బడ్జెట్: దేశ ప్రజలపై వరాల జల్లు-1
posted on Jul 10, 2014 @ 2:54PM
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్‌సభలో 2014-15 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పథకాల రూపంలో దేశ ప్రజల మీద కొన్ని వరాల జల్లులు కురిపించారు. ఆ వివరాలు... 1. గృహ రుణాల ఆదాయపన్ను పరిమితి లక్ష నుంచి రెండు లక్షలకు పెంపు 2. 80 సీసీ పరిమితి రూ.1.5 లక్షలకు పెంపు 3. సర్ ఛార్జీల్లో మార్పులు లేవు, 4. పొదుపు పథకాల్లో లక్షన్నర వరకూ పన్ను మినహాయింపు, 5. సీనియర్ సిటిజన్లకు పన్ను పరిమితి రూ.3లక్షలకు పెంపు, 6. వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితి రూ. 2 లక్షల నుంచి 2.5లక్షలకు పెంపు, 7. సెజ్ ల పునరుద్దరణకు సమగ్ర చర్యలు, 8. టూరిజం అభివృద్ధికి రూ.500 కోట్లు, 9. మహిళల రక్షణకు నిర్భయ ఫండ్, 10. అమరవీరుల స్మారకార్థం వార్ మ్యూజియంకు నిధులు, 11. మావోయిస్టు ప్రాంతాల్లో బలగాల ఆధునీకరణకు 3000 కోట్లు, 12. గంగానది ప్రక్షాళనకు 2,037 కోట్లు, 13. రైతులకు మూడు శాతం వడ్డీతో పంట రుణాలు, 13. రక్షణ రంగానికి 2,29,000 కోట్లు కేటాయింపు, 14. పీపీఎఫ్ పరిమితి లక్ష నుంచి లక్షన్నరకు పెంపు, 15. గంగానదిలో జలరవాణా కోసం రూ.4వేల కోట్లు.....