సిద్ధం సభ.. ప్లాప్ అని ఒప్పుకోలేక.. సక్సెస్ అని చెప్పుకోలేక.. పాపం వైసీపీ

కాలు గడప దాటదు కానీ, మాటలు కోటలు దాటేస్తాయన్నట్లు తయారైంది వైసీపీ పరిస్థితి. బిల్డప్ బాబాయ్ లకే సాధ్యం కాని లెవెల్ లో గంభీర ప్రకటనలు చేయడం.. వాస్తవంలో మాత్రం చెప్పినదానికీ జరిగిన దానికీ ఇసుమంతైనా పొంతన లేకపోవడం జగన్ పార్టీకి పరిపాటిగా మారిపోయింది. రాష్ట్రంలో యుద్ధానికి సిద్ధం కావాలంటూ సిద్ధం పేరిట ఇప్పటికే మూడు బహిరంగ సభలు నిర్వహించిన వైసీపీ తాజాగా ఆదివారం (మార్చి 10) బాపట్లలో నిర్వహించిన చివరి సిద్ధం సభలో మాత్రం చతికిల పడిపోయింది. ఆరంభ శూరత్వం తప్ప.. సిద్ధం సభల ద్వారా సాధించిందేమీ లేదని తేటతెల్లమైపోయింది. ఇప్పటి వరకూ ఏమూలో కాస్తో కూస్తో విజయంపై నమ్మకం ఉన్న క్యాడర్ కు కూడా రానున్న ఎన్నికల ఫలితం ఏమిటన్నది కళ్లకు కట్టింది జగన్ చివరి సిద్ధం సభ. 15లక్షల మందికి పైగా వస్తారంటూ ఆర్భాటంగా గొప్పలు చెప్పుకున్న ఆ పార్టీ నేతలు చివరికి కనీస స్థాయిలో కూడా జనాన్ని సమీకరించలేక చేతులెత్తేసి.. ఇక గెలుస్తామంటూ కనీసం మాటవరసకు కూడా చెప్పుకోవడానికి అవకాశం లేని స్థాయికి పార్టీ ప్రతిష్ఠను దిగజార్చేశారు.  తొలి సిద్ధం సభలో యుద్ధానికి సమయం వచ్చేసిందనీ, ఇక చొక్కాలు మడతపెట్టేయాలనీ క్యాడర్ కు పిలుపు నిచ్చిన జగన్ చివరి సిద్ధం సభకు వచ్చేసరికి జనాన్ని కూడా సమీకరించలేని పార్టీ దుస్థితిని అందరికీ చూపించేశారు.  తాడేపల్లి ప్యాలెస్ దాటి అడుగు బయటపెడితే జనం తన ముఖం చూడరని ఈ సభ ద్వారా తేటతెల్లం చేసేశారు. అందుకే ఇంత కాలం బయటకు వస్తే రోడ్లకు ఇరువైపులా పరదాలు ఏర్పాటు చేసుకున్న సంగతిని దాపరికం లేకుండా ఈ సభ ద్వారా చెప్పేశారు. చివరి సిద్ధం సభ నాటికి కనీసం అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తి చేయలేని దుస్థితిని చాటుకున్నారు. ఎన్నిక మేనిఫెస్టో కూడా ప్రకటించలేని దయనీయ స్థితిని ఎల్లరకూ తెలిసేలా చేయగలిగారు జగన్.  ఇప్పటి దాకా మైకు పట్టుకుంటే చాలు చంద్రబాబుపై విమర్శలతో విరుచుకుపడటం తప్ప తాను ఈ ఐదేళ్ల కాలంలో చేసినది ఇదీ, తన హయాంలో జరిగిన అభివృద్ధి ఇదీ అని చెప్పుకోలేని జగన్.. ఎన్నికల సన్నాహకంలో భాగంగా  అఖరి అంకమైన సిద్ధం సభలో మరోసారి తనకు అధికారం కట్టబెడితే ఇది చేస్తాను అని కూడా చెప్పుకోలేని పరిస్థితి తనదని తేటతెల్లం చేసేశారు. మసిపూసి మారేడు కాయ చేయడంలో సిద్ధహస్తుడిగా పేరొందిన జగన్.. సిద్ధం సభ సందర్భంగా అందులోనూ ఘోరంగా విఫలమయ్యారు. లక్షల మంది హాజరౌతారంటూ ఆర్భాటంగా ప్రకటించుకుని మరీ నిర్వహించిన ఈ సభకు జనాలు రాకపోయినా వచ్చినట్లు బిల్డప్ ఇచ్చుకునేందుకు చేసిన ప్రయత్నం ఘోరంగా విఫలమవ్వడమే కాకుండా పార్టీనీ, జగన్ ను కూడా నవ్వుల పాటు చేసింది. ఇంతకీ జనం హాజరు విషయంలో జగన్ మసిపూసి మారేడు కాయ చేయడానికి చేసిన ప్రయత్నమేంటంటే సభా ప్రాంగణమంతా గ్రీన్ కార్పెట్లు పరిచేసి.. జనం రాకపోయినా ఆ తరువాత వచ్చినట్లుగా కావలసినట్లు మార్చేసుకోవచ్చని చేసిన ప్రయత్నం ఘోరంగా విఫలమైంది వైసీపీ. ఆ ప్రయత్న మంతా సామాజిక మాధ్యమంలో కళ్లకు కట్టినట్లు వచ్చేయడంతో నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఇక సిద్ధం సభ పూర్తయిన తరువాత వైసీపీ విడుదల చేసిన విజువల్స్ లో జనం ఉన్నట్లుగా చూపించడానికి ఫొటోలను మిక్స్ చేసి చేసిన యత్నం కూడా మీడియాలో ఆధారాలతో సహా వచ్చేసింది.  దీంతో సిద్ధం సభ విషయంలో వైసీపీ పరిస్థితి తేలు కుట్టిన దొంగలా తయారైంది. జనం వచ్చారని చెప్పుకోలేక, రాలేదని ఒప్పుకోలేక నానా ఇబ్బందులూ పడుతోంది.  తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సిద్ధం సభకు సంబంధించి వైసీపీ మార్ఫింగ్ చేసి రిలీజ్ చేసిన ఫొటోలను తన ఎక్స్ ఖాతా ద్వారా రివీల్ చేసి  సీఎం జగన్ సిద్ధం సభలకు జనం రాకపోయినా... మార్ఫింగ్ ఫొటోలు వేసుకుంటూ సభ విజయవంతమైనట్టు చెప్పుకుంటున్నారని టీడీపీ యువనేత నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. 

భధ్రాది రామన్నను దర్శించుకున్న రేవంత్ రెడ్డి

యాదాద్రిలో లక్ష్మినరసింహాస్వామిని దర్శించుకున్న వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మంజిల్లాలోని భధ్రాచలం రాములవారిని దర్శించుకున్నారు. ఈ జిల్లా నుంచి నలుగురు మంత్రులు ప్రస్తుత కేబినెట్లో ఉన్నారు.  మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు మాత్రం ముఖ్యమంత్రికి స్వాగతించిన వారిలో ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క స్వాగతం పలికారు. ఆలయ ఈవో, పండితులు పూర్ణకుంభంతో ఆలయంలోకి స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క ఉన్నారు. అంతకుముందు రేవంత్ రెడ్డి దంపతులు యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు.

వైఎస్, బాబు పాలన ఎంతో నయం.. జగన్ పాలనలోనే క్రిస్టియన్లకు కష్టాలు.. బ్రదర్ అనీల్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి గత ఎన్నికలలో తాను అధికారంలోకి రావడానికి దోహదపడిన ప్రతి అంశమూ కూడా ఇప్పుడు ప్రతికూలంగా  మారి అధికారానికి దూరం కావడానికి దోహదపడుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  గత ఎన్నికలలో కారణాలేమైతేనేం.. తెలుగుదేశం, జనసేన, బీజేపీలు వేరువేరుగా రంగంలోకి దిగాయి. దీంతో జగన్ కు సునాయాసంగా అధికారం దక్కింది.  తెలుగుదేశం, జనసేన, బీజేపీలో వేర్వేరుగా పోటీ చేయడం ఒక్కటే కాదు.. రాష్ట్రంలో క్రైస్తవ సమాజం మొత్తం గంపగుత్తగా జగన్ కు మద్దతు పలకడం కూడా జగన్ పార్టీ విజయానికి ప్రధాన కారణమనడంలో సందేహం లేదు.   అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా రివర్స్ అయ్యిందంటున్నారు. స్వ‌త‌హాగా సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఆయ‌న కుటుంబం  క్రిస్టియన్లు కావ‌డంతో ఆ మ‌తానికి చెందిన వారు దాదాపు గంప‌గుత్త‌గా   వైసీపీకి మ‌ద్ద‌తుగా నిలిచారు.  అలా నిలవడానికి ప్రధాన కారకుల్లో ఒకరు   జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సోద‌రి ష‌ర్మిల భ‌ర్త బ్ర‌ద‌ర్ అనిల్ కుమార్‌ అనడానికి సందేహం అవసరం లేదు. అప్పట్లో  ఆయన ఏపీ వ్యాప్తంగా ప‌ర్య‌టించి క్రిస్టియ‌న్ల‌ను వైసీపీవైపు మొగ్గు చూపేలా చేయడంలో సఫలీకృతులయ్యారు.  క్రిస్టియ‌న్లు అంటే కేవ‌లం ఎస్సీ, ఎస్టీ సామాజిక వ‌ర్గాలే కాదు.. బీసీలు, ఓసీల్లోని క‌మ్మ‌, కాపు, రెడ్డి కుల‌స్థులు కూడా అధికంగానే ఉన్నారు.  కులంతో సంబంధం లేకుండా కేవ‌లం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క్రిస్టియ‌న్ అనే కార‌ణంతో  అప్పట్లో చంద్ర‌బాబును దూరంపెట్టి వాళ్లంతా జ‌గ‌న్ కు మద్దతుగా నిలిచారు. అయితే అదంతా గతం. ఐదేళ్లు గిర్రున తిరిగాయో లేదో.. ఇప్పుడు గతంలో జగన్ కు మద్దతుగా నిలిచిన క్రిస్టియన్లు ఇప్పుడు గతంలోలా గంపగుత్తగా ఆయనవైపు నిలిచే పరిస్థితి లేదు.  ఎందుకంటే జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత త‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిచిన క్రిస్టియ‌న్ల‌కు ఆయన చేసిన మేలేమీ లేకపోగా.. కులం ప్రాతిపదికన వారిని చిన్న చూపు చూశారు.  ఎస్సీ, ఎస్టీ సామాజిక వ‌ర్గాల వారి ఆత్మగౌరవం దెబ్బతినేలా జగన్ సర్కార్ వ్యవహరించింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎస్సీఎస్టీలపై దాడులు జరిగాయి.  అంతే కాదు.. గత ఎన్నికలలో క్రిస్టియన్ల ఓట్లు గంపగుత్తగా వైసీపీకి మళ్లడంలో కీలక భూమిక పోషించిన షర్మిల భర్త బ్రదర్ అనీల్ ఇప్పుడు జగన్ కు దూరం జరిగారు. షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన కాంగ్రెస్ కు అనుకూలంగా క్రిస్టియన్లను ఏకం చేయడం కోసం పని చేస్తున్నారు.   దీని వల్ల తనకు జరిగే నష్టం ఏ స్థాయిలో ఉంటుందో జగన్ కు తెలుసు. అందుకే వ్యూహాత్మకంగా తన మేనత్త, అంటే తన తండ్రి సోదరి విమలారెడ్డిని రంగంలోకి దింపారు.  ఆమె  జిల్లాల్లో  విస్తృతంగా పర్యటనలు చేస్తూ.. చ‌ర్చి ఫాద‌ర్లతో భేటీ అవుతున్నారు. అయితే క్రిస్టియన్ సొసైటీలో విమలారెడ్డికి పెద్దగా గుర్తింపు లేదు. అధికార పార్టీ అండతో మాత్రమే ఆమె చర్చి ఫాదర్లకు తాయిలాలు పంచుతూ తన సమావేశాలకు హాజరయ్యేలా చేసుకోగలుగుతున్నారు. అయితే చర్చి ఫాదర్లు, పాస్టర్లతో ఆమె సమావేశాలు పెద్దగా ఫలితాన్నిస్తున్నట్లు కనిపించడం లేదు. అంతే కాకుండా ఇంత పంచుతాము, అంత ఇస్తాము అంటూ ప్రలోభపెట్టి తీరా సమావేశం పూర్తయిన తరువాత ఏదో అరకొరగా చేతిలో పెట్టి చేతులుదులుపుకోవడంతో విమలారెడ్డిపై ఫాదర్లు, పాస్టర్లలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల కాకినాడలో  ఆమె నిర్వహించిన సదస్సుకు దాదాపు రెండు వేల మంది పాదర్లు, పాస్టర్లు పాల్గొన్నారు. అంత సంఖ్యలో వారు రావడానికి కారణం నిర్వాహకులు భేటీ ముగిసిన తరువాత ఒక్కొక్కరికీ వేయి రూపాయలు ఇస్తామంటూ ప్రలోభాలకు గురి చేయడమే. ఈ విషయం సదస్సు ముగిసిన తరువాత ఫాస్టర్లు ఆందోళనకు దిగడంతో వెల్లడైంది. వేయి రూపాయలు ఇస్తామని చెప్పి తీరా సదస్సు ముగిశాకా ఐదొందలు మాత్రమే చేతిలో పెట్టారంటూ కాకినాడ సదస్సుకు హాజరైన ఫాస్టర్లు ఆందోళనకు దిగారు. దీంతో వ్రతమూ చెడి, ఫలమూ దక్కలేదన్నట్లుగా తయారైంది  వైసీపీ పరిస్థితి. సముదాయించి పరిస్థితిని చక్కదిద్దాల్సిన నిర్వాహకులు మొహం చాటేశారు. విమలారెడ్డి చర్చి బ్యాక్ డోర్ నుంచి కారులో పలాయనం చిత్తగించారు. ఈ సంగతి మీడియాలో ప్రముఖంగా రావడంతో విమలారెడ్డికి అసలే అంతంత మాత్రంగా ఉన్న రెపుటేషన్ మరింత తగ్గింది.  ఇక ఇప్పుడు షర్మిల భర్త బ్రదర్ అనీల్ రంగంలోకి దిగారు. జగన్ కు, ఆయన పార్టీకి వ్యతిరేకంగా పాస్టర్లతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. జగన్ ఏలుబడిలో పాస్లర్లు ఎదుర్కొన్న సమస్యలను సవివరంగా వివరిస్తున్నారు. క్రైస్తవులకు మేలు జరగలేదని చెబుతున్నారు. తాజాగా అమలాపురంలో పాస్టర్ల సమావేశంలో పాల్గొన్న బ్రదర్ అనీల్ కుమార్ ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు పాలనలో కానీ   క్రైస్తవులకు ఎలాంటి ఇబ్బందులు రాలేదన్నారు.   వైఎస్ హయాంలో క్రైస్తవులు ఇబ్బందులకు గురౌతున్నారని  చెప్పకనే చెప్పారు. వైఎస్ బిడ్డే కదా అని జగన్‌కు అవకాశం ఇస్తే రాష్ట్రంలో క్రైస్తవులు సువార్త సభలు పెట్టుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని అనీల్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.   రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెప్పడం ద్వారా నేరుగా జగన్ పేరు ఎత్తకుండానే ఆయన పార్టీకి ఓటువేయవద్దని సూటిగా, సుత్తిలేకుండా స్పష్టంగా చెప్పారు.  జగన్ రెడ్డిని గెలిపించడం అంటే దేవుడ్ని మోసం చేసడమేనంటున్నారు.  శత్రువులంతా అంతమైపోవాలని భగవంతుడిని ప్రార్థిద్దామంటున్నారు. అనిల్ రెడ్డి అమలాపురంలో చేసిన వ్యాఖ్యల వల్ల  ఆయన  సువార్త సభలను ఏపీలో పెట్టుకోలేని పరిస్థితులను జగన్ సృష్టించారని తేటతెల్లమౌతున్నది.  మొత్తం మీద బ్రదర్ అనీల్ ప్రసంగాలు క్రిస్టియన్లను వైసీపీకి దూరం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. గత ఎన్నికల సమయంలో జగన్ కు అనుకూలంగా క్రైస్తవ సమాజాన్ని కదిలించిన ఆయన ప్రసంగాలు ఇప్పుడు అదే  జగన్ కు  క్రీస్టియన్లను దూరం చేయడం తథ్యమని అంటున్నారు. 

