రిషికేశ్ వెళ్లిపోయిన  స్వరూపానంద్రేంద్ర స్వామి

జగన్ ప్రభుత్వంలో రాచ మర్యాదలు అందుకున్న విశాఖ శారదాపీఠాధిపతి స్వరూప నంద్రేంద్ర స్వామి ఉన్నఫళంగా రిషికేశ్ వెళ్లిపోయారు. తనకు జగన్ ప్రభుత్వం కేటాయించిన గన్ మెన్ల ను తిరిగి ఇచ్చివేస్తున్నట్లు  విశాఖ పోలీస్ కమిషనర్ కు లేఖ రాశారు. తపస్సు చేసుకోవడానికి రిషికేశ్ వెళుతున్నట్లు ఆయన   లేఖ రాశారు. 2019  నుంచి స్వరూపనందేద్ర స్వామికి భధ్రతను రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. త్రి కూటమి ప్రభుత్వం కూడా భద్రతను కొనసాగించింది. గత జగన్ ప్రభుత్వం  విశాఖ శారదాపీఠానికి కేటాయించిన భూములను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. భీమిలి మండలం కొత్త వలస సమీపంలో 15 ఎకరాలు జగన్ ప్రభుత్వం అప్పనంగా ఇచ్చిన సంగతి తెలిసిందే.   రాజ్యాంగ స్పూర్తికి భిన్నంగా విశాఖ  శారదా పీఠానికి విలువైన భూములను కేటాయించడంతో కూటమి ప్రభుత్వం రద్దు చేసుకోవల్సి వచ్చింది.  

సీఐడీ విశ్రాంత అదనపు ఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ 

సీఐడీ విశ్రాంత అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌ అరెస్టు అయ్యారు. మాజీ ఎంపీ రఘురామను చిత్రహింసలు పెట్టిన కేసులో విజయ్‌పాల్ అరెస్టు అయ్యారు.  ఉదయం 11 గంటల నుంచి విజయ్‌పాల్‌ను పోలీసులు విచారించారు. ఉదయం నుంచి జరిగిన విచారణలో తెలియదు, మర్చిపోయా వంటి సమాధానాలు రావడంతో పోలీసుు బెజారెత్తిపోయారు. ఒక సిట్టింగ్ ఎంపీ రఘురామ కృష్ణ రాజును టార్చర్ కేసులో విజయ్ పాల్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. విజయపాల్ అరెస్ట్ కావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమౌతుంది. గత ప్రభుత్వం విజయపాల్ ను ప్రోత్సహించడం వల్లే టార్చర్ చేసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. 

 మహారాష్ట్ర సిఎంగా  దేవేంద్ర ఫడ్నవీస్? 

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారయ్యే అవకాశం ఉంది.  బిజెపి అధిష్టానం ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. డిప్యూటి సిఎంలుగా అజిత్ పవార్, షిండే పేర్లు వినిపిస్తున్నాయి.  మరో వైపు సీఎం కుర్చీ కోసం శివసేన చీఫ్, ప్రస్తుత సీఎం ఏక్ నాథ్ షిండే మెట్టు దిగడం లేదు. బీహార్ లో ఎక్కువ సీట్లు బిజెపికి దక్కినప్పటికీ జెడీయూ నేత నితీష్ కే సిఎం పదవి ఇచ్చారు. దీంతో బీహార్ ఫార్ములాను మహరాష్ట్రలో అమలు చేయాలని షిండే వర్గం వాదిస్తోంది. దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, షిండే ఢిల్లీలో మకాం వేశారు. లోకసభ స్పీకర్ ఓం బిర్లా కూతురు వివాహానికి హాజరైనట్లు ఈ ముగ్గురు నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. ఫడ్నవీస్ పేరును శివసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. బిజెపి అగ్ర నేత  అమిత్ షా ఫడ్నవీస్  పేరు ఖరారు చేసారని విశ్వసనీయ సమాచారం. 

రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసు.. విజయ్ పాల్ అరెస్టు?

నరసాపురం మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఏపీ సీఐడీ మాజీ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్  అరెస్టుకు రంగం సిద్ధమైంది.   ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం విజయ్ పాల్ దాఖలు చేసుకున్న పిటిషన్ ను సుప్రీం కోర్టు సోమవారం (నవంబర్ 25) కొట్టివేయడంతో ఇక ఆయన అరెస్టు నుంచి తప్పించుకునే అవకాశమే లేకుండా పోయింది. ఇదే కేసులో ఆయన  గతంలో ఆ  హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆయన పిటిషన్ ను డిస్మిస్ చేయడంతో సుప్రీంను ఆశ్రయింంచారు. అక్కడా చుక్కెదురైంది.   ఇలా ఉండగా ఆయన మంగళవారం (నవంంబర్ 26) ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఆర్ఆర్ఆర్ పై కస్టోడియల్ టార్చర్ కేసులోనే ఆయనీ విచారణకు హాజరయ్యారు. ఈ నెల 13న కూడా పోలీసులు సీఐడీ మాజీ అడిషనల్ ఎస్సీ విజయ్ పాల్ ను విచారించిన సంగతి తెలిసిందే. ఆ విచారణకు విజయ్ పాల్ ఏ మాత్రం సహకరించలేదని పోలీసులు తెలిపారు. అడిగిన ప్రశ్నలకు ఆయన  తెలియదు, మరిచిపోయాను, గుర్తు లేదు అంటూ సమాధానాలు ఇచ్చారు. ఇప్పుడు ఉదయం నుంచీ ఆయనను విచారించిన పోలీసులు ఏ క్షణంలోనైనా అరెస్టును ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. 

