బంగాళాఖాతంలో అల్పపీడనం... ఎపికి పొంచి ఉన్న ముప్పు

బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది.  ఎపికి మరో మారు తుఫాను ముప్పు పొంచి ఉంది.  నవంబర్ 25న (సోమవారం) వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాను ఎపి నుంచి  తమిళనాడు అక్కడి నుంచి శ్రీలంక తీరాలవైపు కదొలొచ్చని  విపత్తు నిర్వహణ సంస్థ  ఎండీ కూర్మనాథ్‌ తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఈనెల 27, 28, 29న భారీ వర్షాలు కురుస్తాయని  విపత్తు నిర్వహణ సంస్థ  హెచ్చరిక జారీచేసింది. మిగతా ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.  35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండడంతో వచ్చే నాలుగు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణం శాఖ హెచ్చరించింది. 

లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం తిరుపతి చేరుకున్న స్వతంత్ర సిట్ బృందం

జగన్ హయాంలో తిరుమల పవిత్రతకు ఎంత భంగం కలిగించాలో అంతా కలిగించారు. తిరుమల కొండపై పారిశుద్ధ్యం అధ్వానంగా మార్చేశారు, ఆధ్యాత్మిక వాతావరణాన్ని నాశనం చేశారు. కలియుగ వైకుంఠంగా భక్తులు భావించే తిరుమలలో జగన్ హయాంలో ఎన్ని అరాచకాలు జరగాలో అన్ని అరాచకాలూ జరిగాయి.  అన్యమత ప్రచారం నుంచి మాంసం, మద్యం వినియోగం వరకూ అన్నీ జరిగాయి.  ప్రసాదం ధర మొదలు వసతి గదుల అద్దెల వరకూ దొరికినంత దోచుకో  పద్దతిలో అప్పట్లో టీటీడీ దోపిడీకి పాల్పడిందన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు విచారణలో ఆ విమర్శలన్నీ వాస్తవాలే అన్న విషయం వెలుగులోకి వస్తోంది.  చివరాఖరికి లడ్డూ ప్రసాదం కూడా జగన్ హయాంలో అపవిత్రమైపోయింది.  వైసీపీ అధికారంలో ఉండగా తిరుపతి లడ్డూ ప్రసాదం నాణ్యత నాసిరకంగా తరాయైందని  భక్తులు అప్పట్లోనే పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. అయితే లడ్డూ ప్రసాదం నాణ్యత ఎందుకు నాసిరకంగా మారిపోయిందో.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు. జగన్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో టీటీడీ అధికారులు నాసిరకం, జంతు కొవ్వుతో కల్తీయిన నెయ్యిని లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించారనీ, అందుకే ప్రసాదం నాణ్యత లేకుండా పోయిందనీ చంద్రబాబు కొద్ది కాలం కిందట ఒక సమావేశంలో వెల్లడించారు.   దీంతో దేశ వ్యాప్తంగా గత జగన్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. లడ్డూ ప్రసాదం నాణ్యత నాసిరకంగా ఉండటానికి కారణమైన వారినీ, ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యి వాడకానికి కారణమైన వారినీ, ఆ నెయ్యి సరఫరాదారులను కఠినంగా శిక్షించాలన్న డిమాండ్లు వెల్లువెత్తాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. అయితే ఈ విషయంపై సుప్రీం కోర్టు సీబీఐ పర్యవేక్షణలతో స్వతంత్ర సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. ఇప్పుడా స్వతంత్ర సిట్ దర్యాప్తు ప్రారంభించింది.  శుక్రవారం (నవంబర్ 22) స్వతంత్ర సిట్ దర్యాప్తు బృందం తిరుపతి చేరుకుంది. తిరుపతిలోని భూదేవీ కాంప్లెక్స్ లో సిట్ కోసం తత్కాలిక కార్యాలయం కూడా ఏర్పాటైంది. ఈ సిట్ బృందంలో నలుగురు డీఎస్పీలు నాలుగు బృందాలుగా ఏర్పడి తిరుపతి, తిరుమలలో దర్యాప్తు చేయనున్నారు. తమ దర్యాప్తు నివేదికను సీబీఐకు సమర్పిస్తారు.  నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీ ఫుడ్స్‌తో పాటు తిరుమలలో లడ్డూ పోటు, విక్రయ కేంద్రాలు, ముడిసరుకు పరిశీలించనున్నారు. అలాగే లడ్డూ తయారీలో పాల్గొనే శ్రీవైష్ణవులను కూడా సిట్ బృందం ప్రశ్నించ నుంది.

మ‌హారాష్ట్ర‌లోనూ ప‌వ‌న్ మ్యాజిక్‌

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో వంద శాతం ఫలితాలను సాధించిన జనసేన.. ఆ మ్యాజిక్ ను మళ్లీ మహారాష్ట్రలో రిపీట్ చేసింది. మహారాష్ట్ర ఎన్నికలలో జనసేనాని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రెండు రోజుల పాటు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో తెలుగువారు అధికంగా నివసించే పుణె, బల్లాల్ పూర్, షోలాపూర్, తాలూర్, డెగ్లూర్ తదితర నియోజకవర్గాలలో ప్రచారం నిర్వహించారు. ఆయన ప్రచారానికి అక్కడి జనం నుంచి బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. తన ప్రచారంలో భాగంగా ఆయన రోడ్ షోలు, బహిరంగ సభలలో పాల్గొన్నారు. ఆయన ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాలలోనూ బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. దీంతో పవన్ కల్యాణ్ మహారాష్ట్రలోని హండ్రడ్ పర్సంట్ విన్ మ్యాజిక్ ను రిపీట్ చేశారని జేనసేన శ్రేణులు అంటున్నాయి.  

చలి గుప్పెట్లో తెలంగాణ గజగజ

తెలంగాణలో గత కొన్ని రోజులుగా చలి తీవ్రత బాగా పెరిగింది. రోజంతా చలి గాలులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. రాష్ట్రంలోనే అత్యల్పంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. సంగారెడ్డి జిల్లా  కోహిర్ లో కనిష్టంగా పది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే, అసీఫాబాద్ జిల్లా సిర్పూర్లో 9.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఏజెన్సీ ప్రాంతాలలో చలి తీవ్రత అధికంగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ లో  సైతం కోల్డ్ వేవ్ కొనసాగుతున్నది. గ్రేటర్ ప్రజలు చలిపులి పంజా దెబ్బకు గజగజలాడుతున్నారు. మొత్తం మీద తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత అధికంగా ఉంది. దీంతో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. జ్వరం, జలుబు, దగ్గుతో  బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. వాతావరణ శాఖ సమాచారం మేరకు మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండటమే కాకుండా ఉష్ణోగ్రతలు మరింత పతనమయ్యే అవకాశాలున్నాయి.  

పార్లమెంట్‌ శాతాకాల సమావేశాల్లో ఐదు కొత్త బిల్లులు!

పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం (నవంబర్ 25) నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 20 వరకూ జరిగే ఈ సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లు సహా మొత్తం 16 బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వీటిలో ఐదు కొత్త బిల్లులు ఉన్నాయి. అయితే అందరి దృష్టీ వక్ఫ్ బోర్డు చట్ట సవరణ  బిల్లుపైనే ఉంది. ఈ బిల్లును గతంలోనే అంటే వర్షా కాల సమావేశాలలోనే కేంద్రం సభలో ప్రవేశ పెట్టింది. అయితే విపక్ష సభ్యుల అభ్యంతరాల నేపథ్యంలో దీనిని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపింది. జేపీసీ నివేదిక తరువాత ఈ బిల్లును మరోసారి పార్లమెంటులో ప్రవేశ పెట్టడానికి కేంద్రం నిర్ణయించింది. వక్ఫ్ సవరణ బిల్లుపై జేపీసీ శీతాకాల సమావేశాల మొదటి వారంలో పార్లమెంటుకు సమర్పించే అవకాశం ఉంది. అయితే ఈ జేపీసీ గడువు పొడిగించాలని విపక్ష సభ్యులు పట్టుపడుతున్నారు. ఈ విషయంలో సభలో ప్రతిష్ఠంభన నెలకొనేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.   అలాగే మరో కీలక బిల్లు ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లును ను కూడా ఈ సమావేశాలలోనే ప్రవేశపెట్టాలని కేంద్రం భావించింది. అయితే కారణాలేమైనా ఈ సమావేశాలలో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాలో అది లేదు. ఈ శీతాకాల సమావేశాలలో పెండింగులో ఉన్న పాత బిల్లులు 11 సహా  ఐదు కొత్త బిల్లులను ప్రవేశ పెట్టేందుకు కేంద్రం నిర్ణయించింది. కొత్త బిల్లులలో సహకార యూనివర్సిటీల ఏర్పాటు, పంజాబ్ కోర్టుల సవరణ బిల్లు, మర్చంట్ షిప్పింగ్ బిల్లు, కోస్టల్ షిప్పింగ్ బిల్లు, ఇండియన్ పోర్టుల బిల్లు ఉన్నాయి.  

పెద్దిరెడ్డికి అవమానం.. జగన్ నైజమే అంత అంటున్న వైసీపీయులు!

సీనియర్ నేత పెద్దిరెడ్డిని జగన్ రెడ్డి హ్యూమలేట్ చేశారు. ఆయన స్థాయికి అతి చిన్న పదవి అయిన పీఏసీ సభ్యుడి పదవికి పోటీ చేయమని చెప్పి ఆయన పత్తా లేకుండా పోయారు. కనీసం ఓటింగ్ కు కూడా రాలేదు. ఆయన రాలేదని మిగతా ఎమ్మెల్యేలు కూడా రాలేదు. పీఏసీ సభ్యుడిగా ఎన్నిక కావాలంటే పదో వంతు సభ్యుల మద్దతు ఉండాలి. అంత బలం వైసీపీకి లేకనే జగన్ మోహన్ రెడ్డికి ప్రతిపక్ష  నేతహోదా కూడా రాలేదు. పీఏసీ సభ్యుడిగా ఎన్నికవ్వడానికి అవసరమైన బలం  వైసీపీకి లేదు.  అయినా జగన్ పెద్దిరెడ్డిని పోటీ చేయమన్నారు. కానీ ఓటింగ్ ప్రారంభం కాక ముందే తాము బాయ్ కాట్ చేస్తున్నట్లుగా వైసీపీ ప్రకటించింది. దీనికి కారణం ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా ఓటింగ్ కు రాకపోవడమే. స్వయంగా పార్టీ అధినేత జగన్ ఓటింగ్ కు రాకుండా అంసెబ్లీ ప్రారంభమయ్యే సమయానికి బెంగళూరు వెళ్లిపోయారు. దీంతో మరికొంత మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. జగన్ ను నమ్మి ఆయనతో నడిచిన వారికి అవమానాలు ఎదురు కావడం సాధారణమే. అలా జగన్ పంచన చేరి అవమానాలకు గురైన వారిలో సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేదు. నమ్మిన బంట్లుగా పని చేసిన వారికి కూడా జగన్ పూచిక పుల్ల విలువ ఇవ్వరు. ఇప్పుడు అలా అవమాన భారంతో తలదించుకునే పరిస్థితి పుంగనూరు పుడింగి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎదురైంది. అందలం ఎక్కిస్తున్నానంటూ చెప్పి చివరికి పాతాళంలోకి తొక్కేయడం జగన్ కు అలవాటేనన్న సంగతి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలో మరో సారికి రుజువైంది.  ఇటీవలి ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత జగన్ కు, ఆయన పార్టీకీ అడుగడుగునా అడ్డంకులే ఎదురౌతున్నాయి. జగన్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులంతా కేసుల భయంతో వణికి పోతున్నారు. కొందరు అరెస్టై జైలులో ఉంటే, మరి కొందరు నోటీసులు అందుకుని పోలీసు విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితిలో ఉన్నారు. ఇంకొందరు ఆచూకీ లేకుండా పరారీలో ఉన్నారు. ఇక పార్టీ నుంచి ఇప్పటికే ద్వితీయ శ్రేణి నేతలు బయటకు వెళ్లిపోయారు. తాజాగా సిట్టింగ్ ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడమే కాకుండా ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసేశారు. ఇహనో ఇప్పుడో మీడియా ముందుకు వచ్చి తాను పార్టీ వీడడానికి కారణాలు చెప్పనున్నారు. ఓ వైపు పార్టీ ఖాళీ అవుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నా, జగన్ తన నైజాన్ని ఇసుమంతైనా మార్చుకోవడం లేదు. తాను భ్రమల్లో బతకడమే కాకుండా, తన పార్టీ నేతలు, శ్రేణులూ కూడా భ్రమల్లోనే బతకాలని శాసిస్తున్నారు. అంతే కాకుండా ఆ భ్రమలే నిజమని జనాన్ని నమ్మించడానికి తనను నమ్ముకుని వెంట నడుస్తున్న నేతలను నిలువునా ముంచేస్తున్నారు.  తాజాగా అసెంబ్లీలో వైసీపీకి కనీస బలం లేకపోయినా, పీఏసీకి పోటీ పడ్డారు. కేబినెట్ హోదా ఉన్న పదవి అంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అరచేతిలో వైకుంఠం చూపి నామినేషన్ దాఖలు చేయించారు. ఆ నామినేషన్ దాఖలు సమయంలోనూ తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేత హై డ్రామా ఆడించారు. కనీస బలం లేని జగన్ తన పార్టీ తరఫున సీనియర్ నేతను నిలబెట్టి చివరి నిముషంలో ఓటింగ్ కు గైర్హాజరై హ్యాండిచ్చారు. ఓటింగ్ బహిష్కరణ ప్రకటన కంటే ముందే ఆయన బెంగళూరుకు చెక్కేశారు. దీంతో గత్యంతరం లేక నామినేషన్ వేసిన పెద్దిరెడ్డి ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాల్సి వచ్చింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న పెద్దిరెడ్డిపై అన్న ఆరోపణల సంగతి పక్కన పెడితే ఆయన సీనియారిటీని కూడా ఖాతరు చేయకుండా జగన్ ఆయన పట్ల వ్యవహరించిన తీరు పట్ల వైసీపీలోనే అసంతృప్తి వ్యక్తం అవుతోంది. నిజానికి  పీఏసీ ఛైర్మన్‌ పదవి పెద్దిరెడ్డి స్టేచర్ కు చాలా చాలా చిన్నది. అయితే ఆ చిన్న పదవినే ఎరగా చూపి జగన్ పెద్దిరెడ్డికి ఏదో పెద్ద ఫేవర్ చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చారు. అంతా చేసి చివరకు అవమానించారు. జగన్ స్వయంగా ముఖం చాటేసి బెంగళూరు చెక్కేయడంతో పెద్దిరెడ్డి ఇక  అనివార్యంగా బహిష్కరణ ప్రకటన చేయాల్సి వచ్చింది.   పార్టీకి ఉన్న 18 ఓట్ల కంటే  కూడా పెద్దిరెడ్డికి తక్కువ ఓటు పడే పరిస్థితి ఉండటం కంటే అవమానం ఏముంటుంది? ఇప్పుడు ఉన్న 18 మంది ఎమ్మెల్యేలలో కొందరు ఇప్పటికే పార్టీకి, పార్టీ కార్యక్రమాలకే కాకుండా జగన్ కు కూడా దూరం జరిగారు.  ఇప్పుడు పెద్దిరెడ్డి ఎపిసోడ్ తో మరింత మంది ఎమ్మెల్యేలు జగన్ పై విశ్వాసం కోల్పోయి దూరం జరగడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

వైసీపీకి ఎమ్మెల్సీ జయమంగళం గుడ్ బై

వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆ పార్టీకి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా చేశారు. పార్టీకీ, ఎమ్మెల్సీ పదవికీ కూడా రాజీనామా చేస్తూ తన రాజీనామా లేఖను మండలి చైర్మన్ కు పంపారు. కైకలూరుకు చెందిన జయమంగళం వెంకటరమణ గత ఎన్నికలకు ముందు  తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యే కోటాలో ఎమ్యెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తరువాత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడంతో అప్పటి నుంచీ సైలెంటైపోయారు. వైసీపీ కార్యక్రమాలలో ఎక్కడా కనిపించలేదు. గత కొంత కాలంగా జయమంగళం వైసీపీకి రాజీనామా చేస్తారన్న వార్తలు వినవస్తున్నాయి. తాజాగా ఆ వార్తలు వాస్తవమేనని తేలుస్తు జయమంగళం వెంకటరమణ వైసీపీకి రాజీనామా చేశారు. దాంతో పాటే తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు.  వాస్తవానికి ఎన్నికలలో ఓటమి తరువాత నుంచి వైసీపీ నేతలలో అసహనం, రాజకీయ భవిష్యత్ పట్ల ఆందోళన, జగన్ తీరు పట్ల, ఆయన ఏకపక్ష నిర్ణయాల పట్ల వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఆ ప్రచారానికి బలం చేకూర్చే విధంగానే జయమంగళం రాజీనామా చేశారు. ముందు ముందు మరింత మంది వైసీసీ ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు జగన్ కు, వైసీపీకి గుడ్ బై చెప్పే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   

లోకేశ్ తేల్చేశారు.. ఇక తగ్గేదేలే అంటున్న తెలుగుదేశం శ్రేణులు!

జగన్ అధికారంలో కొన‌సాగిన ఐదేళ్లూ సోష‌ల్ మీడియాలోనూ, మీడియా స‌మావేశాల్లోనూ ప్రత్యర్థి పార్టీ నేతలపై, ముఖ్యంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, లోకేష్, ఆ పార్టీ నేతలు, అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై అస‌భ్య‌, అనుచిత వ్యాఖ్యలతో వైసీపీ నేత‌లు రెచ్చిపోయారు. ముఖ్యంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా చంద్ర‌బాబు, ప‌వ‌న్ కల్యాణ్‌, లోకేశ్ , వారి కుటుంబాల్లోని ఆడ‌వారిపైనా ఇష్ట‌మొచ్చిన‌ట్లుగా అస‌భ్య‌  పోస్టులు పెట్టి రాక్ష‌సానందం పొందారు. వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  అలాంటి వారిని  ప్రోత్స‌హిస్తూ వ‌చ్చారు. దీంతో గ‌త ఐదేళ్లు వైసీపీ సోష‌ల్ మీడియా  బూతుల‌కు కేంద్రంగా మారిపోయింది. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత సీఎం చంద్ర‌బాబు నాయుడు ఈ విష‌యాన్ని సీరియ‌స్ గా తీసుకున్నారు. గ‌డిచిన ఐదేళ్లు, ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో అస‌భ్య‌ వ్యాఖ్యలు, మార్ఫింగ్ ఫొటోల‌తో పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెట్టి చ‌ట్ట‌ప‌రంగా శిక్షిస్తున్నారు. వీరిలో సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన శ్రీ‌రెడ్డి, రాంగోపాల్ వ‌ర్మ‌తో పాటు పోసాని కృష్ణ‌ముర‌ళి మీడియా స‌మావేశాల్లో చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ ల‌ను అస‌భ్య‌క‌ర ప‌ద‌జాలంతో దూషిస్తూ అస‌త్య ఆరోప‌ణ‌లు చేశారు. దీంతో ప్ర‌స్తుతం వీరి ముగ్గురిపై ఏపీలోని ప‌లు పోలీస్ స్టేష‌న్‌ల‌లో కేసులు న‌మోదయ్యాయి.  వీరిలో రాంగోపాల్ వ‌ర్మ‌ ఇప్పటికే పోలీసుల నుంచి నోటీసులు అందుకున్నారు.   శ్రీ‌రెడ్డి, రాంగోపాల్ వ‌ర్మ‌, పోసాని ముర‌ళి కృష్ణ‌లపై కేసులు న‌మోదు కావ‌డంతో వారు భయంతో వణికి పోతున్నారు. వైసీపీ అధికారంలోఉన్న స‌మ‌యంలో అడ్డూఅదుపు లేకుండా చంద్ర‌బాబు, ప‌వ‌న్‌ కల్యాణ్, లోకేశ్ పై ఇష్టానుసారంగా, వారి వ్యక్తత్వాన్ని హననం చేసే విధంగా విమర్శలు చేసి విర్రవీగిన వీరు ఇప్పుడు ఇప్పుడు కాళ్ల‌బేరానికి వ‌స్తున్నారు. ఇప్ప‌టికే శ్రీ‌రెడ్డి సారీ చెబుతూ లేఖ విడుద‌ల చేశారు. న‌న్ను వ‌దిలేయండి.. నేను ఇంకోసారి ఇలాంటి పొర‌పాట్లు చేయ‌ను లోకేశ్ అన్నా అంటూ నాలుగు పేజీల లేఖ‌ను విడుద‌ల చేశారు. తాను చేసింది త‌ప్పేన‌ని.. త‌న‌ను క్ష‌మించాలంటూ వేడుకున్నారు. మ‌రోవైపు పోసాని కృష్ణ‌ముర‌ళి   రాజ‌కీయాల‌కు గుడ్ బై చెబుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇక నుండి తాను చ‌నిపోయే వ‌ర‌కు రాజకీయాల గురించి మాట్లాడనని పేర్కొన్నారు. ఏ రాజ‌కీయ నాయ‌కుడి గురించీ మాట్లాడ‌నని, చంద్ర‌బాబు అంటే తనకు ఇష్ట‌మ‌ని, లోకేశ్ పై గౌర‌వం ఉంద‌నీ.. అవ‌కాశం వ‌స్తే ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాలో న‌టిస్తాననీ పోసాని మీడియా ముఖంగా ప్ర‌క‌టించాడు. మ‌రోవైపు రాంగోపాల్ వ‌ర్మ‌కు పోలీసులు ఇప్ప‌టికే నోటీసులు ఇచ్చారు. విచార‌ణ‌కు రావాల‌ని ఆదేశించారు. ఈనెల 19న ఆయ‌న విచార‌ణ‌కు హాజ‌రుకావాల్సి ఉండ‌గా డుమ్మాకొట్టాడు. అదేక్ర‌మంలో పోలీసులు త‌న‌పై థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగిస్తారని భయంగా ఉందంటూ  యాంటిసిపేటరీ బెయిలు కోసం కోర్టును ఆశ్ర‌యించాడు. ప్ర‌స్తుతం కోర్టులో ఆయన బెయిలు పిటిషన్  విచార‌ణ వాయిదా ప‌డింది. మ‌రోవైపు.. ఈనెల 19న విచార‌ణ‌కు హాజ‌రుకాక‌పోవటంతో రెండో సారికూడా రాంగోపాల్ వ‌ర్మ‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 25న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రాంగోపాల్ వ‌ర్మ‌, శ్రీ‌రెడ్డి, పోసాని కృష్ణ ముర‌ళి ముగ్గురు ఏపీ పోలీసులు న‌మోదు చేసిన కేసుల నుంచి త‌ప్పించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. చంద్ర‌బాబు, లోకేశ్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ద్ద‌కు తాము త‌ప్పుచేశాము.. క్ష‌మించండి అంటూ రాయ‌బేరాలు కూడా నెరపుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా నారా లోకేశ్ పేరును ప్ర‌స్తావిస్తూ శ్రీ‌రెడ్డి, పోసాని కృష్ణ‌ముర‌ళిలు క్ష‌మించ‌మ‌ని కోరి కాళ్ల బారానికి వచ్చారు. ఈ క్ర‌మంలో వారి క‌న్నీటికి లోకేశ్ ఎక్క‌డ క‌రిగిపోయి వ‌దిలేస్తారోన‌ని తెలుగుదేశం, జ‌న‌సేన శ్రేణులలో  ఆందోళ‌న వ్య‌క్తం వ్యక్తమైంది. ఆ ముగ్గురిని ఎట్టి ప‌రిస్థితుల్లో వ‌దలొద్ద‌ని  వారు లోకేశ్ ను కోరుతున్నారు. వారి డ్రామాల‌కు క‌రిగిపోవ‌ద్ద‌ని, కుక్క తోక‌ వంక‌ర అన్న‌ట్లుగా వారి బుద్ధి మార‌ద‌ని లోకేశ్ గ్ర‌హించాల‌ని కోరుతున్నారు.  ఈ నేపథ్యంలోనే  తాజాగా శ్రీ‌రెడ్డి, పోసాని కృష్ణ ముర‌ళి వ్యాఖ్య‌ల‌పై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. గత ఐదేళ్లు తెలుగుదేశం శ్రేణుల‌ను పోలీసులు అక్రమ కేసులతో ఎంత వేధించినా కార్యకర్తలు ధైర్యంగా నిలబడ్డార‌ని,  వైసీపీ అసభ్య పోస్టులపై ఇప్పుడు పోలీసులు చిన్న నోటీసులు ఇస్తున్నా ఆ పార్టీ నేతలు రాజకీయ సన్యాసం అంటున్నానీ పేర్కొన్న లోకేష్.. నాడు తెలుగుదేశం శ్రేణులు తప్పుచేయ లేదు కాబట్టే అక్రమ కేసుల్ని ధైర్యంగా ఎదుర్కొంటూ పోరాటం చేశారు.  వైసీపీ శ్రేణులు తప్పుచేసి అడ్డంగా దొరికారు కాబట్టే సారీలు, రాజకీయ సన్యాసాలు అంటున్నార‌ని లోకేశ్ పేర్కొన్నారు. అయితే, ప్రభుత్వం  తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదల‌ద‌ని, సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని లోకేశ్ స్ప‌ష్టం చేయడం ద్వారా ఎవరినీ వదిలేదే లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు.  ఈ సందర్భంగా ఆయన  శ్రీ‌రెడ్డి చెప్పిన‌ సారీని, పోసాని కృష్ణ‌ముర‌ళి రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటా అంటూ పేర్కొన్న వ్యాఖ్య‌ల‌ను పరోక్షంగా ప్రస్తావించి,  వారు త‌మ‌ను వ‌దిలిపెట్టండి మహప్రభో అఅంటూ చేసిన విజ్ఞ‌ప్తుల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో ప‌రిగ‌ణ‌లోకి తీసుకోబోమ‌ని లోకేశ్  క్లారటీ ఇచ్చేశారని భావించవచ్చు.  శ్రీ‌రెడ్డి, పోసాని, రాంగోపాల్ వ‌ర్మ దాదాపు కాళ్ల‌బేరానికి రావ‌డంతో.. వారిని ఎక్క‌డ వ‌దిలేస్తారోన‌ని తెలుగుదేశం, జనసేన శ్రేణులు ఒకింత గాభరాపడ్డాయి.   లోకేశ్ తాజా  క్లారిటీ తో .. వైసీపీ హ‌యాంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా, మీడియా వేదిక‌గా రెచ్చిపోయిన వారికి జైలు కూడు త‌ప్ప‌ద‌న్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.   

