వరకట్నం ఇవ్వాలన్న నియమం లేదు
posted on Oct 11, 2024 @ 2:44PM
జాఫర్ భయ్ తన చెల్లెలు అప్సర్ కి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. కాని చేతిలో చిల్లి గవ్వలేదు. సమస్య పరిష్కారానికి మౌలానా దగ్గరికి వస్తాడు జాఫర్ భాయ్.
జాఫర్ భాయ్: సలాంవాలేకూం మౌలానా సాబ్
మౌలానా: వాలేకుం సలాం జాఫర్ భాయ్ కైరియత్ , కైసే హై ఆప్
జాఫర్ భాయ్: అలమ్ దు లిల్లా జీ మౌలానా సాబ్ . మేరీ బెహన్ కా షాదీ కర్నా హై . జెహేజ్ కా ఇంతెజామ్ నై వుహా . సొల్యూషన్ బతాయియే
మౌలానా: ఇస్లాంలో నిఖా( పెళ్లి) అత్యంత సులభతరం . ఖర్చులు వీలయినంతగా తగ్గించాలి. ఈ మధ్యకాలంలో నిఖాలు అత్యంత విలాసవంతంగా జరుగుతున్నాయి. వయసు పెరుగుతున్న కొద్దీ చావు దగ్గరవుతుంది. వయసులో ఉన్నప్పుడే నిఖా చేయాలి.అపుడు యుక్త వయసులో ఉన్నప్పుడే వారి పిల్లలు పెద్దవారు అవుతారు. ప్రయోజకులు అవుతారు. పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ లో పెళ్లిళ్లు చేయకండి. డబ్బులేనప్పుడు తమ తాహతును బట్టీ నిఖా చేసేయండి. ఖర్చు తగ్గుతుంది. షరియత్ లో గోరింటాకు వేడుకలు అట్టహాసంగా జరుపుకోవడం నిషిద్దం . నిఖాను సులభతరం చేయాలి. ఇస్లాం ప్రకారం బరాత్ కు చోటే లేదు. వరకట్నం ఇవ్వాలన్న నియమం ఇస్లాంలో లేదు. పెళ్లికి ఆరు నెలల ముందే సంబరాలు ప్రారంభిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు.ఇవి కూడా నిషేధం. డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడే వలీమా(డిన్నర్) ఘనంగా చేసుకోవచ్చు. నేను వెయ్యి రూపాయల మొబైల్ ఫోన్ కొనుగోలు చేసే కెపాసిటీ ఉంటుంది. కాని అవతలి వ్యక్తి లక్ష రూపాయల మొబైల్ ఫోన్ కొన్నాడని మనం కొనాల్సిన అవసరం లేదు. వ్యక్తుల స్థితి గతులను బట్టీ పెళ్లిళ్లు చేయాలి. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు అవుతుంది మరి. పెళ్లిళ్లు చేయాలి కానీ మెహర్ (వరకట్నం) అమ్మాయి తరపున తండ్రి ప్రకటించాల్సి ఉంటుంది. తండ్రి లేనప్పుడు బాబాయ్, మామయ్య మెహర్ ప్రకటించాల్సి ఉంటుంది. అబ్బాయి వాళ్లు మెహర్ అడుగుతారు. అప్పుడు అమ్మాయి తరపు వాళ్లు అబ్బాయి తరపున వారితో సామరస్యంగా చర్చించుకోవాలి. ఇస్లాంలో అమ్మాయి తండ్రి వరకట్నం ఇవ్వాలన్న నియమం లేదు. అమ్మాయికి కనీస అవసర వస్తువులు ఇవ్వొచ్చు. బైక్, ఎయిర్ కూలర్, మంచం, ఆల్మారా వంటివి అబ్బాయి తరపున వాళ్లు అడగొచ్చు. అయితే అమ్మాయి తరపు వాళ్లు ఇష్టంగా ఒప్పుకుంటే మాత్రమే. బలవంతంగా వసూలు చేయకూడదు అంటూ మౌలానా జాఫర్ బయ్ కు వివరించాడు.
- బదనపల్లి శ్రీనివాసాచారి