కేసీఆర్ కుటుంబాన్ని కుదిపేస్తున్న టానిక్ స్కాం
posted on Mar 10, 2024 @ 4:30PM
ఒక్క లైసెన్స్‌తో 11 వైన్ షాపులు, బీఆర్ఎస్ నేతలే ఓనర్స్..! ప్రభుత్వం మనదే. ఏం చేసినా నడుస్తుందనే తీరులో కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించిందనడానికి టానిక్ లిక్కర్ మాల్స్ మరో ఉదాహరణ. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల అండతో.. స్పెషల్ జీవోలు విడుదల చేసి మరీ..ఈ గ్రూప్ రూ.100 కోట్ల ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు గుర్తించారు. టానిక్ మద్యం దుకాణాల తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
టానిక్ స్కాం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని కుదిపేస్తోంది.
స్వయంగా ఎం.పి. సంతోష్ రావు పాత్ర ప్రత్యక్షంగా ఉందని ఎక్సైజ్ అదికారులు స్పష్టమైన ఆధారాలు సేకరించడంతో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కొనసాగిన అవినీతి కుంభకోణాల్లో ఇది కూడా కీలకంగా మారింది.
సి.ఎం. రేవంత్‌రెడ్డి పార్లమెంట్ ఎన్నికల వేళ టైమ్ చూసి బీఆర్ఎస్ ను గట్టిగా ఇరుకున పెట్టడానికే ఆఘమేఘాల మీద దర్యాప్తు సంస్థలతో దూకుడు పెంచారు. ముఖ్యమంత్రే ప్రత్యేకంగా పర్వవేక్షిస్తున్నారు.
ముగ్గురు రాష్ట్ర ఉన్నతాధికారుల కుటుంబ సభ్యులకు వాటాలు ఉన్నట్టు తెలుస్తోంది.
గత ప్రభుత్వంలో సీఎంవో అధికారిగా పనిచేసిన భూపాల్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి,
ఎక్సైజ్ ఉన్నతాధికారి రవీందర్ రావు కూతురు హారిక,
మరో అడిషనల్ ఎస్పీ కూతురు ప్రియాంక రెడ్డి కి టానిక్ గ్రూప్ లో వాటాలు ఉన్నాయి.
దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం వివాదం కొనసాగుతూ ఉండగానే.. ఇప్పుడు మరో కొత్త లిక్కర్ స్కాం వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఉన్న టానిక్ ఎలైట్ వైన్ షాపులో జీఎస్టీ అధికారులు చేపట్టిన సోదాల్లో విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి.
ఏ మద్యం షాపునకు లేని వెసులుబాటు టానిక్‌కు ఉన్నట్టు సోదాల్లో అధికారులు గుర్తించారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో టానిక్‌కు ఏ4 ఎలైట్ కింద లైసెన్స్ జారీ చేశారు.
అయితే.. ఈ లైసెన్స్ కింద.. ఏకంగా 11 మద్యం దుకాణాలు నడిపించారు.
ప్రస్తుతం నగరంలో టానిక్‌కు 11 ఫ్రాంచైజ్‌లు ఉండగా..
క్యూ బై టానిక్ పేరుతో మద్యం విక్రయాలు జరుపుతున్నారు.
తెలంగాణలో ఏ వైన్ షాప్‌కు లేని ప్రత్యేక అనుమతులు కేవలం టానిక్‌కు మద్యం దుకాణానికి మాత్రమే ఉండటం గమనార్హం.
ఈ మేరకు ప్రత్యేక జీవోను కూడా గత ప్రభుత్వం విడుదల చేసింది.
టానిక్ వైన్ షాప్‌కి రాష్ట్రంలో ఏ డిపో నుంచైనా మద్యం తీసుకునే వెసులుబాటుతో పాటు దేశంలో ఏ రాష్ట్రం నుంచైనా రకరకాల మద్యం బ్రాండ్లను తెచ్చుకుని టానిక్‌లో విక్రయించుకునేలా అనుమతులు ఇచ్చారు.
