మోడీకి అంత సీను లేదు: బీజేపీ నేత జోషి

  బీజేపీ నరేంద్ర మోడీని తమ ప్రధాన మంత్రి అభ్యర్ధిగా ప్రకటించిన తరువాత నుండే ఆ పార్టీకి దేశంలో మంచి ఊపు వచ్చింది. నాటి నుండి నేటి వరకు మోడీ విస్తృతంగా చేస్తున్న ప్రచారం వలన నానాటికి ఆయన రేటింగ్, దానితో బాటే పార్టీ రేటింగ్ కూడా బాగా పెరిగింది. ఇది కాంగ్రెస్ నేతలు కూడా కాదనలేని సత్యం. అయితే ఆయన కోసం తన వారణాసి సీటుని వదులుకోవలసివచ్చిన మురళీ మనోహర్ జోషీ మాత్రం అలా భావించడం లేదు. దేశంలో అందరూ చెప్పుకొంటున్నట్లు మోడీ ప్రభంజనమేమీ లేదని అధికేవళం బీజేపీ ప్రభంజనమని దాని వలన మోడీయే లబ్ది పొందుతున్నారని అన్నారు. అంతే కాక మోడీ కేవలం పార్టీలో ఒక ముఖ్యమయిన పదవికి ఎంపిక చేయబడిన వ్యక్తి మాత్రమేనని అన్నారు. ఈ ఎన్నికలలో ఎలాగయినా విజయం సాధించి కేంద్రంలో అధికారం హస్తగతం చేసుకోవాలని బీజేపీ ఉవ్విళ్ళూరుతుంటే, ఇటువంటి అతి కీలకమయిన సమయంలో స్వంత పార్టీకి చెందిన మురళీ మనోహర్ జోషీ వంటి సీనియర్ నేతే వ్యక్తిగత కారణాలతో మోడీకి అంత సీను లేదని కించపరుస్తూ మాట్లాడటం వలన పార్టీకే కాదు, ఆయనకీ నష్టమే కలిగిస్తుంది. ప్రత్యర్ధ కాంగ్రెస్ పార్టీని డ్డీ కొనవలసిన ఈ తరుణంలో ఆయన స్వంత పార్టీ ప్రధాని అభ్యర్ధి మీదే బాణాలు ఎక్కుపెడితే అందుకు కాంగ్రెస్ కూడా చాలా సంతోషిస్తుంది.

సోనియాగాంధీకి ముద్దు : వెల్లువెత్తిన విమర్శలు

  ముస్లింలు కాంగ్రెస్ పార్టీ వెంటే వున్నారు. వాళ్లు సోనియాగాంధీని ఎంతో ఇష్టపడుతున్నారన్న కలరింగ్ ఇవ్వడం కోసం కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ చేసిన ఒక చీప్ ట్రిక్‌కి దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్నామధ్య సోనియాగాంధీ కర్నాటకలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు. అక్కడ ఆమె తన సెక్యూరిటీ సిబ్బంది నుంచి దూరంగా వెళ్ళిపోయి జనంలో కలిసిపోయారు. మహిళలు ఆమెను ఎంతగానో ఆదరించారు. అప్పుడు కొంతమంది ముస్లిం మహిళలతో సోనియాగాంధీ ముచ్చటిస్తూ వుండగా, ఒక ముస్లిం అమ్మాయి సోనియాగాంధీకి ముద్దు పెట్టేసింది. అక్కడే వున్న మిగతా ముస్లిం మహిళలు ఈ దృశ్యాన్ని ఆనందంగా గమనిస్తున్నారు. ముస్లిం యువతి చేత ముద్దు పెట్టించుకున్న సోనియా కూడా సంతోషించారు. దీనిని ఎవరో ఫొటో తీస్తే ఆ ఫొటోని దిగ్విజయ్ సింగ్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. అయితే ఇది చూడటానికి మామూలుగా అనిపించవచ్చుగానీ, ఇది దేశంలోని ముస్లింలను ఆకట్టుకోవడానికి, వారి ఓట్లు కొల్లగొట్టడానికి కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ చేసిన ఒక ట్రిక్ అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓట్లకోసం దేనికైనా దిగజారే కాంగ్రెస్ పార్టీ దిగజారుడు తనానికి ఇది ఒక ఉదాహరణ అని కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ పక్షాలు విమర్శిస్తున్నాయి.

విమాన ప్రమాదం : మాయావతి బతికిపోయింది!

  ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన సమాజ్ పార్టీ నాయకురాలు మాయావతికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో వున్న మాయావతి ఒక చార్టర్ ఫ్లయిట్ ఉపయోగిస్తున్నారు. ఆదివారం నాడు మాయావతి మహారాష్ట్రలో ప్రచారం ముగించుకుని విమానంలో లక్నోకి తిరిగి వచ్చారు. ఆమె ప్రయాణిస్తున్న ఫ్లయిట్ లక్నో ఎయిర్‌పోర్ట్ లో లాండ్ అయ్యే సమయంలో విమానం ముందు చక్రం తెరుచుకోలేదు. దాంతో విమానం పైలెట్ విమానాశ్రయ అధికారులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే విమానాశ్రయంలో ఎమర్జెన్సీ లాండింగ్‌కి సన్నాహాలు చేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే మాయావతిని కాపాడటానికి అంబులెన్స్ ని కూడా రన్ వే దగ్గరకి పిలిపించారు. చివరికి పైలెట్ విమానాన్ని సేఫ్‌గా లాండ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

పిల్లల బుర్రతిన్న హేమమాలిని: కేసు నమోదు

  మధుర పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీలో వున్న బాలీవుడ్ నటి హేమమాలిని మీద ఎన్నికల అధికారులు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేశారు. మధురలోని ఓ విద్యాలయంలో హేమమాలిని ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ ప్రసంగం చేశారు. నియోజకవర్గంలో ప్రచారానికి హేమమాలిని అనుమతి తీసుకున్నప్పటికీ స్కూల్‌లో ప్రసంగించడానికి మాత్రం అనుమతి తీసుకోలేదు. తమ స్కూలుకి వచ్చిన హేమమాలినిని చూసి సదరు స్కూలు పిల్లలు ఆనందించినప్పటికీ, ఆమె ప్రసంగం ఒక్క ముక్క కూడా అర్థంకాక నోళ్ళు వెళ్ళబెట్టారు. స్కూలు పిల్లల దగ్గర రాజకీయ ప్రసంగం చేసిన హేమమాలిని మీద ఎన్నికల అధికారులు కేసు నమోదు చేశారు.

కేసిఆర్ కి రాములమ్మ తిట్లు, శాపనార్ధాలు

      టీఆర్ఎస్ అధినేత కేసిఆర్ పైన కాంగ్రెస్ మెదక్ శాసనసభ అభ్యర్ధి విజయశాంతి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. కేసిఆర్ కు మోసం చేయడం తప్ప పరిపాలించడం చేతకాదని అన్నారు. ఓటమి భయంతోనే కెసిఆర్ మహబూబ్ నగర్ నుంచి మెదక్ పార్లమెంట్ స్థానానికి వచ్చారన్నారు. తెరాసకు అధికారమిస్తే దోచుకుతింటుందన్నారు. తెరాస దొరల పార్టీ అని, బడుగు, బలహీన వర్గాలకు ఆ పార్టీ వ్యతిరేకమని అన్నారు. తెలంగాణ వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కెసిఆర్ మాట తప్పారన్నారు. తెరాస దోపిడీ దొంగల పార్టీ, మోసం చేయడం వారి నైజం, కెసిఆర్ మాటల మరాఠి, ఆయనకు అధికారం అప్పగిస్తే కుటుంబ పాలననే కొనసాగిస్తారని విమర్శించారు.

ఆమ్‌ ఆద్మీ నాయకులని చావగొడుతున్నారు

  ఎన్నికల ప్రచారంలో వున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్‌కి ఎక్కడకి వెళ్ళినా చెంపదెబ్బలు పడుతూనే వున్నాయి. ఈ కొట్టుడు కార్యక్రమం కేజ్రీవాల్‌తో మాత్రమే ఆగటం లేదు. ఆయన పార్టీ కార్యక్తలకు కూడా తన్నులు పడుతున్నాయి. ఈ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షాజియా ఇల్మి మధ్యప్రదేశ్‌లోని కమల్ చౌక్ అనే ప్రాంతంలో ప్రచారం చేస్తుండగా కొంతమంది రాళ్ళతో దాడులు చేసి బుర్ర పగిలేలా చేశారట. రాళ్లు విసిరినవారు మోడీకి మద్దతుగా, కేజ్రీవాల్‌కి అనుకూలంగా నినాదాలు చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు చెబుతున్నప్పటికీ దీనిని ఎవరూ నమ్మడం లేదు. అలాగే బీహార్‌లోని నలందా లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆప్ అభ్యర్థి ప్రణబ్ ప్రకాష్ మీద కూడా దాడి జరిగింది. కారులో వెళ్తున్న ఆయన్ని కొంతమంది కారులోంచి బయటకి లాగి లాఠీతో ఎడాపెడా కొట్టి పారిపోయారట. ఈ సంఘటనలో ప్రణబ్ ప్రకాష్ తీవ్రంగా గాయపడ్డాడట. ఈ రాజకీయాలేంటో.. ఈ చావగొట్టుకోవడాలేంటో!

మోడీకి మద్దతు : పవన్, నాగ్‌కి రజనీకాంత్ షాక్!