యాదాద్రి సాక్షిగా భట్టి విక్రమార్కకు అవమానం

తెలంగాణలో  పదేళ్లపాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలో రావడంలో సీనియర్ కాంగ్రెస్ నేత, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలకపాత్ర పోషించారు.  2023 మార్చి 16న ఆదిలాబాద్​ జిల్లాలోని బోథ్ నుంచి పీపుల్స్​ మార్చ్ పాదయాత్ర ప్రారంభించి రాష్ట్రంలోని 17 జిల్లాలు, 36 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 1,360 కిలో మీటర్లు పూర్తి చేసిన భట్టి విక్రమార్క కాంగ్రెస్ ప్రభుత్వంలో వివక్షకు గురవుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీ సమేతంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు స్వామి వారిని దర్శించుకున్నారు. పూజ సమయంలో రేవంత్, ఆయన భార్య, కోమటిరెడ్డి, ఉత్తమ్ లు కొంత ఎత్తున్న స్టూళ్లపై కూర్చున్నారు. వీరి పక్కన మల్లు భట్టి తక్కువ ఎత్తున్న పీఠంపై కూర్చున్నారు. దీనిపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ... దేవుడి సాక్షిగా ఉప ముఖ్యమంత్రికి అవమానం జరిగిందని అన్నారు. ఈ అవమానాలు లేని భారతం కోసమే బీఎస్పీ పోరాటమని చెప్పారు.  ఇదే అంశంపై బీఆర్ఎస్ పార్టీ కూడా విమర్శలు గుప్పించింది. యాదాద్రి దేవాలయం సాక్షిగా దళితుడైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను, బహుజన బిడ్డ కొండా సురేఖను రేవంత్ రెడ్డి అండ్ కో ఘోరంగా అవమానించిందని ట్వీట్ చేసింది. వారు పైన కూర్చిని భట్టి విక్రమార్క, కొండా సురేఖను రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అవమానించారని వ్యాఖ్యానించింది. 

నిడదవోలు అభ్యర్థిగా కందుల దుర్గేష్ పేరు ప్రకటించిన జనసేనాని 

ఎపిలో ఎన్నికల హడావిడి ఊపందుకుంది. టిడిపి, బిజెపి, జనసేన పొత్తు ఖరారైన తర్వాత ఈ వేగం మరింత ఎక్కువైంది. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోయే మరో అభ్యర్థి పేరును జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. నిడదవోలు నియోజకవర్గ అభ్యర్థిగా కందుల దుర్గేశ్ ను ఆయన ఎంపిక చేశారు. కందుల దుర్గేశ్ ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి తరపున దుర్గేశ్ పోటీ చేయబోతున్నారని జనసేన పార్టీ ప్రకటించింది.  ఇప్పటికే నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణల పేర్లను పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలి జాబితాలో టీడీపీ 94 మంది పేర్లను ప్రకటించింది. మరోవైపు బీజేపీ, జనసేనలకు పొత్తులో భాగంగా 8 లోక్ సభ, 30 శాసనసభ స్థానాలను టీడీపీ కేటాయించినట్టు తెలుస్తోంది. 

ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి యాదాద్రిలో...

యాదాద్రి నిర్మాణం బిఆర్ఎస్ హాయంలో జరిగింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే యాదాద్రిలో నేటి నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలను రేవంత్ రెడ్డి ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు.  శ్రీల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి దేవ‌స్థానం వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా యాదాద్రి చేరుకున్న‌ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి దంప‌తులకు ఆల‌య అర్చ‌కులు పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికారు. బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా తొలిరోజు ప్ర‌ధాన ఆల‌యంలో సీఎం దంప‌తులు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ప్ర‌భ‌త్వం త‌ర‌ఫున స్వామివారికి ప‌ట్టువ‌స్త్రాలు, అమ్మ‌వారికి ముత్యాల తలంబ్రాలు స‌మ‌ర్పించారు. ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, కోమ‌ట్ రెడ్డి వెంక‌ట్ రెడ్డి, కొండా సురేఖ, ప్ర‌జాప్ర‌తినిధులు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.  ఇక రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రి హోదాలో తొలిసారి యాదాద్రికి వెళ్ల‌డంతో ప్రొటోకాల్ స‌మ‌స్య‌లు రాకుండా ఆల‌య ఆఫీస‌ర్లు, పోలీసులు ముందే అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ క్ర‌మంలో కొండ‌పైకి ఇత‌ర వాహ‌నాల‌ను అనుమ‌తించ‌లేదు. ఉద‌యం 11 గంట‌ల త‌ర్వాత భ‌క్తుల‌కు ద‌ర్శ‌నానికి అనుమ‌తించ‌డం జ‌రిగింది. తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి 11రోజుల పాటు జరగనున్నాయి. మహాదివ్య పుణ్యక్షేత్రమైన యాదాద్రి పంచనారసింహుల ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో మరో తిరుమల క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదాద్రీశుల వైభవం నలుదిశల్లోని భక్తజనులను అలరింపజేసేలా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు రంగం సిద్ధం చేశారు. క్షేత్రాభివృద్ధిలో భాగంగా ఆలయ ఉద్ఘాటన జరిగిన తర్వాత రెండోసారి జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.

హైకోర్టులో రఘు రామకృష్ణ రాజు సందడి 

 వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు ముఖ్యమంత్రి జగన్  అవినీతిపై సీరియస్ గానే ఉన్నారు. ఇంతకాలం పార్టీలో ఉంటూ పోరాటం చేసిన ఆయన లీగల్ గా జగన్ పై యుద్దం చేయాలని నిర్ణయించుకున్నట్టు కనబడుతోంది  ఎంపీ రఘురామకృష్ణరాజు  సోమవారం ఏపీ హైకోర్టుకు వచ్చారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అవినీతిపై సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ రోజు ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది. హైకోర్టులోని 19వ నెంబర్ హాల్లో 10వ ఐటెంగా రఘురాజు పిటిషన్ ఉంది. వైసీపీలో ఉంటూనే ఆయన సీఎం జగన్, వైసీపీపై విమర్శల దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ప్రభుత్వం వైపు నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ఆయన ఏపీకి రావడం ఆపేశారు. చాలా కాలం తర్వాత ఆయన మొన్న సంక్రాంతికి భీమవరం వెళ్లారు. ఈ తర్వాత ఈరోజు మళ్లీ ఏపీలో అడుగుపెట్టారు. రఘురాజు రావడంతో హైకోర్టు వద్ద సందడి నెలకొంది. 

