ఏపి, తెలంగాణా ముఖ్యమంత్రులకు బెదిరింపు లేఖ!

  ఆంద్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ లను చంపివేస్తామని హెచ్చరిస్తూ ఒక బెదిరింపు లేఖ వచ్చింది. అంతేకాక ఆంద్రప్రదేశ్ లో నౌకాశ్రయాలను, విశాఖ విమానాశ్రయాన్ని, శ్రీహరి కోట రాకెట్ సెంటర్ ని కూడా పేల్చి వేస్తామని ఆ లేఖలో హెచ్చరిక ఉంది. ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే తెలుగులో వ్రాసి ఉన్న ఆ లేఖని ముఖ్యమంత్రుల కార్యాలయానికో లేక పోలీస్ ఉన్నతాధికారులకో లేక ఏ మీడియా సంస్థకో పంపించకుండా విశాఖ విమానాశ్రయ డైరక్టర్ కి పోస్టులో పంపబడింది. నిజామాబాద్ జిల్లాలోని నిర్మల్ పట్టణంలో ఆ లేఖ పోస్ట్ చేయబడినట్లు పోలీసులు గుర్తించారు. ఆ లేఖను ఎవరు వ్రాసారో, ఏ ఉద్దేశ్యంతో వ్రాసారనే విషయాలు దర్యాప్తులో తేలుతాయని చినట్లు విశాఖ పోలీస్ కమీషనర్ అమిత్ గర్గ్ అన్నారు. ఒకవేళ మావోయిష్టులు ఆ లేఖ వ్రాసి ఉండి ఉంటే వారు దైర్యంగా తామే వ్రాసామని స్వయంగా ప్రకటించుకొనేవారు. కానీ మావోయిష్టులు ఆ లేఖను వ్రాసినట్లు కమీషనర్ చెప్పలేదు కనుక వేరే ఎవరో వ్రాసి ఉండాలి. ఒకవేళ పాకిస్తాన్ ఉగ్రవాదుల మద్దతుదారులు ఎవరయినా ఆ లేఖ వ్రాసారా? లేక ఎవరో ఆకతాయి ఈ లేఖ వ్రాశాడా? అనేది దర్యాప్తులో తేలవలసి ఉంది. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు ఇద్దరు ముఖ్యమంత్రుల భద్రత, లేఖలో పేర్కొన్న సంస్థల వద్ద భద్రత మరింత కట్టుదిట్టం చేసారు.

ఫలక్ నుమా ప్యాలస్ వరల్డ్ నెంబర్: 1

  హైదరాబాద్ అనగానే అందరికీ మొదట గుర్తుకు వచ్చేది చార్మినారే ఆ తరువాత గోల్కొండా, సాలార్ జంగ్ మ్యూజియం, బిర్లా మందిర్ వగైరా వగైరాల పేర్లు చెప్పుకొంటారు. కానీ వాటిలో ఫలక్ నుమా ప్యాలస్ కూడా ఉన్నపటికీ దాని పేరు చాలా అరుదుగా వినబడుతుంది. అందుకు కారణం అత్యద్భుతమయిన ఆ రాజమహల్లోకి సామాన్యులు అడుగుపెట్టే అవకాశం లేకపోవడమే. లేకుంటే దాని పేరు కూడా ప్రజల నోళ్ళలో నిత్యం వినబడుతుండేది. కానీ “ట్రిప్ అడ్వయిజర్” అనే సంస్థ ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్యాలెస్ హోటల్స్ పై ఒక సర్వే నిర్వహించగా వివిధ దేశస్తులు ఫలక్ నుమా ప్యాలెస్ కే ఓటేయడంతో అది ప్రపంచంలో నెంబర్: 1 ప్యాలెస్ హోటల్ స్థానం కైవసం చేసుకొంది. ఫలక్ నుమా ప్యాలెస్ ని స్టార్ హోటల్ గా మార్చి దానిని తాజ్ గ్రూప్ నిర్వహిస్తోంది.