 ముగిసిన  కాళేశ్వరం కమిషన్ విచారణ

కాళేశ్వరం కమిషన్  రెండో రోజు  బహిరంగ విచారణ ముగిసింది. డిజైన్ లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టు ఎలా కట్టారని కమిషన్ ప్రశ్నించింది.  16 మంది ఇంజనీర్లు విచారణ కు హజరైనప్పటికీ పొంతన లేకుండా సమాధానాలు ఇవ్వడంతో కమిషన్ సీరియస్ అయ్యింది.  ఇంజనీర్ల తప్పుడు సమాధానాలతో కమిషన్ సీరియస్ అయ్యింది. క్రిమినల్ కేసులు తప్పవని కమిషన్ హెచ్చరించింది.  గత బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించినకాళేశ్వరం కుంగుబాటు దేశ వ్యాప్త సంచలనమైంది.  జస్టిస్ చంద్రఘోష్ నేతృత్వంలో  రేవంత్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల ఎఈఈ డీఈఈ ఇంజినీర్లను కమిషన్ ప్రశ్నించింది. పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో కమిషన్ అగ్రహం వ్యక్తం చేసింది.

రాంగోపాల్ వర్మ  మరీ ఇంత పిరికివాడా 

దర్శకుడు రాంగోపాల్ వర్మ కోసం ఒంగోలు పోలీసుల వేట కొనసాగుతుంది. వరుసగా రెండు పర్యాయాలు విచారణకు డుమ్మా  కొట్టడంతో ఎపి పోలీసులు మమ్మురంగా వేట కొనసాగిస్తున్నారు. తొలుత తమిళనాడు కోయంబత్తూరులో షూటింగ్ ఉందని వార్తలు వచ్చాయి. పోలీసులు అక్కడ గాలింపు చర్యలు చేపట్టడంతో జాడ కనిపించలేదు దీంతో వర్మ హైద్రాబాద్ సమీపంలోని శంషాబాద్ లో ఒక ఫామ్ హౌజ్ లో తల దాచుకున్నట్టు పోలీసులకు సమాచారమందింది.  సీనియర్ హీరోకు చెందిన ఫామ్ హౌజ్ లో తలదాచుకున్నట్టు పోలీసులకు ఉప్పందింది. అక్కడ కూడా లేకపోవడంతో వర్మ    హ్యండిల్ చేసే సోషల్  మీడియా ప్లాట్ ఫామ్ అడ్రస్ లను వెతుకుతున్నారు. వర్మ ఎక్కడ ఉన్నా పట్టే సాంకేతికత ఎపి పోలీసుల వద్ద ఉంది. రాత్రి, దెయ్యం, భయం వంటి  హారర్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులను  అందించి భయపెట్టిన వర్మ త్రికూటమి నేతలపై  విష ప్రచారం చేసి చట్టం చేతుల్లో ఇరుక్కొన్నారు.  చివరకు  ఇన్నాళ్లు ప్రేక్షకులను భయ పెట్టిన వర్మ తన దాకా వచ్చేసరికి అదే భయంతో పరారీ కావడం అందరిని ఆశ్యర్యపరిచింది మాఫియాలు తలదాచుకునే  డెన్  పేరే తన నివాసానికి నామకారణం చేసిన వర్మ  అదే డెన్ ఖాళీ చేసి వెళ్లిపోవడం చూస్తే రాంగోపాల్ వర్మ ఎంత పిరికివాడో జనాలకు అర్థమైంది. 

తప్పులెన్నుట తరువాత.. ముందు నీ సంగతేంటి అంబటీ!

