రాంగోపాల్ వర్మ మరీ ఇంత పిరికివాడా
posted on Nov 26, 2024 @ 2:54PM
దర్శకుడు రాంగోపాల్ వర్మ కోసం ఒంగోలు పోలీసుల వేట కొనసాగుతుంది. వరుసగా రెండు పర్యాయాలు విచారణకు డుమ్మా కొట్టడంతో ఎపి పోలీసులు మమ్మురంగా వేట కొనసాగిస్తున్నారు. తొలుత తమిళనాడు కోయంబత్తూరులో షూటింగ్ ఉందని వార్తలు వచ్చాయి. పోలీసులు అక్కడ గాలింపు చర్యలు చేపట్టడంతో జాడ కనిపించలేదు దీంతో వర్మ హైద్రాబాద్ సమీపంలోని శంషాబాద్ లో ఒక ఫామ్ హౌజ్ లో తల దాచుకున్నట్టు పోలీసులకు సమాచారమందింది. సీనియర్ హీరోకు చెందిన ఫామ్ హౌజ్ లో తలదాచుకున్నట్టు పోలీసులకు ఉప్పందింది. అక్కడ కూడా లేకపోవడంతో వర్మ హ్యండిల్ చేసే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అడ్రస్ లను వెతుకుతున్నారు. వర్మ ఎక్కడ ఉన్నా పట్టే సాంకేతికత ఎపి పోలీసుల వద్ద ఉంది. రాత్రి, దెయ్యం, భయం వంటి హారర్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులను అందించి భయపెట్టిన వర్మ త్రికూటమి నేతలపై విష ప్రచారం చేసి చట్టం చేతుల్లో ఇరుక్కొన్నారు. చివరకు ఇన్నాళ్లు ప్రేక్షకులను భయ పెట్టిన వర్మ తన దాకా వచ్చేసరికి అదే భయంతో పరారీ కావడం అందరిని ఆశ్యర్యపరిచింది మాఫియాలు తలదాచుకునే డెన్ పేరే తన నివాసానికి నామకారణం చేసిన వర్మ అదే డెన్ ఖాళీ చేసి వెళ్లిపోవడం చూస్తే రాంగోపాల్ వర్మ ఎంత పిరికివాడో జనాలకు అర్థమైంది.