హైదరాబాద్‌తో ఆంధ్రప్రదేశ్‌కి బంధం నేటితో తెగిపోనుంది..
posted on Jun 2, 2024 @ 4:22PM
జూన్ 2, 2024న కొద్ది గంటల్లో హైదరాబాద్‌తో, తెలంగాణతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వున్న బంధం తెగిపోనుంది. విభజన చట్టం ప్రకారం పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా వున్న హైదరాబాద్ ఈ రోజుతో ఆంధ్రప్రదేశ్‌కి ఏమాత్రం సంబంధం లేని నగరంగా మారబోతోంది.
👉 2014 జూన్ 2 నుంచి నేటి వరకు 10 ఏళ్లుగా ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్...
👉 ఈ రోజుతో, 1956లో ఏర్పడ్డ బంధం పూర్తిగా తెగిపోనుంది.
👉 1591 నుంచి నిజాం పాలనలో రాజధానిగా కొనసాగిన హైదరాబాద్....
👉 భాగ్యనగరంలో అద్భుత చారిత్రక కట్టడాలతో గోల్కొండ ఖిల్లా రాజ్యంగా కొనసాగింది...
👉 జంట నగరాలు, మూసీ నది పరవళ్ళతో 1769 నుంచి 1948 వరకూ కొన్నాళ్ళు మొఘలుల పాలనలో... ఎక్కువ కాలం నిజాం పాలనలోనే హైదరాబాద్...
👉 1948లో సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో కలిపారు.
👉 పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయిన ఆంధ్రులకి కర్నూలు రాజధానిగా నిర్ణయం జరిగింది.
👉 భాషా ప్రాతిపదికన రెండు రాష్ట్రాలను కలిపి హైదరాబాద్‌ను రాజధానిగా చేయాలన్న దానిమీద అంగీకారం కుదిరింది.
👉 58 ఏళ్ల తర్వాత రాష్ట్రం విడిపోయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణగా రెండు ముక్కలు అయింది. చివరికి 2014 నుంచి 10 ఏళ్ల హక్కుని మాత్రమే సాధించుకున్న ఆంధ్రప్రదేశ్...
👉 ఐదేళ్ళపాటు తనను తాను నిర్మించుకునే ప్రయత్నంలో ఎన్నో అవరోధాలు. గత ఐదేళ్ళుగా ఏళ్లుగా విధ్వంసానికి గురై తనని తాను నిర్మించుకోలేక రాజకీయ గాయాలతో నలుగుతున్న ఆంధ్రప్రదేశ్...
👉 అభివృద్ధి సంగతి దేవుడెరుగు... కనీసం రాజధాని లేని రాష్ట్రంగా చులకన అయిపోయిన ఆంధ్రప్రదేశ్.
👉 రాష్ట్రం పట్ల ప్రేమ, నిబద్దత, నా రాష్ట్రం, నా ప్రజల అభివృద్ధి అనేది మరచి స్వార్థ రాజకీయాలు నడిపిన రాజకీయ నాయకులు...
👉 కేంద్ర సంస్థల కొరత, కొత్త కంపెనీల ఆశలు, ఇవన్నీ అందని ద్రాక్షలుగా ఎందుకు మారాయి? ఈ పాపం ఎవరిది?
👉 ప్రజాచైతన్యం కొరవడిందా, ప్రశ్నించే తత్వం సన్నగిల్లిందా...
సరైన నాయకుల ఎంపిక లోపమయ్యిందా...?
👉 ఎన్నికల కోడ్ అడ్డమో... రాజకీయమే అడ్డమో... తెగిపోయే ఈ బంధంపై నోరువిప్పని నాయకులు...
👉 దశాబ్ది ఉత్సవాలతో సందడిగా తెలంగాణ.
👉 పదేళ్ళ తర్వాత కూడా అడుగు ముందుకు పడని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్.
👉 ఆంధ్ర ప్రజల తెలివి తెలంగాణ ప్రజల తెలివి ముందు చిన్నబోయిందా...?
👉 విడిపోయి కలిసుందామన్న తెలంగాణ గొప్ప భావం నిలబడింది...
👉 విడిపోయి నిలబడగలం అన్న ఆంధ్రప్రదేశ్ ధైర్యం చిన్నబోయింది...
👉 ఆంధ్రప్రదేశ్ గాయాలను మాన్పే నాయకత్వం వస్తుందని ఆశిద్దాం..