బెయిలు రద్దు పిటిషన్ కొట్టివేత.. సుప్రీం కోర్టులో జానీ మాస్టర్ కు ఊరట

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన కొరియో గ్రాఫర్ కు తెలంగాణ హైకోర్టు బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. గత నెల 24న తెలంగాణ హైకోర్టు జానీ మాస్టర్ కు బెయిలు మంజూరు చేయడంతో ఆయన విడుదలయ్యారు. అయితే ఆయనకు తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన బెయిలు రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ ను జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రాలతో కూడిన ధర్మాసనంముందుకు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా   హైకోర్టు ఉత్తర్వులలో జోక్యం చేసుకోబోమంటూ జానీ మాస్టర్ బెయిలు పిటిషన్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను కొట్టివేసింది.  

వయనాడ్ లో దూసుకుపోతున్న ప్రియాంక

ఇక వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ కూడా కొనసాగుతోంది. వీటిలో ప్రధానంగా కేరళలోని వయనాడ్ లోక్ సభ నియోజకవర్గ ఫలితంపై సర్వత్రా ఆసక్తి ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఆ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ పోటీలో ఉన్నారు. ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయడం ఇదే తొలిసారి. ఈ ఉప ఎన్నిక కౌంటింగ్ లో తొలి నుంచీ ప్రియాంక గాంధీ స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తున్నారు. ఓట్ల లెక్కింపు మొదలైన తొలి గంటలోనే ప్రియాంక గాంధీ దాదాపు పాతిక ఓట్లకు పైగా ఆధిక్యత సాధించారు. వయనాడ్ ఉప ఎన్నిక బరిలో మొత్తం 16 మంది ఉండగా ప్రధాన పోటీ మాత్రం ప్రియాంకగాంధీ, సీపీఐ సీనియర్ నేత సత్యన్ మెకేరీ, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ మధ్యే ఉంది.  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో వయనాడ్ తో పాటు రాయబరేలీ నుంచి కూడా పోటీ చేశారు. ఈ రెండు స్థానాల నుంచీ ఆయన విజయం సాధించారు. ఆ తరువాత ఆయన వయనాడ్ స్థానానికి రాజీనామా చేసి రాయబరేలి ఎంపీగా కొనసాగుతున్నారు. దీంతో వయనాడ్ కు ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో వయనాడ్ స్థానం నుంచి ప్రియాంక గాంధీ బరిలోకి దిగారు.  

మహారాష్ట్రలో మహాయతి.. ఝార్ఖండ్ లో జేఎంఎం కూటమి ఆధిక్యం

మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం ఆరంభమైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే తొలి ఆధిక్యతలు ఉన్నాయి.   ఝార్ఖండ్ లో మాత్రం ఝార్ఖండ్ ముక్తి మోర్చా బీజేపీకి గట్టి పోటీ ఇస్తోంది. తొలి ట్రెండ్స్ లో ఝార్ఖండ్ ముక్తిమోర్చా కూటమి ఆధిక్యత కనబరిచింది ఇక మహారాష్ట్రలో అయితే బీజేపీ నేతృత్వంలోని మహాయతి కూటమి సంపూర్ణ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. కడపటి వార్తలందేసరికి మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయతి కూటమి 219 స్థానాలలో స్పష్టమైన ఆధిక్యతలో ఉండగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఎంవీఏ కూటమి 59 స్థానాలలో ముందంజలో ఉంది.  

