మోడీకి మద్దతు : పవన్, నాగ్‌కి రజనీకాంత్ షాక్!
posted on Apr 14, 2014 @ 3:49PM
స్టార్ అంటే ఎలా వుండాలో, ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో రజనీకాంత్‌ని చూసి నేర్చుకోవాలి. ఎన్నో సందర్భాలలో ఎందరికో మార్గదర్శకుడిలా నిలిచిన రజనీకాంత్ ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కి, అక్కినేని నాగార్జునకి స్టార్ అంటే ఎలా వుండాలో చెప్పకనే చెప్పేశాడు. దేశంలో మోడీ ప్రభంజనం వీస్తూ వుండటంతో తెలుగులో టాప్ స్టార్స్ అయిన పవన్ కళ్యాణ్, నాగార్జున గబగబా నరేంద్రమోడీ అపాయింట్‌మెంట్ తీసుకుని, గుజరాత్‌కి వెళ్ళి మోడీని కలుసుకుని, కౌగిలించుకుని వచ్చారు. మోడీకే మా మద్దతు అని ప్రకటించారు. అలాగే రజనీకాంత్‌కి కూడా మోడీ నచ్చాడు. మోడీకి మద్దతు ఇవ్వాలని ఆయనకి అనిపించింది. అయితే రజనీకాంత్ గబగబా మోడీ దగ్గరకి పరిగెత్తుకుంటూ వెళ్ళలేదు... తెలివిగా ఆలోచించి, తన స్టార్‌డమ్‌కి తగిన పని చేశాడు. మోడీనే తన దగ్గరకి వచ్చేలా చేసుకున్నాడు. దేశమంతా మోడీ వైపు చూస్తుంటే, మోడీని కలవాలని దేశంలోని ప్రముఖులందరూ ప్రయత్నిస్తుంటే మోడీ స్వయంగా చెన్నై వెళ్ళి రజనీకాంత్‌ని కలిశారు చూశారా.. అదీ స్టార్‌డమ్ అంటే. ఇదిలా వుంటే, రజనీకాంత్‌లాగా మా హీరో ఎందుకు తన స్టార్‌డమ్‌ని చూపించలేకపోయాడని పవన్ కళ్యాణ్, నాగార్జున అభిమానులు ఫీలవుతున్నారు. ఈ అంశం సదరు హీరోల అభిమానులకు మాత్రమే కాదు.. హీరోలకు కూడా షాక్ ఇచ్చి వుండవచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.