KCR suspend MP Vijayashanthi

టీఆర్ఎస్ నుంచి రాములమ్మ ఔట్

      విజయశాంతి పై టీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. రాములమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇప్పటికే రంగం సిద్దమైందని వార్తలు వస్తున్న ఆమె ఖండించకపోవడంతో కేసీఆర్ ఆమె పై మండిపడ్డారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న విజయశాంతి అనేక సార్లు క్షమించా౦. ఇప్పుడు సస్పెన్షన్ చేస్తున్నాం. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో చెప్పాలంటూ షోకాజ్ నోటీసు ఇస్తాం. పొలిట్‌బ్యూరో ఏకాభిప్రాయం మేరకు కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు'' అని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.   విజయశాంతి కొన్నాళ్లుగా టీఆర్ఎస్‌ పార్టీ కార్యాకలాపాల్లో పాల్గొనడంలేదు. ఆమె తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. విభజన అంశంపై అటు రాష్ట్రం, ఇటు కాంగ్రెస్ పెద్దలు తలమునకలైన సమయంలోనే ఆమె ఢిల్లీకి వెళ్లారు. సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌తో సమావేశమై మెదక్ ఎంపీ సీటుపై హామీ ఇప్పించుకున్నారు.

mamatha benarji

ఈ పాపం కాంగ్రెస్‌దే

  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో దేశ‌వ్యాప్తంగా విభ‌జ‌న సెగ‌లు చెల‌రేగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ‌తో పాటు బ‌ల‌మైన ఉద్యమంగా కొన‌సాగుతున్న గుర్ఖాల్యాండ్ పోరాటం తెలంగాణ ప్రక‌ట‌న‌తో మ‌రోసారి ఉవ్వెత్తున్న ఎగ‌సి ప‌డింది. తెలంగాణ ప్రక‌ట‌న రాబోతుంది అన్న నేప‌ధ్యంలోనే 72 గంట‌ల బంద్‌కు పిలుపునిచ్చిన అక్కడి ప్రజ‌లు తెలంగాణ ప్రక‌ట‌నతో ఉద్యమాన్ని మ‌రింత ఉదృతం చేశారు. దీంతో ప‌శ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీపై మండిప‌డుతున్నారు. దేశాన్ని ముక్కలుచేసేందుకు కాంగ్రెస్ పార్టీ కంక‌ణం క‌ట్టుకుంద‌ని మండిప‌డ్డారు. కేవ‌లం త‌మ రాజ‌కీయ ప్రయోజ‌నాల కోస‌మే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ‌ను ప్రక‌టించింద‌న్నారు. కాంగ్రెస్ తెలంగాణ ప్రక‌టించ‌టం వ‌ల్లే త‌మ రాష్ట్రంలో ఇలా అనిశ్చితి నెల‌కొంది అని మండిప‌డ్డారు. ఎలాంటి ప‌రిస్థితులు నెల‌కొన్నా ప‌శ్చిమ‌బెంగాల్ విడిపోనివ్వన‌న్న మ‌మ‌త కాంగ్రెస్ నాయ‌కుల‌ను తీవ్రంగా విమ‌ర్శించారు. గుర్ఖాల్యాండ్ ప‌శ్చిమ బెంగాల్లో అంత‌ర్భాగ‌మేన‌ని ఎట్టిప‌రిస్థితుల్లోనూ విడిపోద‌ని ప్రక‌టించారు.

mayavathi

మాకు నాలుగు రాష్ట్రాలు కావాలి

  తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ రెడీ అవ్వటంతో ఇప్పుడు మ‌రిన్ని విభ‌జ‌న అంశాలు తెర మీద‌కు వ‌స్తున్నాయి. ముఖ్యంగా చాలా రోజులు త‌మ రాష్ట్రాన్ని నాలుగు ముక్కలుగా చీల్చాలంటూ కోరుతుంది యుపి నేత మాయ‌వ‌తి. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు తామెప్పుడు సుముఖంగానే ఉన్నా మ‌న్న మాయ త‌మ రాష్ట్ర స‌మ‌స్యను కూడా త్వర‌గా ప‌రీక్షించాల‌ని కోరారు. ఇప్పటికే గుర్ఖాలాండ్ ఉద్యమం కూడా ఊపంవుకోవ‌టంతో మ‌రిన్ని డిమాండ్‌లు వ‌చ్చే అవ‌కాశం ఉందంటున్నారు విశ్లేష‌కులు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు వ్యతిరేక‌మ‌ని ప్రక‌టించిన జమ్ముకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమ‌ర్ అబ్దుల్లా తెలంగాణ ఏర్పాటు తో పాటు ఇత‌ర డిమాండ్లను కూడా ఖండించారు.

 sonia gandhi telangana

అన్నదమ్ముల్లా కలిసుండాలి: సోనియా!