అతి తెలివి రాజకీయాలకు జగన్ నేతృత్వంలోని వైసీపీ పెట్టింది పేరు. సొంతంగా చెప్పుకోవడానికి ఏమీ లేని ఆ పార్టీ ప్రత్యర్థి పార్టీల కుటుంబాలలో విభేదాలు ఉన్నట్లుగా సృష్టించి రాజకీయ లబ్ధికి పాకులాడటం తెలిసిందే. అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలోనూ అదే చేసింది. తన అరాచక, అధ్వాన పాలన నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ప్రత్యర్థి పార్టీల అగ్రనేతలు, వారి కుటుంబాలలోని మహిళలపై సోషల్ మీడియా వేదికగా అసభ్య పోస్టులతో రెచ్చిపోయింది. అలాగే వారి కుటుంబాలలో విభేదాలున్నాయనీ, ఒకరంటే ఒకరికి పొసగదనీ ప్రచారం చేసింది.    ఇప్పుడు జగన్  సొంత తల్లి, చెల్లి వైసీపీ అధినేతపై నిప్పులు చెరుగుతుంటే కన్వీనియెంట్ గా మౌనం వహిస్తోంది. జగన్ కుటుంబంలో విభేదాలు రోడ్డెక్కాయి. పార్టీ అధినేత కుటుంబ సభ్యులపైనే వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ అనుచిత, అసభ్య పోస్టులు పెట్టే పరిస్థితి ఏర్పడింది. అయినా    జగన్ నైజం మారలేదు. వైసీపీకి తత్త్వం బోధపడడంలేదు. ఇప్పటికీ జగన్ సొంత కుటుంబ వ్యవహారాలను మరిచిపోయి..  పక్క వారి కుటుంబ వ్యవహారాలతో రాజకీయం చేసి ఏదో మేరకు రాజకీయంగా లబ్ధి పొందాలన్న తాపత్రయమే కనిపిస్తోంది.  గతంలో తెలుగుదేశం పార్టీని ఇరుకునపెట్టడానికి, చంద్రబాబు, లోకేష్ లకు చెక్ చెప్పడానికి నారా కుటుంబంతో నందమూరి విబేధాలు అంటూ సమయం, సందర్భం లేకుండా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకువచ్చిన వైసీపీ  ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు, లోకేష్ పై ఎంత బురద జల్లినా ప్రయోజనం లేదన్న నిర్ణయానికి వచ్చేసినట్లుంది. దీంతో ఇప్పడు పవన్ కల్యాణ్ ను ఇరుకున పెట్టడమే లక్ష్యంగా  మెగా, అల్లు కుటుంబాల మధ్య విభేదాలు అంటే కొత్త పల్లవి ఎత్తుకుంది.  అందుకే అల్లు అర్జున్ మీద లేని ప్రేమను కురిపిస్తూ, ఆయన సినిమా పుష్ప 2 ప్రచారాన్ని తలకెత్తుకుంది. అదే సమయంలో మెగా, పవన్ అభిమానులను రెచ్చగొట్టేందుకు నానా కష్టాలూ పడుతోంది. తాజాగా మాజీ మంత్రి అంబటి రాంబాబు  పుష్ప ప్రమోషన్లకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు. ఎవరూ ఆపుతామని అనకపోయినా.. పుష్ప 2ను ఎవరూ ఆపలేరు, ఆ సినిమా సక్సెస్ ను అడ్డుకోలేరంటూ అల్లు అర్జున్ పై ప్రశంసల వర్షం కురిపించేశారు. పుష్ప1 హాలీవుడ్ స్థాయిలో ఉందనీ, తనకు తెలిసి పుష్ప2 అంతకు మించి ఉందనీ చెబుతూ పనిలో పనిగా పవన్ కల్యాణ్ పై పరోక్ష విమర్శలు కురిపించారు.  అల్లు అర్జున్ ఎదుగుదల కొందరికి కడుపుమంటగా మారిందంటూ మెగా కుటుంబంపై పరోక్ష విమర్శలు ఆరోపణలు చేశారు. అలా చేయడం ద్వారా రాజకీయంగా వైసీపీకి లబ్ధి చేకూరుతుందని భ్రమ పడుతున్నారు. అయితే ఇదే వైసీపీ గతంలో పుష్ప1 రిలీజ్ సమయంలో టికెట్ల ధరల విషయంలో బన్నీకి, ఆ చిత్ర నిర్మాతలకు చుక్కలు చూపించిన విషయాన్ని కన్వీనియెంట్ గా మరచిపోయారు. జగన్ ప్రభుత్వ నిర్వాకం కారణంగానే దేశ వ్యాప్తంగా రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టిన పుష్ప ఆంధ్రప్రదేశ్ లో మాత్రం నామమాత్రపు కలెక్షన్లతో సరిపెట్టుకోవలసిన పరిస్థితి వచ్చింది. అసలీ వివాదానికి కారణమైన వైసీపీ నాయకుడు, ఇటీవలి ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థిగా నంద్యాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన శిల్పా రవిచంద్ర. ఆయన మౌనం వహించినా అంబటి రాంబాబు మాత్రం అల్లు అర్జున్ ఏదో వైసీపీ సభ్యుడు అన్నట్లుగా పెద్ద పెద్ద కబుర్లు చెబుతున్నారు. ఇన్ని పెచ్చు మాటలు మాట్లాడే అంబటి రాంబాబు తమ పార్టీ అధినేత జగన్ కు  తల్లి చెల్లితో ఉన్న విభేదాలు, ఆస్తి తగాదాలు, పరస్పర విమర్శలతో వారు చేస్తున్న రచ్చ గురించి ఎందుకు మాట్లాడరు అని నెటిజన్లు నిలదీస్తున్నారు. జగన్ దాకా ఎందుకు సొంత అల్లుడు తనపై చేసిన విమర్శలపై అంబటి రాంబాబు ఎందుకు నోరెత్తరని ప్రశ్నిస్తున్నారు. తన కుటుంబ వ్యవహారాన్ని రాజకీయం చేయవద్దు అంటున్న అంబటి ఇప్పుడు బన్నీని అడ్డం పెట్టకుని పవన్ కల్యాణ్ టార్గెట్ గా విమర్శలు గుప్పించడాన్ని తప్పుపడుతున్నారు. 

మోగిన రాజ్యసభ ఉప ఎన్నికల నగారా

దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలలో  ఖాళీగా ఉన్న ఆరు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం (నవంబర్ 26) ప్రకటించింది. వీటిలో ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే మూడు రాజ్యసభ స్ధానాలు ఉన్నాయి. వైసీపీ ఎంపీలు బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్. కృష్ణయ్యలు ఇటీవల తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేయడంతో ఇప్పుడు ఆ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ మూడు కాకుండా ఒడిశా, బెంగాల్, హర్యానాలలో కూడా ఖాళీగా ఉన్న ఒక్కో రాజ్యసభ స్థానాలకూ కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి.  కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ మేరకు ఎన్నికల నోటిఫికేషన్  డిసెంబర్ 3న వెలువడుతుంది.  నామినేషన్ల దాఖలుకు చివరి తేది డిసెంబర్ 10 కాగా డిసెంబర్ 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఇక నామినేషన్ల ఉపసంహరణకు తుది గ డువు డిసెంబర్ 13. పోలింగ్  డిసెంబర్ 20వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటన ఉంటుంది. 

