మళ్లీ మోడీ సర్కారే.. తేల్చి చెప్పేసిన ఎగ్జిట్ పోల్స్
posted on Jun 1, 2024 @ 7:46PM
సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. జూన్ 4న ఫలితాలు అధికారికంగా వెలువడతాయి. అయితే ప్రజా నాడి ఎలా ఉంది అనేది తెలుసుకునేందుకు ఎగ్జిట్ పోల్స్ చాలా వరకూ దోహదం చేస్తాయి. సో.. మొత్తం లోక్ సభ స్థానాలు 543 స్థానాలకు గాను ఏ కూటమి ఎన్ని సీట్లు గెలుచుకుంటుందన్న దానిపై వివిధ సంస్థలు వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ ను బట్టి చూస్తే మోడీ సర్కార్ మరో సారి అధికారంలోకి రావడం ఖాయమని తోచక మానదు.
వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి గెలుచుకునే స్థానాల వివరాలు ఇలా ఉన్నాయి.
జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్
బీజేపీ కూటమి 362-392
కాంగ్రెస్ కూటమి 141-161
ఇతరులు 10-20
న్యూస్ నేషన్...
బీజేపీ కూటమి 340-378
కాంగ్రెస్ కూటమి 153-169
ఇతరులు 21-23
టైమ్స్ నౌ...
బీజేపీ కూటమి 353-368
కాంగ్రెస్ కూటమి 118-133
ఇతరులు 43-48
ఇండియా న్యూస్- డీ డైనమిక్స్...
బీజేపీ కూటమి- 371
కాంగ్రెస్ కూటమి- 125
ఇతరులు- 47
రిపబ్లిక్-పీ మార్క్...
బీజేపీ కూటమి- 359
కాంగ్రెస్ కూటమి- 154
ఇతరులు- 30
రిపబ్లిక్ భారత్-మ్యాట్రిజ్...
బీజేపీ కూటమి 353-368
కాంగ్రెస్ కూటమి 118-133
ఇతరులు 43-48
దైనిక్ భాస్కర్...
బీజేపీ కూటమి 281-350
కాంగ్రెస్ కూటమి 145-201
ఇతరులు 33-49