జగన్ కు షుగర్.. బీపీతో పనేంటి.. గాలి

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేస్తున్నదీక్షపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు విమర్శలు గుప్పించారు. జగన్ చేసే దీక్షలో క్లారిటీ లేదని.. జగన్ కుర్చీకోసం దీక్ష చేస్తున్నారు తప్ప ప్రజల కోసం చేయట్లేదని మండిపడ్డారు. జగన్ షుగర్ లెవల్స్ పడిపోయాయని.. బీపీ రేట్ తగ్గిపోతుందని వార్తలు వస్తున్నాయి.. అసలు దీక్ష చేసేప్పుడు జగన్ కు షుగర్ తో.. బీపీతో పనేంటని ప్రశ్నించారు. ఈ విషయంలో ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. జగన్‌కు హాని జరగాలని తామెవరమూ కోరుకోవడం లేదని, జగన్ ఉంటే తమకే రాజకీయంగా మేలని ముద్దుకృష్ణమ వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదాను కేంద్రాన్ని అడుగుతున్నారా? రాష్ర్టాన్ని అడుగుతున్నారా ? కేంద్రాన్ని అడిగితే జగన్‌ ఢిల్లీలో దీక్ష చేయాలని మంత్రి సూచించారు.

అవి ఊహాగానాలు మాత్రమే.. నాగం

తాను పార్టీని వీడే ప్రసక్తి లేదని నాగం జనార్ధనరెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు నాగం జనార్ధనరెడ్డి కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీని వీడే ప్రసక్తే లేదని.. తాను బీజేపీని వీడి టీడీపీలోకి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. అవి కేవలం ఊహాగానాలు మాత్రమే అని స్పష్టం చేశారు. హోం మంత్రి ఆహ్వానం మేరకే ఢిల్లీ వచ్చానని.. తాను ప్రారంభించిన బచావో తెలంగాణ మిషన్ ద్వారా ప్రజల్లోకి వెళ్తున్న విషయాన్ని రాజ్‌నాథ్‌కు వివరించానని వెల్లడించారు. అంతేకాదు రైతు సమస్యలు తెలుసుకునేందుకు తాను రైతు యాత్ర చేశానని.. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, రైతు ఆత్మహత్యలపై రాజ్ నాథ్‌తో చర్చలు జరిపినట్లు నాగం చెప్పుకొచ్చారు.

సినీ పరిశ్రమకు చంద్రబాబు గాలం

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ లో ఉన్న సినీ పరిశ్రమ కూడా ఏపీకి తరలిరావాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రం విడిపోయిన తరువాత సినీ పరిశ్రమ కూడా విడిపోతుందని అందరూ భావించినా అది జరగలేదు. ఎందుకంటే సినీ పరిశ్రమలో తెలంగాణకు సంబంధించ నటీ నటుల కంటే ఏపీకి సంబంధించిన వారే ఎక్కువగా ఉండటంతో ఇలాంటి సందేహాలు వచ్చాయి. కాకపోతే దానికి భిన్నంగా సినీ పరిశ్రమ విడిపోకుండా.. ఇక్కడ సకల సౌకర్యాలు ఉండటంతో మారే ప్రయత్నాలు చేయలేదు. అయితే ఇప్పుడు చంద్రబాబు ఈ సినీ పరిశ్రమ ఏపీలోకి అడుగుపెట్టాలని కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. ఒక్కసారే కాకపోయినా.. నెమ్మదిగా సినీ పరిశ్రమలు వైజాగ్ లాంటి ప్రాంతాలకు తీసుకురావడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఆయన భీమలి-విశాఖపట్నం రోడ్డులోని వజ్ర ఆశ్రమం దగ్గర ఫిలిం నగర్ కల్చరల్ సొసైటీ (ఎఫ్ ఎన్ సీసీ)కి ఆయన శంకుస్థాపన చేస్తున్నారు. దాదాపు 15 ఎకరాల్లో ఈ సొసైటీని డెవలప్ చేయబోతుండటం విశేషం. అయితే ఇప్పటికే వైజాగ్ లో రామానాయుడు స్టూడియోను నిర్మించినా అందులో పెద్దగా షూటింగ్ లు జరగడంలేదు. ఒక్కసారి ఇక్కడ షూటింగ్ లు ప్రారంభమైతే ఆటోమేటిక్ గా అందరూ వస్తారని.. మున్ముందు సినీ పరిశ్రమను వైజాగ్ కు రప్పించడానికి మరిన్ని చర్యలు చేపట్టనుంది ప్రభుత్వం. మొత్తానికి చంద్రబాబు సినీ పరిశ్రమకు గాలం వేసినట్టు తెలుస్తోంది. మరి చంద్రబాబు ప్లాన్ వర్కవుట్ అవుద్దా.. సినీ పరిశ్రమ ఏపీకి వస్తుందా..