ఇకపై ఈ విధాన్ అప్లికేషన్ ద్వారానే ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాలు!

ఏపీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కచ్చితంగా డిజిటల్ లిటరేట్లుగా మారి తీరాలి. ఇప్పటికే కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవారికి అయితే ఏం ఇబ్బంది లేదు కానీ, ఆ జ్ణానం లేనివారు డిజిటల్ నాలెడ్జ్ పెంచుకోకపోతే మాత్రం ఇబ్బంది పడక తప్పదు. ఏం చేయాలన్నా, ఏం మాట్లాడాలన్నా వారు తడబాటుకు గురి కాక తప్పదు. అన్నిటికీ తమ పీఏలు, పీఎస్ ల మీద ఆధారపడక తప్పదు. అలా అధారపడటం వల్ల జనంలో చులకన కాకా తప్పదు. ఇంతకీ ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకు అంటారా? ఆంధ్రప్రదేశ్ లో ఇక నుంచి ఈ విధాన్ అప్లికేషన్ లోనే అసెంబ్లీ, మండలి సమావేశాలు జరుగుతాయి.  కేంద్రం ఇప్పటికే ఈ నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ రూపొందించింది.  కంప్యూటర్‌పై పరిజ్ఞానం ఉన్న వారికి ఇబ్బంది లేదు. లేదంటే తన పీఎస్‌లపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆధార పడాల్సిందే. ఎందుకు అంటే...  కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ ఈ– విధాన్‌ అప్లికేషన్‌ను రూపొందించింది. దీనిని దేశంలోని ఏ రాష్ట్ర అసెంబ్లీ అయినా, మండలి అయినా వినియోగించుకోవచ్చు. కానీ అందుకు ఒక నిర్దుష్ట విధానాన్ని అనుసరించాలి. అయితే ఈ విధానాన్ని అనుసరించాలా వద్దా అన్నది ఆయా రాష్ట్రాల అసెంబ్లీల నిర్ణయం. ఇష్టం ఉంటే ఉపయోగించుకోవచ్చు. లేకుంటే లేదు.  అయితే టెక్నాలజీయే భవిష్యత్ అని విశ్వసించే చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ ను వినియోగించుకుని పేపర్ లెస్ గా అసెంబ్లీ, మండలి సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. అందుకే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలందరికీ ట్యాబ్ లు అందజేయాలని నిర్ణయించింది.  ఈ ట్యాబ్‌ల ద్వారా ఏదైనా అసెంబ్లీ, శాసన మండలికి సంబంధించిన అన్ని అంశాలూ తెలుసుకునే వీలు కలుగుతుంది.  ప్రశ్నోత్తరాల సమయానికి నోటీసులు ఇవ్వడం, రకరకాల పత్రాలు సమర్పించడం, సభ్యుల నుంచి నోటీసులు స్వీకరించడం, బిల్లులు ప్రవేశపెట్టడం, కమిటీల నివేదికలు సమర్పించడం, బులిటెన్‌లు జారీ చేయడం వంటివన్నీ ఇకపై డిజిటల్‌ రూపంలోనే జరుగుతాయి. సెక్రటరీ జనరల్‌ తోనూ, మంత్రులైతే తమ శాఖల కార్యదర్శులతోనూ చాటింగ్‌ ద్వారా ఆదేశాలు ఇవ్వవచ్చు. ఈ అప్లికేషన్‌ను ఫోన్‌లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌ల్లో వాడుకోవచ్చు. సభ్యులు ఎప్పుడైనా తమ నోటీసులు సెక్రటరీ జనరల్‌కు పంపొచ్చు. వాటిని శాసన సభ స్పీకర్, శాసన మండలి చైర్మన్‌కు సెక్రటరీ జనరల్‌ పంపొచ్చు. ఒకే రకమైన ప్రశ్నను చట్ట సభల్లో ఒకరికంటే ఎక్కువ మంది అడిగితే అందరి పేర్లను ఒకే ప్రశ్న వద్ద చేర్చి సమాధానం ఒకటిగా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల సమయం ఆదా కావడమే కాకుండా స్టేషనరీ వృధా అనేదే లేకుండా పోతుంది. అయితే ఇది కార్యరూపం దాల్చాలంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కంప్యూటర్‌ శిక్షణ అనివార్యం. ప్రస్తుత ఎమ్మెల్యేలు, శాసన మండలి సభ్యుల్లో చాలా మంది బిటెక్‌ పూర్తి చేసిన వారు ఉన్నారు. ఇటీవల కాలంలో బిటెక్‌ చదివిన వారైతే పరవాలేదు. పదేళ్లకు ముందు చదువు పూర్తి చేసిన వారైతే మారిన పరిస్థితులకు అనుగుణంగా శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉన్న వారు ఈ అప్లికేషన్‌ను ఈజీగా హ్యాండిల్‌ చేయగలుగుతారు.  ఆ నాలెడ్జ్ లేని వారు తప్పని సరిగా డిజిటల్ లిటరేట్లు అవ్వడానికి శిక్షణ తీసుకోవలసి ఉంటుంది. దాని కంటే ముందు కంప్యూటర్ వినియోగంపై అవగాహన పెంచుకోవాలి.  ఇదంతా జరగడానికి ముందే  కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల కార్యదర్శి ఉమంగ్ నరులా సమక్షంలో  ఏపీ అ సెంబ్లీ ఏపీతో ఒప్పందం ఆంధ్రప్రదేశ్‌తో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల కార్యదర్శి ఉమంగ్‌ నరులా సమక్షంలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ సూర్యదేవర ప్రసన్న కుమార్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి సత్యప్రకాశ్‌లు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు, మండలి చైర్మన్  మోసేనురాజు సమక్షంలో జరిగింది.   సో ఇక ఇప్పడు ఏపీ ఎమ్మెల్యేలు. ఎమ్యెల్సీలు డిజిటల్ లిటరేట్స్ అయ్యేందుకు శిక్షణ తీసుకోవడం తప్పనిసరి. 

