హే జగన్నాథా.. అవినీతి సొమ్ములోనూ వాటాల గొడవా?

ముందు తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని, ఆ తరువాత తన అధికార మదంతో కొట్లకు పడగలెత్తిన రాజకీయ నేత ఎవరైనా ఉన్నారంటే ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. అడ్డగోలు అక్రమ సంపాదనంతా తన కష్టార్జితమని నిస్సిగ్గుగా చెప్పుకోగలిగిన ధీశాలి కూడా ఆయనే.  2009 నుంచి 2024 మధ్య కాలంలో ఆయన ఆస్తులు వందల రెట్లు ఎలా పెరిగాయన్నది చిదంబర రహస్యమే. స్వేదం చిందించి, కంపెనీలు పెట్టి ఆస్తులను కూడబెట్టానని చెప్పుకుంటున్న జగన్.. 2009 ఎన్నికలకు ముందు కేవలం పది లక్సల రూపాయలలోపు ఆదాయం మాత్రమే ఉన్న వ్యక్తి 2024 నాటికి వందల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా కూడబెట్టగలిగారన్నది చిదంబర రహస్యమే.  జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2009 ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లో వివరాల మేరకు ఆయన పేరుమీద సేవింగ్స్ అక్కౌంట్ లో  అప్పట్లో లక్షా 93 వేల 797 రూపాయలు ఉన్నాయి. అలాగే ఆయన భార్య విజయలక్ష్మి సేవింగ్స్ అక్కౌంట్లో నాలుగు లక్షల 54 వేల 663 రూపాయలు ఉన్నాయి. ఇంకా ఆమె పేరుపై  సెవింగ్స్ 40 లక్షల రూపాయల ఫిక్సెడ్ డిపాజిట్ ఉంది.  ఇంకా వైయస్ పేరు మీద షేర్ మార్కెట్ లో 20 లక్షల రూపాయలు,  ఆయన భార్య పేరు మీద 35 లక్షల 25 వేల రూపాయల విలువ చేసే షేర్లు ఉన్నాయి.  అలాగే ఇద్దరి పేరు మీద  చెరొక అరకేజీ  అంటే మొత్తం కేజీ బంగారం ఉంది.  ఇవి కాక  కడప జిల్లా ఇడుపులపాయలో  39.52 సెంట్లు,   అర ఎకరం తక్కువ 40 ఎకరాల భూమి ఉంది. అలాగే పులివెందుల పట్టణం రాజారెడ్డి స్ట్రీట్ లో  83 గజాల స్థలం వుంది.   ఇది వైఎస్ 2009లో కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లో ఉన్న ఆస్తులు. వైఎస్ కు అప్పట్లో కనీసం కారు కూడా లేదు.   సరే 2004లో వైఎస్ సీఎం కా కముందు  ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ఆదాయపన్ను శాఖకు చూపించిన ఆస్తి   కేవలం పది లక్షల రూపాయలు మాత్రమే.  అయితే తండ్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ పగ్గాలు చేపట్టిన తరువాత జగన్ ఆస్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. 2011 లో కడప లోక్ సభ స్థానానికి జగన్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ సమయంలో  ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్లో  ఆస్తి విలువ అక్షరాలా  365 కోట్లు. ఇక ఆయన భార్య భారతి పేరు మీద ఉన్న ఆస్తి విలువ 41 కోట్ల రూపాయలు.  తండ్రి అధికారంలోకి  రాక ముందు అంటే 2004 కు ముందు  కేవలం  పది లక్షల లోపు ఆదాయం చూపిన వ్యక్తి  2011 నాటికి వందలకోట్లు  ఎలా కూడబెట్టగలిగారన్నది చిదంబర రహస్యమే కదా? తన వ్యాపార విజయ రహస్యం జగన్ దంపతులే వెల్లడించాలి. లేదా అక్రమాస్తుల కేసుల విచారణలో నిగ్గు తేలాలి. అది పక్కన పెడితే 13 ఏళ్ల కిందటే జగన్   43 వేల కోట్ల  ఆర్థిక నేరాలకు పాల్పడ్డారాని ఈడీ, సీబీఐలు కోర్టుకు తెలిపాయి. ఇప్పుడు అదిలక్ష కోట్లు  దాటేసింది.   ఇక జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ఐదేళ్ల విధ్వంస పాలనలో ఒక్క  మద్యం, మట్టి , మైనింగ్ ఇసుక  అక్రమ వసూళ్ళు  ఎంత ఉంటాయన్నది ఎవరి ఊహకు కూడా అందదు.  అటువంటి జగన్ ఇప్పుడు చెల్లెలు షర్మిలతో ఆస్తుల విషయంలో గొడవ పడుతున్నారు. తనకు రాజకీయంగా నష్టం కలిగించేలా వ్యవహరిస్తోంది కనుక చెల్లెలు షర్మిలకు ఆస్తుల్లో వాటా ఇచ్చేది లేదని ఢంకా బజాయించి చెబుతున్నారు. తండ్రి వైఎస్ బతికి ఉండగానే ఆస్తుల పంపకం జరిగిపోయిందని నమ్మబలుకుతున్న జగన్.. ఇప్పుడు షర్మిల కోరుతున్న ఆస్తులు తన కష్టార్జితం అని చెబుతున్నారు. అయితే తల్లి విజయమ్మ మాత్రం కుమారుడు జగన్ చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలని ఓ బహిరంగ లేఖలో విస్పష్టంగా ప్రకటించారు.  దీంతో  సొంత పత్రికలో తల్లీ చెల్లిపై వారి వ్యక్తత్వ హననానికి పాల్పడేలా కథనాలు. వారిద్దరూ చంద్రబాబు చెప్పినట్లల్లా చేస్తున్నారంటూ అభాండాలు.   మొత్తంగా షర్మిలతో ఆస్తుల వివాదంలో జగన్ వాదన అబద్ధమన్నది సులువుగా అర్ధమైపోతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చెల్లెలికి ఆస్తుల్లో వాటాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని తల్లి విజయమ్మ కూడా తన బహిరంగ లేఖ ద్వారా జగన్ దుర్మార్గాన్ని బట్టబయలు చేసేశారు. అయినా శత్రువుతో కుమ్మక్కు అంటూ తల్లి, చెల్లెలిపై విమర్శలు గుప్పిస్తూ జగన్ ఎవరిని నమ్మించాలని ప్రయత్నిస్తున్నారో అర్ధం కావడం లేదని అంటున్నారు. సొంత పత్రికలో ఏం రాసినా అడిగేవాళ్లు ఉండరన్నట్లుగా ఆయన మాటలు చేతలు ఉన్నాయని అంటున్నారు. అయినా  ఎనిమిది ఈడీ కేసులు, 11సీబీఐ కేసులు, 13 ఐటీ కేసుల్లో ఏ1 గా ఉన్న జగన్ మోహన్ రెడ్డి వందల కోట్ల ఆస్తులను చెమటోడ్చి సంపాదించానంటే నమ్మెదేలా అని జనం అంటున్నారు. అయినా పిచ్చి  కాకపోతే ఆస్తే అవినీతి అయినప్పుడు నీతిగా పంచమని అడుగుతారేంటి?

అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. కమలా హారిస్ విజయాన్ని కాంక్షిస్తూ ఇండియాలో పూజలు

మొత్తం ప్ర‌పంచ‌ం ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్న అమెరికా ఎన్నికల పోలింగ్ మంగళవారం (నవంబర్4) పోలింగ్  జ‌ర‌గ‌నుంది.  అగ్ర‌రాజ్యంలో దాదాపు 24.4కోట్ల మంది ఓట‌ర్లలో ముంద‌స్తు ఓటింగ్ ద్వారా 7.5 కోట్ల‌ మంది త‌మ ఓటు హ‌క్కు ఇప్పటికే వినియోగించేసుకున్నారు. ఇక చివ‌రి వ‌ర‌కు ఓట‌ర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌, క‌మ‌లా హారిస్ ల ప్రచారానికి సోమవారం(నవంబర్ 3)తో ముగుస్తుంది. ఇప్పటి వరకూ అమెరికా అధ్యక్ష ఎన్నికలపై నిర్వహించిన పలు సర్వేలు.. గెలుపు ఎవరిదన్నది ఇతమిథ్ధంగా తేల్చలేకపోయాయి కానీ పోరు హోరాహోరీగా ఉంటుందన్న స్పష్టత ఇచ్చాయి.  ఇవాళ రాత్రితో వారి ప్ర‌చారం ముగియ‌నుంది. ఇప్ప‌టివ‌ర‌కు నిర్వ‌హించిన స‌ర్వేల‌ను బ‌ట్టి ఇరువురి మ‌ధ్య హోరాహోరీ పోరు త‌ప్ప‌ద‌ని తేలింది. మరీ ముఖ్యంగా ఎన్నికలలో  స్వింగ్ స్టేట్స్‌లో కమలాహారిస్, ట్రంప్ లు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయని దాదాపు అన్ని సర్వేలూ తేల్చేశాయి.  ఈ రాష్ట్రాల్లో అక్టోబ‌ర్ 24 నుంచి న‌వంబ‌ర్ 2 వ‌ర‌కు ది న్యూయార్క్ టైమ్స్‌- స‌ర్వే నిర్వ‌హిం చింది. ఇందులో విస్కాన్సిన్‌, నార్త్ క‌రోలినా, నెవెడాలో క‌మ‌లకు మ‌ద్ద‌తు ఉంటే.. అరిజోనాలో ట్రంప్‌ వైపు ఓట్ల‌రు మొగ్గ‌చూపుతున్న‌ట్లు తేలింది.  అలాగే పెన్సిల్వేయా, జార్జియా, మిషిగ‌న్‌లో ఇరువురు అభ్య‌ర్థుల మ‌ధ్య తీవ్ర పోటీ ఉన్న‌ట్లు దిన్యూయార్క్ టైమ్స్ ఒపీనియన్ పోల్ వెల్లడించింది.  ఇలా ఉండగా అమెరికా ఎన్నికలలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్ విజయాన్ని కాంక్షిస్తూ ఇండియాలో పూజలు జరుగుతున్నాయి. ఇందులో వింతేమీ లేదు. కమలా హారిస్ భారత సంతతికి చెందిన వ్యక్తి కావడంతో భారత్ లో ఆమె విజయాన్ని కోరుకునే వారి సంఖ్య అధికంగా ఉంది. మరీ ముఖ్యంగా తమిళనాడులోని తులసేంద్రపురం అనే గ్రామంలో కమలా హారిస్ విజయం కోసం పూజలు నిర్వహించడమే కాదు. అమెరికా అధ్యక్ష ఎన్నికలో ఇక్కడి ప్రజలు కూడా ఓట్లు వేస్తున్నారా అన్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచార సంరంభం కనిపిస్తోంది. గ్రామం అంతటా కమలా హారిస్ కు మద్దతుగా పోస్టర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లు వెలిశాయి.   అందుకు కారణం లేకపోలేదు. కమలా హారిస్ తల్లి డాక్టర్ శ్యామల స్వగ్రామం తులసేంద్ర పురం. ఆ ఊరి జనం కమలాహారిస్ ను తమ ఇంటి ఆడబడుచుగా భావిస్తున్నారు. ఎందుకంటే ఆమెరికాలో పుట్టిపెరిగినా కమలా హారిస్ తన అమ్మమ్మ గారి ఊరైన తులసేంద్రపురం గ్రామానికి పలుమార్లు వచ్చి వెళ్లారు. అలా ఆ గ్రామస్తులకు కమలాహారిస్ పట్ల అభిమానం ఏర్పడింది.  దీంతో కమలా హారిస్ విజయాన్ని కాంక్షిస్తూ వారు పూజలు చేస్తున్నారు. గ్రామం అంతటా ఆమె పోస్టర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లు పెట్టి హంగామా చేస్తున్నారు. ఎన్నికలలో ఆమె విజయం సాధిస్తే పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవడానికి సమాయత్తం అవుతున్నారు. 

అమెరికా అద్యక్ష ఎన్నికలు.. గెలుపోటములను ప్రభావితం చేసే కీలక అంశాలు!

అమెరికా ఎన్నికల్లో ఇంటర్నల్ ఎక్స్‌టర్నల్ ఏజెన్నీల పాత్ర చాలా లోతుగా వుంటుంది ఇంటర్నల్ గా ఎఫ్బీఐ ఎక్స్టర్నల్ గా యూఎస్ సీఐఏ, యూకే ఎమ్ఐ6, కెనడా ఆర్సీఎంపీ,  ఆస్ట్రేలియ ఏఎస్ఐఎస్,  న్యూజిల్యాండ్ ఎజెన్సీ ఎన్ జడ్ఎస్ఐఎస్.   ఈ ఐదింటినీ  ఫైవ్ ఐస్  అని పిలుస్తారు.  అయితే వీటన్నిటికీ మించి ఇజ్రాయెల్ కు చెందిన ప్రపంచ టాప్ మెస్ట్ సీక్రేట్ సర్వీస్ ఏజెన్సీ మొసాద్లే  మోడియన్ ఉలే తఫ్కిడిమ్ మేయుహదిమ్. వీటి ప్రమేయం లేకుండా  అమెరికా ఎన్నికలు జరగవు.  అమెరికా ఎన్నికలను ప్రభావితం చేసేలా అనేక  కుట్రలు, కుతంత్రాలు. పన్నాగాలు ,  అమానవీయ కార్యక్రమాలకు ఈ ఏజెన్సీలు ఏ మాత్రం వెనుకాడవు.   గతంలో వీరి చెప్పు చేతల్లో లేని రాబర్ట్ ఎఫ్ కెనడీ బాబీ కెనడి మేల్ కమ్ఎక్స్  మార్టిన్ లూథర్ కింగ్ ను అంతం చేసింది కూడా ఈ ఏజన్సీలే!  గత ఎన్నికల్లో జరిగిన అనేక అక్రమాలకు మించిన దారుణాలు ఈ ఎన్నికల సందర్బంగా జరుగుతున్నాయి. బైడెన్ ప్రభుత్వం ఇల్లీగల్ మైగ్రెంట్స్ ను దేశంలోకి అక్రమంగా అనుమతి ఇస్తొంది. టెక్సాస్, మెక్సికో  సరిహద్దులు అనధికారికంగా తెరుచుకున్నాయి అమెరికాకు అక్రమంగా వచ్చే వలసల్లో లాటిన్స్,  చైనీస్, ఇండియన్స్ అధికంగా వున్నారు భారతీయులలో  అత్యధికంగా  గుజరాత్ రాష్ట్రానికి చెందిన వాళ్లు ఉన్నారు.   అక్రమంగా దేశంలోకి చొరబడిన వ్యక్తులను రిపబ్లిక్ పార్టి బలంగా వున్న రాష్ట్రాలకు పంపించి అక్కడ వీరిని ఓటర్లుగా నమోదు చేస్తున్నారు.  కొన్ని రాష్ట్రాల్లో  సరైన దృవపత్రాలు లేకుండా కూడా ఓటింగ్ కు అనుమతిస్తున్నారు.  ద్రవ్యోల్బణం, ఆర్థిక పరిస్థితి దిగజారడం,  నిరుద్యోగం, ఐటీ మాంద్యం వంటి అనేక కారణాల వల్ల    డెమోక్రాట్స్ తీవ్రమైన యాంటీ ఇంకంబెన్సీని ఎదుక్కుంటున్నారు! కరోనా లాక్ డౌన్ తరువాత వ్యాక్సిన్ పై వ్యతిరేక వార్తలు వెల్లువెత్తాయి. అయితే ఆ పోస్టులను ఏజెన్సీలు చాలా వరకూ కంట్రోల్ చేశాయి. ఇక ఇప్పుడు ఇజ్రాయిల్ దాడులు యుక్రెయిన్ వార్తలను ఏజెన్సీలు ఎంత కంట్రోల్ చేద్దాం అన్నా సాధ్యపడక పోవడం,  నాటి ట్విట్టర్  నేటి ఎక్స్ యజమాని ఎలెన్ మాస్క్ న్యూట్రల్ మీడియాకు యాక్సెస్ ఇవ్వటం రిపబ్లికన్లకు నిస్సందేహంగా కలిసి వచ్చే అంశం.  2020 అమెరికా ఎన్నికలకు కోవిడ్ వైరస్ కు లింక్ వుంది అనే ప్రచారం వుంది ! ఆ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ రిగ్గింగ్ కు పాల్పడ్డారు అన్న ఆరోపణలు వున్నాయి. ఆ ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయారు.  ట్రంప్ మద్దతుదారులు  అమెరికన్ పార్లమెంట్ పై డాడి చేయడం వెనుక ఎఫ్ బీఐ హస్తం ఉందన్న అనుమానాలు ఉన్నాయి.   ట్రంప్ రాజకీయ జీవితానికి చరమగీతం పాడాలన్న ఉద్దేశంతో   ఆ అల్లర్ల వెనుక ఉన్నది ఎఫ్బీఐ అన్న వార్తలు వచ్చాయి.    సెనెట్ కమిటి మీటింగ్ లో ఈ విషయమై ఎఫ్బీ ఐ డైరెక్టర్ వివరణ ఇస్తూ ఐకాంట్ రివీల్ (నేను బయటపెట్టలేను) అన్నారు.  ఈ ఎన్నికల ప్రచారంలో  ట్రంప్ పై  రెండు హాత్య ప్రయత్నాలు జరిగాయి.  ట్రంప్ మునుపటి ట్రంప్ కాదు ఆయనలో చాలా మార్పు వచ్చింది అనేది కొంత మంది వాదన.  ట్రంప్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్న వ్యక్తి జేడీవేన్స్. ఇతను ఎవరో కాదు..  2016 ఎన్నికలలో  ట్రంప్ ను తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి.   వేన్స్ కు మీడియా అధినేతలతోనూ,  సీఐఏ,  మొసాద్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈయన భార్య ఉషా చిలుకూరి మన తెలుగు అడపడుచు.  కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన చిలుకూరి బుచ్చిపాపయ్య శాస్త్రీ మనవరాలే ఉషా చిలుకూరి.  ట్రంప్ ఎన్నికల ప్రచారంలో లోకల్ ఎంప్లాయిమెంట్, ట్రేడ్ టారీఫ్, ఎక్స్‌పోర్ట్ ఇంపోర్ట్ పన్ను విధానం సమీక్ష వుంటుంది అంటున్నారు.  ట్రంప్ అల్లుడు జ్యుయిష్ కావడం విశేషం! అమెరికా ఎన్నికల్లో డీప్ స్టేట్ వ్యవహారాల పాత్ర చాలా ఎక్కువ మిలటరీ ఇండ్రస్టీయల్ కాంప్లెక్స్ తో పాటు మనం ముందు చెప్పుకున్న ' ఫైవ్ ఐస్,  మెసాద్ పాత్ర అత్యంత కీలకం! ఇరాన్, సిరియా, లెబనాన్, సోమాలియా, పాలస్తీనా, యుక్రెయిన్ , జార్జియా, హైతీ, యెమెన్, బంగ్లాదేశ్, జోర్డాన్ లో సీక్రెట్ ఏజెన్సీల కుట్రలు అనేకం! ట్రంప్ అధికారంలోకి వస్తే యుక్రెయిన్ కు ఆయుధాలు నగదు రూపంలో డాలర్ల పంపిణి ఆగిపోవచ్చు అనే అనుమానం ఏజెన్సీలలో వుంది అమెరికా పంపే ఆయుధాల్లో కొంత భాగం బ్లాక్ మార్కెట్ ద్వారా సిరియాలోని ఐసిస్ కు చేరుతాయి! ఐసిస్ ను క్రియేట్ చేసింది ఎవరో తెలుసా ఒమాబా! సిరియా ప్రధాని అసాద్ ను దించటమే ఒబామా లక్ష్యం సిరియా ప్రధాని అసాద్ కు రష్య అండగా వుండటమే అసలు కారణం! సిరియాలో రష్య బేస్ వుంది ! బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ యుక్రెయిన్ కుంభకోణంలో భాగస్వామి! అమెరికా ఎన్నికల సమయంలో ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేస్తే డెమొక్రాట్లకు నష్టం కలగచ్చు అని భావించి ఇజ్రాయెల్ ను అమెరికా వారించినా వినడం లేదని భావించి ఇజ్రాయెల్ చేయబోయే దాడి వివరాల డాక్యుమెంట్ రిలీజ్ చేసింది. ఒక పక్క ఇజ్రాయెల్ ను అమెరికా వారిస్తుంటే మరో పక్క  ఇరాన్ ను రష్యా కంట్రోల్ చేస్తుంది. ఒక వేళ ఇరాన్ పై ఇజ్రాయెల్‌ నూక్లియర్ ఆయుధ దాడి చేస్తే పాకిస్తాన్ రంగంలోకి  దిగుతుంది అని ప్రకటించింది. ఇజ్రాయెల్ తో పాటు మొత్తం యూరప్ నూక్లియర్ వెపన్స్ తో లేపేస్తాం అని ప్రకటించింది! అమెరికా ఎన్నికలు అనేక సంక్లిష్ణ ప్రపంచ యుద్ధ నేరాలు ఘోరాలతో ముడిపడి ఉన్నాయి ! డెమొక్రాట్స్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ తమిళనాడు కమలాపురంకు చెందిన శ్యామలా గోపాలన్ కుమార్తె.  ఈమె తాత ముత్తాతలు అగ్రహార బ్రాహ్మణ కులానికి చెందినవారు. కమాలా హరిస్ గెలిస్తే అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలు అవుతారు. ఆమె భారత సంతతికి చెందిన మహిళ.  ఒక వేళ ట్రంప్ గెలిస్తే ఉపాధ్యక్షురాలిగా జేడీ వేన్స్ అవుతారు. ఆయన సతీమణి  ఉషా చిలుకూరి కూడా భారత సంతతికి చెందిన వ్యక్తే.  అదుర్స్ సినిమాలో బట్టు అన్నట్లు  వాళ్ళుకూడా మన మనవారేనా.. ఏం కిక్కిచ్చావురా చారీ అంటాడు. అలా కమలా హారిస్, డోనాల్డ్ ట్రంప్ లలో ఎవరు గెలిచినా   వారికి మన దేశం పెద్ద మార్కెట్టు వారి వస్తువులను మనకు అమ్మడం కోసం మనతో సన్నిహిత సంబంధాల నాటకం ఆడుతునే వుంటారు.  ఈ నెల ఐదున ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది జనవరి 20 న కొత్త అధ్యక్షుని ప్రమాణకాస్వీకారం వుంటుంది  ఒక వేళ ట్రంప్ గెలిస్తే  జనవరి 20 లోపు ఏమైనా జరగొచ్చు దానిని డీప్ స్టేట్ పాలిటిక్స్ అంటారు. 

బీసీ కుల‌ గ‌ణ‌నతో కాంగ్రెస్ బిగ్ స్కెచ్‌.. బీఆర్ఎస్‌కు షాక్ త‌ప్ప‌దా?

