సోనియాగాంధీకి ముద్దు : వెల్లువెత్తిన విమర్శలు
posted on Apr 14, 2014 @ 6:26PM
ముస్లింలు కాంగ్రెస్ పార్టీ వెంటే వున్నారు. వాళ్లు సోనియాగాంధీని ఎంతో ఇష్టపడుతున్నారన్న కలరింగ్ ఇవ్వడం కోసం కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ చేసిన ఒక చీప్ ట్రిక్‌కి దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్నామధ్య సోనియాగాంధీ కర్నాటకలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు. అక్కడ ఆమె తన సెక్యూరిటీ సిబ్బంది నుంచి దూరంగా వెళ్ళిపోయి జనంలో కలిసిపోయారు. మహిళలు ఆమెను ఎంతగానో ఆదరించారు. అప్పుడు కొంతమంది ముస్లిం మహిళలతో సోనియాగాంధీ ముచ్చటిస్తూ వుండగా, ఒక ముస్లిం అమ్మాయి సోనియాగాంధీకి ముద్దు పెట్టేసింది. అక్కడే వున్న మిగతా ముస్లిం మహిళలు ఈ దృశ్యాన్ని ఆనందంగా గమనిస్తున్నారు. ముస్లిం యువతి చేత ముద్దు పెట్టించుకున్న సోనియా కూడా సంతోషించారు. దీనిని ఎవరో ఫొటో తీస్తే ఆ ఫొటోని దిగ్విజయ్ సింగ్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. అయితే ఇది చూడటానికి మామూలుగా అనిపించవచ్చుగానీ, ఇది దేశంలోని ముస్లింలను ఆకట్టుకోవడానికి, వారి ఓట్లు కొల్లగొట్టడానికి కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ చేసిన ఒక ట్రిక్ అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓట్లకోసం దేనికైనా దిగజారే కాంగ్రెస్ పార్టీ దిగజారుడు తనానికి ఇది ఒక ఉదాహరణ అని కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ పక్షాలు విమర్శిస్తున్నాయి.