మూడూ ఒకటే.. జగన్ కు ఇక ఇక్కట్లే!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో జగన్ కు ఇక్కట్లు తప్పవా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. నిన్న మొన్నటి వరకూ తెలుగుదేశం, జనసేన కూటమితో బీజేపీ కలుస్తుందా? కలవదా? కలిస్తే అది తెలుగుదేశం, జనసేన కూటమికి ప్రయోజనమేనా?  బీజేపీపై ఏపీలో ఉన్న ఆగ్రహం కూటమిపై కూడా ప్రభావం చూపుతుందా? అన్న అనుమానాలు బలంగా వ్యక్తమయ్యాయి. పరిశీలకులు, కొన్ని సర్వేలు సైతం బీజేపీతో కలయిక తెలుగుదేశం పార్టీకి పెద్దగా లబ్ధి చేకూర్చే అవకాశాలు లేవనీ, ఏదో మేరకు నష్టం కూడా వాటిల్లే అవకాశాలున్నాయనీ పేర్కొన్నాయి. అయితే ఒక సారి తెలుగుదేశం, జనసేన కూటమితోనే ఏపీలో కలిసి వెళ్లాలని బీజేపీ నిర్ణయించుకున్న తరువాత జరిగిన పరిణామాలను గమనిస్తే, ఆ అనుమానాలన్నీ దూది పింజెల్లా తేలపోయాయి. 2019 ఎన్నికల తరువాత ఏపీ విషయంలో బీజేపీ తొలి సారిగా తన వాస్తవ బలం ఏమిటన్నది గుర్తించి అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీలో పొత్తులో భాగంగా బీజేపీ ఎన్ని సీట్లు సాధించుకున్నా.. ఎన్ని స్థానాలలో పోటీ చేసినా.. ఆయా స్థానాలలో ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సింది మాత్రం తెలుగుదేశం, జనసేనలే. ఎందుకంటే వాస్తవంగా చూసుకుంటే బీజేపీకి ఏపీలో ఒక్కటంటే ఒక్క శాతం ఓటు స్టేక్ కూడా లేదు. ఇంకా క్లియర్ కట్ గా చెప్పాలంటే.. ఆ పార్టీకి బలమైన అభ్యర్థులూ లేరు. పోటీ చేసే స్థానాలలో బూతు ఏజెంట్లు కూడా దొరకని పరిస్థితి. అయితే కేంద్రంలో అధికారంలో ఉండటం, మరో సారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందన్న అంచనాలు బలంగా ఉండటంతో.. రాష్ట్ర ప్రయోజనాలను, కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన సహకారాన్నీ దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం, జనసేన కూటమి బీజేపీతో పొత్తుకు రెడీ అయ్యింది. ఆ పార్టీ పొత్తు విషయంలో నిర్ణయం తీసుకునే వరకూ వేచి చూసింది. ఒక సారి బీజేపీ కూడా తమ కూటమితో కలిసి వస్తుందన్న నిర్ణయం జరిగిపోగానే.. తెలుగుదేశం, జనసేన అధినేతలు నారా చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ హస్తినకు వెళ్లి రాష్ట్రంలో పరిస్థితిని, కూటమి గెలుపు అవకాశాలనూ ఆ పార్టీ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు కూలంకషంగా వివరించారు. గత ఐదేళ్లుగా ఏపీలో బీజేపీలోని ఒక వర్గం వ్యవహరించిన తీరు కారణంగా బీజేపీ రాష్ట్రంలోని అధికార వైసీపీతో అంటకాగుతోందన్న భావన ప్రజలలో బలంగా ఉందని సోదాహరణగా వివరించారు. ఆ కారణంగా ప్రజలలో బలంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత అంతే బలంగా బీజేపీపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆ పార్టీ అగ్రనేతలకు అర్ధమయ్యేలా వివరించగలిగారు. ఆ కారణంగానే బీజేపీ పెద్దలు ఏపీతో పొత్తుల విషయంలో తెలుగుదేశం, జనసేన కూటముల అభిప్రాయాలకే అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఈ పొత్తు కారణంగానే కనీసం ఒక్కశాతం ఓటు కూడా లేని కమలం పార్టీకి ఏవో కొన్న అసెంబ్లీ, లోక్ సభ స్థానాలు దక్కనున్నాయన్న సంగతి బీజేపీ పెద్దలకు స్పష్టంగా తెలుసు. అలా కాకుండా అధికార పార్టీతోనే  అంటకాగుతున్నామన్న భావన కలిగేలా కూటమితో కలవకపోయినా, అధిక స్థానాలు డిమాండ్ చేసి పొత్తు పొసగకపోవడానికి కారణమైనా ఏపీలో కనీస ప్రాతినిథ్యం కూడా ఉండే అవకాశం లేదని బీజేపీ అగ్రనాయకత్వానికి స్పష్టంగా తెలుసు. ఆ విషయాన్ని పరిగణనలోనికి తీసుకునే పొత్తు విషయంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు కొందరు చేసిన అతి ప్రకటనలను పూర్తిగా పక్కన పెట్టేయడమే కాకుండా, పొత్తులో భాగంగా తమకు వచ్చిన స్థానాలలో కూడా తెలుగుదేశం, జనసేనలకు ఆమోదయోగ్యమైన అభ్యర్థులనే నిలపడానికి కూడా బీజేపీ అగ్రనాయకత్వం అంగీకరించడమే ఆ పార్టీ వాస్తవిక పరిస్థితులను గ్రహించే పొత్తుకు ముందుకు వచ్చిందన్న సంగతి స్పష్టంగా అవగతమౌతుంది.  ఎందుకంటే ఇంత కాలం రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న అధికార వైసీపీపై కాకుండా ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా విపక్ష తెలుగుదేశంపై పోరాడిందన్న భావన ప్రజలలో బలంగా ఉంది. అలా ఉండటానికి కారణం బీజేపీ ఏపీ నాయకులలో కొందరు చేసిన అతే కారణమనడంలో సందేహం లేదు. అదే విధంగా ఏపీ సర్కార్ ఆర్థిక అరాచకత్వాన్ని కేంద్రంలోని మోడీ సర్కార్ చూసీ చూడనట్లు వదిలేసిందన్న భావన కూడా ప్రజలలో ఉంది. జగన్ సర్పంచ్ లకు తెలియకుండానే పంచాయతీరాజ్ నిధులను డ్రా చేసుకుని ఇతర అవసరాలకు వాడేయడం వంటి వ్యవహారాలను కేంద్రం సీరియస్ గా తీసుకోకపోవడంతో జనంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ జగన్ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తోందన్న భావన ఏర్పడింది.  ఏపీ విషయంలో నాన్ సీరియస్ గా వ్యవహరించడం వల్ల జరిగిన నష్టాన్ని గ్రహించిన బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పుడు పొరపాట్లను సవరించుకుని, రాష్ట్ర పార్టీలో వైసీపీ అనుకూల శక్తుల పట్ల సీరియస్ గా దృష్టి పెట్టింది. అందుకే ఏపీ బీజేపీలోని వైసీపీ అనుకూల నేతలకు పోటీ చేసే అవకాశం ఇవ్వవద్దన్న తెలుగుదేశం, జనసేన కూటమి షరతుకు అంగీకరించింది.  ఈ నేపథ్యంలోనే పార్టీలో వైసీపీ అనుకూల నేతలుగా ముద్రపడిన సోము వీర్రాజు, జీవీఎల్ సహా ఎవరికీ వచ్చే ఎన్నికలలో పోటీకి అవకాశం ఉండదని బీజేపీ అగ్రనాయకత్వం చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు స్పష్టం చేసినట్లు బీజేపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అంతే కాదు తొలి నుంచీ హిందూపురం లోక్ సభ స్థానం నుంచి నుంచి పోటీ చేయాలని భావిస్తున్న విష్ణువర్ధన్ రెడ్డిని కూడా పక్కన పెట్టేసినట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి.  ఏపీ నుంచి బీజేపీ అభ్యర్ధులుగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంపై పోరాడిన వారికి మాత్రమే కమలం పార్టీ టికెట్లు ఇచ్చేందుకు నిర్ణయించిందని అంటున్నారు.  బీజేపీ అభ్యర్థులుగా తాము ఎవరికి టికెట్ ఇచ్చినా వారు గెలవాల్సింది మాత్రం తెలుగుదేశం, జనసేన ఓట్లతోనే అన్న వాస్తవాన్ని గుర్తెరిగిన కమలనాథులు.. ఆ రెండు పార్టీలకూ ఆమోదయోగ్యమైన అభ్యర్థులనే బరిలోకి దింపాలన్న నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు.  

ఏపీలో మ‌ద్యం కుంభ‌కోణంపై ఈడీ నజర్.. జ‌గ‌న్ అరెస్ట్ ఖాయ‌మా?

ఏపీలో మ‌ద్యం కుంభ‌కోణంపై ఈడీ నజర్ పెట్టిందా..?  మ‌ద్యం అమ్మ‌కాల్లో జ‌రిగిన అక్ర‌మాల‌ను వెలికితీసేందుకు సిద్ధ‌మైందా..?  సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మెడ‌కు మ‌ద్యం కుంభ‌కోణం ఉచ్చు బిగుసుకోబోతుందా?  అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది.  గత కొద్ది రోజులుగా ఏపీలో మ‌ద్యం విక్ర‌యాలు, లావాదేవీల‌పై దృష్టిసారించిన ఈడీ.. ఇప్ప‌టికే కీల‌క ఆధారాల‌ను సేక‌రించిన‌ట్లు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.  తాజాగా తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మితో బీజేపీ పొత్తు ఖ‌రారు కావ‌డంతో ఈడీ సైతం త‌న ప‌ని  మొద‌లుపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న‌ట్లు స‌మాచారం. ఏపీలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్ర‌భుత్వ‌మే నిర్వ‌హిస్తోంది. దేశ‌వ్యాప్తంగా డ‌బ్బాకొట్టు వ్యాపారి నుంచి డిజిట‌ల్ లావాదేవీల‌తో వ్యాపారం కొన‌సాగించేలా కేంద్ర ప్ర‌భుత్వం ప్రోత్స‌హిస్తోంది. కానీ  ఏపీలో మ‌ద్యం విక్ర‌యాల్లో మాత్రం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం డిజిట‌ల్ లావాదేవీలు మాకు అవ‌స‌రం లేద‌న్న‌ట్లుగా ప‌క్క‌కు పెట్టేసింది. అధిక ప్రాంతాల్లో కేవ‌లం క్యాష్ తోనే మ‌ద్యం విక్ర‌యాలు జ‌రుగుతున్నాయి. దీంతో మ‌ద్యం షాపుల్లో కేవ‌లం క్యాష్ లావాదేవీల కారణంగా  భారీఎత్తున అక్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని విమ‌ర్శ‌లు వెల్ల‌ువెత్తుతున్నాయి.  ఏపీలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కొత్త మ‌ద్యం పాలసీని తీసుకొచ్చింది. ప్రైవేట్ మ‌ద్యం దుకాణాల‌ను ర‌ద్దుచేసి వాటి స్థానంలో ప్ర‌భుత్వ మ‌ద్యం దుకాణాల‌ను ఏర్పాటు చేసింది. దీంతో అధికార పార్టీ కీల‌క నేత‌లు కొంద‌రు బినామీల పేరిట మ‌ద్యం స‌ర‌ఫ‌రా సంస్థ‌ల‌ను ఏర్పాటు చేశారు. ఏపీ బెవ‌రేజ‌స్ కార్పొరేష‌న్ ఈ స‌ర‌ఫ‌రా సంస్థ‌ల నుంచి మ‌ద్యం కొనుగోలు చేసి దుకాణాల్లో విక్ర‌యిస్తోంది. బెవ‌రేజ‌స్ కార్పొరేష‌న్ వ‌ద్ద వంద సంస్థ‌లు న‌మోదై ఉండ‌గా.. అన‌ధికారికంగా నిర్దేశించిన క‌మీష‌న్ చెల్లించేందుకు అంగీక‌రించిన సంస్థ‌ల‌కే మ‌ద్యం స‌ర‌ఫ‌రా ఆర్డర్లు ఇస్తున్నట్లు ఈడీకి అనేక సార్లు ఫిర్యాదులు  అందాయి. కేవ‌లం ప్ర‌భుత్వం పెద్ద‌లకు స‌న్నిహితులు, అధికార పార్టీ నేత‌లకు చెందిన 16 కంపెనీలు మాత్ర‌మే అత్య‌ధిక మ‌ద్యం స‌ర‌ఫ‌రా ఆర్డ‌ర్లు ద‌క్కించుకున్నాయి. దీనికి తోడు మ‌ద్యం దుకాణాల్లో న‌గ‌దు ర‌హిత లావాదేవీలుకాకుండా.. క్యాష్ తోనే మ‌ద్యం విక్ర‌యాలు జ‌రుగుతున్నాయి.  అంతేకాక‌..  కేవ‌లం నాలుగైదు ర‌కాల బ్రాండ్స్ మ‌ద్యాన్ని మాత్ర‌మే విక్ర‌యిస్తున్నారు. దీనిపై మందు బాబులు పలు మార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నాసిరకం మద్యం విక్రయిస్తున్నారంటూ ఫిర్యాదులు సైతం చేశారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు.  అయితే, ఏపీలో మ‌ద్యం స‌ర‌ఫ‌రా, విక్ర‌యాలు, త‌దిత‌ర విష‌యాల్లో జ‌రుగుతున్న అవ‌క‌త‌వ‌ల‌పై ఈడీ ఎప్ప‌టిక‌ప్ప‌డు ఆధారాలు సేక‌రిస్తూనే ఉంద‌ని స‌మాచారం.  మ‌ద్యం దుకాణాల్లో త‌ప్ప‌నిస‌రిగా డిజిట‌ల్ పేమెంట్స్ తీసుకోవాలి.. దీంతో లెక్క‌లు ప‌క్కాగా ఉంటాయి. ప్ర‌భుత్వ  మ‌ద్యం దుకాణాల్లో డిజిట‌ల్ పేమెంట్స్ తీసుకోక‌పోవ‌డం ముమ్మాటికీ త‌ప్పేన‌ని ప‌లువురు రిటైర్డ్ అధికారులు స్ప‌ష్టం చేస్తున్నారు. ప్ర‌భుత్వం మ‌ద్యం దుకాణాల్లో డిజిట‌ల్ లావాదేవీలు నిర్వ‌హించేందుకు ఒక ప్రైవేట్ కంపెనీ యాప్ త‌యారు చేసింది. ఐదారు నెల‌లు డిజిట‌ల్ లావాదేవీల‌కు మ‌ద్యం దుకాణాల్లో అనుమ‌తించినా.. ఆ త‌రువాత కేవ‌లం క్యాష్ ఇచ్చిన‌వారికే మ‌ద్యం విక్ర‌యిస్తున్నారు. దీంతో పెద్ద మొత్తంలో డ‌బ్బులు ప‌క్క‌దారి ప‌డుతున్నాయన్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.  తెలుగుదేశం హ‌యాంలో 2019 నాటికి ప్ర‌భుత్వానికి రోజుకు మ‌ద్యంపై రూ.50కోట్లు ఆదాయం వ‌చ్చేది. ప్ర‌స్తుతం అది రోజుకు రూ.90కోట్ల వ‌ర‌కు చేరుకుంది. అయితే మద్యం ధ‌ర‌ల‌ను ఏపీ ప్ర‌భుత్వం గ‌త‌కంటే మూడు రెట్లు పెంచేసింది. దీంతో మ‌ద్యం అమ్మ‌కాలు కాస్త త‌గ్గినా ఆదాయం మాత్రం భారీగా స‌మ‌కూరుతుంది.  2018-19 లో మ‌ద్యం ఆదాయం రూ. 20,128 కోట్లుగా ఉంటే..  2022-23లో రూ. 28,113 కోట్ల‌కు పెరిగిన‌ట్లు తెలుస్తోంది. అయితే, క్యాష్ లావాదేవీలు మాత్రం జ‌రుగుతుండ‌టంతో లెక్క‌లు చూప‌కుండా డ‌బ్బులు చేతులు మారుతోంద‌ని, దీనివ‌ల్ల జీస్టీ ఎగ్గొడుతున్నార‌న్న ఫిర్యాదులు ఈడీకి కుప్ప‌లుతెప్ప‌లుగా వెళ్లిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. ఏపీలో మ‌ద్యం విక్ర‌యాల్లో భారీ ఎత్తున అక్ర‌మాలు చోటుచేసుకుంటున్నాయ‌ని తెలుగుదేశం నేత‌లు కొన్నేళ్లుగా విమ‌ర్శ‌లు చేస్తున్నారు.   ఈడీకి సైతం అనేక‌సార్లు పిర్యాదులు సైతం చేశారు. కానీ ఇప్పటి వరకూ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. ప్ర‌స్తుతం ఈడీ ఏపీలో మ‌ద్యం స‌ర‌ఫ‌రా, విక్ర‌యాలు, లావాదేవీల‌పై పూర్తిస్థాయి వివ‌రాలు సేక‌రిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో మ‌ద్యం విక్ర‌యాల్లో భారీ ఎత్తున అవినీతి అక్ర‌మాలు చోటుచేసుకున్న‌ట్లు ఈడీ అధికారులు గుర్తించార‌ని ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. ప్ర‌స్తుతం తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మితో బీజేపీ కూడా కలవడంతో ఇక పై నుంచి ఒత్తిడులు వచ్చే అవకాశం లేదన్న భావనతో ఈడీ ఏపీ మద్యం వ్యవహరంలో దూకుడు ప్రదర్శించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. మ‌రో వారం ప‌దిరోజుల్లో ఈడీ అధికారులు అక్ర‌మార్కుల‌పై కొర‌డా ఝుళిపించేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం. అదే జరిగితే ఏపీలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణం వ్య‌వ‌హారం సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మెడ‌కు చుట్టుకోవ‌టం ఖాయ‌మ‌ని, ఆయ‌న అరెస్టు త‌ప్ప‌ద‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు.

