కేసీఆర్, సోనియాకు ఆహ్వానం.. రండి.. వచ్చి కుళ్లుకోండి
posted on Oct 11, 2015 @ 3:58PM
ఏపీ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కర్యాక్రమం ఈనెల 22వ తేదీన మధ్యాహ్నం 12.45 నిమిషాలకు జరగనుంది. ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఏపీ ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పుడు ఒక ముఖ్యమైన అంశంపై చర్చ జరుగుతుంది. అదేంటంటే శంకుస్థాపన కార్యక్రమానికి కేసీఆర్ ను అలాగే సోనియా గాంధీని ఆహ్వానించడంపై. అయితే కేసీఆర్ ను తానే స్వయంగా ఇంటికెళ్లి ఆహ్వానిస్తానని చంద్రబాబు అన్నట్టు ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. మరి సోనియా గాంధీని కూడా అలాగే పిలుస్తారా అని డౌట్.
అయితే చంద్రబాబు వారిని పిలవడంపై ఎలాంటి ఉద్దేశం ఉందో తెలియదు కాదని మిగిలిన నేతలు మాత్రం శంకుస్థాపన కార్యక్రమానికి రండి.. చూడండి.. చూసి కుళ్లుకోండి అని వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రాన్ని విడదీసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి.. అప్పుల రాష్ట్రంగా మిగిల్చారు సోనియా గాంధీ. ఇలాంటి సమయంలో రాజధాని నిర్మాణం చాలా కష్టమని చాలా మందే అన్నారు. అయితే వాటన్నింటిని ఖండించి రాజధాని శంకుస్థాపనకు శ్రీకారం చుట్టి.. హైదరాబాద్ ను తలదన్నేలా అంతర్జాతీయ స్థాయిలో అమరావతి ఉంటుందని మూడేళ్ల తర్వాత ప్రపంచంలోని అద్భుత నగరాల్లో అమరావతి ఒకటి అవుతుందని కూడా ఘంటాపథంగా తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీకి రాజధాని లేకుండా విభజనకు కారణమైనవారు కేసీఆర్ అయితే.. ఏపీకి రాజధాని లేకుండా చేసింది సోనియా కాబట్టి వీరిద్దరికి శంకుస్థాపనకు ఆహ్వానించి వారు కుళ్లుకునేలా చేయాలని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తుందట. అయితే కేసీఆర్ ను స్వయంగా పిలిచినట్టు, సోనియాను కూడా స్వయంగా పిలిస్తే బావుంటుందని పార్టీ నేతలు అనుకుంటున్నారట.