      సీమాంధ్ర ప్రాంతం వారు మీ సోదరులేనని, సంయమనం పాటించాలని తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తమకు సూచించారని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు అన్నారు. విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసుండాలని సోనియా సూచించారని, అనివార్యమై విభజనపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారని అన్నారు. ఏ సమస్యనైనా ఇరు ప్రాంత నేతలు చర్చించి పరిష్కరించుకోవాలని, శాంతిభద్రతలు వాటిల్లకుండా కలిసిమెలిసి ఉండాలని చెప్పారన్నారు. తెలంగాణలో పార్టీని గెలిపించేందుకు కృషి చేయమని సూచించారన్నారు. తెలంగాణపై సానుకూలంగా నిర్ణయం తీసుకున్నందుకు తాము సోనియాకు కృతజ్ఞతలు తెలిపామన్నారు. తీర్మానానికి సహకరించిన సీమాంధ్ర నేతలకు ధన్యవాదాలు తెలిపారు.

third phase of panchayat elections

కావూరి, కిల్లి కృపారాణికి ఓటర్లు షాక్

      కేంద్రమంత్రి కిల్లి కృపారాణికి కూడా స్వగ్రామంలో ఓటర్లు ఝలక్ ఇచ్చారు. ఆమె స్వగ్రామం పోలవరంలో స్వతంత్ర అభ్యర్థి బాలకృష్ణ కాంగ్రెసు పార్టీ పైన ఘన విజయం సాధించారు. కాంగ్రెసు పార్టీ సీనియర్ ఏలూరు పార్లమెంటు సభ్యులు కావూరి సాంబశివ రావుకు స్వగ్రామంలో షాక్ తగిలింది. బుధవారం జరిగిన సర్పంచ్ ఎన్నికలలో ఆయన పెదపారుపూడి మండలం దోసపాడు గ్రామంలో కాంగ్రెసు పార్టీ అభ్యర్థి పైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. దోసపాడు కావూరి స్వగ్రామం. కాంగ్రెసు అభ్యర్థి పైన టిడిపికి చెందిన శివ కుమార్ 950 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

united andhra pradesh

సమైక్యం: రాజీవ్ విగ్రహానికి నిప్పు

      అనంతపురం జిల్లాలో తెలంగాణకు వ్యతిరేకంగా చెలరేగిన ఆందోళనల కారణంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సప్తగిరి సెంటర్లో జరిగిన ఆందోళనల సందర్భంగా నిరసన కారులు హింసకు పాల్పడ్డారు. వాహనాలు ధ్వంసం చేయడంతో పాటు రాజీవ్ గాంధీ విగ్రహానికి నిప్పు పెట్టారు. ముందుగా విగ్రహాన్ని చెప్పులతో కొట్టిన ఆందోళన కారులు తర్వాత దాన్ని అగ్నికి ఆహుతి చేశారు. విగ్రహం అంటుకున్నాక దాన్ని కూలగొట్టారు. స్థానిక పోలీసులు, కేంద్ర బలగాలు తీవ్రంగా అడ్డుకున్నా ఫలితం లేకపోయింది. లాఠీ ఛార్జి చేస్తున్నా ఆందోళన కారులు తగ్గలేదు. ఇక్కడే కాదు అనంతపురం జిల్లా వ్యాప్తంగా కనిపించిన రాజీవ్, ఇందిరల విగ్రహాలన్నీ ఆందోళన కారుల ఆగ్రహానికి దెబ్బతిన్నాయి.

