డబ్బుల్లేకే ఈ మార్గంలోకి... శ్వేతా బసు ప్రసాద్

  వ్యభిచారం చేస్తూ దొరికిపోయి ప్రస్తుతం ప్రభుత్వ పునరావాస కేంద్రంలో వున్న ప్రముఖ సినీ హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ పోలీసులకు ఇచ్చిన వివరణ వెలుగులోకి వచ్చింది. ‘‘నేను నా కెరీర్లో తప్పు నిర్ణయాలు తీసుకున్నాను. నేను ఎంపిక చేసుకున్న సినిమాలు ఫెయిలై నా కెరీర్ ప్రశ్నార్థకంగా మారిపోయింది. దానివల్ల సినిమాలు కూడా తగ్గిపోయాయి. చాలా గొప్పగా మొదలైన కెరీర్ సడెన్‌గా ముగిసిపోయింది. అయితే అప్పటికే నాకు విలాసవంతమైన జీవితం అలవాటు అయిపోయింది. కుటుంబ అవసరాలు కూడా చాలా వున్నాయి. నా కుటుంబానికి నేనొక్కదాన్నే ఆధారం. నేను డబ్బు సంపాదించకపోతే మా కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది. అందుకే నా కుటుంబానికి డబ్బు చాలా చాలా అవసరం. అలాగే నేను కొన్ని మంచి పనులు చేస్తున్నాను. వాటికీ డబ్బు అవసరం. డబ్బు కోసం నేను ఐటమ్ గర్ల్‌గా కూడా చేశాను. ఇప్పుడు ఆ అవకాశాలు కూడా రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నాకు ఇలా చేయడం తప్ప మరో మార్గం కనిపించలేదు’’.

టాయ్‌లెట్‌లో మూడు కిలోల ప్యూర్ గోల్డ్

  శంషాబాద్ విమానాశ్రయంలోని టాయ్‌లెట్‌లో ఓ బంగారం స్మగ్లర్ మూడు కిలోల బంగారు బిస్కెట్లను పారేశాడు. కస్టమ్స్ అధికారులు ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన నజీర్ అనే వ్యక్తి ఒమన్ నుంచి వచ్చాడు. వస్తూ వస్తూ ఐదు కిలోల బంగారాన్ని తీసుకొచ్చాడు. ఎయిర్ పోర్టులో కస్టమ్స్ నిఘా పటిష్టంగా వుండటం గమనించాడు. అయితే అప్పటికే అతని దగ్గర బంగారం వుందని పసిగట్టిన అధికారులు అతన్ని సోదా చేయడానికి ఎదురుచూస్తున్నారు. దాంతో నజీర్ ఎయిర్ పోర్ట్ టాయ్‌లెట్‌లోకి వెళ్ళి తన దగ్గర వున్న ఐదు కిలోల బంగారంలో మూడు కిలోల బంగారాన్ని టాయ్‌లెట్ కుండీలో పారేశాడు. అయితే కస్టమ్స్ అధికారులు అప్రమత్తమై ఆ బంగారంతోపాటు, నజీర్ దగ్గర వున్న రెండు కిలోల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.

అసెంబ్లీలో కొత్త పదం ‘జగనోక్రసీ’

  అప్పుడప్పుడు రాజకీయాల్లో కూడా కొత్త కొత్త పదాలు పుడుతూ వుంటాయి. తాజాగా ‘జగనోక్రసీ’ అనే కొత్తపదం పుట్టింది. ఈ పదాన్ని ఏపీ అసెంబ్లీలో మంత్రి యనమల రామకృష్ణుడు ఉపయోగించారు. రాజధాని ప్రకటనకు ముందే చర్చ జరగాలని జగన్ సభలో పట్టుబట్టడంతో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల ‘‘శాసనసభలో ‘డెమోక్రసీ’ మాత్రమే నడుస్తుంది ‘జగనోక్రసీ’ నడవదు’’ అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి అయినా, ప్రతిపక్ష నాయకుడైనా సభ నియమాలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. రాజకీయం చేయడం కోసం ఈ అంశం మీద జగన్ హడావిడి చేస్తున్నారని అన్నారు. దాంతో ‘జగనోక్రసీ’ వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. ప్రతిపక్ష నేతను అవమానించే విధంగా అసెంబ్లీలో మాట్లాడటం సరికాదని వైసీపీ ఎమ్మెల్యే జోతుల నెహ్రు పేర్కొన్నారు. జగన్‌కి అధికార పక్ష సభ్యులు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