బొత్స బిగ్ గేమ్‌.. జ‌గ‌న్ అనుమాన‌మే నిజ‌మౌతోందా?

ఏపీ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీకి  ఎవ‌రు ఎప్పుడు ఎలా గుడ్ బై చెబుతారో తెలియ‌ని ప‌రిస్థితి. రాత్రికి రాత్రే వైసీపీ నేత‌లు కూట‌మి పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. అయితే  తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ, శాసనమండలిలో ఆ పార్టీ పక్ష నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ కూడా పార్టీ వీడేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌ జ‌రుగుతున్నది.  వైసీపీలో బొత్స కీల‌క హోదాలో ఉన్న‌ప్ప‌టికీ రాబోయే కాలంలో పార్టీ మ‌నుగ‌డ క‌ష్టం అన్న భావనలో ఆయన ఉన్నారని వైసీపీ వర్గీయులే చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో  వైసీపీలోనే కొనసాగుతూ ఇబ్బంది ప‌డ‌టంకం,  ఆ పార్టీకి గుడ్ బై చెప్ప‌డ‌మే మంచిద‌న్న ఆలోచ‌న‌కు బొత్స‌, ఆయ‌న వ‌ర్గీయులు వ‌చ్చిన‌ట్లు వైసీపీలోనే టాక్  న‌డుస్తోంది. అయితే  జ‌గ‌న్ రెడ్డికి ఈ విష‌యం ముందే తెలిసిందని కూడా అంటున్నారు. బొత్స స‌త్య‌నారాయ‌ణ జ‌న‌సేన ముఖ్య‌నేత‌ల‌తో ట‌చ్ లో ఉన్నారనీ, ఇటీవ‌లి కాలంలో ప‌లు సార్లు ప‌వ‌న్ క‌ల్యాణ్ తోనూ ఫోన్లో  సంభాషించారనీ వైసీపీ నిఘావ‌ ర్గాలు జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లిన‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే బొత్స పార్టీ వీడ‌కుండా జ‌గ‌న్ అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారని అంటున్నారు. అయినా, తాజాగా.. బొత్స స‌త్య‌నారాయ‌ణ అసెంబ్లీ ప్రాంగ‌ణంలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో క‌ర‌చాల‌నం చేసి, ఆలింగ‌నం చేసుకోవ‌టంతో బొత్స నేడో రేపో వైసీపీకి గుడ్ బై చెప్పేయడం ఖాయమని వైసీపీ వర్గాలు అంతర్గత సంభాషణల్లో చర్చించుకుంటున్నారు.   అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఏపీ ప్ర‌జ‌లు వైసీపీకి క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదాకూడా ఇవ్వ‌లేదు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో పాటు కేవ‌లం 11 మంది మాత్ర‌మే ఎమ్మెల్యేలుగా విజ‌యం సాధించారు. దీంతో అసెంబ్లీకి వెళ్లేందుకు జ‌గ‌న్ భ‌య‌ప‌డుతున్నారు. గ‌తంలో వైసీపీ హ‌యాంలో చంద్ర‌బాబును అసెంబ్లీలో వైసీపీ స‌భ్యులు దారుణంగా అవ‌మానించారు. చంద్ర‌బాబును దూషించిన ప్ర‌తీ సందర్భంలోనూ స‌భ‌లో నే ఉన్న అప్పటి ముఖ్యమంత్రి  జ‌గ‌న్ న‌వ్వుతూ క‌నిపించాడు. ఈ క్ర‌మంలో క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదా కూడా లేకుండా స‌భ‌కు వెడితే  తెలుగుదేశం స‌భ్యులు త‌న‌ను అవ‌మానించ‌డం ఖాయ‌మ‌ని భావించి జ‌గ‌న్  అసెంబ్లీకి డుమ్మా కొడుతున్నారు. తనకు తోడుగా తన పార్టీకి చెందిన మిగిలిన ప‌ది మంది ఎమ్మెల్యేలనూ కూడా స‌భ‌కు వెళ్ల‌నీయకుండా అసెంబ్లీ స‌మావేశాల‌ను బాయ్ కాట్ చేస్తున్నట్లు   జ‌గ‌న్ ప్ర‌క‌టించాడు. మ‌రోవైపు శాస‌న మండ‌లిలో వైసీపీకి మెజార్టీ ఉంది. దీంతో శాస‌న మండ‌లికి వైసీపీ స‌భ్యులు హాజ‌ర‌వుతున్నారు. మండ‌లి ప్ర‌తిప‌క్ష నేత‌గా వైసీపీ ఎమ్మెల్సీ బొత్స స‌త్య‌నారాయ‌ణ ఉన్నారు. బొత్స మండ‌లిలో హూందాగా వ్య‌వ‌హ‌రిస్తూ మంత్రుల‌కు ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. ప‌లు సంద‌ర్భాల్లో మంత్రుల‌కు, బొత్స‌కు మ‌ధ్య మాట‌ల యుద్ధంకూడా జ‌రుగుతోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ హైలెట్ అవుతున్నారు. ఇలాంటి త‌రుణంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సొంత ప‌త్రిక‌లో మొద‌టి పేజీలో బొత్స స్పీచ్ ను హైలెట్ చేస్తార‌ని వైసీపీ శ్రేణులేకాక‌.. ప్ర‌తీ ఒక్క‌రూ భావించారు. అలా భావించడం సహజం కూడా.  కానీ, జ‌గ‌న్ సొంత ప‌త్రిక‌లో శాస‌న మండ‌లిలో బొత్స ప్రసంగాన్ని, ఆయ‌న మంత్రుల‌ను ప్ర‌శ్నించిన తీరును మొద‌టి పేజీలో హైలెట్ చేయ‌కుండా లోప‌లి పేజీల్లో ప్ర‌చురిస్తుండటం పట్ల  వైసీపీ శ్రేణుల్లో విస్మయం వ్యక్తం అవుతోంది. ఈ విష‌యంలో  బొత్స కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్లు వైసీపీ వ‌ర్గాల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం. ఈ క్ర‌మంలో బొత్స స‌త్య‌నారాయ‌ణ అసెంబ్లీ ఆవ‌ర‌ణలో ప‌వ‌న్ క‌ల్యాణ్ కు అభిమావాదం చేయ‌డం, వారిద్ద‌రూ ఆత్మీయంగా ఆలింగ‌నం చేసుకోవ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.  వైసీపీ ఘోర ఓట‌మి త‌రువాత బొత్స స‌త్య‌నారాయ‌ణ జ‌న‌సేన పార్టీలోకి వెళ్తున్నార‌ని విస్తృత ప్ర‌చారం జ‌రిగింది. ఆ ప్ర‌చారాన్ని బొత్స కూడా ఖండించ‌ లేదు. అప్ప‌టికే ఆయ‌న త‌మ్ముడు ల‌క్ష్మ‌ణ్ జ‌న‌సేన పార్టీలోకి వెళ్లాడు. అయిన‌ప్ప‌టికీ, బొత్స ఫ్యామిలీలో ఎలాంటి రాజ‌కీయ, ఆర్థిక‌ప‌ర‌మైన విబేధాలు రాలేదు. తమ్ముడు జ‌న‌సేన‌లో ఉంటున్నా బొత్స ఫ్యామిలీ క‌లిసే ఉంటున్నది. బొత్స డైరెక్ష‌న్ లోనే ల‌క్ష్మ‌ణ్ జ‌న‌సేన పార్టీలోకి వెళ్లార‌ని అప్ప‌ట్లో రాజ‌కీయ వ‌ర్గాల్లో విస్తృత ప్ర‌చారం జ‌రిగింది. ఆ త‌రువాత కుటుంబ స‌భ్యులు వైసీపీని వీడి జ‌న‌సేన పార్టీలోకి వెళ్లాల‌ని బొత్స‌పై ఒత్తిడి తెచ్చార‌ని.. జ‌న‌సేన నేత‌లు సైతం ఆయ‌న‌కు ఆహ్వానాలు పంపించిన‌ట్లు కూడా టాక్ న‌డిచింది. సీనియ‌ర్ నేత‌, కాపు సామాజిక‌వ‌ర్గం పెద్ద‌గా భావించే బొత్స స‌త్య‌నారాయ‌ణ లాంటి వారు పార్టీని వీడితే ఇబ్బంది ఎదుర‌వుతుంద‌ని భావించిన జ‌గ‌న్ .. బొత్స‌ను విజ‌య‌న‌గ‌రం స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీగా బ‌రిలో నిలిపాడు. స్థానికంగా వైసీపీకి బ‌లం ఉండ‌టం, తెలుగుదేశం కూటమి ఆ ఎన్నికకు దూరంగా ఉండటంతో  బొత్స ఎమ్మెల్సీగా ఎన్నిక‌య్యారు. అయితే, అంత‌కు ముందే లేళ్ల అప్పిరెడ్డిని మండ‌లిలో ప్ర‌తిప‌క్ష నేత‌గా జ‌గ‌న్ నియ‌మించారు. అధినేత నిర్ణ‌యంపై అప్పుడు బొత్స స‌త్య‌నారాయ‌ణ అసంతృప్తి వ్య‌క్తం చేయ‌డంతో, అప్పిరెడ్డికి స‌ర్దిచెప్పి బొత్స‌ను మండ‌లిలో ప్ర‌తిప‌క్ష నేత‌గా జ‌గ‌న్ చేశార‌ని వైసీపీ వ‌ర్గీయుల్లో అప్ప‌ట్లో చ‌ర్చ జ‌రిగింది. దీనికితోడు బొత్స‌కు జ‌గ‌న్ ప్రాధాన్య‌త‌నిస్తూ పార్టీ రీజిన‌ల్ కో-ఆర్డినేట‌ర్ బాధ్య‌త‌లు కూడా అప్ప‌గించాడు. త‌ద్వారా బొత్స స‌త్య‌నారాయ‌ణ పార్టీ వీడ‌కుండా జ‌గ‌న్ జాగ్ర‌త్త‌ప‌డుతూ వ‌స్తున్నారు.  బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు పార్టీలో పెద్ద‌పీట వేసిన‌ప్ప‌టికీ ఆయ‌న పార్టీ వీడతారన్న అనుమానం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిలో ఏదో ఒక‌మూల  ఉంద‌ని వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. పార్టీలో ఎవ‌రికీ ఇవ్వ‌ని ప్రాధాన్య‌త బొత్స‌కు ఇస్తున్న‌ప్ప‌టికీ ఆయ‌న పార్టీ మారే ఆలోచ‌న‌లో ఉన్నారని తనకు అనుమానంగా ఉంద‌ని పార్టీ ముఖ్య‌నేత‌ల వ‌ద్ద జ‌గ‌న్ పేర్కొన్న‌ట్లు తెలిసింది. తాజాగా జ‌గ‌న్ అనుమానం నిజ‌మౌతందని వైసీపీ వర్గాలలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ప్రాంగ‌ణంలో బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒకరినొక‌రు ఆలింగ‌నం చేసుకున్నారు. ప‌వ‌న్ అసెంబ్లీ హాల్ లోప‌లి నుంచి బ‌యట‌కు వ‌చ్చే స‌మ‌యంలో అసెంబ్లీ ప్రాంగ‌ణంలో వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఎమ్మెల్సీ బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ఇత‌ర వైసీపీ ఎమ్మెల్సీలు మాట్లాడుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ను చూసి పెద్దిరెడ్డి, ఇత‌ర వైసీపీ నేత‌లు అక్క‌డి నుంచి ప‌క్క‌కు వెళ్లిపోయారు. బొత్స మాత్రం ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఎదురెళ్లి న‌మ‌స్కారం చేసి పలకరించారు. అక్కడితో ఆగకుండా  పవన్ ను అభినందించి, ఆయనను ఆత్మీయంగా హత్తుకున్నారు. ఇదే ఇప్పుడు జగన్ అనుమానం నిజం చేస్తూ బొత్స వైసీపీకి గుడ్ బై చెప్పేసి జనసేన కండువా కప్పుకుంటారన్న వాదనకు తెరలేపింది. అయితే ఈ విషయంలో ఇప్పటి వరకూ జగన్ స్పందించలేదు.  ఇప్పటికిప్పుడు ఏమీ మాట్లాడకుండా, ఆ తరువాత నెమ్మది నమ్మదిగా బొత్సకు పార్టీలో ప్రాధాన్యత తగ్గిస్తూ ఆయనకు పొమ్మన లేక పొగపెట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తారా అంటూ పొలిటికల్ సర్కిల్స్ లో కూడా చర్చ జరుగుతోంది. అయితే బొత్స త్వరలో ఒక రాజకీయ నిర్ణం తీసుకుంటారనీ, ఆ నిర్ణయంతో జగన్ షాక్ అవ్వడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

నువ్వేమి ఇస్తావో సృష్టి కూడా అదే ఇస్తుంది

జబ్బార్ భాయ్ విచారంగా మౌలానా దగ్గిరికి వచ్చాడు. తన కొడుకులు ఇంట్లో నుంచి వెళ్లగొట్టారని మౌలానాకు వివరించాడు. నాకే ఇలా  ఎందుకు జరుగుతుంది.  కోట్లాది రూపాయల విలువ చేసే ఇల్లు నాకుంది . లీగల్ హెయిర్ సర్టిఫికేట్ లో నలుగురు కొడుకుల పేర్లు ఉన్నాయి. ఈ ఆస్తి వారికే చెందుతుంది. నా భార్య చనిపోయింది. రెండు పూటల భోజనం  దొరకడం లేదు. నలుగురు కొడుకులు  తిండి పెట్టడం లేదు. నాకే ఇలా ఎందుకు జరుగుతుంది.   మౌలానా: జబ్బార్ భాయ్ నువ్వు  కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించినప్పటికీ అది నీకు చెందుతుందా? లేదా? అనేది లా ఆఫ్ అట్రాక్షన్ లో ప్రతీది ఉంటుంది. నువ్వు కష్టపడి సంపాదించిన ప్రతీరూపాయి నీకే చెందుతుంది. నువ్వు పక్కవాడి భూమి కబ్జా  చేసి కోట్లాది రూపాయల ఆస్తి సంపాదిస్తే మాత్రం  పట్టెడన్నం కూడా కరువవుతుంది. సృష్టికి నీవేమి ఇస్తావో సృష్టి కూడా అదే ఇస్తుంది.  జబ్బార్ భాయ్: అవును మౌలానా సాబ్. నేను 40 ఏళ్ల క్రితం పక్కవాడి భూమి కబ్జా చేశాను. వాళ్ల ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టాను. ఒకరి మీద మరొకరికి చాడీలు చెప్పి యజమానిని బుట్టలో వేసుకుని మెల్లి మెల్లిగా భూమి కబ్జా చేశాను.   మౌలానా: తెల్సు జబ్బార్ భాయ్  నీ గురించి నాకు పూర్తిగా తెలుసు. నువ్వు బ్యాంకులో అటెండర్ జాబ్ చేశావు. జీతం కూడా తక్కువే. కోట్లాది రూపాయల విలువ చేసే భూమిని కాజేశావు. నీకు భయపడి వాళ్లు కేసు బనాయించకపోవచ్చు. లా ఆఫ్ అట్రాక్షన్ లో అది చెల్లుబాటు కాదు. ఆ కుటుంబానికి చెందిన వాళ్లు నీ మీద ప్రతీకారం తీర్చుకుంటారన్న భయంతో నీ భార్య మంచానపడి మరణించింది. భార్య చనిపోవడంతో నీవు ఒంటరి వాడివయ్యావు. మద్యానికి బానిస అయ్యావు. రెండో పెళ్లి చేసుకున్నావు. ఆస్తిలో వాటా వెళుతుందేమోనన్న భయంతో కొడుకులు ఇంట్లో నుంచి గెంటి వేశారు. ఏ ఇంటి కోసం పక్కవాడి భూమి కబ్జా చేశావో ఆ భూమి నీకు చెందకుండా పోయింది. 40 ఏళ్ల సర్వీస్ చేసి రూపాయి రూపాయి కూడ బెట్టి బిల్డింగ్ కట్ఠినప్పటికీ జానెడు జాగా లేకుండా పోయింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ కొడుకులకు అయినా  ధర్మబోధనలు చేసి  ధర్మం కాపాడు. ఆఖీరత్  మే జన్నత్ మిలేగా(  ఖురాన్ ప్రకారం చనిపోయిన తర్వాత స్వర్గానికి చేరడం) . ఖుదాఫీస్  జబ్బార్ భాయ్                                                                                               బదనపల్లి శ్రీనివాసాచారి

