మోడీ పెళ్ళి ఇష్యూ: ఎవరికి ఎంతమంది భార్యలు?
posted on Apr 14, 2014 @ 1:07PM
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ తనకు పెళ్ళి అయిన విషయం తాను స్వయంగా ప్రకటించలేదని, సొంత భార్య విషయమే బయటపెట్టని వ్యక్తి దేశానికి ఏం న్యాయం చేస్తాడని ఇటు యుపిఎ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్‌తోపాటు యుపిఎ మిత్రపక్ష పార్టీలు మోడీమీద దాడి మొదలుపెట్టాయి. ఈ దాడిని బీజేపీ వర్గాలు సమర్థంగా తిప్పికొడుతున్నాయి.
మోడీ వ్యక్తిగత జీవితం, ఎప్పుడూ చిన్నప్పుడు జరిగిన పెళ్ళి విషయాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తున్న పార్టీలకు బీజేపీ నాయకులు కీలెరిగి వాత పెడుతున్నారు. ఉత్తరభారదేశంలో దీనికి టిట్ ఫర్ టాట్ అని రియాక్ట్ అవుతున్నారు. ఉత్తరభారతదేశంలో ఈ అంశం మీద బీజేపీ అతికిస్తున్న వాల్ పోస్టర్లు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఆ వాల్ పోస్టర్లలో యుపిఎ భాగస్వామ్య పార్టీల్లో ఎవరికి ఎంతమంది భార్యలున్నారో ప్రకటించారు.
ఈ వాల్ పోస్టర్‌లో ప్రధానంగా జవహర్ లాల్ నెహ్రూ విదేశీ వనితకు ముద్దు పెడుతున్న ఫొటో వుంది. అలాగే భార్యల లిస్టు విషయానికి వస్తే దిగ్విజయ్ సింగ్‌కి, ములాయం సింగ్ యాదవ్‌కి ఇద్దరేసి భార్యలు వున్నారట. శశి థరూర్‌కి ముగ్గురు భార్యలు. సమాజ్ వాది పార్టీ నాయకుడు ఆజమ్‌ఖాన్‌కి మొత్తం ఆరుగురు భార్యలున్నారు. ఇంతమంది భార్యలున్న వీళ్ళు బెటరా? దేశానికి సేవ చేయడం కోసం వైవాహిక జీవితాన్ని వదులకున్న మోడీ బెటరా అనే అర్థం వచ్చేలా ఆ పోస్టరుంది. ఈ పోస్టర్ మీద యుపిఎ భాగస్వామ్య పార్టీకు కిక్కురుమనడం లేదు.