తెలంగాణలో టీఆర్ఎస్ హావా
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన కార్పోరేషన్ మేయర్ స్థానాలు టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో అత్యధిక మున్సిపాలిటీలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో అత్యధికంగా మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు.రాష్ట్రంలోని 52 మున్సిపాలిటీలకు గాను 50 మున్సిపాలిటీల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో టీఆర్ఎస్ -22, కాంగ్రెస్-20, టీడీపీ-4, బీజేపీ-3, ఎంఐఎం-1స్థానం గెలుపొందాయి. నల్లగొండ, సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది.