పోస్టల్ బ్యాలెట్లపై వైసీపీకి షాక్: కేసు కొట్టేసిన కోర్టు

ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ మొత్తం వైసీపీకి వ్యతిరేకంగా వచ్చాయి. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా పోస్టల్ బ్యాలెట్ల విషయంలో కూడా జగన్ పార్టీకి షాక్ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ల అంశంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది. సీఈసీ ఉత్తర్వులలో జోక్యం చేసుకోలేమని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు సమయంలో ఓటరు డిక్లరేషన్‌కి సంబంధించిన ‘ఫారం - 13’ మీద అటెస్టింగ్ అధికారి పేరు, హోదా, సీల్ లేకపోయినా పర్లేదు. ఆ అధికారం సంతకం వుంటే చాలు వాటిని పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేస్తూ ఈసీ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైసీపీ ఏపీ హైకోర్టులో దావా వేసింది. పిటిషనర్ వాదనలు విన్న హైకోర్టు గతంలో పలు సందర్భాల్లో ఇచ్చిన కోర్టు తీర్పులను ఉదహరిస్తూ, వైసీపీ పిటిషన్‌ని కొట్టేసింది.

Teluguone gnews banner