  తెలంగాణ‌లో హ‌స్తం పార్టీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని బీసీ జ‌పంతో ఇప్ప‌టి నుంచే టార్గెట్ ఫిక్స్ చేసుకొని ప‌నిచేస్తోంది. ఇందులో భాగంగా ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీ ప్ర‌కారం.. బీసీ కుల‌గ‌ణ‌న చేప‌ట్టేందుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. కుల‌ గ‌ణ‌న పూర్తి చేసి తెలంగాణ నుంచి స‌రికొత్త పొలిటిక‌ల్ వార్ కు శ్రీ‌కారం చుట్టాల‌ని వ్యూహాలు ర‌చిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కుల‌ గ‌ణ‌న‌కు టాప్ ప్ర‌యారిటీ ఇస్తున్నారు. నిత్యం స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తూ స‌త్వ‌ర నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. తాజాగా హైకోర్టు తీర్పుకు అనుగుణంగా ప్ర‌త్యేక క‌మిష‌న్ ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను సీఎం రేవంత్ ఆదేశించారు. అయితే, కేవ‌లం కుల‌గ‌ణ‌న‌కే ప‌రిమితం కాకుండా రాష్ట్రంలోని బీసీ వ‌ర్గాలను కాంగ్రెస్ పార్టీ వైపున‌కు తిప్పుకొనేందుకు గ్రౌండ్ వ‌ర్క్ కూడా రేవంత్ టీం సిద్ధం చేసుకున్న‌ట్లు తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతున్నది. వాస్త‌వానికి బీసీ కుల‌గ‌ణ‌న ద్వారా ఆ వ‌ర్గాల వారికి ల‌బ్ధి చేకూరుతుంది. ఈ క్ర‌మంలో ఆ వర్గాల్లోని మెజార్టీ ప్ర‌జ‌ల‌ను కాంగ్రెస్ వైపు షిఫ్ట్ చేసుకునేందుకు ప‌క్కా ప్లాన్ ను కూడా కాంగ్రెస్ అమ‌లు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, రేవంత్ స‌ర్కార్‌ వ్యూహం ఆ పార్టీకి ఏ మేర‌కు లాభిస్తుంద‌నే అంశంపైనా కాంగ్రెస్‌ వ‌ర్గాల్లో విస్తృత‌ చ‌ర్చ  జ‌రుగుతున్నది. ఈ ఏడాది చివ‌రిలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు కాంగ్రెస్ ప్ర‌భ‌త్వం సిద్ధ‌మ‌వుతోంది. ఈ విష‌యంపై  రెండు రోజుల కిందట మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి   కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. డిసెంబ‌ర్ నెల‌లో గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని, సంక్రాంతి నాటికి కొత్త పాల‌క వ‌ర్గం కొలువుదీరుతుంద‌ని చెప్పారు. అదే క్ర‌మంలో  ఈనెల 6న బీసీ కులగ‌ణ‌న ప్రారంభించి ఈ నెల 31వ తేదీలోగా పూర్తి చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ఈ మేర‌కు కార్యాచ‌ర‌ణ‌ను సిద్ధం చేసుకుంది. డిసెంబ‌ర్‌లో పంచాయ‌తీ ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం ప్లాన్ చేస్తుండ‌గా.. ఆ ఎన్నిక‌ల్లో బీసీల‌కు ల‌బ్ధి చేకూర‌నుంది. అదే స‌మ‌యంలో బీసీ గ‌ణ‌న ద్వారా బీసీల‌కు జ‌రిగే ల‌బ్ధిని ప్ర‌తీ గ్రామంలో తెలియ‌జేయాల‌ని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. గ్రామ క‌మిటీల ద్వారా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌ని జిల్లా స్థాయి నేత‌ల‌కు పార్టీ పెద్ద‌లు ఇప్ప‌టికే ఆదేశాలు ఇచ్చిన‌ట్లు తెలిసింది. మ‌రో వైపు గ‌త ఎన్నిక‌ల ప్ర‌చారంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. జ‌నాభాలో ఎక్కువ శాతం ఉన్న బీసీల‌కు ఆ స్థాయిలో ల‌బ్ధిచేకూరేలా చేస్తామ‌ని హామీ ఇచ్చారు. జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం బీసీల రిజ‌ర్వేష‌న్లు పెంచుతామ‌ని, నిధులు కూడా జ‌నాభా ప్ర‌కారం ఆ వ‌ర్గాల‌కు ఖ‌ర్చు పెడ‌తామ‌ని అన్నారు.  బీసీ కుల‌గ‌ణ‌న‌తో రేవంత్ స‌ర్కార్ మ‌రో బిగ్ ప్లాన్ ను అమ‌లు చేయ‌బోతున్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగు తున్నది. తెలంగాణ‌లో బీసీ వ‌ర్గాల్లోని ప్ర‌జ‌లు ఎక్కువ శాతం మంది బీఆర్ఎస్ కు మ‌ద్ద‌తుగా ఉన్నారు. కేసీఆర్‌ ప‌దేళ్ల పాల‌న‌లో బీసీల‌కు ప‌లు ప‌థ‌కాల‌ను అమ‌లు చేసి వారు ఆర్థికంగా బ‌లోపేతం అయ్యేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. అయితే, ఆ ప‌థ‌కాల ఫ‌లాలు కింది స్థాయిలో ల‌బ్ధిదారుల‌కు అందే విష‌యంలో కొంత గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంది. ముఖ్యంగా గొర్రెల పంపిణీ ప‌థ‌కం విష‌యంలో భారీ అవినీతి అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ప్ర‌స్తుతం రేవంత్ స‌ర్కార్ ఆ ప‌థ‌కంలో అవినీతిపై విచార‌ణ జ‌రుపుతోంది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ మెజార్టీ బీసీలు బీఆర్ఎస్ వైపే మొగ్గుచూపారు. అయితే, వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి బీసీల్లోని 60శాతానికి పైగా ఓటు బ్యాంకును కాంగ్రెస్ వైపు మ‌ళ్లించేలా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అదే స‌మ‌యంలో బీఆర్ఎస్ పార్టీకి బ‌ల‌మైన ఓటు బ్యాంకుగా ఉన్న బీసీల‌ను దూరం చేయ‌డం ద్వారా ఆ పార్టీని బ‌ల‌హీన ప‌రచాలన్నదే కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది‌. తెలంగాణ‌లో మొద‌టి నుంచి ఎస్సీ సామాజిక వ‌ర్గం, రెడ్డి సామాజిక వ‌ర్గం ఓట‌ర్లు కాంగ్రెస్ పార్టీకి బ‌ల‌మైన ఓటు బ్యాంకుగా ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మెజార్టీ బీసీ ఓట‌ర్ల‌ను కాంగ్రెస్ పార్టీ వైపున‌కు తిప్పుకుంటే మ‌రోసారి అధికారంలోకి రావ‌డం ఈజీ అవుతుంద‌ని కాంగ్రెస్ పెద్ద‌లు భావిస్తున్నారు‌. మ‌రి హ‌స్తం పార్టీ నేత‌ల అంచ‌నాలు ఏమేర‌కు నిజ‌మ‌వుతాయో వేచి చూడాల్సిందే.

రెడ్‌బుక్‌ చాప్టర్3లో ముగ్గురి పేర్లు.. కొడాలి నాని, వల్లభనేని వంశి.. మూడో వ్యక్తి ఎవరు?