ఆసీస్- భారత్ తొలి టెస్టు తొలి రోజు వికెట్లు టపటపా

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా ఆస్ట్రేలియా, ఇండియా మధ్య  ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో  తొలి టెస్ట్ శుక్రవారం (నవంబర్ 22) పెర్త్‌వేదికగా మొదలైంది. తొలి టెస్ట్ తొలి రోజు ఆట ముగిసే సరికి ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్ లో 67 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా తన తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులకు ఆలౌట్ అయ్యింది. పేస్ కు అనుకూలిస్తున్న పిచ్ పై భారత బ్యాటర్ల తడబ్యాటు ఆశ్చర్యం కలిగించకపోయినా, టీమ్ ఇండియా బౌలర్ల ధాటికి ఆసీస్ బ్యాటర్లు కూడా చేతులెత్తేయడమే విశేషం.   తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఇండియా ఆసీస్ పేసర్ల ధాటికి చేతులెత్తేసింది.  ఆసిస్ బౌలర్లలో  జోష్ హేజిల్‌వుడ్ గరిష్టంగా నాలుగు వికెట్లు, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, మిచెల్ మార్ష్ రెండేసి వికెట్ల చొప్పున పడగొట్టారు.  ఈ టెస్టుతో టీమ్ ఇండియా తరఫున  అరంగేట్రం చేసిన   నితీష్ కుమార్ రెడ్డి  41 పరుగులే అత్యధిక పరుగులు కావడం విశేషం.  టీమ్ ఇండియా ఓపెనర్ యశశ్వి జైశ్వాల్, దేవదత్  పడిక్కల్  ఖాతా కూడా తెరవకుండానే పెవిలియన్ కు చేరుకున్నారు. నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్ కోహ్లీ కేవలం ఐదు పరుగులు చేసి ఔటయ్యాడు.  అయితే మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ ఓపికగా ఆడి 74 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 26 పరుగులు చేసి ఔటయ్యాడు.   ధ్రువ్ జురెల్ 11 , వాషింగ్టన్ సుందర్ నాలుగు, అవుటయ్యారు.  పంత్ 37 కూడా మంచి ఆరంభాలను మంచి స్కోర్లుగా మాలచడంలో విఫలమయ్యారు.   ఆ తరువాత బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ బ్యాటర్లు టీమ్ ఇండియా పేసర్లు బుమ్రా, సిరాజ్ ల ధాటికి పెవిలియన్ కు క్యూకట్టారు. బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టగా, సిరాజ్ రెండు, హర్షిత్ రాణా ఒక వికెట్ పడగొట్టారు.  తొలి రోజు ఆటముగిసే సరికి  అలెక్స్ కేరీ 19 పరుగులతోనూ, మైకేల్ స్టార్క్ 6 పరుగులతోనూ క్రీజ్ లో ఉన్నారు. ఆసీస్ భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు కంటే ఇంకా 83 పరుగులు వెనుకబడి ఉంది. మొత్తం మీద తొలి రోజు 17 వికెట్లు పతనమయ్యాయి. పేసర్లకు అనుకూలించిన పెర్త్ పిచ్ పై తొలి రోజు ఆటలో నిస్సందేహంగా టీమ్ ఇండియా పై చేయి సాధించింది. 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నిరవధిక వాయిదా

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ సారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పది రోజుల పాటు సాగాయి. విపక్ష వైసీపీ ప్రతిపక్ష హోదా డిమాండ్ తో సమావేశాలను బహిష్కరించింది. ప్రతిపక్ష హోదా పొందడానికి అవసరమైనంత మంది సభ్యుల బలం లేకపోయినా,  ఆ డిమాండ్ చేయడం ద్వారా వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ సమావేశాలకు ముఖం చాటేయాలని ముందే నిర్ణయించుకుని  తాను అసెంబ్లీకి డుమ్మా కొట్టడమే కాకుండా మిగిలిన పది మంది పార్టీ ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీకి హాజరు కాకుండా నిరోధించారు. అయితే వైసీసీ సభలో లేకపోయినా తెలుగుదేశం కూటమి సభ్యులే ప్రతిపక్ష పాత్ర పోషించి సభలో అర్థవంతమైన చర్చలు జరిగిలా చూశారు. ప్రజాసమస్యలను ప్రస్తావించి మంత్రుల నుంచి వాటి పరిష్కారానికి హామీ పొందారు. ఈ సారి సమావేశాలు మొత్తం 59 గంటల 57 నిముషాల పాటు సాగాయి. సభ్యులు అడిగిన 75 ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు చెప్పరు. అలాగే 27 బిల్లులను అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. వీటిలో అత్యంత కీలకమైన భూకబ్జాల నిరోధక బిల్లు, ఏపీ కో-ఆపరేటివ్ సోసైటిస్ చట్ట సవరణ బిల్లు-2024, ఏపీ ఎక్సైజ్ చట్ట సవరణ బిల్లు-2024, ఏపీ ప్రొహిబిషన్ చట్ట సవరణ బిల్లు-2024, ఏపీ ఇండియా మేడ్‌ లిక్కర్, ఫారిన్ మేడ్ లిక్కర్ చట్ట సవరణ బిల్లు-2024లు  ఉన్నాయి. 