ఈ జీవో ప్రకారం ప్రతీ ఐదు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. మొదటి మూడు సంవత్సరాలు లిక్కర్ అదనపు అమ్మకాలపై ఎలాంటి ప్రివిలేజ్ ఫీజ్ చెల్లిచకుండా వెసులుబాటు కల్పించారు.
ఇది ఎక్సైజ్ పాలసీకి విరుద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు.
విదేశీ మద్యం అమ్మకానికి 2016లో గత ప్రభుత్వం ప్రత్యేక జీవోతో అనుమతి ఇవ్వగా..
2017లో అమ్మకాలు మొదలు పెట్టారు.
అయితే.. ఏడేళ్లుగా టానిక్ వైన్ షాప్ నిర్వాహకులు వందల కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు ప్రాథమికంగా తేలింది.
ఇందులో
ఎక్సైజ్ శాఖలోని ఉన్నతాధికారితో పాటు
ఓ ఐఏఎస్ అధికారి పాత్ర కూడా ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
(ఇప్పుడు రేవంత్ ప్రభుత్వానికి అర్థం కాని విషయం ఏమిటంటే..........
ఇన్నేళ్ల నుంచి వందల కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగ్గొడుతున్నా
ఎక్సైజ్ శాఖ,
కమర్షియల్ ట్యాక్స్ అధికారులు పట్టించుకోకపోవడానికి గల కారణాలపై ప్రభుత్వం విచారణ చేపట్టింది.
టానిక్ యాజమాన్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు, ఎమ్మెల్సీ లు ఉన్నారట.
ట్విస్ట్ ఏమిటంటే... బీఆర్ ఎస్ ఓడిపోవడంతో వెంటనే బీఆర్ఎస్ నేతలు తమ వాటాలు వేరే వ్యక్తులకు అమ్ముకున్నారట.
రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ నేతలే టార్గెట్‌గా దాడులు చేసింది.
ఫలితం..... యజమానులు వాళ్లు కాదని తేలింది.
దీంతో.. టానిక్‌తో పాటు దానికి అనుబంధంగా ఉన్న అన్ని మద్యం షాపుల్లోనూ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
జీఎస్టీ,
వ్యాట్ ఎగవేత కోణాలతో పాటు
మద్యం బదిలీ,
పన్ను చెల్లించని మద్యం అంశాలను కూడా పరిశీలిస్తున్నారు.
మొత్తానికి
అసలు ఎంత మద్యం విక్రయించారు,
ఎంత వ్యాట్ చెల్లించారనే వివరాలను ఈ దుకాణాల వ్యాపారులు పూర్తిగా ఇవ్వలేదని తెలుస్తోంది.
మద్యం కొనుగోలుదారులకు ఇచ్చే రసీదు (ట్యాక్స్ ఇన్వాయిస్)ను జీఎస్టీ నంబరుతో ఈ దుకాణాల్లో జారీచేస్తున్నట్లు తనిఖీల్లో తేలింది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం అమ్మకాల రసీదులో వ్యాట్ వివరాలు మాత్రమే పేర్కొనాలి.
జీఎస్టీ కింద మద్యం అమ్మకాలు లేవు.
అయినా జీఎస్టీ పేరుతో ఎందుకు ప్రజల నుంచి పన్ను వసూలు చేస్తున్నారు?
ఇప్పటివరకూ ఎంత తీసుకున్నారనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.
ఈ దుకాణాల్లో ఆహార పదార్థాల విక్రయానికి ప్రభుత్వ అనుమతి లేదు.
అయినా వాటిని విక్రయిస్తూ జీఎస్టీ చెల్లించకుండా మోసం చేస్తున్నట్లు తేలింది.
ఏడేళ్లుగా టానిక్ వైన్ షాప్ నిర్వాహకులు వందల కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు ప్రాథమికంగా తేలింది.