నోస్ట్రాడమస్ జోస్యం నిజం కానుందా?

మూడో ప్రపంచ యుద్ధం తప్పదా? 2025లో ప్రపంచ వినాశనానికి నాంది ఏర్పడుతుందని ప్రముఖ ఫ్రెంచ్ జ్యోతిష్యుడు నోస్ట్రాడమస్ చెప్పిందే నిజమౌతుందా? అంటే జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఔననే జవాబు చెప్పాల్సి వస్తుంది. ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ అణ్వాస్త్ర వినియోగానికి సై అంటూ చేస్తున్న హెచ్చరికలు, అమెరికా, నాటో దేశాలపై ఆయన వెల్లగక్కుతున్న విద్వేషం చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం మానవాళి ముంగిట్లోకి వచ్చేసిందనే అనిపిస్తున్నది. ఉక్రెయిన్ తో యుద్ధం రష్యాకు నష్టాలు, అపజయాలే కాదు అవమానాలనూ తెచ్చి పెట్టింది. ఉక్రెయిన్  నోటో దేశం కాకపోయినా, రష్యా ఆధిపత్య ధోరణిని వ్యతిరేకిస్తున్న నాటో దేశాలు పరోక్షంగా ఉక్రెయిన్ కు మద్దతుగా నిలిచాయి. ఆయుధాలు సరఫరా చేశాయి. అమెరికా కూడా ఉక్రెయిన్ కు ఆర్థికంగా, ఆయుధాల విషయంలో పూర్తి సహాయ సహకారాలు అందించింది. దీంతో రోజులలో పూర్తైపోతుందని రష్యా భావించిన యుద్ధం ఏడాది కాలంగా సాగుతూనే ఉంది. ఉక్రెయిన్ కంటే అన్ని విధాలుగా రష్యాకే ఎక్కువ నష్టం వాటిల్లింది. ఈ స్థితిలోనే పుతిన్ ఇటీవల ఆర్మీ ఉన్నతాధికారులతో జరిగిన భేటీలో కీలక ఆదేశాలు జారీ చేశారు.  అవసరమైతే అణ్వస్త్రాలను వినియోగించడానికి అనుమతించే ఫైల్ పై సంతకం కూడా చేసేశారు.  దీంతోనే ప్రపంచ వినాశనం గురించి నోస్ట్రాడమస్ చెప్పిన జోస్యం నిజం కానుందన్న భయాందోళనలు ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తం అవుతున్నాయి. అమెరికా,నాటో దేశాలపై రష్యా బ్లాస్టిక్ మిస్సైల్స్ గురిపెట్టి సమయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఒక వేళ రష్యా నేరుగా నాటో దేశంపై దాడి చేస్తే మూడో ప్రపంచయుద్ధం ప్రారంభమైనట్లే. అసలు రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం ఆరంభం అయినప్పుడే ప్రపంచ దేశాలకు చెందిన ప్రసిద్ధ విశ్లేషకులు ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని ఊహించారు. ఇప్పుడు రష్యా తీసుకున్న నిర్ణయం వారి ఊహలు.. ఊహాగానాలు కాదనీ, వాస్తవ రూపం దాల్చేందుకే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ అర్ధమౌతోంది.  అణు దాడులు చేస్తామని పుతిన్ ఎలాంటి బేషజాలూ లేకుండా ప్రపంచ దేశాలను హెచ్చరించారు.  త్తగా రూపోందించిన ఓరెప్నిక్ హైపర్ సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్స్ ను ఈ యుద్ధంలో పరీక్షించాలని నిర్ణయం తీసుకున్న పుతిన్ ఈ మేరకు ఇప్పటికే తన సైన్యాధికారులకు ఆదేశాలు ఇచ్చేశారు.  ఇప్పటివరకూ ఈ మిస్సైల్స్ ను అడ్డుకునే వ్వవస్థ లేదు కాబట్టి ప్రపంచ దేశాల లో ఆందోళన వ్యక్తం అవుతోంది. రష్యా పరీక్షించాలనుకుంటున్న బాలిస్టిక్ మిస్సైల్స్ 5000  కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని సులువుగా ఛేదించేయగలవు. నాటో దేశాలు ఆ రేంజ్ లోనే ఉన్నాయి. అందుకే రష్యా ఆ మిస్సైల్ ను ప్రయోగిస్తే.. నాటో దేశాలు అనివార్యంగా రష్యాపై దాడులకు ఉపక్రమిస్తాయి. అదే మూడో ప్రపంచ యుద్ధం అవుతుంది. అయితే రష్యా కూడా అందుకు సిద్ధంగానే ఉంది. ఇప్పటికే నాటో దేశాలు రష్యాపై యుద్ధానికి వస్తే తనకు మద్దతుగా నిలిచే దేశాలను కూడగడుతోంది. ఇప్పటికే   ఉత్తర కొరియా,చైనా రష్యాకు మద్దతు ప్రకటించాయి.  ఆ ధైర్యంతోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ కు సహాయం చేసిన దేశాలను ఉపేక్షించబోమని హెచ్చరించారు.  ఈ తరుణంలో మూడో ప్రపంచ యుద్ధాన్ని నివారించేందుకు ఉక్రెయిన్, రష్యాలకు మధ్యవర్తిత్వం చేయగలిగే ప్రపంచ నేత ఎవరన్న దానిపైనే అందరి దృష్టీ ఉంది. ప్రధాని మోడీ ఆ పని చేయాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. యుద్ధాన్ని ఆపడమే తక్షణ కర్తవ్యంగా ప్రపంచ దేశాలన్నీ సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. నోస్ట్రాడమస్ జోస్యం ఎట్టిపరిస్థితుల్లోనూ నిజం కాకూడదు.  