  స్టార్ అంటే ఎలా వుండాలో, ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో రజనీకాంత్‌ని చూసి నేర్చుకోవాలి. ఎన్నో సందర్భాలలో ఎందరికో మార్గదర్శకుడిలా నిలిచిన రజనీకాంత్ ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కి, అక్కినేని నాగార్జునకి స్టార్ అంటే ఎలా వుండాలో చెప్పకనే చెప్పేశాడు. దేశంలో మోడీ ప్రభంజనం వీస్తూ వుండటంతో తెలుగులో టాప్ స్టార్స్ అయిన పవన్ కళ్యాణ్, నాగార్జున గబగబా నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్ తీసుకుని, గుజరాత్‌కి వెళ్ళి మోడీని కలుసుకుని, కౌగిలించుకుని వచ్చారు. మోడీకే మా మద్దతు అని ప్రకటించారు. అలాగే రజనీకాంత్‌కి కూడా మోడీ నచ్చాడు. మోడీకి మద్దతు ఇవ్వాలని ఆయనకి అనిపించింది. అయితే రజనీకాంత్ గబగబా మోడీ దగ్గరకి పరిగెత్తుకుంటూ వెళ్ళలేదు... తెలివిగా ఆలోచించి, తన స్టార్‌డమ్‌కి తగిన పని చేశాడు. మోడీనే తన దగ్గరకి వచ్చేలా చేసుకున్నాడు. దేశమంతా మోడీ వైపు చూస్తుంటే, మోడీని కలవాలని దేశంలోని ప్రముఖులందరూ ప్రయత్నిస్తుంటే మోడీ స్వయంగా చెన్నై వెళ్ళి రజనీకాంత్‌ని కలిశారు చూశారా.. అదీ స్టార్‌డమ్ అంటే. ఇదిలా వుంటే, రజనీకాంత్‌లాగా మా హీరో ఎందుకు తన స్టార్‌డమ్‌ని చూపించలేకపోయాడని పవన్ కళ్యాణ్, నాగార్జున అభిమానులు ఫీలవుతున్నారు. ఈ అంశం సదరు హీరోల అభిమానులకు మాత్రమే కాదు.. హీరోలకు కూడా షాక్ ఇచ్చి వుండవచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

విజయవాడ ఎంపీ టిక్కెట్ : పవన్ కళ్యాణ్ మనస్తాపం?

  విజయవాడ తెలుగుదేశం ఎంపీ టిక్కెట్ వ్యవహారం పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ని మనస్తాపానికి గురిచేసినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీ పెట్టడానికి, బహిరంగ సభలు నిర్వహించడానికి వెన్నుదన్నుగా నిలిచిన పొట్లూరి ప్రసాద్‌కి విజయవాడ ఎంపీ తెలుగుదేశం టిక్కెట్ ఇప్పించడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నించాడు. చంద్రబాబు నాయుడు కూడా దీనికి సానుకూలంగా స్పందించాడు. అప్పటి వరకూ విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వున్న కేశినేని నానిని పక్కన పెట్టి పొట్లూరి ప్రసాద్‌కి టిక్కెట్ ఇవ్వడానికి అంగీకరించారు. అయితే చంద్రబాబు నిర్ణయం కేశినేని నానితోపాటు స్థానిక తెలుగుదేశం కార్యకర్తలకు రుచించలేదు. చంద్రబాబు సరైన నిర్ణయం తీసుకోలేదని బహిరంగంగానే విమర్శించడం ప్రారంభించారు. కేశినేని నాని కూడా నిరసన గళాన్ని వినిపించడం, రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తాననే ‘సౌండ్’ ఇవ్వడంతో సదరు సీటు కేశినేని నానికే ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు సమాచారం. అయితే ఈ ఇష్యూలో విజయవాడ తెలుగుదేశం కార్యకర్తలు పవన్ కళ్యాణ్‌ని ఘాటుగా విమర్శించారు. మధ్యలో దూరిపోయి కేశినేని నానికి అన్యాయం చేయడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. టోటల్‌గా ఈ ఇష్యూలో పవన్ కళ్యాణే ముద్దాయిలా నిలిచాడు. దీంతో పవన్ కళ్యాణ్ మనస్తాపానికి గురైనట్టు తెలిసింది. పొట్లూరి ప్రసాద్‌కి టిక్కెట్ ఇస్తున్నట్టు ప్రకటించడానికి ముందే స్థానిక తెలుగుదేశం క్యాడర్‌ని ఒప్పించి ఉంటే ఇంత రాద్ధాంతం జరిగి వుండేది కాదని పవన్ కళ్యాణ్ తన సన్నిహితుల దగ్గర వాపోయినట్టు తెలుస్తోంది.

కేశినేని నానికే విజయవాడ ఎంపీ టిక్కెట్!