రెడ్‌బుక్‌.. ఈ పేరు వింటేనే. మాజీ ముఖ్యమంత్రి జగన్ సహా వైసీపీ నేతల వెన్నులో వణుకు పుడుతోంది.  మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దగ్గర నుంచి జిల్లా స్థాయి వైసీపీ నేతల వరకు అందరిలోనూ ఎప్పుడు ఎవరు జైలు కెళ్లాల్సి వస్తుందోనన్న ఆందోళన నెలకొంది. వైసీపీ ఐదేళ్ల హయాంలో నిబంధనలు తుంగలో తొక్కి కొందరు అధికారులు, వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. తెలుగుదేశం నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడంతోపాటు పలువురిని జైళ్లకు పంపించి చిత్రహింసలకు గురిచేశారు. కొందరు వైసీపీ నేతలు ఏకంగా తెలుగుదేశం ప్రధాన కార్యాలయంపై దాడి చేశారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలపైనా దాడులు చేశారు. లోకేశ్ యువగళం పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఈ క్రమంలో తెలుగుదేశం శ్రేణులపై కక్షపూరితంగా వ్యవహరించిన వైసీపీ నేతలు, వారికి అనుకూలంగా వ్యవహరించిన అధికారుల పేర్లను ప్రతిపక్షంలోఉన్న సమయంలో నారా లోకేశ్ ‘రెడ్‌బుక్‌’లో నమోదు చేసుకున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత వారిని వదిలిపెట్టేది లేదని, ఒక్కొక్కరిని చట్టపరంగా శిక్షిస్తామని హెచ్చరించారు. అయితే, అప్పట్లో వైసీపీ నేతలు రెడ్‌బుక్‌పై వెటకారంగా మాట్లాడారు. కానీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రెడ్‌బుక్‌ పేరు వింటేనే వైసీపీ భయంతో వణికి పోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే లోకేశ్ రెడ్‌బుక్‌ ఓపెన్ చేశారు. రెడ్‌బుక్‌లో నమోదు చేసుకున్న పేర్ల ప్రకారం ఒక్కొక్కరికి చట్టపరంగా శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలరోజుల వ్యవధిలోనే రెడ్‌బుక్‌ ప్రభావం కనిపించడంతో మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు ఢిల్లీకివెళ్లి ఆందోళనకు దిగారు. ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోందంటూ స్వయంగా జగన్ గగ్గోలు పెట్టాడు.  అధికారంలో ఉన్నప్పుడు లోకేశ్ ‘రెడ్‌బుక్‌’ అంటుంటే నవ్వుకున్న జగన్.. అధికారం కోల్పోయిన తరువాత రెడ్‌బుక్‌ అంటేనే వణికిపోతున్న పరిస్థితి. అప్పట్లో తెలుగుదేశం శ్రేణులను టార్గెట్ చేసి వేధించిన వారిలో చాలా మందిపై ఇప్పటికే రెడ్‌బుక్‌ ఛాప్టర్1, ఛాప్టర్2 ఓపెన్ చేసి చట్టపరంగా కేసులు నమోదు చేశారు. ఛాప్టర్1లో వైసీపీ ప్రభుత్వం హయాంలో ఆ పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించి టీడీపీ శ్రేణులపై తప్పుడు కేసులు నమోదుచేసి జైళ్లకు పంపించిన అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో కొందరు అధికారులపై విచారణలు జరుగుతుండగా.. కొందరికి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టారు. మరి కొందరిని సస్పెండ్ చేశారు. రెడ్‌బుక్‌ ఛాప్టర్2లో తెలుగుదేశం ప్రధాన కార్యాలయంపై దాడి చేసిన వారిపై చట్టపరంగా చర్యలు మొదలు పెట్టారు. అదే విధంగా అధికార మదంతో చంద్రబాబు, పవన్, లోకేశ్ పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన వారిపైనా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు జైలు కెళ్లగా.. మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు లోకేశ్   తాజాగా‘రెడ్‌బుక్‌’పై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో రెడ్‌బుక్‌లో చాప్టర్ 3 ఓపెన్ అవుతుందని పేర్కొన్నారు. దీంతో ఛాప్టర్3లో ఎవరెవరి పేర్లు ఉన్నాయనే విషయంపై వైసీపీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.  మంత్రి నారా లోకేశ్ వారం రోజులు అమెరికాలో పర్యటించారు. ఏపీకి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా పలు కంపెనీల సీఈవోలతో భేటీ అయ్యారు.    రెండు రోజుల కిందట అమెరికాలోని అట్లాస్ లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నారా లోకేశ్ మాట్లాడుతూ రెడ్‌బుక్‌ గురించి ప్రస్తావించారు. గత వైసీపీ ప్రభుత్వంలో తన యువగళం పాదయాత్రలో తీవ్ర ఇబ్బందులకు గురిచేసి ఎవరినీ వదిలిపెట్టేది లేదని తెలిపారు. ఇందుకోసం త్వరలో రెడ్‌బుక్‌ ఛాప్టర్3 ఓపెన్ చేస్తామని ప్రకటించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి కచ్చితంగా సినిమా చూపిస్తామని అన్నారు. అయితే, రెడ్‌బుక్‌ ఛాప్టర్3 ఓపెన్ కావాలంటే తెలుగుదేశం ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు చాలా కష్ట పడాలని లోకేశ్ సూచించారు. దీంతో ఛాప్టర్3లో వల్లభనేని వంశీ, కొడాలి నాని పేర్లు ఉండబోతున్నాయని లోకేశ్ చెప్పకనే చెప్పారని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.  వైసీపీ హయాంలో వల్లభనేని వంశీ, కొడాలి నానిలు నందమూరి, చంద్రబాబు కుటుంబాలపై ఇష్టానుసారంగా విమర్శలు చేశారు. వల్లభనేని వంశీ చంద్రబాబు సతీమణిని అవమానించే రీతిలో వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో వంశీపై తెలుగుదేశం శ్రేణులే కాదు,   ప్రజలు సైతం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.  మరోవైపు గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్దం కేసులో వంశీపై కేసు నమోదైంది. త్వరలో వంశీపై అంతకన్నా తీవ్రమైన కేసులు నమోదు కాబోతున్నాయని, జైలుకు వెళ్లడం ఖాయమని లోకేష్ చెప్పకనే చెప్పారంటూ ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.  రెడ్‌బుక్‌ ఛాప్టర్3లో కొడాలి నాని పేరుకూడా ఉంటుందని లోకేశ్ హింట్ ఇచ్చేశారు. వైసీపీ హయాంలో కొడాలి నాని ఇష్టానుసారంగా రెచ్చిపోయిన విషయం తెలిసిందే. నందమూరి, నారా కుటుంబాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. చంద్రబాబును ఏకవచనంతో అసభ్య పదజాలంతో దూషించాడు. పవన్ కల్యాణ్, లోకేష్ పైనా అనేక సార్లు నోరుపారేసుకున్నాడు.  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొండాలి నాని, వల్లభనేని వంశీలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ శ్రేణులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఛాప్టర్ -3లో నాని, వల్లభనేని వంశీపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు లోకేశ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.  వీరిద్దరితో పాటు మరో వైసీపీ ముఖ్యనేత పేరుకూడా రెడ్‌బుక్‌ ఛాప్టర్3లో ఉందని ప్రచారం జరుగుతుంది. అతను జగన్ మోహన్ రెడ్డికి అత్యంత దగ్గరి వ్యక్తి అని, అతనిపై ఇప్పటికే పలు కేసులు నమోదు కాగా.. త్వరలో మరో కేసు నమోదు కాబోతుందని, ఆ కేసులో సదరు వ్యక్తి జైలు కెళ్లడం ఖాయమని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దీంతో రెడ్ బుక్ ఛాప్టర్ -3 అనగానే వైసీపీ నేతల వెన్నులో వణుకు పుడుతుందట. మొత్తానికి రెడ్ బుక్ అంటే.. అధికారంలో ఉన్నప్పుడు ఎగతాళిగా మాట్లాడిన వైసీపీ నేతలు.. ఇప్పుడు అదే రెడ్ బుక్ పేరు వింటే వణికిపోతున్నారు. ఇదిలాఉంటే.. తాజాగా లోకేశ్ రెడ్ బుక్ పేరు ప్రస్తావించడంతో టీడీపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది.

11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలు పది రోజుల పాటు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 11న అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఉంటుంది. అదే రోజు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అలాగే ఈ సమావేశాలలో ప్రభుత్వం పలు బిల్లులను ప్రవేశ పెట్టనుంది.  అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ ప్రవేశపెట్టడం ద్వారా పూర్తిస్థాయి బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టడం లేదు, అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం లేదు అంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై ప్రతిపక్షం చేస్తున్న  విమర్శలకు చంద్రబాబు సర్కార్ చెక్ పెట్టనుంది ఇప్పటికే   బడ్జెట్‌ రూపకల్పన పూర్తయ్యింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌  బడ్జెట్ రెండు లక్షల కోట్ల రూపాయలు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఆ మేరకు ఆదాయం సాధ్యాసాధ్యాలపై ఆర్థిక శాఖ కసరత్తు పూర్తైంది. ప్రజలపై భారం మోపకుండా ఆదాయాన్ని రాబట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చంద్రబాబు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.  అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా.. గత వైసీపీ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను సమర్పించింది. మొత్తం రూ.2,86,389 కోట్లకు బడ్జెట్‌ సమర్పించారు.  2024 ఏప్రిల్‌ నుంచి జులై 31 వరకు నాలుగు నెలల కాలానికి మొత్తం 40 గ్రాంట్ల కింద రూ. 1,09,052.34 కోట్లకు గత ప్రభుత్వం శాసనసభ ఆమోదం తీసుకుంది. ఆ తరువాత ఎన్నికలలో జగన్ ప్రభుత్వం పతనమై తెలుగుదేశం కూటమి జూన్ నెలలో అధికార పగ్గాలను చేపట్టింది.   ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్థంగా ఉండటంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం జులైలో మరోసారి ఓటాన్ అక్కౌంట్ బడ్జెట్ కు ఆమోదం తీసుకుని,  ఆగస్టు మూడు నుంచి నవంబర్ వరకూ నాలుగు నెలల కాలానికి  రూ.1,29,972.97 కోట్లతో 40 గ్రాంట్ల కింద రెండో తాత్కాలిక బడ్జెట్‌కు గవర్నర్‌ఆమోదం పొందింది. ఈ నెలతో ఓటాన్ అక్కౌంట్ బడ్జెట్ గడువు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ 11వ తేదీన పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది.   

కేరళ వెళ్లనున్న రేవంత్ రెడ్డి 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  సాయంత్రం కేరళ బయలు వెళ్లనున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రదాన కార్యదర్శి ప్రియాంకగాంధీ తరపున ప్రచారం చేయనున్నారు. ముఖ్యమంత్రి వెంట  మంత్రి శ్రీధర్ బాబు కేరళ వెళ్లనున్నారు. కేరళలో కాంగ్రెస్ రెండో దశ ఎన్నికల ప్రచారం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఈ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆదివారం  అంటే ఈ నెల మూడో తేదీన రాహుల్ గాంధీ కేరళ వస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. కేరళ వాయనాడ్, రాయ్ బరేలీ నుంచి  గెలిచిన రాహుల్   వాయనాడ్ లోకసభకు రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. రాహుల్ చెల్లెలైన ప్రియాంకకు వాయ నాడ్  టికెట్ కాంగ్రెస్ కేటాయించింది.  

భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర  వెండి కాయిన్స్ పంపిణీ

చారిత్రాత్మక చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో  దీపావళి సందర్బంగా  వెండి కాయిన్స్ పంపిణీ చేస్తున్నారు. ప్రతీ యేడు దీపావళిని పురస్కరించుకుని కాయిన్స్ పంచడం ఆనవాయితీగా వస్తోంది. కాయిన్స్ పంపిణీ  కార్యక్రమం ఆదివారం వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఆలయానికి వచ్చిన వెండి కానుకలతో వెండి కాయిన్స్ తయారు చేసి పంపిణీ చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ జిల్లాల నుంచి అనేక మంది భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు. దీంతో చార్మినార్ పరిసరాలు సందడిగా మారాయి. ఈ వెండి కాయిన్ తీసుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నారు.  అమ్మవారి రూపంలో వెండి కాయిన్స్ ఉండటంతో భక్తులు ఎగబడి కాయిన్స్ తీసుకుంటున్నారు. కాగా ఈ యేడు వేసిన అయోధ్య సెట్ భక్తులను ఆకట్టుకుంటోంది. 

 డబ్బు మీద అతి ప్రేమ మంచిది కాదు 

ఇప్తెకార్ డబ్బు సంపాదనే ధ్యేయంగా జీవనం సాగిస్తున్నాడు. చిట్టీల వ్యాపారం చేసి లక్షల రూపాయలు సంపాదించాడు.  ఆడ పిల్లల పెళ్లి, అనారోగ్యం వంటి కారణాలతో తన వద్ద చీటీ పాడుకునేవారికి చిట్టీ డబ్బులు మొత్తం ఇచ్చేవాడు కాదు. కమిషన్ ఎక్కువగా తీసుకునేవాడు. అవసరం అని తెలియగానే ఇప్తెకార్ తన దైన స్టైల్ లో దోచేసుకునే వాడు ఒక రోజు బాధితులు మౌలానా దగ్గరికి వచ్చారు.  చీటీ బాధితులు: సలాం వాలేకుం మౌలానా సాబ్ మౌలానా: వాలేకుం సలాం భాయ్ , కైరియత్  తష్రీప్ రఖ్ నా  ( రండి కూర్చొండి)  చీటీ బాదితులు: మౌలానా సాబ్  ఇప్తెకార్ చిట్టీల వ్యాపారంలో కస్టమర్లను  మోసం చేస్తున్నాడు. చీటీ డబ్బులు అడిగితే ఏదో ఒకరకంగా మోసం చేస్తున్నాడు. చీటీ డబ్బులు ఇష్టం వచ్చినట్లు వసూలు చేస్తున్నాడు. తన కు ఇష్టం వచ్చినట్లు ఇస్తున్నాడు. చిట్టీల వ్యాపారం ప్రారంభించే ముందు ప్రతీ ఒక్కరితో నమ్మికగా ఉండే వాడు. ఇపుడు పూర్తిగా మారిపోయాడు.       మౌలానా:  డబ్బు, ఆరోగ్యం పరువు ప్రతిష్టగా తీసుకుంటే  ఎవరైనా డిప్రెషన్ లోకి వెళ్లిపోతారు. ప్రపంచమే ఒక ముసాఫిర్ ఖానా. పుట్టుక, చావులు ఇక్కడ షరామామూలే. ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు. డబ్బు, ఆరోగ్యం ఇవన్నీ తాత్కాలికం. అయినా మనిషి వీటి పట్ల ప్రేమను పెంచుకుంటున్నాడు. ఇవి ఎప్పుడైనా మన నుంచి దూరమవుతాయి. అప్పుడు డిప్రెషన్ లోకి వెళ్లిపోతాం. ధర్మం అనేది ఎల్లవేలలా మన వెంటే ఉంటుంది. ధర్మాన్ని  లాక్కోవడం ఎవరి తరం కాదు. అల్లా కోరుకునేది కూడా ధర్మాన్ని ఆచరించడం. ధర్మాన్ని ఆచరించడం వల్ల డిప్రెషన్ లో వచ్చిన వారు లేరు. డబ్బు, ఆరోగ్యం మీద మమకారం పెంచుకుంటే డిప్రెషన్ వస్తుంది. కాంపిటేషన్ వల్ల కూడా మనిషి డిప్రెషన్ లో వెళ్లిపోతున్నాడు. ఈ భౌతిక ప్రపంచం  మీద ప్రేమ పెంచుకోవద్దు. లోభం కూడా మంచిది కాదు. కుక్క కూడ లోభి లక్షణాలతో నిండి ఉంటుంది. కుక్క తమ యజమానిని చూసి తోక ఊపుతుంది. కానీ తన జాతికి చెందిన మరో కుక్క తన యజమాని గేటు ముందు నుంచి వెళ్లగానే తన అసలు స్వరూపం చూపిస్తుంది, నేను తినే రొట్టె వేరే కుక్క తన్నుకుపోతుందని ఈర్శ్య, ద్వేషంతో రగిలి పోతుంది. అరుస్తుంది. మరో కుక్క కండలను తన కోరపళ్లతో కొరికి రక్త సిక్తం చేస్తుంది. దీనిని బట్టి కుక్క విశ్వాసం గల జంతువు అనేది  అపప్రద. ఈ విషయం కుక్కను పెంచుకునే యజమానికి కూడా తెలియదు. అది విశ్వాసం గల జంతువు అనుకుంటూ బతికేస్తున్నాడు. ఇప్తెకార్ కూడా విశ్వాసం గల వ్యక్తి కాదు అని అతని చేతల్లో తెలిసిపోయింది.జాగ్రత్తగా ఉండండి అంటూ మౌలానా హితవు పలికాడు.                                                                  బదనపల్లి శ్రీనివాసాచారి

4శతాబ్దాల నాటి శివాలయ శిథిలాలను కాపాడుకోవాలి!