బలం లేకున్నా నామినేషన్లు వేశారు.. బహిష్కరణ అంటూ డ్రామాలాడుతున్నారు!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి  పీఏసీ కమిటీ సభ్యుల  ఎన్నికకు పోలింగ్ పూర్తయ్యింది. దీనితో పాటు ప్రజాపద్దులు , అంచనాలు, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ  ల్లో సభ్యుల నియామకం కోసం ఎన్నిక  జరిగింది. ఈ ఎన్నికలను వైసీపీ బాయ్ కాట్ చేసింది.  సాంప్రదాయంగా ప్రతిపక్షానికి కేటాయించాల్సిన పీఏసీ చైర్మన్ పదవిని సంఖ్యాబలంతో అధికార పక్షమే దక్కించుకోవాలన్న కుట్రతో ప్రభుత్వం ఎన్నిక నిర్వహించిందని విమర్శలు గుప్పించింది. అయితే వాస్తవానికి ప్రతిపక్షానికి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడమన్నది లాంఛనం మాత్రమే. అ లాంఛనాన్ని పాటించాలన్నా సభలో ప్రతిపక్షం హోదా ఉన్న పార్టీ ఉండాల్సి ఉంటుంది. వైసీపీకి అసెంబ్లీలో కేవలం 11 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. నిబంధనల ప్రకారం అయినా, లాంఛనం మేరకు అయినా వైసీపీకి పీఏసీ చైర్మన్ పదవి దక్కే అవకాశం ఇసుమంతైనా లేదు. అయినా ఆ పార్టీ పీఏసీ కోసం తగుదునమ్మా అంటూ పుంగనూరు పుడింగి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేత నామినేషన్ వేయించింది.  పీఏసీలో మొత్తం 12 మంది సభ్యుల ఎన్నిక జరగాల్సి ఉంది. ఇందులో 9 మంది ఎమ్మెల్యేలు, మరో ముగ్గురు ఎమ్మెల్సీలు ఉంటారు. అయితే కూటమి నుంచి 9 నామినేషన్లు దాఖలు కావడంతో ప్రస్తుత సభలో సంఖ్యాబలం మేరకు వారంతా ఎన్నిక కావడం ఖాయం. అయితే వైసీపీ నుంచి దాఖలైన మూడు నామినేషన్లలో ఒక అభ్యర్ధి మాత్రం గెలిచే అవకాశముంది. ఈ తరుణంలో వైసీపీ పీఏసీ ఎన్నికల్ని బహిష్కరించింది. ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం రెండు వరకూ సాగింది. ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటమి ఎటూ తప్పదని ముందే తెలిసిన వైసీపీ ఎమ్మెల్యేలు బహిష్కరించారు. అసలు తమ పార్టీ తరఫున నామినేషన్ వేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఓటు వేయడానికి వైసీపీ అధినేత జగన్ కూడా అసెంబ్లీకి రాలేదు. వైసీపీ ఎన్నిక బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడానికి ముందే ఆయన బెంగళూరు చెక్కేశారు. అంటే ఏదో ఒక అయోమయం సృష్టించి ప్రభుత్వం సంప్రదాయాన్ని పాటించడం లేదు అన్న విమర్శ చేయడం కోసమే పెద్దిరెడ్డిచేత జగన్ నామినేషన్ వేయించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నిజానికి పీఏసీ చైర్మన్ గా వైసీపీకి నిజంగా అవకాశం ఉంటే..  క్యాబినెట్ ర్యాంక్ కోసం జగనే స్వయంగా నామినేషన్ వేసి ఉండేవారని పరిశీలకులు అంటున్నారు.   అసెంబ్లీ ఆర్థిక కమిటీల్లో ఏదైనా పార్టీ నుంచి ఒక సభ్యుడు ఎన్నికవ్వాలంటే ఆ పార్టీకి శాసనసభలో ఉండాల్సిన కనీస సంఖ్యాబలం 18. కేవలం 11 మంది సభ్యుల సంఖ్యా బలంతో మూడు కమిటీలకూ ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు  నామినేషన్లు దాఖలు చేశారో ఆ పార్టీకే తెలియాలి.  ఎన్నిక పూర్తయ్యింది. ఇక ఫలితాల ప్రకటనే తరువాయి. పీఏసీ చైర్మన్ గా  పులపర్తి ఆంజనేయులు (జనసేన), అంచనాల కమిటీ చైర్మన్ గా  వేగుళ్ల జోగేశ్వర రావు (టీడీపీ), పీయూసీ చైర్మన్ గా కూన రవికుమార్ (టీడీపీ) ఎన్నిక కానున్నారు. 

ప్రభాస్ ఎవడో నాకు తెలియదు: షర్మిల సంచలన వ్యాఖ్యలు

వైఎస్ జగన్ టార్గెట్ గా ఆయన సోదరి వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. నా పిల్లల మీద ఒట్టేసి చెబుతున్నాను. నాడు ప్రభాస్ ఎవడో నాకు తెలియదు నేడు కూడా తెలియదు. పిసిసి అధ్యక్షురాలి హోదాలో ఆమె మీడియాతో ముచ్చటిస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతున్నాయి.  జగన్ ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు తన సైతాన్ సైన్యం చేత విష ప్రచారం చేయించాడని షర్మిల ఆరోపించారు. ప్రభాస్ తో తనకు ఏవో సంబంధాలు ఉన్నాయని కొన్ని యూట్యూబ్ చానల్స్ చేత విష ప్రచారం చేయించింది జగన్ కాదా అని ఆమె ప్రశ్నించారు. ప్రభాస్ తో ఏనాడు పర్సనల్ గా కలిసింది లేదు. జగన్ కు ఈ విషయం తెలుసు. చెల్లెలు మీద విష ప్రచారం జరుగుతుంటే జగన్ ఎందుకు మౌనంగా ఉండిపోయాడని షర్మిల ప్రశ్నించారు.  నా అన్న జగన్ తన సైతాన్ సైన్యం చేత ప్రచారం చేయించాడన్నారు. చెల్లెలు మీద జుగుప్సాకర ప్రచారం చేయడం, తల్లి మీద కేసు బనాయించడం, తండ్రి పేరును సిబిఐ చార్జిషీట్ లో ఇరికించడం జగన్ కే చెల్లిందన్నారు.  అప్పట్లో వివి వినాయక్ దర్శకత్వంలో యోగి చిత్రాన్ని షర్మిల మేనమామ  రవీంద్రనాథ్ రెడ్డి నిర్మించారు. అప్పటి నుంచి షర్మిల, ప్రభాస్ మధ్య రిలేషన్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో  ఈ వీడియోలు చక్కర్లు కొడుతుండటపై షర్మిల  తీవ్ర మనస్థాపం చెంది కేసు బనాయించారు.  వీడియోలను డిలీట్ చేయించారు. తాజాగా తనకుప్రభాస్ తో ఉన్న సంబంధంపై క్లారిటీ ఇవ్వడం చర్చనీయాంశమైంది. 

అంచనాల కమిటీ చైర్మన్ గా వేగుళ్ల

అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల కోనసీమ జిల్లా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావును రా ష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ గా నియమించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ పదవి ద్వారా వేగుళ్లకు క్యాబినెట్ హోదా దక్కుతుంది. కాగా అంచనాల కమిటీ చైర్మన్ గా వేగుళ్ల పేరు ఖరారైంది. ఈ మేరకు వేగుళ్లకు ప్రభఉత్వం నుంచి సమాచారం కూడా అందింది.  తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చిన వేగుళ్ల జోగేశ్వరరావు 2004 ఎన్నికలలో అప్పటి ఆలమూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత 2009 ఎన్నికలు వచ్చే సరికి నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఆలమూరు నియోజకవర్గం మాయమై.. మండపేట నియోజకవర్గం ఏర్పడింది. 2009 ఎన్నికలలో మండపేట నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన వేగుళ్ల విజయం సాధించారు. అక్కడ నుంచి వరుసగా 2009, 2014, 2019, 2024 ఎన్నికలలో వేగుళ్ల విజయం సాధించారు. వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యే అయిన వేగుళ్లకు చంద్రబాబు ఈ సారి కేబినెట్ లో చోటు కల్పిస్తారని అంతా భావించారు. అయితే సమీకరణాల కారణంగా వేగుళ్లకు కేబినెట్ లో స్థానం దక్క లేదు. అయితే పార్టీకి వేగుళ్ల సేవలను గుర్తించిన చంద్రబాబు ఇప్పుడు ఆయనకు అంచనాల కమిటీ చైర్మన్ గా అవకాశం ఇచ్చి కేబినెట్ హోదా కల్పించారు.  వేగుళ్లకు 2009 నుండి అనేక కమిటీల్లో సభ్యుడుగా వేగుళ్లకు పని చేసిన అనుభవం ఉంది