 Telangana chandrababu

తెలంగాణ పై చంద్రబాబు స్పందన

      తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు రేగకుండా నిర్ణయాలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సూచించారు. కొత్త రాజధాని అభివృద్ధి చేయడానికి నాలుగైదు లక్షల కోట్లు ఖర్చు అవుతుందని, కొత్త రాజధానిని హైదరాబాద్ మాదిరిగా అభివృద్ధి చేసే బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. కొత్త రాజధాని ఏర్పాటుపై కేంద్రం నిర్థిష్టమైన ప్రకటన చేయలేదని ఆయన అన్నారు.   సాగునీటి సమస్య ఎలా పరిష్కారిస్తారో చెప్పాలన్నారు. ఉద్యోగాలు, విద్యుత్, వనరుల పంపిణీపై స్పష్టత ఇవ్వాలని కోరారు. చారిత్రక కారణాల వల్ల కేంద్రానికి కొన్ని డిమాండ్లు చేస్తున్నామన్నారు.  కేంద్ర నిధులతో రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎవరికీ ఇబ్బంది కలుగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదే అని సూచించారు. అనివార్య కారణాల వల్ల రాష్ట్రం విడిపోయినా ప్రజల మధ్య సమైక్యత ఉండాలని బాబు కోరారు. ప్రాణహిత ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర ప్రజలు సంయమనం పాటించాలన్నారు. ఆత్మహత్యలు సమస్య పరిష్కారం కాదని హితవు చేశారు.

telangana tollywood

తెలంగాణ వల్ల సినీ పరిశ్రమ చీలిపోతుందా?

KCR సెపరేట్ రాష్ట్రం డిమాండ్ వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ నిట్ట నిలువునా చీలిపోతుందా?   ....మల్లిక్     ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే తెలుగు సినీ పరిశ్రమ రెండుగా చిలీపోవచ్చు...ప్రస్తుతం టాలీవుడ్ గా పిలవబడుతున్న తెలుగు సినీ పరిశ్రమ తెలంగాణా ఏర్పడితే తెలంగాణావుడ్, ఆంధ్రావుడ్ గా చీలిపోవచ్చు.     అప్పుడు టాలీవుడ్ లో హిట్ అయిన చిత్రాలను తెలంగాణా వుడ్ లో రీమేక్ చేస్తారు....అది ఎలాగంటే... టాలీవుడ్ లో హిట్ అయిన చిత్రాలు:     తెలంగాణ వుడ్ లో రీమేక్ అయ్యాక టైటిల్స్:      1. రచ్చ                                                       లొల్లి 2. పోకిరి                                                     లంగాగాడు   3.సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు      పోశయ్య ఇంటి ముంగట పొనగంటి సెట్టు          4.  అమ్మోరు                                                    మైసమ్మ   5. పరుగు                                                       ఉరుకు   6. సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం                            మల్లేశ్ ఫ్రమ్ మల్కాజ్ గిరి       7. అమాయకుడు                                               ఔలగాడు   8. నారీ నారీ నడుమ మురారీ               పోరీ పోరీ నటిమిట్ల NDతివారి

 hyderabad common capital

ఉమ్మడి రాజధానిపై భయపడవద్దు: దిగ్విజయ్

      హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించడం పై తప్పుగా అర్ధం చేసుకోవద్దని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. ఆంధ్రా, రాయలసీమ, తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్ తెలంగాణ రాజధానిగానే ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ బిల్లును త్వరగా ఆమోదం పొందేందుకు అందరూ ప్రయత్నించాల్సి ఉంటుందన్నారు.   56 ఏళ్లుగా జరుగుతున్న పోరాట ఫలితంగా కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించింది. అంతేకాదు వీలైనంత వేగం రాష్ట్ర ఏర్పాటు జరిగిలే చర్యలను కూడా మొదలు పెట్టింది.. ఈనేపధ్యంలో ఇప్పుడు అంతా కొత్త రాజదాని గురించే మాట్లాడుకుంటున్నారు. పదేళ్ల పాటు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా కొనసాగిన తరువాత ఆంద్ర ప్రాంతానిక రాజధాని కానున్న నగరం గురించే అందరి ఆలోచన.

kiran kumar reddy cm

మంత్రుల రాజీనామాలపై ముఖ్యమంత్రి సైలెంట్

  ఈ రోజు హైదరాబాదులో మంత్రుల క్వార్టర్ లో సమావేశమయిన సీమంధ్ర రాష్ట్ర మంత్రులు 15మందీ కూడా రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ రాజీనామాలు చేయాలని నిర్ణయించుకొన్నట్లు తాజా సమాచారం. వారు నిన్నరాత్రి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి ఇదే విషయం తెలియజేసినప్పుడు ఆయన ఎవరి నిర్ణయాలు వారు తీసుకోవడమే మేలని వారితో అన్నట్లు సమాచారం. అంటే, వారి రాజీనామాలను తానూ వ్యతిరేఖించడం లేదు, అలాగని ఆమోదించడం లేదని ఆయన అభిప్రాయం కావచ్చును. రాష్ట్ర విభజనను గట్టిగా వ్యతిరేఖించిన ఆయన కూడా ఇప్పుడు తన పరిస్థితి ఏమిటనే దానిపై తీవ్ర సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది. అటువంటి స్థితిలో తొందరపడి ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం కంటే కొంత కాలం ఆగి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం మేలని ఆయన భావిస్తున్నారు. అయితే, రాష్ట్రానికి అధినేతగా వ్యవహరించిన ఆయన సాటి మంత్రులతో కలిసి ఉద్యమాలు చేయడం సాధ్యం కాకపోవచ్చును. కానీ ఆయన తన రాజకీయ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించవలసి ఉంటుంది గనుక అటు పార్టీ అధిష్టానానికి, ఇటు ప్రజలకి కూడా ఆగ్రహం కలిగించకుండా నేర్పుగా వ్యవహరించవలసి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో రాజీనామాలకు సిద్దపడుతున్న తన మంత్రులకు ఆయన సలహాలు ఇవ్వడం కూడా మంచిది కాదు, గనుకనే ఆయన వారినే నిర్ణయించుకోమని సూచించినట్లు భావించవచ్చును.

Hunt on for capital of Andhra Pradesh

కొత్త రాజధాని ఏది..?

      తెలుగు నేల రెండుగా విడిపోయింది 56 ఏళ్లుగా జరుగుతున్న పోరాట ఫలితంగా కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించింది. అంతేకాదు వీలైనంత వేగం రాష్ట్ర ఏర్పాటు జరిగిలే చర్యలను కూడా మొదలు పెట్టింది.. ఈనేపధ్యంలో ఇప్పుడు అంతా కొత్త రాజదాని గురించే మాట్లాడుకుంటున్నారు. పదేళ్ల పాటు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా కొనసాగిన తరువాత ఆంద్ర ప్రాంతానిక రాజధాని కానున్న నగరం గురించే అందరి ఆలోచన.    రాజధాని నిర్మాణ పెద్ద విషయం కాకపోయినా ఇప్పుడు అలాంటి ప్రాంతాన్ని ఎంపిక చేయడమే అసలు సమస్య. రాజధాని ఏర్పాడేలంటే ఆ ప్రాంతాలకు అందుబాటులో ఉండటంతో పాటు, ప్రభుత్వ భవనాలకు స్థలాల లభ్యత, విమానాశ్రయం ఇతర రవాణ వసతులు ఇలా అన్ని సౌలభ్యాలను పరిగణలోకి తీసుకొని నిర్ణయిస్తారు. ఇలా చూస్తే విజయవాడ ప్రాంతం రాజధానిగా ఏర్పాడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పెద్ద ఓడరేవు, రైల్వే స్టేషన్, విమానాశ్రయం, ఆయిల్ రిఫైనరీలు, స్టీల్ ప్లాంట్ ఇతర పరిశ్రములు ఇలా హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ది చెందిన విశాఖ రాజధాని అయ్యే అవకాశం ఉంది. రాజమండ్రి ఒంగోలు లాంటి ప్రతిపాదనలు వచ్చినా అక్కడస్థలాల లభ్యత సమస్య ఉంది. అందుకే విజయవాడ-గుంటూరు నగరాల కలిపితే రాజధాని ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందన్నది నిపుణుల అభిప్రాయం. రాజధానిపై తుది నిర్ణయం తీసుకోవడానికి మత్రం మరింత సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు నేతలు.

Panchayiti Elections

ఆఖరి పంచాయితీ

      ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరుగుతున్న ఆఖరి పంచాయితీ ఎన్నికలు మొదలయ్యాయి. ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 16 మండలాల్లో 272 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు మొదలయ్యాయి.ఇప్పటికే 14 తెలుగుదేశం, పది కాంగ్రెస్ మద్దతుదారులు, ఇద్దరు వైసీపీకి చెందిన 31 పంచాయతీలు ఏకగ్రీవం కాగా మరో 23 పంచాయతీల్లో సర్పంచ్‌లతో సహా పూర్తికార్యవర్గం ఏకగ్రీవమయ్యాయి. 241 గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులకు జరిగే ఎన్నికల్లో 723 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తెలంగాణ ప్రాంతంలో అన్ని పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతున్నా సీమాంద్రల్లోని కొన్ని డివిజన్లలో మాత్రం ఎలక్షన్లకు ఇబ్బందులు తలెత్తాయి. బంద్‌లు, నిరసనలతో హోరెత్తుతున్న చాలా చోట్ల ఎన్నికలు వాయిదా వేసే అవకాశం కనిపిస్తుంది. ఇవాల వాయిద పడ్డ డివిజన్‌లలో ఆగస్టు 8 తిరిగి ఎన్నికలు నిర్వహించనున్నారు.