ద్వారకా తిరుమలలో అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం

ఓ వైపు దేశ వ్యాప్తంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంటే.. ఏపీలోని ద్వారకా తిరుమలలో గుర్తు తెలియని వ్యక్తులు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం అయిన ద్వారకా తిరుమలలోని పంచాయతీ పార్క్ లో ఉన్న అంబేడ్కర్ విగ్రహాన్ని సోమవారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీనిపై ప్రజలలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. విగ్రహ ధ్వంసానికి పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని పోలీసులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా ద్వారకా తిరుమలలో పోలీసులు భారీగా మోహరించారు. విగ్రహ ధ్వంసానికి పాల్పడిన వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. 

వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై కేసు

వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై ఎర్రగొండపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక బాలిక విషయంలో చేసిన దుష్ప్రాచారానికి సంబంధించి అందిన ఫిర్యాదుపై చెవిరెడ్డిపై పొక్సో, అట్రాసిటీ చట్టాల కింద కేసు నమోదైంది. వివరాలిలా ఉన్నాయి.  ఈ నెల 4న తిరుపతి జిల్లా ఎర్రావారిపాళెం మండలానికి చెందిన బాలిక సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళుతుండగా.. కొందరు  దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన  కలకలంరేపింది.  ఆ వెంటనే బాలికను ఆస్పత్రికి తరలించారు. ఇంతలో బాలికపై అత్యాచారం జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు బాలికను పరామర్శించి,  ఘటనపై ఆరా తీశారు. అయితే ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి బాలికను అడ్డుకుని.. ప్రేమించాలంటూ వేధించారని, వారిని అడ్డుకునే క్రమంలో బాలికకు గాయాలయ్యాయని ఎస్పీ తెలిపారు. వైద్యులు కూడా బాలికపై అత్యాచారం జరగలేదని ధృవీకరించారు. బాలికపై దాడికి పాల్పడిన వారినీ అదుపులోనికి తీసుకున్నారు. దీనిపై బాలిక తండ్రి తన కుమార్తె పై దుష్ప్రచారం చేశారంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.  

అదానీ విషయంలో బీఆర్ఎస్ వింత‌ డిమాండ్‌!

దిగ్గజ పారిశ్రామిక‌వేత్త అదానీ ఇష్యూ దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపుతోంది. విద్యుత్ ఒప్పందాల విషయంలో లంచాలు ఇచ్చినట్లుగా అమెరికా దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. ఈ మేర‌కు అదానీ స‌హా మ‌రో ఎనిమిది మందిపై కేసులు కూడా న‌మోద‌య్యాయి. విద్యుత్ ఒప్పందాల్లో భాగంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డితో స‌హా మ‌రో నాలుగు రాష్ట్రాల అధికారుల‌కు అదానీ కంపెనీ నుంచి ముడుపులు చెల్లించినట్లు అమెరికాలో నమోదైన కేసు చార్జిషీట్ లో ఉంది. ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనాన్ని రేకెత్తించింది. ఈ వ్య‌వ‌హారం అగ్రరాజ్యం అమెరికా, భారత్ సంబంధాల మీద‌ అంతో ఇంతో ప్రభావాన్ని చూపుతుందన్న వాదన కూడా వినిపిస్తుంది. అయితే, ఈ అంశంపై ఇంకా భారత ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు.  వైట్ హౌస్ స్పందించింది. దర్యాప్తు సంస్థలు ఖచ్చితమైన సమాచారంతోనే ముందుకెళ్తాయని.. ఇలాంటి పరిస్థితుల్ని రెండు దేశాలు సమర్థంగా ఎదుర్కొంటాయని ప్రకటించింది.  మ‌రోవైపు, త‌మ కంపెనీపై వచ్చిన ఆరోపణల్ని అదానీ గ్రూప్ ఖండించింది. కానీ అమెరికా న్యాయస్థానాల నుంచి ఆయన తప్పించుకోవడం అంత తేలిక కాదు. భారత్,  అమెరికా మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉంది. అయితే అదానీని భారత్ అంత తేలికగా అప్పగించే అవకాశాలు లేవు. అవినీతి ఆరోపణలపై అమెరికాలో కేసు నమోదైన అదానీని తక్షణమే అరెస్ట్‌ చేయాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. అదానీ గురించి తాము ఇన్నాళ్లుగా చెబుతున్నది నిజమని అమెరికా అధికారుల ఆరోపణలు నిరూపించాయన్నారు. అదానీ భారత్‌లోనేగాక అమెరికాలోనూ చట్టాలను ఉల్లంఘించినట్లు స్పష్టమవుతోందని, అలాంటి వ్యక్తి బయట స్వేచ్ఛగా ఎలా తిరగగలుగుతున్నారో ఆశ్చర్యంగా ఉందన్నారు. స్వలమైన ఆరోపణలపై ఏకంగా ముఖ్యమంత్రులనే అరెస్టు చేస్తున్నప్పుడు.. రూ.2,200 కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్న అదానీ స్వేచ్ఛగా ఎలా తిరుగుతున్నారని, ఎలా తిరగనిస్తున్నారనీ రాహుల్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మ‌రోవైపు, పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమ‌వారం(నవంబర్ 25)  ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన తొలిరోజే విపక్ష సభ్యులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అదానీ ఇష్యూపై చర్చ కోసం పట్టుబట్టారు. స‌భ‌ను నినాదాలతో హోరెత్తించారు. దీంతో తొలి రోజే స్పీకర్ ఓం బిర్లా సమావేశాలను నవంబర్ 27వ తేదీకి వాయిదా వేశారు. ఇక రాజ్యసభలోనూ ఇదే తంతు కొనసాగింది. గౌతమ్ అదాని వ్యవహారంపైన చర్చకు ప్రతిపక్ష ఎంపీలు పట్టుబట్టారు. దీంతో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ సభను ఎల్లుండికి వాయిదా వేశారు. అదానీ ముడుపుల వ్యవహారంపై అమెరికా కోర్టు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణలో ఆయన ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేసిన ప్రభుత్వాల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత స్కిల్‌ యూనివర్సిటీకి అదానీ రూ.100 కోట్లు విరాళంగా ప్ర‌క‌టించారు. అయితే, వాటిని స్వీకరించ కూడదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు నిర్ణ‌యించింది. స్కిల్‌ యూనివర్సిటీకి రూ.100 కోట్లు బదిలీ చేయవద్దని.. అదానీ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం తరఫున లేఖ సైతం రాయ‌డం జ‌రిగింది. అయితే, తెలంగాణ‌లో అదానీ కంపెనీ అధికార పెట్టుబ‌డుల‌పై సీఎం రేవంత్ మాట్లాడుతూ.. రాజ్యాంగ బద్ధంగా, చట్టబద్ధంగానే అదానీ నుంచి పెట్టుబడులు స్వీకరించినట్లు వెల్లడించారు. అనవసర వివాదాల్లోకి రాష్ట్ర ప్రభుత్వాన్ని లాగవద్దని ప్రతిపక్షాలకు ఆయ‌న‌ సూచించారు. కానీ  మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హ‌రీశ్ రావు మాట్లాడుతూ.. స్కిల్‌ యూనివర్సిటీకి ఇచ్చిన 100 కోట్లు నిధులు వెనక్కి ఇచ్చారు సరే.. అదానీ అవినీతిపై రాహుల్ గాంధీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని నినదిస్తున్న సమయంలో దావోస్‌లో మీరు అదానీతో చేసుకున్న 12,400 కోట్ల ఒప్పందాల సంగతేంటని, అదానీకి రాష్ట్రంలోని డిస్కంలను అప్పగించి వాటిని ప్రైవేటీకరించేందుకు మీరు చేస్తున్న కుట్రల మాటేమిటి రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని హరీశ్‌రావు ప్రశ్నించారు. వాస్త‌వానికి బీఆర్ఎస్  హ‌యాంలోనే అదానీ కంపెనీ రాష్ట్రంలో ఎక్కువ పెట్టుబ‌డులు పెట్టింది. మామిడిప‌ల్లిలో అదానీ ఎల్బిట్ సిస్ట‌మ్స్ పేరిట డిఫెన్స్ యూనిట్ ఏర్పాటుకు కేసీఆర్ నేతృత్వంలోనే బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఆమోదించింది.  25 ఎకరాల్లో ఏర్పాటైన ఈ యూనిట్  2025 జ‌న‌వ‌రి నుంచి ఉత్ప‌త్తి ప్రారంభించ‌నుంది. సీఎం కేసీఆర్ తొలిసారి ముఖ్య‌మంత్రి అయిన నెల‌రోజుల‌కే గౌత‌మ్‌ అదానీతో భేటీ అయ్యారు. 2018 దావోస్ స‌ద‌స్సులో అప్ప‌టి మంత్రి కేటీఆర్ అదానీని క‌లిసి విమాన విడిభాగాల త‌యారీ ప్లాంట్ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. తెలంగాణలో విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించాల‌ని గ‌తంలో అదానీ కంపెనీని కేసీఆర్ ఆహ్వానించారు. ఇలా బీఆర్ఎస్ ప్ర‌భుత్వం హ‌యాంలో అదానీతో ప‌లు ఒప్పందాలు చేసుకున్నార‌ని కాంగ్రెస్ నేత‌లు వాదిస్తున్నారు. వాట‌న్నింటిని ప‌క్క‌న‌పెట్టి.. రూ. 100 కోట్ల విరాళాన్ని తిర‌స్క‌రించిన కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని.. ప్రాజెక్టు ఒప్పందాల‌పై ఏం చేస్తార‌ని హ‌రీశ్ రావు ప్ర‌శ్నించ‌డం విడ్డూరంగా ఉంద‌ని కాంగ్రెస్ నేత‌లు మండిప‌డుతున్నారు.

ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కు గుండెపోటు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ గుండె నొప్పితో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు.  ఆయన పరిస్థితి క్రిటికల్ గా ఉందని చెబుతున్నారు. సీనియర్ వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.   ఆయన ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆసుపత్రి ఇంకా హెల్త్ బులిటిన్ విడుదల చేయలేదు. ఆయన ఆరోగ్యపరిస్థితిపై ఆందోళన వ్యక్తం అవుతోంది.  2018 సంవత్సరంలో ఆర్బిఐ గవర్నర్ గా శక్తికాంత్ దాస్ పదవీ బాధ్యతలు చేపట్టారు.  ఆర్బీఐ గవర్నర్ గా ఆయన పదవీ కాలం డిసెంబర్ 10తో ముగియనుండగా, మరో రెండేళ్లు పొడిగించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. 

నందిగామలో చంద్రబాబుపై రాళ్ల దాడి కేసు.. వైసీపీ నేతల ప్రమేయాన్ని నిర్ధారించిన పోలీసులు

వైసీపీ హయాంలో అడ్డూ అదుపూ లేకుండా అరాచకాలకు పాల్పడిన వారంతా ఒక్కొక్కరుగా చట్టం చేతికి చిక్కుతున్నారు. జగన్ హయాంలో ఇష్టారీతిగా నేరాలకు పాల్పడి ఆయన  అండతో చట్టానికి చిక్కకుండా దర్జాగా తిరిగిన వారంతా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చిన తరువాత తప్పించుకోవడానికి అజ్ణాతాన్ని ఆశ్రయిస్తున్నారు.తాజాగా  చంద్రబాబుపై నందిగామలో జరిగిన రాళ్ల దాడికి సంబంధించి వైసీపీ నాయకుల ప్రమేయం బయటపడింది. 2022 నవంబర్ 5 లో అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు కృష్ణాజిల్లా నందిగామలో పర్యటిస్తున్న సమయంలో ఆయనపై రాళ్ల దాడి జరిగింది. ఆ దాడిలో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుసూదన రావు గాయపడ్డారు. అయితే అప్పట్లో ఈ విషయాన్ని వైసీపీ ప్రభుత్వం తేలికగా తీసుకుంది. ఈ కేసు దర్యాప్తు చేయాల్సిన అప్పటి పోలీసు ఉన్నతాధికారి ఐపీఎస్  కాంతి రాణా తాతా పూలు చల్లుతుండగా చిన్న చిన్న రాళ్లు పడ్డాయని పేర్కొంటూ తేలికపాటి సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఆ కేసు దర్యాప్తు కూడా ముందుకు సాగలేదు. అది వేరే సంగతి. అప్పటి దాడిలో గాయపడిన చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ అధికారి మధుసూదన రావుకు రక్తగాయాలు అయ్యాయి. ఆ విషయాన్ని కూడా అప్పట్లో పరిగణనలోనికి తీసుకోకుండా అప్పటి సీపీ కాంతి రాణా తాతా కుట్రపూరితంగా వ్యవహరించారు.   అప్పట్లోనే తెలుగుదేశం నేతల చంద్రబాబుపై దాడి వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని ఆరోపించారు. అయితే పోలీసులు ఆ ఆరోపణలను పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తాజాగా నందిగామలో జగన్ హయాంలో గత ఏడాది నవంబర్ 5న జరిగిన రాళ్ల దాడి కేసు రీఓపెన్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కన్నెగంటి సజ్జనరావు, పరిమి కిషోర్, బెజవాడ కార్తీక్, మార్తి శ్రీనివాసరావులను పోలీసులు అరెస్టు చేశారు. పలువురు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. తాజాగా ఈ దాడి వెనుక  వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావుల ప్రమేయం ఉన్నట్లు తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు.  

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ జస్ప్రిత్ బుమ్రా

ఆస్ట్రేలియాపై తొలి టెస్టులో 295 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన టీమ్ ఇండియా.. ఐదు టెస్టుల సిరీస్ లో 1-0 ఆధిక్యతతో నిలిచింది. పెర్త్ వేదికగా జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్ కి రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో జస్ప్రిత్ బుమ్రా నాయకత్వం వహించారు. సారథిగా బుమ్రా ముందుండి టెస్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ లో మొత్తం ఎనిమిది వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాను ఏ దశలోనూ కోలుకోకండా చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో  18 ఓవర్లు వేసిన బుమ్రా కేవలం 30 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. వీటిలో ఆసీస్ ఓపెనర్లతో పాటు కీలకమైన స్మిత్ వికెట్ ను బుమ్రా తీసుకున్నాడు. ఆ తరువాత క్రీజ్ లో కుదురుకున్న ఎలెక్స్ కేరీ వికెట్ ను కూడా బుమ్రా పడగొట్టారు. ఆసీస్ కెప్పెట్ పాట్ కమ్మిన్స్ కూడా బుమ్రా ఖాతాలోనే పడ్డాడు.  ఇక రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాకు కనీసం ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా  తాను వెసిన తొలి రెండు ఓవర్లలో రెండు వికెట్లు తీశాడు. అసలే భారీ ఛేదన చేయాల్సిన ఆస్ట్రేలియా త్వరత్వరగా రెండు వికెట్లు కొల్పోవడంతో ఇక ఏ దశలోనూ తేరుకోలేకపోయింది. మొత్తంగా ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్ లో బుమ్రా 12 ఓవర్లు వేసి 42 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. రెండు ఇన్నింగ్స్ లోనూ కలిపి బుమ్రా 30 ఓవర్లు వేశాడు. 72 పరుగులు ఇచ్చి ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. బౌలింగ్ ఛేంజెస్, ఫీల్డ్ సెట్టింగ్ తో బుమ్రా  ఆకట్టుకున్నాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ తొలి ఇన్నింగ్స్ లో తక్కువ స్కోరుకే ఆలౌట్ అయ్యి  ఒత్తిడికి లోనైనప్పటికీ అద్భుతంగా పుంజుకున్నామని చెప్పారు.