  కేశినేని నానికే విజయవాడ పార్లమెంట్ స్థానానికి టీడీపి టిక్కెట్ ఖారారు అయ్యే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. ఈ స్థానం నుంచి వ్యాపారవేత్త పొట్లూరి ప్రసాద్‌కి టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన వత్తిడి మేరకు ఆయనకు టిక్కెట్ ఇవ్వాలని బాబు భావించారు. అయితే ఎప్పటి నుంచో విజయవాడ టీడీపీ అభ్యర్థిగా అందరూ భావిస్తున్న కేశినేని నానికి ఈ నిర్ణయంతో షాక్ తగిలింది. అయితే ఆయన దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. విజయవాడ స్థానం నుంచే పోటీ చేస్తానని భీష్మించారు. ఆయనకు సర్ది చెప్పాలని బాబు ప్రయత్నించినప్పటికీ కేశినేని నాని దారిలోకి రాలేదు. రెబల్ అభ్యర్థిగా బరిలో నిలబడే అవకాశాలు కనిపించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కేశినేని నానినే విజయవాడ స్థానం నుంచి పోటీ చేయించాలని చంద్రబాబు నిర్ణయించినట్టు తెలుస్తోంది.

మోడీ భార్యకి భారతరత్న ఇవ్వాలి: కాంగ్రెస్ లీడర్ వెటకారం

బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వైవాహిక జీవితం మీద కాంగ్రెస్ నాయకుల దాడి నాన్‌స్టాప్‌గా కొనసాగుతోంది. స్వయానా రాహుల్ గాంధీ కూడా నిన్నటి వరకూ దాడి చేసి, సదరు దాడి తనమీదే రివర్స్ అవుతూ వుండటంతో నోరు మూసుకున్నాడు. అయితే మిగతా కాంగ్రెస్ నాయకులు మాత్రం మోడీ మీద మాటల తూటాలు వదులుతూ పైశాచిక ఆనందాన్ని ప్రదర్శిస్తున్నారు. తాజాగా అస్సాం ముఖ్యమంత్ర తరుణ్ గొగోయ్ బోలెడంత వెటకారంతో కూడిన ప్రకటన చేశాడు. ‘మోడీ తనను ఎంతమాత్రం పట్టించుకోకపోయినా ఆమె ఎంతో ఓర్పుగా ఉన్నారు. సహనానికి ప్రతీకగా తన బాధని భరిస్తున్నారు. అంచేత నేను మోడీ భార్యకి ‘సహనం’ విభాగంలో భారతరత్న ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నాను’ అన్నారు. యశోదాబెన్‌కి భారతరత్న ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి హాదాలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయబోతున్నట్టు తరుణ్ గొగోయ్ ప్రకటించాడు. సహనం విషయంలో యశోదాబెన్ భారతదేశానికి మాత్రమే కాదు.. యావత్ ప్రపంచానికీ ఆదర్శం అని గొగోయ్ అన్నాడు.

ప్రియాంకకి పిన్ని వార్నింగ్!

      వరుణ్‌గాంధీ బీజేపీ నాయకుడు. మొన్నీమధ్య రాహుల్ గాంధీ నియోజకవర్గంలో అభివృద్ధి బాగా జరిగిందని నోరుజారి చెప్పి తన తల్లిచేత తలంటు పోయించుకున్నాడు. పాపం ఇతనేమో రాహుల్ గురించి పాజిటివ్‌గా మాట్లాడితే, ప్రియాంక మాత్రం అతని గురించి వెటకారంగా మాట్లాడింది. ‘‘వరుణ్‌గాంధీ నా సోదరుడు. కానీ, పాపం అతనికి బొత్తిగా లోకజ్ఞానం లేదు. తప్పు దారిలో నడుస్తున్న అతన్ని మంచి మార్గంలో నడిపించాల్సిన అవసరం వుంది’’ అని సోనియాగాంధీ గారాలపట్టి ప్రియాంక చేసిన కామెంట్లను వరుణ్ గాంధీ తల్లి, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ తీవ్రంగా ఖండించడంతోపాటు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. ‘‘వరుణ్ తప్పు దోవలో నడుస్తుంటే, దేశమే అతన్ని సరైన దారిలో నడిపిస్తుంది. నీ సలహాలు అవసరం లేదు’’ అని మేనక స్పందించారు.

బీజేపీకి ప్రచారం : ఆలోచించి చెప్తానన్న పవన్ కళ్యాణ్

  పవన్ కళ్యాణ్‌జీ ఎన్నికల ప్రచారానికి రండి.. బీజేపీని బలపర్చండి అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పవన్ కళ్యాణ్‌ని సోమవారం స్వయంగా కలసి ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు కర్ణాటకలో కూడా పార్టీకి ప్రచారం చేయాల్సిందిగా కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కిషన్ విజ్ఞప్తిని విన్న పవన్ కళ్యాణ్ తన సన్నిహితులతో ఈ విషయం మీద చర్చించి రెండు రోజుల్లో ప్రచారం విషయంలో నిర్ణయం తీసుకుంటానని కిషన్‌రెడ్డికి చెప్పినట్టు తెలుస్తోంది. నరేంద్రమోడీ విధానాలు నచ్చిన పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతు ఇచ్చారని, త్వరలో ప్రచారం చేస్తారని భావిస్తున్నామని అన్నారు. పవన్ చేసే ప్రచారం బీజేపీతోపాటు తెలుగుదేశం పార్టీకి కూడా ఉపయోగపడే అవకాశం వుందని ఆయన అన్నారు.

