మహారాష్ట్ర సిఎంగా దేవేంద్ర ఫడ్నవీస్?
posted on Nov 26, 2024 @ 5:31PM
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారయ్యే అవకాశం ఉంది. బిజెపి అధిష్టానం ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. డిప్యూటి సిఎంలుగా అజిత్ పవార్, షిండే పేర్లు వినిపిస్తున్నాయి. మరో వైపు సీఎం కుర్చీ కోసం శివసేన చీఫ్, ప్రస్తుత సీఎం ఏక్ నాథ్ షిండే మెట్టు దిగడం లేదు. బీహార్ లో ఎక్కువ సీట్లు బిజెపికి దక్కినప్పటికీ జెడీయూ నేత నితీష్ కే సిఎం పదవి ఇచ్చారు. దీంతో బీహార్ ఫార్ములాను మహరాష్ట్రలో అమలు చేయాలని షిండే వర్గం వాదిస్తోంది. దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, షిండే ఢిల్లీలో మకాం వేశారు. లోకసభ స్పీకర్ ఓం బిర్లా కూతురు వివాహానికి హాజరైనట్లు ఈ ముగ్గురు నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. ఫడ్నవీస్ పేరును శివసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. బిజెపి అగ్ర నేత అమిత్ షా ఫడ్నవీస్ పేరు ఖరారు చేసారని విశ్వసనీయ సమాచారం.