ఆదినారాయణరెడ్డిపై రామసుబ్బారెడ్డి ఫైర్.. అది ఆయనకు అలవాటే

వైకాపా పార్టీనేత, కడప జిల్లా ఎమ్మెల్యే ఆదినారాయణ వైకాపాను వీడి టీడీపీలోకి మారే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుతో మంతనాలు జరపగా ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే అధినేతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా పార్టీ మారడానికి మాత్రం ఆయనకు రామ సుబ్బారెడ్డి రూపంలో బ్రేక్ తగిలింది. ఆదినారాయణను పార్టీలోకి తీసుకోవద్దని.. తీసుకుంటే తాను పార్టీ వీడతానని చెప్పి ఆయన చంద్రబాబు, లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో చంద్రబాబు కూడా ఆదినారాయణరెడ్డి విషయంలో కొంచెం వెనక్కి తగ్గారు. అయితే ఇప్పుడు ఆదినారాయణ రెడ్డిని పార్టీలోకి తీసుకునేదే లేదని.. పార్టీలోకి రానివ్వమని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. పార్టీకి తన అవసరం ఎంత మాత్రం లేదని.. ఆయన రావడాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని వెల్లడించారు. హత్యా రాజకీయాలు చేసే వారిని తీసుకుంటే ప్రజల్లోకి, కార్యకర్తల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు.. అధికారంలో ఉన్న పార్టీలోకి జంప్ అవడం తనకి అలవాటే అని ఎద్దేవ చేశారు..

ఆశా వర్కర్లని కలిసిన కవిత.. పార్లమెంట్లో గళం విప్పుతా.. మరి అసెంబ్లీలో?

  తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు ఆందోళన చెపట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం వారి సమస్యలను పట్టించుకోవడం సరికదా.. వారు చేపట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని కూడా అడ్డుకొని దాదాపు తొమ్మిది వేలమంది నిరసన కారులను అరెస్ట్ చేసింది. కనీసం ప్రభుత్వాధినేతల్ని కలిసి తమ గోడును చెప్పుకుందామని కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గరకు వెళ్లిన వారిని కూడా అడ్డుకుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు తలెత్తాయి. ఒక పక్క ఇప్పటికే రైతు సమస్యలతో అధికార పార్టీని ఇరుకున పెడదామని చూస్తున్న ప్రతిపక్షాలకు ఇదో కొత్త పాయింట్ దొరికింది. అయితే ఈ వ్యవహారంలో అనవసరంగా తలనొప్పులు ఎందుకనుకున్నారేమో కేసీఆర్ కూతురు కవిత ఆశావర్కర్లని కలిశారు. వారి వాదనలను.. డిమాండ్లను ఓపికగా వినడం జరిగింది. వారి వాదనల విన్న తరువాత తాను వారి సమస్యలను తీరుస్తానని.. ఆవ్యవహారంపై పార్లమెంట్ లో తన గళం విప్పుతానని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే కవిత బాధ్యతగా వారి దగ్గరకు వెళ్లడం.. వారి సమస్యలు వినడం అంతా బానే ఉంది.. ఈ విషయంలో ఆమెను ప్రశంసిస్తున్నారు కూడా. అయితే పార్లమెంట్ లో చర్చిస్తానని చెప్పిన ఆమె తన తండ్రి కేసీఆర్ ప్రభుత్వం ఏం చేస్తుంది అనే విషయంపై మాత్రం చెప్పలేదు. ఆమె కేంద్రంతో చర్చించి వారు స్పందించే లోపు కేసీఆర్ ప్రభుత్వంతో చర్చించి వారి సమస్యలకు ఎంతోకొంత సాయం చేస్తే బావుంటుందని అభిప్రాయపడుతున్నారు.

పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు ఎలాంటి హోదా ఇస్తారు?

ఏపీ రాజధాని అమరవాతి శంకుస్థాపన కార్యక్రమానికి చంద్రబాబు ఎంతోమంది అతిధిలను ఆహ్వానించనున్నారు. దసరా రోజు జరగబోయే ఈ మహత్కర కార్యక్రమానికి ఇప్పటినుండే ఏర్పాట్లు చేస్తూ చంద్రబాబు చాలా బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు అందరూ ఒక విషయంపై చర్చించుకుంటున్నారు. అదేంటంటే.. చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఏ హోదాలో పిలుస్తారు అని. ఇప్పటి వరకూ శంకుస్థాపన కార్యక్రమానికి మోడీ వస్తారు.. కేసీఆర్ ను ఇంటికెళ్లి మరీ ఆహ్వానిస్తా.. జగన్ ను పిలుస్తా.. సోనియాను ఆహ్వానిస్తా అన్న మాటలే వినిపిస్తున్నాయి కానీ పవన్ కళ్యాణ్ పేరు మాత్రం  ఎక్కడా వినిపించడం లేదు. దీంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు సముచిత స్థానం.. గౌరవం దక్కుతుందా? కేవలం జనసేన పార్టీ అధినేతగానే ఆహ్వానిస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి పవన్ కు ఏరీతిలో ఆహ్వానం అందుతుందో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

కేసీఆర్ ఇంటికెళ్లి మరీ పిలుస్తా.. కేసీఆర్ రియాక్షన్ ఇదేనా?

ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈవిషయంపై  వార్తలు వచ్చాయి. అయితే చంద్రబాబు స్వయంగా పిలుస్తానని చెప్పినంత వరకూ బానే ఉంది మరి ఈ వార్త విన్న కేసీఆర్ రియాక్షన్ ఏంటి అన్న ప్రశ్న ఇప్పుడు అందరిని తొలుస్తుంది. ఎందుకంటే టీవీ లైవ్ లో వచ్చిన కేసీఆర్ అసలు ఈ మాటలు విన్నరా? వింటే ఎలా స్పందించారు? అన్న సందేహ పడుతున్న సమయంలో కొన్ని ఆసక్తివార విషయాలు తెలిశాయి. వివరాల ప్రకారం.. చంద్రబాబు ఆ మాట అన్న కొద్ది నిమిషాలకే కేసీఆర్ కు వార్త తెలిసిందట.. అయితే ఆయన ముహూర్తం ఎన్నిగంటలకు అని అడిగారట. అయితే ఆయన ఒక్క మూహుర్తం ఎప్పుడు అన్న ఒక్క మాట మాత్రమే అడిగారని.. అంతకు మించి ఎక్కవ ఏం మాట్లాడలేదని.. శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లేది లేనిది గురించి ఏం మాట్లాడలేదని తెలుస్తోంది. అయితే ఇప్పుడు కేసీఆర్ అలా అడగటంపై పలువురు పలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ కు వాస్తు.. మూహూర్తాలపై నమ్మకం ఎక్కువ కాబట్టి ఆకోణంలో అడిగి ఉంటారని.. తనకు వెళ్లే ఛాన్స్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి అని కొందరు.. ఇంకా కొంతమందైతే ఆ సమయంలో కావాలనే ఏమైనా ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారేమే అని ఎవరికి నచ్చినట్టు వాళ్లు అభిప్రాయపడుతున్నారు. మరి ఇంతకీ కేసీఆర్ ఏ ఉద్దేశ్యంతో అడిగారో ఆయనకే తెలియాలి.