జ‌గ‌న్‌కో న్యాయం.. ప‌వ‌న్‌కో న్యాయ‌మా ముద్రగడా?

ఏపీ రాజ‌కీయాల్లో మాజీ మంత్రి, కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం వ్య‌వ‌హార‌శైలి ప‌లు అనుమానాల‌కు తావునిస్తోంది. కాపు సామాజిక‌వ‌ర్గానికి రిజ‌ర్వేష‌న్లు, సామాజిక‌వ‌ర్గ ప్ర‌జ‌ల అభ్యున్న‌తే తన  ధ్యేయం అని చెప్పుకుంటూ ఇన్నాళ్లూ ప‌బ్బంగ‌డుపుకున్న  ముద్ర‌గ‌డ.. ఇప్పుడు వైసీపీ కండువా క‌ప్పుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. కాదు.. కాదు.. ఇన్నాళ్లూ కాపు నేత ముసుగులో జ‌గ‌న్ ప్ర‌ణాళిక‌ను అమ‌లు చేసిన ముద్ర‌గ‌డ‌.. ప‌వ‌న్ దెబ్బ‌కు అవి బెడిసికొట్ట‌డంతో ముసుగు తీసేసి.. త‌న నిజ‌స్వ‌రూపాన్ని చూపించ‌డానికి రెడీ అయ్యారనడం కరెక్ట్.  ముద్ర‌గ‌డ ఇన్నాళ్లు ఆడిన రాజ‌కీయ నాట‌కాన్ని గుర్తించిన కాపు సామాజిక వ‌ర్గ ఓట‌ర్లు ఇప్పుడు మ‌ద్ర‌గ‌డ‌పై మండిప‌డుతున్నారు. ప్ర‌జాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అయితే.. ముద్ర‌డ కాపు సామాజిక వ‌ర్గానికి చేసిన మోసంపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు.. సిగ్గుందా నీకు అంటూ నిలదీశారు. గ‌తంలో ముద్ర‌గ‌డ‌కు కాపు సామాజిక వ‌ర్గ  ప్ర‌జ‌ల అండ‌దండ‌లు పుష్క‌లంగా ఉండేవి.. ముద్ర‌గ‌డ‌ను ఏమైనా అంటే ఆ సామాజిక‌వ‌ర్గం  ఊరుకునేది కాదు. కానీ  ఇప్పుడా ప‌రిస్థితి లేదు.  ముద్ర‌గ‌డ సీఎం జ‌గ‌న్ మునిషి అని గుర్తించిన నాటి నుంచి కాపు సామాజిక వర్గం  ఆయన పేరెత్తితే మండిపడుతున్నారు.  దీంతో కేఏ పాల్ ముద్ర‌గ‌డ‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేసినా.. క‌నీసం ఖండ‌న‌  ఇచ్చేందుకు కూడా కాపు సామాజిక వర్గం నుంచి ఎవ‌రూ ముందుకురాలేదు. కాపు రిజ‌ర్వేష‌న్ల కోసం ఉద్య‌మం చేస్తున్నాన‌ని చెప్పుకుంటూవ‌చ్చిన ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం తెలుగుదేశం హ‌యాంలో  ఆందోళ‌న‌లు నిర్వ‌హించారు. చంద్ర‌బాబు సీఎంగా ఉన్నంత‌కాలం కాపు రిజ‌ర్వేష‌న్లు అంటూ తెగ హ‌డావుడి చేసిన ముద్ర‌గ‌డ, జ‌గ‌న్ సీఎం అయిన త‌రువాత కాపు రిజ‌ర్వేష‌న్ల ముచ్చ‌టే ఎత్త‌లేదు. దీనికి తోడు గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో కాపు రిజ‌ర్వేష‌న్లుకు నేను వ్య‌తిరేకం అని   జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కుండబద్దలు కొట్టినట్లు చెప్పిన తరువాత కూడా ఆయనను గెలిపించేందుకు ముద్ర‌గ‌డ ప్ర‌య‌త్నం చేశార‌నే విమ‌ర్శ‌లుసైతం ఉన్నాయి. జ‌గ‌న్ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి ముద్ర‌గ‌డ సైలెంట్ అయిపోయారు.. కాపు రిజ‌ర్వేష‌న్లు లేవు.. కాపు ఉద్య‌మం లేదు.. కేవ‌లం చంద్ర‌బాబును గ‌ద్దెదించేందుకే కాపుల‌ను అడ్డుపెట్టుకొని ముద్ర‌గ‌డ నాట‌కం ఆడార‌నే విష‌యాన్ని కాపు సామాజిక వ‌ర్గం ప్ర‌జ‌లకు బోధపడింది.  అందుకే ముద్ర‌గ‌డ‌కు కాపు సామాజిక వ‌ర్గం ప్ర‌జానీకం బైబై చెప్పి.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కే   మ‌ద్ద‌తు అని చెబుతున్నారు. ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంకు జ‌న‌సేన పార్టీ అన్నా, ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నా.. మొద‌టి నుంచి చిన్న‌చూపే. కాపు సామాజిక వ‌ర్గం పెద్ద‌గా తాను త‌ప్ప మ‌రెవ‌రూ ఉండ‌కూడ‌దు. కాపులంతా తన మాటే వినాలి.. తాను  ఏ పార్టీకి ఓట్లేయాలి అంటే కాపులంతా గుండుగుత్తగా ఆ పార్టీకే ఓట్లు వేయాల‌న్నది ముద్ర‌గ‌డ ఉద్దేశంగా చెబుతున్నారు. ఆ మేర‌కు కాపు సామాజిక వ‌ర్గ ప్ర‌జానీకాన్ని త‌న‌వైపుకు తిప్పుకోవ‌డంలో ముద్ర‌గడ ఇన్నాళ్లు స‌క్సెస్ అయ్యారు. కానీ, ప‌వ‌న్ రాజ‌కీయాల్లోకి రావ‌డంతో ముద్ర‌గ‌డ ప్రాబ‌ల్యం త‌గ్గుతూ వ‌చ్చింది. ప్ర‌స్తుతం మెజారిటీ కాపు సామాజిక వ‌ర్గం  ప‌వ‌న్ వైపే ఉన్నారు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ల్యాణ్‌  తెలుగుదేశం, బీజేపీ కూట‌మితో క‌ల‌సి ఎన్నిక‌ల‌కు వెళ్తున్నారు. అయితే  ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం జ‌న‌సేనలో చేర‌కుండానే  ఇంత కాలం  ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు  నిబంధనలుపెడుతూ వ‌చ్చారు. తెలుగుదేశంతో పొత్తులో భాగంగా ప‌వ‌న్ త‌క్కువ సీట్లు తీసుకున్నారంటూ జ‌న‌సైనికుల‌ను రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేశారు. క‌నీసం 50 నుంచి 70 సీట్లు అడ‌గాలంటూ ప‌వ‌న్ కు సూచ‌న‌లు చేశారు. జ‌న‌సేన తన క‌నుస‌న్న‌ల్లోనే న‌డ‌వాలన్న‌ట్లుగా ముద్ర‌గ‌డ లేఖ‌ల‌తో తెగ‌హ‌డావుడి చేశారు. కాపు సామాజిక వ‌ర్గానికి  చెందిన సీనియ‌ర్ నేత కావ‌డంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం ఆయ‌న్ను గౌర‌విస్తూనే వ‌చ్చారు. గ‌త నెల‌లో ముద్ర‌గ‌డ జ‌నసేన పార్టీలో చేరతార‌ని ప్ర‌చారం జ‌రిగింది. జ‌న‌సేన‌కు సంబంధించిన నేత‌లు సైతం ముద్ర‌గ‌డ‌తో భేటీ అయ్యారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ సైతం ముద్ర‌గ‌డ సీనియ‌ర్ నేత కావ‌డంతో ఆయ‌న నివాసానికి వెళ్లి క‌లిసి పార్టీలోకి ఆహ్వానించాల‌ని భావించారు.  అయితే ముందు షెడ్యూల్ చేసిన ప్రోగ్రాంల కార‌ణంగా ప‌వ‌న్ ముద్ర‌గ‌డ నివాసానికి వెళ్ల‌లేపోయారు. ప‌వ‌న్ త‌న‌కు ఇంటికి వ‌చ్చి పార్టీలోకి ఆహ్వానించ‌లేద‌ని భావించిన ముద్ర‌గ‌డ‌.. వైసీపీలోకి చేరేందుకు నిర్ణ‌యించుకున్నారు.  మ‌రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికూడా ముద్ర‌గ‌డ ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించ‌లేదు. కాపుల అభ్యున్న‌తికి ఎలాంటి హామీలూ   ఇవ్వ‌లేదు. కానీ ముద్ర‌గ‌డ కేవ‌లం వైసీపీ విజయం కోసం మాత్ర‌మే ప‌నిచేస్తానంటూ వైసీపీలోకి వెళ్తున్నారు. సొంత సామాజిక వ‌ర్గానికి చెందిన, ఓ పార్టీకి అధినేత అయిన‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం ముద్ర‌గ‌డ‌ను ఇంటి కొచ్చి క‌ల‌వాలి.. జ‌గ‌న్ అయితే.. ముద్ర‌గ‌డే తాడేప‌ల్లి ప్యాలెస్ కు వెళ్లి సాష్టాంగ న‌మ‌స్కారం చేయాలి. దీంతో ప‌వ‌న్ అయితే ఓ న్యాయం.. జ‌గ‌న్ అయితే ఓ న్యాయ‌మా ముద్ర‌గ‌డా అంటూ కాపు సామాజిక వ‌ర్గం   ప్ర‌శ్నిస్తున్నది. కాపునేత‌ల‌పై మీ  క‌ప‌ట ప్రేమ తేట‌తెల్లం అయింద‌ని కాపు సామాజిక వ‌ర్గం ఇప్పుడు ముద్రగడపై మండిపడుతోంది.

ప‌థ‌కాల జోరు.. రేవంత్ సర్కార్ కు కలిసొస్తున్న తీరు!

తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో ఏ మాత్రం జాస్యం చేయడం లేదు. ఎన్నికల సమయంలో వాగ్దానం ఇచ్చిన విధంగా అధికారంలోకి వచ్చిన మూడు నెల‌ల కాలంలోనే ఒక్కొక్క హామీని నెర‌వేరుస్తూ ప్రజల నమ్మకాన్ని, మన్ననలను పొందుతోంది. ముఖ్య‌మంత్రి హోదాలో రేవంత్ రెడ్డి  ఆరు గ్యారెంటీల అమ‌లుపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. అధికారంలోకి వ‌చ్చిన కొద్ది రోజుల్లోనే మ‌హాల‌క్ష్మీ ప‌థ‌కంలో భాగంగా ఆర్టీసీ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణంతోపాటు.. రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా   ప‌రిమితిని రూ.10ల‌క్ష‌ల‌కు పెంచారు. మ‌రోవైపు రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లో జ‌మ‌చేయ‌డంతోపాటు.. ఇటీవ‌ల మ‌హాల‌క్ష్మీ ప‌థ‌కం కింద రూ.500కే గ్యాస్ సిలిండ‌ర్ అందించే ప‌థ‌కానికి రేవంత్ స‌ర్కార్ శ్రీ‌కారం చుట్టింది. అలాగే  గృహ‌జ్యోతి ప‌థ‌కంలో భాగంగా 200 యూనిట్ల వ‌ర‌కూ ఉచిత విద్యుత్ స్కీంను  ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోంది. మ‌రోవైపు ఈనెల 11న ఇందిర‌మ్మ ఇళ్ల ప‌థ‌కం ప్రారంభించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణ‌యం తీసుకున్నారు. అందుకు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. దీనికి తోడు వ‌డ్డీలేని రుణాల‌నుసైతం ఇచ్చేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది.. ఈనెల 12 నుంచి వ‌డ్డీలేని రుణాల‌ను అందించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. అలాగే  పార్ల‌మెంట్ ఎన్నిక‌లకు నోటిఫికేష‌న్ వ‌చ్చేకంటే ముందే.. మ‌హిళ‌ల‌కు నెల‌కు రూ.2500 న‌గ‌దు పంపిణీ కార్య‌క్ర‌మ‌న్ని కూడా ప్రారంభించేందుకు రేవంత్ స‌ర్కార్ రెడీ అవుతోంది.  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీల్లో ప‌లు ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తామ‌ని ఎన్నిక‌ల ప్ర‌చార‌ స‌మ‌యంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డం, సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టిన మూడు నెల‌ల కాలంలోనే దాదాపు స‌గానికిపైగా ప‌థ‌కాలు అమ‌ల్లోకి వ‌చ్చాయి. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల స‌మ‌యం నాటికి మ‌రికొన్ని ప‌థ‌కాల‌ను అమ‌లు చేసేందుకు రేవంత్ రెడ్డి సిద్ధ‌మ‌య్యారు. మ‌రోవైపు  ప్ర‌తిప‌క్ష బీఆర్ ఎస్ పార్టీ నేత‌లు మాత్రం తొలి నుంచి కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఆరు గ్యారెంటీల అమ‌ల్లో పూర్తి గా విఫ‌మ‌వుతుంద‌ని విమ‌ర్శిస్తూ వ‌చ్చారు. కానీ  రేవంత్ మాత్రం ప‌ట్టుద‌ల‌తో ఒక్కో ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తూ వ‌స్తున్నారు. దీంతో రాష్ట్రంలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి కాంగ్రెస్ స‌ర్కార్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన మూడు నెల‌ల కాలంలోనే పార్టీకి ఆద‌ర‌ణ భారీగా పెరిగింద‌ని ప‌లు స‌ర్వేలు చాటుతున్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డంతో.. అటు అసెంబ్లీలోనూ, ప్ర‌భుత్వ పాల‌న‌లోనూ త‌న‌దైన మార్క్ ను చూపుతున్నార‌ని ప్ర‌జ‌ల   ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. దీంతో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ హ‌వా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని  సర్వేలు చాటుతున్నాయి.  ఈ నెలలో ఎన్నిక‌ల‌  నోటిఫికేష‌న్ విడుద‌ల చేసేందుకు ఈసీ స‌న్న‌ద్ద‌మ‌వుతోంది. ఇప్ప‌టికే తెలంగాణ‌లోని అధికార కాంగ్రెస్ తో పాటు.. ప్ర‌తిప‌క్ష పార్టీలైన బీఆర్ ఎస్‌, బీజేపీ అధిష్టానాలు ఎన్నిక‌ల్లో స‌త్తాచాటేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకున్నాయి. మూడు పార్టీలూ అభ్య‌ర్థుల తొలి జాబితాను విడుద‌ల చేశాయి. తెలంగాణ‌లో మొత్తం 17 పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. వీటిల్లో 12 నుంచి 14 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ  జెండాను ఎగుర‌వేయాలన్న వ్యూహంతో  రేవంత్ రెడ్డి ప్రణాళికలు రచిస్తున్నారు.  ఆ మేరకు ఇప్ప‌టికే ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో భారీ బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హిస్తూ విప‌క్ష పార్టీల‌పై త‌న‌దైన శైలిలో రేవంత్ విరుచుకు ప‌డుతున్నారు. రేవంత్ వ్యూహం ఫలిస్తోందనడానికి  తాజాగా వెల్ల‌డ‌వుతున్న స‌ర్వే ఫ‌లితాలే నిదర్శనమని కాంగ్రెస్ నేత‌లు పేర్కొంటున్నారు.  కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఆర్నెళ్ల‌కంటే ఎక్కువ‌కాలం ఉండ‌ద‌ని, కూలిపోతుంద‌ని బీఆర్ ఎస్ నేత‌లు ప‌దేప‌దే  అంటున్నారు. ముఖ్యంగా కేటీఆర్, హ‌రీష్ రావు లాంటి నేత‌లు సైతం కాంగ్రెస్ పార్టీ కుప్ప‌కూలిపోతుంద‌ని అనడం పట్ల  ప్ర‌జ‌ల్లో   వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతుంద‌ని పరిశీలకులు విశ్లేషి స్తున్నారు. ప్ర‌జ‌లెన్నుకున్న ప్రభుత్వాన్నిఎలా కూల్చేస్తారంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నా రంటున్నారు. దీనికి తోడు బీఆర్ ఎస్ పార్టీ నుంచి  భారీ ఎత్తున కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతుండటంతో కేసీఆర్ తన పార్టీని కాపాడుకోవడంపై ముందు దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.   

సిద్ధం స‌భ అట్ట‌ర్ ప్లాప్‌!.. గెలుపు ఆశలు ఉఫ్!

బాప‌ట్ల జిల్లా మేద‌ర‌మెట్ల‌లో వైసీపీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన సిద్ధం బ‌హిరంగ స‌భ అట్ట‌ర్ ప్లాప్ అయింది. స‌భ‌కు జ‌నాన్ని త‌ర‌లించేందుకు వైసీపీ నేత‌లు నానా తంటాలు ప‌డ్డారు. బ‌స్సులు ఏర్పాటు చేసి తాగడానికి మందు బాటిల్స్, తినడానికి బిర్యానీ పొట్లాలు ఇస్తామ‌న్నా స‌భ‌కు వ‌చ్చేందుకు ప్ర‌జ‌లు స‌సేమిరా అన్నారు.  దీంతో అర‌కొర‌గా వ‌చ్చిన ప్ర‌జ‌ల‌తో సిద్ధం స‌భా ప్రాంగ‌ణం ఖాళీగా క‌నిపించింది. కొన్ని ప్రాంతాల నుంచి అయితే.. కేవ‌లం నలుగుతోనే బ‌స్సులు స‌భ‌కు వెళ్ల‌డంచూస్తే సిద్ధం స‌భ ఏ స్థాయిలో ఫెయిలైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  స‌భ‌కు ముందు వ‌ర‌కు భారీ సంఖ్య‌లో ప్ర‌జ‌లు స‌భ‌కు వ‌స్తార‌ని వైసీపీ నేత‌లు భావించారు. విజ‌య‌సాయి రెడ్డిలాంటి నేత‌లైతే సిద్ధం స‌భ‌కు 15ల‌క్ష‌ల మంది హాజ‌రువుతారు.  ప్ర‌జ‌లంతా స్వ‌చ్ఛందంగా స‌భ‌కు వ‌స్తున్నారంటూ ప్ర‌గ‌ల్భాలు ప‌లికారు. కానీ, చివ‌రికి గ‌ట్టిగా లెక్కిస్తే.. లక్షన్నర రెండులక్షల మంది కూడా స‌భ‌కు హాజరు కాని  ప‌రిస్థితి. భారీ సంఖ్య‌లో ప్ర‌జ‌లు స‌భ‌కు హాజ‌ర‌వుతారు. త‌న ప్రసంగంతో వారిలో జోష్ నింపుదామ‌ని సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఉత్సాహంగా స‌భ‌కు హాజ‌ర‌య్యారు.. కానీ, స‌భ‌లో జ‌నాన్నిచూసి జ‌గ‌న్‌లో సైతం నీర‌సం వ‌చ్చేసిన‌ట్లుంది. ఈ సభకు హాజరైన జనాలే రానున్న ఎన్నికలలో పార్టీ ఫేట్ ఏమిటన్నది తేల్చేసినట్లైంది. అంత‌కుముందే రాసిన స్క్రిప్ట్  తెచ్చుకొని చ‌దువుతూ.. నిమిషానికోసారి చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేస్తూ.. మ‌ధ్య‌మ‌ధ్య‌లో ప‌వ‌న్‌, బీజేపీపై విమ‌ర్శ‌లు చేస్తూ  జగన్ మరో సారి ఆవుకథ లాంటి ప్రసంగాన్ని మమ అనిపించేశారు.  స‌భ‌కు ఆశించిన స్థాయిలో జ‌నం రాక‌పోవ‌టంతో స్థానిక నేత‌ల‌పై జ‌గ‌న్ సీరియ‌స్ అయిన‌ట్లు తెలిసింది. స‌భ‌కు జ‌నాన్ని ఎందుకు త‌ర‌లించ‌లేకపోయారు అంటూ నేత‌ల‌పై జగన్ మండిపడ్డారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. రాష్ట్రంలో వైసీపీ ఆధ్వ‌ర్యంలో గ‌తంలో మూడు ప్రాంతాల్లో సిద్ధం స‌భ‌లు జ‌రిగాయి.. నాలుగో సిద్ధం స‌భ‌ను బాప‌ట్ల జిల్లాలో నిర్వ‌హించారు. ఇదే చివ‌రి సిద్ధం స‌భ కావ‌డంతో ఈ స‌భా వేదిక నుంచి ఎన్నికల మ్యానిఫెస్టోను ప్ర‌క‌టించాల‌ని తొలుత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి భావించారు. స‌భ‌కు త‌క్కువ సంఖ్య‌లో ప్ర‌జ‌లు హాజ‌రు కావ‌డంతో మ్యానిఫెస్టోను ప‌క్క‌న పెట్టేసిన‌ట్లు వైసీపీ వ‌ర్గాల స‌మాచారం. తెలుగుదేశం, జ‌న‌సేన‌ కేటమితో బీజేపీ కలవడం ఖాయమైన  త‌రువాత, పొత్తులో భాగంగా మూడు పార్టీల మధ్యా సీట్ల సర్దుబాటు కూడా ఎలాంటి ఇబ్బందులూ, పొరపొచ్చాలే లేకుండా పూర్తయిన తరువాత  జ‌రుగుతున్న సిద్ధం స‌భ కావ‌డంతో.. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏం మాట్లాడ‌తారన్న ఉత్సుకత ఏపీ ప్రజల్లో కనిపించింది.  కానీ, జ‌గ‌న్ మాత్రం.. ఎప్ప‌టిలానే చంద్ర‌బాబు, ప‌వ‌న్ పై విమ‌ర్శ‌లు చేయడానికే తన ప్రసంగాన్ని పరిమితం చేశారు. బీజేపీని, ఆ పార్టీ నేత‌ల‌కు విమ‌ర్శించేందుకు జ‌గ‌న్ ధైర్యం చేయ‌లేక పోయారు. కే వ‌లం బీజేపీకి గ‌త ఎన్నిక‌ల్లో డిపాజిట్లుకూడా రాలేదు  రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా మోసం చేసిందంటూ జ‌గ‌న్ మాటవరసకు చెప్పారు.  అంతే  మిగిలిన ప్రసంగం అంతా గతంలో ఆయన ప్రసంగాలకు సేమ్ టూ సేమ్. ప్ర‌తీస‌భ‌లో చెప్పిన‌ట్లుగానే.. వ‌చ్చే ఎన్నిక‌లు ధ‌ర్మానికి.. అధర్మానికి మ‌ధ్య జ‌రుగుతున్నాయన్నారు. తాను ఒంటరినీ, మిగిలిన వారంతా  ఒకటయ్యారంటూ  అంటూ ప్రజల్లో సానుభూతిని పొందే ప్రయత్నం చేశారు జగన్. మొత్తానికి జ‌గ‌న్ త‌న‌ ప్ర‌సంగంలో ప్రారంభం నుంచి చివ‌రి దాకా.. చంద్ర‌బాబు జపమే చేశారు. ఎప్పుడూ చెప్పే మాటలే, చేసే విమర్శలే చేసిన జ‌గ‌న్‌.. తాను మళ్లీ గెలిస్తే ఏం చేస్తాననే మాట తన నోటి వెంట రానీయలేదు. సిద్ధం స‌భ‌లో డ్రోన్ కొద్ది సేపు క‌ల‌క‌లం సృష్టించింది. స‌భ‌కు ప్ర‌జ‌లు రాకుంటే గ్రాఫిక్స్ మాయాజాలంతో భారీ సంఖ్య‌లో ప్ర‌జ‌లు స‌భ‌కు హాజ‌ర‌య్యార‌ని చూపించ‌డానికి ముందుగానే వైసీపీ అధిష్టానం ప్లాన్ చేసింది. మైదానం మొత్తం గ్రీన్ మ్యాట్ లు వేసింది. దీని ద్వారా గ్రాఫిక్స్ తో మైదానం మొత్తం ప్ర‌జ‌ల‌తో నిండిపోయిన‌ట్లు చూపించేందుకు ప్ర‌య‌త్నించింది. అయితే, స‌భ జ‌రుగుతున్న స‌మ‌యంలో గుర్తుతెలియ‌ని డ్రోన్ ఒక‌టి స‌భా ప్ర‌దేశంలో ఎగురుతూ క‌నిపించింది. దీంతో వైసీపీ నేత‌ల్లో ఒక్క‌సారిగా కంగారు మొద‌లైంది. ఎక్క‌డ త‌మ‌ బండారం బ‌య‌ట‌ప‌డుతుందోన‌ని వైసీపీ నేత‌లు ఆందోళ‌న చెందారు.  ఎట్ట‌కేల‌కు ఆ డ్రోన్ ను తొల‌గించారు. అయితే, డ్రోన్ తీసిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఈ డ్రోన్   దృశ్యాల్లో స‌భాప్రాంగ‌ణం  స‌గానికి కూడా  నిండ‌లేద‌ని  విస్పష్టంగా చూపాయి. మొత్తానికి గ‌త మూడు సిద్ధం సభలకూ ఎదో విధంగా జనాన్ని తరలించగలిగినా, నాలుగో, చివరి సిద్ధం సభకు మాత్రం ఎన్ని ప్రలోభాలు పెట్టినా జనం రాలేదు.  దీంతో జగన్ లో ఓటమి భయం స్పష్టంగా కనిపించింది. వైసీపీ నేత‌లు డీలా పడిపోయారు.  అధికారంలో ఉండి కూడా  స‌భ‌కు జ‌నాన్ని ఎందుకు త‌ర‌లించ‌లేకయిన పరిస్థితి జనంలో జగన్ పట్ల, ఆయన పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకతకు అద్దం పట్టిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఐదేళ్ల పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తమవుతోంది. వైసీపీ అభ్య‌ర్థులు ఇంటింటికి వెళ్లి ఓట్లు అడిగే సాహ‌సంకూడా చేయ‌లేక పోతున్నారు. ఈ క్ర‌మంలో టీడీపీ- జ‌న‌సేన కూట‌మిగా ఏర్ప‌డ‌టంతో వైసీపీ ఓడిపోతుంద‌న్న భావ‌నకు మెజార్టీ ప్ర‌జ‌లు వ‌చ్చేశారు. తాజాగా టీడీపీ - జ‌న‌సేన కూట‌మిలో బీజేపీకూడా క‌లిసిపోవ‌టంతో జ‌గ‌న్ తో పాటు, వైసీపీ నేత‌ల్లో భ‌యం ప‌ట్టుకుంద‌ట‌. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో మోదీ, అమిత్ షాల‌పై విమ‌ర్శ‌లు చేయ‌కుంటే వైసీపీకి ఉన్న ఓటు బ్యాంకును కూడా పోగొట్టుకోవాల్సి వ‌స్తుంద‌ని, అలాఅని మోదీ, అమిత్‌షాపై విమ‌ర్శ‌లు చేస్తే.. కేంద్రంలో ఎలాగూ బీజేపీ మ‌రోసారి అధికారం చేప‌ట్టే అవ‌కాశాలు ఉన్నాయి.. ఏపీలో కూట‌మి అధికారంలోకి రావ‌డం దాదాపు ఖాయ‌మైంది.. దీంతో అధికారం కోల్పోయిన త‌రువాత ఎక్క‌డ జైళ్లో వేస్తారోనన్న భ‌యం జ‌గ‌న్ ను వెంటాడుతుంద‌ట‌. మొత్తానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఖాయం కావడంతో జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ నేతలను ఓటమి భయం వెంటాడుతోందని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

టీడీపీ కూట‌మిలో పెత్త‌న‌మంతా మోదీదే

బీజేపీతో టీడీపీ-జ‌న‌సేన పొత్తులు ఖ‌రారైన నేప‌థ్యంలో ఇక ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల‌పై దృష్టి పెట్టారు. ప్ర‌ధానంగా న‌రేంద్ర మోడీని ఏపీకి తీసుకురావ‌డం ద్వారా.. ప్ర‌జ‌ల‌ను పొత్తుల పార్టీవైపు న‌డిపించేందుకు అవ‌కాశం ఉంటుంద‌నే అంచ‌నాలు వేసుకున్నారు. ఈ క్ర‌మంలో మూడు పార్టీల ఉమ్మడి కార్యాచరణలో భాగంగా ఈ నెల 17న లేదా 18న భారీ బహిరంగ సభను టీడీపీ-జనసేన నిర్వహించబోతోంది. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోడీనే ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నున్నారు. వైసీపీని ఓడించేందుకు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు కూటమిగా ఏర్ప‌డ‌డ‌మే కాదు గెలిపించే బాధ్య‌త కూడా మోడీ పైనే పెట్టింది టీడీపీ కూట‌మి. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ  ఉమ్మడిగా ప్రజల ముందుకు వెళ్తుండడంతో రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ప్రస్తావించాల్సి ఉంది. ఆ బాధ్యతను ప్రధాని మోదీకే అప్పగించారు. రాష్ట్రానికి సంబంధించి ఒకటి రెండు కీలక ప్రకటనల్ని మోదీతో  చేయించడం ద్వారా కూటమిపై విశ్వాసం కలుగుతుందనేది ఆ పార్టీల ప్లాన్. ఈ నెల 17న చిలకలూరిపేటలో టీడీపీ, జనసేన ఉమ్మడిగా బహిరంగసభకు ప్లాన్ వేశాయి. అయితే ఇప్పుడు మోదీ కూడా వస్తుండడంతో సభను చిలకలూరిపేటలో నిర్వహిస్తారా.. లేకుంటే మరో ప్రాంతాన్ని ఎంచుకుంటారా అనేది తేలాల్సి ఉంది. మొత్తానికి ఆ సభలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను మోదీ వెల్లడిస్తారని సమాచారం. బీజేపీ పొత్తుకు ఓకే చెప్పింది. దీంతో టీడీపీ, జనసేన ఫుల్ హ్యాపీ. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో కేంద్రంలో ఉన్న బీజేపీ అంత గొప్పగా చేయలేదనే విమర్శలు ఉన్నాయి. అమరావతి రాజధానికి మోదీ శంకుస్థాపన చేశారు. కానీ జగన్ దాన్ని కాదని మూడు రాజధానులను తెరపైకి తెచ్చారు. అయినా మోదీ ప్రభుత్వం అడ్డుకోలేకపోయింది. మరోవైపు విభజనచట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వాటిలో ఇంతవరకూ వాటాలు తేల్చలేదు. పోలవరం పూర్తి కాలేదు. రైల్వే జోన్ సాకారం కాలేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మెడపైన వేలాడుతోంది. ఇలా అనేక అంశాలపై బీజేపీ స్పందించాల్సిన అవసరం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలిసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి. సీట్ల సర్దుబాటు కూడా పూర్తయింది. 145 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుండగా జనసేన, బీజేపీ కలిసి 30 అసెంబ్లీ, 8 లోక్ సభ స్థానాల్లో బరిలోకి దిగుతున్నారు.  ప్ర‌ధాని ఏపీకి వ‌స్తే.. ఎలాంటి హామీలు ఇస్తారు? అనేది ఆస‌క్తిగా మారింది. రాష్ట్రానికి మేలు జరిగేలా కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని టీడీపీ నేత‌లు అంచ‌నా వేస్తున్నారు. ఆ ప్రకటనలు ఓటర్లను కట్టిపడేసేలా.. మరో కూటమికే ఓట్లు పడేలా ఉంటాయని కూట‌మి చెబుతోంది. ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ గురించి.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ఏమేం మాట్లాడుతారో అనేదానిపై కూడా పార్టీల‌కు, రాజ‌కీయాల‌కు అతీతంగా సర్వత్రా చ‌ర్చ సాగుతోంది.