Seemandhra ministers

మంత్రులు మాట మీద నిలబడతారా

      తెలంగాణ ఏర్పాటు పై సీమాంద్రలో నిరసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా మరి కొందరు ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నారు. మరి ఈ సమయంలో ముందుగానే రాజీనామా చేస్తామన్న నేతలపై విమర్శలు వస్తున్నాయి.   గత కొద్ది రోజులుగా సమైక్యాంద్ర కోసం డిల్లీలో భారీ లాభియింగ్‌ నిర్వహించిన రాష్ట్రమంత్రులు తమ ఆకాంక్ష నెరవేరని పక్షంలో రాజీనామాలకు కూడా వెనుకాడమని అధిష్టానాన్ని హెచ్చరించారు. అయితే వీరి బెదిరింపులను అధిష్టానం ఏమాత్రం పట్టించుకోలేదు. అనుకున్నట్టుగానే అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేసింది. అన్ని విషయాలపై ఖచ్చితమైన అభిప్రాయంతో ఉన్న అధిష్టానం నాలుగు నెలలోనే ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని కూడా తేల్చేసింది. మరి ఇప్పుడు తెలంగాణ మంత్రుల స్టెప్‌ ఏంటి.. ఇప్పటికే పలువురు ఏమ్మెల్యేలు, ఎంపిలు రాజీనామ బాట పట్టగా ఇంతవరకు మాట ఇచ్చిన మంత్రులు మాత్రంనోరుమెదపలేదు.. దీని కారణం ఏంటి అన్న ఆగ్రహంలో ఉన్నారు సీమాంద్ర ప్రజానీకం.

kcr

విలీనానికి కేసీఆర్ సై ఎందుకు

  కాంగ్రెస్ అధిష్టానం నిన్న తెలంగాణా ప్రకటన చేసిన వెంటనే, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆ తరువాత దిగ్విజయ్ సింగ్ చేసిన పార్టీ విలీనం వ్యాక్యలకు స్పందిస్తూ “తాను మాట తప్పే మనిషిని కాదని, అయితే, పార్టీ విలీనం గురించి మాట్లాడే ముందు కాంగ్రెస్ తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు పార్లమెంటులో బిల్లు పెట్టాలని ఆయన కోరారు. ఆ తరువాత ఆ పార్టీ రాష్ట్ర విభజనను ఏవిధంగా చేయాలనుకొంటున్నదో, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గురించి తన ఉద్దేశ్యాలు ఏమిటో వంటి విషయాలను స్పష్టం చేయాలని కోరారు. అది గాక, పార్టీ విలీనం చేసేందుకు రెండు పార్టీల మధ్య తగిన ఒప్పందం జరిగిన తరువాతనే సాధ్యం అవుతుందని ఆయన తెలిపారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీతో తమ పార్టీ విలీనం చేయడానికి అభ్యంతరం ఏమి లేదన్నట్లే ఆయన మాట్లాడారు.కానీ, తెలంగాణాలో పునర్నిర్మాణంలో తమ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పడం గమనిస్తే, వీలయితే తన పార్టీ అస్తిత్వాన్ని నిలుపుకోవాలనే కోరిక ఆయనలో ఉందని అర్ధం అవుతోంది.   అయితే, కాంగ్రెస్ తన ప్రమేయం లేకుండానే తెలంగాణా ప్రకటన చేయడంతో ఇప్పుడు తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీదే పైచేయి అవుతుందని ఆయనకీ తెలుసు. మారిన పరిస్థితుల్లో బలపడిన కాంగ్రెస్ పార్టీని ఎన్నికలలో డ్డీకొని మొక్కుబడిగా సీట్లు సంపాదించుకొని ప్రతిపక్ష బెంచీలకి పరిమితమయి పోతే కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో తన ప్రాభల్యం తగ్గిపోవడం ఖాయం. అంతకంటే, కాంగ్రెస్ లో తెరాసను విలీనం చేసి రానున్న ఎన్నికలకి తన పార్టీ నేతలకి వీలయినన్ని ఎక్కువ టికెట్స్  దక్కేలా చూసుకొంటే, కాంగ్రెస్ తో పోటీపడేబదులు దాని బలమయిన మద్దతు కూడా పొంది అధికార పార్టీలో చక్రం తిప్పవచ్చును. ఒకవేళ కేసీఆర్ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయకుండా కాంగ్రెస్ పార్టీని డ్డీ కొనాలని భావించినా కూడా మారిన రాజకీయ పరిస్థితుల్లో, ఆపార్టీలో నేతలు తమ రాజకీయ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని తెరాస నుండి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు మొదలుపెడితే ఇక వారిని ఆపడం ఆయన తరం కాదు. అప్పుడు ఆయన ఎటువంటి షరతులు పెట్టకుండా తెరాసను కాంగ్రెస్ లో విలీనానికి ముందుకు వచ్చినప్పటికీ, కాంగ్రెస్ అందుకు అంగీకరించక పోవచ్చును. అంతకంటే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడమే మేలని అర్ధం చేసుకొన్నకేసీఆర్ విలీనం గురించి సానుకూలంగా స్పందించారు.

