బడ్జెట్: దేశ ప్రజలపై వరాల జల్లు-2
posted on Jul 10, 2014 @ 3:02PM
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్‌సభలో 2014-15 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పథకాల రూపంలో దేశ ప్రజల మీద కొన్ని వరాల జల్లులు కురిపించారు. ఆ వివరాలు... జమ్మూ,కాశ్మీర్లో హస్తకళలకు రూ.50వేల కోట్లు, లక్నో, అహ్మదాబాద్‌లకు మెట్రో ప్రాజెక్టులు, రూ.11,635 కోట్లతో పోర్టుల అభివృద్ధి, బాలికల సాధికారిత కోసం రూ.100 కోట్లు, బెనారస్ సిల్క్ అభివృద్ధికి రూ.50 కోట్లు, తక్కువ వడ్డీకే రైతులకు స్వల్పకాలిక రుణాలు, వ్యవసాయ రుణాల కోసం రూ.8వేల కోట్లు, రక్షిత మంచినీటి పథకం కోసం రూ.6,500 కోట్లు, ద్రవ్యోల్బణం కట్టడికి ధరల స్థిరీకరణ నిధి, పీపీసీ పద్ధతిలో ఎయిర్ పోర్టుల అభివృద్ధి, విస్తరణ, పట్టణాలలో రైతు మార్కెట్లు ఏర్పాటు, ఆహార సెక్టార్లో పీపీసీలకు ప్రోత్సాహం, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.28వేల కోట్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధికి రూ.50వేల కోట్లు, 16 కొత్త నౌకాశ్రయాల అభివృద్ధి, ఫుడ్ కార్పొరేషన్ ఇండియాలో సంస్కరణలు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం రూ.200 కోట్లతో కార్ఫస్ ఫండ్, భూసార పరీక్ష కేంద్రానికి రూ.56 కోట్లు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి విషయంలో ప్రత్యేక దృష్టి, కృష్ణపట్నంలో ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీ ఏర్పాటు, విశాఖ నుంచి చెన్నై వరకూ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు, రైతుల కోసం కిసాన్ టెలివిజన్ ఛానల్ ఏర్పాటుకు రూ.100 కోట్లు, ఈ ఏడాది చివరినాటికి దేశవ్యాప్తంగా జీఎస్టీ, సూరత్, రాయ్ బరేలీ, తమిళనాడులో టెక్స్ టైల్ పార్కులు, వాతావరణంలో అనూహ్య మార్పులను ఎదుర్కొనేందుకు రూ.100 కోట్లు, నాబార్డు ద్వారా 5లక్షల మంది భూమిలేని రైతులకు ఆర్థిక సాయం.