సానంబట్లలో విజయనగర కాలపు శిధిలాలు పురావస్తు పరిశోధకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి  తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలం, సానంబట్ల గ్రామంలో స్వర్ణముఖీ నది ఒడ్డున 400 ఏళ్ల నాటి శిధిల శివాలయాన్ని కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు ప్లీచ్ ఇండియా ఫౌండేషన్  సిఈఓ  డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. ఎస్వీ యూనివర్సిటీ విశ్రాంత తెలుగుశాఖాధిపతి, ప్రముఖ రచయిత, పేటశ్రీ ఇచ్చిన సమాచారం మేరకు ఆయన శుక్రవారం నాడు సానంబట్ల శివారులోని సువర్ణముఖీ నది పరిసరాలను గాలించి, క్రీ.శ. 16-17 శతాబ్దాల నాటి ఒక ఫర్లాంగు పొడవు, అడుగున్నర వెడల్పు గల రాతికోట గోడ ఆనవాళ్లు, వరదలకు నేలమట్టమైన శివాలయ శిథిలాలను  క్షుణ్ణంగా పరిశీలించారు.  చంద్రగిరి నుంచి వెంకటపతి రాయలు పాలిస్తున్నప్పుడు, ఈ ప్రాంతం మట్ల అనంతరాజు ఆధీనంలో ఉండేదని, విజయనగర రాజభటుల శిబిరం ఇక్కడ ఉండేదని, రాను రాను, సైన్యం భట్టుల గ్రామం సానంభట్ల అయిందని పేటశ్రీ చెప్పారు.  ఇక్కడ సైనిక శిబిరముందనటానికి, నదికి ఎడమ గట్టునున్న కోట గోడ శిధిలాలే ఆధారమని, శివాలయముందనటానికి, ఆలయ పునాదులు, పడిపోయిన గోడలు, స్తంభాలు, కప్పురాళ్లు, ఇటుక, సున్నంతో కట్టిన శిఖరం ఆనవాళ్లు తెలియజేస్తున్నాయనీ, ఆలయ విడి భాగాలపై విజయనగర కాలపు శిల్పాలు, చక్కటి నైపుణ్యానికి అద్దం పడుతున్నాయని శివనాగిరెడ్డి చెప్పారు. చారిత్రక ప్రాధాన్యత గల విజయనగరం కాలానికి చెందిన పడిపోయిన కోటగోడలు, ఆలయ శిథిలాలను పునరుద్ధరించి, భావితరాలకు అందించాలని గ్రామ సర్పంచి ముడిపల్లి సురేష్ రెడ్డికి సానంబట్ల గ్రామస్తులకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చరిత్ర పరిశోధకులు పాములపాటి శ్రీనాథ్ రెడ్డి, ప్రకాష్, శ్రీకాంత్ యాదవ్ పాల్గొన్నారు.

వైఎస్ కుటుంబ వివాదం.. కేవీపీ మౌనం.. ఎవరికి లాభం?

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో  వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న ఆస్తి వివాదం హాట్ టాపిక్ గా ఉంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిల మధ్య ఆస్తుల పంపకం విషయంలో తలెత్తిన నిస్సందేహంగా వైఎస్ కుటుంబ పరువును బజారున పడేంది.  ప్రజాజీవితంలో ఉన్నవారికి వ్యక్తిగతం అనేది ఉండదని అంటారు.  జగన్,షర్మిల విషయంలో  అదే జరుగుతోంది.  ఆస్తుల  విభేదాలు ఎలా ఉన్నా వైఎస్ కుటుంబం లోని లొసుగులన్నీ పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలతో బయటపడి వైఎస్ కుటుంబం నవ్వుల పాలౌతోంది.  జగన్, షర్మిల మధ్య అన్నా చెల్లెళ్ల అనుబంధం, రక్త సంబంధం కంటే ఆస్తి గొడవలే పెద్ద పీట వేసుకు కూర్చున్నాయి.   అయితే ఈ మొత్తం వ్యవహారంలో ప్రజా సానుభూతి షర్మిల వైపే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తాను గద్దెనెక్కడం కోసం చెల్లెలు కాళ్లరిగేలా చేసిన పాదయాత్ర, తాను జైలులో ఉన్నప్పుడు పార్టీని భుజాన వేసుకుని నడిపించిన వైనం గుర్తు చేసుకుంటూ పబ్బం గడిచిన తరువాత జగన్ షర్మిలను పార్టీ నుంచి పంపేశారనీ, తల్లిని సైతం అమర్యాదగా పార్టీ అధ్యక్ష పదవి నుంచి రాజీనామా చేయించి పంపేరనీ ప్రజలు చర్చించుకుంటున్నారు. జగన్ షర్మిల మధ్య ఆస్తుల తగాదాలో జగన్ రాజకీయం కూడా ప్రస్తావనకు, చర్చకు వస్తున్నది. అది పక్కన పెడితే తన తరఫు వాదనను షర్మిల మాత్రమే వినిపిస్తుండగా జగన్ తరఫున వకాల్తా పుచ్చుకుని వైసీపీ నేతలు షర్మిలపై విరుచుకుపడుతున్నారు. ఈ వివాదంలో వైఎస్ కుటుంబ బంధువు వైవీ సుబ్బారెడ్డి, వారి కుటుంబానికి సన్నిహితుడు విజయసాయి రెడ్డిలు మీడియా ముందుకు వచ్చి షర్మిల అవాస్తవాలు చెబుతున్నదంటూ వ్యాఖ్యలు చేశారు. ఇంకో అడుగు ముందుకు ముందుకు వేసి చంద్రబాబుకు అనుకూలంగా షర్మిల మాట్లాడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు.  అయితే ఈ తరుణంలో వైఎస్ విజయమ్మ రంగ ప్రవేశం చేసి  షర్మిలకు మద్దతుగా బహిరంగ లేఖ రాయడంతో వైసీపీ నేతల విమర్శలను పట్టించుకునే నాథుడే లేకపోయాడు. అయినా షర్మిలకు జగన్ అన్యాయం చేశారనే మెజారిటీ ప్రజలు నమ్ముతున్నారు. అయితే వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, వైఎస్ ఆత్మగా అందరూ భావించే కేవీపీ రామచంద్రరావు షర్మిల, జగన్ ఆస్తుల వివాదం విషయంలో నోరు మెదపకపోవడం గమనార్హం.  వైఎస్ బతికి ఉండగా ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయానికీ ప్రత్యక్ష సాక్షి కేవీపీ రామచంద్రరావు. వైఎస్ షర్మిలకు కుటుంబ ఆస్తులలో సమాన వాటా ఇవ్వాలని భావించారా లేదా అన్న విషయాన్ని సాధికారికంగా చెప్పగలిగిన వ్యక్తి కేవీపీ మాత్రమే. జగన్ కాంగ్రెస్ తో విభేదించి వైసీపీ పార్టీని పెట్టుకున్నా కేవీపీ మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. అయినా జగన్ శ్రేయోభిలాషిననే ఆయన చెప్పుకుంటున్నారు. జగన్ ఐదేళ్ల పాలనపై ఆయన గట్టిగా విమర్శించిన దాఖలాలు కూడా లేవు. ఇప్పుడు షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నప్పటికీ, కేవీపీ ఆమో పక్కన పెద్దగా కనిపించిందీ లేదు. మద్దతు పలికిందీ లేదు. అందుకే షర్మిల, జగన్ ఆస్తుల వివాదంలో కేవీపీ ఏం మాట్లాడినా ఇంపార్షియల్ గా ఉంటుందని జనం భావిస్తారు. ఆయన కనుక నోరు తెరిచి షర్మిలకు సమాన వాటా ఇవ్వాలని వైఎస్ భావించారన్న మాట చెబితే ఇక జగన్ రాజకీయ భవిష్యత్ కు ఎండ కార్డ్ పడినట్లునని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