మోడీ పెళ్ళి ఇష్యూ: ఎవరికి ఎంతమంది భార్యలు?

      బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ తనకు పెళ్ళి అయిన విషయం తాను స్వయంగా ప్రకటించలేదని, సొంత భార్య విషయమే బయటపెట్టని వ్యక్తి దేశానికి ఏం న్యాయం చేస్తాడని ఇటు యుపిఎ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్‌తోపాటు యుపిఎ మిత్రపక్ష పార్టీలు మోడీమీద దాడి మొదలుపెట్టాయి. ఈ దాడిని బీజేపీ వర్గాలు సమర్థంగా తిప్పికొడుతున్నాయి.   మోడీ వ్యక్తిగత జీవితం, ఎప్పుడూ చిన్నప్పుడు జరిగిన పెళ్ళి విషయాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తున్న పార్టీలకు బీజేపీ నాయకులు కీలెరిగి వాత పెడుతున్నారు. ఉత్తరభారదేశంలో దీనికి టిట్ ఫర్ టాట్ అని రియాక్ట్ అవుతున్నారు. ఉత్తరభారతదేశంలో ఈ అంశం మీద బీజేపీ అతికిస్తున్న వాల్ పోస్టర్లు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఆ వాల్ పోస్టర్లలో యుపిఎ భాగస్వామ్య పార్టీల్లో ఎవరికి ఎంతమంది భార్యలున్నారో ప్రకటించారు. ఈ వాల్ పోస్టర్‌లో ప్రధానంగా జవహర్ లాల్ నెహ్రూ విదేశీ వనితకు ముద్దు పెడుతున్న ఫొటో వుంది. అలాగే భార్యల లిస్టు విషయానికి వస్తే దిగ్విజయ్ సింగ్‌కి, ములాయం సింగ్ యాదవ్‌కి ఇద్దరేసి భార్యలు వున్నారట. శశి థరూర్‌కి ముగ్గురు భార్యలు. సమాజ్ వాది పార్టీ నాయకుడు ఆజమ్‌ఖాన్‌కి మొత్తం ఆరుగురు భార్యలున్నారు. ఇంతమంది భార్యలున్న వీళ్ళు బెటరా? దేశానికి సేవ చేయడం కోసం వైవాహిక జీవితాన్ని వదులకున్న మోడీ బెటరా అనే అర్థం వచ్చేలా ఆ పోస్టరుంది. ఈ పోస్టర్ మీద యుపిఎ భాగస్వామ్య పార్టీకు కిక్కురుమనడం లేదు.

పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ కలుస్తారా?

      పవన్ కళ్యాణ్ కళ్యాణాల హిస్టరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా వుంటుంది. ప్రేమించి పెళ్ళాడిన నందినికి దూరమైన పవన్ కళ్యాణ్ తనతో ‘బద్రి’లో నటించిన రేణూ దేశాయ్‌కి చేరువయ్యాడు. ఆ తర్వాత నందినికి విడాకులిచ్చేశాడు. రేణూ దేశాయ్‌తో కొంతకాలం సహజీవనం, మరికొంతకాలం వైవాహిక జీవితం గడిపి, ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. కాలక్రమేణా రేణూ దేశాయ్‌తో వైవాహిక జీవితాన్ని ముగించేసి, ‘సెటిల్’ చేసుకున్నాడు.   ఇప్పుడొక విదేశీయురాలిని పెళ్ళాడాడు. ఈ హిస్టరీ ఇలా వుంటే, పవన్ కళ్యాణ్ నుంచి దూరమైపోయి తన స్వస్థలమైన పూణే వెళ్ళిపోయిన రేణు దేశాయ్ ఒక హిందీ సినిమాకి దర్శకత్వం వహిస్తూ బిజీగా వున్నారు. అయితే  తాజాగా రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్‌కి చేరువ కావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆమె తన ఫేస్ బుక్ అకౌంట్లో పవన్ కళ్యాణ్ గురించి చేసిన పాజిటివ్ కామెంట్లు దీనికి బలాన్నిస్తున్నాయి. రేణు దేశాయ్ పవన్ గురించి ఫేస్ బుక్‌లో చేసిన కామెంట్లు చాలా ఆసక్తికరంగా వున్నాయి. పవన్ కళ్యాణ్ చాలా ఉన్నత ఆశయాలున్న వ్యక్తి అట. పవన్ కళ్యాణ్ ప్రజలకు ఏదైనా చేయాలని నిరంతరం తపించే వ్యక్తి అట. తమమధ్య అభిప్రాయ భేదాలు వుండటం, వాటివల్ల తాము విడిపోవడం జరిగినప్పటికీ, పవన్ కళ్యాణ్ అంటే తనకెంతో గౌరవమట. రేణు దేశాయ్ సడన్‌గా ఇలా పబ్లిగ్గా పవన్ కళ్యాణ్‌ని పొగడ్డం చూస్తుంటే వీరిద్దరూ మళ్ళీ చేరువవుతారేమోనన్న సందేహాలు కలుగుతున్నాయి.

