వైసీపీకి విపక్ష హోదా కూడా దక్కదు.. వైసీపీకి వణుకుపుట్టిస్తున్న కేకే ఎగ్జిట్ పోల్ ఫలితం
posted on Jun 2, 2024 7:57AM
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. మరోసారి సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారా..? చంద్రబాబు సీఎం సీటును అదిరోహించబోతున్నారా? ఓటర్లు ఎవరికి మద్దతు ఇచ్చారు..? అనే విషయాలపై ఏపీ ప్రజల్లోనేకాదు.. దేశవ్యాప్తంగా ఉత్కంఠనెలకొంది. గతంకంటే ఎక్కువ స్థానాల్లో మా పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తుండగా.. కూటమి అధికారంలోకి రావడం పక్కా అంటూ టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే, వీరిలో ఎవరు అధికార పీఠాన్ని దక్కించుకోబోతున్నారు అనే విషయాన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. ప్రముఖ సర్వే సంస్థలన్నీ కూటమి అధికారంలోకి వస్తుందని కుండబద్దలు కొట్టేశాయి. 100 నుంచి 140 స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని పలు సర్వేలు స్పష్టం చేశాయి. అయితే కేకే సర్వే సంస్థ వెల్లడించిన ఫలితాలు వైసీపీ నేతలకు దడపుట్టిస్తున్నాయి. అధికార వైసీపీకి ఈ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురు కాబోతున్నదని కేకే సర్వే తేల్చిచెప్పింది. వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కదని కేకే సర్వే తేల్చేసింది. కేకే సర్వే ఫలితాలపై ఏపీ ప్రజల్లో నమ్మకం ఎక్కువ. ఎందుకంటే.. 2019 ఎన్నికల్లో వైసీపీ 150 నియోజవర్గాల్లో విజయం సాధిస్తుందని కేకే సర్వే సంస్థ చెప్పింది. ఆ సమయంలో వైసీపీ నేతలు సైతం అంత రావంటూ ఎగతాళి చేశారు. కానీ, కేకే సర్వే సంస్థ చెప్పినట్లుగానే ఫలితాలు పక్కాగా దిగిపోయాయి.
కేకే సర్వే వెల్లడించిన ఫలితాల ప్రకారం.. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోకవర్గాల్లో 161 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించనున్నారు. వీరిలో టీడీపీ పోటీ చేసిన 144 స్థానాలకు గానూ 133 స్ధానాలలో, జనసేన 21 స్థానాలకు 21లోనూ , బీజేపీ పోటీ చేఃసిన 10 స్థానాలకు ఏడు స్థానాల్లో విజయకేతనం ఎగురవేయనుంది. ఇక అధికార వైసీపీ అభ్యర్థులు కేవలం 14 నియోజకవర్గాల్లో మాత్రమే విజయం సాధిస్తారని కేకే సర్వే పేర్కొంది. దీనికి తోడు శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదారి, కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేయబోతుందని కేకే సర్వే వెల్లడించింది. లోక్‌సభ స్థానాల విషయానికి వస్తే రాష్ట్రంలోని పాతిక లోక్ సభ స్థానాలనూ తెలుగుదేశం కూటమే గెలుచుకోనుందని కేకే సర్వే పేర్కొంది.
వైసీపీ , టీడీపీ కూటమికి కులాల వారిగా పోలైన ఓట్ల వివరాలు కేకే సర్వే ప్రకారం ఇలా ఉన్నాయి.. ఎస్సీ (వైసీపీకి 80శాతం, కూటమికి 20శాతం), ఎస్టీ (వైసీపీకి 70శాతం, కూటమికి 30శాతం), ముస్లిం (వైసీపీకి 70శాతం, కూటమికి 30శాతం), క్రైస్తవులు (వైసీపీకి 80శాతం, కూటమికి 20శాతం), కాపు (వైసీపీకి 10శాతం, కూటమికి 90శాతం), కమ్మ (వైసీపీకి 10శాతం, కూటమికి 90శాతం), క్షత్రియ (వైసీపీకి 10శాతం, కూటమికి 90శాతం), బీసీ (వైసీపీకి 40శాతం, కూటమికి 60శాతం), రెడ్డి (వైసీపీకి 30శాతం, కూటమికి 70శాతం), వైశ్య (వైసీపీ 20శాతం, కూటమి 80శాతం), బ్రాహ్మణ (వైసీపీకి 10శాతం, కూటమికి 90శాతం) ఓట్లు పోలయ్యాయి.
కేకే సర్వే ప్రకారం రాష్ట్రంలోని 13 ఉమ్మడి ల్లాల వారిగా తెలుగుదేశం కూటమి గెలిచే స్థానాల స్థానాల వివరాలు ఇలా ఉన్నాయి...
శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం కూటమి క్లీన్ స్వీప్ చేస్తుంది. ఆ జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం అభ్యర్థులే విజయం సాధిస్తారు. ఇఖ విజయనగరం జిల్లా విషయానికి వస్తే ఈ జిల్లాలో తొమ్మిది నియజకవర్గాల్లో కూటమి అభ్యర్థులే విజయం సాధిస్తారు.
విశాఖపట్టణం జిల్లాలో 15 నియోజకవర్గాలు ఉండగా 14 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు, ఒక నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో కూటమి అభ్యర్థులు 18 నియోజకవర్గాల్లో, వైసీపీ ఒక్క నియోజకవర్గంలో విజయం సాధించనుంది.
పశ్చిమగోదావరి జిల్లాలో 15 నియోజకవర్గాలు ఉండగా ఆ 15 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులే విజయం సాధిస్తారు. అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం కూటమి క్లీన్ స్వీప్ చేస్తుంది. అలాగే కృష్ణా జిల్లాలో కూడా వైసీపీ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించే అవకాశం లేదు.
కృష్టా జిల్లాలో 16 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 16 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారు.
గుంటూరులో కూడా అదే పరిస్థితి. గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 17నియోజక వర్గాల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం అని కేకే సర్వే పేర్కొంది.
ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉండగా వాటిలో 11 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు, ఒక నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి విజయం సాధిస్తారు.
ఇక నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఎనిమిది నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు, రెండు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారు.
చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో 11 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు, మూడు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారు.
అనంతపురం జిల్లాలో 14 నియోకవర్గాలు ఉన్నాయి. ఈ జిల్లాలో కూడా తెలుగుదేశం కూటమి క్లీన్ స్వీప్ చేయనుంది. మొత్తం 14 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించనున్నారు.
కడప జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఏడు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు, మూడు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారు.
కర్నూల్ జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. 11 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు, మూడు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారు.