తెరాస రాజ్యాంగ సంక్షోభం తెస్తోంది: బీజేపీ నేత
posted on Sep 3, 2014 @ 2:06PM
తెలంగాణలో అధికారంలో వున్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం రాజ్యాంగ సంక్షోభాన్ని తెచ్చే విధంగా వ్యవహరిస్తోందని బీజేపీ సీనియర్ నాయకుడు, బీజేపీ జాతీయ కార్యదర్శి నల్లు ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వం మీద సంధించిన విమర్శనాస్త్రాలు ఇలా వున్నాయి.
1. తెలంగాణ రాష్ట్ర సాధనలో, టీఆర్ఎస్ అధికారంలోకి రావడంలో విద్యార్థుల కృషి ఎంతో వుంది. ఇప్పుడు విద్యార్థులే టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు.
2. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలైనా హామీలను పట్టించుకోవడం లేదు.
3. బడ్జెట్ పెట్టకుండా ఆర్డినెన్స్ తేవాలని ప్రయత్నిస్తోంది. ఆర్థిక బిల్లులను ఆర్డినెన్స్ ద్వారా తెచ్చే అధికారం ప్రభుత్వానికి లేదు. ఈ విషయంలో తెరాస ప్రభుత్వం రాజ్యాంగ సంక్షోభం తెచ్చేలా వ్యవహరిస్తోంది.
4. రుణ మాఫీపై కేసీఆర్ రోజుకో మాట మాట్లాడుతున్నారు. లేనిపోని వంకలు చెబుతూ రుణమాఫీ ఆలస్యం చేస్తున్నారు.
5. రాష్ట్రంలో ఐదు విశ్వవిద్యాలయాలకు ఉప కులపతులు లేరు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రాలేదా? విశ్వవిద్యాలయాలకు గ్రాంట్లు లేవు. ఎందులోనూ పాలక మండళ్ళు లేవు.
6. కేసీఆర్ ప్రభుత్వానికి రైతు రుణమాఫీ కంటే సర్వేనే ముఖ్యమైపోయింది.