రాజధానిపై సభలో రభస

  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు అసెంబ్లీలో ఏపీ రాజధాని మీద ప్రకటన చేయనున్న నేపథ్యంలో గురువారం నాడు వైసీపీ సభ్యులు రభస చేశారు. రాజధాని గురించి ప్రకటన ఇచ్చిన తర్వాత చర్చ జరగకూడదని, చర్చ, ఓటింగ్ జరిపిన తర్వాతే ప్రకటించాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు. అయితే సభ నియమాల ప్రకారం వ్యవహరిస్తామే తప్ప జగన్ చెప్పినట్టు వినాల్సిన అవసరం లేదని అధికార పక్షం తెలిపింది. ఈ సందర్భంగా ముందుగా చర్చ జరపాల్సిందేనని ప్రతిపక్ష సభ్యులు, సీఎం ప్రకటన తర్వాత జగన్ ఎంతసేపైనా చర్చించవచ్చని అధికార పార్టీ సభ్యులు వాదులాడుకున్నారు. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో అసెంబ్లీని గురువారం తొలిసారి పదిహేను నిమిషాల పాటు స్పీకర్ కోడెల వాయిదా వేశారు.

లాటరీ గెలవండి.. స్వాగతం పలకండి..

  త్వరలో అమెరికా పర్యటనకు వెళ్ళనున్న భారత ప్రధాని నరేంద్రమోడీకి అమెరికాలో స్వాగతం చెప్పాలంటే లాటరీ గెలవాల్సిందే. ఈ నెల 28న అమెరికాలోని న్యూయార్క్ నగరం, మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో మోడీ కోసం ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో పాల్గొని ఆయన్ని ఆహ్వానించే వారిని లాటరీ ద్వారా ఎంపిక చేయనున్నారు. దీనికి అమెరికాలో భారీస్పందన లభిస్తోంది. దీనికోసం 20 వేల దరఖాస్తులు వచ్చిపడ్డాయి. మంగళవారం నుంచి ఈ నెల 7 వరకు సాధారణ ప్రజానీకానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ ఫౌండేషన్ అవకాశం కల్పించింది. మొత్తమ్మీద దీనికోసం లక్ష వరకూ దరఖాస్తులు వచ్చే అవకాశం వుందని తెలుస్తోంది.

ఏపీ రాజధాని: ముహూర్తం చాలా మంచిది

  ఆంధ్రప్రదేశ్‌లో అడ్రస్ లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీ ఏదోరకంగా వార్తల్లో వుండాలని ప్రయత్నిస్తోంది. అలాగే చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టే ప్రయత్నాలు ప్రారంభించి పథక రచన చేసింది. అందులో భాగమే మొన్నీమధ్య చిరంజీవి తదితరులు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబును విమర్శించడం. చిరంజీవి చేసిన విమర్శలు చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కామెడీ సినిమా చూసినట్టుగా నవ్వుకున్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడాలని అనుకుంటున్న వాళ్ళ అమాయకత్వం చూసి జాలిపడ్డారు. ఇదిలా వుంటే, ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన ప్రకటనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం 12 గంటల 17 నిమిషాలకు అసెంబ్లీలో చేయబోతున్నారు. దీని మీద ఎలా విమర్శించాలో అర్థంకాని కాంగ్రెస్ నాయకులు కొత్త వాదనను తెరమీదకి తీసుకొచ్చారు. చంద్రబాబు రాజధాని గురించి ప్రకటించే ముహూర్తం మంచిది కాదని అంటున్నారు. అయితే దీనికి తెలుగుదేశం వర్గాలు ఖండిస్తున్నాయి. జ్యోతిష శాస్త్రాన్ని ఔపోసన పట్టిన పండితులతో పెట్టించిన చాలా మంచి ముహూర్తమని, కాంగ్రెస్ నాయకులకు జ్యోతిషం అంత బాగా తెలిస్తే, ఆ ముహూర్తాలేవో మొన్నటి ఎన్నికలలో పెట్టుకుని గెలిచి వుండాల్సిందని వెటకారంగా ఎద్దేవా చేస్తున్నారు.

కేసీఆర్ చాలా బిజీ... కేంద్రాన్ని కరెంట్ అడగలేదట...

  తెలంగాణ రాష్ట్రంలో తీవ్రమైన కరెంట్ కొరత వున్న విషయం తెలిసిందే. ఈ సమస్యని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద వుంది. అయితే అడగందే అమ్మైనా పెట్టదంటారు. కేంద్రాన్ని అడిగితేనే ఏ పనైనా జరిగేది. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి చాలా బిజీ అని, ఆయన తమను కరెంట్ కావాలని అడగనే లేదని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయెల్ అన్నారు. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాలకు త్వరలోనే 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ అడిగితే తెలంగాణలో కూడా విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు గోయల్ చెప్పారు. విద్యుత్ విషయంలో తాము రాజకీయాలు చేసే ప్రసక్తి లేదని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ స్పష్టం చేశారు.

అరుదైన గుండె ఆపరేషన్... సక్సెస్

  వైద్యో నారాయణో హరి: అన్నారు. వైద్యుడు దేవుడితో సమానం. ఆ చెన్నై డాక్టర్లు కూడా సాక్షాత్తూ దేవుళ్ళే. ఆ చెన్నై డాక్టర్టు అరుదైన రికార్డు సృష్టించారు. గుండె మార్పిడి శస్త్ర చికిత్సలో అద్భుతం సాధించారు. చెన్నైలోని మలార్ ఆస్పత్రిలోని 42 సంవత్సరాల వ్యక్తి గుండె పూర్తిగా పాడైంది. అతనికి గుండె మార్పిడి చికిత్స తప్ప మరో మార్గం లేదు. బెంగుళూరులో ఒక బ్రెయిన్ డెడ్ అయిన మహిళ గుండెను అతనికి అమర్చాదని డాక్టర్లు నిర్ణయించారు. అయితే ఆమె చనిపోయింది బెంగళూరులో. అతను వున్నది చెన్నైలో. ఆమె నుంచి గుండెను సేకరించిన కొద్ది నిమిషాల్లోనే ఇతనికి అమర్చాల్సి వుంటుంది. ఆ ప్రక్రియ ఆలస్యమైతే ఏ ఉపయోగమూ వుండదు. డాక్టర్లు క్షణం ఆసల్యం చేయలేదు. చెన్నై, బెంగళూరు వైద్యులు చకచకా స్కెచ్‌ గీశారు. పోలీసుల సహకారం కోరారు. విమానం సిద్ధం చేశారు. సరిగ్గా 3 గంటల 15 నిమిషాలకు ఆమె నుంచి గుండెను స్వీకరించారు. మరో పది నిమిషాల్లో అంటే 3 గంటల 25 నిమిషాలకు బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కి గుండెను తీసుకొచ్చారు. ప్రత్యేక విమానం గంటసేపట్లో చెన్నైకి చేర్చింది. సరిగ్గా 4.25కి చెన్నై ఎయిర్‌ పోర్ట్‌కి గుండె చేరింది. అంబులెన్స్ 12 కిలోమీటర్ల దూరంలో వున్న మలార్‌ ఆస్పత్రికి కేవలం పది నిమిషాల్లో గుండె చేరింది. ఈ దారిలో 13 సిగ్నల్స్‌ వున్నప్పటికీ ఎక్కడా ఏ ఆటంకం రాకుండా చెన్నై పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. అందరి కృషి ఫలించింది. ఆపరేషన్ విజయవంతం అయింది. ఓ నిండు ప్రాణం నిలబడింది.

ఏపీ రాజధాని: ముహూర్తం మంచిది కాదట!

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి సంబంధించిన ప్రకటనను గురువారం మధ్యాహ్నం 12:57కి రాష్ట్ర శాసనసభలో ప్రకటించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ మంచిది కాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు అంటున్నారు. దశమి తిథితో కూడిన గురువారం మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు శని హోరం ఉంటుందని, అంటే మరో రకంగా చెప్పాలంటే వర్జమని, ఆ సమయంలో ముహూర్తం మంచిది కాదని ఎప్పుడు నేర్చుకున్నారోగానీ ఆయన పంచాంగం చెపుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆ సమయంలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారని, దానివల్ల సఫలం కాలేకపోయారని ఆయన ఉదాహరణ కూడా వివరించి చెపుతున్నారు.

కేసీఆర్ క్యాంప్ కార్యాలయం.. వాస్తు దోషం...

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు ఆఫీసును వాస్తు దోషం వదలడం లేదు. వాస్తు లోపాలతోపాటు మరికొన్ని ఇతర కారణాల వల్ల సీఎం కేసీఆర్ ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న క్యాంప్ కార్యాలయం నుంచి మారుతున్నట్టు ఆధికారులు వెల్లడించారు. సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ ను మరో భవనంలోకి మార్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుత క్యాంప్ ఆఫీస్‌ను స్పీకర్ మధుసూదనాచారికి కేటాయించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవీ స్వీకారం చేసిన తర్వాత క్యాంప్ ఆఫీస్ మారడం ఇది రెండవసారి. కేసీఆర్ ఈ ఆఫీసులో చేరినప్పుడు నానారకాల వాస్తు పరీక్షలు చేశారు. అప్పుడు బాగానే వుందని అనుకున్నారు. మళ్ళీ ఇప్పుడు బాగాలేదని డిసైడ్ చేశారు.. ఈ వాస్తు పండితులున్నారే....

హీరోయిన్ కంప్యూటర్ హ్యాక్.. నగ్న చిత్రాలు లీక్...