తులం బంగారం కొంటే 12 వేలు న‌ష్ట‌పోవాల్సిందేనా

డ‌బ్బులు ఊరికే రావు అంటూ ఊద‌ర‌గొట్టే ప్ర‌క‌ట‌న‌ల వెనుక ఇంత మోసం ఉందా?మీరు కొన్న బంగారు ఆభరణంలో అస‌లు బంగారం ఎంత వుంది? ఆభ‌ర‌ణాలు కొనే సమయంలో మనం ఎలా నష్టపోతున్నాం? రాగిని బంగారం ధరకు బ‌హిరంగంగానే అమ్మి క‌స్ట‌మ‌ర్ జేపుకు చిల్లి పెడుతున్నారు.  షాపు వాళ్లకు ఏ విధంగా లాభాలొస్తాయి?  క‌స్ట‌మ‌ర్‌ ఎలా మోసపోతున్నాడు?  బంగారం కొనుగోలు లో మోసాల‌పై తెలుగుఒన్ గ్రౌండ్ రిపోర్ట్‌.. బంగారం షోరూం పెట్టుకుంటే త‌క్కువ స‌మ‌యంలో కోట్లు సంపాదించుకోవ‌చ్చ‌ట‌. ఎందుకంటే బంగారం అమ్మ‌కాల్లో భారీ ఎత్తున మోసాల‌కు పాల్ప‌డుతుంటారు. అది కూడా బ‌హిరంగంగానే... బంగారం షాపులో క‌స్ట‌మ‌ర్‌ ఎలా మోసపోతున్నాడో మీకు వివ‌రిస్తాను. మోసం జరిగే అవకాశం డిజైన్లు, స్టోన్ వర్క్ ఎక్కువగా ఉండే ఆభరణాల విషయంలోనే ఉంటుంది. ఆభరణంలో అద్దిన రాళ్ల (స్టోన్స్) బరువును సైతం బంగారంగా చూపిస్తారు.  ఎన్ని ఎక్కువ స్టోన్స్ ఉంటే అంత మోసానికి అవకాశం ఉంటుంది.  స్టోన్స్‌తో కూడిన ఒక ఆభరణం బరువు 20 గ్రాములుంటే అందులో ఐదు గ్రాములు స్టోన్స్ ఉంటే, రాళ్ల బరువును కూడా బంగారం ధరకే లెక్క వేసే అవకాశం ఉంటుంది. ఆ రాళ్లను బంగారంలా లెక్కించి,  తరుగు ధర,  మేకింగ్ ఛార్జెజ్ ఉండవని తక్కువ తరుగు, తయారీ ధరలంటూ తగ్గించి... మార్కెటింగ్ చేసుకుంటారు.  బంగారు ఆభరణాల్లో పొదిగే రాళ్లు ఖరీదు రూ.10 నుంచి గరిష్ఠంగా రూ.2000 వరకు ఉంటాయి. అయినా కూడా బంగారంలో వాటిని కలిపి చూపిస్తే కస్టమర్ చాలా నష్టపోతారు. అదే తరుగు, తయారీ ఛార్జీలు లేవనే ఆఫర్లు గట్టి గాజులు, గట్టి ఉంగారాలు, డిజైన్ వర్క్ లేని బంగారు ఆభరణాల విషయంలో ఇవ్వరు. ఇవ్వలేరు. ఈ రోజు 10 గ్రాముల ల 24 క్యారెట్ బంగారం ధర (99.9%) : ₹ 64,010 అనుకుందాం.  వాస్తవంగా నగలు చేయడానికి 24 క్యారట్ల బంగారం ఏ మాత్రం పనికిరాదు.  బంగారు నగలు చేయడానికి 22 క్యారట్ల బంగారాన్ని మాత్రమే వాడతారు.  10 గ్రాముల బంగారం మనం కొంటే  అందులో 1 గ్రాము రాగి +9 గ్రాముల బంగారం ఉంటుందనే సంగతి చాలా మందికి తెలుసు.  22 కారట్ 10 గ్రాముల బంగారు ధర :₹ 58633 మాత్రమే ఉంది. 24 కారట్ మరియు 22 కారట్ గోల్డ్ మధ్య వత్యాసం :₹ 5,377.00 వరకు ఉంది కదా…?  పది గ్రాముల బంగారు నగ మనం కొంటే  తరుగు కింద 10 నుంచి 15 శాతం వరకు కట్ చేస్తారు. ఆంటిక్ నగలకైతే 22–24% వరకు కూడా ఉంటుంది.  ఈ సొమ్ము మొత్తం మన జేబులో నుంచే.  నిజానికి ఎంత మంచి బంగారు నగ తయారు చేసినా సరే 5 శాతం మించి పోయే అవకాశం ఉండదు.  ఆ లెక్కన 10 గ్రాముల బంగారు నగ ధర: 58,633 + 10%,… టోటల్ 58,633 + 5,863 = 64,496/- (ఇది 22 కార‌ట్ 10 గ్రాముల బంగారు న‌గ ధ‌ర‌). 22 కారట్ 10 గ్రాముల బంగారు నగ వెలకి,  24 కారట్ రాగి కలపని స్వచ్ఛమైన బంగారానికి తేడా పెద్ద‌గా ఏం ఉండదు.  పది గ్రాముల బంగారు నగ మనం కొంటే వచ్చేది కేవలం 8.8 గ్రాముల బంగారమే.  ఈ విషయం చాలా మందికి తెలియదు.  అంటే ₹ 64,496/- పెట్టి కొన్న నగ నిజమైన విలువ ₹ 58,633/- మాత్రమే అనే విషయం చాలా మందికి తెలియదు.  మనకు అమ్మిన వాడి ₹ 5,863 లాభం ఉంటుంది.  ఇవన్నీ కాకుండా మేకింగ్ కాస్త అని చెప్పి  గ్రాము బంగారానికి ₹ 150 నుంచి ₹ 200 వరకు మన జేబులో నుంచే వెళ్తుంది.  పది గ్రాముల బంగారం కొంటే ₹ 1500 – ₹ 2000 రూపాయలు అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది.  బంగారం కొనుగోలు లో మోసపోతున్న  వినియోగదారులు. రాగిని బంగారం ధరకు కొని ఎంత  నష్టపోతున్నారో తెలుసా...? బంగారు గొలుసు తయారుచేయడానికి రాగిని జోడించడం ద్వారా మాత్రమే ఆభరణాలు తయారు చేయబడతాయి ఈ విషయం వినియోగదారుల ముఖ్యంగా తెలుసుకోవాలి....!   ఉదాహరణకు 10 గ్రాముల బంగారు గొలుసు తయారు చేయడానికి  1 గ్రాము రాగి మరియు 9 గ్రాముల బంగారాన్ని జోడించి బంగారు  ఆభరణాలను తయారు చేస్తారు.  కానీ ఒక సాధారణ మనిషి బంగారం కొనేటప్పుడు,  9 గ్రా. బంగారం + 1 గ్రాము రాగి కలిపి బిల్లులో 10 గ్రాముల బంగారంగా అమ్ముతారు.  దానికి తోడు,  వారు రాగిని బంగారం ధరకు అమ్ముతున్నారు,  1 గ్రాము బంగారం వృధాగా తరుగుగా చూపిస్తున్నారు. దీనిలో 9గ్రా బంగారం + 1గ్రా. రాగి (బంగారంగా) + నష్టం (తరుగు) 1 = 11 గ్రాములు.  కాబట్టి 10 గ్రాముల ఆభరణాల కొనుగోలుదారులు  9 గ్రాముల బంగారాన్ని మాత్రమే కాకుండా  2 గ్రాముల రాగిని కూడా బంగారంగా జోడించి బంగారం ధరను వసూలు చేస్తారు .. కాబట్టి మనం 10గ్రా గ్రాముల ఆభరణాలకు 11 గ్రాముల బంగారం ధరను చెల్లిస్తాము.  వారు ఎవరిని మోసం చేస్తున్నారు!  వారు పేదలను మోసం చేస్తున్నారు.  మరియు పరాన్నజీవులై పేదల రక్తాన్ని పీలుస్తున్నారు.  ఒక కొత్త ఆభరణాల దుకాణాన్ని తెరిచి, కొన్నేళ్ల వ్యవధిలో బహుళ భవనాలు, అంతస్తులు నిర్మించి, కొనుగోలు చేస్తే డబ్బు వారికి ఎలా వచ్చింది? పై లెక్కలు అంత గొప్పగా మారడానికి సరైనవని అంగీకరిస్తున్నారు.  ఇది నిజం కాదా ఈ రోజు ఒక గ్రాము బంగారం ధర ఎంత?  24 క్కారెట్ గోల్డ్ ని అభారణాలుగా మార్చడానికి 2 గ్రాముల బంగారం వసూలు చేస్తున్నప్పుడు ఒక గ్రాము రాగి ధర ఎంత?  ఉదాహరణ కు ఈ క్రింది ఖాతాను తనిఖీ చేయండి ...!  1 గ్రాము బంగారం విలువ  రూ. 6,401 / -  10 గ్రాముల బంగారం విలువ రూ. 64,010 / -  1 గ్రాముల రాగి - రూ. 10/-  9 గ్రాముల  బంగారం ధర  రూ. 57,609/-  9 గ్రాముల బంగారం +  1 గ్రాము రాగి -  రూ.  57,609/- + 10= 57,619/- 10గ్రా. బంగారంలో -  రూ.64,010 - రూ 57,619/- లాభం = రూ. 6,391/-  వ్యర్థం 1గ్రా= రూ.6,401/ -  10గ్రా ఆభరణానికి రూ.12,792/-కు స్థూల లాభం  ప్రజలు ఈ అవగాహన వుంటే బంగారం ధర ఖచ్చితంగా తగ్గుతుంది ...   సూచన: కేవలం ఇది 10% తరుగు ఆధారంగా లెక్కించబడినది. 15%నుండి 20% తరుగు తీసుకునే షాపులు కూడా ఉన్నాయి.(వాస్తవంగా ఎంత మంచి డిజైన్ ఉన్న ఆభరణం ఐనా 5%వరకు మాత్రమే తరుగు పోతుంది). 22 కేడీఎం హాల్‌మార్క్ ఉంగరం పది గ్రాములు,  అంటే 22కే పది గ్రాముల బంగారం ఖరీదు రూ. 58,633 వేలు అనుకుందాం.  ఈ ఉంగ‌రం తయారు చేయడానికి  2 వేల 300 రూపాయ‌ల‌ విలువైన బంగారం ఖర్చవుతుంది. అంటే తయారీదారు 400 మిల్లీ గ్రాముల బంగారాన్ని తీసుకుంటారు. వస్తువు తయారీలో హ్యాండ్ అండ్ మిషన్ వర్క్ చేసేటప్పుడు  దాదాపు 200 మిల్లీ గ్రాములు పోతుంది.  మిగిలిన 200 మిల్లీ గ్రాములు మజూరీ లేదా తయారీకి తీసుకుంటారు. తయారీదారు వస్తువుగా చేసి కస్టమరు ఇచ్చే  ఆభరణంలో 9.6 గ్రాముల బంగారం మాత్రమే ఉంటుంది.  దీని విలువ రూ. 56,333/-. కానీ ఆ ఆభరణం బరువు మాత్రం 10.44 గ్రాములుంటుంది. అంటే 10 గ్రాముల బంగారం ఇస్తే 10.44 గ్రాముల బరువైన ఆభరణం వస్తుంది.  అందులో 96 శాతం బంగారం ఉంటే, 8.4 శాతం ఇతర లోహాలుంటాయి.  

మిస్టీరియస్ గా మారిన గోయెల్ రాజీనామా

2024 లోక్​సభ ఎన్నికలకు ముందు, తాజా పరిణామాలతో.. ముగ్గురు ఎన్నికల కమిషనర్లలో ఇద్దరిని మోదీ నియమించనున్నారు. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం. అరుణ్​ గోయల్​ అసలు ఎందుకు రాజీనామా చేశారు? అన్న ప్రశ్నకు ప్రస్తుతం స్పష్టమైన సమాధానం లేదు. కానీ.. పలు విషయాల్లో ఆయనకు ఇతరులతో విభేదాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలియదు.   ఎన్నికల కమిషనర్​గా గోయల్​ నియామకంపైనా అప్పట్లో వివాదం చెలరేగింది. 2022 నవంబర్ 18న ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (ఐఏఎస్) నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. 2022 డిసెంబర్ 31న ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. పదవీ విరమణ సమయంలో గోయల్ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా ఉన్నారు. కాగా.. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన మరుసటి రోజే ఆయనను ఎన్నికల కమిషనర్​గా నియమించింది. కేంద్రం. దీనిపై అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్ ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్​లో.. కేంద్ర నిర్ణయం ఏకపక్షంగా ఉందని, భారత ఎన్నికల సంఘం సంస్థాగత సమగ్రత, స్వతంత్రతను ఉల్లంఘిస్తోందని పేర్కొంది. ఈసీగా నియామకానికి ముందే స్వచ్ఛంద పదవీ విరమణ పొందేందుకు గోయల్​కు విశేషమైన దూరదృష్టి ఉన్నట్లు కనిపిస్తోందని ఏడీఆర్ వ్యంగ్యంగా విమర్శించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం 2023 ఆగస్టులో ఈ పిటిషన్​ని కొట్టివేసింది. ఎన్నికల కమిషనర్​గా అరుణ్​ గోయల్​ రాజీనామాపై ఇప్పుడు దేశంలో రాజకీయ దుమారం చెలరేగింది! బీజేపీపై విపక్షాలు, మరీ ముఖ్యంగా కాంగ్రెస్​ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శల వర్షం కురిపిస్తోంది. వాస్త‌వానికి  ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ లోక్ సభ ఎన్నికల సన్నాహాల్లో ఇటీవల చురుగ్గా పాల్గొన్నారు.. ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు పలు రాష్ట్రాల పర్యటనలు చేపట్టారు. దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. షెడ్యూల్ విడుదలకు ఎంతో సమయం లేదు. గడువు సమీపిస్తోంది. ఈ నెల 13 లేదా 14 తేదీల్లో షెడ్యూల్ విడుదల కావడం ఖాయంగా కనిపిస్తోంది. దీనితో పాటే- దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తోంది. లోక్‌సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒడిశాలో బిజూ జనతాదళ్, అరుణాచల్ ప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ, సిక్కింలో సిక్కిం క్రాంతికారి మోర్చా- బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలో ఉన్న విషయం తెలిసిందే.  2019 తరహాలోనే దేశవ్యాప్తంగా మొత్తం ఏడు దశల్లో పోలింగ్ పూర్తి అయ్యేలా కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు షెడ్యూల్‌ను రూపొందించినట్లు చెబుతున్నారు. ఏప్రిల్ రెండోవారంలో తొలి దశ పోలింగ్ ఉండొచ్చు. మే 18 లేదా 20వ తేదీ నాటికి పోలింగ్ ప్రక్రియ మొత్తం పూర్తి అవుతుంది. అదే నెల చివరి వారం నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది.  ఈ పరిస్థితుల్లో అనూహ్యం సంఘటన చోటు చేసుకుంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ తన  పదవికి రాజీనామా చేశారు. ఈ కీలక సమయంలో అరుణ్ గోయెల్ రాజీనామా చేయడం అత్యంత మిస్టీరియస్‌గా మారింది. గోయల్ 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 2022 నవంబర్ 18న ఆయన వీఆర్ఎస్ తీసుకున్నారు.   పంజాబ్ కేడర్‌కు చెందిన మాజీ IAS అధికారి. అతను నవంబర్ 21, 2022న అధికారికంగా ఎన్నికల కమీషనర్ పాత్రను స్వీకరించాడు. అతని పదవీకాలం 2027లో ముగియనుంది. గోయెల్ గతంలో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వచ్చే ఏడాది పదవీ విరమణ చేయనుండగా, ఆయన స్థానంలో అరుణ్ గోయల్ నియమితులయ్యే అవకాశం ఉన్నప్పటికీ, ఊహించని విధంగా అరుణ్ గోయెల్ రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది. గోయ‌ల్ రాజీనామా పై దేశ‌వ్యాప్తంగా చర్చ జ‌రుగుతోంది.  ఇప్పటికే ఎన్నికల సంఘంలోని ముగ్గురు సభ్యుల ప్యానెల్ లోని మరో కమిషనర్ అనుప్ పాండే.. గత నెలలో పదవీ విరమణ చేయగా ఆ స్థానం ఖాళీగా ఉంది. ఈ క్రమంలో తాజాగా అరుణ్ గోయెల్ కూడా రాజీనామా చేయడంతో ఇక ఆ ప్యానెల్ లో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు. ఈయన పదవీ కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగియనుండటంతో... ఈయన అనంతరం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా అరుణ్ గోయెల్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఈలోగా ఆయన రాజీనామా చేశారు. కాగా... ఈ నెల 14, 15 తేదీల్లో లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావొచ్చని కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో గోయెల్ రాజీనామా చేయడం తీవ్ర ఆశ్చర్యానికి గురి చేస్తుందని తెలుస్తుంది!