చాలా మర్యాదగా పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించిన రోజా

వైకాపా పార్టీ ఎమ్మెల్యే రోజా తమ అధినేత జగన్ చేస్తున్న దీక్షకు పవన్ కళ్యాణ్ మద్దతు తెలపాలని.. ప్రశ్నించడానికి వచ్చిన పపన్ కళ్యాణ్ ఎందుకు మోడీని.. చంద్రబాబును ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు. అయితే రోజా చేసిన వ్యాఖ్యలకు.. రోజా చాలా తెలివిగా పవన్ కళ్యాణ్ ను ఈ సీన్లోకి లాగిందని అనుకుంటున్నారు. చాలా వరకూ రోజా మాట్లాడే సందర్భల్లో మర్యాద పూర్వకంగా మాట్లాడటం చాలా తక్కువ. సూటిగా మాట్లాడటం.. మాటలతోనే ప్రత్యర్ధులకు మంటలు పుట్టించడం రోజాకు చాలా తేలికైన పని. అలాంటిది పపన్ కళ్యాణ్ విషయంలో మాత్రం చాలా గౌరవంగా.. మర్యాదపూర్వకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని నరేంద్ర మోడీ.. చంద్రబాబు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చూస్తూ.. ‘‘పవన్ కల్యాణ్ గారు ఆ మాటలకు మీరే సాక్షి’’ అని వ్యాఖ్యానించారు. మరి పవన్ కళ్యాణ్ రోజా ప్రశ్నకు సమాధానంగా ప్రశ్నిస్తారో లేదో చూడాలి.

జగన్ పై టీడీపీ మంత్రుల విమర్శలు.. లేనిపోని తలనొప్పులు

  వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ గుంటూరు సమీపంలో నల్లపాడు వద్ద చేపట్టిన దీక్ష ఈరోజుతో ఆరవ రోజుకి చేరుకుంది. అయితే జగన్ దీక్ష చేపట్టిన రెండు రోజులు అధికార పార్టీ నేతలు విమర్శలు గుప్పించిన తరువాత అంతగా పట్టించుకోలేదు. కానీ జగన్ దీక్ష గురించిన సమాచారం సేకరిస్తూనే ఉన్నారు. కాని ఇప్పుడు అనవసరంగా జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి ఇబ్బందులు తెచ్చుకుంటున్నారనే వార్తులు గుప్పిస్తున్నాయి. రెండు మూడు రోజులు సైలెంట్ గా ఉన్న టీడీపీ నేతలు మళ్లీ ఇప్పుడు జగన్ దీక్షపై విమర్శలు చేసి కొత్త తలనొప్పులు తెచ్చుకున్నట్టు తెలుస్తోంది. జగన్ రెండుగంటలకు ఒకసారి బస్సులోకి వెళ్లి ఆహారం తీసుకుంటున్నారని..షుగర్ లెవల్స్ పెరుగుతున్నాయని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు టీడీపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై అందరూ మండిపడుతున్నారు. దీక్షకు సహకరించపోయిన పర్వాలేదు కాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అంటున్నారు. మరోపక్క టీడీపీ నేతలు ఇలా మాట్లాడి జగన్ పై ఇంకా సింపతి వచ్చేట్టు చేశారని.. అంతేకాదు వారు చేసిన  వ్యాఖ్యలకి వైకాపా శ్రేణుల్లో ఇంకా కొత్త ఉత్సాహాన్నిఇచ్చాయని పలువురు రాజకీయ వర్గాలు తెలుపుతున్నాయి.

పవన్ కళ్యాణ్ ఇప్పుడెందుకు ప్రశ్నించడంలేదు.. రోజా

వైసీపీ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంటున్న ఎమ్మెల్యే రోజా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. వైకాపా అధినేత జగన్ ఏపీ ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం ఏపీలో ప్రతి గుండె తపిస్తోందని, ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడంలేదని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ గత ఎన్నికల్లో చంద్రబాబు, మోడీ అన్నారని.. దానికి పవన్ కళ్యాణే సాక్ష్యమని.. మరి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులను ఎందుకు ప్రశ్నించడంలేదని వైసిపి ఎమ్మెల్యే రోజా ఆదివారం ప్రశ్నించారు. జగన్ దీక్షకు పవన్ కళ్యాణ్ మద్దతు పలికి, హోదా కోసం పోరాడాలని సూచించారు.

విరమణ మాత్రమే.. విరామం కాదు.. కేసీఆర్ కు కోదండరాం చురక

తెలంగాణ జేఏసీ నేత కోదండరాం ముఖ్యమంత్రి కేసీఆర్ కు చురకలు అంటించేలా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆయన హరగోపాల్ తదితరులతో కలిసి మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ రకంగా వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణ అంశంలో తమ ఉద్యమానికి విరామం మాత్రమేనని.. విరమణ మాత్రం కాదని.. తెలంగాణ బిల్లు విషయంలో కెసిఆర్‌తో పాటు అన్ని పార్టీలు కీలక పాత్ర పోషించాయని ఆయన అన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) కొనసాగుతుందని.. త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్నారు. ప్రజాస్వామ్య తెలంగాణ కంకణబద్దులం అవుదామన్నారు.

కోపంలోనే అలా అన్నాను సారీ.. బలరాం నాయక్

మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ తన ప్రసంగాలతో ఎప్పుడైనా ఫేమస్ అయ్యారో లేదో తెలియదు కాని రెండు రోజుల క్రితం  ఆయన చేసిన ఒక వ్యాఖ్య వల్ల ఇప్పుడు ఫుల్లు గుర్తింపు వచ్చింది. అదేంటని అనుకుంటున్నారా అదే తెలంగాణను ఆంధ్రాలో కలిపేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ ను కాదని టీఆర్ఎస్ కు పట్టం కట్టారు..ఈసారి ఎన్నికల్లో తమను గెలిపించకపోతే తెలంగాణను ఆంధ్రాలో కలిపేస్తాం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్సలు రావడంతో ఇప్పుడు సారీ చెప్పుతున్నారు. గత ఎన్నికల్లో నాకు అన్యాయం (ఓడించారు) జరిగిందన్న కోపంలోనే అలా అన్నానని.. ఏదిఏమైనా తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాని క్షమాపణ చెపుతున్నట్టు బలరాం నాయక్ అన్నారు.

కేసీఆర్ మనమడు తినే బియ్యం పంపండి.. రేవంత్ రెడ్డి

తెలంగాణ టీడీపీ యువనేత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి మండిపడ్డారు. ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంక్షేమ హాస్టళ్లలో ప్రభుత్వం సన్నబియ్యంతో భోజనం  పెడుతుందని చెపుతున్నారు కాని వాటికి బదులు దారుణమైన బియ్యంతో భోజనం పెడుతున్నారని విమర్శించారు. ఈ సన్నబియ్యం వ్యవహారంలో కోట్ల రూపాయల అవినీతి జరగుతుందని.. ఏదో బియ్యం తీసుకొచ్చి వాటికి పాలిష్ చేసి సన్న బియ్యమని మభ్యపెడుతున్నారని అన్నారు. కేసీఆర్ కు చిత్తశుద్ది ఉంటే దీనిపై చర్య తీసుకోవాలని సూచించారు. అంతేకాదు ఆ అన్నంను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబ సభ్యులు ఎవరైనా తింటారా.. కేసీఆర్ మనమడు ఏ రకమైన సన్న బియ్యం తింటారో అలాంటి బియ్యాన్ని సంక్షేమ హాస్టళ్లకు కూడా అందించాలని అన్నారు.

కేసీఆర్, సోనియాకు ఆహ్వానం.. రండి.. వచ్చి కుళ్లుకోండి

ఏపీ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కర్యాక్రమం ఈనెల 22వ తేదీన మధ్యాహ్నం 12.45 నిమిషాలకు జరగనుంది. ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఏపీ ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పుడు ఒక ముఖ్యమైన అంశంపై చర్చ జరుగుతుంది. అదేంటంటే శంకుస్థాపన కార్యక్రమానికి కేసీఆర్ ను అలాగే సోనియా గాంధీని ఆహ్వానించడంపై. అయితే కేసీఆర్ ను తానే స్వయంగా ఇంటికెళ్లి ఆహ్వానిస్తానని చంద్రబాబు అన్నట్టు ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. మరి సోనియా గాంధీని కూడా అలాగే పిలుస్తారా అని డౌట్. అయితే చంద్రబాబు వారిని పిలవడంపై ఎలాంటి ఉద్దేశం ఉందో తెలియదు కాదని మిగిలిన నేతలు మాత్రం శంకుస్థాపన కార్యక్రమానికి రండి.. చూడండి.. చూసి కుళ్లుకోండి అని వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రాన్ని విడదీసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి.. అప్పుల రాష్ట్రంగా మిగిల్చారు సోనియా గాంధీ. ఇలాంటి సమయంలో రాజధాని నిర్మాణం చాలా కష్టమని చాలా మందే అన్నారు. అయితే వాటన్నింటిని ఖండించి రాజధాని శంకుస్థాపనకు శ్రీకారం చుట్టి..   హైదరాబాద్ ను తలదన్నేలా అంతర్జాతీయ స్థాయిలో అమరావతి ఉంటుందని మూడేళ్ల తర్వాత ప్రపంచంలోని అద్భుత నగరాల్లో అమరావతి ఒకటి అవుతుందని కూడా ఘంటాపథంగా తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీకి రాజధాని లేకుండా విభజనకు కారణమైనవారు కేసీఆర్ అయితే.. ఏపీకి రాజధాని లేకుండా చేసింది సోనియా కాబట్టి వీరిద్దరికి శంకుస్థాపనకు ఆహ్వానించి వారు కుళ్లుకునేలా చేయాలని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తుందట. అయితే కేసీఆర్ ను స్వయంగా పిలిచినట్టు, సోనియాను కూడా స్వయంగా పిలిస్తే బావుంటుందని పార్టీ నేతలు అనుకుంటున్నారట.

జానారెడ్డి పార్టీ మారడానికే ఇలా చేస్తున్నారా?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి గులాబీ రంగు పూసుకోనున్నారా? కాంగ్రెస్ పార్టీని వీడి గులాబీ గూటికి చేరుతున్నారా? అంటే అవునని కొంత మంది రాజకీయ నేతలు అనుకుంటున్నారు. తెలంగాణ సీనియర్ నేత డీ.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లోకి చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జానారెడ్డి కూడా టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్దపడుతున్నారా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తరువాత కాంగ్రెస్ పార్టీకి సరైన ఉనికి లేదు. ఈ నేపథ్యంలోనే పార్టీలో ఉన్నా పెద్ద ప్రయోజనం లేదని అనుకున్నారేమో పార్టీ మారే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది జానారెడ్డి. దీనిలో భాగంగానే ముందునుంచి ఆయన పార్టీ వ్యవహారాలను కూడా అంతగా పట్టించుకోవడం.. దీనిపై ఇతర కాంగ్రెస్ నేతలు కూడా ఆయనమీద ఆగ్రహంగా ఉండటం అన్నీ జరుగుతూనే వస్తున్నాయి. అంతేకాక అధికార పార్టీ.. కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేసినా అధికార పార్టీని పల్లెత్తు మాటకూడా అనకుండా టీఆర్ఎస్ పార్టీకి ఒత్తాసు పలకడం.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలతో అధికార పార్టీకి క్షమాపణలు చెప్పిండటం.. ఇవన్నీ ఆయన పార్టీపై మరింత అనుమానాలు ఎదురవుతున్నాయి. దీనికి తోడు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు అన్నిపార్టీలు కలిసి టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నిన్న చేపట్టిన తెలంగాణ బంద్ కు జానారెడ్డి డుమ్మాకొట్టారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతల కోపం నషాళానికి అంటింది. అయితే జానారెడ్డి మాత్రం తాను కాంగ్రెస్ వాదినే అని  ఎవరి సర్టిఫికెట్టూ తనకు అవసరం లేదని చెప్పుకొస్తున్నారు. కానీ పార్టీ నేతలు మాత్రం జానారెడ్డి తీరుపై చాలా అసహనంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో రాహుల్ గాంధీ కూడా జానారెడ్డితో ఏం సార్ పార్టీ మారుతున్నారా అని కూడా సెటైర్లు వేశారు. అయితే కొంతమంది మాత్రం జానారెడ్డి పార్టీ మారేందుకు కావాలనే ఇలా వ్యవహరిస్తున్నారని.. కావాలనే అధిష్టానంతోనూ.. పార్టీ నేతలనూ కయ్యం పెట్టుకోవడానికి చూస్తున్నారని అనుకుంటున్నారు. అయితే కేంద్రం తనంతట తానుగా పంపించినా.. లేక తాను స్వయంగా వెళ్లిపోయినా తనకే మంచిదని భావిస్తున్నట్టు రాజకీయ వర్గాలతో పాటు పార్టీ నేతలు కూడా అనుకుంటున్నారు. మొత్తానికి రాజకీయానుభవం జానాకు బాగానే వర్కవుట్ అయినట్టు ఉంది. మరి జానా కూడా పార్టీ మారే రోజు తొందరలోనే ఉందని తెలుస్తోంది.

జగన్ దీక్ష.. పరామర్శిండానికి వచ్చారా.. ఎటకారం చేయడానికా

వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తున్న తరుణంలో పలు పార్టీ నేతలు మద్దతుపలుకుతున్నారు. అయితే అందరూ మద్దతు పలుకుతున్న నేపథ్యంలో ఒక నేత మాత్రం జగన్ పరామర్శిండానికి వచ్చారో లేదా ఎటకారం ఆడటానికి వచ్చారో తెలియకా అర్ధంకావడంలేదట. సీపీఎం మాజీ ఎంపీ సీనియర్ నేత మధు జగన్ పరామర్శించడానికి వెళ్లి జగన్ తో కొంచెం సేపు ముచ్చటించి ఆఖరికి ''మాకు పోరాటాలే అజెండా... మాకు ఎలాంటి వ్యాపారాలు లేవు'' అని ఒక మాట అన్నారంట. దానికి ఒక్కసారిగా జగన్ కు ఎమనాలో తెలియక.. నోట మాట రాక.. ఏదో తలాడించి అలా ఊరుకున్నారంట. అయితే మధు చేసిన వ్యాఖ్యలపై పార్టీ నేతలు కోపంగా ఉన్నా.. కొంతమంది మాత్రం మధు అదెదో యథాలాపంగా అన్న మాట కాదని రాజకీయ వర్గాలు అంటున్నాయి.