విజయవాడలో లగడపాటి పోటీ?

      రాష్ట్రం విడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, మళ్ళీ ఎన్నికలలో పోటీ చేయబోనని ప్రకటించిన విజయవాడ సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఇప్పటి వరకూ తన ప్రతిజ్ఞకే కట్టుబడి వున్నారు. రాజకీయాల నుంచి తప్పుకున్నానని ప్రకటించినప్పటికీ కిరణ్ కుమార్ నాయకత్వంలోని జై సమైక్యాంధ్ర పార్టీలో లగడపాటి చురుకైన పాత్ర నిర్వహిస్తున్నారు.   తాజాగా లగడపాటి విజయవాడ స్థానం నుంచి  పోటీ చేయాలని ఆయనపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతున్నట్టు తెలుస్తోంది. సీమాంధ్రలో జై సమైక్యాంధ్ర పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగా వుంది. అసెంబ్లీ స్థానాల నుంచి కొంతమంది అభ్యర్థులు గెలిచే అవకాశం వున్నప్పటికీ పార్లమెంట్ స్థానాల నుంచి గెలిచే సత్తా వున్న వ్యక్తులు ఆ పార్టీకి కొరవడ్డారు. ఆ సత్తా వున్న ఒకే ఒక వ్యక్తి లగడపాటి రాజగోపాల్ అస్త్రసన్యాసం చేసి పోటీకి దూరంగా వున్నారు. మరోవైపు విజయవాడలోని లగడపాటి అనుకూల వర్గం కూడా లగడపాటి మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయంలో వున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో వాళ్ళు ఎప్పటి నుంచో లగడపాటి మీద ఒత్తిడి తెస్తున్నప్పటికీ లగడపాటి సానుకూలంగా స్పందించనట్టు సమాచారం. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో విజయవాడ పార్లమెంటు సీటుకు సంబంధించిన వివాదం ముదిరిపోవడంతో అక్కడ ఆ పార్టీ విజయావకాశాలు సన్నగిల్లాయి. ఇలాంటి పరిస్థితుల్లో విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి లగడపాటి సునాయాసంగా గెలిచే అవకాశాలున్నాయని జై సమైక్యాంధ్ర పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే సీమాంధ్రలో కీలకమైన పార్లమెంట్ స్థానాన్ని జేసీపీ గెలుచుకున్నట్టయితే పార్టీ ప్రతిష్ట పెరిగే అవకాశం వుందని అనుకుంటున్నారు. లగడపాటి  తన ఒట్టును గట్టుమీద పెట్టి విజయవాడ నుంచి పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. లగడపాటి తన నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలని కోరుతున్నారు. లగడపాటి కూడా విజయవాడ నుంచి మళ్ళీ పోటీ చేయడానికి సానుకూలంగానే వున్నారని జేసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.

తెదేపా సీమాంధ్ర అభ్యర్ధుల జాబితా

  తెలుగు దేశం పార్టీ తన సీమాంధ్ర అభ్యర్థుల మూడో జాబితాను కూడా ఈరోజు ఉదయం విడుదల చేసింది. అందులో 3 లోక్‌సభ మరియు 32 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. టీడీపీ లోక్‌సభ అభ్యర్ధులు అనకాపల్లి - అవంతి శ్రీనివాస్ కాకినాడ - తోట నర్సింహం అమలాపురం - పి.రవీంద్రబాబు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులు హిందూపురం - బాలకృష్ణ, భీమిలి - గంటా శ్రీనివాసరావు, కర్నూలు - టీజీ వెంకటేశ్, పాణ్యం - ఏరాసు ప్రతాప్‌రెడ్డి, పాతపట్నం - శత్రుచర్ల విజయరామరాజు, నంద్యాల - శిల్పామోహన్‌రెడ్డి, అవనిగడ్డ-మండలి బుద్ధ ప్రసాద్, విజయవాడ సెంట్రల్-బీ.ఉమామహేశ్వర రావు, ఆచంట-పితాని సత్యనారాయణ, సత్తెనపల్లి-కోడెల శివ ప్రసాద్,   పలాస - జీ.యన్.యన్. శివాజీ,  శ్రీకాకుళం - లక్ష్మీదేవి, నర్సన్నపేట -బీ. రమణమూర్తి,  పార్వతీపురం - చిరంజీవులు, గజపతినగరం - కేఏ నాయుడు, విశాఖ సౌత్ - వాసుపల్లి గణేష్, గాజువాక - పల్లా శ్రీనివాసరావు, అనకాపల్లి - పిలా గోవింద్, యలమంచిలి - పంచకర్ల రమేష్‌బాబు   పాయకరావుపేట - అనిత, రాజంపేట - మల్లికార్జునరెడ్డి, నందికొట్కూరు - లబ్బి వెంకటస్వామి, ఆళ్లగడ్డ - గంగుల ప్రభాకర్‌రెడ్డి, శ్రీశైలం - శిల్పా చక్రపాణి రెడ్డి, డోన్ - కేఈ ప్రతాప్, పత్తికొండ - కేఈ కృష్ణమూర్తి, మడకశిర - ఎం వీరన్న,  రైల్వే కోడూరు - వెంకటసుబ్బయ్య, కాకినాడ సిటీ-వీ.వెంకటేశ్వర రావు( కొండబాబు), బాపట్ల-అన్నం సతీష్, గుంటూరు (పశ్చిమం)-మాడుగుల వేణుగోపాల్ రెడ్డి