కేసీఆర్ కుటుంబాన్ని కుదిపేస్తున్న టానిక్ స్కాం

ఒక్క లైసెన్స్‌తో 11 వైన్ షాపులు, బీఆర్ఎస్ నేతలే ఓనర్స్..! ప్రభుత్వం మ‌నదే. ఏం చేసినా నడుస్తుందనే తీరులో కేసీఆర్ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించింద‌న‌డానికి టానిక్ లిక్కర్ మాల్స్ మ‌రో ఉదాహ‌ర‌ణ‌. గత బీఆర్ఎస్‌ ప్రభుత్వ పెద్దల అండతో.. స్పెషల్ జీవోలు విడుదల చేసి మరీ..ఈ గ్రూప్ రూ.100 కోట్ల ట్యాక్స్‌ ఎగ్గొట్టినట్లు గుర్తించారు. టానిక్ మద్యం దుకాణాల తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టానిక్ స్కాం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని కుదిపేస్తోంది.  స్వయంగా ఎం.పి. సంతోష్ రావు పాత్ర ప్రత్యక్షంగా ఉందని ఎక్సైజ్ అదికారులు స్పష్టమైన ఆధారాలు సేకరించడంతో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కొనసాగిన అవినీతి కుంభకోణాల్లో ఇది కూడా కీలకంగా మారింది. సి.ఎం. రేవంత్‌రెడ్డి పార్లమెంట్ ఎన్నికల వేళ టైమ్ చూసి బీఆర్ఎస్ ను గట్టిగా ఇరుకున పెట్టడానికే ఆఘమేఘాల మీద దర్యాప్తు సంస్థలతో దూకుడు పెంచారు.  ముఖ్యమంత్రే ప్రత్యేకంగా పర్వవేక్షిస్తున్నారు.  ముగ్గురు రాష్ట్ర ఉన్నతాధికారుల కుటుంబ సభ్యులకు వాటాలు ఉన్నట్టు తెలుస్తోంది.  గత ప్రభుత్వంలో సీఎంవో అధికారిగా పనిచేసిన భూపాల్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి,  ఎక్సైజ్ ఉన్నతాధికారి ర‌వీంద‌ర్ రావు కూతురు హారిక‌,  మరో అడిషనల్ ఎస్పీ కూతురు ప్రియాంక రెడ్డి కి టానిక్ గ్రూప్ లో వాటాలు ఉన్నాయి. దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం వివాదం కొనసాగుతూ ఉండగానే.. ఇప్పుడు మరో కొత్త లిక్కర్ స్కాం వెలుగులోకి వచ్చింది.   హైదరాబాద్  జూబ్లీహిల్స్‌లో ఉన్న టానిక్‌ ఎలైట్‌ వైన్‌ షాపులో జీఎస్టీ అధికారులు చేపట్టిన సోదాల్లో విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి.  ఏ మద్యం షాపునకు లేని వెసులుబాటు టానిక్‌కు ఉన్నట్టు సోదాల్లో అధికారులు గుర్తించారు.  కేసీఆర్ ప్రభుత్వ హయాంలో టానిక్‌కు ఏ4 ఎలైట్ కింద లైసెన్స్ జారీ చేశారు.  అయితే.. ఈ లైసెన్స్ కింద.. ఏకంగా 11 మద్యం దుకాణాలు నడిపించారు. ప్రస్తుతం నగరంలో టానిక్‌కు 11 ఫ్రాంచైజ్‌లు ఉండగా..  క్యూ బై టానిక్ పేరుతో మద్యం విక్రయాలు జరుపుతున్నారు.  తెలంగాణలో ఏ వైన్ షాప్‌కు లేని ప్రత్యేక అనుమతులు కేవలం టానిక్‌‌కు మద్యం దుకాణానికి మాత్రమే ఉండటం గమనార్హం.  ఈ మేరకు ప్రత్యేక జీవోను కూడా గత ప్రభుత్వం విడుదల చేసింది.  టానిక్ వైన్ షాప్‌కి రాష్ట్రంలో ఏ డిపో నుంచైనా మద్యం తీసుకునే వెసులుబాటుతో పాటు దేశంలో ఏ రాష్ట్రం నుంచైనా రకరకాల మద్యం బ్రాండ్లను తెచ్చుకుని టానిక్‌లో విక్రయించుకునేలా అనుమతులు ఇచ్చారు.  ఈ జీవో ప్రకారం ప్రతీ ఐదు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. మొదటి మూడు సంవత్సరాలు లిక్కర్ అదనపు అమ్మకాలపై ఎలాంటి ప్రివిలేజ్ ఫీజ్ చెల్లిచకుండా వెసులుబాటు కల్పించారు.  ఇది ఎక్సైజ్ పాలసీకి విరుద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. విదేశీ మద్యం అమ్మకానికి 2016లో గత ప్రభుత్వం ప్రత్యేక జీవోతో అనుమతి ఇవ్వగా..  2017లో అమ్మకాలు మొదలు పెట్టారు. అయితే.. ఏడేళ్లుగా టానిక్ వైన్ షాప్ నిర్వాహకులు వందల కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు ప్రాథమికంగా తేలింది.  ఇందులో  ఎక్సైజ్ శాఖలోని ఉన్నతాధికారితో పాటు  ఓ ఐఏఎస్ అధికారి పాత్ర కూడా ఉన్నట్టు అధికారులు గుర్తించారు.  (ఇప్పుడు రేవంత్ ప్ర‌భుత్వానికి అర్థం కాని విష‌యం ఏమిటంటే.......... ఇన్నేళ్ల నుంచి వందల కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగ్గొడుతున్నా  ఎక్సైజ్ శాఖ,  కమర్షియల్ ట్యాక్స్ అధికారులు పట్టించుకోకపోవడానికి గల కారణాలపై ప్రభుత్వం విచారణ చేపట్టింది.  టానిక్ యాజ‌మాన్యంలో  బీఆర్ఎస్‌ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు, ఎమ్మెల్సీ లు ఉన్నార‌ట‌.  ట్విస్ట్ ఏమిటంటే... బీఆర్ ఎస్ ఓడిపోవ‌డంతో వెంట‌నే బీఆర్ఎస్ నేత‌లు తమ వాటాలు వేరే వ్యక్తులకు అమ్ముకున్నార‌ట‌.  రేవంత్ స‌ర్కార్  బీఆర్ఎస్ నేతలే టార్గెట్‌గా దాడులు చేసింది.  ఫ‌లితం..... యజమానులు వాళ్లు కాదని తేలింది.  దీంతో.. టానిక్‌తో పాటు దానికి అనుబంధంగా ఉన్న అన్ని మద్యం షాపుల్లోనూ అధికారులు తనిఖీలు నిర్వహించారు.  జీఎస్టీ,  వ్యాట్‌ ఎగవేత కోణాలతో పాటు  మద్యం బదిలీ,  పన్ను చెల్లించని మద్యం అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. మొత్తానికి  అసలు ఎంత మద్యం విక్రయించారు,  ఎంత వ్యాట్ చెల్లించారనే వివరాలను ఈ దుకాణాల వ్యాపారులు పూర్తిగా ఇవ్వలేదని తెలుస్తోంది.  మద్యం కొనుగోలుదారులకు ఇచ్చే రసీదు (ట్యాక్స్ ఇన్వాయిస్)ను జీఎస్టీ నంబరుతో ఈ దుకాణాల్లో జారీచేస్తున్నట్లు తనిఖీల్లో తేలింది.  ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం అమ్మకాల రసీదులో వ్యాట్ వివరాలు మాత్రమే పేర్కొనాలి.  జీఎస్టీ కింద మద్యం అమ్మకాలు లేవు.  అయినా జీఎస్టీ పేరుతో ఎందుకు ప్రజల నుంచి పన్ను వసూలు చేస్తున్నారు?  ఇప్పటివరకూ ఎంత తీసుకున్నారనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.  ఈ దుకాణాల్లో ఆహార పదార్థాల విక్రయానికి ప్రభుత్వ అనుమతి లేదు.  అయినా వాటిని విక్రయిస్తూ జీఎస్టీ చెల్లించకుండా మోసం చేస్తున్నట్లు తేలింది. ఏడేళ్లుగా టానిక్ వైన్ షాప్ నిర్వాహకులు వందల కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు ప్రాథమికంగా తేలింది.

ప‌వ‌న్ కేంద్రంలో మంత్రినా? రాష్ట్రంలోనా? ఎక్క‌డో ఓ చోట‌ మంత్రి అవ్వ‌డం మాత్రం ప‌క్కా! 

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ సారి మంత్రి అవ్వ‌డం మాత్రం ప‌క్కాన‌ట‌. ఎమ్మెల్యేగా గెలిస్తే రాష్ట్రంలో మంత్రి ప‌ద‌వి, ఎంపీగా గెలిస్తే కేంద్రంలో మంత్రి అయిపోయిన‌ట్లే. అవును.... పవన్ కల్యాణ్ స్కెచ్.. మామూలుగా లేదు. రెండు చోట్ల నుంచి పోటీ చేస్తార‌ట‌.  ఐతే గత ఎన్నికల్లో కూడా జనసేనాని రెండు చోట్ల పోటీ చేశాడు. ఓడిపోయాడు.  ఈసారి పవన్ పోటీ చేసేది రెండు అసెంబ్లీ స్థానాల్లో కాదట. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ స్థానానికట. ఇప్పటికే ఖరారైన పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ.. కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా పోటీలో ఉంటార‌ట. జనసేనకు మంచి ఊపుందని భావిస్తున్న నేపథ్యంలో పవన్ రెండు చోట్లా జయకేతనం ఎగురవేస్తాడని కూటమి భావిస్తోంది. రెండు చోట్లా గెలిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వేరే అభ్యర్థిని గెలిపించుకుంటారని.. తర్వాత పవన్ ఎన్డీయేలో చేరి కేంద్ర మంత్రి కూడా అవుతాడని జనసేన వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  గత ఎన్నికల్లో రెండు చోట్లా పవన్ కల్యాణ్ ను ఓడించింది వైసీపీ. అందుకే ఈసారి కూడా  ప‌వ‌న్‌పై పోటీకి ధీటైన నుగుణంగా క్యాండిడేట్ ను డిసైడ్ చేసి బరిలోకి దింపాలనుకుంటోంది వైసీపీ.  పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో రెండు అసెంబ్లీ సీట్లలో పోటీ చేశారు.  గాజువాక,  భీమవరం స్థానాల్లో పోటీ చేసిన ఆయన .. రెండు చోట్లా ఓడిపోయారు.  ఎంపీగా ఎన్నికైతే కేంద్రంలో మంత్రి పదవి తీసుకునే అవకాశం కలుగుతుందనే ఆలోచ‌న‌లో ప‌వ‌న్ ఉన్నార‌ట‌. బీజేపీ పెద్దల కోరికమేరకే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఎంపీగా,  ఎమ్మెల్యేగా పోటీ చేస్తే విమర్శలు వస్తాయనే భయం కూడా జనసేనను వెంటాడుతోంది.  ఒకవేళ ఎంపీగా గెలిస్తే పవన్ ఢిల్లీ వెళ్లి కూర్చుంటాడని..  రాష్ట్రాన్ని, పార్టీని గాలికొదిలేస్తాడని వైసీపీ నేతలు ప్రచారం చేస్తారు. వాటిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ పవన్ అసెంబ్లీకి వెళ్లి జగన్‌ను ఎదుర్కోవడమే కరెక్ట్ అంటున్నారు.

ముద్రగడ అడుగులు వైసీపీ వైపు...14న ముహూర్తం 

ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరికకు రంగం సిద్ధమైంది. ఈ నెల 14న తాను వైసీపీలో చేరుతున్నానని ముద్రగడ స్వయంగా వెల్లడించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో తాను, తన కుమారుడు గిరి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నామని వివరించారు.  తాను పదవులు ఆశించి వైసీపీలోకి రావడం లేదని, సీఎం జగన్ విజయం కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ముద్రగడ స్పష్టం చేశారు. వైసీపీ నాయకత్వాన్ని ఎలాంటి పదవులు అడగలేదని అన్నారు.  కాగా, మార్చి 14న కిర్లంపూడి నుంచి తాడేపల్లికి భారీ ర్యాలీగా ముద్రగడ తరలిరానున్నట్టు తెలుస్తోంది. ముద్రగడ పద్మనాభం వైసీపీ నుంచి పవన్ కల్యాణ్ పైన పోటీ చేస్తారని ప్రచారం సాగింది. పిఠాపురం నుంచి పోటీలో నిలుస్తారని భావించారు. అయితే, ముద్రగడ ఎలాంటి షరతులు లేకుండానే వైసీపీలో చేరుతున్నట్లు స్పష్టత ఇచ్చారు. ముద్రగడ గతంలో కాకినాడ ఎంపీగా, ఎమ్మెల్యేగా పని చేసారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉంటానని చెబుతూనే...ఎన్నికల్లో మాత్రం పోటీ చేయటం లేదని వెల్లడించారు. ఇక, గోదావరిలో ఈ సారి పవన్ కల్యాణ్ కాపు ఓట్ బ్యాంక్ తన వైపు తిప్పుకుంటారనే అంచనాలు ఉన్నాయి. దీంతో, ఇప్పుడు ముద్రగడ వైసీపీలో చేరటం ద్వారా కాపు ఓట్ బ్యాంక్ పైన గురి పెట్టింది. ఇప్పటికే చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు వైసీపీలో చేరారు. ఇక, ముద్రగడ వైసీపీలో చేరిన తరువాత గోదావరి రాజకీయం మరింత ఆసక్తి కరంగా మారుతోంది. వైసీపీ అధికారంలోకి వస్తే ముద్రగడను రాజ్యసభకు ఎంపిక చేసే అవకాశం ఉందని సమాచారం.