  అతి చిన్న వయసులో ఆస్కార్ అవార్డు పొందిన రెండో నటిగా గుర్తింపు పొందిన హాలీవుడ్ అందాల హీరోయిన్ జెన్నీఫర్ లారెన్స్‌కి చిక్కులు వచ్చిపడ్డాయి. జెన్నిఫర్ లారెన్స్ ఎంతో ముచ్చటపడి తీసుకున్న తన నగ్న ఫొటోలను తన కంప్యూటర్లో భద్రపరుచుకుంది. అయితే ఆమె కంప్యూటర్ని ఎవరో హ్యాక్ చేసి ఆమె నగ్న ఫొటోలను ఇంటర్నెట్‌లో పెట్టేశారు. దాంతో సోమవారం నాడు హాలీవుడ్ మొత్తం షాకైపోయింది. సినిమాల్లో కూడా పెద్దగా ఎక్స్‌పోజింగ్ చేయని జెన్నిఫర్ లారెన్స్ కళాత్మకంగా పోజులిచ్చిన పూర్తి నగ్న చిత్రాలను చూసి హాలీవుడ్ జనాలతోపాటు ప్రపంచంలోని అందరూ నోళ్ళు తెరిచారు. తన నగ్న ఫొటోలు బయపడ్డాయన్న విషయాన్ని తెలుసుకున్న జెన్నిఫర్ లారెన్స్ తన కంప్యూటర్ని ఎవరు హ్యాక్ చేశారో కనుక్కుని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరింది. ‘‘ఇది నా వ్యక్తిగత ఏకాంతానికి భంగం కలిగించే విషయం. నా నగ్న చిత్రాలను హ్యాకింగ్ ద్వారా దొంగలించి నెట్‌లో పెట్టిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి’’ అని జెన్నిఫర్ పేర్కొన్నట్టు ఆమె మేనేజర్ తెలిపాడు.

శ్వేతా బసు ప్రసాద్: మూడు నెలలు అక్కడే...

  వ్యభిచారం కేసులో పట్టుబడిన సినీ హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రభుత్వ మహిళా పునరావాస కేంద్రంలో వుంది. కోర్టు ఆదేశాల మేరకు ఆమెను పోలీసులు ఆ కేంద్రంలో వుంచారు. ఆ కేంద్రంలో వ్యభిచారం చేస్తూ పట్టుబడిన మహిళలను, అనాథలను, నా అంటూ లేని వారిని వుంచుతారు. హీరోయిన్‌గా ఎంతో లగ్జరీని అనుభవించిన శ్వేతా బసు ప్రసాద్‌ ఇప్పుడు అక్కడ వుంది. శ్వేత బసు ప్రసాద్‌ని పునరావాస కేంద్రంలో వుంచాలని ఎర్రమంజిల్ కోర్టు ఆదేశించిన తర్వాత పోలీసులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్ళారు. అక్కడ ఆమెకు ఆరోగ్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ తర్వాత ఆమెను పునరావాస కేంద్రానికి తరలించారు. శ్వేతా బసు ప్రసాద్‌ను ఆ పునరావాస కేంద్రంలో మూడు నెలలపాటు వుంచుతారు. ఈ మూడు నెలల లోపు ఆమె బయటకు వచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది.

అప్పటికింకా నా వయసు నిండా పదహారే... మైత్రేయ...

  కేంద్ర మంత్రి సదానంద గౌడ కొడుకు కార్తీక్ గౌడ తనను పెళ్ళి చేసుకుంటానని మోసం చేశాడని, రేప్ చేశాడని కన్నడ నటి మైత్రేయ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు కేసు నమోదు చేసి కార్తీక్ గౌడ కోసం గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో రిషి అనే కన్నడ డైరెక్టర్ పదేళ్ళ క్రితం తాను ‘సూర్య ది గ్రేట్’ అనే సినిమా తీసే సమయంలో మైత్రేయని తాను పెళ్ళి చేసుకున్నానని ప్రకటించి సంచలనం సృష్టించాడు. అయితే దీనిని హీరోయిన్ మైత్రేయ ఖండించింది. ‘‘ఆ సినిమా తీసే నాటికి నాకు పదహారేళ్ళు. అప్పుడు నా వెంట మా అమ్మ కూడా వుండేది. మా అమ్మకి తెలియకుండా నా పెళ్ళవుతుందా చెప్పండి? అంచేత నాకు, తనకి పెళ్ళయిందంటూ డైరెక్టర్ రిషి చెబుతున్న మాటల్లో ఎంతమాత్రం నిజం లేదు’’ అని మైత్రేయ వివరణ ఇచ్చింది. మొత్తానికి ఈ హీరోయిన్ రేప్ కేసు సస్పెన్స్ సినిమా తరహా ట్విస్టులతో ముందుకు వెళ్తోంది.