బడ్జెట్: వీటి ధరలు తగ్గుతాయి!
posted on Jul 10, 2014 @ 2:34PM
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో 2014-15 ఆర్థిక సంవత్సరానికి దేశ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అంతకు ముందు బడ్జెట్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ బడ్జెట్‌లో ధరలు తగ్గుముఖం పట్టే ఉత్పత్తుల వివరాలు ఇలా వున్నాయి. పాదరక్షల ధరలు, 19 ఇంచ్లు టీవీలు, కంప్యూటర్, మొబైల్ ఫోన్ల ధరలు, ఇనుము ధరలు, సున్నపురాయి, డోలమైట్, వజ్రాల ధర, పెట్రో కెమికల్స్, పవన విద్యుత్ పరికరాలు, ఎల్ఈడీ, ఎల్సీడీ టీవీల ధరలు, కలర్ టీవీ పిక్చర్ ట్యూబ్‌లు, ఫ్యాటీ ఆసిడ్స్, గ్లిజరిన్ ఉత్పత్తులు, ఉన్ని దుస్తులు.