తెరమీదకు మరిన్ని విభజనలు

      కేంద్రం తెలంగాణ ప్రకటించిన నేపధ్యంలో ఇప్పుడు మరిన్ని ప్రత్యేక వాదాలు తెరమీదకు వస్తున్నాయి. 50 ఏళ్లుగా నలుగుతున్న తెలంగాణ సమస్యను మూడు రోజుల్లో తేల్చేసిన కాంగ్రెస్‌ తమ డిమాండ్లను కూడా అదే స్థాయిలో పరీష్కరించాలని కోరుతున్నారు.       తెలంగాణ సమస్యకు పరిష్కారం దిశగా కాంగ్రెస్‌ అడుగులు వేయడం మొదలవగానే గూర్ఖాలండ్‌ ప్రతిపాదన కూడా ఊపందుకుంది. ప్రస్థుతం ఆ ప్రాంతంలో 72 గంటల బంద్‌ కొనసాగుతుండగా, రాష్ట్రం ఏర్పడే వరకు వెనకడుగు వేసేది లేదంటున్నారు ఉద్యమకారులు.     దీంతో పాటు మహారాష్ట్రలో కాంగ్రెస్‌ నాయకులు కూడా విదర్భ రాష్ట్రం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో పాటు అస్సాంలో బోడాలాండ్‌, పశ్చిమ యుపిలో హరిత్‌ ప్రదేశ్‌, బీహార్‌లో మిథిల, యుపిలో పూర్వాంచల్‌, లాంటి మరిన్ని డిమాండ్‌లు తెరమీదకు వస్తున్నాయి.    

కృత‌జ్ఞత‌లు తెలిపిన కెసిఆర్‌

  తెలంగాణ ఏర్పాటుకు ముందుకు వ‌చ్చినందుకు గాను కాంగ్రెస్ పార్టీకి ప్రముఖంగా సోనియా గాంధికి, ప్రదాని మ‌న్మోహ‌న్ సింగ్‌కు కృత‌జ్ఞత‌లు తెలియ‌జేశారు. దీంతో పాటు ఉద్యమంలో త‌న‌తో పాటు క‌లిసి న‌డిచిన క‌వులు క‌ళాకారులు నాయ‌కులు, పాత్రికేయ‌ల‌కు కూడా త‌న కృత‌జ్ఞత‌లు తెలియ‌జేశారు. త‌రువాత తెలంగాణ ఏర్పాటును అందుకు కాంగ్రెస్ సూచించిన అన్ని మార్గాల‌ను స్వాగ‌తించిన కెసిఆర్ ఉమ్మడి రాజ‌ధాని విష‌యం అన్న విష‌యంలో మాత్రం కాంగ్రెస్ నుంచి మరింత క్లారిటీ రావాల‌ని కోరారు. దీంతో పాటు ఇప్పటితో మ‌న పని అయిపోయిన‌ట్టుకాదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వ‌ర‌కు ప్రతి తెలంగాణ వాది అప్రమ‌త్తంగా ఉండాల‌ని పిలుపునిచ్చారు. దీంతో పాటు తెలంగాణ ఏర్పడిన ప‌క్షంలో టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్‌లో క‌లుపుతాను అన్న మాట‌ను కూడా కెసిఆర్ ప్రస్థావించారు. ఇప్పుడే అంతదూరం ఆలొచించాల్సిన అవ‌స‌రం లేద‌న్న కెసిఆర్, పార్లమెంట్‌లో బిల్లు పాస్ అయిన త‌రువాత త‌ప్పుకుండా ఆ విష‌యం గురించి ప్రక‌ట‌న చేస్తామ‌న్నారు. తెలంగాణ సాదనే కాదు తెలంగాణ పున‌ర్మిమాన ప్రక్రియ‌లో కూడా టిఆర్ఎస్ చురుకైన పాత్ర పోషిస్తుంద‌ని ప్రక‌టించారు.