కేటీఆర్ పాదయాత్ర.. 2028 ఎన్నికల్లో పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రొజెక్ట్ అవుదామనేనా?

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లుగా మారిపోతున్నది. హైడ్రా కూల్చివేతలు, మూసీ సుందరీకరణ, రైతు భరోసా నిధులు వంటి విషయాలలో రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ కు పుంజుకునేందుకు ఇచ్చిన అవకాశాలను బీఆర్ఎస్ సమర్థంగా ఉపయోగించుకోవడంలో విఫలమైంది. పార్టీ  అధినేత మౌనం కావచ్చు. పార్టీలో నెలకొన్న అంతర్గత సంక్షోభం కావచ్చు మొత్తంగా బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమ స్ఫూర్తి అన్నది కొరవడటమే ఆ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను సమర్ధంగా తిప్పి కొట్టలేకపోవడానికి ప్రధాన కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీగా సుదీర్ఘ కాలం ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని సాగించిన ఆ పార్టీ రాష్ట్ర విభజన తరువాత అధికారం చేపట్టింది. అధికారం చేపట్టిన తరువాత కేసీఆర్ స్వయంగా టీఆర్ఎస్ ఇంకెంత మాత్రం ఉద్యమ పార్టీ కాదు, ఫక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించారు. ఆ తరువాత ఆపరేషన్ ఆకర్ష్ తో ఉద్యమ సమయంలో పార్టీకి వ్యతిరేకంగా గట్టిగా నిలబడిన వారినీ, సమైక్య ఆంధ్రప్రదేశ్ కు అనుకూలంగా ఉన్నవారినీ కూడా పార్టీలో చేర్చుకున్నారు. అది వేరే సంగతి. రెండో సారి పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్ పార్టీలోని తెలంగాణ సదాన్ని తీసేసి పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చి ఒక్క సారిగా జాతీయ రాజకీయాలపై మక్కువ పెంచేసుకున్నారు. తన తనయుడు కేటీఆర్ ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించి భవిష్యత్ ముఖ్యమంత్రిగా బిల్డప్ ఇచ్చారు. ఇది పార్టీలోని కొందరికి రుచించలేదనుకోండి అది వేరే సంగతి. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం పాలైన తరువాత కేసీఆర్ మౌనం పార్టీ క్యాడర్ ను నిస్తేజంగా మార్చేసింది. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ ఎంత దూకుడుగా వెళ్లినా క్యాడర్ లో ఉత్సాహం నింపడంలో పూర్తిగా సఫలం కాలేకపోయారు. మరో వైపు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో మాజీ మంత్రి హరీష్ రావు కేటీఆర్ కంటే ముందున్నారన్న భావన పార్టీ క్యాడర్ లో నెలకొంది. ఈ నేపథ్యంలోనే పార్టీ బలోపేతం తో పాటు తన నాయకత్వాన్నీ స్థిరపరుచుకునే లక్ష్యంతో కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. దీపావళి రోజున  (అక్టోబర్ 31) ఆస్క్ కేటీఆర్ అన్న కార్యక్రమాన్ని నిర్వహించిన కేటీఆర్ ఆ సందర్భంగా తన పాదయాత్ర విషయాన్ని ప్రకటించారు. పాదయాత్రకు సంబంధించి పూర్తి వివరాలు అంటే ఎప్పుడు ఎక్కడ నుంచి పాదయాత్ర ప్రారంభమౌతుంది. రూట్ మ్యాప్ ఏమిటి అన్న వివరాలను త్వరలో వెల్లడిస్తానని కేటీఆర్ చెప్పారు.  ప్రజలతో మమేకమై అధికారంలోకి రావడానికి పాదయాత్రలు చేయడం తెలుగు రాష్ట్రాలలో కత్తేమీ కాదు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. అలాగే చంద్రబాబు కూడా పాదయాత్ర చేసి 2014 లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత వైఎస్ జగన్ కూడా పాదయాత్ర ద్వారానే 2019లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇక లోకేష్ యువగళం పాదయాత్ర 2024 ఎన్నికలలో రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడానికి ఎంతగానో దోహదపడింది. లోకేష్ ను బలమైన ప్రజా నేతగా ఆవిష్కరించింది. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాదయాత్ర చేయనున్నారు. తద్వారా పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడంతో పాటు 2028 లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను తాను బలంగా ప్రొజెక్టు చేసుకోవాలని భావిస్తున్నారు. 

కొమ్మినేని భారతం.. జగన్ దుర్యోధనుడని తేల్చేసిందిగా?

అధికారం కోల్పోయిన వైసీపీ అధినేత జగన్  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబుపై  చేస్తున్నది అధర్మయుద్ధమని ఆయన పార్టీ నేతలే తెలిసో తెలియకో అంగీకరించేస్తున్నారు. వాస్తవానికి 2019 ఎన్నికలలో కూడా జగన్ అధర్మయుద్ధం చేసే తన పార్టీని గెలిపించారనీ చెప్పకనే చెప్పేస్తున్నారు. ఇతిహాసాలను, పురాణాలనూ తీసుకువచ్చి వాటితో పోలుస్తూ జగన్ ను సమర్ధించుకోవడానికి వైసీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు నవ్వుల పాలౌతున్నాయి. తాజాగా ఉంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ మాజీ  చైర్మర్, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు రాసిన ఓ వ్యాసం ఆయనకు పురాణాల గురించి ఇసుమంతైనా తెలియదని చాటింది. అంతే కాకుండా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ది మహాభారతంలో దుర్యోధనుడి లాంటి వ్యక్తిత్వం అని కొమ్మినేని శ్రీనివాసరావు తన వ్యాస్తం ద్వారా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఇంత సూటిగా జగన్ ను కౌరవ అగ్రజుడిగా పేర్కొంటూ కొమ్మినేని శ్రీనివాసరావు రాసిన వ్యాసాన్ని జగన్ సొంత మీడియా తన ఆన్ లైన్ ఎడిషన్ లో ప్రముఖంగా ప్రచురించుకుంది.  వైఎస్ విజయమ్మ వాస్తవాలు చూడలేని స్థితిలో ఉన్నారా? అనే శీర్షికన కొమ్మనేని శ్రీనివాసరావు వ్యాసంలో దివంగత వైఎస్ దృతరాష్ట్రుడు, విజయమ్మ గాంధారి, జగన్ దుర్యోధనుడు. ఔను ఆయన వ్యాసం సారాంశం క్లుప్తంగా, స్థూలంగా ఇదే.  ఇంతకీ కొమ్మినేని జగన్ ను సమర్ధిస్తున్నట్లా? విమర్శి స్తున్నట్లా?