కేశినేని నానికి చంద్రబాబు టిక్కెటిస్తారా..!

      విజయవాడ టిడిపి పార్లమెంట్ సీటుపై ఉత్కంఠ నెలకొంది. విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేది తానేనని ధీమాగా వున్న కేశినేని నానికి చివరి నిమిషంలో పారిశ్రామికవేత్త పొట్లూరి వర ప్రసాద్ పేరు తెరపైకి రావడంతో ఆ వర్గంలో కలవరం మొదలైంది. విజయవాడ లోక్‌సభ సీటును తనకే కేటాయిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని, ఇవ్వకపోయినా తాను విజయవాడ నుంచే పోటీ చేస్తానని కేశినేని నాని స్పష్టం చేశారు. టీడీపీ సభ్యుడే కాని పొట్లూరికి ఏ విధంగా టికెట్ కేటాయిస్తారని ప్రశ్నించారు. పవన్‌కల్యాణే పీవీపీకి టికెట్ ఇవ్వాలని చంద్రబాబును పట్టుబడుతున్నారని వస్తున్న వార్తలను.. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఖండించాలని నాని కోరారు. పైసా డబ్బులు లేని వాళ్లకు కూడా అసెంబ్లీ టిక్కెట్లు కేటాయించిన చంద్రబాబు, ఎలాంటి ఒత్తిళ్లకు లొంగరని తప్పకుండా తనకే లోక్ సభ టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు చంద్రబాబును కలిసేందుకు కేశినేని నాని ఈ రోజు ఉదయం ఆయన నివాసానికి వెళ్లారు. అయితే చంద్రబాబు అందుబాటులో లేకపోవటంతో నాని వెనుదిరిగారు. ఓ గంట తర్వాత నాని బాబును కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

సీమాంధ్ర కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితా

  లోక్ సభ అభ్యర్ధులు: శ్రీకాకుళం - కిల్లి కృపారాణి, విజయనగరం - బొత్స ఝాన్సీ, అరకు - కిషోర్ చంద్రదేవ్, ఒంగోలు - దర్శి పవన్ కుమార్, నర్సాపురం - కనుమూరి బాపిరాజు, అమలాపురం - బుచ్చి మహేశ్వర రావు, ఏలూరు - నాగేశ్వర రావు, గుంటూరు - షేక్ వహీద్, బాపట్ల - పనబాక లక్ష్మి, తిరుపతి – చింతామోహన్, కాకినాడ - పల్లం రాజు, అమలాపురం - బుచ్చిమహేశ్వర రావు, రాజమండ్రి - కందుల దుర్గేష్, విజయవాడ - దేవినేని అవినాష్, నెల్లూరు - వాకాటి నారాయణ రెడ్డి, రాజంపేట – సాయిప్రతాప్, హిందూపురం - చిన వెంకట్రాముడు, నంద్యాల – బి.వై రామయ్య, కర్నూలు - కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, నరసరావుపేట - కాసు కృష్ణా రెడ్డి. శాసన సభ అభ్యర్ధులు: నూజివీడు - చిన్నం రామకోటయ్య, గుడివాడ - అట్లూరి సుబ్బారావు, పామర్రు - డి.వై.దాస్‌, విజయవాడ వెస్ట్ - వెలంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ సెంట్రల్‌ - మల్లాది విష్ణువర్థన్‌రావు, విజయవాడ ఈస్ట్ - దేవినేని రాజశేఖర్‌, మైలవరం - ఆప్పసాని సందీప్‌, నందిగామ - బోడపాటి బాబూరావు, జగ్గయ్యపేట - వేముల నాగేశ్వరరావు.   పెదకూరపాడు - పక్కల సూరిబాబు, తాడికొండ - చల్లగాలి కిషోర్‌, మంగళగిరి - కాండ్రు కమల, పొన్నూరు - తేళ్ల వెంకటేష్‌ యాదవ్, వేమూరు - రేవెండ్ల భరత్‌బాబు,రేపల్లె - మోపిదేవి శ్రీనివాసరావు, అమలాపురం - జంగా గౌతమ్‌, రాజోలు - సరెళ్ల విజయ ప్రసాద్‌, గన్నవరం - పాముల రాజేశ్వరీ దేవి, కొత్తపేట - ఆకుల రామకృష్ణ, మండపేట - కామన ప్రభాకరరావు   రాజానగరం - అంకం నాగేశ్వరరావు, రాజమండ్రి రూరల్ - శ్రీమతి రాయుడు రాజవెల్లి, జగ్గంపేట - తోట సూర్యనారాయణ మూర్తి, గుంటూరు ఈస్ట్ - ఎస్‌కే మస్తాన్ వలీ, చిలకలూరిపేట - ఎం. హనుమంతరావు, నరసరావుపేట - కాసు మహేష్‌రెడ్డి,సత్తెనపల్లి - యెర్రం వెంకటేశ్వరరెడ్డి,వినుకొండ - ఎం. మల్లిఖార్జునరావు,గురజాల - ఆనం సంజీవ్‌రెడ్డి   మాచర్ల - రాంశెట్టి నరేంద్ర బాబు,దర్శి - కోట పోతుల జ్వాలారావు,పర్చూరు - మోదుగుల కృష్ణారెడ్డి,అద్దంకి - గాలం లక్ష్మీయాదవ్, తెనాలి - నాదెండ్ల మనోహర్‌, బాపట్ల - సి.హెచ్. నారాయణరెడ్డి, ప్రత్తిపాడు - కొరివి వినయ్‌కుమార్, గుంటూరు వెస్ట్ - కన్నా లక్ష్మీనారాయణ, చీరాల - మెండు నిశాంత్‌ మార్కాపురం - ఏలూరి రామచంద్రారెడ్డి, సంతనూతలపాడు - నూతల తిరుమల రావు   ఒంగోలు - యెద్దు శశికాంత్‌ భూషణ్‌, కందుకూరు - వెంకట్రావ్ యాదవ్‌, కొండేపి - జి.రాజ్‌విమల్‌, రంపచోడవరం - కేవీవీ సత్యనారాయణ రెడ్డి,నిడదవోలు - కామిశెట్టి వెంకట సత్యనారాయణ, ఆచంట - ఇందుగపల్లి రామానుజ రావు,పాలకొల్లు - బాల నాగేశ్వరరావు,నరసాపురం – నాగతులసీరావు,భీమవరం - యెర్లగడ్డ రాము, ఉండి - గాడిరాజు లచ్చిరాజు   తాడేపల్లిగూడెం - దేవతి పద్మావతి,దెందులూరు - మాగంటి వీరేంద్ర ప్రసాద్‌,ఏలూరు - వెంకట పద్మరాజు, గోపాలపురం - కాంతవల్లి కృష్ణవేణి,పోలవరం - కంగల పోసిరత్నం,తిరువూరు - రాజీవ్‌ రత్న ప్రసాద్,గిద్దలూరు - కందుల గౌతమ్‌రెడ్డి,కనిగిరి - ముక్కు ఉగ్రనరసింహారెడ్డి,కోవూరు - జి.వెంకటరమణ   నెల్లూరు సిటీ - ఏసీ సుబ్బారెడ్డి, నెల్లూరు రూరల్‌- ఆనం విజయకుమార్‌రెడ్డి,సర్వేపల్లి - కె.పట్టాభిరామయ్య, గూడూరు - పనబాక కృష్ణయ్య,సూళ్లూరుపేట - డి.మధుసూదనరావు, వెంకటగిరి - ఎన్‌.రామ్‌కుమార్‌రెడ్డి, బద్వేల్ - జె.కమల్ ప్రభాస్‌,రాజంపేట - గాజుల భాస్కర్‌,కడప - మహ్మద్‌ అష్రాఫ్‌,రాయచోటి - షేక్ ఫజ్లే ఇల్లా   పులివెందుల - రాజగోపాల్‌రెడ్డి,ఆళ్లగడ్డ - టి.ఎ.నరసింహారావు,శ్రీశైలం – షబానా,నందికొట్కూరు - చెరుకూరి అశోకరత్నం,కర్నూలు - అహ్మద్ అలీఖాన్,నంద్యాల - జూపల్లి రాకేష్‌రెడ్డి, బనగానపల్లి - పేర రామసుబ్బారెడ్డి,.డోన్ - ఎల్‌.లక్ష్మీరెడ్డి,పత్తికొండ - కె.లక్ష్మీనారాయణరెడ్డి,కోడుమూరు - పి.మురళీకృష్ణ, ఆదోని - మనియర్ యూనిస్‌.