సీమాంద్రలో పంచాయితీ డౌట్‌

  కేంద్ర తెలంగాణ ప్రక‌ట‌న నేప‌ధ్యంలో సీమాంద్రలో నిర‌స‌న‌లు హోరెత్తుతున్నాయి. ఇప్పటికే ప‌లువురు ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాగా మ‌రి కొంత మంది అదే బాట‌లో న‌డ‌వ‌డానికి రెడీ అవుతున్నారు. ప‌లు జేఎసికి సంబందించిన నాయ‌కులు బంద్‌కు పిలుపు నిచ్చారు దీంతో రేపు సీమాంద్ర ప్రాంతంలో జ‌ర‌గాల్సిన పంచాయితీ మూడో ద‌శ ఎల‌క్షన్లపై ఆ ప్రభావం ప‌డ‌నుంది. ప‌లు సీమాంద్ర జిల్లాల్లో రేపు చివ‌రి ద‌శ పంచాయితీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌ధ్యంలో సీమాంద్ర నాయ‌కులు ఎన్నిక‌లను బ‌హిష్కరించాల్సిందిగా పిలుపునివ్వగా, చాలా మంది టీచ‌ర్లు త‌మ విధుల‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణయించుకున్నారు. దీంతో రేపు సీమాంద్రలో జ‌ర‌గాల్సిన పంచాయితీ ఎన్నిక‌ల‌పై స్పష్టత రావాల్సి ఉంది.

సీమాంద్రలో రాజీనామాలు షురూ

  తెలంగాణ పై తేల్చేసిన కాంగ్రెస్ పై సొంతం పార్టీ నాయ‌కులే భ‌గ్గుమంటున్నారు. తమ అభిప్రాయాల‌కు ఏ మాత్రం విలువ నివ్వకుండా ఏక‌ప‌క్షంగా తెలంగాణపై నిర్ణయం తీసుకున్న అధిష్టానంపై సీమాంద్ర నాయ‌కులు ఫైర్ అవుతున్నారు. ఈ సంప్రదింపుల‌కు ముందే రాజీనామ చేసిన వీర‌శివారెడ్డి సీమాంద్రలో హీరో కాగా ఇప్పుడు మ‌రింత మంది నేత‌లు అదే బాట‌లో న‌డ‌వ‌నున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఉన్న తుల‌సిరెడ్డి త‌ను అధ్యక్షునిగా ఉన్న 20 సూత్రాల ప్రణాలిక క‌మిటీకి రాజీనామ చేశారు. ఆయ‌న‌కు మ‌రింత బ‌లం చేకూరుస్తూ ఎమ్మేల్యేలు స‌తీష్‌కుమార్‌, ఆదినారాయ‌ణ‌రెడ్డి, తోట త్రిమూర్తులు రాజీనామ చేశారు. వీరితో పాటు ఎంపి రాయ‌పాటి సాంబ‌శివ‌రావు కూడా రాజీనామ‌కు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే సీమాంద్ర జేఎసి బంద్‌కు పిలుపు నివ్వగా ఆ బంద్‌ను 72 గంట‌ల పాటు కొన‌సాగించాల‌ని భావిస్తున్నారు. దీనికి తోడు స‌మైక్యాంద్ర జేఎసి విద్యార్దులు ఆమ‌ర‌ణ నిర‌హార దీక్షకు కూడా దిగారు. అయితే రేపు స‌మావేశం కానున్న సీమాంద్ర నాయ‌కులు మూకుమ్మడి రాజీనామాల‌కు రెడీ అవుతున్నట్టుగా స‌మాచారం.