రేప్ కేసు: ఇరుకునపడిన హీరోయిన్
కేంద్ర మంత్రి సదానందగౌడ కుమారుడు కార్తీక్ గౌడ తనను రేప్ చేశాడని, తనను పెళ్ళి చేసుకుని ఇప్పుడు మరో పెళ్ళి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడని కోర్టుకి ఎక్కి కేంద్ర మంత్రి గారికి, ఆయన పుత్రరత్నానికి ముచ్చెమటలు పట్టిస్తున్న కన్నడ హీరోయిన్ మైత్రేయ ఇప్పుడు ఇరుకునపడింది. హీరోయిన్ మైత్రేయ తన భార్య అంటూ కన్నడ దర్శకుడు రిషి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఇప్పుడు పరిస్థితి ఆమెకి వ్యతిరేకంగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తాను చాలా అమాయకురాలిని అయినట్టు, తనను మంత్రి కొడుకు మోసం చేశాడన్నట్టు చెప్పుకొస్తున్న మైత్రేయ దర్శకుడు రిషి పిటిషన్‌కి సమాధానం ఎలా చెప్పుకుంటుందో చూడాలి. దర్శకుడు రిషి మైత్రేయతో తనకు ఆల్రెడీ పెళ్ళయిందని, ఆమె తనను విడిచిపెట్టేసిందని, తన దగ్గర ఆధారాలు కూడా వున్నాయని అంటున్నాడు. మైత్రేయ పెట్టిన ‘రేప్’ కేసు తాజా పరిణామాలతో డీలా పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.