర్​ఎస్, బీజేపీ నేతలు మద్దతు పలికారు. అయితే ఈ సమయంలో బీఆర్​ఎస్ నేతలకు చేదు అనుభవం ఎదురైంది.  బీజేపీ, బిఆర్ ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. సచివాలయానికి ర్యాలీగా వెళ్తున్న గ్రూప్‌ వన్‌ అభ్యర్థులకు మద్దతుగా వచ్చిన  బిఆర్ ఎస్ నాయకులు శ్రీనివాస్‌గౌడ్‌, ప్రవీణ్‌కుమార్‌లను గ్రూప్‌వన్‌ అభ్యర్థులు అడ్డుకున్నారు. గులాబీ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గో బ్యాక్‌అంటూ నినాదాలు చేశారు. ఇదే సమయంలో అక్కడకు బీజేపీ నేతలు రావడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. ఇదిలా వుండగా  కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా అక్కడకు చేరుకున్నారు. గ్రూప్‌1 మెయిన్స్‌ పరీక్షపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆందోళనలో ఉన్న విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారని ఆయన ప్రశ్నించారు. జీవో 29పై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు 

జనసేన గూటికి ముద్రగడ పద్మనాభం కుమార్తె

ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి జనసేన గూటికి చేరారు. జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమక్షంలో ఆమె జనసేన తీర్ధం పుచ్చుకున్నారు. పవన్ కల్యాణ్ కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల సమయంలో తన తండ్రి ముద్రగడ పద్మనాభం పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పిస్తూ మొత్తం కాపు జాతికి తానే ప్రతినిధిని అని చెప్పుకోవడాన్ని అప్పట్లో క్రాంతి తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. తన తండ్రి ముద్రగడ పద్మనాభం పవన్ పై చేస్తున్న విమర్శలను తాను ఖండిస్తున్నానని చెప్పి జనసేనకు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.    అప్పట్లోనే  క్రాంతి భారతి జనసేన పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. అయితే అందుకు సున్నితంగా తిరస్కరించారు. తండ్రీ కూతుళ్లను విడదీయడం తన అభిమతం కాదంటూ పవన్ కల్యాణ్ ఎన్నికల తరువాత ఆమె చేరికను ఆహ్వానని చెప్పిన సంగతి తెలిసిందే. అన్నట్లుగానే ఎన్నికలు పూర్తయ్యాయి. తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టింది. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి జనసేన గూటికి చేరారు. అన్నట్లుగానే పవన్ కల్యాణ్ ఆమెకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.