బడ్జెట్: దేశ ప్రజలపై వరాల జల్లు-3
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్‌సభలో 2014-15 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పథకాల రూపంలో దేశ ప్రజల మీద కొన్ని వరాల జల్లులు కురిపించారు. ఆ వివరాలు... తక్కువ ధరలకే ఇళ్లు నిర్మించేందుకు ప్రత్యేక చర్యలు, సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు ప్రోత్సాహాలు, ఆంధ్రప్రదేశ్, హర్యానాలో అగ్రికల్చరల్ యూనివర్సిటీలు, హార్డ్వేర్ తయారీ లక్ష్యంగా కాకినాడ పోర్టు అభివృద్ధి, 2022 నాటికి అందరికీ ఇళ్లు, గోదాముల కోసం రూ.5కోట్లు, తెలంగాణలో హార్టీకల్చర్ యూనివర్సిటీ, ఆన్ లైన్ విద్యా బోధనకు రూ.100 కోట్లు, గిరిజనుల కోసం వనబంధు పథకానికి రూ.100 కోట్లు, సర్వశిక్ష అభియాస్ కు రూ.28,635 కోట్లు, 2019 నాటికి పరిశుభ్ర భారత్, సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి రూ.6000 కోట్లు, గ్రామీణ విద్యుద్దీకరణకు రూ.500 కోట్లు, మహిళల భద్రతకు రూ.150 కోట్లు, దశలవారీగా ప్రతి రాష్ట్రంలో ఎయిమ్స్ ఏర్పాటు, పబ్లిక్ ట్రాన్స్ పోర్టుల్లో మహిళల భద్రతకు రూ.50 కోట్లతో పైలట్ ప్రాజెక్ట్, యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు స్కిల్ ఇండియా కార్యక్రమం, మదర్సాల అభివృద్ధికి రూ.100 కోట్లు, ఈ-క్రాంతి పథకం ద్వారా గ్రామాల్లో ఇంటర్నెట్లకు 500 కోట్లు, కొత్తగా 12 వైద్య, దంత కళాశాలలు, కమ్యూనిటీ రేడియో స్టేషన్ల అభివృద్ధికి రూ.100 కోట్లు, నగరాల్లో మెట్రో పనుల కోసం రూ.100కోట్లు, ఈపీఎఫ్ వడ్డీరేట్లు పెంపు, బాలిక రక్షణ కోసం రూ.100 కోట్లు, వాటర్ షెడ్ ప్రోగ్సామ్స్ కి 2,142 కోట్లు, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కోసం రూ.3,600 కోట్లు, గృహ నిర్మాణ పథకానికి రూ.800 కోట్లు, ఆంధ్రప్రదేశ్ సహా అయిదు రాష్ట్రాల్లో కొత్త ఐఐటీలు, గ్రామీణ రహదారుల అభివృద్ది కోసం 14,389 కోట్లు, ఎస్సీ, ఎస్టీ ప్రణాళికకు 50వేల కోట్లు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏక్తా విగ్రహానికి 200 కోట్లు, గ్రామ్ జ్యోతి పథకానికి రూ.500 కోట్లు, ప్రధానమంత్రి నీటిపారుదల పథకానికి వెయ్యి కోట్లు, 7060 కోట్లతో 100 స్మార్ట్ సిటీలు.