పవన్ కేంద్రంలో మంత్రినా? రాష్ట్రంలోనా? ఎక్కడో ఓ చోట మంత్రి అవ్వడం మాత్రం పక్కా!
posted on Mar 10, 2024 @ 4:22PM
పవన్ కళ్యాణ్ ఈ సారి మంత్రి అవ్వడం మాత్రం పక్కానట. ఎమ్మెల్యేగా గెలిస్తే రాష్ట్రంలో మంత్రి పదవి, ఎంపీగా గెలిస్తే కేంద్రంలో మంత్రి అయిపోయినట్లే. అవును....
పవన్ కల్యాణ్ స్కెచ్.. మామూలుగా లేదు. రెండు చోట్ల నుంచి పోటీ చేస్తారట. ఐతే గత ఎన్నికల్లో కూడా జనసేనాని రెండు చోట్ల పోటీ చేశాడు. ఓడిపోయాడు. ఈసారి పవన్ పోటీ చేసేది రెండు అసెంబ్లీ స్థానాల్లో కాదట. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ స్థానానికట. ఇప్పటికే ఖరారైన పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ.. కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా పోటీలో ఉంటారట.
జనసేనకు మంచి ఊపుందని భావిస్తున్న నేపథ్యంలో పవన్ రెండు చోట్లా జయకేతనం ఎగురవేస్తాడని కూటమి భావిస్తోంది. రెండు చోట్లా గెలిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వేరే అభ్యర్థిని గెలిపించుకుంటారని.. తర్వాత పవన్ ఎన్డీయేలో చేరి కేంద్ర మంత్రి కూడా అవుతాడని జనసేన వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
గత ఎన్నికల్లో రెండు చోట్లా పవన్ కల్యాణ్ ను ఓడించింది వైసీపీ. అందుకే ఈసారి కూడా పవన్‌పై పోటీకి ధీటైన నుగుణంగా క్యాండిడేట్ ను డిసైడ్ చేసి బరిలోకి దింపాలనుకుంటోంది వైసీపీ.
పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో రెండు అసెంబ్లీ సీట్లలో పోటీ చేశారు.
గాజువాక,
భీమవరం స్థానాల్లో పోటీ చేసిన ఆయన .. రెండు చోట్లా ఓడిపోయారు.
ఎంపీగా ఎన్నికైతే కేంద్రంలో మంత్రి పదవి తీసుకునే అవకాశం కలుగుతుందనే ఆలోచనలో పవన్ ఉన్నారట. బీజేపీ పెద్దల కోరికమేరకే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
అయితే ఎంపీగా,
ఎమ్మెల్యేగా పోటీ చేస్తే విమర్శలు వస్తాయనే భయం కూడా జనసేనను వెంటాడుతోంది.
ఒకవేళ ఎంపీగా గెలిస్తే పవన్ ఢిల్లీ వెళ్లి కూర్చుంటాడని..
రాష్ట్రాన్ని, పార్టీని గాలికొదిలేస్తాడని వైసీపీ నేతలు ప్రచారం చేస్తారు. వాటిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ పవన్ అసెంబ్లీకి వెళ్లి జగన్‌ను ఎదుర్కోవడమే కరెక్ట్ అంటున్నారు.